శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పాఠ్యాంశంగా వివేకానందుడి బోధనలు కూడదట ! ఇదెక్కడి ఖర్మ ?

>> Monday, February 28, 2011

వివేకానందుడి బోధనలు పాఠ్యాంశాలుగా పెట్టకూడదట .ఈరోజు వచ్చిన ఈవార్తను చూడండి.

------------------------------------

పాఠ్యాంశంగా వివేకానందుడి బోధనలా: యూటీఎఫ్

హైదరాబాద్, ఫిబ్రవరి 27 : ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీఓ నంబర్ 16 ద్వారా స్వామి వివేకానంద జీవితం, బోధనలను ఉపవాచకంగా ప్రవేశపెట్టాలని ఆదేశించడం సరైన చర్య కాదని యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.నారాయణ, ఐ.వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. దానివల్ల ఒక మత సారాన్ని విద్యార్థులపై రుద్దినట్లవుతుందని తెలిపారు.

--------------------------------------------------------------

ప్రపంచవ్యాప్తంగా భారతదేశమంటే గుర్తొచ్చే మహానుభావులలో మొదటివరుసలో కనపడే మహనీయుడు వివేకానందులవారు. నిర్వీర్యమవుతున్నజాతిని మేల్కొల్పి శక్తివంతులనుచేశాయి ఆయనబోధలు. ముఖ్యంగా ఈనాటి యువతకు ఆయన బోధలు ఎంతో అవసరం . జాతిని చైతన్యవంతం చేయగల ఈయన బోధలు మనకు వద్దని వారించే వారి ఉద్దేశ్యమేమిటో నాకర్ధం కావటం లేదు . కాషాయరంగు బట్టలు కట్టాడుకనుక ఈయన హిందువు కనుక ఈయన చేప్పే మాటలు ఎంతగొప్పవైనా పిల్లలకు చెప్పకూడదనా వీరి ఉద్దేశ్యం ? ఆయనబోధలు చదివారా మీరు? ఆయనమాట్లాడినవన్నీ ఒకమతాన్ని ఇతరులమీదకు రుద్దేవిగా ఉంటాయా ? !!

అయ్యా ! నేను ఓ చిన్న ప్రశ్న అడుగుతున్నాను . మదర్ థెరిస్సా వేషధారణ క్రైస్తవవాన్ని సూచిస్తుంది . ఆమె ఒంటిపై శిలువ గుర్తు కనపడుతుంది. కానీ మాకు ఆమెగూర్చి ఇచ్చిన పాఠ్యాంశాలుచదివినా చెప్పినా మానవీయ విలువలే కనపడ్డాయిగాని.ఇలాంటి మానసిక వైకల్య భావనలు కనపడలేదే ! ?

ఏమి మాట్లాడుతున్నారు మీరు ? ఎవరిని సంప్రదించి నిర్ణయించుకుని మాట్లాడుతున్నారు మీరు .నేనుకూడా యూటీఎఫ్ సభ్యుడినే . ప్రతిసంవత్సరం చందా చెల్లించి సభ్యునిగా కొనసాగుతున్నాను. మీరు ఈమాటమాట్లాడదలచుకున్నప్పుడు కనీసం జిల్లాబాధ్యులను సంప్రదించారా ? నేనైతే నాదేశాన్ని ,ఈదేశాన్ని చైతన్యవతం చేసిన ,మానవీయ విలువలను బోధించిన మహానుభావులందరినీ గౌరవిస్తాను . ఈ ప్రకటనను నేను గర్హిస్తున్నాను .

Read more...

పరహిత వ్రతం

>> Sunday, February 27, 2011



లోకంలో మూడు రకాల మనుషులుంటారు. ఈ జీవితం పరుల మేలుకోసమేననుకునేవారు మొదటిరకం. జీవితం పరుల కోసమూ, తన కోసమూ అనుకునేవారు రెండోరకం. జీవితం తనది, తన కోసమేననుకునేవారు మూడోరకం. వీరిలో మొదటి కోవకు చెందినవారే ఉత్తములు. యోగులు, మునులు, పౌరాణికులు, బుధులు- అంతా ఆ శ్రేణికి చెందినవారే. వారు లోకకల్యాణమే మహోన్నతాశయంగా భావించి తమ జీవిత సర్వస్వం జ్ఞాన సముపార్జనకు, జ్ఞాన వితరణకే అంకితం చేసిన మహానుభావులు. కనుకనే నేడు మన భారత జాతి పావనమైన ఆధ్యాత్మిక దిశవైపు దూసుకుపోతోంది.

ఎంతటి ఆధ్యాత్మికానందానుభూతిలో రసప్లావితులవుతున్నా మానవుడు నిరంతరం జ్ఞాపకముంచుకుని అనుసరించదగినది ఒకే ఒక్క వ్రతం. అదే పరహితవ్రతం. అంటే- ఇతరులకు ఉపకారం చేయడమే నిరంతర దీక్షగాబూని వర్తిల్లడం.

నిజానికి పరోపకారమనే శబ్దం చాలా తేలికగా కనిపించినా, వినిపించినా ఆ పదంలోని శక్తి, మహిమ వర్ణనాతీతం. తెల్లవారి మేల్కొన్నప్పటి నుంచీ మన దినచర్యలను, సంభాషణలను, ప్రవర్తనలను ఏమైనా పరిశీలించుకుంటున్నామా? మనం ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇదంతా ఎవరికోసమనే ప్రశ్నలు వేసుకొంటే వస్తున్న సమాధానం ఒకటే- 'నా కోసం నా కుటుంబం కోసం!'. ఎంత స్వార్థం! ఎంత హేయం! ఈ సమాధానంతో సంతృప్తిపడుతూ శ్లేష్మంలోని ఈగలా సంపారలంపటంలో కొట్టుమిట్టాడుతూ నిరర్థకంగా జీవితం వెళ్లబుచ్చడమేనా?

భగవంతుడు ప్రసాదించిన ఈ జీవన వరప్రసాదం పదిమందికీ అందాలి. పదిమంది మన మాటవల్ల మన చర్య వల్ల ఆనందపడాలి, సుఖపడాలి. బదులుగా వారేమిస్తారు. మనకేం చేస్తారన్న భావనకే మనసులో చోటివ్వకూడదు. హితమన్నా ఉపకారమన్నా అదే. ఉపకారికి ఉపకారంతోపాటు అపకారికి కూడా ఉపకారం చెయ్యమనే చెబుతున్నాయి మన ధర్మశాస్త్రాలు. అంతటి విశాల దృక్పథాన్ని మానవుడు అలవరచుకున్ననాడు మానవజాతిలో హింసకు, దౌర్జన్యానికి అశాంతికీ తావే ఉండదు. పొరుగువారికి తోడ్పటంలో సొంత లాభం కొంతలో కొంతైనా మానుకుంటే మునిగిపోయే కొంపలేముంటాయి? ఒక్క మాటసాయమో, ఒక్క పనిసాయమో చేస్తే ఎదుటి వ్యక్తి ముఖంలో ఎంతటి ఆనందం, సంతృప్తీ తొణికిసలాడతాయో- అది చూస్తే మన జన్మ ధన్యమనిపించదూ! ఇలాగే- ఇంకా, ఇంకా సాటివాడికి సాయం చేయాలనిపించదూ! అందులో ఎంత తృప్తి, ఎంత ఆనందం! ఆ ఆనందమే మన ఆరోగ్యాన్ని పెంచుతుంది.

తొంభై సంవత్సరాల ఓ పండు వృద్ధుడు ఓ మామిడి మొక్కను నాటుతుంటే చూసిన ఓ పిల్లవాడు- 'తాతా! ఈ మామిడి మొక్క పెద్దదై పండ్లు ఇస్తే తినొచ్చని ఆశతో నాటుతున్నావా?' అని అడిగితే తాత అన్నాడట- 'మా తాత ముత్తాతలు వేసిన మొక్కలు వృక్షాలై ఫలాలనిస్తే తృప్తిగా ఆరగించాను కదా. అలాగే- ఈ మొక్కలు నాకోసం కాదు నాయనా, నా తరవాతి తరాలకోసం!' అన్నాడట. అటువంటి ఉపకార భావం మనిషి నరనరానా జీర్ణించుకుపోవాలి. ఇతరులకు సాయపడే తత్వమే లేకపోతే మనం దేని నుంచైనా, ఎవరి నుంచైనా ఏ రకంగా మేలుపొందగలం?

ఎంత డబ్బున్నా ఆ డబ్బుతో కూడా కొనలేనివెన్నో ఉన్నాయి. అది గమనించాలి మనం. మూడు వేళ్లతో దానం చేస్తే అయిదు వేళ్లతో తినగలం. పది వేళ్లతో నమస్కరిస్తే పదుల వేలు సంపాదించుకోగలం. అయితే మనం ఎంత సంపాదించామన్నది కాదు, ఎలా సంపాదించామనేది ముఖ్యం! ఎంత దాచామన్నది కాదు ముఖ్యం, ఎంత వితరణ చేశామన్నది ముఖ్యం. ఎంతసేపూ 'వాడు నాకేం చేశాడని నేను చెయ్యాలి?' అని ప్రశ్నించుకోవడం మహా మూర్ఖత్వం. మనం చెయ్యడమే ప్రధానం.

ఎదుటివాడు కోరకపోయినా, ఆశించకపోయినా తోచిన సలహా మంచిదైతే మనకు మనం చెప్పడంలో తప్పులేదు. ఉపకారం చేయడం నేరం కాదు. 'మంచి చెయ్యకపోయినా, చెడు మాత్రం చెయ్యకు' అంటారు కొందరు. తనంతట తానుగా ఉపకారం చేయాలన్న మనసున్నవాడు సహజంగానే ఇతరులు చేసే మేలుకు సర్వదా కృతజ్ఞుడై ఉంటాడు. ఇదొక ఉత్తమమైన సంస్కారం. భవ్య జీవనసారం. నిజానికి పరహిత దీక్షపరుడెప్పుడూ ఈ ప్రకృతికే కృతజ్ఞుడై ఉంటాడు. ప్రతి వస్తువునుంచీ ఉపకారం పొందుతూనే ఉంటాడు కనుక!

నిజమైన ఉపకారి తాను ఇతరులకు చేసిన మేలును బహిరంగంగా ప్రకటించుకోడు. కీర్తి కోసమో, సత్కారం కోసమో, బిరుదు కోసమో తాపత్రయపడడు. 'మాఫలేషు కదాచన' అన్న గీతావాక్యాన్ని ఎన్నటికీ విస్మరించడు. వ్యక్తిత్వ పరిపక్వతకిదే తార్కాణం. పరహితవ్రత దీక్షాపరులకు అందే సుఖశాంతులు అందుకే అనుభవైక వేద్యాలు, ఆత్మ-పరమాత్మలకు నిత్యనైవేద్యాలు!


- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Read more...

సత్యమార్గంలో సాహసం

>> Saturday, February 26, 2011


- కె.యజ్ఞన్న
త్వవేత్తలు లోకాతీతమైన సత్యాల గురించి ఆలోచిస్తుంటారు. శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచంలోని వాస్తవాలను పరిశోధిస్తారు. తత్వవేత్తలు మానస పుస్తకం చదివితే, శాస్త్రవేత్తలు ప్రకృతి పుస్తకం చదువుతారు. తత్వవేత్తలు లోపలి పుస్తకం చదువుతారు కాబట్టి, వారు భౌతిక సత్యాలు పట్టించుకోరు. శాస్త్రవేత్తలు బాహ్య పుస్తకం చదువుతారు కాబట్టి, వారికి లోపలి సత్యాలు అవసరం లేదు.

'నేను మత నియమాలు పాటించి, మతం చెప్పే సత్యం సిద్ధింపజేసుకోవాలనుకున్నాను. కాని నాకు అది అందలేదు. ఇప్పుడు నేను సత్యాన్ని నమ్మలేని స్థితికి వచ్చాను' అని సాధారణంగా ప్రతి వ్యక్తీ అనుకుంటాడు. 'నేను మతం చెప్పే సూత్రాల ప్రకారం జీవించాను. అందులో నాకేమీ కనిపించలేదు' అనేవారు కోకొల్లలు. ఒక గొప్ప శాస్త్రవేత్త వద్దకు ఒక సాధారణ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి శాస్త్రజ్ఞుడితో 'నాకు సైన్సులో నమ్మకం లేదు. అందులో ఏమీ లేదు. జీవితమంతా ప్రయత్నించాను. కాని నేను శాస్త్రవేత్త కాలేకపోయాను' అన్నాడు. అప్పుడా శాస్త్రవేత్త 'నువ్వు ప్రయత్నించానన్నావు. ఏం చేశావు?' అని అడిగాడు. 'నేను రాత్రివేళ- ఓ విజ్ఞానశాస్త్రమా! నా వద్దకురా అని ఎన్నోసార్లు అడిగాను. కాని అది నా వద్దకు రాలేదు' అని సామాన్య వ్యక్తి అన్నాడు. అప్పుడా శాస్త్రవేత్త నవ్వి 'అది సరియైున పద్ధతి కాదు. నువ్వెందుకు ఆ గ్రంథాలు చదవలేదు? ప్రయోగశాలకు వెళ్లి ఏమైనా ప్రయోగాలు చేశావా? అప్పుడే నీకు సైన్సు తెలుస్తుంది' అన్నాడు.

ఆధ్యాత్మిక జ్ఞానసంపాదనలోనూ మనం చేసే పొరపాటు అదే.

తత్వ పరిశోధనలో సైతం శ్రమించాలి. సాధన చెయ్యాలి. మానసక్షేత్రంలో ప్రయోగాలు చెయ్యాలి. రాత్రివేళ లేదా పొద్దున్నే లేచి కాస్సేపు ధ్యానం చేసి 'ఓ సత్యమా! నా వద్దకు రా' అని పదేపదే మంత్రాలు చదివితే అది రాదు. మనం ఉన్న స్థితిలోనే ఉంటాం. ఇప్పుడు ఉన్నది అదే స్థితిలో. భౌతిక సత్యాల ఆవిష్కరణకు ఎన్నో త్యాగాలు చేస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక అన్వేషణలో ఎన్ని త్యాగాలు చెయ్యవలసి వస్తుందో! 'ఎందుకీ శ్రమ?' అనే ప్రశ్నకు శాస్త్రవేత్తకాని, తత్వవేత్తకానీ జవాబివ్వడు. జవాబివ్వలేడు. ఒకవేళ ఆ శ్రమ లేకపోతే మనమింకా కొండ గుహల్లో ఆదిమానవుల్లాగా జీవిస్తుండేవాళ్లం. మనలో ఎవ్వడో ఒకడు మానవజాతి సుఖసంతోషాలకోసం (భౌతికమైన, ఆధ్యాత్మికమైన) ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పరిపూర్ణత్వంకోసం, సత్యంకోసం, నిజమైన ఆనందం కోసం పరిగెడుతూనే ఉన్నాడు. అవి దొరికేవరకు ఈ పరుగు ఆగదు. ఏమో! భౌతికమైన విజ్ఞానశాస్త్రం గీసిన సరిహద్దురేఖలు సైతం దాటిపోయి మానవజాతి ఆనందమయ కాంతిలోకంలో అడుగుపెట్టగలదేమో!

చాలామంది- ప్రాచీన ప్రవక్తల మాటలకు, ఆ యుగాల బృహత్‌గ్రంథాలకు బూజు పట్టిందని, ఆధునిక సమాజానికి పనికిరావని భావిస్తున్నారు. ఔను, వాటిని అధిగమించి మానవజాతిని మహోన్నత శిఖరాలకు తీసుకునివెళ్లాలి. నిజమే కాని, అక్కడికి వెళ్లే మార్గాలు ఆ ప్రవక్తల ప్రవచనాల్లోనే నిక్షిప్తమై ఉన్నాయన్న సంగతి మరచిపోరాదు.

నదిని దాటడానికి పడవ ఉపయోగిస్తాం. నదిని దాటిన పిమ్మట పడవను మోసుకుని ఊళ్లోకి ఎవ్వరూ వెళ్లరు. అలాగే ప్రాచీన మంత్ర సంహితలు సత్యధామం వరకు మనల్ని తీసుకుని వెళ్తాయి. సత్యాన్ని చూడవలసింది మనం... అవి కావు. సహనం, విశ్వాసం, సాధనతోపాటు సాహసం కూడా కావాలి.

ప్రాచీన శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు సాహసంతో ముందడుగు వేశారు కాబట్టే- మనకు ఇంతటి మహనీయ ప్రపంచం లభించింది. సాంకేతిక పురోగతితోపాటు నైతిక, ఆధ్యాత్మిక పరివర్తనం జరిగినప్పుడే మనిషికి నిజమైన శాంతి లభిస్తుంది. భౌతికమైన గట్టి పునాదులపైనే ఆధ్యాత్మిక స్వర్గం చెక్కుచెదరకుండా భాసిస్తుంది. దానికోసం నిరీక్షించడం కాదు... ఎవరికి వారు కొద్దిగానైనా ప్రయత్నిస్తే ఆ అమృతక్షణం త్వరలోనే రావచ్చు.


Read more...

శాస్త్రం... ఒక శేషవస్త్రం

>> Wednesday, February 23, 2011


- చక్కిలం విజయలక్ష్మి
శాస్త్రం... రుషులు మనకిచ్చిన భగవంతుని శేషవస్త్రం. దాన్ని ధరించి, అవధరించి, తరించమనే ఆశీర్వచనం. మన ఘన సంస్కృతి అనే మేరుపర్వతాన్ని శాస్త్రం చిన్న అద్దమై ప్రతిబింబిస్తుంది. భారతీయ సంస్కృతి ఎంత ఘనమైనదంటే యుగాలకు పూర్వం నుంచే మానవ జీవితాన్ని పూలపందిరిలా నవనవోన్మేషంగా పరిఢవిల్లజేయడానికీ, పరిమళింపజేయడానికీ మొలకగా ఉన్నప్పుడే, మారాకు తొడగకముందే- శాస్త్రం అనే రాటను ఆసరా పట్టించి అల్లుకుపొమ్మంది. శాస్త్రం అడుగడుగునా, అణువణువునా మనిషి జీవనగమనాన్ని స్వప్రయోజన, సార్వజనీన ప్రయోజనాలతో నిర్దేశిస్తూ సర్వభూత హితకారిగా, జీవన సార్ధక్య దిశగా సాగిపోయే బంగారుబాట వేస్తుంది.

శాస్త్రం సదా వందనీయం. శిరోధార్యం. శాస్త్రం చీకట్లో కరదీపికలాంటిది. ముళ్లదారిలో పాదరక్షల్లాంటిది. కొత్తదారిలో మార్గసూచికలాంటిది. శాస్త్రం రాచబాటలాంటిది. శాస్త్రాన్ని అనుసరిస్తే ఏ గమ్యానికైనా ముళ్లు ఏరుకుంటూ, దారి వెదుక్కుంటూ పోవలసిన అవసరం లేదు. మన సాధనలో ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో సగం పని అది చేసిపెడుతుంది. శాస్త్రం ఒక మతానికో, దేశానికో, కాలానికో సంబంధించినది కాదు. అది సార్వకాలికం. సదా అనుసరణీయం. అది మనను ప్రేమించే తల్లిలాంటిది. అన్నం పెట్టే అమ్మలాంటిది. క్రమశిక్షణ నేర్పే తండ్రిలాంటిది. నీకు నేనున్నాననే సోదరునిలాంటిది. మనసు పంచుకునే మిత్రునిలాంటిది.

మనకు జలాశయాల్లో నీళ్లు దొరుకుతాయి. చెట్లనుంచి గాలి వీస్తుంది. అగ్ని రాజేస్తే వేడి పుడుతుంది. ఇలాగే దేనికి సంబంధించిన మూలవస్తువు దాన్నే మనకు అందిస్తుంది. కానీ శాస్త్రం ఇవ్వని జ్ఞానం లేదు. శాస్త్రం తీర్చని సమస్య లేదు. శాస్త్రం చెప్పని ధైర్యం లేదు. అది కల్పతరువు, కామధేనువు. మన ఒక్కరి జీవితంలోని అనుభవాలు మనకు పూర్తి పాఠాలు చెప్పలేవు. చెప్పిన పాఠమైనా ఆ పాఠం గ్రహించేలోపల ఆ అనుభవం తాలూకు ఆపదా, దాని అవసరమూ తీరిపోయి ఉంటాయి. శాస్త్రం ఎన్నో వేలూ లక్షల మంది అనుభవసారం! మంచి చెడుల విశ్లేషణల రసం! జ్ఞానభండారం! సౌరభ మందారం. మనం దానివైపు చూడటం లేదు. అసలు ప్రతి విషయంలో అలాంటిదొకటుందనే స్పృహే మనకు లేదు. ఎంత దౌర్భాగ్యం! ఆధునిక శాస్త్రాలు భౌతిక పరిశోధనాలయాల్లో గాజు నాళికల్లో పరీక్షల తరవాత నిర్ధారితమైన సూత్రాలు. ఎప్పటికప్పుడు అవి మారే అవకాశాలున్నాయి. ప్రాచీన రుషులు మనకందించిన శాస్త్రాలు వారి మేధస్సులోంచీ, మనోమథనంలోంచీ, వారి తపోభూమికలోంచీ ఉద్భవించిన సారభూతాలు. నిష్కామకర్మిష్ఠుల అనుభవసారాలు. వాటికి తిరుగు లేదు. మార్పు ఉండదు. గురువైనా శాస్త్రాన్ని బోధించవలసిందే. సత్య దర్శనం ఎలా చేయాలనేదే కాదు. ఎలాంటివారు గురువు స్థానానికి అర్హుడనే కీలకాంశాన్నీ శాస్త్రం మనకు తెలియజేస్తుంది. అదృష్టవశాత్తు భారతీయులకు శాస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. స్వీకరించగలిగితే ప్రపంచ మానవాళికందరికీ. దురదృష్టవశాత్తూ మనమే మన శాస్త్రనిధిని నిర్లక్ష్యం చేస్తున్నాం. మీదుమిక్కిలి ధ్వంసం చేస్తున్నాం. అమృతమైనా ఉపయోగించుకుంటేనే మేలు చేస్తుంది. మనం విషప్రాయమైన సంస్కృతులవైపు పరుగులు తీస్తున్నాం. ఎండమావులకు ఆకర్షితులమై ఒడిలోని అమృతకలశాన్ని ఒలకబోసుకుంటున్నాం. ఏమిటీ దౌర్భాగ్యం!

నిన్న మొన్న కళ్లు తెరిచిన చిన్ని చిన్ని దేశాలు కూడా తమ సంస్కృతిపట్ల గౌరవాన్ని కలిగిఉన్నాయి. నిలబెట్టుకోవాలనే తపన కలిగిఉన్నాయి. ఆచరించాలనే ఆరాటంతో మెలగుతున్నాయి. అత్యున్నతమైన సుసంస్కృతిని, ఉదాత్తమైన సంస్కారాన్ని, అమూల్యమైన జ్ఞానభాండారాన్ని కలిగి ఉండీ మనం- తన బలం తనకు తెలీని హనుమంతునిలా ప్రవర్తిస్తున్నాం. చాలా ఏళ్లు నిద్రపోయాం. ఇక చాలు. మేలుకోవాలి. మన బలం మనం తెలుసుకోవాలి. మన సత్తా మనం గ్రహించాలి. నిజానికి మనం మారవలసిందేమీ లేదు. మనమెవరమో, మన ఆభిజాత్యమేమిటో గుర్తుచేసుకుంటే చాలు. రాముడెవరంటే 'ఫలానా నటుడు' అనే సామాజిక స్థాయి నుంచి 'రామో విగ్రహవాన్‌ ధర్మః' అనే సాకేత స్థాయికి ఎదగగలిగితే- భావితరాలకు మన సంస్కృతీ సంప్రదాయాల సహజ వారసత్వాన్ని కొంతవరకైనా అందించినవారమవుతాం. లేకపోతే వారిముందు దోషులుగా నిలబడవలసి వస్తుంది.
అందుకే శాస్త్రాలను విశ్వసిద్దాం, అనుసరిద్దాం, ఆచరిద్దాం. భారతీయతకు నిలువుటద్దాలుగా నిలుద్దాం.


Read more...

జీవితాన్ని జీవించాలి!

>> Tuesday, February 22, 2011


- తటవర్తి రామచంద్రరావు
నుషులు మూడు రకాలు. ఒకరకం దేనికీ సంతృప్తిపడని వాళ్ళు. అహంకారులు. వారి కోరికలు అనంతం. అసహనం ఎక్కువ. తాము సుఖపడలేరు. ఇతరుల్ని సుఖపెట్టలేరు. రెండోరకంవారు, లభ్యమైనదానితో సరిపెట్టుకుంటారు. తమకంతే రాసిపెట్టి ఉందని సమాధానపడిపోతుంటారు. తృప్తికి, సర్దుబాటుకు తేడా తెలియని వ్యక్తులు. ఇక మూడోరకం- వీళ్ళిద్దరిలా అటూఇటూ వూగిసలాడరు. నిత్యాన్వేషకులు. చైతన్యవంతులు. తమకానందించటం తెలుసు. ఇతరుల్ని ఆనందపెట్టడమూ తెలుసు.

ఒకరోజున ఒక చెరువులో చేపలు పట్టడానికి ఆ మూడు రకాల వాళ్ళు వెళ్ళారు. మొదటివాడు చేపలు దొరకలేదని చిరాకుపడ్డాడు. గాలాన్ని, తాడును, ఎరను, తన పనిముట్లను తిట్టాడు. తన జాతకాన్ని తప్పుపట్టాడు. బుర్రనిండా అస్తవ్యస్తమైన ఆలోచనలతో గింజుకున్నాడు. పోనీ తోటివాళ్ళకు దొరకనట్లే తనకీ చేపలు దొరకలేదేమో అని సమాధానపడలేదు. ఇతరులకు దొరికిపోతాయేమోనని హైరానాపడిపోయాడు. తనకు దొరక్కపోతేపోయె... వాళ్ళక్కూడా దొరక్కూడదని అనుకున్నాడు అహంభావి అసహనమూర్తి. అశాంతికి మారురూపమతడు.

రెండోరకం వాడికికూడ రోజంతా చేపలు దొరకలేదు. కాలక్షేపానికి పుస్తకాలు చదివాడు. మధ్యమధ్య తెచ్చుకున్నది తిన్నాడు, తాగాడు. ఆఖరికి తనకారోజు చేపలు దొరికే ప్రాప్తంలేదని నిట్టూర్చి ఇంటిముఖం పట్టాడు. తనకిలా రాసిపెట్టివుందని రాజీపడిపోయాడు.

ఇంక మూడోవాడు జ్ఞాని. అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాడు. చేపల వేట పనిలో ఉన్న భగవత్ప్రసాదితమైన సృష్టిలోని అందాలన్నీ ఆస్వాదించసాగాడు. తనముఖంపైకి నీటిమీదనుంచి వచ్చే చల్లనిగాలులకు పరవశించాడు. గాలివీచే దిశగా నావను నడిపాడు. తనను నావలో ఒక భాగంగా చేసుకొని సాగిపోయాడు. గాలికి కదిలివచ్చే కెరటాల మీద నావ సాగుతుంటే- అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాడు. తన తలపై పక్షి ఎగిరి వెడుతూంటే తానూ మానసికంగా ఒక పక్షిలా ఎగిరాడు. నీటిలో మిలమిల కదిలే చేపల్ని కుతూహలంగా తిలకించాడు. ఇనుము అయస్కాంతంవైపు తరలివచ్చేటట్లు ఏదో ఒక చేప చిక్కకపోదన్న నమ్మకంతో గాలాన్ని ఒడుపుగా పట్టుకున్నాడు. అతని గాలానికున్న సన్నని తాడులాగానే ఏకాగ్రతతో నిరీక్షించాడు.

ఇంటికి వెళ్ళిన ముగ్గురూ మూడు రకాలుగా ప్రవర్తించారు. మొదటివాడు తనకు చేపలు దొరకలేదని ఎదురువచ్చిన పెంపుడు కుక్కను తన్నాడు. పిల్లల్ని అనవసరంగా కొట్టాడు. భార్యను వంకలుపెట్టి తిట్టాడు. తన ఇంటిని చేజేతులా నరకం చేసుకున్నాడు. ఇలాంటివాడికి ఎదురుపడాలంటేనే అంతా భయపడతారు.

రెండోవాడు నిద్రపోయాడు. నావలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడో అక్కడా స్తబ్ధుగా ఉండిపోయాడు. అతను తనకూ ఉపయోగించడు. ఇతరులకీ ఉపయోగించడు. ఇక మూడోవాడు- చేపలు దొరికినా దొరక్కపోయినా విజేత. నావలో ఉన్నా ఇంట్లో ఉన్నా అతని ప్రతి కదలికలోనూ చైతన్యమే. మనసు నిత్య ఆనందమయం. ఇంటా బయటా సుఖజీవనం ఇతని సొత్తు.

ఈ సామ్యాలు చేపలు పట్టడానికి వెళ్ళినవాళ్ళకే కాదు. జీవితంలో ఏది సాధించాలనుకున్న వాళ్ళకైనా అన్వయిస్తాయి. ఎవరి జీవన విధానాన్ని మలచుకునే శక్తియుక్తులు వారిచేతుల్లో ఉంటాయి. మొదటిరకం అసంతృప్తిగా బతికితే, రెండోరకం అసంపూర్తిగా బతుకుతారు. మూడోరకం మాత్రం పరిపూర్ణంగా జీవిస్తుంటారు.


Read more...

మనీషాపంచకమ్

>> Monday, February 21, 2011


అవతారమూర్తి సైతం మానవదేహం ధరించి వచ్చినప్పుడు సత్వ, రజో, తమో గుణాలతో ఉంటాడు. కాల, కార ్య, కారణ, కర్తవ్య నిమిత్తంగా ఉంటాడు. ఎంత సర్వజ్ఞుడైనా, జగత్తుకు ఏదైనా మహాపరిసత్యం బోధించదలచినప్పుడు, సాధారణ మానవుని వలె ప్రవర్తిస్తారు. శ్రీరాముడు యోగ వాశిష్ఠాన్ని శ్రద్ధగా ఆలకించాడు. శ్రీకృష్ణుడు విష్ణుసహస్రనామాన్ని నిష్ఠగా విన్నాడు. అలాగే శంకర భగవత్పాదులు పరబ్రహ్మస్వరూపమై కూడా అద్వైత బోధను ఇలాగే అందుకున్నారు. ఆ సందర్భం రమణీయం. మనోహరం. హృదయంగమం.

అద్వైతం... అమరం
శిష్య సమేతంగా వెళుతున్న శంకరుల కంటికి కటికవాడు ఒకడు కనిపించాడు. అతని వెంట నాలుగు శునకాలున్నాయి. జాత్యభిమానాన్ని ప్రకటిస్తూ శంకరులు "తొలగు..తొలగు'' అన్నారు. దేనిని తొలగమంటున్నారు? దేహాన్ని తొలగమనడం అంటే మీదీ దేహమే. నాదీ దేహమే. రెండూ అన్నమయాలే. రెండూ పంచభూతాల వల్ల ఏర్పడినవే. ఇక తేడా ఎక్కడ ఉంది? పోనీ జ్ఞాన దృష్టితో చూసినా నీలో ఆత్మ ఉంది. నాలోనూ అదే ఉంది. కనుక బ్రాహ్మణ, చండాల అని దేనిని చూసి అంటున్నారు? సూర్యడు గంగాజలం పైనా, మురికి కాలువలోని నీటిపైనా ఏకకాలంలో ప్రసరించడం లేదా? ఆత్మ అంటే అద్వైత భావనే కదా? ఇక తొలగిపోవలసింది ఏది? అన్నాడు ఆ చండాలుడు.

శంకరుల హృదయాన్ని ఈ ప్రశ్నలన్నీ జ్ఞాన కిరణాల వలె తాకాయి. బ్రాహ్మణుడు - "చండాలుడు అనే భావాన్ని, పావనుడు - పాపి అనే భేద భావాన్ని, ద్వంద్వాలను విడిచి సమత్వాన్ని, సమభావాన్ని, సమదృష్టిని ఆచరిస్తాను. మహోదాత్తమైన దివ్యబోధనందించిన మీరు ఈశ్వరులే తప్ప వేరొకరు కాదు''. అంటూనే "అంతే కాదు సర్వ సృష్టిని ఆత్మ స్వరూపంగా చూడగలిగిన వాడు, నిశ్చిత జ్ఞాని అయినవాడు, ఎవరైనా సరే నాకు గురుసమానుడు. సర్వకాలాలా నాకు ఆరాధనీయుడే'' అన్నారు శంకరులు.

ఆ ఎరుకే జ్ఞానం
"బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఉన్న చైతన్యమే సమస్త జీవకోటిలోనూ ఉంది. అన్ని కాలాల్లో ఈ భావంతో వెలుగుతున్న తత్త్వజ్ఞుడు నాకు పరమ గురువే. నాకు మాత్రమే కాదు. జగత్తు అంతటికీ గురువే'' అన్నారు భగవత్పాదులు. అంతే కాదు తన ఎదుట నిలబడి, దర్శనాన్ని అనుగ్రహించినది సాక్షాత్తూ ఆ పరమశివుడే అని గ్రహించారు శంకరులు. భేదభావం నశించిన స్థితే మనీష. తిరుగులేని, మరువరాని మహాపరిసత్యం. నిశ్చితమైన, స్థిరమైన భావం. ఆ విషయాన్నే శంకరులు తన మనీషా పంచకంలో తేటతెల్లం చేశారు. భేదభావం లేకపోవడమే అద్వైతం. భౌతిక స్థితిలో రెండూ కనిపించినా, అధిభౌతిక స్థితిలో రెండూ ఒకటేననే స్థిరచింతన కలిగినా, ఆధ్మాత్మిక స్థితిలో, రెండంటూ లేవని, ఉన్నది ఒకటేనని ఎరుక కలగడమే జ్ఞానలబ్ధి.

సిద్ధత, శుద్ధత, వాటికి తోడు వినయమూ తోడైతే, ఆనంద తారకస్థితిని అందుకోవడం ఎంత సులభం?

ఆ స్థితిని అనుభవించడం ఎంత సుందరం?
ఆ స్థితిలో ఆత్మానందం కలగడం ఎంత శివం?
ఆ స్థితిలో సంస్థితం కావడం ఎంత సత్యం?
ఒకే స్థితిలో అన్నిటినీ, అన్ని స్థితులలో వాటిని మనిషాయత్తంగా అనుభవించగలగడం సాధ్యమేనని, జ్ఞానస్వరూపులైన శంకరులు నిరూపించారు.
- వి.ఎస్.ఆర్, మూర్తి,
ఆధ్మాత్మిక శాస్త్రవేత్త.

Read more...

కొంచెం కంఫ్యూజన్ గా ఉంది !హిందూ ధర్మం వేరే, హిందూమతం వేరేనా..?

>> Sunday, February 20, 2011



Anonymous said...

దుగ్గేశ్వర్ గారూ,
కొంచెం కంఫ్యూజన్ గా ఉంది. ధర్మం లోకి మారడం వేరే, మతం లోకి మారడం వేరేనా..? హిందూ ధర్మం వేరే, హిందూ మతం వేరేనా..? దయచేసి వివరించగలరని మనవి.


అజ్ఞాతగారూ
ఇంత మంచి ప్రశ్నవేసినందుకు చాలా సంతోషం .
ముందుగా మతం అంటే ఏమిటి ?చర్చిద్దాం .మతం అంటే ఒక వ్యక్తి లేక కొద్దిమంది మనుషుల అభిప్రాయం. సామాన్యమానువులు కాక విశేషశక్తికలిగిన మహాత్ములమనస్సునుంచి ఉద్భవించిన మార్గం. సాధారణ జీవనంలో మనమెవరిమీదన్నా విసుగువస్తే వాడిమతం వేరురా! అంటుంటాం కదా .అంటే అక్కడ అతని ఆలోచనవేరు అని అర్ధం.

దీనిని ప్రామాణీకరిస్తూ ఒక సిద్దాంత,లేక ఆలోచనారీతి ఉండవచ్చు.దానిని వివరించే ఒక గ్రంథం ఉటాయి ప్రమాణంగా చెప్పటానికి.
అయితే ధర్మం ఇంకావిస్త్రృతమైనది. అది సత్యం ,మారటానికి వీలులేనిది . మనకు అందుబాటులో ఉన్న ఉదాహరణ నొకటిచెబుతాను. "సూర్యుడు తుర్పున ఉదయిస్తాడు ".అన్నది సత్యం .

ఈ సత్యాన్ని ఎవరు చెప్పినా భాషలలో తేడాతప్ప భావంలో తేడాఉండదు . ఇదీ ధర్మమంటే. అనేకానేకమతాలు ఈ సత్యాన్ని చెప్పటానికి అనేకవిధాలుగా ప్రయత్నించవచ్చు , కానీ చెప్పబడే సత్యం ఒక్కటే .
ఈ తీరున చూస్తే మనది మతం కాదు .ధర్మం . హిందూ ధర్మం . సనాతనం .అంటే అనాది .ఆది కూడా ఇదే.

అందుకనే మనకు ఈ ధర్మంలో అనేకమతాలు కనపడతాయి ,అద్వైత.ద్వైత,విషిష్ఠాద్వైత,బౌద్ధ,జైన ములనుండి అనేకం ఇందులో . వీటన్నింటి మూలసూత్రాలు ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అన్నిమతాల మూలసిధ్ధాంతాలు ఇందులోనే కనిపిస్తాయి. దీనికి మిగతామతాలలాగా ఒకే మతగ్రంథం ప్రామాణికం కాదు. అదీగాక ఇది ఎవరో ఒక మహానుభావుని భావాలనుండి మాత్రమే ఉద్భవించిన సిధ్ధాంతం కాదు. అనేకానేకమంది ద్రష్ట లు భగవంతునినుండి పొందిన దివ్యజ్ఞానాన్ని పొందుపరుస్తుండగా అనంతంగావిస్తరించి,మనిషి సంపూర్ణమానవునిగా ఎదగటానికి అవసరమయ్యే విజ్ఞానభాండాగారం . ఇది యుగయుగాలుగా సుసంపన్నమవుతూ సాగుతున్న గంగ . కనుకనే మనం దీనిని ధర్మం అనిపిలవాలి . కాకుంటే వాడుకలో హిందూమతం అనేపిలుపుకు అలవాటయ్యాం. అదికూడా ఒకశుభకరమైన అలంకారమే . సృష్టిలోఉన్నసమస్తంలోనూ భిన్నత్వం కనపడుతుంది .అందులోభాగమైన మనుషులలోనూ భిన్నత్వం ఉంటుంది . ఈభిన్నత్వాల ఆలోచనలన్నీ ఏకత్వానికి చేరుకుంటాయని చెబుతూ,ఆసత్యాన్ని గ్రహించటానికే ఈ ధర్మంలో వివిధ ఉపాసనారీతులు,ఆరాధనలు ,యోగాలు కనపడతాయి. నేనుచెప్పినది నువ్వునమ్మటం కాదు .సత్యాన్వేషణలో నువ్వుసాగుతూ నేతి,నేతి,అంటూ అన్వేషణ సాగించు అంటూ మానవునికి సంపూర్ణస్వాతంత్ర్యాన్ని ఇచ్చిప్రోత్సహించే మార్గం ధర్మం కనుక ఇక్కడే . కనపడుతుంది . ఆకాశత్పతితం తోయం..యథాగచ్చతి సాగరం... అన్నట్లు చివరకు ఈ అన్వేషణలన్నీ పరమ ,చరమ సత్యమైన పరమాత్మవద్దకు చేరుస్తాయి. దానిని బోధించి అనుసరించమనదు.అన్వేషించు ,అన్వేషించు,నువ్వు అనంతశక్తిగలవానివి అనిచెబుతుంది.

కనుకనే దీనికి మతాలకున్నట్లు ఏఒక్కప్రవక్తో,ఒకమతగ్రంథము మాత్రమో ప్రమాణం కాదు. అనంతమైన పరమాత్మతత్వాన్ని అనంతంగా వివరిస్తూ సాగుతూనే ఉంది.

ఇక్కడ మీరింకొక ప్రశ్నవేయవచ్చు.

ఇంకేం !,అన్నీ ఇందులోనివే అయినప్పుడు దీనిని ఇంకోమతం ధ్వంశం చేస్తే మాత్రమేమి ?అదికూడా దీనిలోనిదే కదా అనవచ్చు.
చాలాగొప్పగా విస్తరించిన మహావృక్షంలో అనేకానేక శాఖలు ఉంటాయి . కొన్నిశాఖలు క్షీణించినా ,నశించినా కొత్త కొమ్మలు వస్తాయి ,కొత్తభావాలతో. ఇబ్బందిలేదు . కానీ మూలాన్ని నాశనంచేస్తే ? ఇక కొమ్మలుండవు రెమ్మలుండవు. ఇప్పుడు ఈయుగపురుషుడైన "కలి" చేస్తున్నదిదే . మూలాన్ని నాశనం చెయ్యాలని కొమ్మలనాశ్రయించి ముందుకొస్తున్నాడు.కనుక ధర్మాన్ని కాపాడుకోవాలి.అందుకోసం ధర్మాన్ని ఆశ్రయించాలి.

జైశ్రీరాం

Read more...

వైద్యులు సాధ్యం కాదన్నతరువాతకూడా ,భోళాశంకరుని అనుగ్రహంతో సంతానం పొందిన దంపతులు.

>> Saturday, February 19, 2011

భగవంతుని కృపకు అవధులుండవు .అసాధ్యాలు అని మనమనుకున్నవి ఆయన అనుగ్రహంతో సుసాధ్యాలవుతుంటాయి.అందుకే అంటారు "మూకం కరోతివాచాలం ,ఫంగుంలంఘయితే గిరిం" అని. అంటే మూగవాడు వాచాలునిగా మారగలడు,కుంటివాడు కొండలనెక్కగలడు భగవంతుని కృప ఉంటే అని అర్ధం . ఇప్పుడు నాకు ప్రత్యక్షనిదర్శనం గా కనిపిస్తున్న అమ్మవారి లీలను మీకొకటి మనవిచేస్తాను.

మా మండలంలో నమశ్శివాయ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఒక దినపత్రికలో విలేఖరి . పందొమ్మిదివందల తొంభైఒకటిలో వివాహమైంది . అనుకూల దాంపత్యం . ఉన్నంతలో సంతోషకరమైన జీవితమే . కాని ఒక్కటేబాధ. సంతానం లేదు . ఇక మానవప్రయత్నాలన్నీ చేశాడు. విన్ఉకొండ ,నరసరావుపేట, గుంటూరు విజయవాడ ఇలా ఎక్కడ ఈవిషయమై పేరున్న డాక్టర్లుంటే అక్కడకు తిరిగాడు . అతని భార్యకు గర్భసంచిలో ఉన్న లోపంవలన ఇబ్బంది అన్నారు. అనేక రకాలవైద్యాలనంతరం చివరకు చిన్నపాటి శస్త్రచికిత్సకూడా జరిపారు. ఈఅమ్మాయికి గర్భం ధరించే అవకాశం దాదాపు లేనట్లే నని డాక్టర్లు తేల్చి చెప్పారు . ఇక దంపతులిరువురకు దుఃఖం మిక్కుటమైంది . మోడువారిన చెట్లమాదిరిగా గడపాల్సిందేనా జీవితం అని కుమిలిపోతున్నారు . ఇద్దరు దైవభక్తి కలవారే.
ఇక్కడ మొదలైంది భగవంతుని లీలావినోదం. గత మహాశివరాత్రి రోజున ఎప్పుడూ పీఠానికి రానివారు మరొక పాత్రికేయమితృని కుటుంబం తో కలసి వచ్చారు . ఆ వారితో శివాభిషేకం చేపించాను . వీళ్ల సమస్యను నాకు ఆమితృడు చెప్పాడు. మనుషులము మనమేమి చేయగలము . అనుగ్రహించాలన్నా ఆర్తిని తొలగించాలన్నా ఆయనకే సాధ్యం. అనుకోకుండా వచ్చారు . ఎవరుకూడా అమ్మవారి అనుమతి లేకుండా నేనుపిలచినా పీఠానికి రారు. ఇది ఆతల్లిపిలుపే అయి ఉంటుంది. అదీగాక ఈరోజు మహాశివరాత్రి . మనం మనసుపెట్టిపిలిస్తే పలికే భోళాశంకరుడు స్వామి .అడగండి స్వామిని ,మీకేంకావాలో ! మీ దుఃఖాన్నంతా గంగలామార్చి స్వామిని అభిషేకించండి అనిచెప్పాను. మనస్సునిండా భక్తితో ఆర్తితో చేతులారా శివునిపూజించుకునేలా అవకాశం కల్పించాను . మీరు స్వామిని దేవుడనికాదు ,మీతండ్రి అనేభావనతో ప్రార్ధించండి.ఆయన మీస్వంతమన్న నమ్మకంతో పూజించండి అనిచెప్పాను . తీర్ధప్రసాదాలిస్తూ వచ్చే ఈరోజుకు ముగ్గురైవచ్చి ముక్కంటి పూజచేసుకుంటారు అన్నానట నేను [నాకు గుర్తులేదు .వాల్లే చెబుతున్నారు] [స్వామి అలాపలికించాడేమో గాని నాకు గమనిక లేదు]వాల్ల భక్తికి పొంగిపోయాడు కాబోలు ఆ భక్తజనవశంకరుడు , మరలా ఆ అమ్మాయికి నెలసరి రాలేదు . వాల్ల ఆనందానికి అవధులులేవు . చెప్పినవిధంగా స్వామిని స్తుతిస్తూ మరచిపోకుండా ఉన్నారు . నవమసాల అనంతరం శుక్రవారం రోజు వాల్ల ఇంట్లో వెన్నెలజల్లు కురిసింది . ముందుగా అతను నాకే ఫోన్ చేశాడు.
శుభం . లక్ష్మీదేవి అంశమయ్యా .నీకు ఇక అన్నీ శుభాలే అని చెప్పాను . ఫోన్ లో
. మీ అను... మాస్టారూ....అనబోతే వారించాను. ఇక్కడే మనం పొరబడేది . మనిషిద్వారా ఏమీజరుగదు. నీభక్తి స్వామి అనుగ్రహం .అది మరుచి వ్యక్తులనుకారకులుగా భావించకూడదు నీకు ఆయన చూపిన ప్రత్యక్షలీలతో మరింతశ్రధ్ధాశక్తులతో ఆయనను ఆశ్రయించి ఉండాలి అని వివరించాను. పాపకు లక్ష్మీ అనిపేరుపెట్టమన్నాను .

మొన్న జరిగిన కళ్యాణానికి పాపను తీసుకుని వచ్చాడు . ఎంతచక్కగా ఉన్నదో .నవ్వుతూ. ! అమ్మవారిముందు పాపను ఉంచి అమ్మా !ఇది నీప్రసాదం అని దంపతులిద్దరు కళ్లవెంట ఆనందభాష్పాలు పొంగుతుంటే తమఆనందాన్ని తెలియజేసుకున్నారు .
.

ఇది దైవలీల . అసాధ్యాలు సుసాధ్యాలవుతాయి నమ్మకముంటే . ఆర్తి కలగాలి . ఆశ్రయించాలి
ఎలా గంటే చిన్ననాడు మనం తల్లిని హఠం చేసి మనకుకావలసిన మిఠాయిలను సాధించుకున్నామే !ఆ హఠం .కావాలి.అమ్మఊరెలతానంటే కిందపడి పొర్లి ఏడ్చి, ఏడ్చి అమ్మకాళ్లకుమనచేతులు పెనవేసివదలను అని మొండికేశామే ! అటువంటి ఆర్తి,తపన కావాలి . మన "మాయ" ఏడ్పులు ,మొక్కులు ఆ మహామాయ దగ్గర పనిచేయవు . నిజమైన ప్రేమ ,నమ్మకం కావాలి .అవి ఉంటే జీవితమంతా ప్రత్యక్షలీలలే .

Read more...

పూజతో పాటు ధ్యానం చేయాలా?


రోజూ పూజ చేస్తున్నాం గదా! ధ్యానం కూడా చేయ్యాలా?
- కె. శివరామగురులింగాచారి, మార్కాపురం

ఇది మంచి ప్రశ్న. ధ్యానాన్ని అర్చనలో అంతర్భాగంగా చేసుకోగలిగితే, అప్పుడు ధ్యానానికి ప్రత్యేక సమయాన్ని పెట్టుకోవలసిన పనిలేదు. కాని ఇప్పుడు ధ్యానం (మెడిటేషన్) ఒక ప్రశాంతతనిచ్చే ప్రక్రియగా, ఒక ఆధునిక వ్యాయామంగా ఒక ఆరోగ్యప్రక్రియగా, ఖ్యాతి, లాభ పూజలనిచ్చే ఒక చిట్కాగా అత్యంత ఆధునిక జీవనంలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఎలా చెలామణి అయినా మొత్తానికి ధ్యానం ఒక 'వాణిజ్య వస్తువు' అయింది. పరమార్థకృషిలో అంతర్యామి ఉపాసనం చేసే సాధకుడికి ధ్యానయోగం ఒక అభ్యాసంగా విధించబడింది.

ఈ ధ్యాన యోగాన్ని భ్రమర కీట న్యాయంతో పోలుస్తారు. ఒక వస్తువును గూర్చి తదేక నిష్ఠతో ధ్యానించేటప్పుడు ధ్యాత(ధ్యానించే వాని)చిత్తం ధ్యేయ(ధ్యానించే వస్తువు) ఆకారంగా పరిణమిస్తుంది. ఇది ప్రకృతి నియమం. కీటకం(పురుగు) ఒక తుమ్మెదను నిరంతరం చింతన చేయడం వల్ల అది భ్రమరాకారంలోకి మారిపోతుందని లోక ప్రతీతి. దీన్నే 'భ్రమర కీటన్యాయం' అంటారు. చిత్తం ఒక అద్దం వంటిది. అద్దం తన ముందున్న దాన్ని తనలో ప్రతిబింబింపచేసుకొని, ఆ రూపాన్ని పొందుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు, పరమాత్మనే ధ్యానిస్తూ మనస్సును దానిలోనే ప్రతిష్ఠింప చేయాలని భగవానుడు గీతలో అన్నాడు.

'ఆత్మ సంస్థం మనః కృత్వానకించిదపి చింతయేత్' మనస్సును బాహ్యం నుంచి మరల్చి అంతర్ముఖం చేసి, ఆత్మలో నిలిపి ఇతర విషయాల్ని చింతింపరాదు అని ఆదేశించాడు. ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం రెండూ సిద్ధించాలంటే నిత్య ఆరాధనలోనే ధ్యానం అంతర్లీనంగా ఉంటే మంచిది. ధ్యానం ఒక పనిగా కాక మనం చేసే ప్రతి పనీ ధ్యానంగా చేయగలగడమే మన జీవితానికి సార్థకత.
- ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ


[ఆంధ్రజ్యోతి దినపత్రిక నుండి]

Read more...

ధర్మమార్గంలోకి అడుగిడిన విదేశీయ భక్తుడు

>> Friday, February 18, 2011





సగం మతిచెడ్ద మనపిల్లలు కొందరు మొన్న పదునాల్గునాడు విదేశీసంస్కృతిని అవలబించుకోవటం ఫాషన్గా భావించి పబ్బులమ్మటి ఊరేగితే
ఈ ధర్మంలో ఉన్న విశిష్టతను తెలుసుకుని సంపూర్ణమానవునిగా మారటం ఈధర్మమార్గంలోనే ఉన్నదని నమ్మి తాను హిందువుగా మారి"అసతోమా సద్గమయ,తమసోమా జ్యోతిర్గమయ,మృత్యోర్మా అమృతంగమయ" అంటూఈధర్మం లోకి అడుగిడిన న వైనం సన్నివేశం చూడండి .

అగ్నిసంస్కారం జరిపి ఆయనను సనాతనధర్మం లోకి ఆహ్వానించారు.

Read more...

అంజనేయ విగ్రహనికి పాము రక్షణ

ఆగిరిపల్లి, ఫిబ్రవరి 17 : అందరికీ రక్షణ కల్పించే ఆంజనేయ స్వామికే రక్షణగా నిలిచి ఓ పాము అందరిని విస్తుపోయేలా చేసింది. కృ ష్ణాజిల్లా ఆగిరిపల్లి శోభనగిరి కొండ పైకి వెళ్ళే మెట్ల మార్గంలోని ఆంజనే య స్వామి గుడిలో జరిగిన ఈ విం త సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. మెట్ల మార్గంలో ఉన్న ఆంజనే య స్వామి గుడిలో విగ్రహాన్ని తొలగించి, సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆగిరిపల్లికి చెందిన వ్యాపారి మడుపల్లి నారాయణరావు సంకల్పించారు. గురువారం ఉదయం ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించేందుకు ఆరుగురు కూలీలను పురమాయించారు.

వారు గుడిలోకి అడుగు పెట్టడంతోనే నాగుపాము పడగ విప్పి ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ తిరుగుతూ బుసలు కొడుతూ కూలీలను లోనికి రానివ్వకుండా అడ్డుపడింది. రెండు గంటల పాటు ప్రయత్నించినా పాము అలాగే బుసలు కొడుతుండడంతో కూలీలు వెళ్ళి పోయారు. తర్వాత పాము గుడిలోనే ఓ మూలన పడుకుంది. ఈ సంఘటనను తిలకించేందుకు జనం బారులు తీరారు. ఇది దైవ సంకల్పం అని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. భక్తులు గుడిలో పడుకున్న పాము దగ్గరకు వెళ్ళినా ఏమి చేయక పోవటాన్ని విశేషంగా చెపుతున్నారు. కొం దరు భక్తులు ఏకంగా పాముకు పాలు, ప్రసాదాలు అందిస్తున్నారు.


[ ఈ రోజు ఆంధ్రజ్యోతి లో ని వార్త]

మూగజీవులకున్న నిబద్దత మనకులేదు .

Read more...

నక్క రామేశ్వరం అనే ఈ బెస్తపల్లెను చూసి నేర్చుకోవాలి మనం ధర్మనిష్ఠ అంటే ఏమిటో !

>> Thursday, February 17, 2011

బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం|

జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం||

తూర్పుగోదావరిజిల్లా అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామశివారైన పల్లెపాలెం పంచాయితీకి చెందిన నక్కారామేశ్వరం ఒక చిన్నమారుమూలగ్రామం. కోనసీమలో ఈగ్రామానికి గొప్పశివక్షేత్రంగా మంచిప్రసిద్ధి ఉంది. వశిష్ఠగోదావరి పాయలుగా చీలి, సముద్రంలో కలిసేటప్పుడు ఏర్పడిన చిన్నద్వీపం ఈగ్రామం. గ్రామంలో స్త్రీలు, పురుషులు కలిసిన మొత్తం జనాభా 4,500మంది. వీరందరూ అగ్నికులక్షత్రియులు. సముద్రంమీద వేటకు పోయి, చేపలు పట్టుకుని జీవించటమే వీరి ప్రధానవృత్తి. అయితే ఈగ్రామస్తులందరూ వందలఏళ్ళుగా గొప్పశివభక్తులు. ఇందుకు కారణం ఆగ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతీసమేత రామేశ్వరస్వామివారు. ఈస్వామి మహిమల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఈగ్రామంలోకి పాదం మోపి ప్రచారం చేసుకోవడానికి అన్యమతాలవారు వందలఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మహమ్మదీయుల ప్రాబల్యం దేశమంతటా ఉన్నప్పుడు ఇక్కడికి ఒకానొక ఫకీరు వచ్చి, ఇక్కడ ఉండే స్వామివారి మహిమకు ఆకర్షింపబడి, తానే శివభక్తుడుగా మారాడనీ చెబుతారు. ఆయన పేరు నాగూరు మీరాసాహెబ్‌. ప్రజలు ఆయన భక్తికి, ఆయన ద్వారా ప్రదర్శింపబడిన మహిమలకు ఆకర్షింపబడి, ఆయనను సేవించేవారని తెలుస్తోంది. ఆయన దేహం చాలించిన తరువాత ఆయన సమాధిపై నిర్మించిన దర్గా ఒకటి ఇప్పటికీ అక్కడి ప్రజలచే గౌరవింపబడుతోంది. ఇంతటి మహిమాన్వితమైన శైవక్షేత్రంలో పాదంమోపి, ఎలాగైనాసరే తమమతాన్ని ప్రజలలో వ్యాపింపజేసుకుందామని కొన్ని మిషనరీలవాళ్ళు ఎంతోకాలంగా ప్రయత్నిస్తూవచ్చారు. అలాంటి ప్రయత్నాలలో ఒకటి ఈమధ్యనే విఫలమైన వైనం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఒక మిషనరీకి చెందిన మతప్రచారకుడు ఒకాయన ఈగ్రామంపై కన్నువేసి, కొంతమంది యువకులను చేరదీశాడు. గ్రామంలో ఒక ఆస్పత్రి, పాఠశాల, వసతిగృహం, కమ్యూనిటీహాలు నిర్మిస్తామని, అవి స్థానికులకు ఎంతో ఉపయోగపడతాయనీ మాయమాటలు చెప్పాడు. పంచాయితీవారినుండి ఆరుసెంట్లస్థలం సంపాదించాడు. అక్కడొక కమ్యూనిటీహాలు కడుతున్నాం అని చెప్పి, ఒకభవనాన్ని నిర్మింపజేశాడు. 2002వ సంవత్సరం అక్టోబర్‌ 29వ తేదీన ఉదయం 7గంటలకు ప్రభువుతోపాటు అందులో ప్రవేశించుదాం అని చెప్పి, ముహూర్తం కూడా నిర్ణయించాడు. గ్రామంలోని పెద్దలకు అక్కడ సిద్ధమైనది కమ్యూనిటీహలు కాదనీ, చర్చిభవనమనీ తెలిసిపోయింది. ఎలాగైనా సరే అక్కడ బలవంతపు మతాంతరీకరణలు జరగకుండా ఆపాలని వారు నిర్ణయించుకున్నారు. అమలాపురంలో ఉండే విశ్వహిందూపరిషత్‌, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ వంటి సంస్థల కార్యకర్తలను సంప్రదించారు. వారంతా కలిసి ఆయ్రత్నాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్‌ 28వ తేదీ రాత్రికే గ్రామస్థులంతా సమావేశమై, అన్యమతప్రవేశాన్ని అడ్డుకోవాలని ముక్తకంఠంతో తీర్మానించారు. 29వ తేదీ బ్రాహ్మీముహూర్తంలో గ్రామస్థులందరూ సీతారామలక్ష్మణహనుమల విగ్రహాలతో సిద్ధమైపోయారు. అమలాపురం నుండి కార్యకర్తలందరూ ఉదయం 5గంటలకల్లా అక్కడికి చేరుకున్నారు. మేళతాళాలతో దేవతావిగ్రహాలను ఊరేగించి, హరేరామహరేకృష్ణ, జైజైరామ జానకిరామ, జైశ్రీరాం అంటూ సరిగ్గా ఉదయం 6గంటలకు నూతనంగా నిర్మించిన భవనంలో ప్రవేశించి, దేవతావిగ్రహాలను ప్రతిష్ఠించి, భజనను కొనసాగించారు. మరో అరగంటలో 7గంటల ముహూర్తానికని శిలువతో అక్కడికి చేరుకున్న మతప్రచారకునికి మతిపోయినట్లయింది. కాసేపు అటూఇటూ తచ్చాడాడు. అందరూ ఆయనకేసి చూశారు గానీ, ఒక్కరూ పలుకరించలేదు. జైజైరామ జానకిరామ అంటూ మరింత గట్టిగా గ్రామస్థులు భజన చేస్తుంటే, పరిస్థితిని అర్థంచేసుకున్న ఆపెద్దమనిషి కిమ్మనకుండా కారువెనక్కి త్రిప్పుకుని పలాయనం చిత్తగించాడు.

ఈగ్రామం కథాకమామీషు

ఈవిధంగా మతాంతరీకరణను త్రిప్పికొట్టిన ఈపల్లెకు పెద్దచరిత్రే ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని అపహరించిన రావణాసురుని సంహరించి, అయోధ్యకు తిరిగివెడుతూ, సముద్రతీరానగల ఈప్రాంతంలో కొంతసేపు విశ్రమించాడట. బ్రాహ్మణుడైన రావణుని సంహరించడంవల్ల తనకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందని బాధపడ్డాడట. పాపపరిహారార్థం శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని సంకల్పించాడట. అందుకు తగిన ముహూర్తాన్ని నిర్ణయించుకుని, ఆసమయానికి తిరిగివచ్చేలా కాశీనుండి శ్రేష్ఠమైన శివలింగాన్ని తీసుకురమ్మని ఆంజనేయస్వామిని ఆదేశించాడట. హనుమ శివలింగంతో తిరిగిరావటం ఆలస్యమైందట. ముహూర్తం మించిపోకూడదని రాములవారు ఆసముద్రతీరాన ఇసుకతోనే ఒక శివలింగాన్ని చేసి, దానికి ప్రాణప్రతిష్ఠ చేసి, తన సంకల్పం నెరవేర్చుకున్నాడట. ఇక్కడ ఈప్రతిష్ఠ జరుగుతుండగా ఆంజనేయస్వామి కాశీనుండి శివలిగాన్ని తీసుకువచ్చాడు. దానిని ఏమి చెయ్యాలి అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితో ''ఈలింగాన్ని నీవు ఈగోదావరిపాయకు ఆవలివైపున ప్రతిష్ఠ చెయ్యి. ఈరెండు శివలింగాలలో ఒకటి నాపేరుతో శ్రీరామలింగేశ్వరస్వామిగాను, మరియొకటి నీపేరుతో లక్ష్మణేశ్వరస్వామిగాను ప్రసిద్ధికెక్కి, ప్రజలచే పూజింపబడతాయి. వారిపాలిట ఈరెండుక్షేత్రాలూ కల్పవృక్షాలవలె కోరికలు తీరుస్తూ, వారిని తరింపజేస్తాయి'' అని చెప్పాడట. ఆవిధంగా రాములవారిచే ప్రతిష్ఠింపబడిన శ్రీరామలింగేశ్వరస్వామివారు పార్వతీసమేతంగా ఇప్పటికీ ఈప్రాంతప్రజలచే ఆరాధింపబడుతున్నారు. ఈఆలయం పశ్చిమముఖంగాను, లక్ష్మణేశ్వరస్వామి ఆలయం తూర్పుముఖంగాను ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉండటం విశేషం. రాములవారు ఇక్కడ ఈప్రతిష్ఠ చేసిన సమయంలో నక్కలు కూశాయనీ, అందువల్ల ఈప్రాంతానికి నక్కారామేశ్వరం అనేఖ్యాతి వచ్చిందనీ ఇక్కడి పెద్దలు చెబుతారు. చాలాకాలం క్రితం ఇక్కడ కంచుతో నిర్మించిన ఆలయం ఉండేదనీ, అది సముద్రం పొంగిరావటంవల్ల కొట్టుకుపోయిందనీ, తరువాతికాలంలో ఇక్కడి ప్రజలు లింగప్రతిష్ఠ చేసి గుడి కట్టించుకున్నారనీ స్థానికులు చెబుతారు. పెద్దాపురం మహారాజులు ఈక్షేత్రమహిమను గురించి తెలుసుకుని ఈదేవుడికి మడిమాన్యాలు సమర్పించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పోయిన ఆస్తి పోగా, ఇప్పుడు స్వామివారిపేరున నలభయ్యెకరాల భూమి మిగిలింది. యాభైసంవత్సరాల క్రితంవరకు ఈఆలయంలో బంగారపు అమ్మవారి విగ్రహం, దేవుని ఊరేగింపుకు వాహనాలు ఉండేవిట. అయితే ఆలయానికి సరయిన రక్షణ లేకపోవటంవల్ల సమీపగ్రామమైన సామంతకుర్రు గ్రామస్తులు ఆవిగ్రహాన్నీ, వాహనాలనూ తమ ఊరి దేవాలయంలో భద్రపరుస్తామని చెప్పి తీసుకువెళ్ళారట. ఆనాటినుండి ఈనాటివరకూ అవి అక్కడే ఉన్నాయని ఈగ్రామప్రజలు చెబుతున్నారు.

శ్రీరామలింగేశ్వరస్వామి మహిమలు

గోదావరీ సంగమస్థానంలో నెలకొని ఉన్న ఈపార్వతీసమేత రామలింగేశ్వరస్వామివారి గురించి, వారి మహిమల గురించి ఎన్నెన్నో కథలూ, గాథలూ ప్రచారంలో ఉన్నాయి. చొల్లంగి అమావాస్యనాడు ఇక్కడ పెద్దతీర్థం జరుగుతుంది. పరిసరప్రాంతాలనుంచే గాక, సుదూరప్రాంతాలనుంచి కూడా ప్రజలు ఇక్కడికి తరలివస్తారు. సముద్రస్నానం చేసి, శ్రీరామలింగేశ్వరస్వామిని సందర్శించి, ఫలపుష్పాలు సమర్పిస్తారు. సంతతిలేని దంపతులు ఇక్కడ సముద్రస్నానం చేసి, ఒకరాత్రి స్వామి సమక్షంలో నిద్రించి, గుడిచుట్టూ ప్రదక్షిణ చేస్తూ, స్వామిని సేవించుకుంటే తప్పకుండా వారికి పిల్లలు పుడతారట. అనారోగ్యంతో బాధపడేవారు తమకు స్వస్థత కలగాలని స్వామివారికి మ్రొక్కుకుంటే ఎలాంటివ్యాధులైనా తగ్గిపోతాయని, ఆతరువాత వారు వచ్చి, ఇక్కడ మ్రొక్కులు చెల్లించుకుంటారనీ తెలుస్తోంది. స్వామికి అర్చన చేసిన తీర్థజలాలు ఎంతోమహిమ గలవని, సర్వవ్యాధినివారకములని కూడా ప్రజల విశ్వాసం. శివరాత్రి పర్వదినమున, రధసప్తమినాడు ఇక్కడ విశేషపూజలు జరుగుతాయి. కార్తీకమాసంలో స్వామిని దర్శించి, అభిషేకాలు చేయించుకునేందుకు అధికసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

ఆలయపునరుద్ధరణ

అతిప్రాచీనమైన ఈశివాలయం శిధిలావస్థకు చేరుకోగా గ్రామపెద్దలు పూనుకుని 1982వ సంవత్సరంలో ఈఆలయానికి ప్రాకారం నిర్మింపజేశారు. వాస్తుశాస్త్రప్రకారం జరిగిన ఈప్రాకార నిర్మాణంవల్ల ఈఆలయానికి మంచిరోజులు వచ్చాయనే చెప్పాలి. 2004వ సంవత్సరంలో ఆలయపునఃప్రతిష్ఠ మహావైభవంగా జరిగింది. శిధిలమైన పానవట్టాన్ని, అమ్మవారి విగ్రహాన్ని మార్చి, క్రొత్తవాటిని ప్రతిష్ఠించి, పూజలు జరిపించారు. శ్రీపుల్లేటికుర్తి పురుషోత్తమశర్మగారు ఈఆలయ ప్రధానార్చకులు. స్వామివారికి నిత్యపూజలు, మహానైవేద్యములు భక్తితో సమర్పిస్తూ, భక్తులకు పూజాదికములను జరిపిస్తున్నారు.

ప్రజల సహకారం

రెండుమూడు కుటుంబాలవారు తప్ప ఈగ్రామంలోని ప్రజలందరూ అగ్నికులక్షత్రియులే. ఈఆలయమన్నా, శ్రీరామలింగేశ్వరస్వామివారన్నా వీరికి ఎంతో భక్తివిశ్వాసాలు ఉన్నాయి. తమకు ఏకష్టం వచ్చినా స్వామికి నివేదిస్తే గట్టెక్కుతామని వారందరూ నమ్ముతారు. సునామీలవంటి ప్రకృతిభీభత్సాలను కూడా తట్టుకుని నిలబడగలిగామంటే అంతా ఆస్వామిదయే అంటారు ఇక్కడి ప్రజలు. ఈమత్స్యకారులకు ఒక సహకారసంఘం ఉంది. అసంఘానికి అధ్యక్షులైన శ్రీఅంగాడి కాళీస్వామిగారు ఈఆలయవిశేషాలను సహృదయంతో తెలియజేశారు. గ్రామస్తులంతా కలసి ఈఆలయ అభివృద్ధికి ఒకలక్షా ఎనభైవేల రూపాయిలు విరాళాలుగా సేకరించామని, ప్రభుత్వంవారు తమవంతుగా మరొక నలభైవేలరూపాయిలు ఇచ్చారనీ, ఈమొత్తమంతా స్వామిపేరున బ్యాంకులో ఉన్నదని చెప్పారు. దీనిపై వచ్చే వడ్డీతో ఇక్కడి కార్యక్రమాలు నడుస్తున్నాయని, అంతకు మించిన అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు దేవాదాయశాఖవారి సహకారం లేకపోవటమే కారణమని కూడా ఆయన చెప్పారు.

చేయవలసిన సదుపాయాలు

ప్రసిద్ధమైన ఈశైవక్షేత్రానికి సరయిన ప్రయాణసదుపాయం లేకపోవటం పెద్ద లోపంగా ఉంది. అమలాపురం నుండి చల్లపల్లిమీదుగా సామంతకుర్రు వెళ్ళేందుకు ఒకటిరెండు ఆర్‌టిసి బస్సులు తిరుగుతున్నాయి గానీ, రోడ్డు పెద్దపెద్ద గోతులతో ప్రమాదభరితంగా ఉండటంవల్ల ప్రయాణీకులు అసౌకర్యానికి లోనవుతున్నారు. పాడయిన ఈమార్గాన్ని తక్షణమే బాగుచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

భక్తులు మ్రొక్కులు చెల్లించుకోవటానికి వచ్చినప్పుడు విడిదిచేసేందుకు వసతిగృహాలు లేక చాలా ఇబ్బందిపడుతున్నారు. కాబట్టి ఇక్కడ దూరప్రాంతాలనుండి వచ్చే భక్తులకోసం వసతిగృహాలు నిర్మించవలసి ఉంది. దేవుడి భూములను కొంతమంది స్వార్థపరులు అక్రమంగా ఆక్రమించుకుని పక్కాభవనాలు నిర్మించుకున్నారు. ఆభవనాలను స్వామివారి ఆస్తిగా ప్రకటించి, స్వామివారికి దక్కేలా చెయ్యవలసి ఉంది.

కొమరగిరిపట్నంనుంచి గోదావరిపాయల మీదుగా ఈగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. గోదావరిపాయలపై వంతెనల నిర్మాణానికి జరిగిన ప్రయత్నం శంకుస్థాపన ఫలకాల వరకు వచ్చి ఆగిపోయింది. రాజకీయాలకు అతీతంగా ఈప్రయత్నాన్ని కొనసాగించి వంతెనలను నిర్మిస్తే, ఈగ్రామం మరింత అభివృద్ధికి నోచుకుంటుంది. అంతేకాక, దేవాలయాన్ని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఈమార్గం ఎంతో సౌకర్యంగా కూడా ఉంటుంది. ఈఆలయానికి ఎదురుగా తూర్పుముఖంగా ఉండే శ్రీలక్ష్మణేశ్వరస్వామిని లక్ష్మణేశ్వరం వెళ్ళి సేవించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.

క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామికి సరయిన ఆవాసం కల్పించవలసి ఉంది. ఆస్తీ, ఆదాయమూ కూడా ఉన్న ఈపురాతన శైవక్షేత్రన్ని భక్తులందరికీ దర్శనీయమైన క్షేత్రంగా చేయటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోనసీమప్రజలందరూ కోరుకుంటున్నారు.

శ్రీరాములవారిచే ప్రతిష్ఠింపబడినట్లుగా చెప్పబడుతున్న ఈరామేశ్వరస్వామివారు తనప్రతిష్ఠకు కారకుడైన శ్రీరాములవారిని కూడా ఇక్కడ స్థాపించుకుని పూజింపవలసి ఉన్నది అనే సంకల్పాన్ని ఇక్కడి ప్రజల హృదయాలలో కలిగించి, శ్రీరామప్రతిష్ఠ తన భక్తులచే జరిపించటం విశేషం. ''శివస్యహృదయం విష్ణోః'' అని కదా అంటారు. వాస్తవానికి దైవం విషయంలో నామభేదమే తప్ప వస్తుభేదం ఉండదు.

మహేశ్వరే వా జగతామధీశ్వరే

జనార్దనే వా జగదన్తరాత్మని|

నవస్తుభేద ప్రతిపత్తిరస్తిమే

తథా-పి భక్తిస్తరుణేన్దుశేఖరే||

అని కదా ఆర్యోక్తి.



క్రొత్తగా నిర్మించుకున్న శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో భక్తులు నిత్యపూజలు జరిపించడంతోపాటుగా, కార్తీకమాసం సందర్భంగా శ్రీస్వామి అయ్యప్పదీక్షలను చేపట్టి, పూజలు నిర్వహించడం విశేషం.




నక్కరామేశ్వరంఆలయ ముఖ మండపం

నక్కరామేశ్వరుడు




రామాలయం లోపల
ఇది రామాలయం



[ ఇంతవిలువైన సమాచారం ఇచ్చిన మితృనునుండి వచ్చిన మెయిల్]





దుర్గేశ్వర గారు
నమస్కారములు.

నాపేరు .........కృష్ణ. నేను వెబ్ డిజైనింగ్ మరియు డి.టి.పి చేస్తూ ఉంటాను. నాకు సనాతనధర్మము అన్నా, సాంప్రదాయాలు అన్నా నాకు చాలా గౌరవం ఉంది. వాటిగురించి తెలుసుకోవడం మరియు వాటిని ప్రోత్సహించడం నాకు చాలా ఇష్టం నేను ప్రస్తుతం

ముంబాయి నగరంలో ఉంటున్నాను. మాది అసలు కోనసీమలోని అమలాపురం పట్టణము. మా తండ్రిగారు ........... కళాశాలలో తెలుగు విభాగాధిపతిగా పనిచేసి మూడు సంవత్సరములక్రిందట కాలం చేసినారు. ఆయన అధ్యాపకవృత్తితో పాటు, మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యగారి మార్గదర్శకత్వంలో ఉచిత హోమియో వైద్యసేవ, ఆధ్యాత్మిక ప్రవచనాలు, మరియు రచనావ్యాసంగము చేసేవారు. ఆయన మహాభారంలో ద్రౌపది పాత్ర మీద పరిశోధన చేసి యాజ్ఞసేని అనే పుస్తకముగా వెలువరించారు.

ఆయన అడుగుజాడలలోనే మాకుటుంబసభ్యులమంతా మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యగారా మార్గదర్శకత్వంలో నడుస్తున్నాము. నేను శారీరకవైకల్యం కలవాడిని అయినప్పటికీ ఢి.టి.పి, మరియు వెబ్ డిజైనింగ్ నేర్చుకుని పనిచేసుకుంటున్నాను. మా తండ్రిగారి ఆశీస్సులవల్ల నాకు ఆధ్యాత్మిక చింతన, పూజలు పునస్కారాల పట్ల నమ్మకం, క్రమశిక్షణ అలవడ్డాయి.

మీబ్లాగు తరచుగా చూడటమే గాని ఇంతవరకు కామెంట్ ఇవ్వలేదు. మొదటిసారిగా మీరు రాసిన ధర్మం పైన అభిమానమే కాదు ధర్మనిష్ఠ ఉన్నదా మనకు? అనే వ్యాసం చూసి కామెంట్ రాస్తున్నాను. మీరు మనకు మనధర్మం పట్ల అభిమానం మాత్రమే ఉంటోంది కానీ ఆధర్మం పట్ల నిష్ఠ ఉండటం లేదని, మనధర్మాన్ని విమర్శిస్తే మనం మౌనంగా ఉండిపోతున్నామని, వేరే ధర్మాలను మనం విమర్శిస్తే తీవ్రపరిణామాలను ఎదుర్కొనవలసివస్తుందని ఆవేదనను ఈవ్యాసంలో వెలిబుచ్చారు. నిజమే నీతల్లినో, నీబిడ్డనో పదిమందిలో నీవే చులకనచేస్తూ మాట్లాడితే ఆపదిమంది కూడా లోకువ చేస్తారు కదా. ఎవడైనా మనవాళ్ళను మనధర్మం నుంచివేరుచేయటానికి చేసే కార్యక్రమంలో భాగంగా కానుకలు, ధనం ఆశ చూపటంవంటివి నాకు కొన్ని తెలుసు. మా ఊళ్ళో మాతండ్రిగారి దగ్గరకు వైద్యానికి వచ్చే పనిపాటలు చేసుకునేవారు ఎక్కువగా క్రిస్టియానిటీకి ఆకర్షితులయ్యేవారు. వారు నియమానుసారం దేవాలయాలకు వెళ్ళకపోయినా చర్చికి మాత్రం వెళ్ళేవారు. ఆవిషయం గురించి వాళ్ళను నియమానుసారం దేవాలయానికి వెళ్ళకుండా చర్చికే ఎందుకు వెడతారు అని అడిగితే మాకు వాళ్ళు మాఅవసరాలకు పండుగలుపబ్బాల పేరుతో కానుకలు, డబ్బు ఇస్తున్నారు. మరి దేవాలయానికి వెడితే ఇస్తారా అని అడిగారు. దాంతో మాకు ఏమి చెప్పాలో తెలియక ఊరుకున్నాము. అలాగే మాఊరిలోని రామకృష్ష సమితివారు కార్యక్రమం పెట్టాము రండి అని పిలిస్తే ఒక్కరూ రారు నిర్వహించేవారు తప్ప. చర్చివారు ఏదైనా కార్యక్రమం చేస్తే పిలవకపోయినా వెడతారు కానుకలు, డబ్బు వస్తాయని. వెళ్ళకపోతే రావుగా మరి. అంతేకాకుండా రోగాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని నాలుగు ఆదివారాలు రండి ప్రార్థనలు చేసి కొబ్బరినూనె ఇస్తాం, దాంతో మీసమస్యలు పరిష్కారమైపోతాయ్ లాంటి ప్రచారాలు కూడా. ఇలాంటి విషయాలవల్ల మనధర్మం ఎంత పలచనైపోతోందో కదా. మీలాంటివారే ఈవిషయంలో ఏదైనా పరిష్కారం ఆలోచించాలి.

కానీ ఇలాంటి ధర్మవ్యతిరేకమైన విషయాలను పట్లించుకోకుండా ధర్మంపట్ల నిష్ఠ, నిబద్ధత చూపి ఒక గ్రామం గురించి మాకు తెలుసు. ఆగ్రామం గురించి హరేఈశ! హరేరామ! హరేక్రీస్తు! హరే హరే!! అనే పేరుతో భక్తిప్రపంచం మాసపత్రిక జూన్ 2007 సంచికలో ఒక వ్యాసం కూడా రాసారు. ఆవ్యాసాన్ని, ఆయన ఆగ్రామాన్న సందర్శించినప్పుడు తీసిన ఫొటోలను పంపుతున్నాను. మాకు ఆగ్రామాన్ని చూసాక మనధర్మం ఎన్ని వ్యతిరేతలు వచ్చినా ఇలాంటి సంఘటనలవల్ల ఇంకా సురక్షితంగా ఇంది అనిపించింది. భగవద్గీతలో కృష్ణపరమాత్మ చెప్పిన యథాయథాహి ధర్మస్య_____ అనేది అక్షరసత్యం. దానికి ఉదాహరణలే భగవాన్ శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, వివేకానందులు, రమణమహర్షి, కంచిపరమాచార్చ చంద్రశేఖరేంద్ర సరస్వతి, మాస్టర్ ఇకె లాంటి వారే కదా!

నమస్కారాలతో

(నోట్: నాయొక్క ఈ కామెంటును నలుగురికి తెలియజేయదలచిన యెడల నాపేరు మరియు మాతండ్రిగారి వివరాలు వాడవద్దని మనవి)

Mandapam-Nakka-Rameswaram.jpgMandapam-Nakka-Rameswaram.jpg
1481K View Download
Ramalayam-inside1-Nakka-Ram.jpgRamalayam-inside1-Nakka-Ram.jpg
1181K View Download
Ramalayam-inside2-Nakka-Ram.jpgRamalayam-inside2-Nakka-Ram.jpg
1140K View Download
Ramalayam-inside-Nakka-Rame.jpgRamalayam-inside-Nakka-Rame.jpg
1255K View Download
Ramalayam-Nakka-Rameswaram.jpgRamalayam-Nakka-Rameswaram.jpg
1534K View Download
Rameswarudu1-Nakka-Rameswar.jpgRameswarudu1-Nakka-Rameswar.jpg
1196K View Download
Rameswarudu--&-Parvati1-Nak.jpgRameswarudu--&-Parvati1-Nak.jpg
1433K View Download
Rameswarudu--&-Parvati-Nakk.jpgRameswarudu--&-Parvati-Nakk.jpg
215K View Download
Rameswarudu-Nakka-Rameswara.jpgRameswarudu-Nakka-Rameswara.jpg
806K View Download


Reply

Forward

Ramakrishna is not available to chat


Read more...

ధర్మం పైన అభిమానమే కాదు ధర్మనిష్ఠ ఉన్నదా మనకు?

>> Tuesday, February 15, 2011

ప్రతివ్యక్తికీ తమధర్మం పైనఎంతో కొంత అభిమానం ఉంటుంది . ఐతే అది ధర్మనిష్ఠ కాదు. ధర్మనిష్ఠ అంటే మనధర్మం మననుండివేరుగా చూదబడకూడదు. మనభావంధర్మంతో మమేకమై ఉండాలి. నీధర్మాన్ని విమర్శించినప్పుడు నీకు వేదన కలగాలి . నీధర్మాన్ని రక్షించుకోవటానికి నీవ్యక్తిత్వాన్ని రక్షించుకోవటంతో సమానంగా భావించాలి. ఉదాహరణకు మనం రోజూ వెళ్ళి పూజించేలేక నమస్కరించే దేవీదేవతలు మననుండి పరాయివారుకారు కనుక మనం మనకుటుంబసభ్యులపట్లచూపే ప్రేమాభిమానాలు ,గౌరవమర్యాదలు వారిపట్ల చూపాలి ,అదే నీధర్మం పట్లచూపాలి.అది ధర్మనిష్ట అంటే . అలాకాకుంటే అవసరార్ధ భక్తి ఆభగవంతునికి ఆమోదమవుతుందా ? ధర్మోరక్షతి రక్షితః అని పెద్దలలెందుకు అంతఖచ్చితంగా చెప్పారో మనం ఆలోచించుకోవాలి .

ఈ విషయంలో మన నిబద్దత ఎంత అనిప్రశ్నించుకోవాలి . మన ధర్మంలోని భావాలు ఉన్నతమైనవి .శాంతి ,సహనం,క్షమాగుణం మనకు తల్లిపాలతో వస్తాయి . అయితే ఇవి మనలో అన్ని విషయాలలోనూ ఒకేరకంగా ఉన్నయా ? ఆలోచిద్దాం ఓసారి.
సాధారణంగా మనం ఇతరులభావాలను ,ఇతరులధర్మాలను కించపరచం . మంచి సంస్కారమిది . ఈలక్షణాలను మనకు మన మతగ్రంథాలు ,మనపెద్దలు చిన్నతనం నుంచి నేర్పారు. కానీ మనం ఇంకాకొద్దిగా ఎక్కువనేర్చుకున్నామేమో ఇప్పుడు మనధర్మాన్ని ,మనవిశ్వాసాలను అవమానించినా పట్టించుకోని స్థితికి చేరుతున్నామేమో క్రమేపీ అని అనిపిస్తున్నది నేటి పరిస్థితులు చూస్తుంటే .
ఇది ఆచరణీయమేనా ?

ఏమిటిది ? రెచ్చగొట్టే విధంగా వ్రాస్తున్నాడు అనుకోకండి .నాప్రశ్నను పరిశీలించండి.

నీవు అమ్మా.మాతా అని పిలచిప్రార్ధించే దైవాన్ని గాని నీ కన్నతల్లిని గాని తిడితే శాంత వహిస్తున్నావంటే నీవు లోకమర్యాదలకు అతీతస్థితికిచేరిన సర్వసంగ పరిత్యాగి వయ్యుండాలి. లేదా దైవాన్ని తిట్టినప్పుడు కలగని బాధ నీ కుటుంబసభ్యులను తిట్టినప్పుడుమాత్రం కలుగుతుందంటే మాత్రం ..............ఇది శాంత గుణమేనా ? అనే అనుమానం రావాలి. పరిశీలించుకోవాలి. ధర్మం వేరు మనం వేరుకాదు, ఆధర్మం అండలేకుంటే మన జీవితం ఇంతప్రశాంతంగా సాగేది కాదు . కనుక ధర్మాన్ని రక్షించుకోవలసిన బాధ్యత మనజీవితావసరం కూడా .

సరే ఇక మనం ఈరోజు చూస్తున్న విచారకరమైన స్థితి గూర్చి చూద్దాం . ఎవడైనా మనవాల్లను మనధర్మం నుంచివేరుచేయటానికి చేసేప్రచారంలో వాల్ల విశ్వాసాలగూర్చిచెప్పటం కాక .మనధర్మాన్నిగూర్చి తిట్టడమే ఎక్కువగాఉంటుంది , మైకులుపెట్టి మరీ.
ఏచెప్పులకంపెనీవాడైనా వానిచెప్పులపై మనదేవతలను ముద్రించగలడు.
ఏసినిమావాడైనా మన విశ్వాసాలను మతాచార్యులను,విశ్వసాలను హేళనగాచూపుతూ సినిమాతీయగలడు.
బుర్రలో గుజ్జులేకున్నా ,అసలు మన మతగ్రంథాలమొహం చూడనివాడుకూడా దౌర్భాగ్యకరమైన వ్యాఖ్యానాలుచేస్తూ పుస్తకాలు వ్రాయగలడు.
ఇక మనమొహంముందే మన ఆచారాలను తిట్టగలడు. శుభమా అని మనం పండుగ చేసుకుంటుంటే మనవిశ్వాసాలను దెబ్బతీసేవిధంగా టీవీల్లోచర్చావేదికలు పెట్టగలరు.
ఇదెక్కడిదాకా పోతోందంటే వాళ్లఇంట్లో కూరలో ఉప్పుతగ్గినా మనదేవతలను విమర్శిస్తారు
మాకూరగాయలవాడితో నాకు గొడవైంది కనుక సీతా..గీతా ఏమిగొప్పని బ్లాగులు వ్రాయగలరు. పాలవాడో,పాతసామానువ్యాపారో నన్ను తిట్టాడు, కనుక నేను మీదేవతలను తిడతాను అనే బుద్దిహీనవాదనలను చేయగలరు నిర్భయంగా .

ఎందుకు జరుగుతుందిలా ?

స్వేచ్చలు ,వాక్ స్వాతంత్ర్యాలు,ప్రజాస్వామ్యాలు,పైత్యానందాలు ఇతర మతాలు,ధర్మాలపట్ల ఒల్లుదగ్గరపెట్టుకుని ఉంటూ మనధర్మం మీద, మతం మీద మాత్రమే ఇంత అహంకారపూరితంగా ఎలా ప్రవర్తించగలుగుతున్నాయి ?

ఇప్పుడు నేనంటాను మనకుధర్మం పట్ల అభిమానం ఉందికాని ధర్మనిష్ఠ తక్కువ . ఇతరులకు వారి ధర్మంపై ఉన్న స్థాయిలో అభిమానం మనకు లేదు అని.దానివల్లనే మనధర్మానికి మనవిశ్వాసాలకు[అంటే స్వయంగా మనకే]ఇన్నిఅవమానాలు.

కోప్పడకండి..అలోచించి చూడండి .వాస్తవమో కాదో . వాస్తవం మాట్లాడితే మతోన్మాదం అంటారుకూడా [అదికూడా మనలని మాత్రమే అనగలరు.]

నేనొకప్పుడు ఒక పత్రికలో పనిచేసే వాడిని .ఒకరోజు అందులో జయగోపాల్ అనే వ్యాసకర్త ఒకాయన పలానామతం లో స్త్రీలకు స్వేఛ్చ తక్కువ అని వ్రాశాడు . అంతే సాయంత్రానికల్లా గుంటూరు లోను ఇంకా చాలాచోట్ల రాస్తారోకోనిరశన ప్రదర్శనలు, మరుసటిరోజు వస్తున్న ఆ పేపర్ కట్టలు తగలెట్టడం జరిగాయి . వెంటనే చాలాభ్యుదయ భావాలుగల నాటి ఆ పత్రిక సంపాదకుడు యాజమాన్యం ఆ మతానుయూయులకు క్షమాపణ చెప్పటం జరిగింది .

ఇక నేను నూజండ్లలో పనిచేసేప్పుడు ఆవూరిలో సంఘటన . ఆఊరిలో ఆంజనేయస్వామికి చెందిన ఏడెకరాలభూమిని ప్రభుత్వంవారు తీసుకుని మండలకార్యాలయాలు, మనమతంలోని బలహీనవర్గాలకు ఇళ్లకు కేటాయించగా ఇంకా ఆలయం పక్కనే మిగిలిఉన్నస్థలంలో ఒక ప్రార్ధనామందిరాన్ని[పూరిల్లు] కట్టారు. దానిలోనుంచి రోజూ మైకులో రాల్లు రప్పలూ దేవుడా >? ......తుడుచుకునే రాయి దేవుడా ? అని విమర్శిస్తున్నా పదహారు సంవత్సరాలపాటు వింటూ బాధపడురతున్నారేగాని ఎదిరించటానికి ఎవరూ పూనుకోలేదు . ఆ తరువాత నేను అక్కడకెళ్లాక స్వామి అనుగ్రహంతో అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయటం చాలామంది హనుమద్దీక్షలు తీసుకోవటం ఎంతో మందికి జీవితంలో సమస్యలు తొలగి మంచిఫలితాలురావటం .అక్కడనుంచి మైకుల్లో విమర్శలు మాయంకావటం జరిగాయి. ఆతరువాత ఆమతం వాల్లు విదేశంనుంచి వచ్చే నిధులతో అక్కడ పెద్దప్రార్ధనామంధిరాన్ని నిర్మించాలని ప్రయత్నాలు మొదలెట్టగా కుర్రవాల్లు ఎదురుతిరగటం ఒక మత స్థలం ప్రక్కన మరొకదానికి అదీ ఈదేవునికి సంబంధించి స్థలంలో ఇవ్వటం కుదరదని అధికారులచే చెప్పించటం జరిగి తాత్కాలికంగా ఆగిపోయింది.[ఆకారణంగా కక్షపెట్టుకుని ఓరాత్రి పదిమంది మా అశ్రమం మీద దొంగతనానికొచ్చారు కూడా]
ఆ తరువాత వచ్చిన ఎలక్షన్ లో మాఓట్లు కావాలంటే ఆస్థలం మాప్రార్ధనామందిరానికి ఇవ్వాలని వాల్లు పెట్టిన షరత్తుకు ప్రధానపార్టీలకు చెందిన ఇరువర్గాల నాయకులు పరిగెత్తుకెళ్ళి మద్దతిచ్చి దగ్గరుండి సహకరించారు .వీళ్లలో ఓట్లు ఒక్కల్లకు మాత్రమే వేస్తారని తెలిసినాకూడా . స్వామి ద్వారామేలుపొందినవారుసైతం గ్రామరాజకీయాలు మేము ఎదిరించలేము అని మొహంచాటేశారు . కలి మాయ తండ్రీ ,అని కన్నీటితో స్వామికి క్షమాపణ చెప్పుకుని వచ్చేశాను . స్వామినుంచి మేలు పొందటానికి మాత్రమే పనికొచ్చిన భక్తివిశ్వాసాలు మనవాల్లకు స్వామి పట్ల జరుగుతున్న అపచారాన్ని నివారించటానికి కలుగలేదు .
అప్పుడు జరిగిన స్టాఫ్ మీటింగులో ఈవిషయంపైన నేనువ్రాసిన వార్తను మా స్టాఫ్ రిపోర్టర్ ప్రచురించనీయలేదు అని బ్యూరో ఇన్చార్జ్ కు ఫిర్యాదు చేశాను . దానికి మాస్టాఫర్ ఇతను చాలా తీవ్రవాదండి అని ఎగతాళిచేయగా ... బ్యూరో గారైతే మైనార్టీస్ అవర్ చిల్డ్రన్సయ్యా ఎప్పుడు తెలుసుకుంటావు ,అయినా మతాలు రెచ్చగొట్టే విధంగా వార్తలు వ్రాస్తావా అన్నాడు. సరేలెండి నేను రేపు వినుకొండలో ఆమతంవాల్లు వందఎకరాలు ఆక్రమించుకుని కట్టుకున్న పెద్దమందిరం పాఠశాల ప్రహరీ గేటుకు వెలుపల ,రోడ్డమ్మటి ఒక విగ్రహం పెట్టుకుంటాను అప్పుడు వాల్లు ఎదురు తిరిగితే మనం వార్త వ్రాస్తామా ? వ్రాయమా అని అడిగాను. అంతే ఆయన సీరియస్సయ్యాడు.
ఇంత దిక్కుమాలిన భావాలతో నేను పనిచేయలేనని చెప్పి ఆపత్రికనుంచి బయటకొచ్చాను.

ఇక నాఉద్యోగవిషయంలో సంఘటన
నాదగ్గరకొక అడ్మిషన్ వచ్చింది . అడ్మిషన్ ఫారంలో మీ మతమేదమ్మా అంటే అపిల్లవాని తల్లి ఫలానామతం అని చెప్పింది . నాపక్కనే ఉన్న మాష్టారు ,అలాచెప్పకూడదు . హిందూ..చెప్పాలి లేకపోతే రిజర్వేషన్ రాదు అని చెపుతూ నన్ను హిందూ అని వ్రాయమటాడు. అదెలాగయ్యా ఆవిడ మేము కాదు అంటుంటే ? అన్నాను
ఆయన చెప్పమన్నా సరే ఆపిల్లవాని తల్లిమాత్రం ,మేము ఫలానా మతస్తులమని అని గట్టిగాచెబుతుంది . ఇక మా మాస్టారు నానుంచి అడ్మిషన్ ఫారం లాక్కుని తాను పూర్తిచేసుకున్నాడు [ఆయనహెడ్మాస్టార్ మరి] .

మొన్న వినుకొండలో సంఘటన

ఆర్టిసీ బస్టాండదగ్గర నాచిన్నతనంలో ఒక ముసలావిడ ఎవరో చాలాకష్టపడి చిన్న శివాలయం కట్టించింది.చిన్నతనంలో మా జేజినాయన వెంట వెళ్ళినప్పుడు అయనతో పాటు నమస్కరించుకోవటం అలవాటు. ఆతరువాత ఆపక్కనే ఒక మసీదు వెలసింది, దానిపక్కనే ఉన్న జీవాలయం వాల్లు కూడా ముందుకు వచ్చి మేరీమాత విగ్రహాన్ని కూడా నిర్మించారు. ఇప్పుడు రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు ప్రొక్లైనర్లతో వచ్చి దేవాలయం లేపేశారు.విగ్రహాలు పీకిపక్కన పడేశారు. ఎంతదుర్మార్గం అని అనుకున్నవాల్లేగాని ఒక్కల్లు ఎదిరించి మాట్లాడలేదట. పక్కనే ఉన్న ప్రార్ధనామందిరాలదగ్గరకెల్లేసరికి "పుచ్చలు లేసిపోతాయ్" అని హెచ్చరికలొచ్చాయి కాబోలు అధికారులు పరార్ . మీరిప్పుడొచ్చి చూడండి ..ధ్వంసమైన ఆలయం పక్కన సగర్వంగా నిలుచున్న ప్రార్ధనామందిరాలను. ఇది వాల్లధర్మ నిష్ట. ఆధర్మ నిష్ఠ కలవారు కనుకనే వారి విశ్వాసాలపై దాడి చేయటానికెవడూ సాహసించడు.

మనవాల్లు రోజూ వెళ్ళి దణ్నం పెట్టుకునే గుడిగూర్చి వివాదమేదన్నా జరుగుతుందని తెలిస్తే మనపిల్లలను అటువెళ్లవద్దని హెచ్చరిస్తాం . వాల్లవిశ్వాసాలకు ప్రతీకలైన వాటిపట్ల అవమానం జరిగితే పిల్లాదిమొదలు తమనిరసన తెలిపేందుకు సిద్దమవుతారు .న్యాయపరంగా నిజమైన విషయాలపట్లనయితే వాల్లస్పందన నాకు అభిమాన విషయం .అదీ ధర్మనిష్ఠ అంటే.
సరే మనం మనధర్మం పట్ల ఇంత నిరాశక్తత,నిస్సహాయత , చూపించటమే మనధర్మనిష్టకు ప్రతీకగా భావిద్దామా ?
ఎందుకింత నిర్లక్ష్యం ? మనకు మనధర్మాన్ని అవమానింపబడకుండా కాపాడుకునే శక్తిలేదా ? దానికోసం మనం మగొంతునుంచి ఒక్క కేకను బయటకు పంపలేమా ? మనచుట్టూతా, మనకు వీలైన చోట్ల మన నిరశన తెలుపలేమా?మరొకరు మనలను అవమానించకుండా చట్టపరిధిలో మనం మనశక్తిచూపలేమా ? అందుకోసం మనం మనజీవితాన్నుంచి ఏమీ ఇవ్వలేమా ?
మనకోర్కెలు నెరవేర్చేందుకు మాత్రమే మనకు మన దైవాలు, విశ్వాసాలు అవసరమా ? మనకు మనధర్మం పట్ల ఈమాత్రం అభిమానముంటే మన దేవీదేవతలకుఇన్ని అవమానాలు వారిపట్ల ఇన్ని అపచారాలు జరుగుతాయా ?
దీనికి మన సమాధానమేమిటి ? ఎవరి మనసుకు వాల్లం చెప్పుకుందాం ఓ పదినిమిషాలు మన అమూల్యమైన,అతి బిజీ జీవితాలనుంచి వెచ్చించి .

Read more...

కన్నులపండుగాయె స్వామీ ! నీకళ్యాణము.

>> Sunday, February 13, 2011






శ్రీదేవి,భూదేవి సిగ్గులమొగ్గలుకాగా చిరుతనవ్వులవాడు సింగారములతో కళ్యాణమండపంలో కొలువుదీరి ,పురోహితుల మత్రోచ్ఛరణ లమధ్య అమ్మవారల మెడలలో మంగళసూత్రం కట్టాడు. భక్తులజయజయధ్వానాలు తో మురిసిపోయి మనలను తానెప్పుడు వీడనని మందహాసస్మితుడై మోదాన్నితెలియపరచాడు.
మరొకపక్క జగన్మాతాపితరులగు పార్వతీ పరమేశ్వరులు తమ పిల్లలవేడుకకోసం నూతనవధూవరుల రూపుదాల్చి పరిణయోత్సవంలోపాల్గొన్నారు.

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణోత్సవం నిన్న [ఆదివారం] వైభవోపేతంగా జరిగింది .
మగపెళ్ళివారు, ఆడపెళ్ళివారు గా భక్తులు ఇరువైపులా తరలివచ్చి కళ్యాణంలోపాల్గొన్నారు.
ఈసందర్భంగా చెన్నైనుంచి వచ్చిన సునీల్ వైద్యభూషణ్ కూడా పురోహితులతోపాటు ఒకపురోహితుడై కళ్యాణక్రమాన్నినడపటమేగాక . స్వామి వారి భక్తులకు పెండ్లివిందు కూడా ఏర్పాటుచేశాడు అమెరికాలో ఉండే మన ఆడపడుచు రాధిక పురోహితులకు స్వామివారి తరపుఅ సంభావనలను అందించారు.
మన బ్లాగర్లు నాగప్రసాద్ ,కౌటిల్య లుకూడా కళ్యాణోత్సవంలో సందడిచేశారు.
వివాహమైన పందొమ్మిది సంవత్సరాలకు అమ్మవారి కృపతో శుక్ర్రవారం రోజు జన్మించిన పాపను తీసుకుని వచ్చిన ఆంధ్రభూమి విలేఖరి నమశ్శివాయ పాపను అమ్మవారి పాదసన్నిధిలో ఉంచి అమ్మా !ఇది నీప్రసాదం సంబరపడిపోయాడు . మూడునెలలు నిండని ఆ పిడుగు అమ్మవారి వంకచూసి కిలకిలలాడుతుంటే వెన్నెలవానకురిసినట్లనిపించింది .
నాడు యశోదకులభించని భాగ్యం నేడు మాకుదక్కింది ,మరలా నీకళ్యాణానికి మాకుచెప్పటం మరచిపోకు స్వామీ ! అని వచ్చినభక్తులు స్వామికి విన్నవించుకుని తరలి వెళ్ళారు.

ఈససందర్భంగా గోత్రనామాలు పంపిన భక్తుల తరపున కూడా అర్చనలు జరుపబడ్డాయి.

Read more...

శ్రీవారి కళ్యాణోత్సవం ... ప్రత్యేక అర్చనలకు గోత్రనామాలు పంపండి

>> Thursday, February 10, 2011


పీఠంలో కొలువై యున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి,భూదేవి దేవేరులతోను
శ్రీరామలింగేశ్వర స్వామి వారికి శ్రీ దుర్గాపరమేశ్వరి అమ్మవారి తోను కళ్యాణోత్సవములు[13-2-2011] మాఘ శుద్ధదశమి ఆదివారం నాడు నిర్వహించబడుతున్నాయి.
ఈసందర్భంగా ప్రత్యేక అర్చనలు ,సేవలు జరుగుతాయి . మీరందరూ సకుటుంబ సపరివారసమేతంగా రావాలని మా హృదయపూర్వక ఆహ్వానం
అలాగే గోత్రనామములు పంపిన భక్తులందరి తరపున పూజలు జరుపబడతాయి . కావాలని కోరినవారికి కళ్యాణాక్షతలు ప్రసాదంగా పంపబడతాయి .

మీ గోత్రనామాలు పంపవలసిన అడ్రెస్
durgeswara@gmail.com

Read more...

హిందువులారా ! మన తల్లిని నీచులుఇంతగా అవమానిస్తున్నా ఇంకాసహనమేనా ?

>> Tuesday, February 8, 2011

ఒళ్ళుకొవ్వెక్కిన ప్రతివాల్లూ మనవిశ్వాసాలను దేవీ దేవతలను అవమానించడమే . ఒకనీతి ,నియమాలు లేని నికృష్టులంతా ఇంతగా మన గుండెలను గాయపరుస్తున్నారంటే కారణం మనమే . సహనం క్షమాగుణానికీ ఒక హద్దు ఉంటుంది. మనసహనం చేతగానితనంగా తీసుకుని ఒల్లు కొవ్వెక్కి వాగగలుగుతున్నారు. ఇంకా మనం మౌనంవహించటం పాపహేతువు. అధర్మానికి పాల్పడేవాడేకాదు అదిచూసి మౌనంగా ఉండేవాడు ఆపాపంలో భాగం పంచుకున్నవాడవుతాడని మహాభారతం మనకు బోధిస్తుంది.
మనతల్లి సీతమ్మను గూర్చి అత్యంత హేయంగా నీచసంస్కారం గల ఒక మహిళ [నిజంగా తల్లులందరికీ ఆవిడ జన్మసిగ్గుచేటు] బ్లాగులో వ్రాసింది. ఇంకా సహించటం సీతామాత బిడ్దలుగా మనకు అవమానకరం . మనతల్లిగూర్చి ఇంత నీచంగా వ్రాసినప్పుడు మనం సహిస్తే ,....ఇక మనకు బిడ్డలుగా ఇంతకంటే అవమానం మరొకటిలేదు.
ఈవిడ పై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నాము . మీతల్లిని ఇంతగా అవమానించిన వారికి బుద్ధిచెప్పేందుకు మీరుకూడా పిడికిలి బిగించి మాతో చేయి కలపండి.
ముందుగా ఇటువంటి మానసిక రోగులను అగ్రిగేటర్లనుంచి తొలగించవలసనదిగా కోరండి . ఆతరువాత చట్టపరంగా ఎలాబుధ్ధిచెప్పాలో అందరం కలసి చూపిద్దాము.

ఇక ఈ బ్లాగర్ వ్రాసిన దానిని బట్టి మానసికంగా అనారోగ్యం తో ఉన్నట్లున్నదని కొందరు మితృలంటున్నారు. ఈ బ్లాగర్ మహిళకనుక ఒక అవకాశమిస్తున్నాము . తల్లిసీతా మాత పట్ల చేసిన అపరాధానికి బహిరంగంగా క్షమాపణచెప్పి పోస్టును తొలగించి తనతప్పు తెలుసుకోవాలి . లేదంటే హిందువులు ధర్మాగ్రహం ఎలాఉంటుందో చూడటానికి సిద్దంగా ఉండాలి .

Read more...

మళ్ళీ ఎవరికో మూడింది .

>> Sunday, February 6, 2011

ఎన్ని సార్లు చెప్పినా వినరు .ఎన్ని దెబ్బలుతిన్నా బుద్దిరాదు . అధికారమదం కళ్లకు కప్పితే పరమాత్మ చర్యలు అర్ధంకావు. అనర్ధం నెత్తిన మొట్టినదాకా. ఇప్పటికి పలుమార్లు తిరుమల శ్రీవారి పట్ల అపచారం చేసిన వారికి పట్టిన గతిని చూశారు. అయినా దురాశ చావలేదు. కొండలరాయని జోలికెళ్ళి కోరి కష్టాలు తెచ్చుకునే బుద్దిమాలిన పనులు మానటం లేదు రా[క్ష]జకీయులు .
ఇప్పుడు పెద్దతలకాయలేవో మళ్ళీ మూర్ఖపుపనులను మొదలెడుతున్నాయి . ఈసారెవరి తలకు స్వయంగా వెలకట్టుకుంటూన్నారో ????

Read more...

కళ్యాణము చేతమురారండీ ! [మీ ఇంటిల్లపాదీ రావాలి సుమా !]

>> Friday, February 4, 2011


జగన్నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవీ భూదేవి దేవేరులతతోనూ
లోకశుభంకరుడగు పరమేశ్వరునకు జగన్మాత దుర్గాపరమేశ్వరి అమ్మవారలతోను కళ్యాణం జరిపే అదృష్టం ప్రసాదించబడింది.
మాఘశుద్దదశమి నాడు పీఠములో దేవతామూర్తులు కొలువైన శుభసమయం. ప్రతిసంవత్సరం ఈ శుభముహూర్తాన శ్రీవారికి.శ్రీదేవి వారలకు
శివపార్వతులకు భక్తజనులే బంధువర్గంగా గా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఈసంవత్సరం 13-2-2011 న కళ్యాణోత్సవం జరుపబడుతుంది . మీరంతా సకుటుంబసపరివార సమేతంగా విచ్చేసి జగన్మాతాపితరుల కుజరిపే కళ్యాణం లో పాలుపంచుకోవలసినదిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము

అలాగే వివాహమహీత్సవాన జరిగే ప్రత్యేక పూజలలో మీగోత్రనామాలతో పూజజరగుతుంది కాన మీ గోత్రనామాలు
durgeswara@ gmail.com పంపవలసినదిగ మనవి .

అలాగే మిగతావివరాలకు 9948235641 లో నన్ను సంప్రదించగలరు.

భక్తజన పాదదాసుడు
దుర్గేశ్వర

Read more...

మాఘమాసం వచ్చేస్తోంది .

>> Thursday, February 3, 2011

ఇక రెండురోజులలో మాఘమాసం ప్రారంభం, అత్యంత శక్తివంతం ప్రభావ వంతం, శక్తి
పూజలు, విష్ణు పూజలు, సౌర వ్రతాలు, శివ పూజలు అభిషేకాలు, శ్రీపంచమి,
మాఘపాదివారాలు, రథసప్తమీ వ్రతం, భీష్మాష్టమి, భీష్మేకాదశి, మార్కండేయ
జననం, మహా శివరాత్రి, మాఘ స్నానాలు ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో అద్భుత
విషయాలు కలిగి మానవమాత్రులు అతి సులభంగా తరించ గలిగే ఎన్నో వ్రతాలు,
నోములు, ఉపాసనా విధులతో కూడిన మాఘ మాసం ప్రత్యేకతలు ఒక్కొక్కటిగా పొందు
పరచడానికి చేసే ప్రయత్నమే ఇది. ఇక్కడ పొందు పరచే విషయాలు అక్కడా ఇక్కడా
వెతికి సంకలనం చేయబడ్డవి అంతర్జాలం (Internet), గ్రంధములు, పెద్దల ద్వారా
తెలుసుకున్నవి.

వసంత పంచమితో మొదలు
"మాఘమాసేతు సంపూజ్య కర్తవ్యః సుమహోత్సవః
ఆయముత్సవో వసంతోత్సవః"
అంటే మాఘశుద్ధ పంచమినాడే వసంత ఋతువు ప్రారంభమవుతుందనీ, వసంత పంచమి
నామాన్ని అనుసరించి ఇది ఋతువుల పండుగని తెలుస్తోంది. చదువుల తల్లి శ్రీ
సరస్వతీదేవి జన్మించిన అత్యంత పుణ్యప్రదమైన మాసం "మాఘమాసం"
శ్రీ అనగా సంపద. ‘జ్ఞాన సంపత్ప్రద' అయిన సరస్వతిని ఆరాధించడానికి విశేష
ఫలప్రదమైన పంచమిని ‘శ్రీ పంచమి' అని, ‘వసంత పంచమి' ‘మదన పంచమి' అని కూడ
అంటారు. ఆరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం సర్వశ్రేష్ఠకరమనీ, ‘శ్రీ'
అనగా లక్ష్మి పరమైన భావన ఉన్నందున శ్రీ పంచమినాడు లక్ష్మీదేవిని మంద
కుసుమాలతో పూజించడం శుభప్రదమని, సరస్వతీదేవి జన్మదినం మాఘశుద్ధ పంచమి
కనుకనే శ్రీ పంచమిని సరస్వతీ జయంతిగా కూడా జరుపుకుంటారు.
‘సరః' అంటే కాంతి అని, సరస్వతీ అంటే కాంతినిచ్చేది అని అర్థము. జ్ఞానం
ప్రసాదించే తల్లి కనుకనే శ్రీ పంచమిని వసంత పంచమి అని అంటారు.
సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి, సరస్వతి పద్మాసనస్థయై ఉంటుంది. పద్మం
జ్ఞానానికి సంకేతం కాబట్టి వాగ్దేవి జ్ఞానప్రదాయినిగా వుంది. జ్ఞానశక్తి
చేత బ్రహ్మ సృష్టి కార్యాన్ని చేస్తాడు. కనుక సరస్వతి బ్రహ్మదేవునకు
అర్ధాంగియైనది.
చతుర్భాహువులతో శోభిల్లే సరస్వతీదేవి ఒక చేతిలో గ్రంథాలు అదే బుద్ధి. మరో
చేతిలో జపమాల అదే మనస్సు. బుద్ధిజ్ఞాన రూపమై జ్ఞానశక్తిని వ్యక్తం
చేసినప్పుడు మనసు క్రియారూపమై క్రియాశక్తిని బహిర్గతం చేసి కార్యరంగంలో
ప్రవేశిస్తుంది. మనోబుద్ధులు ఏకమైన స్థితిలో మనో హృదయాలు కలవడంచేత
మహత్తరమైన జీవనగీతం ఆలపించబడుతుంది అదియే వీణానాదం.
‘‘మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపిచ
పూర్వేహ్ని సమయం తృత్యా తత్రాహ్న సంయతః శుచిః"
అంటే మాఘ శుక్ల పంచమినాటి ఉషోదయ కాలాన స్నానమాచరించి, పూజామందిరంలో
పూజాపీఠంపై నూత్న వస్త్రాన్ని పరచి దానిపై బియ్యాన్ని పోసి అష్టదళ
పద్మాన్ని లిఖించి, వాగ్దేవి ప్రతిమనుంచి, కలశస్థాపన చేసి, దేవి
సన్నిధిలో కలం, పుస్తకాలు ఉంచి ముందుగా విఘ్నేశ్వర పూజగావించి,
సరస్వతీదేవిని షోడశోపచార, అష్టోత్తరాలతో పూజించాలి. నివేదనగా ఆవుపాలతో
చేసిన పాయసం సమర్పించాలి.
శ్రీ పంచమిరోజున విద్యారంభం, విద్యాభ్యాసం, చేయడం శుభప్రదమని
అక్షరాభ్యాసాలు చేయించడం, విద్యార్థినీ విద్యార్థులు తమ పుస్తకాలను
సరస్వతీదేవి ముందుంచి పూజించడంవల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది. పిల్లలు
చదువుల్లో బాగా వృద్ధిచెందుతారని బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొనబడింది.
శ్రీ పంచమినాడు విశేషంగా సరస్వతి క్షేత్రమైన ‘బాసర’లో సరస్వతీదేవి ఆరాధన---
మహోత్సవం గొప్పగా జరుపుతారు. - కావ్యసుధ

------------------------------------------------------------------------------
శ్రీగురుభ్యోన్నమః

భాగవతులందరికీ నమస్సులు



శ్రీ నారద పురాణము,ఉత్తర భాగము, , మోహినీ చరిత్రములోని కాష్టీలోపాఖ్యానమునందు కల మాఘ మహాత్యము అనే ముప్పైఒకటవ అధ్యాయము నుండి సేకరించినది.



ఈ క్రింది శ్లోకము రోజు స్నానము చేయునప్పుడు చదవటం మాఘమాస స్నాన పూర్ణ ఫలితాన్ని కలుగచేస్తుంది. సూర్య భగవానుని స్నానం చేస్తూ ఈ క్రింది విధంగా ప్రార్థించడం ద్వారా పూర్ణ మాఘమాస స్నానా ఫలితాన్ని, అనంతమైన ఇతర ఫలితాలని ఇస్తాడని నారద పురాణం పేర్కొంటోంది.



యదనేక జనుర్జన్యం యజ్ జ్ఙానాజ్ఙానతః కృతమ్! త్వత్తేజసా హతం చాస్తు తత్తు పాపం సహస్రధా!!

దివాకర జగన్నాధ ప్రభాకర నమోస్తుతే! పరిపూర్ణ కురుష్వేదం మాఘస్నానం మమాచ్యుత!!



భావము:అనేక జన్మలలో తెలిసీ తెలియక చేసిన కర్మల వలన కలిగిన పాపములెన్నో కలవు, నీ తేజస్సు చే ఆ అనంతములైన పాపములు హతములగును (గాక). హే దివాకరా! జగన్నాధా! ప్రభాకరా! నీకు నమస్కారములు! ఓ అచ్యుతా నా పాపములను హరించి నా ఈ మాఘస్నానమును పరిపూర్ణము కావింపుము.





మాఘ స్నానానికి అంత ప్రాముఖ్యత ఎందుకు? నారద పురాణం పేర్కొన్న ప్రకారం దేవతలు తమ తమ శక్తులను/ తేజస్సులను ఈ మాసంలో జలములందు నిక్షేపం చేస్తారు అందువల్లనే మాఘ మాసంలో స్నానం అతి శ్రేష్ఠం. (స్నానమనేది శారీరక శుద్ధి కొఱకు కాదు ధర్మ సేవనమునకు)



నదీ స్నానం నది కి అభిముఖంగా చేయాలి, ఇతర స్థలాలో ఐతే (ప్రస్తుతం మన స్నానపుగదులలో అనుక్కుందాం) సూర్యునికి అభిముఖంగా చేయాలి. స్నానానికి ముందు గంగేచ యమునేచైవ.... శ్లోకంతో గంగాది తీర్థములను ఆవాహన చేసి (మమోపాత్త........ స్నానమహం కరిష్యే అంటూ సంకల్పం కూడా చెప్పుకోగలిగితే మేలు) ఆ నీటితో స్నానం చేయాలి.



సూర్యోదయమునకు ముందే స్నానము చేసి సూర్యుడు ఉదయించులోగానే సూర్యుని ప్రార్థించాలి (సంధ్యావందనాదులు, సూర్య స్తోత్రములు, ఆ సంధ్యావందనాది అధికారం లేని వారు సూర్య స్తోత్రాదులు)



మాఘస్నానం, మాఘ వ్రతం అతి మహిమాన్వితం, నారద పురాణం ప్రకారం ఎన్నో ఉన్నత లోకాలను, మోక్షమును కూడా ప్రసాదించగలదు మాఘం



రేపటి నుండే మాఘం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇంతే పొందుపరుస్తున్నాను. ఎవరైనా దీనిని ఉపయోగించుకోడానికి వీలు ఉంటుంది అని తొందరగా పెట్టడానికి ఈ మాత్రమే పొందు పరచడం జరుగుతోంది. రేపటికల్లా మాఘ మహాత్మ్యం మొత్తం (నారద పురాణంలోనిది పైన చెప్పినది) పొందు పరచటానికి ప్రయత్నిస్తాను.



-మీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ


[సత్సంగము గ్రూప్ లో ఉంచిన వ్యాసము మరికొంతమందికి చేరాలని ఇక్కడ ఉంచాను]

Read more...

పెళ్లికాని పూజారులు! [ఈవార్తను చదవండి ]


నిన్న ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో పూజారుల దీనస్థితిని గూర్చి తెలుపుతూ వ్రాసిన వార్త ఇది.చదివి ఆలోచించండి.

https://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2011/feb/2/navya/2navya1&more=2011/feb/2/navya/navyamain&date=2/2/2011
మొన్నామధ్య మీరందరూ ఆర్జితసేవలు నిలిపేసి, గుడులకు తాళాలు వేసి ధర్నా చేశారెందుకు?
సత్యనారాయణ శర్మ: ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాం...ప్రభుత్వం మా బాధల్ని పెడచెవిన పెడుతోందే తప్ప మా గురించి పట్టించుకోవడం లేదు. నేను కీసరగుట్ట దేవాలయంలో వేదపండితుడిగా పనిచేస్తున్నాను. దేవాదాయశాఖ ఆధీనంలో పనిచేస్తున్న పూజారులకు వేతన విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది.

అన్ని డిపార్టుమెంటులలో ఐదేళ్లకొకసారి వేతన సవరణ జరుగుతుంది కాని మా శాఖలో అలాంటిదేమీ లేదు. కొన్ని గుడులలో అర్చకులకి జీతాలు నాలుగు నెలలకొకసారి, ఐదునెలలకొకసారి ఇస్తున్నారు. అలాకాకుండా రాష్ట్రంలో ఉన్న గుడులన్నింటి నుంచి కొంత ఆదాయం తీసి ఒక ధార్మిక నిధిని ఏర్పాటుచేసి అందులోనుంచి పూజారులందరికీ జీతాలు ఇవ్వాలని మా విన్నపం. కొన్నేళ్లకింద ఈ విషయంపై చట్ట సవరణ కూడా జరిగింది. పెద్దఎత్తునే పోరాటాలు కూడా చేశాం. కాని దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. దానికన్నా ప్రధానమైనది పెన్షను.్ల కొన్ని పెద్ద పెద్ద గుడులలో అర్చకులకు తప్ప పూజారులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదు.

రామకృష్ణాచార్యులు: ఉద్యోగాలు చేసే అర్చకుల గురించి చెబుతున్నారు మీరు... కొన్ని ప్రాంతాల్లో అర్చకులకి గుడిమాన్యం నుంచి జీతం ఇస్తారు. అంటే ఏడాదికొకసారి పంట వచ్చినపుడు జీతం ఇస్తారు. వానలు, వరదలు వస్తే అదీ ఉండదు. అప్పటివరకూ ఆ అర్చకుడి పొట్ట గడిచేదెలా? గుడిలో పూజారి టైమింగ్స్ ఏంటి? సత్యనారాయణ శర్మ: ఊర్లో అందరికంటే ముందు లేచేవాడు అర్చకుడు. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం ముగించుకుని గుడిలో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాలి. పొద్దున నాలుగింటికి పనులు మొదలైతే పన్నెండింటివరకూ ఊపిరి చెలపదు. మళ్లీ సాయంత్రం ఐదింటికి మొదలైతే రాత్రి ఎనిమిదీ తొమ్మిదింటి వరకూ అర్చకుడు బిజీగానే ఉంటాడు.

లక్ష్మీ వరప్రసాద్ ఆచార్యులు: పెద్ద గుడైతే పద్ధతులు వేరుగా ఉంటాయి, చిన్న గుడికి వేరుగా ఉంటాయి. నేను ఇక్కడ నాగారంలోని వేంకటేశ్వర దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. మాది ప్రైవేట్ యాజమాన్యంలోని గుడి. దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఆలయాల్లో మాత్రం టైమింగ్స్, షిఫ్ట్స్ ఉంటాయి. మాకు అలా ఉండవు.

అర్చకుల సంపాదన ఎలా ఉంటుంది?
సత్యనారాయణ శర్మ: పెద్ద పెద్ద గుడుల్లో అర్చకులకి జీతాలు ఉంటాయి. ప్రైవేటు గుడుల్లో అయితే పిండి కొలదీ రొట్టె. గుడి స్థోమతని బట్టి వేతనాలు ఉంటాయి. మన రాష్ట్రంలో మొత్తం 37 వేల గుడులు ఉన్నాయి. వీటిలో ప్రైవేటు గుడులే ఎక్కువ. మీకు వేలు సంపాదించే అర్చకుల గురించే తెలుసు. కాని కొన్ని గ్రామాల్లో అర్చకులు హారతిపళ్లెంలోని డబ్బులతోనే బతుకుతున్నారు. డబ్బులున్నాయి కదా అని కొందరు, మొక్కులు ఉన్నాయని కొందరు చిన్న చిన్న గుడులు కట్టేసి వదిలేస్తున్నారు.

దేవుడికి తప్పినా, భక్తుడికి తప్పినా...పూజారికి తప్పదు కదా! పుణ్యం కోసమో దేనికోసమో దమ్మిడీ ఆదాయం లేని గుడిలో సైతం దీపం ఉంచుతాడు. చాలామంది భక్తులు దాన్ని గమనించరు. రామకృష్ణాచార్యులు: నా గురించి చెబితే మీకు విషయం బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ అయ్యప్పకాలనీలో ఆంజనేయస్వామి గుడిలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. నెలకి రెండువేలు జీతం ఇస్తున్నారు. ఈ రోజు భార్యాపిల్లల్ని పోషించాలంటే నెలకి పదివేల రూపాయలు అవసరం. మరి రెండువేల రూపాయలతో ఎలా బతకాలి. అందుకే ఆటో నడుపుకుంటాను. పొద్దునా సాయంత్రం స్కూలుపిల్లల్ని తీసుకొచ్చేపని చేసుకుని పొట్టగడుపుకుంటున్నాను.

ఏడాదిలో ఎన్ని సెలవులు తీసుకుంటారు?
సత్యనారాయణ శర్మ: దేవుడికి సెలవులు ఉంటాయా? ఉండవు. ఇక అలాంటపుడు అర్చకుడికి సెలవులు ఎక్కడ ఉంటాయి? రామకృష్ణాచార్యులు: ఎందుకు ఉండవు...గ్రహణం పట్టినపుడు సెలవే కదా!(నవ్వుతూ..) సత్యనారాయణ శర్మ: ఎప్పుడు పడుతుందేమిటి? వారానికొకసారా, నెలకి నాలుగుసార్లా...పోయినేడాది మన దగ్గర రెండుసార్లే వచ్చిందండి గ్రహణం. ఆ రోజున మాత్రం గుడి తలుపులు మూసేసి ఉంటాయి కాబట్టి, మాకు రెస్ట్ అన్నమాట. రెండు సందర్భాల్లో పర్సనల్ లీవులు తీసుకుంటాం. అవి..ఒకటి ఇంట్లో ఎవరైనా చనిపోతే మైల సెలవులు, పురుడు వస్తే పురిటి సెలవులు.

లక్ష్మీ వరప్రసాద్ ఆచార్యులు: పెద్ద గుడుల్లో పనిచేసేవారికి మైల సెలవులు పెట్టుకోడానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి షిఫ్ట్‌లు మార్చుకోవడం, మరో ప్రాంతం నుంచి రప్పించడం వంటివి ఉంటాయి. కాని మాలాంటి ప్రైవేటు గుడుల్లో పనిచేసే అర్చకులకి మాత్రం అది పెద్ద నరకం.

తనవారు పోయిన బాధకంటే గుడిలో మా స్థానంలో పెట్టాల్సిన పూజారి గురించే బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ పది రోజులు మా గుడిలో ఉండటానికి అర్చకుడ్ని మేమే వెతుక్కోవాలి. గుడిలో ఉండే చీపురు కట్ట దగ్గర నుంచి దేవుడి మెడలో ఉండే ఆభరణాల వరకూ మాదే బాధ్యత కాబట్టి ఆ పది రోజులు మేము పెట్టిన పూజారిని మేమే కనిపెట్టుకుని కూర్చోవాలి.

మీ కట్టుబాట్లు ఎలా ఉంటాయి? మీరు బయట హోటళ్లకు, సినిమాలకు వెళుతుంటారా?
సత్యనారాయణ శర్మ: ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. అయితే అర్చకుడికి అది చాలా తక్కువగా ఉంటుంది. సినిమాలు చూడలేడు, సరదాగా బయటికి వెళ్లి పార్కుల్లోనో, హోటళ్ళలో రిలాక్స్ అవ్వలేడు. సరదాగా వెళ్లే విహారయాత్రలకు కూడా ఫ్రెండ్స్ తీసికెళ్లరు. నిజం చెప్పాలంటే అవన్నీ మేము చేయకూడని పనులే.

అర్చకుడు అంటే కేవలం భగవంతున్ని సేవించేవాడు. భార్యా పిల్లలు మినహాయిస్తే అంతా భగవంతుని సన్నిదిలోనే కాలక్షేపం చేయాలి. ఈ విషయాల్లో కొందరు చాలా నిష్టగా ఉంటారు. కొందరు కాస్త ఆకతాయిగా ఉంటారు. రామకృష్ణాచార్యులు: సమయం ఎక్కడ ఉంటుందండి. అయినా సరదాగా అలా బంధువుల ఇంటికి భోజనానికి వెళదామంటేనే కుదరదు. ఆ విషయం అలా ఉంచండి. మేము అర్చకులం కాబట్టి మా పద్ధతులు మాకుంటాయి. రోజూ గుడిలో పూజ చేసే పూజారి పక్కనే ఉన్న థియేటర్లో కనిపించాడనుకోండి...జనం ఊరుకుంటారా(నవ్వుతూ...)

సర్వణసాయి శర్మ: నాకైతే సినిమాలు చూడాలని, షికార్లకి వెళ్లాలని ఉండదు. సమయమంతా గాయిత్రీదేవి ఆలయంలోనే సరిపోతుంది. కాని అందరూ ఒకేలా ఉండరు కదా! దీన్ని కేవలం ప్రొఫెషన్‌గా భావించి వచ్చినవారు కట్టుబాట్లకి కట్టుబడి ఉండలేరు కదా! లక్ష్మీ వరప్రసాద్ ఆచార్యులు: ఎందుకు ఉండలేరు? ఉండకేం చేస్తారు. అయినా ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు కానీ....అర్చకులు ఎదుర్కొనే పెద్ద సమస్య ఒకటి ఉందండి. అర్చకత్వం చేసే యువకులెవ్వరికీ కొన్నాళ్ల నుంచి పెళ్లిళ్లు కావడం లేదు. మమ్మల్ని బాధిస్తున్న మరో సమస్య అది.

పెళ్లిళ్లు కాకపోవడం ఏంటి?
సత్యనారాయణ శర్మ: పదేళ్ల నుంచి వాతావరణం మారిపోయింది. మా కులంలో ఉండే అమ్మాయిలు డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోతున్నారు. పిలక వేసుకునే అర్చకుడ్ని చేసుకోవడానికి ఏ అమ్మాయి ఇష్టపడడం లేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రధానమైనవి రెండు. ఒకటి చదువు, మరొకటి సౌఖ్యం. ప్రతి అర్చకుడూ 'మాలా మంత్రాలు చెప్పుకుంటూ బతక్కూడదు మా పిల్లలు. పెద్ద చదువులు చదువుకుని కంప్యూటర్ ముందు కూర్చునే ఉద్యోగం చేయాలి' అని కలలు కంటున్నారు.

కనడమేమిటి నిజం చేసుకుంటున్నారు కూడా. దీంతో అబ్బాయిల విషయం పక్కన పెడితే...అమ్మాయిలందరూ చక్కగా చదువుకుంటున్నారు. ఆ చదువులు కూడా ఇంగ్లీషు మీడియం. వారికి మంత్రాలు కాదు కదా తెలుగు క్యాలెండరు చూసి తిథి చెప్పడం కూడా రాదు. మరి అలాంటి పిల్లలకి పెళ్లిళ్లు చేయాలంటే ఆ స్థాయిలో చదువుకుని పెద్ద ఉద్యోగం చేసే అబ్బాయిలు కావాలి. ఇలా అర్చకత్వం చేసే యువకులు వారి దృష్టిలో ఉండరు. ఒకవేళ అర్చకవృత్తిపై అభిమానంతో, గౌరవంతో పెద్దలు ఇష్టపడ్డా అమ్మాయిలు మాత్రం ఆమడదూరం పరిగెడుతున్నారు. ఇదిగో చక్కని రూపు, సరిపడా సంపాదన ఉండి కూడా మా లక్ష్మీ వరప్రసాద్ ఆచార్యులకి ఒక్క సంబంధం రావడం లేదు.

లక్ష్మీ వరప్రసాద్ ఆచార్యులు: ఏ సమస్యకైనా కారణం ఉంటుంది. ఇక్కడ మేము ఎదుర్కొంటున్న సమస్యకి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఇందాక మేము చెప్పిన మా పర్సనల్‌లైఫ్ విషయాలు వింటే మీకు ఏం అర్థమైంది. మిగతావారికుండే సరదాజీవితం మాకు ఉండదు. రేపు నన్ను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి కూడా మాతోబాటు అన్నీ వదులుకుని బతకాలి.

నేను పొద్దున నాలుగింటికల్లా లేచి ఇంట్లో పనులు మొదలుపెడతాను. ఉత్సవాలు ఉన్నప్పుడయితే రెండింటికే లేవాలి. ఎప్పుడూ దేవుడు, పూజలు, భక్తులు, గుడి..అంతే. వారి కోసం మేము ఎక్కువ సమయం కేటాయించలేం. మమ్మల్ని చేసుకుంటే ఎన్ని తిప్పలుపడాలో మా ఇళ్లలో అమ్మాయిలకు తెలుసు. అందుకే ఎందుకొచ్చిన గొడవ...హాయిగా ఉద్యోగం చేసుకునేవాడ్ని చేసుకుంటే పోలా అనుకుంటారు(నవ్వుతూ...)

సత్యనారాయణ శర్మ: లేదు..లేదు ఇది నవ్వడం కోసం చెప్పుకునే విషయం కాదు. బయట సమాజంలో అర్చకుడికి పని పెరిగిన మాట వాస్తవమే. కాని రోజురోజుకీ వీరి పట్ల అమ్మాయిలకుండే అభిప్రాయం బలపడడం దురదృష్టకరం. ఖచ్చితంగా చెప్పేస్తున్నారు... అర్చకుడ్ని పెళ్లిచేసుకోవడం మా వల్లకాదని. దాంతో నలభైఏళ్లు వచ్చినా పెళ్లిళ్లు కాని వారు చాలామంది ఉన్నారు. ఏంచేస్తారు మిగతావారిలా పరకులంవారిని చేసుకోలేరు కదా.

రామకృష్ణా చార్యులు: అవును ఇష్టపడ్డా చేసుకోలేరు. ఎందుకంటే శాస్త్రం ఒప్పుకోదు. సత్యనారాయణశర్మ: శాస్త్రం సంగతి పక్కనపెట్టు చుట్టూజనం ఒప్పుకుంటారా....'పూజారికేం పోయేకాలం వచ్చింది...ఫలానా అమ్మాయిని లేపుకుపోయాడంట' అని గ్రామపొలిమేర వరకూ తరిమికొడతారు(నవ్వుతూ...)
జూ భువనేశ్వరి
ఫోటోలు: సురేష్‌వర్మ

Read more...

కేవలం ఆవులకు -బ్రాహ్మణులకు శుభం జరిగి పోతే చాలనా మీ ఉద్దేశం? అదేనా మీ ధర్మం?

>> Wednesday, February 2, 2011

బ్రాహ్మణులమీద కాదు ధర్మంపైన ద్వేషం అంటూ నిన్న నేనురాసిన పోస్ట్ లో అన్నగారు మురుగేశన్ గారు ఒక కామెంట్ వ్రాసారు. దానిమీద వివరణ ఇవ్వవలసి ఉంది నేను.

சித்தூர்.எஸ்.முருகேசன் said...

అయ్యా,
//అంతిమవిజయం ధర్మానిదే .//
నేనెప్పుడు అధర్మానికే విజయమని చెప్పలేదు. ధర్మం ఏది అన్న అంశం పైనే విభేదిస్తున్నా.

//అందుకే మేము మరలా నినదిస్తున్నాం//
మీ అసలు ఉద్దేశం ఏమిటో తదుపరి వాక్యంలోనే భయిట పెట్టేరు థ్యాంక్స్.

//గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం....లోకాస్సమస్తా సుఖినోభవంతు..//

మీరు నెత్తి మీద పెట్టుకునే భగవద్గీతలో శ్రీ కృష్ణుడు సత్ బ్రాహ్మణుడ్ని - కుక్క మాంసం వండుకుని తినువాడిని సమత మమతతో చూడువాడే అభేధభావం గలవాడన్నాడు కదా..

కేవలం ఆవులకు -బ్రాహ్మణులకు శుభం జరిగి పోతే చాలనా మీ ఉద్దేశం? అదేనా మీ ధర్మం?

February 1, 2011 11:26 AM


పైన వ్యాఖ్యలో ధర్మమంటే ఏది అన్నారు. ఏదైతే మార్చటానికి వీలుకాదో అసలా అవసరమే లేదో,ఏదైతే సృష్టి వికాశానికవసరమైన సంపూర్ణ మార్గమో!.ఏ దైతే పిపీలకాది బ్రహ్మపర్యంతం పరమేశ్వర స్వరూపమనే దృష్టిని కలిగించగలదో అదిగో..అటువంటి లక్షణాలున్న నాసనాతన ధర్మమే ధర్మము . ప్రపంచాన ఈభావనతో కూడినసిద్దాంతాలన్నీ అందులో భాగాలే . సూర్య్డుడు తూర్పున ఉదయిస్తాడు అంటే అది సత్యము, దానికి సవరణలుండవు . భాషవేరైనా భావం మాత్రం మారదు అదిసత్యము. ఆధర్మానికిచెందిన నేను ఈసనాతన ధర్మాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను .

దీనిని విశ్వసించి,ఆచరించేవారిలో సాత్వికబుద్దికలిగి బ్రహ్మత్వాన్ని పొందిన మహానుభావులు,ఆదిశంకరులనుండి అవధూత మాలపిచ్చమ్మ వరకు, మహమ్మదులనుండి క్రీస్తుదేవులవరకు, ఆళ్వారులు,నాయనారులనుండి అవధూత వెంకయ్యస్వామిదాకా.రామకృష్ణుపరమహంసనుండి రమణమహర్షులదాకా, సాయినాథులవంటి సద్గురు పరంపరం నంతా మేము బ్రాహ్మణులుగా పరిగణిస్తాము . ఆస్థాయి చేరలేకపోయినా కనీసం వారిమార్గంలో పయనిస్తూ లోకక్షేమానికై పాటుపడే వారంతా ఆకోవకే చెందుతారు.

ఒకవేళ మీ మనసులో ద్వేషభావం సమూలంగా తుడిచివేయబడి మీరే ఆ పరమాత్మ చేతిలోలోకోపకారకపరికరమైనప్పుడు మిమ్మలనుకూడా బ్రాహ్మణులుగానే పరిగణిస్తాము. ఇది ఈధర్మం ప్రత్యేకత.

అందుకనే ఈధర్మం ద్వేషించదు .ప్రేమిస్తుంది ,ప్రేమించటం నేర్పుతుంది . ద్వేషించినవాల్లు ,ద్వేషిస్తున్నవాల్లెవరన్నా మీకంటబడితే వాళ్ళు కలిపురుషుని చే వంచింపబడ్డవారు మాత్రమే.

ఇక గీతాచార్యుడు చెప్పిన మహావాక్యాన్ని ఉదహరించారు.
ఇంకెక్కడన్నా అటువంటిబోధ మానవజాతికి దొరుకుతుందా ?

ఇక గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం ..........అంటే గోవులు బ్రాహ్మణుల శుభంగా ఉంటే చాలా ? అన్నారు
అవే మరి కితకితలంటే !!!!

కాలే వర్షతుపర్జన్య: పృథివీసస్యశాలినీ ....అంటూ లోకమంతా సుఖంగా ఉండాలని కోరుతూ అందుకుపాటుపడే గోమాతను,బ్రాహ్మణులను కూడా శుభంగా వర్ధిల్లమంటూ చేస్తున్న ప్రార్ధన అది. మీకు తెలియక కాదు.
ముక్కలు,ముక్కలుగా అర్ధాలుచెప్పికదా ఇప్పటిదాకా లోకాన్ని తప్పుదారిపట్టించటానికి కలి ప్రయత్నిస్తున్నది. ఎవడో అనామకుడు మాలాంటి పామరులు ఇలాంటి కుయుక్తులకు పాల్పడితే సరిదిద్దవలసిన మీవంటి పండితులుకూడా గాడితప్పితే ఎలా ??????
ఒక్కద్వేషభావం పక్కకు తప్పిమ్చి చూస్తే చాలు ఈ సనాతన ధర్మ పరమోన్నతభావం మీకు కనిపిస్తుంది. లోకబాంధవుడైన సూర్యున్ని దర్శించటానికి మన కొచ్చిన కండ్లకలక జబ్బు ఇబ్బందిపెట్టవచ్చు. అంతమాత్రం చే సూర్యదర్శనం మనకొద్దనుకుంటామా ?

ఇక చివరగా మాఉద్దేశ్యం దాచిమాట్లాడుతున్నామని ఎవరూ భావించవద్దు. అలాదాచుకోవలసిన అవసరం మాకులేదు. మేమేమన్నా ప్రపంచంలో తనధర్మం తప్పమరేదీ మిగలకూడదన్న కలిపురుషుని లక్ష్యంతో పనిచేస్తున్న మార్గావలంబకులమా? కాదే.
మేము హిందువులము అనిసగర్వంగా చెప్పుకుంటున్నాము.హిందువునని చెప్పుకోవటం..హిందువుగా జీవించటం నా పూర్వజన్మసుకృతం .
లోకమంతాశుభంగా ఉండాలని మరోమారు ...కాదుకాదు ...జీవించి ఉన్నంతకాలం కోరుకుంటూనే ఉంటాము .

Delete

Read more...

బ్రాహ్మణులపై కాదు ధర్మంపైద్వేషమే అసలు కారణం .

>> Tuesday, February 1, 2011

ఈ యుగంలో సనాతనమైన ఈ ధర్మాన్ని లేకుండా చేయాలనే సంకల్పం కలిపురుషునిది. ఇక ఆయన తయారుచేసుకున్న సైన్యం ఆయనవారసులు తమశక్తివంచన లేకుండా తమప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈధర్మం పట్ల అపనమ్మకం పెంచటం, ఈధర్మానికిచెందిన శాస్త్రాదులపై చులకన భావాన్ని పెంచి శాస్త్రజ్ఞానాన్ని క్రమేపీ తరువాత తరాలకు అందకుండా చూడటం . అలా అందజేస్తున్న వారిని ,ఆచరిస్తున్నవారిని అనేకానేక ప్రలోభాలతో ,విధ్వంశకర చర్యలతో నశింపజేయటం ,ఈ ప్రణాళికలన్నీ తరాలుగా సాగుతున్నాయి .కాకుంటే ఇప్పుడు వికృతచేష్టలుగా బయటపడుతున్నాయి.

ఇక ప్రతిసమాజం లోనూ ఉండే సామాజి విభాగాలలాగే ఈ పుణ్యభూమిలో శ్రమ విభజన వర్ణాశ్రమ రూపంలో జరిగింది. ఈ యుగధర్మాన్ననుసరించి అన్ని వర్ణాలలోనూ మంచితోపాటు చెడ్దబుద్దులతో సమాజానికి మేలు,కీడు చేసినవారున్నారు . అయితే
బ్రాహ్మణ్యం అనబడే వారిలో సాత్వికులు భగవత్ చింతనాపరులు తాము ఆకలితో,పేదరికంతో మగ్గటానికైనా సిద్దపడ్డారేకాని ధర్మాచరణను వదులుకోలేదు . కనుకనే మానవజాతిమహోన్నతస్థితిపొందటానికి మహర్షులు భగవత్ ప్రసాదితంగా పొందిన విజ్ఞానమంతా ఇంకా మనకందుతున్నది. ధర్మాచరణలేనివారిని పుట్టుకను మాత్రమే చూసి బ్రాహ్మణులుగా మన:పూర్వకంగా అంగీకరించలేదు మనసమాజం. ఆచరణరీత్యా ధార్మికులయినవారిని చూసి స్పూర్తిపొందుతూ ధర్మచ్యుతి పొందకుండా నిలబడిఉంది. అటువంటివారిని అనుసరిస్తూ వివిధసామాజికవర్గాలనుండికూడా ధార్మికులు ధర్మరక్షనకై నడుం బిగిస్తూనే ఉన్నారు.
ఇలా పరంపరానుగతంగా కొనసాగుతుంటే ధర్మధ్వంశకులు సహిస్తారా ? కనుకనే ముందుగా బ్రాహ్మణులమీద ద్వేషం వెళ్లగక్కుతారు . మానసికంగా హింసించాలనే లక్ష్యంతో పనిచేస్తుంటారు.

పోనీ బ్రాహ్మణులంతా మేము ఈధర్మాన్ని వదిలేస్తామన్నా వీళ్ళపని పూర్తికాదు. ఇంకా భగవంతునిపై విశ్వాసంతో ఈధర్మాన్ని ఆశ్రయించిన వారెవరన్నా భూమ్మీద మిగిలుంటే వాళ్ళపై గురిపెడతారు.వీల్లమాటలు జాగ్రత్తగా గమనించండి అర్ధమవుతుంది . బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణిజం నశించాలన్నిది కోరికట. అంటే బ్రాహ్మణులు అనే పేరు ఉన్నా కలిపురుషుడి మాయలకు లోబడి ధర్మచ్యుతులైనవారితో బాధలేదు . ఇంకా ఈధర్మాన్ని పట్టుకుని వేళ్లాడుతుండేవారు[వాళ్ళు పుట్టుకరీత్యా అయినా,కాకపోయినా ఆచరణరీత్యా బ్రాహ్మణులైనవారినైనా] వీళ్లను ధ్వంశం చేయాలన్నదే లక్ష్యమని స్పష్టంగా చెబుతున్నారు .ఇంకా స్పష్టం గా చెప్పాలంటే ఈ సనాతన హైందవధర్మాన్ని నశింపచేయటమే తమ అసలు లక్ష్యం . కాకుంటే వారిభాషావిన్యాసాలమాటున నేను వివరించినంత మోటుగా కాక తేనెపూసినకత్తిలా కనపడుతుంది . అసలు విషయం ధర్మాన్ని ద్వేషించటమే.

చరిత్ర మొత్తం తిరగేస్తే అధర్మానికి పాల్పడ్డవాల్లు బ్రాహ్మణులొక్కరేనా ? అన్ని వర్ణాలవారున్నారు. ఈరోజు కోట్లరూపాయల సమాజసంపదను దోచి దాచుకున్నవాల్లంతా ఎవరు బ్రాహ్మణులొక్కరేనా ?అధికారం చేజిక్కించుకుని అడ్డమైన పనులుచేస్తున్నవారంతా ఎవరు? సమాజానికి హితాన్ని కలిగించేవాడు మాత్రమే బ్రాహ్మణుడని మనసనాతన ధర్మం ఘోషిస్తున్నది నూతన తరం కూడా దానినివిశ్వసిస్తున్నది.
వేదాలగూర్చి,పురాణాలగూర్చి మనసమస్తశాస్త్రసంపదనుగూర్చి అవహేళనగామాట్లాడుతున్నా మనం ధర్మాగ్రహం చూపం. అందుకనే పదేపదే ఇలా కులచిచ్చులో వెకిలిచర్చలో లేపాలని ద్వేషాలురగల్చాలను ప్రయత్నిస్తుంటారు.

వీళ్ళు మన పక్కనే మనవారిగా ఉంటూనే , మన ధర్మధ్వంసనకోసం ప్రయత్నాలు చేస్తున్నందున వీళ్లకు రక్షణ కవచాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లకు ఈధర్మం పై విశ్వాసం లేదు. పోనీ వదిలెయ్యమనండి. దానితోపాటు ఈధర్మం వలన ఇవ్వబడ్ద కులాన్ని వదులుకోరు .ఎందుకని ? అది సామాజికంగా తమకు రక్షనకవచం కనుక. సామాజికంగా తమ బలం తగ్గకూడదు కనుక . ఇది వీళ్ళ నయవంచక నాటకం . ఈమధ్య మావాళ్ల లో ఒకాయన కనపడ్డాడు. ఆయనకు తలకెక్కిన పైత్యమంతా కక్కాడు . ఈదేశంలో బ్రాహ్మణులుచాలామోసాలు చేశారని ఈధర్మమంతా వాళ్లసృష్టని కాబట్టి వదిలివేశానని చెప్పాడు . బాగుంది ప్రస్తుతం నువ్వు ఈధర్మం పట్ల విరక్తికలిగి వదిలివేశావు .ఇక నీకు దీని సంబంధించిన అవశేషాలు మాత్రం ఎందుకు ? నేను పలానా కులం వాడిని అని చెప్పుకోవటం మాత్రం ఎందుకు ? దాన్నికూడా వదిలివెయ్ ! అన్నాను . అట్లెట్లాకుదురుద్ది .అని జారుకున్నాడాయన .
సామాజికసౌకర్యం కోసం నాడెప్పుడొ ఏర్పరచుకున్న కులాలు కాలప్రవాహంలో మంచివాల్లతోనూ చెడ్దవాల్లతోనూ నిండిపోయాయి. అవి లక్ష్యానికి వికృతిగా మారి సమాజానికి నష్టం కలిగిస్తే వాటిని సంస్కరించుకోవాల్సినది మనమే, దానికి ధర్మమెలా కారణమవుతుంది ? ఇక ధర్మద్వేషులు దీన్నొక ఆయుధంగా మలచుకోవటానికి మాత్రం అనుకూలంగా మారింది. కొందరు ఇతరులపై ద్వేషాన్నిచిమ్మేది సమాజంపట్ల ప్రేమతో అని చెప్పుకున స్వయంప్రకటిత సంస్కర్తలుంటారు . ఒకపక్క విషం చిమ్ముతూ .అది సమాజానికి ఔషధం .మీరు నమ్మాలి నమ్మమంటారు.
మనసునిండా కుళ్ళునింపుకుని సమాజంపట్లప్రేమ కలిగి ఉన్నాని ప్రకటించుకున్నంతమాత్రాన పవిత్రులవుతారా ?మనం వీళ్ల కుయుక్తులు గమనిస్తున్నామని తెలిస్తే చాలు మేము ఈధర్మం లోనేకాదు ఇతరచోట్లకూడా ఇలానే పోరాడతామంటారు. కానీ ఇతర ధర్మీయులపట్ల వీల్లేదన్నా వ్యాఖ్యానం చేసేప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాటలు పేర్చుకుంటారు. [మీరు పరీక్షించి చూడండి . మీకే తెలుస్తుంది] . ఎందుకయ్యా ! అంటే , ఎన్నన్నాగానీ సహనము ,క్షమాగుణము కలిగినది హిందువులకే . అదే ఇతరులపట్ల ఇలామాట్లాడితే వీళ్ళకు కపాలమోక్షం తప్పదు అనేసత్యం బాగా తెలుసు.

ధర్మద్వేషులారా ! యుగధర్మాన్ననుసరించి మీకుయుక్తులు కొంత విజయవంతమైనట్లు కానరావచ్చు. కానీ అంతిమవిజయం ధర్మానిదే .
అందుకే మేము మరలా నినదిస్తున్నాం
గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం....లోకాస్సమస్తా సుఖినోభవంతు..

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP