శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కేవలం ఆవులకు -బ్రాహ్మణులకు శుభం జరిగి పోతే చాలనా మీ ఉద్దేశం? అదేనా మీ ధర్మం?

>> Wednesday, February 2, 2011

బ్రాహ్మణులమీద కాదు ధర్మంపైన ద్వేషం అంటూ నిన్న నేనురాసిన పోస్ట్ లో అన్నగారు మురుగేశన్ గారు ఒక కామెంట్ వ్రాసారు. దానిమీద వివరణ ఇవ్వవలసి ఉంది నేను.

சித்தூர்.எஸ்.முருகேசன் said...

అయ్యా,
//అంతిమవిజయం ధర్మానిదే .//
నేనెప్పుడు అధర్మానికే విజయమని చెప్పలేదు. ధర్మం ఏది అన్న అంశం పైనే విభేదిస్తున్నా.

//అందుకే మేము మరలా నినదిస్తున్నాం//
మీ అసలు ఉద్దేశం ఏమిటో తదుపరి వాక్యంలోనే భయిట పెట్టేరు థ్యాంక్స్.

//గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం....లోకాస్సమస్తా సుఖినోభవంతు..//

మీరు నెత్తి మీద పెట్టుకునే భగవద్గీతలో శ్రీ కృష్ణుడు సత్ బ్రాహ్మణుడ్ని - కుక్క మాంసం వండుకుని తినువాడిని సమత మమతతో చూడువాడే అభేధభావం గలవాడన్నాడు కదా..

కేవలం ఆవులకు -బ్రాహ్మణులకు శుభం జరిగి పోతే చాలనా మీ ఉద్దేశం? అదేనా మీ ధర్మం?

February 1, 2011 11:26 AM


పైన వ్యాఖ్యలో ధర్మమంటే ఏది అన్నారు. ఏదైతే మార్చటానికి వీలుకాదో అసలా అవసరమే లేదో,ఏదైతే సృష్టి వికాశానికవసరమైన సంపూర్ణ మార్గమో!.ఏ దైతే పిపీలకాది బ్రహ్మపర్యంతం పరమేశ్వర స్వరూపమనే దృష్టిని కలిగించగలదో అదిగో..అటువంటి లక్షణాలున్న నాసనాతన ధర్మమే ధర్మము . ప్రపంచాన ఈభావనతో కూడినసిద్దాంతాలన్నీ అందులో భాగాలే . సూర్య్డుడు తూర్పున ఉదయిస్తాడు అంటే అది సత్యము, దానికి సవరణలుండవు . భాషవేరైనా భావం మాత్రం మారదు అదిసత్యము. ఆధర్మానికిచెందిన నేను ఈసనాతన ధర్మాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను .

దీనిని విశ్వసించి,ఆచరించేవారిలో సాత్వికబుద్దికలిగి బ్రహ్మత్వాన్ని పొందిన మహానుభావులు,ఆదిశంకరులనుండి అవధూత మాలపిచ్చమ్మ వరకు, మహమ్మదులనుండి క్రీస్తుదేవులవరకు, ఆళ్వారులు,నాయనారులనుండి అవధూత వెంకయ్యస్వామిదాకా.రామకృష్ణుపరమహంసనుండి రమణమహర్షులదాకా, సాయినాథులవంటి సద్గురు పరంపరం నంతా మేము బ్రాహ్మణులుగా పరిగణిస్తాము . ఆస్థాయి చేరలేకపోయినా కనీసం వారిమార్గంలో పయనిస్తూ లోకక్షేమానికై పాటుపడే వారంతా ఆకోవకే చెందుతారు.

ఒకవేళ మీ మనసులో ద్వేషభావం సమూలంగా తుడిచివేయబడి మీరే ఆ పరమాత్మ చేతిలోలోకోపకారకపరికరమైనప్పుడు మిమ్మలనుకూడా బ్రాహ్మణులుగానే పరిగణిస్తాము. ఇది ఈధర్మం ప్రత్యేకత.

అందుకనే ఈధర్మం ద్వేషించదు .ప్రేమిస్తుంది ,ప్రేమించటం నేర్పుతుంది . ద్వేషించినవాల్లు ,ద్వేషిస్తున్నవాల్లెవరన్నా మీకంటబడితే వాళ్ళు కలిపురుషుని చే వంచింపబడ్డవారు మాత్రమే.

ఇక గీతాచార్యుడు చెప్పిన మహావాక్యాన్ని ఉదహరించారు.
ఇంకెక్కడన్నా అటువంటిబోధ మానవజాతికి దొరుకుతుందా ?

ఇక గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం ..........అంటే గోవులు బ్రాహ్మణుల శుభంగా ఉంటే చాలా ? అన్నారు
అవే మరి కితకితలంటే !!!!

కాలే వర్షతుపర్జన్య: పృథివీసస్యశాలినీ ....అంటూ లోకమంతా సుఖంగా ఉండాలని కోరుతూ అందుకుపాటుపడే గోమాతను,బ్రాహ్మణులను కూడా శుభంగా వర్ధిల్లమంటూ చేస్తున్న ప్రార్ధన అది. మీకు తెలియక కాదు.
ముక్కలు,ముక్కలుగా అర్ధాలుచెప్పికదా ఇప్పటిదాకా లోకాన్ని తప్పుదారిపట్టించటానికి కలి ప్రయత్నిస్తున్నది. ఎవడో అనామకుడు మాలాంటి పామరులు ఇలాంటి కుయుక్తులకు పాల్పడితే సరిదిద్దవలసిన మీవంటి పండితులుకూడా గాడితప్పితే ఎలా ??????
ఒక్కద్వేషభావం పక్కకు తప్పిమ్చి చూస్తే చాలు ఈ సనాతన ధర్మ పరమోన్నతభావం మీకు కనిపిస్తుంది. లోకబాంధవుడైన సూర్యున్ని దర్శించటానికి మన కొచ్చిన కండ్లకలక జబ్బు ఇబ్బందిపెట్టవచ్చు. అంతమాత్రం చే సూర్యదర్శనం మనకొద్దనుకుంటామా ?

ఇక చివరగా మాఉద్దేశ్యం దాచిమాట్లాడుతున్నామని ఎవరూ భావించవద్దు. అలాదాచుకోవలసిన అవసరం మాకులేదు. మేమేమన్నా ప్రపంచంలో తనధర్మం తప్పమరేదీ మిగలకూడదన్న కలిపురుషుని లక్ష్యంతో పనిచేస్తున్న మార్గావలంబకులమా? కాదే.
మేము హిందువులము అనిసగర్వంగా చెప్పుకుంటున్నాము.హిందువునని చెప్పుకోవటం..హిందువుగా జీవించటం నా పూర్వజన్మసుకృతం .
లోకమంతాశుభంగా ఉండాలని మరోమారు ...కాదుకాదు ...జీవించి ఉన్నంతకాలం కోరుకుంటూనే ఉంటాము .

Delete

9 వ్యాఖ్యలు:

Anonymous February 2, 2011 at 3:53 AM  

దుర్గేశ్వర గారు!

మీరేదో సౌమ్యంగా తెలియ జెప్పి నేర్పాలనుకుంటున్నారు...అవతలి వాళ్ళకి నేర్చుకోవాలన్న సౌజన్యం లేనప్పుడు ఎందుకండీ.. అనవసరంగా సమయం వృధా!!! ద్వేషించడం లోనే వాళ్ళకి ఆనందం పొందుతున్నప్పుడు, అందులోంచి బయటకి రావాలనుకోరు.

బ్లాగుల్లో ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు కాబట్టి వీళ్ళ గెంతులు ఇక్కడే.... ఆర్కూట్ లోనో, ఫేస్ బుక్ లోనో ఇలాంటి టాపిక్ లేవదియ్యమనండి చూద్దాం...జన్మ జన్మ లకి సరిపడా జ్నానోదయం చేసి వదుల్తారు. సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే కనీసం పి.హెచ్.డి చేసుండాలి.

పట్టు మని నాలుగొందలు కూడా లేని బ్లాగుల లో ఏదో పెద్ద పొడిచేసినట్టు ఫీలవడం... వదిలెయ్యండి. వినని వాళ్ళ గురించి టైమ్ వేస్ట్

రాజేష్ జి February 2, 2011 at 3:54 AM  

$దుర్గేశ్వర గారు
చక్కగా చెప్పారు.. ఒక్క over generalization తప్ప (సర్లెండి , అది నా గోస అనుకోండి).

I am staunch believer of hinduism which learnt me peace and love whilst had zero-tolerance towards those insane bashers while on the way of protecting my dharma.

శిల్పాదికారాన్ని రాసిన జైన ముని ఇలాంగో అడిగల్. అందులో కథానాయిక కన్నగి.

ఇందులో కన్నగి తనకు జరిగిన అవమానానికి ప్రతిగా తన అనునూయులు మధురను అగ్నికి ఆహుతి చేసేప్పుడు అన్న మాటలు
" నగరాన్ని ఆహుతి చేయండి కానీ గోవుల్ని, బ్రాహ్మణుల్ని వదిలేయండి!"

రచయిత జైనముని అడిగల్ కూడా బ్రాహ్మలపట్ల గౌరవాన్ని చూపిస్తారు. ఇది నాటి మాట.

కాలక్రమాన శిల్పాదికారం తమిళసంఘ ప్రముఖ ప్రబంధం/కావ్యం అయింది, కన్నగి ఆరాధ్యదేవత అయింది. కానీ ఆమె అన్న మాటలు తలకెక్కలేదు. బ్రాహ్మణ ద్వేషం పొంగి పొర్లింది. ఇది కేవలం స్వార్థచింతన, రహదారిలో కాకుండా పక్కవాడిని అణగదొక్కి పైకి ఎక్కే ఆలోచన!

మీరు కిందది దూషణ అనుకోవద్దు.

జ్యోతిష్యాన్ని డబ్బులకు అమ్ముకుంటూ దానికి ప్రాణా/మూలాధారమైన పవిత్రవేదాల్ని తుంగలో తొక్కమని చెప్పేవారికి మనస్సుకి ఇవి ఎక్కుతాయా? కనీసం ఇలాంటి వారి చెడుమాటలు విని వారి దారిలో మరి నలుగురు నడవకుండా ఉండానికి ఈ మాటలు ఉపయోగపడితే చాలు!

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ February 2, 2011 at 4:11 AM  

గురువు గారూ,

మురుగేశ అయ్యవారు ఉదహరించిన శ్లోకానికి అర్ధం వారికి తెలుసు. కానీ వారు అలా చేయడం వెనుక ఉద్దేశ్యం వేరు. వారు రాసింది ఆ శ్లోకం అర్ధం తెలిసిన వారికోసం కాదు. తెలియని వారికి తప్పుడు అర్ధాన్ని చెప్పి వారి మనస్సులో ద్వేషభావం రగిలించడం.


కలిసేనకున్న అస్త్రాల్లో ఇది ఒకటి.

Anonymous February 2, 2011 at 6:07 AM  
This comment has been removed by a blog administrator.
astrojoyd February 2, 2011 at 8:39 AM  

సగం మాత్రమె తెలిసిన "మురుగుఈషన్ను"లకు మీరు చెప్పినవి బాగున్నాయి సుమండీ.

Mythiliram.g February 2, 2011 at 6:45 PM  

Excellent post sir,
It is our responsobility to protect hinduism.

Malakpet Rowdy February 2, 2011 at 7:01 PM  

A fitting response to him.

మనోహర్ చెనికల February 2, 2011 at 8:46 PM  

http://newjings.blogspot.com/2011/02/blog-post.html

veera murthy (satya) February 3, 2011 at 6:28 PM  

మనకి పాలిచ్చి పోషించేదేదైనా తల్లితో సమానం కాబట్టి గోవుకి శుభం కలుగాలి...(అలాగే మనపోషణ కోసం కష్టపడే వాన్ని తండ్రితో సమానం గా చూస్తాం..అందుకే ఎద్దులకి తండ్రిలాంటి గౌరవమిస్తారు.)
బ్రహ్మ జ్ఞానం కలిగిన వాన్ని(ఆత్మా అనాత్మా వివేకం కలిగి, పరమాత్మ పట్ల విజ్ఞ్తత కలిగిన వాడు) మాత్రమే బ్రాహ్మణుడన్నది వేదం..నిజంగా వాడికి శుభం జరగాలి...

సమాజాన్ని...
రక్షించడానికి క్షత్రియులు(పాలన, రక్షణ)
అభివృద్దికి వైశ్యులు (వాణిజ్యం, గోసంరక్షణం)
మార్గ దర్శ్ణణానికి బ్రాహ్మ్ణణులు (వైదిక మైన యజ్ఞ-క్రతువులు ,సన్మార్గదర్శణం)
మహత్తరమైన సేవా కార్యానికి శూద్రులు ( క్షుద్రమైన పనులతో గొప్పదైన సేవ)..


(వైదికం లో పంచములు లేరు...)

ఇవి వారి గుణాలని కర్మలని బట్టి ఎంచుకునే మార్గాలు...జన్మ తహా వచ్చేవి కావు....

కృపాచార్యుడు బ్రాహ్మణుడు ...కానినేర్చింది..నేర్పింది క్షత్రియ విద్య!
గాందీగారు వైశ్యుడు...కాని నిమ్మకాయ ముక్కలతో కుష్టి వారికి చేసింది క్షుద్రమైన(తక్కువ స్థాయికి దిగి చేసే) సేవ!

వృత్తిని బట్టి కులం ... కులం, చేసే వృత్తిలో నైపుణ్యాన్ని మెరుగు పరిచి, వారి ముందు తరాలకి అందించడానికి పని కొస్తుంది...(కొట్టుకొని చావడానికి కాదు!)

ఓ ఉన్నత కులస్తుడు బాటా చెప్పుల షాప్ లో పని చేస్తే వాడిది ఏ కులమనాలో...
ఓ ఉన్నత కులస్తురాలు బ్యూటీ సెలూన్ పెడితే, తనది ఏ కులమనాలో...
కిరాణా కొట్టు పెట్టుకుంటే ఏ కులమనాలో ...
బట్టల షాప్ పెడితే ఏకులమనాలో..
మునిస్పల్ ఉద్యోగిది ఏ కులమో...
పోలిస్ వాడిది ఏకులమో...
వారి వారి విజ్ఞతకి సంబంధిచిన విషయం...
పని ఏదైనా చిన్నది కాదు...అది పరమాత్మతో సమానం..

దాదాపు వెయ్యి సంవత్సరాలు పరాయి పాలనలో బ్రతికీ బ్రతికీ ఇప్పుడిప్పుడే దార్మిక సంస్కృతిని సహేతుకంగాతెలుసు కుంటున్నారు జనాలు...నాకు తెలిసి ఇంకా సంమయం పడుతుంది...
జాబాలి లాంటి నాస్తికులు రాముని కాలం లో కూడా ఉన్నట్టే ఇఫ్ఫుడూ ఉన్నారు...వారి గోల వారిది...

-saty

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP