శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నా బ్లాగులో ఇటువంటి నీచపుపనులుచేయకండి దయచేసి.

>> Wednesday, April 6, 2011

నేను బ్లాగునడుపుతున్న లక్ష్యం మీకుతెలుసు. ఇష్టమైన వాళ్లుచదువుతున్నారు . ఇష్టం లేనివాళ్లు చదవటం లేదు. వాళ్లతో ఇబ్బంది లేదు . కానీ కొందరు మానసిక రోగులు వాళ్లమనసుల్లో ద్వేషాన్ని వెళ్లగక్కటానికి నాబ్లాగును వేదికగా చేసుకుంటున్నారు అప్పుడప్పుడు . దీనిద్వారా ఎవరి మనసుగాయపడుతుందో దానికి నేనుకూడా పరోక్షంగా కారణమవుతున్నాను . నాబ్లాగునుచూసేవారి దృష్టిలో నేను చులకనవుతాను . నామానాన నాపని నేనుచేసుకుంటూ వెళుతుండగా ఈ దౌర్భాగ్యులద్వారా నాకీమానసికవేదనేంటి ? అని బాధపడతాను . మరి ఇలాంటిచర్యలద్వారా అలా చెత్తకామెంట్లు వ్రాసేవారికి ఒనగూడేపయోజనం ఏమీఉండదు సరికదా ఖచ్చితంగా ఇతరులకు వేదనకలిగించిన పాపాన ఖచ్చితంగా తిరిగి దుఃఖపడవలసిన సమయం వస్తుంది. గుర్తుంచుకోండి . నిన్న నేను ముక్కెళ్ళపాడు అనే గ్రామంలో దత్తక్షేత్రంలో అక్కడ నిర్వహకులతో దైవసంబంధిత విషయాలచర్చలో ఉండగా ,అంతర్జాలంలో ఉన్న మిత్రులనుంచిఫోన్ వచ్చింది "మీబ్లాగులో చండాలమైన కామెంట్లు పెట్టారు అని. అప్పటికప్పుడు నాపాస్వర్డ్ చెప్పి వాటిని తొలగించమని కోరాను. ఇలాంటి సమయంలో వచ్చే ఆవేదన ,కోపం ఆచర్యకు పాల్పడ్డవారికి మాత్రం హానికలిగిస్తాయి .దయచేసి ఎవరూ నన్ను నాబ్లాగును ఇబ్బంది పెట్టవద్దని వేడుకొంటున్నాను.

ఇంత ఇబ్బందెందుకు మోడరేషన్ పెట్టకూడదా అని అనొచ్చుమీరు. నాబ్లాగులో ఆథ్యాత్మికవిషయాలపై తమస్పందనలను తెలియజేసేవారు,వాటిమీద మరలా తమ అభిప్రాయాలను వ్రాసేవారు వెరసి ఇదంతా ఒక చర్చగా సాగుతూఉంటుంది . ఆయావిషయాలపై విషయావగాహ పెంచుకోవటానికి నాబ్లాగుపాఠకులకు నాకు ఒక అవకాశం ఇది. నాకు మీకుమల్లే అన్నిసందర్భాలలో నెట్ అందుబాటులో ఉండదు కనుక వ్యాఖ్యలపరిశీలనకు సమయం తక్కువగాఉంటుంది . అప్పటికీ ఈమధ్య మోడరేషన్ ఉంచుతున్నాను కానీ ఒక్కోసారి నాపరిజ్జ్ఞాన లోపంవలన పనిచేయటం లేదు .

దయచేసి మానసిక వికారాలను ఒలకబోయటానికి నాబ్లాగును వేదిక చేసుకోవద్దని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను .

జైశ్రీరాం

9 వ్యాఖ్యలు:

కొత్త పాళీ April 6, 2011 at 3:49 AM  

మాస్టారు, అంతర్జాలంలో స్వేఛ్ఛగా వదిలివేసిన ప్రతి వేదికకీ ఇటువంటి గతే పడుతున్నది. మాడరేషన్ తప్పని సరి అని అనుభవం నేర్పిన పాఠం. ఒక చర్చా వేదికగా ఉండాలని మీ ఆశయం గొప్పదేకాని, సద్వినియోగం వల్ల ఎంత మేలు జరుగుతుందో దుర్వినియోగం వల్ల దానికి కొన్నిరెట్ల హాని జరుగుతుంది.

Saahitya Abhimaani April 6, 2011 at 8:30 AM  

"...మానసిక వికారాలను ఒలకబోయటానికి నాబ్లాగును వేదిక చేసుకోవద్దని..."

బాగా చెప్పారు. కనీసం ఇప్పటికైనా "మనిషికైతే ఒక మాట...." చందాన వింటారని భావిద్దాం.

hkpt April 6, 2011 at 8:34 AM  

తమ యదార్ధమైన ఊరూ పేరూ చెప్పే ధైర్యం లేని మనుషులకి ఇంటర్నెట్ లో వ్యాఖ్యలు రాయడమెందుకో అర్ధం గాదు. తమ మిత్రులతోనూ, తమ భార్యాబిడ్డలతోనూ, తమ తల్లిదండ్రులతోనూ గర్వంగా చెప్పుకోలేని రాతలు రాసే వారినేమనాలి? ఇంటర్నెట్ సరిగా వాడుకుంటే అదో శక్తివంతమైన సాధనం. తమ మన: స్థితిని ఇలా వెళ్ళగక్కుకోవడం - తమ ఇంట్లో చెత్త తీసుకెళ్ళి ఎవరూ చూడని రాత్రి సమయంలో పక్కవాడింట్లో కుమ్మరించడంతో సమానం. విద్య అంటే అక్షరాస్యత కాదనడానికి ఇదో తార్కాణం.


- తాడేపల్లి హరికృష్ణ

KumarN April 6, 2011 at 9:13 AM  

ఆచార్యా,
ఇది జరగటం మొదటిసారి కాదు. గుర్తించారా.
పోయినసారి సీతమ్మ గారి గురించి జరిగిన గొడవలో కూడా ఇలాగే కామెంట్లు చూస్తే, అప్పుడూ నేను మీతో ఇదే బాధ వ్యక్తం చేసా. మాష్టారూ, మీ బ్లాగుకేసి వచ్చే వాళ్ళు రారూ అనీ. అప్పుడే నేను మీకో సలహా చెప్పాను, మోడరేషన్ ఉంచి, భూమి కిటు పక్కన ఉన్న మీ నమ్మకమయిన వ్యక్తి కి పాస్వర్డ్ ఇస్తే, కొంచెం తొందరగా అలాంటి కామెంట్లని డిలీట్ చేయటానికి అవకాశం ఉంటుందీ అని, మళ్ళీ మీరొచ్చేదాకా అవి అక్కడే ఉండి జనాలకి కనువిందు చేయకుండా. ఈసారింకా నయ్యం, పోయిన సారి ఆ రక్తచరిత్ర పచ్చి బూతులు రాసాడు మీ బ్లాగులో.

Sitaram April 6, 2011 at 9:37 AM  

సార్...
మీ బాధ అర్థం చేసుకోదగినది. మీ బ్లాగులోకి కూడా వచ్చి అలాంటి కామెంట్స్ పెట్టడం దారుణం. మీ పోస్టు చదివి...నెట్ లో అలాంటి దౌర్భాగ్యులను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి నాకు బాధేసింది. నా మీద మొరిగిన అలాంటి కుక్కలను ఒక సారి కసితో బండ బూతులు తిట్టాను...సహనం నశించి. అపుడు మేల్కొన్న సోదరులు, పెద్దలు...నేనేదో కొంపలు మునిగే ఘోరం చేసినట్లు ప్రవర్తించారు. భాషన్లు ఇచ్చారు. ఈ బ్లాగులోకంలో ఎవడి గొడవ వాడిది అనుకోకుండా...పిచ్చి కూతలు చూసే దరిద్రులు ఎక్కువ కావడం బాధాకరం.
ఏతావాతా నాకు అర్థమయ్యింది ఏమిటంటే...అలాంటి వారి గురించి పట్టించుకోక పోవడమే మంచిదని.
సత్యమేవజయతే...ఇదే మనలను రక్షించాలి. రక్షిస్తుంది. బాధపడకండి.
రాము
apmediakaburlu.blogspot.com

Sitaram April 6, 2011 at 9:38 AM  

సార్...
మీ బాధ అర్థం చేసుకోదగినది. మీ బ్లాగులోకి కూడా వచ్చి అలాంటి కామెంట్స్ పెట్టడం దారుణం. మీ పోస్టు చదివి...నెట్ లో అలాంటి దౌర్భాగ్యులను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి నాకు బాధేసింది. నా మీద మొరిగిన అలాంటి కుక్కలను ఒక సారి కసితో బండ బూతులు తిట్టాను...సహనం నశించి. అపుడు మేల్కొన్న సోదరులు, పెద్దలు...నేనేదో కొంపలు మునిగే ఘోరం చేసినట్లు ప్రవర్తించారు. భాషన్లు ఇచ్చారు. ఈ బ్లాగులోకంలో ఎవడి గొడవ వాడిది అనుకోకుండా...పిచ్చి కూతలు చూసే దరిద్రులు ఎక్కువ కావడం బాధాకరం.
ఏతావాతా నాకు అర్థమయ్యింది ఏమిటంటే...అలాంటి వారి గురించి పట్టించుకోక పోవడమే మంచిదని.
సత్యమేవజయతే...ఇదే మనలను రక్షించాలి. రక్షిస్తుంది. బాధపడకండి.
రాము
apmediakaburlu.blogspot.com

Ordinary Person in Extraordinary World April 6, 2011 at 6:14 PM  

I hate to see Sri Guru garu has to deal with "trash". His valuable time is used by some 'dogs' who don't have purpose in life.
We all know what is Sri Guru garu's ambition is. If we all ignore these 'useless' comments, Sri Guru garu can spend his time writing divine spiritual messages for all of us.

Saahitya Abhimaani April 6, 2011 at 6:27 PM  

@తాడేపల్లి హరికృష్ణ

"...విద్య అంటే అక్షరాస్యత కాదనడానికి ఇదో తార్కాణం....."

బాగా చెప్పారు. మన బ్లాగులోకంలో కి వచ్చి కామెంట్ల పేరుతొ అవాకులూ చవాకులూ వ్రాసే వాళ్ళల్లో చదవటం వ్రాయటం వచ్చిన మానసిక నిరక్ష్యరాస్యులు, పిరికివాళ్ళు తక్కువేమీ కాదు. విచిత్రం! అలా ప్రవర్తించే వాళ్లకి స్వంత బ్లాగులుంటాయి. అక్కడ మడికట్టుకునే ఉంటారు. వేరొకళ్ళ బ్లాగుల్లో మాత్రం పైత్య ప్రకోపం చూపిస్తూ ఉంటారు.

నా బ్లాగులో మాత్రం, అజ్నాతల కామెంట్లను రాకుండా చేసాను. మోడరేషన్ పెట్టి ప్రొఫైల్ లేని వాళ్ళ కామెంట్లు కూడా ప్రచురించటం మానేసాను.

durgeswara April 7, 2011 at 2:31 AM  

అభిమానంతో
నాకు తగు జాగ్రత్తలు తీసుకొమ్మని చెప్పిన మీఅందరికీ ధన్యవాదములు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP