శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పాఠ్యాంశంగా వివేకానందుడి బోధనలు కూడదట ! ఇదెక్కడి ఖర్మ ?

>> Monday, February 28, 2011

వివేకానందుడి బోధనలు పాఠ్యాంశాలుగా పెట్టకూడదట .ఈరోజు వచ్చిన ఈవార్తను చూడండి.

------------------------------------

పాఠ్యాంశంగా వివేకానందుడి బోధనలా: యూటీఎఫ్

హైదరాబాద్, ఫిబ్రవరి 27 : ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీఓ నంబర్ 16 ద్వారా స్వామి వివేకానంద జీవితం, బోధనలను ఉపవాచకంగా ప్రవేశపెట్టాలని ఆదేశించడం సరైన చర్య కాదని యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.నారాయణ, ఐ.వెంకటేశ్వరరావులు పేర్కొన్నారు. దానివల్ల ఒక మత సారాన్ని విద్యార్థులపై రుద్దినట్లవుతుందని తెలిపారు.

--------------------------------------------------------------

ప్రపంచవ్యాప్తంగా భారతదేశమంటే గుర్తొచ్చే మహానుభావులలో మొదటివరుసలో కనపడే మహనీయుడు వివేకానందులవారు. నిర్వీర్యమవుతున్నజాతిని మేల్కొల్పి శక్తివంతులనుచేశాయి ఆయనబోధలు. ముఖ్యంగా ఈనాటి యువతకు ఆయన బోధలు ఎంతో అవసరం . జాతిని చైతన్యవంతం చేయగల ఈయన బోధలు మనకు వద్దని వారించే వారి ఉద్దేశ్యమేమిటో నాకర్ధం కావటం లేదు . కాషాయరంగు బట్టలు కట్టాడుకనుక ఈయన హిందువు కనుక ఈయన చేప్పే మాటలు ఎంతగొప్పవైనా పిల్లలకు చెప్పకూడదనా వీరి ఉద్దేశ్యం ? ఆయనబోధలు చదివారా మీరు? ఆయనమాట్లాడినవన్నీ ఒకమతాన్ని ఇతరులమీదకు రుద్దేవిగా ఉంటాయా ? !!

అయ్యా ! నేను ఓ చిన్న ప్రశ్న అడుగుతున్నాను . మదర్ థెరిస్సా వేషధారణ క్రైస్తవవాన్ని సూచిస్తుంది . ఆమె ఒంటిపై శిలువ గుర్తు కనపడుతుంది. కానీ మాకు ఆమెగూర్చి ఇచ్చిన పాఠ్యాంశాలుచదివినా చెప్పినా మానవీయ విలువలే కనపడ్డాయిగాని.ఇలాంటి మానసిక వైకల్య భావనలు కనపడలేదే ! ?

ఏమి మాట్లాడుతున్నారు మీరు ? ఎవరిని సంప్రదించి నిర్ణయించుకుని మాట్లాడుతున్నారు మీరు .నేనుకూడా యూటీఎఫ్ సభ్యుడినే . ప్రతిసంవత్సరం చందా చెల్లించి సభ్యునిగా కొనసాగుతున్నాను. మీరు ఈమాటమాట్లాడదలచుకున్నప్పుడు కనీసం జిల్లాబాధ్యులను సంప్రదించారా ? నేనైతే నాదేశాన్ని ,ఈదేశాన్ని చైతన్యవతం చేసిన ,మానవీయ విలువలను బోధించిన మహానుభావులందరినీ గౌరవిస్తాను . ఈ ప్రకటనను నేను గర్హిస్తున్నాను .

7 వ్యాఖ్యలు:

Anonymous February 28, 2011 at 11:11 AM  

swaamiji,

This is the pitiable state of 'hindu dharma' ( although there is no hindu but only sanaathana dharma) in India. Its unfortunate that secularism means anti-hindu! Anything related to the mother of the world religions is anti for secularism ! Pity them for they know not what they are doing! When a time comes that 'Hindu Dharma' gets re-planted from 'American Mouth' then probably (hopefully) indian mentality will change from anti-hindu to favourable acceptance!

cheers
zilebi.
http://www.varudhini.tk

Anonymous February 28, 2011 at 1:54 PM  

They (anti-Hindus) are very well organized. They hide their real faces and use poison-tipped-tongues to twist facts.

Individually or semi-organized Hindus are no match for them.

Full time, paid, practicing Hindu intellectuals/leaders must lead organizations to defend Hindu causes.

చిలమకూరు విజయమోహన్ February 28, 2011 at 3:38 PM  

ప్రపంచంలోని తేజోరాశిని తీసుకొనిరండు! వెలుగు ప్రతివానికి లభించేట్లు ఒనర్చండి.ప్రతి ఒకరు బ్రహ్మాన్ని చేరేవరకు ఈ కర్తవ్యం పూర్తికాదు.పేదవారికి వెలుగును చేకూర్చండి భాగ్యవంతులకు ఇంకా ఎక్కువ చేకూర్చండి.ఎందుకంటే పేదవారికన్నా వీరికే ఎక్కువగా వెలుగు కావలసింది. చదువురానివారికి వెలుగును సమకూర్చండి.చదువుకున్నవారికి ఇంకా ఎక్కువ వెలుగు సమకూర్చండి.ఎందుకంటే ఈ కాలం చదువులచే కలిగే దురభిమానాలు అపారాలు.కావున అందరకు వెలుగును సమకూర్చి తక్కిన పనిని వంతుడికి వదలివేయండి.

చిలమకూరు విజయమోహన్ February 28, 2011 at 3:43 PM  

చదువుకున్నవారికి ఎక్కువ వెలుగును సమకూర్చే ఆవశ్యకతను స్వామి వివేకానంద తెలిపారు.ఎందుకంటే,నేటి చదువులు దురభిమానాన్ని,దురహంకారాన్ని పెంచుతవి,హృదయాన్ని ఉజ్జ్వలం చేయవు.విద్యావిహీనులకు వెలుగు అవసరమైతే విద్యావంతులకు దాని అవసరం మిక్కుటమనే ఈ భావాన్ని ఇలాంటివారిని ఉద్దేశ్యించే కాబోలు ఆనాడే స్వామి వివేకానంద చెప్పారు.

Saahitya Abhimaani February 28, 2011 at 5:13 PM  

వాళ్ళ ఉద్దేశ్యంలో మావో సూక్తులు, లెనిన్ ప్రసంగాలు ఉపవాచాకాలుగా ఉంచితే బాగుంటుందేమో.

"...ఎవరిని సంప్రదించి నిర్ణయించుకుని..." అందరికీ తెలుసు వాళ్ళు ఎవరిని సంప్రదించి, ఎవరి ప్రోద్బలంతో ఇటువంటి ప్రకటనలు చేస్తారో. మీ వంటి సభ్యులు పేరుకు మాత్రమె, మీరు కట్టే డబ్బులు కావాలి కాని, మీ భావాలు, మీ భావ స్వాతంత్రం వాళ్లకి అక్కర్లేదేమో ఒకసారి ఆలోచించి, తగిన నిర్ణయం తీసుకోండి.

వ్యక్తిత్వ వికాసానికి వివేకానందుని రచనలు ఉపవాచకంగా ప్రభుత్వం ఉంచటం ఎంతైనా సముచితం, వారు తీసుకున్న ఈ చక్కటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను.

Bhardwaj Velamakanni February 28, 2011 at 5:51 PM  

They just want to oppose whatever is Indian - after all, they are the traitors of the first kind!

తాడేపల్లి March 1, 2011 at 12:59 AM  

నేను వారి యొక్క జీమెయిల్ చిరునామాకు పంపిన వేగు పాఠం ఈ కింద ఇచ్చాను :

ఆర్యా ! నమస్కారములు.

మీ ఉపాధ్యాయసంఘంవారు వివేకానందుని బోధలకు మత రంగు పులిమి అవి పాఠ్యాంశాలుగా వద్దంటున్నట్లు వార్త లొచ్చాయి. దీన్నిబట్టి చూస్తే బహుశా మీది ఏదో ఒక కమ్యూనిస్టు సంఘంలా అనిపిస్తున్నది. ఈ రకమైన డిమాండ్లు ఆ తరహా మనుషుల నుంచే వస్తూండడం అనుభవసిద్ధం. ఇదివఱకు చాలాసార్లు ఆయన జీవిత చరిత్రనీ, బోధనల్నీ పాఠ్యాంశాలుగా నిర్ణయించిన సందర్భాలున్నాయి. అప్పుడు ఏ అభ్యంతరాలూ రాలేదు హైందవేతరుల నుంచి కూడా ! మఱి ఇప్పుడు హిందువులైన మీరెందుకు మతరంగులు పులిమి వ్యతిరేకిస్తున్నారు ? ధనసంపాదనా, కామవాంఛా తప్ప ఇంకేమీ లేని మన విద్యావ్యవస్థలో ఉపాధ్యాయుల్లోనూ, విద్యార్థుల్లోనూ నైతిక విలువల్ని పెంపొందించడానికి మీ దగ్గఱ ఉన్న మేల్తరమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమిటి ? మీరూ, నేనూ నీతులు చెబితే, లేదా పుస్తకాలు వ్రాస్తే ప్రజలు వింటా రనుకుంటున్నారా ? అందుకు ఒక మహనీయుడు కావాలి. అదే ఒక మహాత్మాగాంధీ, వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణమహర్షి, సాయిబాబా ! మన నీతి మన దేశంలో, మన మధ్య, మన పరిస్థితుల్లో పుట్టినదై ఉండాలి. వేఱే దేశాల నుంచి అరువు దెచ్చుకున్నదై
ఉండకూడదు. బయటివాళ్ళ చొక్కాలు మనకు సరిపోవు. అందుకనే దేశీయ మహాత్ముల బోధల్ని పిల్లలకు పరిచయం చేయడం.

ఈ సందర్భంగా నా వైపునుంచి కొన్ని ప్రశ్నలు :-

౧. వివేకానందుడు ఏమైనా భారతప్రభుత్వం చేత నిషిద్ధ వ్యక్తిగాప్రకటించబడ్డాడా ?

౨,. లేక ఆయన రచనలు నిషిద్ధమా ?

౩. ఆయన రచనలో "ఇది అభ్యంతరకరం" అని కనీసం ఒక్క పుటని మీరు ఎత్తిచూపగలరా ?

౪. ఆయన బోధల వల్ల గతంలో మతసామరస్యం పాడయినట్లు ఆధారాలేమైనా ఉన్నాయా ?

వీటన్నింటికీ సరిగ్గా సమాధానం చెప్పండి. నాకు చెప్పడం కాదు. ముందుమిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

నా మాటల్లోని స్వారస్యాన్ని గ్రహించి మీరు ఇహనైనా ఇలాంటి విషయాల్లో విజ్ఞతతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP