అంజనేయ విగ్రహనికి పాము రక్షణ
>> Friday, February 18, 2011
ఆగిరిపల్లి, ఫిబ్రవరి 17 : అందరికీ రక్షణ కల్పించే ఆంజనేయ స్వామికే రక్షణగా నిలిచి ఓ పాము అందరిని విస్తుపోయేలా చేసింది. కృ ష్ణాజిల్లా ఆగిరిపల్లి శోభనగిరి కొండ పైకి వెళ్ళే మెట్ల మార్గంలోని ఆంజనే య స్వామి గుడిలో జరిగిన ఈ విం త సంఘటన వివరాలు ఇలా ఉన్నా యి. మెట్ల మార్గంలో ఉన్న ఆంజనే య స్వామి గుడిలో విగ్రహాన్ని తొలగించి, సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆగిరిపల్లికి చెందిన వ్యాపారి మడుపల్లి నారాయణరావు సంకల్పించారు. గురువారం ఉదయం ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించేందుకు ఆరుగురు కూలీలను పురమాయించారు.
వారు గుడిలోకి అడుగు పెట్టడంతోనే నాగుపాము పడగ విప్పి ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ తిరుగుతూ బుసలు కొడుతూ కూలీలను లోనికి రానివ్వకుండా అడ్డుపడింది. రెండు గంటల పాటు ప్రయత్నించినా పాము అలాగే బుసలు కొడుతుండడంతో కూలీలు వెళ్ళి పోయారు. తర్వాత పాము గుడిలోనే ఓ మూలన పడుకుంది. ఈ సంఘటనను తిలకించేందుకు జనం బారులు తీరారు. ఇది దైవ సంకల్పం అని భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. భక్తులు గుడిలో పడుకున్న పాము దగ్గరకు వెళ్ళినా ఏమి చేయక పోవటాన్ని విశేషంగా చెపుతున్నారు. కొం దరు భక్తులు ఏకంగా పాముకు పాలు, ప్రసాదాలు అందిస్తున్నారు.
[ ఈ రోజు ఆంధ్రజ్యోతి లో ని వార్త]
మూగజీవులకున్న నిబద్దత మనకులేదు .
1 వ్యాఖ్యలు:
శ్రీ కాళహస్తి ఆలయ చరిత్ర ద్వారా ......... మూగజీవులు తమ దైవభక్తిని ప్రదర్శించటం మనం విన్నాము. ఈ రోజుల్లో కూడా , ఇలాంటి సంఘటనల ద్వారా ....... జంతువుల, పక్షుల యొక్క దైవ భక్తి ప్రపంచానికి వెల్లడవుతోంది. ఇలాంటి విషయాలు తెలుపుతున్నందుకు కృతజ్ఞతలండి......
Post a Comment