శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మమ్మల్ని నమ్ము!

>> Tuesday, May 31, 2011


మమ్మల్ని నమ్ము!
- అప్పరుసు రమాకాంతరావు
నమాలీ! ఇలా పిలుస్తే పలుకుతావా? మా మానస మందిరంలో నిన్ను శంఖు చక్ర పద్మవిలాసునిగా నిలుపుకొన్నాం. సర్వం కృష్ణార్పణమస్తు అనుకొని అన్నీ నీకే సమర్పిస్తున్నాం. అంతటా వ్యాపించి ఉన్నావని నమ్మి నిన్నే వేడుకొంటున్న భక్తులం. అయినా ఇంకెన్నాళ్లు మధుసూదనా... మా ఎదురుచూపులు! తల్లి జఠరంలో ఉంటూ తొమ్మిది నెలల చీకటి జీవనం గడిపాం. జననంకోసం తల్లడిల్లే మమ్మల్ని ఆత్మతో అనుసంధానం చేసి పంచభూతాలతో కూడిన ప్రపంచంలోకి ప్రవేశింపజేశావు. హృషీకేశా! అదిగో అక్కడినుంచి మా చుట్టూ మాయ ఆవరించింది. చారుహాసుడవూ చతుర్భుజుడవూ కనుక నీతోపాటు అవతరించిన మాయను మటుమాయం చేయగలిగావు! మరి మేము? ఆ మాయలోనే పెరుగుతున్నాం. మా బాల్యమంతా అమ్మ చెంతనే గడిపాం. కూపస్థ మండూకంలా అమ్మే లోకంగా భావించి ఆనందంగా గడిపాం. ఈ మానవ జీవితంలో... అదేనా నిజమైన ఆనందం? కానే కాదు తండ్రీ! కేశవా! బాల్యాంకం అలా గడిచేపోయింది. మేము పొందినది ఆనందమో మాయానందమో తెలియదే!

యౌవనఛాయలు అంకురించాక మాలాంటి శక్తియుక్తి సంపన్నులు లేరనే గర్వం ఆవహించింది. ఇదేం మాయ శ్రీవత్సాంకా! యౌవనంలో మోహాన్ని అంకురింపజేశావు! తారసపడిన కన్యలందరూ విరహిణులుగా కనిపించారు. ఎదురుపడిన యువకులందరూ మనోహరులుగానే భాసించారు. ఏమైతేనేం? పెళ్ళిళ్లు చేసుకొన్నాం. దేహబంధం మరింత పెరిగింది. పుత్రులు, సుతలే ప్రపంచమనుకొన్నాం. మోహంతో గర్వం అధికమైంది. అసూయ ఆవరించింది. ఇతరుల ధనాన్ని చూసి అసూయపడ్డాం. ఇతరుల ఆనందాన్ని నిరసించి వారిని శత్రువులుగా చేసుకొన్నాం. భవనాలు సిరిసంపదలు సుఖాలే జీవితమనుకొన్నాం. అన్నీ... అన్నీ శాశ్వతమే అనుకొన్నాం. అయినా నీది కాదు వసుదేవసుతా తప్పు! ఇది కాదురా నాన్నా జీవితం అని చెప్పడానికి కష్టాలు సృష్టించావు. మా కళ్లముందు ఆనందంగా తిరుగాడిన తల్లిదండ్రులకు ముదిమిని కల్పించావు. వాళ్ల నునుపు మేనులో ముసలిఛాయలు ఆవరింపజేశావు. వారి అందాలు చర్మపు ముడతల్లోకి ఇంకిపోయాయి. వారి ఆనందాలు రోగాలమాటున కరిగిపోయాయి. చివరికి మమ్మల్ని విడిచి వారు వెళ్లిపోయినప్పుడైనా మేము తెలుసుకోలేకపోయాం కృష్ణా! జాగ్రత్తపడమని నీవు పంపిన సంకేతాలను గ్రహించలేకపోయాం. రెక్కలొచ్చి కన్నవాళ్లందరూ పక్షుల్లా ఎగిరిపోయి మేమున్న కొమ్మలను విడిచి వేరే శాఖలను ఆశ్రయించారు. వెచ్చగా పొట్టకు అదుముకున్న బుజ్జాయి పెద్దవాడై మరో గూడును చూసుకొని పొట్టను తన్ని వెళ్లిపోయాడు. రమ్మంటే వస్తాడా? యౌవనంలో మేం చేసినట్లే మా పిల్లలూ ప్రవర్తిస్తున్నారు. అదిగో... ఇప్పుడు జ్ఞాపకం వచ్చావు... పూర్ణచంద్ర నిభాననుడవు కనుక నీ చల్లని వెలుగును గ్రహించాం. యశోదానందనా! మేము అరిషడ్వర్గాలను కలిగిఉన్న మానవులం, కఠినులం. ఈ జీవిత చరమాంకంలో బతికి ఉండీ మరణించినవారితో సమానమై జీవిస్తున్నాం. ఒకరి కోసం ఒకరం బతుకుతూ మా దాంపత్య జీవితంలో పాపపుణ్యాలను బేరీజు వేసుకొంటున్నాం. మాలో కొందరం భార్యను కోల్పోయి, మరికొందరు భర్తను కోల్పోయి అనాథలుగా జీవిస్తున్నాం.

యాదవ శిరోరత్నా! జ్ఞానోదయం కలుగుతుందో లేదో తెలియకున్నాం కానీ... అనుభవాలు నేర్పిన పాఠాలవల్ల కరికి వరదుడిలాగా ఇక మాకు నీవే పరాప్రకృతివి అని గ్రహించాం. సర్వమూ నీ శరీరంనుంచే ఆవిర్భవించాయని నీవు బోధించిన గీత ద్వారా తెలుసుకొన్నాం. మాలోని పరమాత్మవు నీవే! నిన్ను పూజిస్తున్నాం. స్మరిస్తున్నాం. పూజలు స్మరణలు సనాతనమైనవి కావు కదా! సనాతనమైన నారాయణా... నీవే అంతర్యామివి! మేము, వర్షం కురిసిన తరవాత పర్వతాగ్రంనుంచి జాలువారిన ధారలం. సముద్రంలాంటి నీలో చేరలేని నిర్బలులం కావచ్చు. విష్ణూ! ఈ ప్రపంచమంతా సత్యం, రజస్సు, తమస్సు అనే మూడు ప్రకృతిగుణాలతో నిండి ఉందని మహానుభావులెవరో చెప్పగా విన్నాం. ఈ గుణాలన్నీ ఈ ముదిమి వయసులో కూడా మా అంతరంగాల్లో అంతర్లీనంగా ఉన్నాయేమో? ఆ తరంగాల్లో కొట్టుకొనిపోకుండా కాపాడు తండ్రీ!

పురుషోత్తమా! పంచభూతాలతో కూడిన ఈ విశ్వంలో ఏమీలేదని గ్రహించాం. మళ్లీ ప్రసాదించిన దేహాన్ని ధర్మసాధనంగా వినియోగించుకొని నిన్ను చేరే ప్రయత్నం చేస్తాం. నిజం తండ్రీ! మమ్మల్ని నమ్ము!!



Read more...

అసాధ్యసాధకస్వామిన్ అసాధ్యం తవకింవద ? అనిస్తుంతించినందున స్వామి అనుగ్రహంతో సాగిన యాగం పూర్ణాహుతి

>> Sunday, May 29, 2011

స్వామి అనుగ్రహం ఎలాఉంటుందో ప్రత్యక్ష ప్రమాణం ఈ హనుమత్ రక్షాయాగం . స్వామి యాగాన్ని గమనిస్తునేఉన్నారనే సంకేతాలు అందుతూనే ఉన్నాయి. యాగం మొదలైనప్పటినుండి పారాయణములు చేస్తామని మిత్రులంతా ఎంతో ఉత్సాహం తో ప్రోత్సాహాన్నందించారు. రుద్రసూక్త,మన్యుసూక్త,సుందరాకాండ ,చాలీసా పారాయణాదులను అనుసంధిస్తూ సాధన సాగించారు. ఇక అసలు పరీక్షలను ఎలా కల్పించారో ?ఎలా తొలగించారో తెలుసుకుంటే మనంచేస్తున్న యాగం స్వామి గమనిస్తున్నారన్నవిషయం స్పష్టమవుతుంది. ఈసంవత్సరం యాగనిర్వహణకు కావలసిన సంరంభాల సమీకరణ కాస్త సమస్యగామారింది . ఈసమయంలోనే సంకీర్తనా మంటపనిర్మాణం జరుగుతున్నందున కాస్త ఇబ్బందే . ఏమైనాకానీ యాగం యథావిథిగా సాంగించాలి అన్నీ స్వామి చూసుకుంటాడు అనే విశ్వాసంతో ముందుకు నడవటం జరిగింది. యాగనిర్వహణ విషయాలను తాము చూసుకుంటామని నాగప్రసాద్,మనోహర్ లు ముందుకొచ్చారు . స్వామి అనుగ్రహంతో మోహన్ కిషోర్ గారు ,భాస్కర్ రామరాజు,వెంకట సూర్యనారాయణ, చెనికల మనోహర్ ,నాగప్రసాద్ లు కార్యనిర్వహనాభారం తమభుజస్కందాలపై మోసారు.
హనుమజ్జయంతి రోజు న హనుమత్ వ్రతాలు జరిగాయి . మనోహర్, శివకుమార్ లు హైదరాబాద్ నుంచి,గిద్దలూరునుంచి ముక్కెళ్లపాడునుంచి భక్తులు వచ్చి వ్రతంలో పాల్గొన్నారు. వ్రతం రోజున తీవ్రమైన ఎండ . రేపు యాగసమయానికి ఇలాఎండ ఉంటే చాలాకష్టం . స్వామి అనుగ్రహించి రేపుఎండతగ్గితే బాగుండు అని అనుకున్నాము.మాటలసమ్దర్భంలో అందరమూ. నిజంగా మరుసటిరోజు పొద్దుటే మబ్బులుపట్టాయి . యాగం పూర్తయ్యేదాకా వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంది . చుట్టుపక్కల ఊర్లలో పెద్దవాన . మాకుమాత్రంలేదు. వంటచెసేవారికి ఇబ్బందికలుగలేదు . ఇదీ స్వామి అనుగ్రహం .ఇక శనివారం రోజు పూర్ణాహుతి .
ఇక పూర్ణాహుతి యాగానికి రుత్విక్కులుగా కృష్ణమూర్తి భట్టు బృందాన్ని పిలచాము. ఐదుగురికి మనం వస్త్రాలివ్వాలని నాగప్రసాద్ చెన్నైనుంచి వస్త్రాలు తీసుకుని బయలుదేరాడు . తీరా కృష్ణమూర్తి భట్టుగారొక్కరే వస్తున్నానని చెప్పారు . ఇదేమిటి ? ఈ ఆటంకం అనుకుంటుండగా హైదరాబాదునుంచి శేషాంజనేయశర్మగారు వారి బావగారితో కలసి పూర్ణాహుతి రోజున పీఠానికి చేరారు. వారువస్తారన్న సమాచారమే మాకులేదు. స్వామి సంకల్పం కలిపించారని అప్పటికప్పుడు తాముబయలుదేరామని వారు చెప్పగా ఆశ్చర్యపోయాము. వచ్చినవారిద్దరూ స్వామి పరివారం . యాగసమయానికి భట్టుగారు వస్తూ వస్తూ కొచ్చర్లనుంచి మరో పురోహితుణ్ణి వెంటబెట్టుకొచ్చారు. అరే ! ఇంకో బ్రాహ్మణుడు రావాలే ? అని సందేహిస్తుండగా ఖచ్చితంగా పూర్ణాహుతికి పదినిమిషాలముందు చింతలపాటి శ్రీకిష్ణగారు వచ్చి చేరటం నిజంగా స్వామి లీలే . రాత్రల్లా వేరే పెళ్లికార్యక్రమంలో నిదురగాసి ఉండికూడా తెల్లవారుఝామున బయలుదేరి వచ్చి సరిగ్గాసమయానికిచేరుకున్నారు. పరిపూర్ణంగా మనసంతా స్వామి నిండిఉండగా భక్తులజయజయధ్వానాలమధ్య పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయింది. ఈసంవత్సరం యాగనిర్వహణ కష్టమనుకుని చేయలేము అని నిరాశలో ఉన్నసమయంలో తన ఉపాసనలో గలశక్తేమిటో చూపించారాయన. అందుకే అన్నారు . అసాధ్యసాధకస్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కార్యం సాధక ప్రభో ! అని స్తుతిస్తారు పెద్దలు.











photos link


https://picasaweb.google.com/111792900373084554502/HANUMADRAKSHA2011?authkey=Gv1sRgCLm5kNbQ8_iDLw

Read more...

తెలుగు బ్లాగర్లందరికీ ఆహ్వానం

>> Thursday, May 26, 2011

తెలుగు బ్లాగులతో తెలుగు భాషాభివృద్దికి తోడ్పడుతున్న బ్లాగ్మితృలందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.
శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం లో జరుగుతున్న హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి కార్యక్రమములు రేపటినుంచి మొదల్వుతున్నాయి .హనుమజ్జయంతి సందర్భంగా రేపు అభిషేకములు హనుమత్ వ్రతములు నిర్వహించబడుతున్నాయి. శనివారం రోజు హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి జరుపబడుతుంది .
గోత్రనామములు పంపి ఇప్పటివరకు పారాయణం చేస్తున్న వారు ఇంతవరకు ఈకార్యక్రమంగూర్చి పరిచయం లేనివారైనా అందరికీ ఆహ్వానం . మీరందరూ వచ్చి స్వామిని సేవించుకుని స్వామి రక్షలు ,ప్రసాదలను స్వీకరించవలసినదిగా హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాము.

హైదరాబాద్ నుంచి వచ్చేవారు హైదరాబాద్ -- నాగార్జునసాగర్.. మాచర్ల ...కారంపూడి..వినుకొండవచ్చి పీఠానికి రావచ్చు. ఇటుకోస్తానుంచి వచ్చేవారు విజయవాడ గుంటూరు ..నరసరావుపేట నుండి వినుకొండవచ్చి రావచ్చు
నెల్లూరువైపునుంచి వచ్చేవారుఉ ఒంగోలు --అద్దంకి- ఉల్లగల్లు -- రవ్వవరం రావచ్చు.
ఇటు రాయలసీమనుంచి వచ్చేవారు కర్నూలు.. గుంటూరు రహదారిలో వినుకొండ దిగవచ్చు. రాయలసీమనుంచి..కోస్తానుంచి వినుకొండకు రైల్ మార్గం కూడా ఉంది . జైశ్రీరాం

Read more...

రాండీ ..పుణ్యాత్ములారా ! శ్రీరంగని భజనకు రాండీ ధర్మాత్ములారా ! రండీ మనమందరము కోదండరాముల భజనచేద్దము .

>> Monday, May 23, 2011


Read more...

హిందువులంతా చదవవలసినపోస్ట్

>> Sunday, May 22, 2011


ఏడాది పొడవునా అన్ని దేవాలయాలకూ భక్తులు పోటెత్తుతున్నారు. హుండీలు పొంగిపొర్లుతున్నాయి, భక్తులు చెల్లించుకున్న ముడుపులతోనూ, మ్రొక్కులతోనూ, తదితర కానుకలతోనూ ! దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఆ దేవాలయాలలో ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా జీవితాలు గడిపేస్తున్నారు. దేవాలయాల యాజమాన్యం క్రింద ఉన్న నానా విద్యా, వైద్యసంస్థల్లో వేలాదిమంది చేఱుతున్నారు.


అంతా బానే ఉన్నట్లు కనిపిస్తోంది కదూ ? నిజానికి వాస్తవ పరిస్థితి అంత ఆశావహంగా లేదు. హిందూమతం ఒక అత్యవసర పరిస్థితి (Emergency) వైపు, ఒక మానవ వనరుల సంక్షోభం (Human resources' crisis) వైపు అతివేగంగా పయనిస్తోంది. ఎక్కడో అమెరికాలో కాదు, ఇక్కడే ఈ సనాతన భూమిలోనే ! ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయ దృశ్యం కనీసం పదేళ్ళ తరువాత, లేదా గరిష్ఠంగా పాతికేళ్ళ తరువాత పూర్తిగా అదృశ్యం కాబోతున్నది. అటుపిమ్మట ఆ దేవాలయాల పరిస్థితేంటో, వాటిల్లోని దేవుళ్ళ పరిస్థితేంటో, ఆ దేవాలయాల క్రింద నడుస్తున్న సంస్థల పరిస్థితేంటో, అసలు టోకుగా హిందూమతం పరిస్థితేంటో అంతా అగమ్యగోచరం. ఎందుకంటే హిందూమతానికి తీవ్రమైన పూజారి-పురోహితుల కొఱత ముంచుకు రాబోతోంది. ఇది చాప కింద నీరులా ఇప్పటికే మొదలయింది, గత కొద్ది సంవత్సరాలుగా ! మొదట్లో ఒక పదీ-పదిహేనేళ్ళ క్రితం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ అర్చక బ్రాహ్మణుల కొఱత ఇప్పుడు నగరాలక్కూడా ప్రాకింది. రాష్ట్రంలో సుమారు ఇఱవై-పాతిక లక్షలమంది బ్రాహ్మణులు ఉన్నప్పటికీ వారిలో పౌరోహిత్యం చేసేవారి జనాభా దారుణంగా పడిపోవడంతో చిన్నచిన్న వేడుకలూ, కర్మలూ చేయడానికి సైతం ఎవఱూ దొఱక్క, ఆ దొఱికిన బ్రాహ్మణుడికే అనేక రెట్లు డబ్బు కుమ్మరించి చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాదులో ఎంత చిన్న అర్చామూర్తిని ప్రతిష్ఠించాలన్నా యాభైవేలు డిమాండు చేస్తున్నారు. కాస్త పెద్ద విగ్రహాలకైతే లక్ష తప్పనిసరి. జనం "సరే"నని విధిలేక ఇస్తున్నారు, చందాలేసుకుని మఱీ !

అసలు విషయమేంటంటే - బ్రాహ్మణులంతా దాదాపుగా అర్చక-పురోహిత వృత్తిని పరిత్యజించారు. ప్రస్తుతం ఎనిమిదిన్నఱ కోట్ల జనాభా గల ఈ రాష్ట్రం మొత్తమ్మీద ఆ వృత్తి చేసేవారు అంతా కలిపి పూర్తిగా ఒక యాభైవేలమంది కూడా ఉంటారో ఉండరో ! ఉన్నవారిలో ఎక్కువమంది ముసలివాళ్ళే. కొన్నిసంవత్సరాల తరువాత ఆ ముసలివాళ్ళు గనుక దాటుకుంటే వారి స్థానంలో పనిచేయడానికి వైదికంగా సుశిక్షితులైన బ్రాహ్మణ యువకులు తగినంతమంది లేరు. రాష్ట్రం నలుమూలలా వేదపాఠశాలలూ, అవీ నామమాత్రంగా ఉండడానికైతే ఉన్నాయి. కానీ అక్కడ శిక్షణ పొంది బయటికొస్తున్నవాళ్ళ సంఖ్య బొత్తిగా సరిపోదు ఈ ఏనుగుని ఎత్తడానికి ! ఉన్న పురోహితుల పిల్లలే అర్చక-పౌరోహిత్యంలో ప్రవేశించడానికి ఇష్టపడడం లేదు. అథవా కొంతమంది ఇష్టపడినా ఇంట్లో ఆడవాళ్ళు "ఠాఠ్ ! వల్లకాదు. అర్చక-పౌరోహిత్యంలో ఏముంది ? నా కొడుకు ఇంజనీరో, డాక్టరో అవ్వాల్సిందే" నని ముక్కు చీదితే కాదనలేక అటు మళ్ళిస్తున్నారు. మిహతా బ్రాహ్మణ జనాభా అలవాటు చేసుకుంటున్న డబ్బువిలువలు ఈనాడు సాంప్రదాయిక అర్చక బ్రాహ్మణ కుటుంబాల్ని కూడా ఇతోఽధికంగా ప్రభావితం చేస్తున్నాయి. తమను తాము ఉద్యోగ వర్గపు బ్రాహ్మణులతో పోల్చుకుని "మనకేం తక్కువ ? ఇంగ్లీషు చదువుకుంటే ఆ మాత్రం ఉద్యోగాలు మనం చెయ్యలేమా ? సంపాదించలేమా ?" అని బయలుదేఱుతున్నారు, ధనసంపాదనా ప్రస్థానానికి ! ఆ విధంగా ఒకసారి మా దగ్గఱ పనిచేస్తున్న యువ పురోహితుడు కూడా HDFC బ్యాంకులో చేఱాడు. కానీ ఆ బ్యాంకువాళ్ళు పొద్దున్నే పూజ చేసుకోవడానిక్కూడా వీల్లేనంత బిజీ చేసేస్తున్నారని గమనించి ఆ ఉద్యోగం వదిలేసి మళ్ళీ పౌరోహిత్యంలోకి వచ్చాడు. సరే, ఇది పురోహితుల సంగతి. ఇహ పూజారుల విషయానికొస్తే వాళ్ళని తప్పు పట్టలేం, వాళ్ళకి ఇస్తున్న జీతం ఒక మనిషిని పోషించడానిక్కూడా చాలని పరిస్థితుల్లో ! పూజారి, పురోహితుడంటే బ్రాహ్మణ అమ్మాయిలు ముందుకు రావడం లేదు పెళ్ళి చేసుకోవడానికి ! అందువల్ల కూడా చాలామంది బ్రాహ్మణులు ఈ వృత్తిని వదిలిపెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఏ ఇతర మతంలోనూ లేదు. హిందూ పూజారులే దీనికి గుఱిచేయబడుతున్నారు.

ఈ పరిస్థితి హఠాత్తుగా తలెత్తినటువంటిది కాదని గమనించాలి. గత కొన్ని దశాబ్దాలుగా నిశ్శబ్ద ప్రక్రియ (silent process) లో ఉన్నదే ఈనాడు బహిరంగంగా విశ్వరూపాన్ని ధరించి కనిపిస్తోంది. ఈ సామాజిక సంక్షోభం తలెత్తకుండా హిందువులూ, వారి నాయకులూ కొన్ని దశాబ్దాల క్రితమే కాస్త ముందుచూపుతో, ఈషణ్మానవత్వంతో వ్యవహరించి ఉంటే బావుండేది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ బ్రాహ్మణుల్ని అణచివేయడమూ, వారు తమకెన్నడూ చేయని అపకారాలకు వారిమీద కులకక్ష సాధించడమూ - ఇవే లక్ష్యంగా పెట్టుకున్నాయి అబ్రాహ్మణ హిందువుల నాయకత్వంలోని ప్రభుత్వాలు. ఉద్దేశపూర్వకంగా చాలా హీనమైన పేదఱికానికి గుఱిచేశారు బ్రాహ్మణ కులాన్ని ! రిజర్వేషన్ల పేరుతో ఎంత చదువుకున్నా ఉద్యోగాలివ్వకుండా హింసించారు. ప్రమోషన్లు ఇవ్వకుండా హింసించారు. ఏ పాపమూ ఎఱుగని బ్రాహ్మణ ఉద్యోగులమీద తప్పుడు అవినీతి కేసులు బనాయించి మఱీ హింసించారు. భూపరిమితి చట్టాల పేరుతో, కమిటీల పేరుతో భూములు లాగేసుకుని హింసించారు. పూజారులకు జీతాలివ్వకుండా ఎగ్గొట్టి హింసించారు. ఓరియంటల్ కళాశాలల్లో చాలీచాలని జీతాలకు తెలుగూ, సంస్కృతమూ చెప్పుకుని బతుకుతూంటే "బ్రాహ్మణుడు ఆ మాత్రం కూడా ఎందుకు బతకా"లని ఏకంగా ఆ కళాశాలల్నే ఎత్తేశారు. అలా ఎక్కడెక్కడ బ్రాహ్మణుడు ఆశ్రయం పొంది ఒక ముద్ద అన్నం తింటున్నాడో కనిపెట్టి ఆయా వ్యవస్థల్నీ, సంస్థల్నీ క్రూరంగా కూలద్రోసుకుంటూ పోతూ అతన్ని దయాదాక్షిణ్య రహితంగా లేవగొట్టారు. ఏతావతా హిందువులకు తరతరాల గురువైన బ్రాహ్మణుడికి చివఱికి ఆ హిందూసమాజంలో మనుగడనే దుర్భరం చేశారు. బ్రాహ్మణుడికి అన్నం పెడితే పుణ్యం వస్తుందనే పూర్వ నమ్మకాన్ని కాలరాచి బ్రాహ్మణుడి పొట్టగొడితే అభ్యుదయం అవుతుందనే ఒక నవీన కలికాలపు ధర్మశాస్త్రాన్ని రచించారు. బ్రాహ్మణుడి యొక్క తరతరాల సాంప్రదాయిక జీవన వనర్లన్నింటినీ ఉద్దేశ పూర్వకంగా ధ్వంసం చేశారు. ఇన్ని చేశాక, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడుగా జీవించడానికి కావాల్సిన ప్రాపులూ, వాతావరణమూ సంపూర్ణంగా అదృశ్యమైనాక ఈ రోజు మీకు పూర్వపు బ్రాహ్మణుడే కావాలంటే ఎక్కడ దొఱుకుతాడు ?

అలా అబ్రాహ్మణులు ప్రభుత్వాల రూపంలో బ్రాహ్మణుల్ని బాధించడానికి పూనుకోవడం ఊరికే తమాషాగా జఱిగింది కాదు. సర్వే జనా స్సుఖినో భవన్తు అని ఆశీర్వదించే బ్రాహ్మణుడు లోకకంటకుడుగా, సంఘద్రోహిగా చిత్రించబడడం చిత్రమే అయినా ఆ విచిత్ర విద్వేష మనస్తత్త్వానికి నింపాదిగా పునాదులు వేసిన కుట్ర ఒకటుంది. దాని వెనుక ఒక కుహనా సైద్ధాంతిక ప్రాతిపదిక (ideological basis) ఉంది. గతశతాబ్దంలో సర్వేసర్వత్రా బ్రాహ్మణుల మీద విస్తృతంగా జఱిగిన విశృంఖలమైన దుష్ప్రచారమే ఆ ప్రాతిపదిక. ఈ దుష్ప్రచారంలో నాస్తికులూ, కమ్యూనిస్టులూ అయిన బ్రాహ్మణులు కూడా అమాయకంగా పాలుపంచుకున్నారు, దాని మూలమూ పర్యవసానాలూ ఊహించలేక ! ఈ కుట్రకు నాందీప్రస్తావన చేసినది క్రైస్తవ మిషనరీలు కాగా అమలు జఱిపింది బ్రిటీషు ప్రభుత్వం. బ్రాహ్మణులకు తరతరాలుగా సమాజంలో ఉన్న ప్రాచుర్యాన్నీ, జనాదరణనీ నాశనం చేస్తే తప్ప హిందూమతాన్ని నాశనం చేయలేమనే కీలకాన్ని వారు కనిపెట్టారు. ఈ కుట్రలో భాగంలో ప్రతిరాష్ట్రంలోనూ ఎక్కడెక్కడి బ్రహ్మద్వేషుల్నీ దగ్గఱికి తీసి, దువ్వి, తెఱ వెనుక ఆర్థికాది సహకారాలు అందించి రెచ్చగొట్టారు. నిజంగా బ్రాహ్మణులు వీళ్ళు ప్రచారం చేసినంత బలవంతులూ, విలన్లే అయితే వాళ్ళని శాల్తీల్ని లేపేసి మొగ్గలోనే తుంచి అవతల పారేసి ఉండేవాళ్ళు. బలహీనులూ, నిస్సహాయులు గనుకనే తమ మీద ఇంత దుష్ప్రచారం చేస్తున్నా ఏమీ అనలేకా, ఏమీ చెయ్యలేకా దీనంగా చూస్తూ నిలబడ్డారు.

ఒక రకంగా చెప్పాలంటే - ఈనాడు తెలంగాణవాదులు ఆంధ్రా ఏరియావారి మీద చేస్తున్న దుష్ప్రచారం లాంటిదే చేశారు గత శతాబ్దంలో బ్రహ్మద్వేషులు. ఆ దుష్ప్రచారం చాలా ప్రతిభావంతంగా, సమర్థంగా జఱిగింది. బ్రాహ్మణులు ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏ స్థితిలో ఉన్నా దానికి కులగజ్జిపరమైన వక్రభాష్యాలు చెప్పారు. జాతికి బ్రాహ్మణులు చేసిన సేవలన్నీ వారి ఆధిపత్యానికి చిహ్నమని ప్రచారం చేశారు. బ్రాహ్మణులు తమ కులాచారం పాటిస్తే అది బ్రాహ్మణుల కులగజ్జి. దేశంలో ఎన్నో కులాలున్నాయి. ఏ కులానికి ఆ కులాచారం ఉంది. ఆయా కులాలు ఆయా ఆచారాల్ని పాటిస్తే అది కులగజ్జి కాదు. బ్రాహ్మణులు తమ కులాచారాన్ని పాటించడం మాత్రమే కులగజ్జి. బ్రాహ్మణులు ధనికులైతే అది రాజుల దగ్గఱ వాళ్ళు చేసిన పైరవీల ఫలితం. వాళ్ళు పేదలైతే అది వాళ్ళ సోమరిపోతుతనం. ఈ దుష్ప్రచారంలో జాతికి వేలాది సంవత్సరాలుగా బ్రాహ్మణులు చేసిన ఉపకారాలూ, ఉపచర్యలూ, దేశం కోసం వివిధ చారిత్రిక ఘట్టాల్లో వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలూ, ఆ క్రమంలో వాళ్ళు అనుభవించిన ఇక్కట్లూ, వాళ్ళతో పాటు వాళ్ళ ఆడవాళ్ళు పడ్డ బాధలూ అన్నీ మఱుగున పడవేయబడ్డాయి.

ఒక పేద, నిస్సహాయ, బడుగువర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దేశానికి విలన్‌లుగా చిత్రిస్తూ భారీ బడ్జెట్టుతో ప్రభుత్వస్థాయిలో అత్యంత వ్యవస్థీకృతంగా జఱిగిన ఈ తరహా బుఱదజల్లుడు ప్రచారం బహుశా ప్రపంచంలోనే న భూతో న భవిష్యతి. బహుశా ఇది కలియుగ లక్షణం. కలిపురుషుడి లీల. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. అన్ని మతాలకూ మతగురువులున్నారు. కానీ తమ మతగురువుల్ని హిందువులు అణచివేసినట్లుగా, అవమానిస్తున్నట్లుగా ఎక్కడా ఎవఱూ చేయడం లేదు. పైపెచ్చు నెత్తిన బెట్టుకుని పూజించుకుంటున్నారు. కానీ భారతదేశంలో బ్రాహ్మణుల స్థానమూ, చారిత్రిక భూమికా ఇతరమతాలలోని మతగురువుల కంటే ఎన్నో రెట్లు గొప్పవీ, వైవిధ్య భరితమైనవీను. బ్రాహ్మణులు ఈ జాతికి ఎప్పుడు అపకారం చేశారు ? వారు ఎల్లప్పుడూ చేతనైనంత మంచే చేశారు. మన రాష్ట్రమే తీసుకుంటే ప్రాచీన ఆంధ్ర బ్రాహ్మణుల మాతృభాష తెలుగు కాదు, సంస్కృతం. వాస్తవానికి వారు తెలుగువారు కారు. కానీ మనసా వాచా కర్మణా తెలుగుజాతిలో కలిసిపోయి తమ సంస్కృత నామాల్ని సైతం వర్జించి అచ్చతెలుగులో నన్నయ్య, తిక్కన్న, పోతన్న మొదలైన పేర్లు పెట్టుకుని ఇక్కడి జనసామాన్యంతో తాదాత్మ్యం చెందారు. వారు వచ్చి లిపిలేని తెలుగుభాషకు లిపి (బ్రాహ్మీలిపి) నిచ్చారు. వ్యాకరణం లేని తెలుగుభాషకు వ్యాకరణాన్నిచ్చారు. సాహిత్యం లేని భాషలో సాహిత్యాన్ని సృష్టించి ప్రపంచ భాషల సరసన దీని చరిత్రని సగర్వంగా, సుస్థిరంగా నిలబెట్టారు. రాష్ట్రం సంగతి పక్కన బెడితే బ్రాహ్మణులు లేకుండా భారతదేశం అనే పరిభావన (concept) అసలెక్కడుంది ? బ్రాహ్మణ వారసత్వం కాకుండా ఈ దేశానికి ఉన్న ఉమ్మడి వారసత్వం ఏంటి ?

దేసీ ప్రభుత్వాల చేతుల్లో తమ తల్లిదండ్రులు పడ్డ బాధలు గమనించి చాలామంది తెలుగు బ్రాహ్మణుల సంతానం ఇంగ్లీషు అభ్యసించి దశాబ్దాల క్రితమే ఉత్తర అమెరికాకి పారిపోవడం ప్రారంభించారు. ఇతరులకు విదేశీ ప్రయాణం ఒక హోదాచిహ్నం (Status symbol) కాగా బ్రాహ్మణులకు మాత్రం అదొక చావుబతుకుల సమస్యగా మారింది. ఏం చేసైనా సరే, పారిపోక తప్పని పరిస్థితిని అనుభూతి చెందారు. నిరంతర కృషీ, శ్రమా ఫలితంగా బ్రాహ్మణుల ఆర్థిక హోదా (Economic status) గత పాతికేళ్ళల్లో విప్లవాత్మకమైన మార్పుకు లోనైంది. వారిలో కొంతమంది కోటీశ్వరులు కావడంతో అలాగే తానూ కోట్లకు పడగలెత్తాలనే దుగ్ధ ప్రతి బ్రాహ్మణుడిలోనూ పురివిప్పింది. ఏదేమైనా బ్రాహ్మణజాతి యావత్తూ ఉత్తర అమెరికాకు శాశ్వతంగా ఋణపడిపోయింది. స్వదేశంలో ద్వేషానికి బలై కూడు లేక ఆకలితో అలమటిస్తూ వచ్చిన బ్రాహ్మణ బిడ్డల్ని అమెరికామాత ప్రేమగా దగ్గఱికి తీసుకుని అన్నం పెట్టింది. కోట్లు ప్రసాదించింది. MNC లకు అధిపతుల్ని చేసింది. అధికారాన్ని సైతం అనుగ్రహించింది.

అబ్రాహ్మణ హిందూ ప్రభుత్వాల చేతుల్లో నిష్కారణంగా అణచివేతకు గుఱైన వర్గంగా బ్రాహ్మణుల హృదయాంతరాళాల్లో ఒక కసి గూడు కట్టుకుని ఉంది. ఆ కసిలో అది తనకు పూర్వం ఉన్న అనేక అభిమానాల్నీ, సెంటిమెంట్లనీ వదులుకుంది. ఏం చేద్దాం ? చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. మానవజాతి అంతా గుఱ్ఱుపెట్టి ఆదమఱచి గాఢనిద్ర పోతున్న యుగాల్లో కళ్ళు తెఱుచుకుని మేలుకుని అన్నీ ఆలోచించిన ప్రకాశమాన చరిత్ర గల బ్రాహ్మణులు తమ అణచివేతకు రియాక్ట్ అవ్వరని అనుకోవడం ప్రభుత్వాల అమాయకత్వం, మూర్ఖత్వం. ఆ రోజున ఆ అణచివేతల్ని నిరంకుశంగా పాశవిక రాజకీయ అధికార సహాయంతో అమలు జఱుపుతున్న కాలంలో బ్రాహ్మణులు నిస్సహాయులు. పేదవారు. అప్పటికే బ్రిటీషు ప్రభుత్వం చేతిలో దెబ్బదిని చప్పున కోలుకోలేక అప్పటి దాకా తాము పాల్గొంటూ వస్తున్న అన్ని రాజకీయ, సాంఘిక కార్యకలాపాల నుంచీ స్వచ్ఛందంగా విరమించుకున్నారు. అందువల్ల ఆ ప్రభుత్వాలకు ఆనాడు ఒక మంచి అవకాశం లభించింది. తాత్కాలిక విజయం సిద్ధించింది.

అలా దేశం నుంచి పారిపోవడం వెనక బ్రాహ్మణుల్లో కూడా చారిత్రికంగా చోటు చేసుకున్న మనస్తత్త్వపరమైన లోపాలున్నాయి. బ్రాహ్మణులు మొదట్నుంచీ ప్రభుత్వ పోషణ మీదే ఇనుమిక్కిలిగా ఆధారపడి బతికారు. ప్రభుత్వాదరణ మీదే తమ సాంఘిక గౌరవ పునాదుల్ని కూడా నిర్మించుకున్నారు. వారిని ఆదరించిన ప్రభుత్వాలు పోయాయి. వాటి స్థానంలో వచ్చిన కొత్త ప్రభుత్వాలు హఠాత్తుగా తమ మీద కక్ష సాధించడం మొదలుపెట్టడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ పరిస్థితి వస్తుందనుకోలేదు. అందుకు మానసికంగా సన్నద్ధులై లేరు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు.

బ్రాహ్మణులు ఈ మత పరిరక్షణకై నియమించబడ్డవారు. కానీ ఈ కర్తవ్యాన్ని నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. అందుకని వారు ఇందులోంచి విరమించుకోక తప్పడం లేదు. కూడు కోసం, గుడ్డ కోసం, గౌరవం కోసం వారు ఈ హిందూసమాజంతో పోరాడి, పోరాడి పూర్తిగా అలిసిపోయారు. అయినా బ్రాహ్మణుల స్థానాన్ని ఇతరులతో భర్తీ చేయలేం పూర్తిగా ! ఎందుకంటే ఒక పూజారి కొడుకు తన తండ్రి చేస్తున్నవన్నీ శ్రద్ధగా గమనిస్తూ తానూ పెద్దవాడై అలా చేయాలనుకుంటాడు. ఏ శిక్షణ ఇచ్చినా ఆ భావాన్ని కలిగించలేం. అదొక అమూల్యమైన వారసత్వం. ఒకసారి ఆ వారసత్వం లోంచి బయటపడ్డ కుటుంబాలు తిరిగి అందులోకి వెళ్ళడం చాలా కష్టం, మా కుటుంబం లాగే ! అయినా దేవాలయాల్లో నిత్యనైమిత్తికాలు నడవాల్సి ఉంది. అందుకు హిందువులే ఏదో ఒక ఏర్పాటు చూసుకోవాలి. ఏ ఏర్పాటైనప్పటికీ ఇప్పుడు బ్రాహ్మణుల్ని హింసించినట్లుగా కొత్తవారిని కూడా హింసించకుండా ప్రేమతో, గౌరవంతో, ఆదరంతో, అభిమానంతో చూసుకోవడం అవసరం.



Read more...

నేను! నేను!! నేను!!!

నేను! నేను!! నేను!!!
- నాయుని కృష్ణమూర్తి
మనలో అహంకారం ఎక్కువ. మన మనసును అహంకారం శాసిస్తోంది. 'అహంకారం' అంటే 'నేను' అనే గర్వం.

- 'నేను' ఈ కుటుంబానికి యజమానిని. అందరికీ తిండి పెడుతున్నాను. కాబట్టి నామాట ప్రతి ఒక్కరూ వినాలి. నన్ను ఎదిరించకూడదు. నన్ను తక్కువచేసి మాట్లాడకూడదు'

'నేను' కాబట్టి ఈ పనిని చెయ్యగలిగాను'

ఇలా 'నేను' ప్రతిరోజూ, ప్రతివ్యక్తి మాటల్లోనూ, చేతల్లోనూ వ్యక్తమవుతోంది. ఇది అవతలి వ్యక్తులు భరించలేని స్థాయికి కూడా వెళ్తుంది. వాళ్ళు భరించలేకపోవడానికి వాళ్ళలో కూడా 'నేను' అన్న అహంభావం ఉండటమే కారణం!

రహూగణుడు అనే రాజు తత్వజ్ఞానం కోసం కపిల మహాముని దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నది పల్లకిలో. పల్లకిని నలుగురు బోయీలు మోస్తున్నారు. పెద్దంత దూరం వెళ్లిన తరవాత బోయీలు అలసిసోయారు. ఒక్కొక్కరికి కాస్సేపు విశ్రాంతి ఇవ్వడానికి ఒక అదనపు బోయీ కావాలి. చుట్టూ చూశారు. దోవపక్కన చేనుకు ఒకడు కాపలా కాస్తున్నాడు. వాణ్ని తమకు సహాయంగా రమ్మన్నారు. అతడు వెంటనే వచ్చి పల్లకిని మోయడానికి సిద్ధపడ్డాడు. ఒక బోయీకి కాస్సేపు విశ్రాంతి లభించింది.

వచ్చిన కొత్తవ్యక్తి జడ భరతుడు. అహంకారం, మమకారం, మిథ్యాజ్ఞానం ఏమీలేనివాడు. భరతుడికి పల్లకి మొయ్యడం కొత్త. పల్లకిలో కుదుపులు మొదలయ్యాయి.

లోపల కూర్చొని ఉన్న రహూగణుడికి కోపం వచ్చింది. 'ఓరీ బుద్ధిహీనుడా! పల్లకి మొయ్యడం కూడా నీకు చేతకాదా? నిన్ను కఠినంగా శిక్షిస్తేగాని నీకు బుద్ధి రాదు' అని తిట్టాడు.

భరతుడు తలపైకెత్తి రాజు వంక చూస్తూ 'రాజా! నీ పల్లకి మోసే భారం నా శరీరానిదేగాని, అందులోని జీవుడిది కాదు. కాబట్టి నేను నీ పల్లకి మొయ్యడంలేదు. స్థూలత్వం, కృశింపు, వ్యాధులు, మనోవ్యధలు, ఆకలిదప్పులు, భయరోషాలు, జరామరణాలు, నిద్రాజాగరణలు, అహంకార మమకారాలు దేహంతోపాటు పుడతాయి. దేహాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. 'ఈ దేహమే నేను' అని నేను అనుకోవడంలేదు. కాబట్టి నేను జీవన్మృతుణ్ని. యజమాని, సేవకుడు అనే సంబంధం విధికృతమైంది. ఆ వ్యవహారం శరీరానికే పరిమితం కాని జీవుడి వరకు రాదు.

రాజు అనే అహంభావంతో నువ్వు నన్ను శిక్షిస్తానంటున్నావు. ఉన్మత్తత, జడత్వం స్వభావంగా ఉన్న నన్ను నీ శిక్ష ఏం చేస్తుంది? స్తబ్ధుణ్నయిన నాపట్ల నీ ఆగ్రహం, శిక్ష రెండూ వ్యర్థమే!' అన్నాడు.

భరతుడికి మించిన గురువు ఉండడని రాజుకు తెలిసిపోయింది. దిగ్గుమని పల్లకి దిగి భరతుడి కాళ్లకు మొక్కి తత్వబోధ చెయ్యమని వేడుకొన్నాడు.

భరతుడిలాగా మనమందరమూ ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అంత స్తబ్ధులుగా ఉండి ఈ ఆధునిక ప్రపంచంలో జీవించడం కష్టం.

కాని కొంతవరకైనా జ్ఞానం సంపాదించుకొని, అహంభావాన్ని ఒకింత అదుపులో పెట్టుకోగలిగితే మనం మరికొంత సుఖంగా జీవించగలం. ఎదుటివాళ్లు కొంతస్వేచ్ఛగా వూపిరి పీల్చుకోగలుగుతారు.

Read more...

జ్ఞాతవ్యము [తెలుసుకోదగినది.]

>> Saturday, May 21, 2011


భగవంతుడన్నిచోట్ల పరిపూర్ణుడైయున్నాడు . ఈ విషయమును ఆస్తికులందరూ నమ్ముదురు. కానీ,ఎవరైతే మూర్తిని,వేదములను,సూర్యుని,రావిచెట్టును,తులసిని,గోవును మొదలినవాటిని భగవంతుడని తలచి పూజిస్తారో వారే నిజముగా అట్లునమ్మినవారు. కారణమేమనగా ఎవరితే మూర్తి,వేదములు,సూర్యుడు మొదలైన వాటిలో భగవంతుని నమ్ముతారో వారే స్వతహాగా అన్నిచోట్ల సంపూర్ణుడైన భగవంతుని విశ్వసిస్తారు. ఎవరైతే కేవలం మూర్తిలోనే భగవంతుని నమ్ముతారో వారు ప్రాకృత[ఆరంభ] భక్తులనబడతారు.
అర్చాయామేవ హరయే పూజాం య:శ్రద్దయేహతే/
నతద్భక్తేషు చాన్యేషు స భక్త: ప్రాకృత: స్మృత:
[శ్రీ మద్భాగవతం ౧౧-౨-౪౭]
ఏలననగా వారు ఒకేచోట భగవంతుని పూజను ప్రారంభించిరి. కావునవారు భగవంతుని సన్ముఖులైరి . కానీ, ఎవరు ఎవరు భగవ్ంతుడన్నిచోత్ల ఉన్నాడు అని పలికి,ఎక్కడ భగవంతుని పట్ల వారికి ఆదరభావము,పూజ్యభావము,శ్రేష్ఠభావము లేదో వారిని భక్తులనరు. ఎందుకనగా వారు వాచా భగవంతుడన్నిచోట్ల ఉన్నాడని పలకటమేగాని నిజంగా మనసున విశ్వసించరు. కావున భగవంతునికి సన్ముఖులుకారు.
మూర్తి యందు భగవంతుని పూజ శ్రధ్ధ విషయమే ,కానీ తర్కవిషయముకాదు. ఎవరికి శ్రద్ధయుండునో వరియెదుట మహత్వము ప్రకటితమగును .వారిద్వారా చేయబడిన పూజనే భగవంతుడు గ్రహించును. వారిచేతిప్రసాదమునే స్వీకరించును. ఏలయనగా భగవంతుడు కల్మాబాయి పెట్టిన కిచిడి తిన్నాడు.ధన్నాభక్తుడు పెట్టిన రొట్టెముక్కను భుజించాడు. మీరాబాయి ఇచ్చిన పాలు తాగాడు. వీటన్నింటిసారాంశమేమంటే శ్రధ్ధాభక్తులచేతనే మూర్తియందు భగవంతుడు ప్రకటితమగును.

Read more...

హనుమంతుని దయకు ప్రత్యక్ష్యనిదర్శనం

>> Friday, May 20, 2011





our poojya guruji tole wherver sundarakanda is recieted there hanuman appears and listens and bring managalam to the house and to its owner. look at the photos below--regards
rajanikanth

Yatra yatra raghunatha kirtanam;
Tatra tatra kritha masthakanjalim;
Bhaspavaari paripurna lochanam;
Maarutim namata raakshasanthakam
Meaning : "We bow to Maruti, Sri Hanuman, who stands with his palms folded above his forehead,
with a torrent of tears flowing down his eyes wherever the Names of Lord Rama are sung".
Sri Hanuman JI - Chiranjeevi and will be there where Harikatha or Ramayan discourses takes place. Please Scroll down....
Jai Jai SitaRam
This is a real incidence happened at a Shri Ramayan Katha in Gujrat. These phots were captured by a photo journalist Shahid Mir.
The photographs are self explanatory. But in short it seems like that Shri Hanuman paid a visit during the katha pravachan and blessed the Swamiji and Mahantji. After blessings The Vanarji left.
Bajrangbali ki Jai
Jai Siya Ram





Jai Jai SitaRam


Read more...

హనుమాన్ చాలీసాలో సాధనారహస్యాలు

>> Thursday, May 19, 2011


శ్రీగురుచరణ రజ నిజమన ముకుర సుధారీ
వరుణౌ రఘువర విమల జోయశదాయక ఫలచారీ
బుద్ధి హీన తనుజానికై సుమిరౌ పవన కుమార్
బలబుద్ధి విద్యాదేహు మొహి హరహు కలేశవికార్



1 జయ హనుమాన జ్ఞాన గుణ సాగర | జయ కపీశ తిహులోక ఉజాగర
2 రామదూత అతులిత బలధామ | అంజని పుత్ర పవన సుతనామా
3 మహావీర విక్రమ బజరంగీ | కుమతినివార సుమతికే సంగీ
4 కంచన వరణ విరాజ సువేశా | కానన కుండల కుంచితకేశా
5 హథవజ్ర అరుధ్వజా విరాజై | కాంధే మూంజ జనేవూ సాజై
6 శంకర సువన కేసరి నందన | తేజ ప్రతాప మహాజగ వందన
7 విద్యావాన గుణీ అతిచాతుర | రామ కాజ కరివేకో ఆతుర
8 ప్రభు చరిత్ర సునివేకో రసియా | రామలఖన సీతా మన బసియా
9 సూక్ష్మరూపధరి సియహిదిఖావా | వికటరూపధరి లంకజరావ
10 భీమరూపధరి అసుర సం హారే | రామచంద్రకే కాజ సవారే
11 లాయ సజీవన లఖన జియాయే | శ్రీరఘువీర హరిషి వురలాయే
12 రఘుపతి కీన్హీ బహుత బడాయీ | తుమ మమ ప్రియ భరతహి సమభాఈ
13 సహస్ర వదన తుమ్హారో యశగావై | అసకహి శ్రీపతి కంఠలగావై
14 సనకాది బ్రహ్మాది మునీశా | నారద శారద సహిత అహీశా
15 యమ కుబేర దిగపాల జహాతే | కవి కోవిద కహిసకై కహతే
16 తుమ ఉపకార సుగ్రీవ హికీన్ హా | రామ మిలాయ రాజపద దీన్ హా
17 తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయే సబ జగ జానా
18 యుగ సహస్ర యోజన పరభానూ | లీల్యో తాహీ మధుర ఫలజానూ
19 ప్రభు ముద్రికా మేలిముఖ మాహీ | జలధి లాంఘిగయే అచరజనాహీ
20 దుర్గమ కాజ జగతికే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హారే తేతే
21 రామదుఆరే తుమ రఖవారే | హోతన అజ్ఞా బినుపైసారే
22 సబ సుఖలహై తుమ్హారీ శరనా | తుమ రక్షక కాహూకో డరనా
23 ఆపనతేజ సం హారో అపై | తీనో లోక హాంకతే కాంపై
24 భూత పిశాచ నికట నహిఆవై | మహావీర జబనామ సునావై
25 నాసై రోగ హరై సబపీరా | జపత నిరంతర హనుమత వీరా
26 సంకటసే హనుమాన ఛుడావై | మన క్రమ వచన ధ్యానజోలావై
27 సబపర రామ తపస్వీరాజా | తినకే కాజ సకల తుమ సాజా
28 ఔర మనోరధ జో కోఇలావై | సోఇ అమిత జీవన ఫలపావై
29 చారోయుగ పరతాప తుమ్హారా | హై పరసిద్ధి జగత ఉజియారా
30 సాధుసంతకే తుమ రఖవారే | అసుర నికందన రామదులారే
31 అష్టసిద్ధి నవనిధి కే దాతా | అసవర దీన్హ జానకీ మాతా
32 రామరసాయన తుమ్హారే పాసా | సాదర తుమ రఘుపతికే దాసా
33 తుమ్హారే భజన రామకొపావై | జన్మ జన్మకే ధుఃఖబిసరావై
34 అంతకాల రఘుపతి పురజాయీ | జహా జన్మ హరిభక్త కహాయీ
35 ఔర దేవతా చిత్తన ధరయీ | హనుమత సేయీ సర్వసుఖ కరయీ
36 సంకట హటై మిటై సబ పీరా | జో సుమిరై హనుమత బలవీరా
37 జైజైజై హనుమాన గోసాయీ | క్రుపాకరో గురుదేవకీ నాయీ
38 యహశతవార పాఠకర జోయీ | చూటహి బంది మహసుఖహోయీ
39 జో యహ పడై హనుమన చాలీసా | హోయ సిద్ధి సాఖీ గౌరీసా
40 తులసీ దాస సదా హరిచేరా | కీజై నాథ హృదయ మహ డేరా

పవనతనయ సంకటహరణా మంగళ మూరతి రూప్

రామలఖన సీతాసహిత హృదయబసహు సురభూప్


హనుమాన్ చాలీసాలో ప్రతి ఒక్కదోహా ఒక సంపుటీకరణ మంత్రం తోసమానం నిష్ఠతో జపించినా పదేపదే స్మరించినా పాయాకార్యాలను సాధించగల మహాశక్తివంతములు .ఏసమస్యకు ఏ దోహాను పఠించాలో వివరములు.



పిల్లలకు చదువులో అభివృద్ధికి

[బుధ్ధిహీననతనుజానికై సుమిరౌపవనకుమార్

బలబుద్ధి విద్యాదేహు మొహి హరహుకలేశవికార్]



శారీరకబలహీనత తొలగుటకు[2] మానసిక బలానికి[౩] సంతానప్రాప్తికి[6] అధికారమునకు[16] కష్టతరమైన కార్యసాధనకు[20] భయంతీరుటకు[22] భూతబాధలనివృత్తికి[24] అనారోగ్యనివారణకు[25] సంకటములు తొలగుటకు[26] దుష్టభీతి నివారణకు[30] సకలసంపదలవృధ్ధికి[31] మానసికవ్యాకులత నివారనకు[౩౩] సంకటముల నివారణకు [36]ఆథ్యాత్మిక ప్రగతికి[37]


Read more...

మూర్తిపూజ

>> Monday, May 16, 2011


మనసనాతన వైదిక సిధ్దాంతంలో భక్తులు మూర్తిపూజ చేయరు .పరమాత్మనే పూజించెదరు. సారాంశమేమనగా అన్నిచోట్ల పరిపూర్ణుడైన పరమాత్మను విశేషముగా ధ్యానించువారు మూర్తినిచెసి ఆమూర్తిద్వారా పరమాత్మను పూజించెదరు.దానివలన పరమాత్మధ్యానము,చింతనము సుగమమగును.
ఒకవేళ అర్చకుడు మూర్తినేపూజించినట్లైతే అతని మనస్సులో రాతి విగ్రహభావనయే ఉడును . "నీవు జడమైన పర్వతమునుండి వచ్చినావు జడుడైన మనిషి నిన్నుచేసినాడు,మరొకవ్యక్తి నిన్ను ఇక్కడుంచాడు . కావున ఓ రాతిదేవుడా ! నాకు శుభం చేయుము" కానీ యిట్లెవ్వడు పలుకడు . మరి మూర్తిపూజ ఎక్కడ జరిగినది? కావున భక్తులు మూర్తిపూజ చేయరు. మూర్తియందు భగవంతుని పూజించెదరు .అనగా మూర్తి భావమును తొలగించి భగవద్భావనతో పూజ చేయుదురు. ఈ విధముగా మూర్తియందు భగవద్భావముతో పూజించుటచే అన్నిచోట్ల భగవద్భావము కలుగును. భగవంతునిపూజించుటచే భగవంతుని యందు భక్తికలుగును .భక్తుడు సిధ్ధుడైనప్పుడు భగవంతుని పూజ జరుగును.
మూర్తియందు తనను పూజించు విషయంలో భగవంతుడు గీతయందిట్లునుడివియున్నాడు. "భక్తులు భక్తిపూర్వకంగా నాకు నమస్కరించి నన్నుపాసించెదరు. [9-14] . ఏ భక్తుడు శ్రధ్ధా భక్తులతో పత్రము,పుష్పము,ఫలము ,తోయము నాకర్పించునో " ఆ యుపహారమును నేను బుజించెదను" [9-26] దేవతలను[విష్ణువు,శివుడు,,శక్తి,గనేశుడు,సూర్యుడు వీరు పంచదేవతలు] బ్రాహ్మణులను,గురువు,తల్లిదండ్రులను,పెద్దలను,జ్ఞానులైన జీవన్ముక్తులను ,మాహాత్ములను పూజించుట శారీరక తపస్సనబడును. [17-14]ఎదుట మూర్తిలేనిచో దేనికి నమస్కరించవలెను ?.పత్ర,పుష్పఫల,జలములు మొదలగునవి దేనికి ఇవ్వవలెను ? దేనిని పూజించవలెను ? కావున గీతలో మూర్తిపూజ విషయముకూడా యున్నదని తెలియుచున్నది.
అదే విధముగా గోవు,తులసి.రావిచెట్టు,బ్రాహ్మణుడు,తత్వజ్ఞుడైన జీవన్ముక్తుడైన ,గిరిరాజైన గోవర్ధనము,గంగా,యమున మున్నగు వాటి పూజకూడా భగవత్పూజయే . వీటిని పూజించుటవలన అన్నిచోట్ల పరమాత్మయున్నాడు అనుమాట సులభముగాయనుభవమునకు వచ్చును. కావున అన్నిచోట్ల పరమాత్ముని యనుభవమునకు గోవు మొదలైన వాటిపూజ సహాయపడును. కారణమేమనగా అన్నిచోట్ల భగవంతుడున్నాడు అనిపూజించువాడు అంగీకరించినాడు. కానీ దేనినీ పూజించకుండా,కేవలం అన్నిచోట్లపరమాత్మ ఉన్నాడు అని మాటలుమాత్రమే చెప్పినచో అతనికి భగవంతుని యనుభవము రాదు. సారాంశమేమనగా మూర్తియందు భగవంతుని పూజించుట శుభానికి,శ్రేయస్సుకూ సాధనము.
భగవంతుని పూజలేకుండా అస్తిమాంసములను పూజించుట అనగా తన శరీరమును అందమైన బట్టలతో,సొమ్ములతో అల్ంకరించుట,ఇంటిని పెద్దగా కట్టుట,సుందరసామాగ్రితో అలంకరించుట,శృంగారము చ్జేసికొనుట మొదలైనవి కూడా మూర్తిపూజలే. అవి పతనమునకు దారితీయును.

Read more...

నమో నారసింహా!


నమో నారసింహా!
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌
శ్రీహరి దశావతారాల్లో, సద్యోజాతాల(గర్భవాసం లేనివి) పరంపరలో నృసింహావతారం విశిష్టమైనది. మృగమూ కాకుండా మనిషీ కాకుండా నర, జంతు సమ్మిళిత రూపంలో స్వామి ఆవిర్భవించాడు. అవతరించిన మరుక్షణమే దుష్టశిక్షణకు సమాయత్తమై భక్త వాత్సల్యమూర్తిగా ప్రహ్లాదుణ్ని అనుగ్రహించాడు. హిరణ్యకశిపుడు దక్కించుకున్న వరాలకు ఎక్కడా భంగం వాటిల్లకుండా ద్వంద్వాలకు అతీతంగా దనుజ సంహారం చేశాడు. దివ్యమైన, భవ్యమైన ఈశ్వర చైతన్యం ఒక్కటేనని తన రూపంద్వారా స్వామి చాటిచెప్పాడు. ప్రహ్లాదుడిపట్ల ప్రేమాస్పదునిగా, హిరణ్యకశిపుడిపై రౌద్రమూర్తిగా స్వామి ఏకకాలంలో ద్వంద్వ ప్రవృత్తుల్ని కనబరచాడు. ఇరువురికీ తన మూర్తిమత్వం ప్రకటించడం కోసం రెండు అంశాల్ని ఏకీకృతం చేసి తన అవతారతత్వాన్ని వెల్లడించాడు.

ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుల గాథలతో ముడివడిన ప్రసిద్ధ క్షేత్రాలు మనరాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఆ నేపథ్యంలోనివే అహోబలం, యాదగిరి. ఈ క్షేత్రాల్లో ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాల్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. పురాణాలు, సంహితల ప్రకారం నారసింహాకృతుల్ని నానా విధాలుగా వర్ణించి చెబుతారు. ఆ రూపాలే పలు ఆలయాల్లో నిత్య పూజలందుకుంటున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పర్వత పంక్తుల మధ్య నెలకొన్న అహోబిల క్షేత్రం నవ నారసింహ సన్నిధానంగా విఖ్యాతి గాంచింది. ఉగ్ర, ప్రహ్లాద వరద, మాలోల, జ్వాల, భార్గవ, ఛత్రవట, యోగానంద, కారంజ, వరాహ నరసింహస్వామి రూపులు ఇక్కడ దర్శనమిస్తాయి. ఒకే పరిధిలో నవ నారసింహధామాలు విరాజిల్లడం అహోబిలం ప్రత్యేకతగా చెబుతారు. హిరణ్యకశిపుని సంహరణ కోసం విష్ణువు నరసింహుడిగా వ్యక్తమైన సందర్భంలో ఉగ్రమూర్తిగా స్వామి గోచరించాడంటారు. ఆ రూపం ఎగువ అహోబిలంలో ఉంటుంది. రాక్షసవధ తరవాత స్వామి తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించి, ప్రహ్లాద వరద నరసింహుడిగా దర్శనమిచ్చాడని చెబుతారు. ఈ నరసింహమూర్తిని దిగువ అహోబిలంలో భక్తులు తిలకించి పులకిస్తారు. విశిష్టాద్వైత సంప్రదాయరీతిలో ఈ క్షేత్రంలో నిత్యార్చనలు, ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతాయి.

హిరణ్యకశిపుని కడతేర్చాక ప్రహ్లాదుడికి సుప్రసన్న మూర్తిగా స్వామి తన దర్శనాన్ని అనుగ్రహించిన దివ్యసన్నిధే యాదగిరిగుట్ట క్షేత్రమని చెబుతారు. రుష్యశృంగుడి పుత్రుడైన యాదర్షి తపః ఫలితంగా స్వామి అర్చామూర్తిగా యాదగిరిపై కొలువుతీరాడంటారు. ఏకశిలా శిఖరంపైన స్వామి పంచ రూపాల్లో ఇక్కడ వ్యక్తమయ్యాడు. జ్వాల, యోగానంద, గండభేరుండ, ఉగ్ర, లక్ష్మీనరసింహ అనే నామధేయాలతో నారసింహుడు వర్ధిల్లుతున్నాడు. అందుకే ఇది పంచ నారసింహ క్షేత్రంగా విలసిల్లుతోంది. పాంచరాత్ర ఆగమోక్తంగా పదకొండు రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో లక్ష్మీనారసింహుల తిరుకల్యాణాన్ని ఈ నెల 23వ తేదీన నయన మనోహరంగా జరిపించనున్నారు.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ ప్రధాన హేతువుగా ఉద్భవించిన నరసింహుని ఆశ్రయించడం సకలభయ నివారకం, సచ్చిదానంద దాయకం, సన్మంగళ కారకం.

Read more...

కృతజ్ఞత - కృతఘ్నత

>> Sunday, May 15, 2011

కృతజ్ఞత - కృతఘ్నత
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
నం తరచుగా 'కృతజ్ఞత', కృతఘ్నత' అనే మాటలు వింటూంటాం. వినడానికి ఇవి సామాన్యపదాలుగా ఉన్నా- అద్భుతమైన మానవ జీవనరహస్యం వీటిలో నిక్షిప్తమై ఉంది. మానవుడికి ప్రధానంగా ఉండవలసిన సహజ లక్షణం 'కృతజ్ఞత'. ఉండకూడని ప్రధాన అవలక్షణం 'కృతఘ్నత'. ఈ రెండింటి వైశిష్ట్యం బాగా అవగాహన చేసుకుని తన జీవితంతో వీటిని సమన్వయం చేసుకుని జీవనయానం చేయగలిగేవాడు మహామనీషి!

చేసిన మేలును గుర్తుంచుకుని ఎదుటివారికి ప్రత్యుపకారం చేయడం 'కృతజ్ఞత'. చేసిన మేలును మరచిపోవడం మహాపాపం- అదే కృతఘ్నత. ఎన్నో ఎన్నో పాపాలకు పరిహారమూ, ప్రాయశ్చిత్తమూ ఉంటాయని రుషులు, విజ్ఞులు సూచించారు. కృతఘ్నతకు నిష్కృతే లేదన్నారు. కృతఘ్నుడి మాంసాన్ని కుక్కలు కూడా తినవని భారతంలో విదురనీతి చెప్పింది. శ్రీరాముడి సద్గుణ సంపదలో ప్రధానమైనది కృతజ్ఞతాలక్షణమని వాల్మీకి మహర్షి అభివర్ణిస్తాడు. ఇతరులు తనకు 'చిన్న' ఉపకారం చేసినా- రాముడు అపరిమితానందం వ్యక్తంచేసేవాడట. ఎవరైనా తనకు వంద అపకారాలు చేసినా, అది క్షణంలో మరిచిపోయేవాడట. సీతాపహరణ ఘట్టంలో రావణుడితో పోట్లాడి ప్రాణాలు కోల్పోతున్న జటాయువుపట్ల రాముడు చూపిన కృతజ్ఞత అపూర్వం. ఆ కృతజ్ఞతవల్లనే తన కారణంగా మరణించిన జటాయువుకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వర్తించాడు! తనను చేరదీసి అంగరాజ్యాభిక్తుణ్నిచేసి, నిజమైన మైత్రికి సాక్షీభూతుడిగా నిలిచిన సుయోధనుడికి ఆజన్మాంతం రుణపడి ఉన్నానన్న కర్ణుడు ప్రదర్శించిన కృతజ్ఞతాభావం అనన్యసామాన్యమైనది. లక్క ఇంటినుంచి బైటపడిన తమకు ఆశ్రయమిచ్చిన కుటుంబానికి ప్రత్యుపకారం చెయ్యాలన్న సత్సంకల్పంతో కుంతీదేవి బకాసురుడికి ఆహారంగా తన కుమారుడు భీమసేనుణ్ని పంపేందుకు సిద్ధపడింది. వాసుదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ తమకు అండగా ఉన్నాడు కనుకనే పాండవులు సర్వదా ఆయనకు విధేయులు, కృతజ్ఞులై సజ్జనులనిపించుకున్నారు. ద్రోణాచార్యుని పరోక్షగురువుగా భావించి విలువిద్యలో విశేష నైపుణ్యం సముపార్జించుకోగలగడం వల్లనే ఏకలవ్యుడు నిస్సంకోచంగా తన బొటనవేలిని కోసి గురుదక్షిణగా సమర్పించుకున్నాడు.

ఈ యుగంలో మానవుడు ఇతరులనుంచి పొందిన ఉపకారాన్ని ఇట్టే మరిచిపోతున్నాడు. అది ఘోరమైన పాపమన్న ఆలోచనే లేదు. పైగా ఉపకారం పొందికూడా అపకారమే చేస్తున్నాడు. మనం అసలు ఎవరికి ఎందుకు కృతజ్ఞులమై ఉండాలి? మనం తింటున్న తిండి, కడుతున్న బట్ట, ఉంటున్న గూడు... మనం తయారుచేసుకున్నవి కావు. ఇవి సమకూర్చినవాళ్లకు మనం కృతజ్ఞులమై ఉండాలి. పంచభూతాల వల్ల ఈ దేహం ప్రాణంతో పెరుగుతోంది. కనుక వాటికి కృతజ్ఞత తెలుపుకోవాలి. సృష్టిలో ప్రత్యణువునుంచి, ప్రతి వస్తువునుంచి మనం ఉపకారమో, సుఖమో పొందుతున్నాం. ప్రతి వ్యక్తినుంచీ సమయం-సందర్భాలనుబట్టి ఎప్పుడో అప్పుడు ప్రయోజనం ఇంతోఅంతో పొందుతూనే ఉన్నాం. కనుక వీరంతా మన కృతజ్ఞతకు అర్హులే! శాస్త్ర పురాణాల నుంచి, వేదోపనిషత్తులనుంచి, సత్సంగాలనుంచి, తీర్థయాత్రలనుంచి ఎంతో 'మంచి'ని నేర్చుకోవచ్చు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, హితవు తెలిపి, పథం నిర్దేశించే ఆచార్యులకు, శ్రేయం చేకూర్చే స్నేహితులకు, కంటికి రెప్పలా మనల్ని చూసుకునే కుటుంబ సభ్యులకు, సమాజంలో మనల్ని ఆదరించి అభిమానించే సాటిమానవులకు మనం సర్వదా కృతజ్ఞులమై, విధేయులమై ఉండి తీరాల్సిందే! వీరందరికీ మనం ప్రేమతో, సేవతో, ప్రత్యుపకారంతో, గౌరవంతో, ఆత్మీయతతో రుణం తీర్చుకోవలసిందే. లేకపోతే ఈ మానవజన్మకు అర్థమూ-పరమార్థమూ అనేవే ఉండవు. చదువో, పదవో, ధనమో, బంగారమో సంపాదించినంత మాత్రాన మన అవసరాలు తీరవు. మనకు సుఖసంతోషాలు లభించవు. కృతజ్ఞత కోసం వీటిని వినియోగించినప్పుడే ఆనందం లభిస్తుంది. చివరికి అపకారం తలపెట్టినవాడికి సైతం ఉపకారమే చేసి పంపాలి. అదే మానవత్వం. అందుకే వేమన అంటాడు- 'చంపదగినయట్టి శత్రువు తనచేత-జిక్కెనేని కీడు చేయరాదు- పొసగి మేలుచేసి పొమ్మనుటే చాలు'. మానవ జీవన తాత్వికత అంతా ఈ నాలుగు మాటల్లోనే నిబిడీకృతమై ఉందనడం అత్యుక్తి ఎంతమాత్రం కాదు. మనం అనేక విధాలుగా భక్తి ప్రకటించుకుంటున్నాం. కృతజ్ఞతాభావమనేది ప్రధానంగా అంతర్లీనమై ఉండకపోతే ఆ భక్తి నిరుపయోగం, నిష్ఫలం. 'ఎదుటివారి ఉపకారాన్ని గ్రహించటమే బుద్ధిమంతుల లక్షణం. అందుకు ప్రత్యుపకారం చెయ్యడం మధ్యమమార్గం. పొందిన ఉపకారంకంటే ఎన్నో రెట్లు ప్రత్యుపకారం చేసి రుణవిముక్తులం కావటం సర్వోత్తమ లక్షణం- అని భారతం చెబుతున్నది. ఈ మహత్తర భారత సందేశాన్ని నిరంతరం గుర్తుంచుకుని, జీవనయాగ మంత్రబీజాక్షరాలుగా ఆహ్వానించడమే ఇప్పుడు మనం చేయవలసిన పని!



Read more...

సద్గురుదేవులు వీరబ్రహ్మేంద్రుల ఆరాధన ఈరోజు

>> Thursday, May 12, 2011


వీరబ్రహ్మేద్రులగూర్చి తెలియని ఆంధ్రుడుండడు. కాలజ్ఞానాన్ని బోధించి జాతిని హెచ్చరించిన మహాత్ముడు. మానవుని అవివేకంచే ఏర్పరుచుకున్న సంకుచిత భావాలను ఖండించి సత్యాన్ని బోధించిన విప్లవయోగి . వ్యాపారమను పేర తెల్లదొరలు మనదేశమొచ్చి ఉద్యోగములుచూపి ఉచ్చులెన్నో వేసి మనమతానికె ఎసరు పెడతారని హెచ్చరించారు జాతిని. మనిషిగా పుట్టిన వాడెమి చేయాలో దేన్నిసాధించాలో దిశనిర్దేశం చేసిన సద్గురు పరంపరలో మహాగురువాయన. తాతగారూ అని అందరిచే పిలుపించుకునే ఆసద్గురువు ఆరాధనా ఉత్సవం జరుగుతున్న రోజు ఈరోజు. జీవసమాధిలో ఉంటూ నేటికీ భక్తులను కపాడుతూ ముముక్షువులకు మార్గదర్శనం చేస్తున్న ఆపరమగురువులపాదారవిందములకు ప్రణమిల్లుతూ..............జయముజయము సద్గురుపరంపరకు .

Read more...

సామవేదాంతర్గతమైన గణపతి మంత్రము


శ్రీ గురుభ్యోనమ:
శ్రీగణేశాయనమః
అందరికీ నమస్సులు,

సామవేదాంతర్గతమైన గణపతి మంత్రములను నామములుగా, స్తోత్రముగా స్వయంగా శ్రీ
హరి, పార్వతీ దేవికి చెప్పిన స్తోత్రమిది. మొదటి శ్లోకములలోని నామములు
చెప్పినంతనే విఘ్నేశ్వరుని కృపతో సర్వ విఘ్న నివారింపబడతాయి. ఈ అష్టకం
చాలా మహిమాన్వితమైనది. మూడు సంధ్యలలోనూ పఠింపతగినది. ఆర్తి కల
భాగవతులందరికీ పనికి వస్తుందని దీనిని ఇక్కడ ఉంచడం జరిగింది.

ఓం

గణేశమేకదంతం చ హేరంబం విఘ్ననాయకం !
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం!!

------------------------------

----------------------
జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకః!
తయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్‌ !!1

ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకః!
బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహమ్‌ !!2

దీనార్థవాచకో హేశ్చ రంబః పాలకవాచకః!
పాలకం దీనలోకనాం హేరంబం ప్రణమామ్యహమ్‌!! 3

విపత్తివాచకో విఘ్నోనాయకః ఖండనార్థకః!
విపత్‌ ఖండనకారం తం ప్రణమామి విఘ్ననాయకమ్‌ !!4

విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబం పురోదరమ్‌!
పిత్రా దత్తైశ్చ వివిధైఃవందే లంబోదరం చ తమ్‌ !!5

శూర్పాకారౌ చ యత్కర్ణౌ విఘ్నవారణకారణౌ!
సంపద్దౌ జ్ఞానరూపే చ శూర్పకర్ణం నమామ్యహమ్‌!! 6

విష్ణుప్రసాదం మునినా దత్తం యన్మూర్ధ్ని పుష్పకమ్‌!
తద్‌గజేంద్ర ముఖం కాంతం గజవక్త్రం నమామ్యహమ్‌ !!7

గుహస్యాగ్రే చ జాతోయమావిర్భూతో హరాలయో!
వందే గుహాగ్రజం దేవం సర్వదేవాగ్రపూజితమ్‌ !!8

ఫలశ్రుతి:-

ఏతన్నామాష్టకం స్తోత్రం నానార్థసహితం శుభమ్‌!
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స సుఖీ సర్వతో జయీ!! 9

తతో విఘ్నాః పలాయంతే వైనతేయాత్‌ యథోరగాః!
గణేశ్వర ప్రసాదేవ మహాజ్ఞానీ భవేత్‌ ధ్రువమ్‌ !!10

పుత్రార్థీ లభతే పుత్రం భార్యార్థీ కుశలాం స్త్రియమ్‌!
మహాజడః కవీంద్రశ్చ విద్యావాంశ్చ భవేత్‌ ధ్రువమ్‌ !!11

-: ఇతి శ్రీ బ్రహ్మవైవర్త పురాణే గణపతి ఖండే శ్రీ గణేశ నామాష్టక
స్తోత్రమ్‌ :-
aayyagaari nagendrakumar

Read more...

అక్షయపాత్ర

>> Wednesday, May 11, 2011

his noble initiative from Bengaluru which targetted for the benefit of school going children in Karnataka. Possibly, the Government of Maharashtra or ANDHRA PRADESH could take a leaf from this initiative !!!!!!


Akshaya Patra does it in BENGALURU !!!


http://www.akshayapatra.org/Centralized1/data/images/1.jpg
The kitchen from the outside - a three-storey building which uses Gravity Flow Mechanism developed in-house
by our team. Each kitchen has the capacity to cook between 50 000 to 100 000
mid-day meals per day. Costing approximately 9 crores to set up, they are built with funds from public donations.

http://www.akshayapatra.org/Centralized1/data/images/2.jpg
The kitchen from the inside, consisting of rice cauldrons each of which
cooks up to 110kg of rice in 20 minutes. Sambar cauldrons cook up to 1200
litres of sambar in two hours.

http://www.akshayapatra.org/Centralized1/data/images/4.jpg
It is washed thoroughly on the 2nd floor

http://www.akshayapatra.org/Centralized1/data/images/5.jpg
Washed rice is sent down the chute to the 1st floor

http://www.akshayapatra.org/Centralized1/data/images/6.jpg
Rice pours down into steam heated cauldrons for cooking. The entire cooking process
takes place on the 1st floor

http://www.akshayapatra.org/Centralized1/data/images/7.jpg
Super heated steam is used to cook food instead of flame.

http://www.akshayapatra.org/Centralized1/data/images/8.jpg
When cooking is finished, it is loaded into trolleys

http://www.akshayapatra.org/Centralized1/data/images/9.jpg
Cooked rice is sent down the chute to the ground floor

http://www.akshayapatra.org/Centralized1/data/images/10.jpg
It flows down the pipe into containers

http://www.akshayapatra.org/Centralized1/data/images/11.jpg
Piping hot rice on its way to being loaded into food vans. Around
6000 kilosof rice are cooked daily in each kitchen.

http://www.akshayapatra.org/Centralized1/data/images/12.jpg
Food materials in Kitchen

http://www.akshayapatra.org/Centralized1/data/images/13.jpg
Stock in the kitchen

http://www.akshayapatra.org/Centralized1/data/images/14.jpg
Washed dal and vegetables flows down the chute into sambar cauldron on
the 1st floor.

http://www.akshayapatra.org/Centralized1/data/images/15.jpg
Vegetables and dal ready to be cooked

http://www.akshayapatra.org/Centralized1/data/images/16.jpg
Sambar being cooked on the first floor

http://www.akshayapatra.org/Centralized1/data/images/17.jpg
Cooked sambar is packed and sent to the food vans to be loaded.

http://www.akshayapatra.org/Centralized1/data/images/18.jpg
Chapati dough is mixed

http://www.akshayapatra.org/Centralized1/data/images/19.jpg
Heavy rollers flatten the dough into thin sheets

http://www.akshayapatra.org/Centralized1/data/images/20.jpg
Dough is cut into the classic round shape

http://www.akshayapatra.org/Centralized1/data/images/21.jpg
Making chapatti

http://www.akshayapatra.org/Centralized1/data/images/22.jpg
Collecting all the chapattis

http://www.akshayapatra.org/Centralized1/data/images/24.jpg
Transporting akshayapatra food through bus

http://www.akshayapatra.org/Centralized1/data/images/25.jpg
Happy Kids

http://www.akshayapatra.org/Centralized1/data/images/26.jpg
Students benifited from akshayapatra
!!

How wonderful and thoughtful it would have been if lavish money thrown over ipl was used for these humanitarian works by the sponsors
......



Read more...

నిన్ను నువ్వు తెలుసుకో!

>> Tuesday, May 10, 2011

నిన్ను నువ్వు తెలుసుకో!
- డాక్టర్‌ డి.చంద్రకళ
నిషి ప్రశాంత జీవనం గడపాలంటే ఆధ్యాత్మిక మార్గమే సరైనదని నొక్కిచెప్పిన మహానుభావుడు జిడ్డు కృష్ణమూర్తి. ఆయన 1895లో మదనపల్లిలో జన్మించారు. జీవితకాలమంతా వివిధ దేశాలు పర్యటిస్తూ ఎన్నెన్నో లోతైన ప్రసంగాలు చేశారు. ఆయన తాత్వికత, అపూర్వమైన దార్శనికత సామాన్యులను, శాస్త్రవేత్తలను, ధార్మిక చింతనులను సైతం ఎంతో ప్రభావితం చేసింది.

'జరుగుతున్న దానిపట్ల ఎరుక కలిగి ఉంటూ దానితోపాటు జీవించటమే ఆధ్యాత్మికత. అలాంటి జీవనం పట్ల ఆసక్తి మనిషిని సత్యమార్గంలోకి నడిపిస్తుంది. ఈ మార్గంలో జరుగుతున్న విషయాల్లో యథార్థతను తెలుసుకోగలుగుతాం' అని ఆయన విశదీకరించారు. తాడును పాము అనుకోకపోవడమే యథార్థత. 'ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి యథార్థతను గ్రహించుకోకుండా భ్రమలతో, భయాలతో, దుఃఖాలతో బతుకుతున్నాడు. వీటినుంచి బయటపడటానికి భద్రతను వెతుక్కుంటున్నాడు. ఆ భద్రత ఆస్తులు కూడబెట్టుకోవడంలోనూ, హోదా పెంచుకోవడంలోనూ లేదు. తనను తాను తెలుసుకుని, తనలో సంపూర్ణమైన మార్పు పొందినవాడే భద్రత సాధించగలడు' అని స్పష్టం చేశారు.

మనిషి మానసిక స్థితినిబట్టి అతడి చర్యలుంటాయి. తన చేతనలోను, అంతః చేతనలోనూ, లోపలిపొరల్లో ఉండే తన స్థితిని తెలుసుకోగలిగితే తానెందుకు భయపడుతున్నాడో, ఎందుకు దుఃఖపడుతున్నాడో అర్థంచేసుకుంటాడు. అలా వాటినుంచి విముక్తి పొందగలడు. అదే 'స్వీయజ్ఞానం' అంటూ జిడ్డు కృష్ణమూర్తి బోధించారు.

మనిషి భద్రతకోసం పడే ఆరాటంలో నుంచే కూడబెట్టుకోవడం, ఆర్జించుకోవడం అనే తత్వం వస్తుంది. కూడబెట్టుకునే కొద్దీ వాటి రక్షణకోసం మరింత భద్రత కోరుకుంటాడు. భద్రత కోరుకుంటున్నంతకాలం భయం వెంటాడుతూ ఉంటుంది. అందుకే కూడబెట్టుకునే తత్వాన్ని స్వచ్ఛంగా వదిలేయమన్నారు. గాఢోద్రేకాలూ, అసూయ, దుర్బుద్ధి... ఇవన్నీ కూడా ఆర్జించుకునే మనస్తత్వంలో నుంచే పుడతాయి. వాటినుంచి విడుదల కావాలంటే, తనలో జనించే ఆలోచనలను, వాటివల్ల శరీరంలో వచ్చే ప్రతిస్పందనలను అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఆ అవగాహనే మనిషికి సత్యమంటే ఏమిటో తెలుసుకునే గ్రహింపునిస్తుంది. జరుగుతున్నదాన్ని జరుగుతున్నట్లుగా గ్రహించాలి. అంటే దానికి ఏ విధమైన ఊహలు, అపోహలు జోడించకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడగలిగితే- సత్యాన్ని తెలుసుకున్నట్టే అని ఆయన ఉద్బోధించారు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనసు ఎటువంటి భయాలూ లేకుండా ఉండాలి. ఎటువంటి కోరికల్లోనూ చిక్కుకోకూడదు. అలా మనసు అటూ ఇటూ తిరుగాడకుండా నిశ్చలత్వాన్ని పొందినప్పుడే సత్యాన్ని గ్రహించగలుగుతాం. అలా నిశ్చలమైన మనసును సాధించాలంటే మనసులో పుట్టే ప్రతి ఆలోచన పట్లా ఎరుక కలిగి ఉండాలి. వాటిని అవగాహన చేసుకోవాలి. ఆ నిశ్చలమైన మనసే అన్ని సంఘర్షణలనుంచి, దుఃఖాలనుంచి తప్పించగలుగుతుంది' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

జీవితంలో ధ్యానం తప్పనిసరి. ధ్యానం లేనిదే జీవితమే లేదు. ధ్యానాన్ని అవగాహన చేసుకుని అందులో ఉండాలనుకునేవారు తమను తాము అర్థం చేసుకోవాలి. స్వీయజ్ఞానం లేకుండా తనను తాను అవగాహన చేసుకోలేరు. దానికి ధ్యానమే ఆరంభం. స్మృతులు పనిచేస్తున్నంతవరకు మనిషి యథార్థతను కనిపెట్టలేడు. అందుకే వాటినుంచి విముక్తి పొందాలి అని మనసు తనకు తానే చెప్పుకొంటుంది. మనసు తాలూకు చేతన, అంతఃచేతనా అన్నింటినీ అవగాహన చేసుకుని ఎటువంటి కదలికా లేకుండా నిలిచిపోతుంది. ఈ స్థితిలో ఒక బ్రహ్మాండమైన సజీవశక్తి, శాంతి అప్రమత్తతా ఉంటుంది. ఆ శాంతమైన మనసులో చురుకుతనం, విస్తృతమైన ఎరుక ఉంటాయి. అక్కడ కేవలం అనుభూతి చెందుతూ ఉన్న స్థితి ఉంటుంది. ఆ స్థితిలోనే యథార్థాన్ని చూడగలరు. సత్యాన్ని తెలుసుకోగలరు. ఇదంతా తెలుసుకోవాలంటే మనిషికి తనను గురించి తాను తెలుసుకోవటం ఎంతో అవసరమని చెప్పిన ఆ మహామనిషికి నీరాజనాలర్పిద్దాం.



Read more...

తాను ఆడే ఆటలో ఆటంకాలు కల్పించేది తానే ....తొలగించేదీ తానే !!!

>> Monday, May 9, 2011



అమ్మ అప్పుడప్పుడు చిత్రమైన ఆట లాడుతుంటుంది . తాను నడిపే బొమ్మలతో ఆశ్చర్యకరమైన పనులను అవలీలగా చేపిస్తుంది. అహా ! నేనుకదా చేయగలిగానని ,ఈ బొమ్మలో కొద్దిగానైనా అహం మొలకెత్తుతుందన్న అనుమానం కలిగిందో కొండత ఆటంకాన్ని కన్నులెదురుగా కల్పించి బెంబేలెత్తేలా చేస్తుంది . నావల్లకాదు . నీవు తప్పదిక్కులేదు అని శరణాగతులమైన మరుక్షణం ముందున్న ఆటంకం మంచులా కరిగిపోతుంది . అలాగని ఎప్పుడుబడితేఅప్పుడు బిచ్చగాడిలా అడుక్కునే కేకలు వేయకూడదన్న మా గురుదేవులు రాధికా ప్రసాద్ మహరాజ్ వారి బోధన హెచ్చరిస్తూనే ఉంటుంది .అమ్మముందు బెగ్గర్లుగా కాదు ! బిడ్డలుగా బ్రతకండి అన్నది వారి బోధ.
ఇప్పుడు తాను వెన్నంటి ఉన్నానని ఈ మొద్దుబుర్రకు గుర్తుచేస్తూ అమ్మ నడిపిన ఇంకో లీలను మీతో పంచుకుంటాను.
ఇప్పుడు పీఠప్రధానమందిరం లో సామూహికంగా జరిపే పూజలకు ఇరుకుగా ఉంది. మందిరం ఎదురుగా ఉన్నయాగశాల తాటాకులతో కప్పువేయటం చెదలు పట్టి త్వరగా దెబ్బతినటం వలన యజ్ఞకార్యక్రమాలకు ఇబ్బంది. ఇక కపీఠంలో నిదురచెయ్యాలని వచ్చేవారికి , కార్తీకమాసాదులలో దీక్షాధారులు వచ్చి నిదురచేసి వెళ్లటాని వచ్చినప్పుడు వాళబాగా సమస్యగాఉంది. లోపల మందిరం హాలులోనే అమ్మవారికి పవ్వళింపు సేవచేసే ఊయల ఉంటుంది కనుక అక్కడ నిద్రించడానికి కుదరదని చెబుతాము . యాగశాల [పాక] లో నిద్రచేయటానికి పొలాలుకనుక కప్పులో ఎలుకలు వాటికోసం పాములుకూడాచేరుతుంటాయి కనుక పైనుంచి ఏమిపడుతుందో ? అన్నభయం . దీనికిపరిష్కారం ఏమిటంటే యాగశాలను తీసివేసి స్లాబు తో హాలు నిర్మించటమే. అందుకు కావలసిన డబ్బు నాదగ్గరలేదు.
హనుమత్ రక్షాయాగం మొదటి ఆవృత్తి పూర్తయ్యాక పూర్ణాహుతిలో పాల్గొన్న ఓ పెద్ద అధికారిగారికి ఉద్యోగోన్నతి లభిమ్చి దేశరాజధానికి వెళుతూ ఇచ్చిన మాటప్రకారం ఆయన సహకారం అడిగాను . దానికి చేద్దాం చేద్దామంటూ కాలంగడిచిపోతున్నది. వారికేమి ఇబ్బందులున్నయో తెలియదు గాని వారినుంచి స్పందన కరువైంది. ఇక పాఠశాలకూడా ఆపి ఉన్నాము కనుక డబ్బుకు ఇబ్బందే . కానీ మండపం అవసరం మాత్రం ఉంది.
ఇక నావల్ల కాదు అనుకున్న సమయంలో కష్టాల్లో కూరుకున్న ఓ అధికారి ఇక్కడ అమ్మవారి పూజకోసం రావటం ఆయమ్మ అనుగ్రహం వలన ఆయన సమస్యలనుండి బయటపడటం తో ఓరోజు నేను ఊహించనివిధంగా ఆయన నుండి ఓసమాచారం వచ్చింది . తనతరపున ఓ యాభైవేలరూపాయలు పంపుతున్నానని అవి అక్కడ నిర్మాణాలకుపయోగించమని కోరాడాయన. ఇంతలో మరొకరు పాతికవేలరూపాయలిచ్చారు. ఉంది డెబ్బై ఐదు .కావలసినది మూడున్నర లక్షలకుపైగా . మరెలా? మాతమ్ముళ్ళు ముందు మొదలుపెడదాం తరువాత అమ్మే చూసుకుంటుంది అని ఉత్సాహంతో ఉన్నారు. వద్దు ఇప్పుడు మనం స్వంతంగా చేయగలిగే పరిస్థితిలేదు,అని నేను వారిస్తున్నా వినలేదు . ఈలోపల మాతమ్ముడి మితృడొకరు వందబస్తాల సిమెంట్ ఇస్తానని మాట ఇచ్చాడు. అవును మనం చేయగలం అనే మాట మనసులో మెదిలింది . అంతే ,ఏమిచేయగలవో చూపించమని పరీక్ష పెట్టిందమ్మ.
పిల్లర్స్ వేసి పౌండేషన్ కే డబ్బు చాల్లేదు . తాపీమేస్త్రీకి ఎనభైవేలు కట్టుబడి కూలీ మూడువిడతలుగా ఇవ్వాలి. మొదటి విదతకే డబ్బులేదు ఎలా ? ఎలా ? అనుకుంటున్నప్పుడు మనసు ప్రశ్నించింది నేను చేయగలననుకుంటివికదా ఇప్పుడు ఆలోచిస్తావేమిటీ ? అని . పొరపాటైంది . మేముచేయగలం అనుకోవటం ఎంతపొరపాటో అర్ధమైంది . చేపించేది అమ్మే అన్న గమనిక ఏక్షణం లో మరవకూడదు. కానీ సాధారణమానవునకుండే సహజమైన చాంచల్యం తో మరుపుకు వస్తుంది.
ఇలా మనసులో చింతనచేయగనే హైదరాబద్ లో వ్యాపారంచేస్తున్న పిచ్చిరెడ్డి అనే వ్యక్తిమావూరి తిరుణాళ్లకొచ్చి నేనడకుండానే నాతరపున ఏమిచేయమంటారని అడిగి మరీ ఇరవైవేలు పంపగా మేస్త్రీకి సర్దాము.
ఇక స్లాబు వేయాలంటే మల్లీ వెతుకులాట. స్లాబుకోసం ఇనుము కొనటానికి పైసాపైసా చూసుకోవాలి . ఓరోజు అనుకోకుండా చాట్ లో కలిసిన జనార్ధన శర్మగారు నేనేమైనా సహాయం చేయగలనా అని అడిగారు . వారి తరపున ఇన్ముకొనటానికి ఓ ఇరవైవేలు పంపారు. ముక్కెళ్లపాడులో ఓ యువవ్యాపారి సుందరరావు స్లాబ్ చెక్క కు ఆయ్యే అద్దెను నేను భరిస్తాను అని ముందుకొచ్చారు. స్లాబుకు ఏర్పాట్లు చేసుకునేసమయానికి సిమెంట్ ఇస్తానన్న వ్యక్తి ఇవ్వలేకపోయాడు . ఇక మళ్ళీపరీక్ష . ఈసారి మాత్రం రెండో మా లేదు. అన్యధా శరణం నాస్తి .....అని శరనాగతులమయ్యాం . సమయానికి సిమెంట్ తెప్పించగలిగాం . ఇక నిన్న స్లాబ్ వేస్తుండగా మధ్యలో మిల్లర్ మొరాయించింది. నివువినా దిక్కెవరు అంటూ విష్ణునామస్మరణ చేయగనే మిల్లర్ నిరాటంకంగా పనిచేసి పనిగట్టెంకించింది.
అలా నేను అనుకున్నప్పుడు కొండలా సమస్య ఎదురవుతూ , అమ్మనుతలచుకున్నప్పుడల్లా మంచుపొరలా కరుగుతూ ఇదొక ఆట అమ్మకు అనిపిస్తూ జరుగుతున్న అమ్మలీలావినోదం.............

Read more...

ముక్కెళ్ళపాడులో మారుతి పూజలు

>> Sunday, May 8, 2011

ముక్కెళ్లపాడు గ్రామంలో హనుమత్ రక్షాయాగంలో భాగంగా అష్టోత్తరకలశాభిషేకం హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం వైభవంగా జరిగింది . నిన్న [శనివారం] రాత్రి ఆగ్రామంలో ని దత్తపీఠం ఆవరణలో స్వామివారి మూర్తికి నూటఎనిమిది కలశముల పుణ్యజలాలతో అభిషేకం జరిపిన భక్తులు అర్చనలుచేశారు. పిల్లలనుండి పండుముసలి వరకు వరకు చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొని పరవశించి ఆపవనసుతుని స్తుతించారు. స్వామిరక్షలు ధరించారు.
శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమాన్ని దత్తపీఠం నిర్వహకులు రాములు,సుబ్బారావు,ఆదిశేషయ్యలు గ్రామపురోహితులు విశ్వనాథశాస్త్రిగారు ఈ పూజాకార్యక్రమాలు నిర్వహించారు.


















Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP