శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మూర్తిపూజ

>> Monday, May 16, 2011


మనసనాతన వైదిక సిధ్దాంతంలో భక్తులు మూర్తిపూజ చేయరు .పరమాత్మనే పూజించెదరు. సారాంశమేమనగా అన్నిచోట్ల పరిపూర్ణుడైన పరమాత్మను విశేషముగా ధ్యానించువారు మూర్తినిచెసి ఆమూర్తిద్వారా పరమాత్మను పూజించెదరు.దానివలన పరమాత్మధ్యానము,చింతనము సుగమమగును.
ఒకవేళ అర్చకుడు మూర్తినేపూజించినట్లైతే అతని మనస్సులో రాతి విగ్రహభావనయే ఉడును . "నీవు జడమైన పర్వతమునుండి వచ్చినావు జడుడైన మనిషి నిన్నుచేసినాడు,మరొకవ్యక్తి నిన్ను ఇక్కడుంచాడు . కావున ఓ రాతిదేవుడా ! నాకు శుభం చేయుము" కానీ యిట్లెవ్వడు పలుకడు . మరి మూర్తిపూజ ఎక్కడ జరిగినది? కావున భక్తులు మూర్తిపూజ చేయరు. మూర్తియందు భగవంతుని పూజించెదరు .అనగా మూర్తి భావమును తొలగించి భగవద్భావనతో పూజ చేయుదురు. ఈ విధముగా మూర్తియందు భగవద్భావముతో పూజించుటచే అన్నిచోట్ల భగవద్భావము కలుగును. భగవంతునిపూజించుటచే భగవంతుని యందు భక్తికలుగును .భక్తుడు సిధ్ధుడైనప్పుడు భగవంతుని పూజ జరుగును.
మూర్తియందు తనను పూజించు విషయంలో భగవంతుడు గీతయందిట్లునుడివియున్నాడు. "భక్తులు భక్తిపూర్వకంగా నాకు నమస్కరించి నన్నుపాసించెదరు. [9-14] . ఏ భక్తుడు శ్రధ్ధా భక్తులతో పత్రము,పుష్పము,ఫలము ,తోయము నాకర్పించునో " ఆ యుపహారమును నేను బుజించెదను" [9-26] దేవతలను[విష్ణువు,శివుడు,,శక్తి,గనేశుడు,సూర్యుడు వీరు పంచదేవతలు] బ్రాహ్మణులను,గురువు,తల్లిదండ్రులను,పెద్దలను,జ్ఞానులైన జీవన్ముక్తులను ,మాహాత్ములను పూజించుట శారీరక తపస్సనబడును. [17-14]ఎదుట మూర్తిలేనిచో దేనికి నమస్కరించవలెను ?.పత్ర,పుష్పఫల,జలములు మొదలగునవి దేనికి ఇవ్వవలెను ? దేనిని పూజించవలెను ? కావున గీతలో మూర్తిపూజ విషయముకూడా యున్నదని తెలియుచున్నది.
అదే విధముగా గోవు,తులసి.రావిచెట్టు,బ్రాహ్మణుడు,తత్వజ్ఞుడైన జీవన్ముక్తుడైన ,గిరిరాజైన గోవర్ధనము,గంగా,యమున మున్నగు వాటి పూజకూడా భగవత్పూజయే . వీటిని పూజించుటవలన అన్నిచోట్ల పరమాత్మయున్నాడు అనుమాట సులభముగాయనుభవమునకు వచ్చును. కావున అన్నిచోట్ల పరమాత్ముని యనుభవమునకు గోవు మొదలైన వాటిపూజ సహాయపడును. కారణమేమనగా అన్నిచోట్ల భగవంతుడున్నాడు అనిపూజించువాడు అంగీకరించినాడు. కానీ దేనినీ పూజించకుండా,కేవలం అన్నిచోట్లపరమాత్మ ఉన్నాడు అని మాటలుమాత్రమే చెప్పినచో అతనికి భగవంతుని యనుభవము రాదు. సారాంశమేమనగా మూర్తియందు భగవంతుని పూజించుట శుభానికి,శ్రేయస్సుకూ సాధనము.
భగవంతుని పూజలేకుండా అస్తిమాంసములను పూజించుట అనగా తన శరీరమును అందమైన బట్టలతో,సొమ్ములతో అల్ంకరించుట,ఇంటిని పెద్దగా కట్టుట,సుందరసామాగ్రితో అలంకరించుట,శృంగారము చ్జేసికొనుట మొదలైనవి కూడా మూర్తిపూజలే. అవి పతనమునకు దారితీయును.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP