శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగానికి హాజరైన స్వామి పరివారం.

>> Monday, April 18, 2011

స్వామి అనుగ్రహముంటే ఆయన కార్యక్రమసమయంలో విశేషవ్యక్తులు ఇక్కడకు వస్తారని మానమ్మకం .అది నిజమని నిరూపిస్తూ మానమ్మకాన్ని పెంచే నిదర్శనాలు స్వామివారు చూపిస్తూనేఉన్నారు.
శనివారం రోజున ప్రాతఃకాలంలో నే పీఠంలో నిత్యపూజలు జరిగాక హనుమంత్ రక్షాయాగం ప్రారంభించాము .ఆపూజాసమయంలో మేము సరిగా చేస్తున్నామో లేదో పర్యవేక్షించటానికన్నట్లుగా ఇద్దరు వానరయూధముఖ్యులు స్వామి వారి పూజచూస్తూ చెట్లమీద ప్రత్యక్షమయ్యారు . మాఊరికి కోతులు ఎప్పుడో గాని రావు . స్వామి కెదురుగా ఉన్న చెట్లపై తిష్టవేసి కార్యక్రమాన్ని తిలకించారు . పూజముగిశాక స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని , స్వామి సేనాధిపతులయిన మైందద్విదులుగా భావించి ఆవానర స్వాములకే మొదటగా ఇచ్చాము .

ఇక రాత్రి ఇంకో విశేషం జరిగింది . ప్రముఖ హనుమదుపాసకులు , హనుమత్తత్వప్రచారకులు ,పరాశరసంహితపై విశేషపరిశోధనచేసి వెలుగులోకి తెచ్చి అందరికీ అందుబాటులో ఉంచినవారు , డాక్టర్ అన్నదానం చిదంబరశాస్త్రిగారు పీఠానికి విచ్చేశారు. సోమవారం వినుకొండలో వేలాదిమంది భక్తులకు హనుమద్దీక్ష ఇవ్వటంకోసం వినుకొండవస్తూ అంతవత్తిడిలో కూడా హనుమత్ రక్షాయాగమ్ కార్యక్రమాన్ని పరిశీలించాలని వారు రావటం నిజంగా స్వామి అనుగ్రహమే . స్వామికి ఆంతరంగికభక్తులలాంటి వారు రావటం సాక్షాత్తూస్వామి పరివారమే వచ్చారని మనసు ఆనందంతరంగితమైనది. లాంగూలాస్త్రపూజవిధికై మామితృలు పెయింటర్ ప్రసాదగారు చిత్రించి ఇచ్చిన హనుమచిత్రం చాలాబాగుందని ఇలాంటి చిత్రం అందరికీ అందుబాటులో ఉండేలా కొన్ని కాపీలు తీసి ఇస్తేబాగుంటుందని సూచించారు. ఆయన వచ్చి యాగ వివరాలను అడిగి ఓగంట ఇక్కడగడిపి ఆశీర్వాదాలందించి వెళ్ళారు.

ఇక లోకశ్రేయస్సుకై చేస్తున్న ఈయాగం కొరకు సంకల్పించి ఎక్కడెక్కడో ఉన్న భక్తులు తాముకూడా సుందరకాండ,మన్యుసూక్త రుద్రసూక్త,హనుమాన్ చాలీసా పారాయణాదులు ప్రారంభించామని తెలుపుతుంటే స్వామి దయాహృదయాన్ని వర్ణించటానికి మాటలు చాలటం లేదు. నాగేంద్రకుమార్ గారు హైదరాబాద్, ఒంగోలు శ్రీనుస్వామి ,మోహనకిశోర్ [ఢిల్లీ]మనోహర్ లాంటి భక్తులు సుందరాకాండను , రాజశేఖరునివిజయశర్మ గారు ,కృష్ణమూర్తి భట్టు, లాంటి విశేషవ్యక్తులు మన్యుసూక్తాదులను . అమెరికాలో కోటీ రుద్రపారాయణం జరుపుతున్నవారిలో ఒక బృందంగాఏర్పడి భాస్కర్ గారు రుద్రసూక్త పారాయణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు .ఇక ఎంతోమంది హనుమాన్ చాలీసా పారాయణం,ప్రదక్షిణలు మొదలుపెట్టామని తెలియజేస్తున్నారు .
ఆథ్యాత్మిక ,మానసిక, భౌతిక సంకటాలను తొలగించి విశేష శుభాలను అనుగ్రహించే ఈ యాగంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని మీకందరకూ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాము.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP