జ్ఞాతవ్యము [తెలుసుకోదగినది.]
>> Saturday, May 21, 2011
భగవంతుడన్నిచోట్ల పరిపూర్ణుడైయున్నాడు . ఈ విషయమును ఆస్తికులందరూ నమ్ముదురు. కానీ,ఎవరైతే మూర్తిని,వేదములను,సూర్యుని,రావిచెట్టును,తులసిని,గోవును మొదలినవాటిని భగవంతుడని తలచి పూజిస్తారో వారే నిజముగా అట్లునమ్మినవారు. కారణమేమనగా ఎవరితే మూర్తి,వేదములు,సూర్యుడు మొదలైన వాటిలో భగవంతుని నమ్ముతారో వారే స్వతహాగా అన్నిచోట్ల సంపూర్ణుడైన భగవంతుని విశ్వసిస్తారు. ఎవరైతే కేవలం మూర్తిలోనే భగవంతుని నమ్ముతారో వారు ప్రాకృత[ఆరంభ] భక్తులనబడతారు.
అర్చాయామేవ హరయే పూజాం య:శ్రద్దయేహతే/
నతద్భక్తేషు చాన్యేషు స భక్త: ప్రాకృత: స్మృత:
[శ్రీ మద్భాగవతం ౧౧-౨-౪౭]
ఏలననగా వారు ఒకేచోట భగవంతుని పూజను ప్రారంభించిరి. కావునవారు భగవంతుని సన్ముఖులైరి . కానీ, ఎవరు ఎవరు భగవ్ంతుడన్నిచోత్ల ఉన్నాడు అని పలికి,ఎక్కడ భగవంతుని పట్ల వారికి ఆదరభావము,పూజ్యభావము,శ్రేష్ఠభావము లేదో వారిని భక్తులనరు. ఎందుకనగా వారు వాచా భగవంతుడన్నిచోట్ల ఉన్నాడని పలకటమేగాని నిజంగా మనసున విశ్వసించరు. కావున భగవంతునికి సన్ముఖులుకారు.
మూర్తి యందు భగవంతుని పూజ శ్రధ్ధ విషయమే ,కానీ తర్కవిషయముకాదు. ఎవరికి శ్రద్ధయుండునో వరియెదుట మహత్వము ప్రకటితమగును .వారిద్వారా చేయబడిన పూజనే భగవంతుడు గ్రహించును. వారిచేతిప్రసాదమునే స్వీకరించును. ఏలయనగా భగవంతుడు కల్మాబాయి పెట్టిన కిచిడి తిన్నాడు.ధన్నాభక్తుడు పెట్టిన రొట్టెముక్కను భుజించాడు. మీరాబాయి ఇచ్చిన పాలు తాగాడు. వీటన్నింటిసారాంశమేమంటే శ్రధ్ధాభక్తులచేతనే మూర్తియందు భగవంతుడు ప్రకటితమగును.
0 వ్యాఖ్యలు:
Post a Comment