పెళ్లికాని పూజారులు! [ఈవార్తను చదవండి ]
>> Thursday, February 3, 2011
నిన్న ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో పూజారుల దీనస్థితిని గూర్చి తెలుపుతూ వ్రాసిన వార్త ఇది.చదివి ఆలోచించండి.
https://www.andhrajyothy.com/
మొన్నామధ్య మీరందరూ ఆర్జితసేవలు నిలిపేసి, గుడులకు తాళాలు వేసి ధర్నా చేశారెందుకు?
సత్యనారాయణ శర్మ: ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాం...ప్రభుత్వం మా బాధల్ని పెడచెవిన పెడుతోందే తప్ప మా గురించి పట్టించుకోవడం లేదు. నేను కీసరగుట్ట దేవాలయంలో వేదపండితుడిగా పనిచేస్తున్నాను. దేవాదాయశాఖ ఆధీనంలో పనిచేస్తున్న పూజారులకు వేతన విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది.
అన్ని డిపార్టుమెంటులలో ఐదేళ్లకొకసారి వేతన సవరణ జరుగుతుంది కాని మా శాఖలో అలాంటిదేమీ లేదు. కొన్ని గుడులలో అర్చకులకి జీతాలు నాలుగు నెలలకొకసారి, ఐదునెలలకొకసారి ఇస్తున్నారు. అలాకాకుండా రాష్ట్రంలో ఉన్న గుడులన్నింటి నుంచి కొంత ఆదాయం తీసి ఒక ధార్మిక నిధిని ఏర్పాటుచేసి అందులోనుంచి పూజారులందరికీ జీతాలు ఇవ్వాలని మా విన్నపం. కొన్నేళ్లకింద ఈ విషయంపై చట్ట సవరణ కూడా జరిగింది. పెద్దఎత్తునే పోరాటాలు కూడా చేశాం. కాని దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. దానికన్నా ప్రధానమైనది పెన్షను.్ల కొన్ని పెద్ద పెద్ద గుడులలో అర్చకులకు తప్ప పూజారులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదు.
రామకృష్ణాచార్యులు: ఉద్యోగాలు చేసే అర్చకుల గురించి చెబుతున్నారు మీరు... కొన్ని ప్రాంతాల్లో అర్చకులకి గుడిమాన్యం నుంచి జీతం ఇస్తారు. అంటే ఏడాదికొకసారి పంట వచ్చినపుడు జీతం ఇస్తారు. వానలు, వరదలు వస్తే అదీ ఉండదు. అప్పటివరకూ ఆ అర్చకుడి పొట్ట గడిచేదెలా? గుడిలో పూజారి టైమింగ్స్ ఏంటి? సత్యనారాయణ శర్మ: ఊర్లో అందరికంటే ముందు లేచేవాడు అర్చకుడు. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం ముగించుకుని గుడిలో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాలి. పొద్దున నాలుగింటికి పనులు మొదలైతే పన్నెండింటివరకూ ఊపిరి చెలపదు. మళ్లీ సాయంత్రం ఐదింటికి మొదలైతే రాత్రి ఎనిమిదీ తొమ్మిదింటి వరకూ అర్చకుడు బిజీగానే ఉంటాడు.
లక్ష్మీ వరప్రసాద్ ఆచార్యులు: పెద్ద గుడైతే పద్ధతులు వేరుగా ఉంటాయి, చిన్న గుడికి వేరుగా ఉంటాయి. నేను ఇక్కడ నాగారంలోని వేంకటేశ్వర దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. మాది ప్రైవేట్ యాజమాన్యంలోని గుడి. దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఆలయాల్లో మాత్రం టైమింగ్స్, షిఫ్ట్స్ ఉంటాయి. మాకు అలా ఉండవు.
అర్చకుల సంపాదన ఎలా ఉంటుంది?
సత్యనారాయణ శర్మ: పెద్ద పెద్ద గుడుల్లో అర్చకులకి జీతాలు ఉంటాయి. ప్రైవేటు గుడుల్లో అయితే పిండి కొలదీ రొట్టె. గుడి స్థోమతని బట్టి వేతనాలు ఉంటాయి. మన రాష్ట్రంలో మొత్తం 37 వేల గుడులు ఉన్నాయి. వీటిలో ప్రైవేటు గుడులే ఎక్కువ. మీకు వేలు సంపాదించే అర్చకుల గురించే తెలుసు. కాని కొన్ని గ్రామాల్లో అర్చకులు హారతిపళ్లెంలోని డబ్బులతోనే బతుకుతున్నారు. డబ్బులున్నాయి కదా అని కొందరు, మొక్కులు ఉన్నాయని కొందరు చిన్న చిన్న గుడులు కట్టేసి వదిలేస్తున్నారు.సత్యనారాయణ శర్మ: ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాం...ప్రభుత్వం మా బాధల్ని పెడచెవిన పెడుతోందే తప్ప మా గురించి పట్టించుకోవడం లేదు. నేను కీసరగుట్ట దేవాలయంలో వేదపండితుడిగా పనిచేస్తున్నాను. దేవాదాయశాఖ ఆధీనంలో పనిచేస్తున్న పూజారులకు వేతన విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది.
అన్ని డిపార్టుమెంటులలో ఐదేళ్లకొకసారి వేతన సవరణ జరుగుతుంది కాని మా శాఖలో అలాంటిదేమీ లేదు. కొన్ని గుడులలో అర్చకులకి జీతాలు నాలుగు నెలలకొకసారి, ఐదునెలలకొకసారి ఇస్తున్నారు. అలాకాకుండా రాష్ట్రంలో ఉన్న గుడులన్నింటి నుంచి కొంత ఆదాయం తీసి ఒక ధార్మిక నిధిని ఏర్పాటుచేసి అందులోనుంచి పూజారులందరికీ జీతాలు ఇవ్వాలని మా విన్నపం. కొన్నేళ్లకింద ఈ విషయంపై చట్ట సవరణ కూడా జరిగింది. పెద్దఎత్తునే పోరాటాలు కూడా చేశాం. కాని దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. దానికన్నా ప్రధానమైనది పెన్షను.్ల కొన్ని పెద్ద పెద్ద గుడులలో అర్చకులకు తప్ప పూజారులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించడం లేదు.
రామకృష్ణాచార్యులు: ఉద్యోగాలు చేసే అర్చకుల గురించి చెబుతున్నారు మీరు... కొన్ని ప్రాంతాల్లో అర్చకులకి గుడిమాన్యం నుంచి జీతం ఇస్తారు. అంటే ఏడాదికొకసారి పంట వచ్చినపుడు జీతం ఇస్తారు. వానలు, వరదలు వస్తే అదీ ఉండదు. అప్పటివరకూ ఆ అర్చకుడి పొట్ట గడిచేదెలా? గుడిలో పూజారి టైమింగ్స్ ఏంటి? సత్యనారాయణ శర్మ: ఊర్లో అందరికంటే ముందు లేచేవాడు అర్చకుడు. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం ముగించుకుని గుడిలో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాలి. పొద్దున నాలుగింటికి పనులు మొదలైతే పన్నెండింటివరకూ ఊపిరి చెలపదు. మళ్లీ సాయంత్రం ఐదింటికి మొదలైతే రాత్రి ఎనిమిదీ తొమ్మిదింటి వరకూ అర్చకుడు బిజీగానే ఉంటాడు.
లక్ష్మీ వరప్రసాద్ ఆచార్యులు: పెద్ద గుడైతే పద్ధతులు వేరుగా ఉంటాయి, చిన్న గుడికి వేరుగా ఉంటాయి. నేను ఇక్కడ నాగారంలోని వేంకటేశ్వర దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాను. మాది ప్రైవేట్ యాజమాన్యంలోని గుడి. దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఆలయాల్లో మాత్రం టైమింగ్స్, షిఫ్ట్స్ ఉంటాయి. మాకు అలా ఉండవు.
అర్చకుల సంపాదన ఎలా ఉంటుంది?
దేవుడికి తప్పినా, భక్తుడికి తప్పినా...పూజారికి తప్పదు కదా! పుణ్యం కోసమో దేనికోసమో దమ్మిడీ ఆదాయం లేని గుడిలో సైతం దీపం ఉంచుతాడు. చాలామంది భక్తులు దాన్ని గమనించరు. రామకృష్ణాచార్యులు: నా గురించి చెబితే మీకు విషయం బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ అయ్యప్పకాలనీలో ఆంజనేయస్వామి గుడిలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. నెలకి రెండువేలు జీతం ఇస్తున్నారు. ఈ రోజు భార్యాపిల్లల్ని పోషించాలంటే నెలకి పదివేల రూపాయలు అవసరం. మరి రెండువేల రూపాయలతో ఎలా బతకాలి. అందుకే ఆటో నడుపుకుంటాను. పొద్దునా సాయంత్రం స్కూలుపిల్లల్ని తీసుకొచ్చేపని చేసుకుని పొట్టగడుపుకుంటున్నాను.
ఏడాదిలో ఎన్ని సెలవులు తీసుకుంటారు?
సత్యనారాయణ శర్మ: దేవుడికి సెలవులు ఉంటాయా? ఉండవు. ఇక అలాంటపుడు అర్చకుడికి సెలవులు ఎక్కడ ఉంటాయి? రామకృష్ణాచార్యులు: ఎందుకు ఉండవు...గ్రహణం పట్టినపుడు సెలవే కదా!(నవ్వుతూ..) సత్యనారాయణ శర్మ: ఎప్పుడు పడుతుందేమిటి? వారానికొకసారా, నెలకి నాలుగుసార్లా...పోయినేడాది మన దగ్గర రెండుసార్లే వచ్చిందండి గ్రహణం. ఆ రోజున మాత్రం గుడి తలుపులు మూసేసి ఉంటాయి కాబట్టి, మాకు రెస్ట్ అన్నమాట. రెండు సందర్భాల్లో పర్సనల్ లీవులు తీసుకుంటాం. అవి..ఒకటి ఇంట్లో ఎవరైనా చనిపోతే మైల సెలవులు, పురుడు వస్తే పురిటి సెలవులు.
లక్ష్మీ వరప్రసాద్ ఆచార్యులు: పెద్ద గుడుల్లో పనిచేసేవారికి మైల సెలవులు పెట్టుకోడానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి షిఫ్ట్‌లు మార్చుకోవడం, మరో ప్రాంతం నుంచి రప్పించడం వంటివి ఉంటాయి. కాని మాలాంటి ప్రైవేటు గుడుల్లో పనిచేసే అర్చకులకి మాత్రం అది పెద్ద నరకం.
తనవారు పోయిన బాధకంటే గుడిలో మా స్థానంలో పెట్టాల్సిన పూజారి గురించే బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ పది రోజులు మా గుడిలో ఉండటానికి అర్చకుడ్ని మేమే వెతుక్కోవాలి. గుడిలో ఉండే చీపురు కట్ట దగ్గర నుంచి దేవుడి మెడలో ఉండే ఆభరణాల వరకూ మాదే బాధ్యత కాబట్టి ఆ పది రోజులు మేము పెట్టిన పూజారిని మేమే కనిపెట్టుకుని కూర్చోవాలి.
మీ కట్టుబాట్లు ఎలా ఉంటాయి? మీరు బయట హోటళ్లకు, సినిమాలకు వెళుతుంటారా?
సత్యనారాయణ శర్మ: ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. అయితే అర్చకుడికి అది చాలా తక్కువగా ఉంటుంది. సినిమాలు చూడలేడు, సరదాగా బయటికి వెళ్లి పార్కుల్లోనో, హోటళ్ళలో రిలాక్స్ అవ్వలేడు. సరదాగా వెళ్లే విహారయాత్రలకు కూడా ఫ్రెండ్స్ తీసికెళ్లరు. నిజం చెప్పాలంటే అవన్నీ మేము చేయకూడని పనులే.
అర్చకుడు అంటే కేవలం భగవంతున్ని సేవించేవాడు. భార్యా పిల్లలు మినహాయిస్తే అంతా భగవంతుని సన్నిదిలోనే కాలక్షేపం చేయాలి. ఈ విషయాల్లో కొందరు చాలా నిష్టగా ఉంటారు. కొందరు కాస్త ఆకతాయిగా ఉంటారు. రామకృష్ణాచార్యులు: సమయం ఎక్కడ ఉంటుందండి. అయినా సరదాగా అలా బంధువుల ఇంటికి భోజనానికి వెళదామంటేనే కుదరదు. ఆ విషయం అలా ఉంచండి. మేము అర్చకులం కాబట్టి మా పద్ధతులు మాకుంటాయి. రోజూ గుడిలో పూజ చేసే పూజారి పక్కనే ఉన్న థియేటర్లో కనిపించాడనుకోండి...జనం ఊరుకుంటారా(నవ్వుతూ...)
సర్వణసాయి శర్మ: నాకైతే సినిమాలు చూడాలని, షికార్లకి వెళ్లాలని ఉండదు. సమయమంతా గాయిత్రీదేవి ఆలయంలోనే సరిపోతుంది. కాని అందరూ ఒకేలా ఉండరు కదా! దీన్ని కేవలం ప్రొఫెషన్‌గా భావించి వచ్చినవారు కట్టుబాట్లకి కట్టుబడి ఉండలేరు కదా! లక్ష్మీ వరప్రసాద్ ఆచార్యులు: ఎందుకు ఉండలేరు? ఉండకేం చేస్తారు. అయినా ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు కానీ....అర్చకులు ఎదుర్కొనే పెద్ద సమస్య ఒకటి ఉందండి. అర్చకత్వం చేసే యువకులెవ్వరికీ కొన్నాళ్ల నుంచి పెళ్లిళ్లు కావడం లేదు. మమ్మల్ని బాధిస్తున్న మరో సమస్య అది.
పెళ్లిళ్లు కాకపోవడం ఏంటి?
సత్యనారాయణ శర్మ: పదేళ్ల నుంచి వాతావరణం మారిపోయింది. మా కులంలో ఉండే అమ్మాయిలు డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోతున్నారు. పిలక వేసుకునే అర్చకుడ్ని చేసుకోవడానికి ఏ అమ్మాయి ఇష్టపడడం లేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రధానమైనవి రెండు. ఒకటి చదువు, మరొకటి సౌఖ్యం. ప్రతి అర్చకుడూ 'మాలా మంత్రాలు చెప్పుకుంటూ బతక్కూడదు మా పిల్లలు. పెద్ద చదువులు చదువుకుని కంప్యూటర్ ముందు కూర్చునే ఉద్యోగం చేయాలి' అని కలలు కంటున్నారు.
కనడమేమిటి నిజం చేసుకుంటున్నారు కూడా. దీంతో అబ్బాయిల విషయం పక్కన పెడితే...అమ్మాయిలందరూ చక్కగా చదువుకుంటున్నారు. ఆ చదువులు కూడా ఇంగ్లీషు మీడియం. వారికి మంత్రాలు కాదు కదా తెలుగు క్యాలెండరు చూసి తిథి చెప్పడం కూడా రాదు. మరి అలాంటి పిల్లలకి పెళ్లిళ్లు చేయాలంటే ఆ స్థాయిలో చదువుకుని పెద్ద ఉద్యోగం చేసే అబ్బాయిలు కావాలి. ఇలా అర్చకత్వం చేసే యువకులు వారి దృష్టిలో ఉండరు. ఒకవేళ అర్చకవృత్తిపై అభిమానంతో, గౌరవంతో పెద్దలు ఇష్టపడ్డా అమ్మాయిలు మాత్రం ఆమడదూరం పరిగెడుతున్నారు. ఇదిగో చక్కని రూపు, సరిపడా సంపాదన ఉండి కూడా మా లక్ష్మీ వరప్రసాద్ ఆచార్యులకి ఒక్క సంబంధం రావడం లేదు.
లక్ష్మీ వరప్రసాద్ ఆచార్యులు: ఏ సమస్యకైనా కారణం ఉంటుంది. ఇక్కడ మేము ఎదుర్కొంటున్న సమస్యకి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఇందాక మేము చెప్పిన మా పర్సనల్‌లైఫ్ విషయాలు వింటే మీకు ఏం అర్థమైంది. మిగతావారికుండే సరదాజీవితం మాకు ఉండదు. రేపు నన్ను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి కూడా మాతోబాటు అన్నీ వదులుకుని బతకాలి.
నేను పొద్దున నాలుగింటికల్లా లేచి ఇంట్లో పనులు మొదలుపెడతాను. ఉత్సవాలు ఉన్నప్పుడయితే రెండింటికే లేవాలి. ఎప్పుడూ దేవుడు, పూజలు, భక్తులు, గుడి..అంతే. వారి కోసం మేము ఎక్కువ సమయం కేటాయించలేం. మమ్మల్ని చేసుకుంటే ఎన్ని తిప్పలుపడాలో మా ఇళ్లలో అమ్మాయిలకు తెలుసు. అందుకే ఎందుకొచ్చిన గొడవ...హాయిగా ఉద్యోగం చేసుకునేవాడ్ని చేసుకుంటే పోలా అనుకుంటారు(నవ్వుతూ...)
సత్యనారాయణ శర్మ: లేదు..లేదు ఇది నవ్వడం కోసం చెప్పుకునే విషయం కాదు. బయట సమాజంలో అర్చకుడికి పని పెరిగిన మాట వాస్తవమే. కాని రోజురోజుకీ వీరి పట్ల అమ్మాయిలకుండే అభిప్రాయం బలపడడం దురదృష్టకరం. ఖచ్చితంగా చెప్పేస్తున్నారు... అర్చకుడ్ని పెళ్లిచేసుకోవడం మా వల్లకాదని. దాంతో నలభైఏళ్లు వచ్చినా పెళ్లిళ్లు కాని వారు చాలామంది ఉన్నారు. ఏంచేస్తారు మిగతావారిలా పరకులంవారిని చేసుకోలేరు కదా.
రామకృష్ణా చార్యులు: అవును ఇష్టపడ్డా చేసుకోలేరు. ఎందుకంటే శాస్త్రం ఒప్పుకోదు. సత్యనారాయణశర్మ: శాస్త్రం సంగతి పక్కనపెట్టు చుట్టూజనం ఒప్పుకుంటారా....'పూజారికేం పోయేకాలం వచ్చింది...ఫలానా అమ్మాయిని లేపుకుపోయాడంట' అని గ్రామపొలిమేర వరకూ తరిమికొడతారు(నవ్వుతూ...)
జూ భువనేశ్వరి
ఫోటోలు: సురేష్‌వర్మ
3 వ్యాఖ్యలు:
There won't be any improvement in the situation of "Pujari or Archak" until there is single organization to manage all Hindu institutions and allocate resources (money collected at Temples and Temple Wealth) appropriately.
1) First create a centralized organization.
2) Set priorities
3) Create supportive institutions
4)
@"పెళ్లికాని పూజారులు!
హ్మ్ ..అర్చకత్వ౦ బ్రాహ్మలు మాత్రమే చేసే రోజులు కావేమో ము౦దు ము౦దు ..
పెళ్ళిళ్ళు చెయ్యడానికి, ఊరి కొక బ్రాహ్మడు ఉ౦డేవారు ఇదివరలో ..ఇప్పుడు ..౪ ఊర్లకు ఒకరు ..ము౦దు ము౦దు జిల్లా కి పది మ౦ది ఉ౦టారేమో ...
అర్చకుల సమస్యలను మీ ఇంటర్వ్యూ ద్వారా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అర్చకులు కనీస వేతనానికి అర్హులు కారా! కనీసవేతనం రాష్ట్ర ప్రభుత్వ గుమాస్తా వేతనానికి సమంగా చేయాలన్న కనీస జ్ఞానం ఎండోమెంట్స్ శాఖ అధికారులకు కలగాలని ఆశిద్దాము.
మంచి పోస్ట్. వేతన కమిషన్‌కు దృష్టికి తీసుకెళ్ళాలి.
Post a Comment