ధర్మమార్గంలోకి అడుగిడిన విదేశీయ భక్తుడు
>> Friday, February 18, 2011
సగం మతిచెడ్ద మనపిల్లలు కొందరు మొన్న పదునాల్గునాడు విదేశీసంస్కృతిని అవలబించుకోవటం ఫాషన్గా భావించి పబ్బులమ్మటి ఊరేగితే
ఈ ధర్మంలో ఉన్న విశిష్టతను తెలుసుకుని సంపూర్ణమానవునిగా మారటం ఈధర్మమార్గంలోనే ఉన్నదని నమ్మి తాను హిందువుగా మారి"అసతోమా సద్గమయ,తమసోమా జ్యోతిర్గమయ,మృత్యోర్మా అమృతంగమయ" అంటూఈధర్మం లోకి అడుగిడిన న వైనం సన్నివేశం చూడండి .
అగ్నిసంస్కారం జరిపి ఆయనను సనాతనధర్మం లోకి ఆహ్వానించారు.
4 వ్యాఖ్యలు:
దుర్గేశ్వర గారు,
1) హిందూ మతంలోకి శాస్త్రోక్తంగా చేరడం కూడా వుంటుందా? ఆ పద్ధతులేవి? అలా చేరిన వారు వున్నారా?
2) ఆ ఫోటోలో క్రైస్తవుడు ఏ కులంలోకి మారుతున్నట్టు, బ్రాహ్మణ/క్షత్రియ/వైశ్య?
ఆర్యసమాజం వారు స్వాతంత్ర్యపూర్వంనుంచి కూడా ఈవిధమైన ప్రక్రియద్వారా హైందవంలోకి రావాలనే కోరిక ఉన్నవారికి సంస్కారాలు జరుపుతున్నారు.
ఇక మీరు గమనించవలసిది ఏమిటంటే ఆయన వచ్చింది ఈ ధర్మంలోకి అంతేకాని కులాలలోకి కాదు.
దుగ్గేశ్వర్ గారూ,
కొంచెం కంఫ్యూజన్ గా ఉంది. ధర్మం లోకి మారడం వేరే, మతం లోకి మారడం వేరేనా..? హిందూ ధర్మం వేరే, హిందూ మతం వేరేనా..? దయచేసి వివరించగలరని మనవి.
అజ్ఞాగారూ
ఇంత మంచి ప్రశ్నవేసినందుకు చాలా సంతోషం .
ముందుగా మతం అంటే ఏమిటి ?చర్చిద్దాం .మతం అంటే ఒక వ్యక్తి లేక కొద్దిమంది మనుషుల అభిప్రాయం. సామాన్యమానువులుకాక విశేషశక్తికలిగిన మనూషులనుంచి ఉద్భవించిన మార్గం. ఉదాహరణకు మనమెవరిమీదన్నా విసుగువస్తే వాడిమతం వేరురా! అంటుంటాం కదా . దీనిని ప్రామాణీకరిస్తూ ఒక సిద్దాంత,లేక ఆలోచనారీతి ఉండవచ్చు.దానిని వివరించే ఒక గ్రంథం ఉటాయి ప్రమాణంగా చెప్పటానికి.
అయితే ధర్మం ఇంకావిస్త్రృతమైనది. అది సత్యం ,మారతానికి వీలులేనిది . మనకు అమ్దుబాటుళొ ఉదాహరణ నొకటిచెబుతాను. సూర్యుడు తుర్పున వుదయిస్తాడు .అన్నది సత్యం . భాషలలో తేడాతప్ప విషయంలో తేడాఉండదు . ఇది ధర్మమంటే. అనేకానేకమతాలు సత్యాన్ని చెప్పటానికి అనేకవిధాలుగా ప్రయత్నించవచ్చు , కానీ చెప్పబడె సత్యం ఒక్కటే .
ఈ తీరున చూస్తే మనది మతం కాదు .ధర్మం . హిందూ ధర్మం . సనాతనం .అంటే అనాది .ఆది కూడా ఇదే. అందుకనే మనకు ఈధర్మంలో అనేకమతాలు కనపడతాయి ,అద్వైత.ద్వైత,విషిష్ఠాద్వైత,బౌద్ధ,జైన ములకాడనుండి అనేకం . ఇందులో . వీతన్నింటి మూలసూత్రాలు ఒకరకంగా చెప్పాలంటే ప్రపంచంలోని అన్నిమతాల మూలసిధ్ధాంతాలు ఇందులోనే కనిపిస్తాయి. దీనికి మిగతామతాలలాగా ఒకే మతగ్రంథం ప్రామాణికం కాదు. అదీగాక ఇది ఎవరో ఒక మహానుభావుని భావాలనుండి మాత్రమే ఉద్భవించిన సిధ్ధాంతం కాదు. అనేకానేకమంది ద్రష్ట లు భగవంతునినుండి పొందిన దివ్యజ్ఞానాన్ని పొందుపరుస్తుండగా అనంతంగావిస్తరించి,మనిషి సంపూర్ణమానవునిగా ఎదగటానికి అవసరమయ్యే విజ్ఞానభాండాగారం . ఇది యుగయుగాలుగా సుసంపన్నమవుతూ సాగుతున్న గంగ . కనుకనే మనం దీనిని ధర్మం అనిపిలవాలి . కాకుంటే వాడుకలో హిందూమతం అనేపిలుపుకు అలవాటయ్యాం.
ఇక్కడ మీరింకొక ప్రశ్నవేయవచ్చు. ఇంకేం ,అన్నీ ఇందులోనివే అయినప్పుడు దీనిని ఇంకోమతం అనుసరించేవాల్లు ధ్వంశం చేస్తే మాత్రమేమి ?అని. వాల్లుకూడా దీనిలోనివారేకదా అనవచ్చు.
చాలాగొప్పగా విస్తరించిన మహావృక్షంలో అనెకానేక శాఖలు ఉంటాయి . కొన్నిశాఖలు క్షీణించినా ,నశించినా కొత్త కొమ్మలు వస్తాయి ,కొత్తభావాలతో. కానీ మూలాన్ని నాశనంచేస్తే ఇక కొమ్మలుండవు రెమ్మలుండవు. ఇప్పుడు ఈయుగపుఇరుషుడైన "కలి" చెస్తున్నదిదే . మూలాన్ని నాశనం చెయ్యాలని కొమ్మలనాశ్రయించి ముందుకొస్తున్నాడు.కనుక ధర్మాన్ని కాపాడుకోవాలి.అందుకోసం ధర్మాన్ని ఆశ్రయించాలి. ఇంకా చర్చ పొడిగించాలనిఉంటే నాతో ఫోన్లో మాట్లాడగలరు. జైశ్రీరాం
Post a Comment