ఈ ఆథ్యాత్మిక ప్రయోగంలో మీరూ పాల్గొని మీజీవితంలో ఎదురవుతున్న సమస్యలను తొలగించుకోండి
>> Thursday, April 14, 2011
మనిషి జన్మించిన సమయం నుండి గ్రహస్థితులననుసరించి జీవనయానం జరుగుతుంది అని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. ఇదొక అపూర్వవిజ్ఞానం. మనదేశసంపద. ఎవరునమ్మినా నమ్మకున్నా ఆయా గ్రహాలు ఆజీవిపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. ఇక్కడ మనం ఎలాజరగాల్సుంటే అలాజరుగుతుంది కనుక మనమేమిచేయగలం అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఎండను తగ్గించలేకపోవచ్చు,కానీ గొడుగును ఉపయోగించుకుని ఎండతీవ్రతనుండి రక్షణపొందవచ్చు. అలాగే మానవజీవితంలో జాతకప్రకారం ఎదురయ్యే సంకటాలను వివిధ రీతులలో పరిష్కరించుకునేమార్గాలను మహర్షులు మనకు అందించారు. వీటిలో అత్యున్నతమైన పద్దతి భగవంతుని ఆశ్రయించి ఆయన ఆరాధన ,నామస్మరణలద్వారా చెడుకర్మలను నశింపజేసుకుని జాతకంలో గల ఇబ్బందులు మనపై ప్రభావం చూపకుండా నిరోధించగలగటం .
దీనికోసం రుషులు తాముదర్శించిన మంత్ర,స్తోత్రాదులను, మానవులకందించారు. వీటి జప పారాయణాదులు ద్వారా సత్ఫలితాలను పొంది అప్పుడు భగవత్ శక్తి పై విశ్వాసం పెంచుకుని సంపూర్ణమానవునిగా తనను తాను మలుచుకోవాలనే యత్నం చేస్తాడు అనేది వారి ఉద్దేశ్యం.
ఇక భగవంతుడున్నాడా ? మంత్రాలకు చింతకాయలు రాలతాయా ? వంటి తలతిక్క ప్రశ్నలువేసే స్థాయినుండి మనఋషులు చెప్పినదానిలో సత్యాసత్యాలను స్వయంగా నిరూపణచేసుకునేందుకు ప్రయత్నించటం విజ్ఞత.
చింతకాయలను రాల్చటం కోసం మంత్రాలవసరం లేదు అనే ప్రాథమికజ్ఞానం మనిషికి ఉంటుంది కదా ?
ఇక ఇప్పుడు శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం ఈ ఋషివిజ్ఞానాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించే అనేక ఆరాధనారీతులను నిర్వహిస్తున్నది.
ఈ క్రమంలో "హనుమత్ రక్షాయాగం" అనే ఆథ్యాత్మిక ప్రయోగాన్ని గతరెండు సంవత్సరాలుగా చేపడుతున్నది. ఇప్పుడు తాముఎదుర్కొంటున్న జీవిత సమస్యలను ఈ యాగంలో పాల్గొనుటద్వారా పరిష్కరించుకోగలమాలేదా ?అనే ప్రయోగాన్ని గత రెండు సంవత్సరాలుగా అనేకమంది భక్తులు స్వయంగా చేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా తమ జీవితంలో ఎదురైన సమస్యలు విజయవంతంగా తొలగించుకున్నారు. అది వారి భక్తికి స్వామి శక్తికి నిదర్శనం.
ఎక్కడో సప్తసముద్రాలవతర ఉద్యోగవేటలో నిరాశలో మునిగున్నసమయంలో స్వామి అనుగ్రహంతో జయం సాధించినవారు. సంతానం కోసం తపించి సత్ఫలాన్ని పొందినవారు, దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనారోగ్యాన్ని తొలగించుకున్నవారు ,ఇలా ఎంతో మంది స్వామి అనుగ్రహాన్ని పొందారు. మహనీయులిచ్చిన పారాయణాదుల శక్తేమిటో స్వయంగా చవిచూసి ఉన్నారు. ముఖ్యంగా యువత స్వామి అండతో వారి క్షేత్రరంగాలలో విజయాలు సాధిస్తున్నారు .
ఈసంవత్సరం హనుమత్ రక్షాయాగం మూడవ ఆవృత్తిని ఏప్రిల్ పదహారునుంచి ప్రారంభించటం జరుగుతున్నది . సాధారణ నియమాలతోనూ.విశేషనియమాలతోనూ ఎలాపాల్గొనాలో వివరాలు ఈబ్లాగులో ఉన్న హనుమంతులవారి చిత్రంపై క్లిక్ చేసి చూడవచ్చు. మనసమస్య పరిష్కారం కోసం అనేకమందిని ఆశ్రయించి వారిచుట్టూ తిరగటం బదులు స్వామిచుట్టూ తిరిగి మనసమ్యలను ఎందుకు పరిష్కరించుఓకూడదు ? ఇంది మహాత్ములుచూపినబాట . మీరుకూడా ఈ ఆథ్యాత్మిక ప్రయోగంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాము.
జైశ్రీరాం .
0 వ్యాఖ్యలు:
Post a Comment