శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహాత్ములజీవితాలలో అసలైన మహిమలను గుర్తించగలగాలి మనం.

>> Monday, April 4, 2011


మానవజీవితగమనానికి దిశానిర్దేశ్యం చేసేందుకు మహాత్ముల అవతరణ జరుగుతుంది . వారి చర్యలు చిత్రంగానూ ,విచిత్రంగానూ కనిపించినా వాటి లక్ష్యమేమిటో అవిరూపుతీసుకున్న తరువాత మనకు కనపడతాయి . వారిబోధలను వినటమేకాదు , అవి ప్రకృతినియమాలకు విరుద్ధంగా ఎట్టిపరిస్తితులలోనూ ఉండవు అనే విషయం మనం గమనించాలి. అవి సహజాతి సహజంగా జరుగుతాయి. సృష్టినియమాలకు విరుద్ధంగా తమ శరీరాలను నిలుపుకోవటం ఎట్టిపరిస్థితులలోనూ అంగీకరించరు.
పిల్లవానికి బడికిపంపటానికి మిఠాయిలు ఇచ్చిన తల్లివలె వారు కొద్దిమందిపై కొంత అనుగ్రహం చూపుతారు, కానీ తమజీవితం చమత్కారాలకోసమే కాదని హెచ్చరిస్తూనే ఉంటారు. వారి జీవితాలనుంచి మనం నేర్చుకోవలసినదేదో నేర్చుకోవాలి ,వారి ఏర్పరచిన దారిలో నడచి లోకకళ్యాణానికి తద్వారా ఆత్మకళ్యాణానికి పాటుపడటమే వారికిష్టం .అంతే తప్ప తమనే భగవంతునిగా భావించి తాము శాస్వతంగా భౌతికావధిలో ఉండాలని కోరుకోవడం వారికి నచ్చదు.
వారి భౌతికంగా చేయాల్సిన పనులు పూర్తయ్యాక సూక్ష్మశరీరాలతో చేయవలసిన పనులకోసం తరలివెళతారు దీనినే మహాసమాధి అంటారు. గర్విష్ఠులకు .అహంకారులకు ఆచర్యలు అర్ధం కావు . లోకాస్సమస్తా సుఖినోభవంతు

9 వ్యాఖ్యలు:

Unknown April 4, 2011 at 10:06 PM  

హరిసేవగారు,
ఉన్నారా...లేదా..
ఇది మీ బ్లాగేనా....
మీరు ఈ రకమైన వ్యాఖ్యలు ప్రచురించడం చాలా అసహ్యంగా ఉంది. మీమీద ఉన్న గౌరవం కూడా పోయింది.
ముందు ఈ వ్యాఖ్యలను తొలగించండి.

Unknown April 4, 2011 at 10:16 PM  

మీ ప్రొఫైల్ లో మీరు రాసిన ముందు మాటలు ఇవి-
అందుకే అప్పుడు విన్నవి ఇప్పుడెవరన్నా చెబుతున్న నాలుగు మంచిమాటలు ఇక్కడుంచుతున్నాను. ఇన్నివేల అక్షరాలలో ఏ ఒక్కటైనా ఎవరికైనా మేలు చేయగలిగితే ఈ జన్మలో చేసిన మంచిపనులలో అదీ ఒకటవుతుంది అనే ప్రయత్నం ఈ బ్లాగు
మరి మీ టపాతో సంబంధంలేనివ్యాఖ్యలు, ఒక మహిళను విమర్శిస్తూ రాసిన వ్యాఖ్యలు ఎలా ప్రచురించారండీ.
నాకు వాళ్లు ఏం చేసారో, ఏ చర్యకు ఏ ప్రతిచర్యో వివరాలు తెలియవు. కానీ మీ బ్లాగును ఆసక్తిగా చదివే పాఠకురాలిగా ఇది చెప్తున్నాను. మీ అంగీకారం లేనిదే కామెంట్ ప్రచరింపబడకుండా మోడరేషన్ కూడా పెట్టుకున్నారే...
మరి భగవంతుడి సేవ కోసం ప్రారంభించి కొనసాగుతున్న బ్లాగులో ఏ సామాజిక ప్రయోజనం లేదా వ్యక్తిగత ప్రయోజనం ఆశించి ఇంత నీచమైన వ్యాఖ్యలు ప్రచురించారు. మీ బ్లాగు అభిమానిగా ఈ ప్రశ్న వేసే హక్కు ఉందనుకుంటున్నాను.

కత పవన్ April 5, 2011 at 12:03 AM  

హల్లో సుభద్ర గారు మీరు కాస్త అవేశం తగ్గించుకొండి.
దుర్గేశరావు గారు ఈ కామెంట్లు ను గమనించినట్టు లేరు .. ఒక్కవేళ చూసుంటే వెంటనే తొలగిస్తారు ఆ మాత్రానికి మీ సలహాలు అవసరం లేదు .. అయన బ్లాగులో కూడా చెత్తవాగుడు తో కంపు చేస్తారని అయనకు తెలియదు లెండి ..

Anonymous April 5, 2011 at 2:28 AM  

Sorry to say he could not see the blog until this evening as he would be busy with his work. I don't know whether the moderation is working or not.

Anonymous April 5, 2011 at 2:37 AM  

See above. My comment is published. I think that the moderation is not working.
One thing I want to say all of you friends that you all educated ones and commenting like this. This is rude and unfair on your parts. Don't come to this blog and don't comment here with those intentions.

మనోహర్ చెనికల April 5, 2011 at 3:43 AM  

మాస్టరుగారు ఆలయనిర్మాణ పనుల్లో బిజీగా ఉండి చూసుకోలేకపోయారు.అంతే తప్ప మరోభావం లేదు.

మనోహర్ చెనికల April 5, 2011 at 3:46 AM  

సుభద్రగారు
ఇన్న్నాళ్ళనుండి ఈ బ్లాగు చదువుతున్నారు , మీ అభిప్రాయం ఇదా?
ఏ కారణం చేతనో మోడరేషన్ సరిగా పనిచెయ్యలేదు,
మాస్టరుగారు ఆలయనిర్మాణపనుల్లో బిజీగా ఉండందంచేత గమనించలేదు అంతే కానీ మీరన్నట్టు వ్యక్తిగత ప్రయోజనాలనో, పగలనో నెరవేర్చుకోవడానికి కాదు.

Bhãskar Rãmarãju April 5, 2011 at 6:57 AM  

వాడెవడో ఇక్కడ కామెంట్ల వర్షం కురిపిస్తే *ఈ బ్లాగుపై మీమీదా ఉన్న గౌరవం పోయింది* అనటం ఏవిటీ??
ఏం పర్లేదులేండి. మీలాంటివారికి ఎలా అనిపిస్తే అలా చేస్కోండి. కొత్తగా ఇక్కడ గౌరవాలకోసం దుకాణాలు తెరుచుక్కూర్చోలేదు ఎవ్వరూ.

రాజేష్ జి April 5, 2011 at 9:29 AM  

#మీలాంటివారికి ఎలా అనిపిస్తే అలా చేస్కోండి. కొత్తగా ఇక్కడ గౌరవాలకోసం దుకాణాలు తెరుచుక్కూర్చోలేదు ఎవ్వరూ.

చక్కగా చెప్పారు భాస్కర్ గారు.. మరీ అంత అభద్రతాభావం ఆయితే ఎలా?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP