అసాధ్యసాధకస్వామిన్ అసాధ్యం తవకింవద ? అనిస్తుంతించినందున స్వామి అనుగ్రహంతో సాగిన యాగం పూర్ణాహుతి
>> Sunday, May 29, 2011
స్వామి అనుగ్రహం ఎలాఉంటుందో ప్రత్యక్ష ప్రమాణం ఈ హనుమత్ రక్షాయాగం . స్వామి యాగాన్ని గమనిస్తునేఉన్నారనే సంకేతాలు అందుతూనే ఉన్నాయి. యాగం మొదలైనప్పటినుండి పారాయణములు చేస్తామని మిత్రులంతా ఎంతో ఉత్సాహం తో ప్రోత్సాహాన్నందించారు. రుద్రసూక్త,మన్యుసూక్త,సుందరాకాండ ,చాలీసా పారాయణాదులను అనుసంధిస్తూ సాధన సాగించారు. ఇక అసలు పరీక్షలను ఎలా కల్పించారో ?ఎలా తొలగించారో తెలుసుకుంటే మనంచేస్తున్న యాగం స్వామి గమనిస్తున్నారన్నవిషయం స్పష్టమవుతుంది. ఈసంవత్సరం యాగనిర్వహణకు కావలసిన సంరంభాల సమీకరణ కాస్త సమస్యగామారింది . ఈసమయంలోనే సంకీర్తనా మంటపనిర్మాణం జరుగుతున్నందున కాస్త ఇబ్బందే . ఏమైనాకానీ యాగం యథావిథిగా సాంగించాలి అన్నీ స్వామి చూసుకుంటాడు అనే విశ్వాసంతో ముందుకు నడవటం జరిగింది. యాగనిర్వహణ విషయాలను తాము చూసుకుంటామని నాగప్రసాద్,మనోహర్ లు ముందుకొచ్చారు . స్వామి అనుగ్రహంతో మోహన్ కిషోర్ గారు ,భాస్కర్ రామరాజు,వెంకట సూర్యనారాయణ, చెనికల మనోహర్ ,నాగప్రసాద్ లు కార్యనిర్వహనాభారం తమభుజస్కందాలపై మోసారు.
హనుమజ్జయంతి రోజు న హనుమత్ వ్రతాలు జరిగాయి . మనోహర్, శివకుమార్ లు హైదరాబాద్ నుంచి,గిద్దలూరునుంచి ముక్కెళ్లపాడునుంచి భక్తులు వచ్చి వ్రతంలో పాల్గొన్నారు. వ్రతం రోజున తీవ్రమైన ఎండ . రేపు యాగసమయానికి ఇలాఎండ ఉంటే చాలాకష్టం . స్వామి అనుగ్రహించి రేపుఎండతగ్గితే బాగుండు అని అనుకున్నాము.మాటలసమ్దర్భంలో అందరమూ. నిజంగా మరుసటిరోజు పొద్దుటే మబ్బులుపట్టాయి . యాగం పూర్తయ్యేదాకా వాతావరణం చల్లగా ఆహ్లాదంగా ఉంది . చుట్టుపక్కల ఊర్లలో పెద్దవాన . మాకుమాత్రంలేదు. వంటచెసేవారికి ఇబ్బందికలుగలేదు . ఇదీ స్వామి అనుగ్రహం .ఇక శనివారం రోజు పూర్ణాహుతి .
ఇక పూర్ణాహుతి యాగానికి రుత్విక్కులుగా కృష్ణమూర్తి భట్టు బృందాన్ని పిలచాము. ఐదుగురికి మనం వస్త్రాలివ్వాలని నాగప్రసాద్ చెన్నైనుంచి వస్త్రాలు తీసుకుని బయలుదేరాడు . తీరా కృష్ణమూర్తి భట్టుగారొక్కరే వస్తున్నానని చెప్పారు . ఇదేమిటి ? ఈ ఆటంకం అనుకుంటుండగా హైదరాబాదునుంచి శేషాంజనేయశర్మగారు వారి బావగారితో కలసి పూర్ణాహుతి రోజున పీఠానికి చేరారు. వారువస్తారన్న సమాచారమే మాకులేదు. స్వామి సంకల్పం కలిపించారని అప్పటికప్పుడు తాముబయలుదేరామని వారు చెప్పగా ఆశ్చర్యపోయాము. వచ్చినవారిద్దరూ స్వామి పరివారం . యాగసమయానికి భట్టుగారు వస్తూ వస్తూ కొచ్చర్లనుంచి మరో పురోహితుణ్ణి వెంటబెట్టుకొచ్చారు. అరే ! ఇంకో బ్రాహ్మణుడు రావాలే ? అని సందేహిస్తుండగా ఖచ్చితంగా పూర్ణాహుతికి పదినిమిషాలముందు చింతలపాటి శ్రీకిష్ణగారు వచ్చి చేరటం నిజంగా స్వామి లీలే . రాత్రల్లా వేరే పెళ్లికార్యక్రమంలో నిదురగాసి ఉండికూడా తెల్లవారుఝామున బయలుదేరి వచ్చి సరిగ్గాసమయానికిచేరుకున్నారు. పరిపూర్ణంగా మనసంతా స్వామి నిండిఉండగా భక్తులజయజయధ్వానాలమధ్య పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయింది. ఈసంవత్సరం యాగనిర్వహణ కష్టమనుకుని చేయలేము అని నిరాశలో ఉన్నసమయంలో తన ఉపాసనలో గలశక్తేమిటో చూపించారాయన. అందుకే అన్నారు . అసాధ్యసాధకస్వామిన్ అసాధ్యం తవకింవద రామదూత కృపాసింధో మత్కార్యం సాధక ప్రభో ! అని స్తుతిస్తారు పెద్దలు.
photos link
https://picasaweb.google.com/111792900373084554502/HANUMADRAKSHA2011?authkey=Gv1sRgCLm5kNbQ8_iDLw
1 వ్యాఖ్యలు:
శుభమ్ మాష్టారూ.
జై శ్రీరామ్
Post a Comment