శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రామనామం వింటే ఈపైత్యరోగులకెందుకు భయం ?

>> Wednesday, April 13, 2011

ేమనకీమధ్య రాముని మీద విమర్శలుచేసే మేతావులు ఎక్కువగా కనపడుతున్నారు . రాముడు అనేపదం వినపడితే పూర్వం రాక్షసులు ఎంతగా విలవిలలాడిపోయేవారో ,ఇప్పుడు వీళ్లకు రామచరితం గాని ఆయన గుణకీర్తనం గాని వింటేచాలు చెవుల్లో సీసం పోసినంత బాధకలుగుతుంది , సహజంగా శతృత్వం ఉన్నవాడికి సద్గుణధాముడైన రాముని చరిత్రం ఆయన కీర్తి ఒప్పుకోబుధ్ధి కాదు. కనుకనే రాముని గుణాలు తమకెలాగూ రావుకనుక ఆ సద్గుణాలను తమ తక్కువస్థాయి మెదళ్లతో చిన్నబుచ్చాలనే ద్వేషపూరిత యత్నాలు చేస్తుంటారు .
ఒకాయనంటాడు ,రాముడు ఇంజనీరా ? ఏకాలేజీలో చదివాడు ? అని . ఇంజనీరింగ్ అనేపదం ఏకాలంలో పుట్టిందో తెలియని మూర్ఖత్వం అనుకోవాలో, ఏమాత్రం నైతికవిలువలులేని ఈ నాయకునికి రాముని ఏకపత్నీత్వం లాంటి సుగుణమంటే ద్వేషమో మనం అంచనావేసుకోవాలి.
ఇక విషవృక్షాల సంగతి చెప్పనక్కరలేదు .అవిపుడతాయే గాని వాటి నీడనఎవరూ చేరరు.అవొకరకంగా నిరర్ధక జన్మలు.
ఇక రామాయణం ఏమిటో ? రాముని చరితమేమిటో తెలియకపోయినా రాముని రాజ్యంలో కరువొచ్చిందని , ఎవరినోచంపాడని ,స్త్రీలను ద్వేషించాడని ,రక్తమాంసాలు యజ్ఞాలలో పోసేవారు ఎంతో అహింసాపరులని అవి నిరోధించిన రాముడు హింసాత్మకుడని తమ పైత్యం వెళ్లగక్కే జాతి మొదలైంది .

ఏమాత్రం సామాజిక బాధ్యత గాని ,సంస్కారాలుగాని లేని ఒక సినీమేతావి [క్షమించాలి వీళ్లను మేథావులు అనకూడదు] రాముడివల్ల లోకానికేమి మేలు అని వెర్రిప్రశ్నలడుగుతాడు. నీబొంద !ఎప్పుడో రామునిగూర్చి పక్కనపెట్టు నీజన్మవల్ల ఏమన్నా ప్రయోజనముందా లోకానికి అదిచూడు ముందు అని అనుకుంటున్నారు జనం. వానికి సిగ్గుశరం ఉండవు కనుక ఏదైనా వాగగలుగుతారు .
అసలు ఈ తెగులు ఎందుకు పుడుతుంది ఈ బాపతు జనానికి ?

ఎందుకంటే రాముని సుగుణాలు లోకంలో ఆదర్శంగా ఉన్నంతకాలం తమ నీచపు చేష్టలు తమవాళ్లకే ఏవగింపు కలిగిస్తాయి కనుక . ఏమాత్రం ఆదర్శాలు లేని పిచ్చికుక్కలజాతిని పెంచాలంటే మానవీయవిలువలను బోధించే ఇలాంటి సత్ చరిత్రలు మానవాళికి అందకుండా ఉండాలి . అందుకే రాముని ఆదర్శలను ఔదలదాల్చే భారతజాతి లో రాముని పట్లచులకనభావనకలిగించాలని అవసరమున్నా లేకున్నా, పిచ్చివాదనలనులేవదీస్తూవిశ్వప్రయత్నాలు చేస్తుంటారు. కనీసం గందరగోళం సృష్టించాలని తమ పైత్యప్రకోపాలను జనానికి అంతించాలని చూస్తుంటారురు. పాపం ఆకాశం పైన ఉమ్మెయ్యాలన్న వీరి వెర్రిప్రయత్నాలు విఫలమైనా సిగ్గుఉండదుకనుక తమలోని రాక్షసాంసలు మరలా అదేపనికి ప్రేరేపిస్తున్నంతకాలం ఈపని చేస్తూనే ఉంటారు.మానసిక రోగులైన వీరిస్థితికి జాలిపడి జనం చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు. అది వీళ్ళగొప్పదనానికి మేతస్సుకు విజయంగా భావించిన ఈపిచ్చికుక్కలజాతి మరింతగా పెరేగుతుంది. జనం కర్రతీసుకుని చావబాదే రోజొచ్చేంతవరకు వీటి మొరుగుడు ఆపవు.
ఇది ఇప్పుడేకాదు ఆనాడు త్రేతాయుగంలోనూ అంతే .
అంతచదువుకుని తపస్సుచేసిన సిద్దులను పొందిన రావణుడుకూడా మారీచునితో రాముడు దుర్గుణపరుడని వాదిస్తాడు. ఎవడయ్యా ! నీపుర్రెకు ఇలాంటి విషమెక్కించినవాడు అని మారీచుడు హెచ్చరించినా వినడు. వినాశకాలే విపరీతబుధ్ధి అంటారు దీన్నే.

ఇక భారతీయ ధార్మిక నైతిక విలువలను దెబ్బతీసే యత్నంలోమునిగిఉన్న విదేశీ ఏజంట్లు,మతప్రచారవాదులు కోట్లకొలది డబ్బు వెచ్చించి పెంపుడుకుక్కల్లా ఈ పిచ్చికుక్కలను పెంచి ఉసిగొల్పుతుంటాయి . త్రేతాయుగంలో రామున్ని అనుసరించటం గొప్పకాదు ,కల్మషమయమవుతున్న ఈ కలియుగంలో రాముని ఆదర్శంగా తీసుకోవటమే గొప్ప ఆథ్యాత్మిక సాధన గా మనం గుర్తించాలి

ఆపదామప హర్తారం
దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం .

జైశ్రీరాం .

6 వ్యాఖ్యలు:

మన ఊరు - నీలపల్లి (తాళ్ళరేవు మండలం, తూ.గో.జిల్లా) April 13, 2011 at 10:29 AM  

ఇటు వంటివారివలన, మన హిందూ ధర్మానికి ఏ విధమైన నష్టము రాదు. ఇటువంటి వారు వేసే ప్రశ్నలు వలననే రాముని గొప్పతనము తెలియని వారు తెలుసు కుంటున్నరు. నా పరిశీలనలో, గత 10 సంవత్సరములుగ మన హైందవ ధర్మము యెడల గౌరవము పెరిగినది. ప్రధానముగా గ్రామాలలోని ప్రజలలో అధ్బుతముగా మార్పు వచ్చినది. మార్పు అంటే, హిందుత్వములోని గొప్పతనము, మన మహర్షుల విజ్ఞానము, ఇందులో, టీ.వి. లలొ వచ్చే ప్రవచనములు, కార్యక్రమములు పాత్ర చాలవుంది. అందువలన, మూర్ఖులు వేసే మూర్ఖమైన ప్రశ్నలకు బాధ పడవలసిన అవసరము లేదు.

heisatya April 13, 2011 at 10:37 AM  

మీరు చెప్పింది అక్ష‌రాలా నిజం.
రాముడు ఆద‌ర్శ పురుషుడు... ఈ రాక్ష‌స జాతికి మాత్రం అన్నీ త‌ప్పులే క‌న‌బ‌డ‌తాయి. మా టీవీ చానెళ్లు న‌డిపే వారు పూర్వ జ‌న్మ‌లో ఈ సంత‌తి వారే. అందుకే హిందు దేవ‌త‌ల మీద ఆడిపోసుకోడానికి తాప‌త్ర‌య ప‌డ‌తారు. నేను నా బ్లాగ్ లో టీవీ జ‌ర్న‌లిస్టుల పూర్వ జ‌న్మ వృత్తాంతం కూడా రాశా. www.heisatya.blogspot.com.

Jawahar April 13, 2011 at 11:48 AM  

Durgeswara gaaru,

I just came across a commentary from sirasri ( for greatandhra.com a telugu gossip site: sometimes this site dare to write truths) about Ramayanam and "cine metavi" & "Visha Vriksham":

http://www.greatandhra.com/viewnews.php?id=28328&cat=10&scat=25 (Gods, Humans, Rakshasas And Ram Gopal Varmas)

Thanks & Regards,
Jawahar

Anonymous April 14, 2011 at 1:29 AM  

"చీకటివెలుగులు", "కష్టసుఖాలు" అంటూ మన పెద్దలు పూర్తి జీవితాన్ని ఒకే పదం సహాయంతో వివరించారు.
ఒకటి ఉంటేనే మరొకదానికి విలువ. మీరన్నట్లు మొరిగే కుక్కలు ఎపుడూ మొరుగుతూనే ఉంటాయి.

"అన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి" అని అన్నమాచార్యులు అన్నా....
"జగదానందకారకా" అని త్యాగరాజస్వామి స్తుతించినా....
"ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు" అని రామదాసు అనగలిగినా.....
వాటిలో సూక్ష్మం గ్రహించి, తదాత్మ్యం పొందగలవారికే అర్థం అవుతాయి.

"చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా?" అని శతకకారులన్నారు కదా....

దీని గురించి మనము చింతించుట అనవసరము. ఆ సమయాన్ని కూడా మరో మంచి పనికి కేటాయించుకోవచ్చును.

anrd April 14, 2011 at 10:36 AM  

నిజమేనండి. సీతారాముల వంటి ధర్మాత్ములలో దోషాలను వెదకటం అంటే ......... అది దోషాలు వెదికేవారి దురదృష్టం అని చెప్పుకోవాలి.
సీతారాముల వంటి వారిలో కూడా తప్పులు వెదుకుతున్నారంటే ఇక వారు ఎవరిని మెచ్చుకుంటారో అర్ధం కాదు...
అయితే , ఇలాంటి వారు వేసే ప్రశ్నల వల్ల చర్చలు జరిగి .............. వాటి ద్వారా సీతారాముల లాంటి గొప్పవారి, ......... గొప్పదనం మరింతగా ప్రపంచానికి తెలిసే అవకాశం కూడా ఉందండి..

Bhardwaj Velamakanni April 16, 2011 at 9:05 PM  

They are just those caste maniacs. They have no life or identity outside the caste circle.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP