శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అత్యంతభక్తిశ్రద్దలతో అష్టోత్తర కలశాభిషేకం

>> Tuesday, April 26, 2011పోయిన శనివారం హనుమంతులవారికి అష్టోత్తరశత కలశాభిషేకం హనుమాన్ చాలీసా పారాయణము అత్యంత భక్తిశ్రద్దలతో జరిగాయి. హనుమత్ రక్షా యాగంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంళో విశేషద్రవ్యాలతో స్వామి వారికి అభిషేకములు జరిగాయి . బాలురనుండి వృధ్ధులవరకు ఆనందోత్సాహాలతో స్వామిని సేవించుకుని తన్మయులయ్యారు. తమాలార్చనలు ,పుష్పార్చనల అనంతరం హనుమాన్ చాలీసాను నూటఎనిమిది పర్యాయములు గానం చేయటం జరిగింది. ఎక్కడో మారుమూలపల్లెలనుంచికూడా వచ్చిన భక్తులు తమకు స్వామి అనుగ్రహం కలగటం వలననే ఆయనను ఇలాసేవించుకోగలిగామని సంతోషంతో వెల్లడించారు.

ఈకార్యక్రమాన్ని గుర్గావ్ లో నివాసముంటున్న మోహన్ కిశోర్ & కళ్యాణి దంపతులు స్వామి సేవలో భాగంగా నిర్వహింపజేశారు. ఈసందర్భంగా హనుమత్ రక్షాయాగంలో పాల్గొంటున్న భక్తులందరి గోత్రనామాలతో పూజజరపటం జరిగింది.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP