శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవుడు ఎక్కడుంటాడు? ఎటుచూస్తుంటాడు?ఏమిచేస్తుంటాడు?

>> Friday, December 31, 2010

ఓ రాజుగారికి కాస్త తలతిక్క, పండితులను హేళన చేసే తత్వం బాగా ఉన్నాయి . ఓరోజు తన ఆస్థాన పండితుని ప్రజ్ఞ ను పరీక్షించాలని కోరికపుట్టింది . అయ్యా ! పండితులవారూ మీరు ఈరోజు నా ప్రశ్నలకు శాస్త్రీయమైన సమాధానాలను ఇచ్చి

నా అనుమానాలు తీర్చాలి .ఇది మీబాధ్యత కూడా . నా ప్రశ్నలకు మీరు సంతృప్తికరమైన సమాధానములివ్వలేకపోయారంటే మీరు పండితులుకాదని అర్ధం .అలా జరిగితే మీరు పండితులమని చెప్పి మమ్మల్ని మోసం చేసినట్లుగా భావించవలసి వస్తుంది . అని చెప్పాడు.

సమాధానమివ్వటానికి సిద్దమయ్యాడు ఆయన.

మీరు దేవుని గూర్చి పలు శాస్త్రాల ఆధారంగా వివరనలిస్తున్నారు. ఈవిషయం నిజమని లోకాన్ని నమ్మిస్తున్నారు . సరే మీకంతగా తెలిసిన విషయమే కనుక . అసలు దేవుడెక్కడ ఉంటాడు . ఎటుచూస్తుంటాడు ? ఏమిచేస్తుంటాడు ?
ఈప్రశ్నలకు సరైన సమధానం చెప్పాలి . లేకుంటే మీరిప్పటి వరకు చెప్పినవి సప్రమాణమైనవి కావని భావించి అలాంటివి చెప్పినందుకు శిక్షించవలసి వస్తుంది కూడా అన్నాడు.

ఈ ప్రశ్నలకు ఏవిధంగా సమాధానమిచ్చి సంతృప్తి పరచాలో ఆపండితులవారికి అర్ధంకాలేదు. అందువలన ముందు గండం నుంచి బయటపడటానికి కొంత సమయం అడిగాడు . అందుకు రాజు అంగీకరించి ,ఈసమయంలోపు సంతృప్తికర సమాధానాలివ్వవలసి ఉంది అని హెచ్చరించాడు .

ఇక ఇంటికి వచ్చిన పండితులవారు దిగులుతో ఆలోచనల్లో మునిగిపోయాడు. మౌనంగా బాధపడుతున్న ఆయనను చూసి కుటుంబసభ్యులకు దిగులు పట్టుకుంది. అయన సమస్య ఎలా అధిగమిస్తాడోనని ఆందోళన మొదలైంది.
ఈస్థితిలో ఆపందితులవారి వద్ద శిశ్యైకం చేస్తున్న ఓ చురుకైన కుర్రవాడు ముందుకొచ్చాడు . గురువుగారూ మీతరపున నేను రాజుగారి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి వెళతానని తనను పంపించమని కోరాడు.
వద్దునాయనా ! చూస్తూ చుస్తూ నిన్ను ప్రమాదంలోకి నెట్టలేను .అని నివారించబూనాడు .
కానీ అతని ఆత్మవిశ్వాసం చూసి మరియు ఇక ప్రత్యామ్నాయమేమీలేకపోవటం వలనను భగవంతునిపై భారం వేసి అంగీకరించాడు .

గడువు సమయం ముగిసేలోపల పండితులవారి శిష్యుడు ఆస్థానానికి వెళ్ళి తాను తన గురువుగారి తరపున సమాధానాలివ్వ్టటానికి సిధ్ధమని తెలియపరచాడు . ఈవిషయం తెలిసి సభకు జనం పెద్దఎత్తున తరలి వచ్చారు.
ఇక చర్చ మొదలైంది
రాజుగారడిగారు దేవుడు ఎక్కడ ఉంటాడు ?ఎటుచూస్తుంటాడు ? ఏమిచేస్తుంటాడు ?
శిష్యుడు అడిగాడు . మాహారాజా ! మీరడిగినవి చాలా లోతైన ప్రశ్నలు .సర్వ శాస్త్రాలసారమైన విషయం మీరడిగారంటే మీ మేధోశక్తి అనన్యసామాన్యం . మనమధ్య ఇంతగొప్పవిషయం చర్చ జరుగుతుంది కనుక మనం శాస్త్రీయమైన మర్యాదలు పాటించటం మమ్చిదికదా ! విజ్ఞులైన మీకు నేను చెప్పాల్సిన పనిలేదుకదా ! అనివినయంగా అడిగాడు.ఇప్పటికే శిష్యుడి పొగడ్తలకు పొంగివున్న రాజుగారు అంగీకరించాడు. ఏమిచేయాలో చెప్పమన్నాడు.
అడిగేవాడు చెప్పేవానికంటే తక్కువ . కాబట్టి అడుగుతున్న మీరు క్రింద చెప్పే నేను పైన కూర్చోవటం శాస్త్రసమ్మతం. కనుక మీరుకూర్చున్న సింహాసనం పై నేను నేను నిలుచున్న స్థితిలో ఈ కొద్దిసేపన్నా ఉండటం ధర్మం ఆపై తమరి చిత్తం.అన్నాడు.

రాజుగారు సరేనని శిష్యుణ్ణి సింహాసనం పై కూర్చోపెట్టి తాను నిలుచున్నాడు .

ఇప్పుడు చెబుతావినండి . దేవుడెక్కడున్నాడనికదా మీ ప్రశ్న . కొద్దిపాలు తెప్పించండి అని తెప్పించాడు . మహారాజా ! ఈపాలలో వెన్న ఉందా చెప్పండి అనడిగాడు . ఉంటుంది అన్నాడు మహారాజు . ఐతే చూపించండి అనడిగాడు శిష్యుడు. అదెలాకుదురుతుంది .వెన్నరావాలంటే కాచి తోడుపెట్టి పెరుగయ్యాక చిలికితేగాని రాదు అన్నాడు రాజుగారు.

అలానే సర్వత్రా వ్యాపించిఉంటాడు భగవంతుడు . అయితే ఆయన్ను చూడాలంటే మహాత్ములు చూపినబాటలో పాలలో వెన్నకోసం చేసిన ప్రయత్నం కంటే ఎక్కువప్రయత్నం చేస్తేగాని కనపడడు వివరించాడు శిష్యుడు.

రాజుగారు తల ఊపాడు.

ఇక మీ రెండవ ప్రశ్న .దేవుడు ఎటుచూస్తుంటాడు అనికదా . ఇదిగో చూడండి ఈవెలుగుతున్న జ్యోతి ఎటుచూస్తున్నది.ఎటని చెబుతాము ? అన్నివైపులా చూస్తున్నదికదా ?అలానే పరమాత్మ కూడా అంతే అన్నివైపులకూ చూడగలడు.
రాజుగారు తల ఊపక తప్పలేదు .

ఇక మీ మూడవ ప్రశ్న .ఆయన ఏమి చేస్తుంటాడు ? అప్పుడప్పుడూ ఇలాకూడా చేస్తుంటాడు .అన్నాడు శిష్యుడు.
ఇలా అంటే ? ప్రశ్నించాడు రాజు

అదేనండి అనామకుణ్ణైన నన్ను సింహాసనం మీద కూర్చో బెట్టాడు . మాహారాజులైన మిమ్మల్ని నాముందు నిలబెట్టాడు . అని చమత్కరించాడు . చప్పట్లతో దద్దరిల్లిపోయింది సభ.
రాజుకు కళ్ళు తిరిగి నేలకొచ్చాయి .

Read more...

చార్వాక హేతువాదాల జంతర్ మంతర్ లు

>> Wednesday, December 29, 2010

సమాజం యొక్క ఆథ్యాత్మిక అభ్యుదయానికి ఆథ్యాత్మికతతోపాటు హేతువాద నాస్తిక ,చార్వాక వాదాలుకూడా అవసరం .మనదేశంలో అనాదిగా ఈరెండువాదాలకు ఆదరణలభిస్తూనే ఉంటుంది . దశరథుడుచేసిన అశ్వమేథయాగంలో "కర్మాంతరే తదా విప్రా హేతువాదాన్ బహూనపిప్రాహుశ్చ వాగ్మినో ధీరా: పరస్పర జిగీషయా" మధ్యమధ్య యాగవిరామ సమయంలో పండితులైన విప్రులు ఒకరినొకరు ఓడించాలనే పట్టుదలతో [వినోదార్ధం ]హేతువాదాలుచేశారని వాల్మీకి వ్రాశాడు . ఆరోజుల్లో వినోదార్ధం చేసుకునే చదరంగం ఆటల్లాగా క్రాస్ వర్డ్ పజిల్ లాగా మెదడుకు మేతగా పనికొచ్చేవి ఈ యుక్తివాదాలు .

పూర్వం బృహస్పతి బోధించాడని కాదు,చార్వాకుడనేవాడు బోధించాడని చెప్పబడే ఈబుద్ధివాదానికి ప్రామాణికమైన గ్రంథం ప్రస్తుతం లభ్యంకావటంలేదు ..ఇతరదర్శనాల్లో చార్వాకాన్ని ఖందించడం కోసం చేసినవాదాల్లో లేకప్రస్తావనరూపములో మాత్రమే ఇదిమనకు దర్శనమిస్తుంది. . ఈబుధ్ధివాదం"పశుశ్చేన్నిహత స్వర్గం ! జ్యోతిష్టోమే గమిష్యతి ! స్వపితా యజమానేన!తత్ర కస్మాన్హింస్యతే " అంటే జ్యోతిష్టోమాది యాగాలతో చంపబడ్డ పశువు స్వర్గానికి పోతుంది అనికాదా మీరనేది ?అయితే అజమాని తనతండ్రినే యాగపశువుగా బలియిచ్చి నేరుగా స్వర్గానికి పంపవచ్చునే? అట్లా ఎందుకు చేయకూడదు ?] వంటి యుక్తివాదాలతో "యావజ్జీవం సుఖం జీవేత్ !ఋణం కృత్వా ఘృతం పిబేత్ !భస్మ భూతస్య దేహస్య ! పునరాగమనం కృతు " [బ్రతికినన్నాళ్ళూ సుఖంగా బ్రతకాలి . అప్పుచేసైనా నేతిభోజనాలు చేయాలి. ఇవన్నీ దేహమున్నంతవరకే కదా ! అదికాస్తా బూడిదైనాక మళ్ళీరవతం ఎక్కడ ? ] అంటు కమ్మని బోధలతో మనసును మభ్యపెట్టి ఇంద్రియలోలత్వానికి,విశృంఖల జీవనానికి ప్రలోభ పెడుతుంది. చార్వాకం అనేపదానికి అర్ధం మధురమైన మాట అని. ఈచార్వాకపు తర్క కుతర్క జల్పకల్పవికల్పాలకుచెక్కుచెదరక నిలవడం లోనే సాధకుని బుద్ధి స్థైర్యం,వివేకం వెల్లడవుతాయి . అందుకే సాధకునికి స్వాధ్యాయం తోపాటు దర్శనాల అధ్యయనం కూడా విధించారు .ఈ దర్శనాలలో తర్కం,చార్వాకం కూడా ఉన్నాయి .ఈ దర్శనాలు వాస్తవాన్ని వివిధకోణాలనుండి మనచే దర్శింపజేపించి పరిపూర్ణసత్యాన్ని మనహృదయంలో ప్రతిష్టింపజేస్తాయి.
మనశరీర తత్వానికి సరిపడని పదార్ధాన్నేదైనా తింటే ఆరోగ్యం పాడవుతుంది . మామూలువైద్యుడు ఆ సరిపడని పదార్ధాన్ని తినొద్దని పథ్యం పెడుతూ వైద్యం చేసి అనారోగ్యాన్ని తాత్కాలికంగా పోగొడతాడు . కానీ నిజమైన వైద్యుడు అంతటితో తృప్తిపడడు. ఏపదార్థాన్ని తింటేఅనారోగ్యం కలిగిందో ఆపదార్ధాన్ని తిన్నా చెడని దేహస్వస్థతను కలిగింపజూస్తాడు. అలాగే హేతు,నాస్తిక వాదాలకు బలహీనులబుధ్ధి స్థైర్యం బలయ్యేది నిజం . కానీ నిశితమైన విశ్లేషణ ,వివేకం,సత్య జిజ్ఞాసలనే వైద్యంతో యుక్తివాదాల వెలితినిగ్రహిస్తే సాధకుని ఆథ్యాత్మిక ఆరోగ్యం చెక్కుచెదరదు. ఈ యుక్తివాదాల అంటువ్యాధి మనసుకు సోకకముందే నిరోధించడం కోసం విధ్యాభ్యాసం లోనే దర్శన శాస్త్రాధ్యయనాన్ని విధించారు. వేక్సినేషన్లలాగా ! . ధర్మనిరతితో రాజ్యభోగాలను త్యజించి వనవాసానికి బయలుదేరిన రామునితో చార్వాక యుక్తివాదాన్నిచేస్తాడు జాబాలి మహర్షి. కానీ మహర్షి పరీక్షలకు లొంగక తనధర్మనిరతిని నిరూపించుకుంటాడు శ్రీరామచంద్రుడు.
వివేకవంతులకు మంచి విజ్ఞానవినోదాన్నందివ్వగల ఈ హేతువాదం ఈనాడు సరై్న ఆథ్యాత్మిక అవగాహననందించేవారూ ,అందుకునేవారూలేక వెయ్యి వెర్రితలలు వేసి ,ఆస్తికులగుండెలపై విలయతాండవం చేస్తున్నది.తమ హింసావాదానికి విప్లవలక్ష్యాలకు అడ్డుగా ఉన్న ఆథ్యాత్మికపుకంచుకోటను భేధించటానికి ఈ చార్వాకవాదాలు కొన్ని వామపక్ష రాజకీయ వాదులకు అయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈనాడు సమాజంలో అసలైన ఆథ్యాత్మిక విలువల బోధన,సాధన ఆవగింజైనట్లే ,ఈచార్వాక హేతువాదాల్లోని పస నేతిబీరకాయలోని నెయ్యయింది. .ఈ హేతువాదుల సవాళ్లకు సమాధానం చెప్పలేక లోలోన సతమతమవుతూ పైకిమాత్రం మేకపోతు గాంభీర్యంతో "ఆస్తి-నాస్తి"విచికిత్సమనకొద్దు .కళ్ళుమూసుకుని భగవద్భజన చేసుకుంటేచాలు ! అని ఉద్భోధిస్తున్నారు చాలామంది మనగురుస్వాములు . ఈ తాత్విక పలాయనవాదం వలన వారు వారి సంస్థలు తాత్కాలికంగా తప్పుకున్నా.జనబాహుళ్యం మీద ముఖ్యంగా యువతరం మీద ఈ యుక్తివాదాలప్రభావం తప్పటం లేదు. అయితే వీరిపుణ్యమా అని ఆథ్యాత్మిక పేరుతో సాగుతున్న దొంగస్వామీజీల దోపిడి కొంతవరకు దమించబడిందనే చెప్పాలి . బూజుపట్టిన భౌతికవాదాన్ని యుక్తివాదంలోని బండారాన్ని ఆధునిక సైన్స్ విజ్ఞానంతో,తార్కికవిశ్లేషణలతో ఎదుర్కొంటున్న బహుకొద్ది మందికి ఈ "హేతు" వాదులతో వీరివెనుకుండి నడిపిస్తున్న రాజకీయపక్షాలతో విరోధం తప్పటం లేదు. .సిధ్ధాంత సత్యాన్ని ఎదుర్కోలేక [కు]యుక్తి వాదాలతో,నీచమైన వ్యక్తిధూషణలతో,రంజైన బూతువ్యాఖ్యానాలతో,మ్యాజిక్ ప్రదర్శనలతో అసలుసమస్యనుండి ప్రజలను పక్కదారిపట్టించి బ్రెయిన్ వాష్ చేస్తున్న ఈచార్వాక హేతువాదాల అంటురోగాన్ని విజ్ఞులు త్వరగా గుర్తించి దాని నిర్మూలనకు నడుముబిగించాలి.

[ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ గారి రచన ...సాయిబాబా పత్రికనుండి]

Read more...

అమ్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసాదించగల అష్టాదశ శక్తిపీఠాలు

>> Monday, December 27, 2010


అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.

ఈ అష్టాదశ పీఠాలు ఎలా వెలశాయంటే..? పూర్వం అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి సతీదేవిరూపంలో ఉన్నప్పుడు తండ్రి దక్షుడు మహాయజ్ఞం తలపెట్టాడు. ఈ మహాయజ్ఞానికి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కుమార్తె పార్వతీదేవిని, అల్లుడు పరమేశ్వరునిని ఆహ్వానించడు.

కానీ తండ్రి చేపట్టిన యజ్ఞానికి వెళ్లాలని ఈశ్వరునిని సతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి వెళ్లడానికి పార్వతీ పరమేశ్వరుడు అంగీకరించడు. కానీ పరమేశ్వరుని మాటను కాదని పుట్టింటిమీదిప్రేమతో వెళ్ళిన లోకమాతకు అక్కడ అవమానం ఎదురవగా ఆతల్లి యోగాగ్నితో తనశరీరాన్ని త్యజిస్తుంది. కోపంతో పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి యజ్ఞధ్వంసం చేసి సతీదేవిశరీరాన్ని భుజానవేసుకుని ఉన్మత్తుని లా తిరుగుతూ ఉంటే సృష్టి శ్రేయస్సుకోసం చక్రి ఆశరీరాన్ని పద్దెనిమిది భాగాలుగా ఖండిస్తాడు.. ఆ శరీర భాగాలు భూలోకంలో 18 చోట్ల పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలశాయి.

అష్టాదశ పీఠాల్లో ప్రథమ పీఠం "శ్రీ శాంకరీ దేవి పీఠం" శ్రీలంకలో ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయని పండితులు అంటున్నారు. రావణుని స్తోత్రాలకు ప్రసన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించింది. రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధానమైంది. రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది. ఇదీ ఈ శక్తి పీఠం యొక్క పురాణగాథ.

శ్రీ పురుహుతికా దేవి:
అష్టాదశ శక్తి పీఠాల్లో రెండోది శ్రీ పురుహుతికా దేవి క్షేత్రం రాష్ట్రంలోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ హస్తం పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. పూర్వం ఏలుడు అనే ఋషి గంగ కోసం శివుని గురించి తపస్సు చేసి, శివుని అనుగ్రహం పొందాడు. ఏలుని తపస్సుతో సంతృప్తి చెందిన పరమేశ్వరుడు తన జటాజూటంలోని గంగలోని ఒక పాయను వదిలిన శివుడు... వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపూ, గంగ వస్తుందని ఏలునితో చెప్పాడు.

కానీ శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడి పుంజులా మారి కూశాడు. ఏలుడు వెనక్కి చూశాడు. గంగ ఆగి అక్కడ ఏలానదిగా మారింది. శివుడు కుక్కుటేశ్వరుడుగా మారాడు. ఇక్కడ అపరకర్మలు చేస్తారని ఆలయ పండితులు చెబుతున్నారు.

శ్రీ శృంఖళా దేవి:
అష్టాదశ శక్తి పీఠాల్లో మూడోది శ్రీశృంఖలా దేవి క్షేత్రం. ఇది బెంగాల్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని చెబుతారు. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖళా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి.

ఇక అష్టదశ పీఠాల్లో ముఖ్యమైన శ్రీ చాముండేశ్వరీ దేవి పీఠం కర్ణాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడినట్లు ఆలయ పురాణాల ద్వారా తెలిసింది. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భించిన ప్రాంతం ఇదేనని చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3500 కి.మీ ఎత్తున చాముండేశ్వరి కొండపై ఈ శక్తి పీఠం ఉంది. ఈ శక్తిపీఠంలోనే ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.

అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదోది "శ్రీ కామాక్షీ దేవి" క్షేత్రం. ఇది తమిళనాడు, కాంచీపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి వీపు భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. కాత్యాయనమహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. కామాక్షి ఏకామ్రనాథుని అర్చించి కంచిలో వెలసిందని పండితులు చెబుతున్నారు.

ఇక అష్టాదశ పీఠాల్లో ఆరోది శ్రీ మహాలక్ష్మీ దేవి ఆలయం. ఈ పీఠం మహారాష్ట్రలోని కొల్హపూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. మహాలక్ష్మి అంటేనే విష్ణుపత్ని లక్ష్మి అనుకో కూడదు. 18 భుజాలతో రజోగుణంతో విలసిల్లుతున్న మహాశక్తి పార్వతీదేవి అని పండితులు అంటున్నారు. ఇక్కడ అమ్మవారి పాదాలపై ఏడాదికి మూడుసార్లు సూర్యకిరణాలు పడతాయి. అలా సూర్యకిరణాలు పడే రోజులలో కిరణోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

అలాగే ఏడో అష్టాదశ పీఠం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా అలంపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని శ్రీ జోగులాంబా దేవి అని పిలుస్తారు. అమ్మవారి దంతపంక్తి పూర్వం హలంపురం అని పిలుపబడే అలంపురంలో పడిందని పండితులు చెబుతున్నారు. పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంలో ఉన్న ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయం కూడా ఉండటం విశేషం.
ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయాన్ని ఎనిమిదో అష్టాదశ పీఠంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మ వారి మెడ భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ జపంతో బ్రహ్మను ప్రసన్నం చేసుకోని, స్త్రీపురుషుల చేతిలో చావులేకుండా వరాన్ని పోందాడు. అందరిని హింసించడం మొదలుపెట్టాడు. గర్వంతో గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టాడు. దానితో అతడిలో స్త్రీ మోహం మొదలైంది. అప్పుడు అమ్మవారు. సౌందర్య దేవతగా ఆ రాక్షసుడికి ప్రత్యక్షమైంది. ఆ దేవి ముఖారవిందంపై వాలిన తుమ్మెదల గుంపు ఆ రాక్షసుడిపై దాడి చేయటంతో ఆ రాక్షసుడు మరణించాడు. ఆ తల్లి భ్రమరాంబికగా వెలసి, మల్లికార్జునుని వరించి శ్రీశైలంపై కొలువైందని పురాణాలు చెబుతున్నాయి.

అష్టాదశ శక్తి పీఠాల్లో తొమ్మిది శక్తి పీఠం ఒరిస్సాలోని వైతరణీ నదీతీరంలో వెలసింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీ గిరిజా దేవి అని పిలుస్తారు. ఒరిస్సాలో వైతరణీనదీతీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి బాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. సింహవాహణిగా దర్శనమిచ్చే గిరిజా దేవి, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని ఉంటుంది. ఈమెను శక్తిత్రయరూపిణి కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి.

ఇక శ్రీ ఏకవీరా దేవి శక్తి పీఠం మహారాష్టల్రోని నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. ఇది అమ్మవారి కూడి హస్తం పడిన చోటు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శన మవుతుంది. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి. ఒక దానిపై అత్రి- అనసూయలు, రెండవ దానిపై దత్తాత్రేయుడు, మూడవ దానిపై ఏకవీరాదేవి ప్రతిష్ఠితిమయ్యారు. అమ్మవారి ముఖం గర్భాలయపుపై కప్పును తాకేంత పెద్దదిగా ఉంటుంది. జమదగ్ని రేణుఖా దంపతులకు చెందిన కథ ఇక్కడ జరిగిందని చెపుతారు. పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అనికూడాఅంటారు.

అష్టాదశ శక్తిపీఠాల్లో 11వ శ్రీ మహంకాళీ దేవి క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడి ఉంది. ఇక్కడి నది సిప్ర. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమినుంచి కుజుడు విడిపోయిన ప్రాంత ఇదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది.

శ్రీ మాధవేశ్వరీ దేవి పీఠం: ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా దీన్ని పిలుస్తారు. శక్తిత్రయస్వరూపిణి పీఠమైన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో యాగాలు చేసినందున ప్రయాగ్‌గా మారింది. ఈమెను కృతియుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ క్షేత్రాన్ని అమృత తీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఈ తల్లిని పూజించారని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.

శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం: కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 40 కి.మిదూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అమ్మవారి దక్షిణ హస్తం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ దేవీని కీరవాణి అని పిలు స్తారు. పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణం కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తనను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠంగా వెలసిందని ఆలయ గాథలు చెబుతున్నాయి. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.

శ్రీ కామరూపీ దేవి శక్తి పీఠం:
అస్సాం గౌహతి సమీపంలోని నీలాచలపర్వతశిఖరంపై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాడమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.

శ్రీ మాంగల్యగౌరీ దేవి శక్తి పీఠం:
అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. ఈ పీఠం బీహార్‌లోని గయాలో ఉంది. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరి అయిన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి అని పండితులు చెబుతున్నారు. శ్రాద్ధకర్మలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.

శ్రీ మాణిక్యాంబా దేవి:
అష్టాదశ శక్తి పీఠాల్లో 16వ శక్తి పీఠమే ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామం. ఇక్కడ అమ్మవారిని శ్రీ మాణిక్యాంబా దేవిగా పిలుస్తారు. ఇది అమ్మవారి ఎడమ చెక్కిలి పడిన చోటుగా అభివర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ త్రిలింగం అనడానికి మూలమైనా త్రిలింగాలలో ద్రాక్షారామలింగం ఒకటి. ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చెబుతారు. ఇది దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివాలయం పంచారామాలలో ఒకటి కావడం విశేషం.

అష్టాదశ శక్తి పీఠాల్లో 17వ క్షేత్రం పుణ్యక్షేత్రం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో వెలసిన అమ్మవారిని శ్రీ విశాలాక్షీదేవిగా ప్రార్థిస్తారు. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదానపుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశిగా పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం అమ్మవారు నిర్మించుకున్న పట్టణం కాశిగా పరిగణించబడుతోంది.. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలసినదే విశాలాక్షి పీఠమని పురాణాలు చెబుతున్నాయి.

ఇకపోతే.. అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ వైష్ణవి దేవీ క్షేత్రం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో హిమపర్వతం నడమ పఠాన్‌కోటలో జ్వాలాముఖి రైల్వేస్టేషన్‌కు 20 కి.మి. దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటుగా విరాజిల్లుతున్న శ్రీ వైష్ణవీ దేవి శక్తి పీఠం జమ్మూలో కాట్రాకు సమీపంలో ఉంది.

అష్టాదశ పీఠాల్లో పద్దెనిమింటిని దర్శించుకోవడం అసాధ్యం. అందుచేత అష్టాదశ పీఠాల్లో ఏదేని ఒక క్షేత్రాన్ని దర్శించుకున్నా 18 క్షేత్రాలు దర్శించుకున్న పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు.

Read more...

కనమరుగవుతున్నాడు కడుపునింపేవాడు .. ఇది దేశానికి శాపం, మనకు చుట్టుకునే పాపం

>> Thursday, December 23, 2010


తాను అర్ధాకలితో ఉండి మనకు ఆన్నం పెట్టి కడుపునింపాడు . ఒక్క పుట్టి ఎక్కువపండితే ఉబ్బితబ్బిబ్బయి పదిమందికీ పంచే అల్పసంతోషి ,అపర త్యాగయోగి . అటువంటి అన్నదాత సెలవంటూ మనలను వదలి వెళ్లిపోతున్నాడు . కాదుకాదు..... మాయామర్మం తెలియని నీవు ఈ మాయదారి లోకంలో ప్రకృతితో జూదాలు ఆడుతూ బ్రతకలేవు నాన్నా , అని తన తల్లి భూమాత గర్భంలో కి పిలుచుకుని దాచుకుంటుంది . బాధలు కష్టాలు ఇకమావల్లకాదంటూ మనలను వదలి వెల్లిపోతున్న మన అన్నదాత కోసం ఓ కన్నీటిబొట్టు కార్చే ఓపికా తీరికా లేని మనకు రాబోయే కాలమంతా కావల్సినంత కన్నీరు ..... బోలెడంత దు:ఖం బోనస్ .

Read more...

ఇతరులను విమర్శించటమే కాదు మనగూర్చీ ఆలోచించుకోవాలి

The case against Lord Krishna

A nun in Warsaw, Poland, filed a case against ISKCON (International Society for Krishna Consciousness). The case came up in court.

The nun remarked that ISKCON was spreading its activities and gaining followers in Poland. She wanted ISKCON banned because its followers were glorifying a character called 'Krishna' “who had loose morals,” having married 16,000 women called Gopikas.

The ISKCON defendant to the Judge: “Please ask the nun to repeat the oath she took when she was ordained as a nun.”

The Judge asked the nun to recite the oath loudly. She would not.

The ISKCON man asked whether he could read out the oath for the nun. Go ahead, said the judge.

The oath said in effect that 'she (the nun) is married to Jesus Christ'. The ISKCON man said, "Your Lordship! Lord Krishna is alleged to have 'married' 16,000 women only. There are more than a million nuns who assert that they are married to Jesus Christ.

Between the two, Krishna and Jesus Christ , who has a loose character?” What about the nuns ?

The case was dismissed.

Read more...

హనుమత్ వ్రతం పూర్తిచేసుకుని జాపాలి బయలుదేరిన దీక్షా బృందాలు

>> Sunday, December 19, 2010




వందేసంతం శ్రీహనుమంతం ...రామదూతం బలవంతం


ఈరోజు హనుమద్వ్రతం .భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం. మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి , హనుమంతుని ఆయనశక్తిస్వరూపమగు సువర్చలాదేవిని పంపానది ని కలశాలలోకి ఆవాహనచేసి పూజించి ,హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్లతోరాన్ని ధరిస్తారు . ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సమ్పూర్ణ అనుగ్రహం ఆ సాధకులకు కలుగుతుంది అని శాస్త్రవచనం .వ్రతవిధానాన్ని హనుమదుపాసకులు పూజ్య అన్నదానం చిదంబర శాస్త్రిగారు పరాశరసంహిత నుండి ప్రచురణలోకి తెచ్చారు .
కాగా మాప్రాంతంలో కార్తీకం మొదటినుంచి హనుమత్ వ్రతం దాకా .అలాగే వైశాఖంలో వచ్చే హనుమజ్జయంతికి నలభైరోజులు పూర్తయ్యే విధంగా హనుమద్దీక్షలు స్వీకరిస్తుంటారు. ముఖ్యంగా ఏకాగ్రత ,మానసికబలం ,శక్తిసామర్ధ్యాలను పెంచే ఈ హనుమత్ ద్దీక్షలను యువకులు ఎక్కువగా స్వీకరిస్తుంటారు.

మనపీఠం లో ఇప్పుడు దీక్షలు స్వీకరించిన వారిలో ఒక బృందం ఈరోజుకు మద్దిమడుగు ఆంజనేయ దేవస్థానంలో ఉండేలా మొన్ననే బయలుదేరి వెల్లగా మరొక బృందం ఈరోజు ఇక్కడే వ్రతాలు చేసుకుని హనుమ జన్మస్థలమైన తిరుమలగిరులలో ఉన్న జాపాలి క్షేత్రానికి తరలి వెల్లారు.
ఈరోజు వ్రతం చేసుకున్నవారిలో షేక్ హుస్సేన్ , సాంబశివానాయక్,శ్రీహరిరెడ్డి ఉన్నారు .వీల్లంతా మాపూర్వవిద్యార్థులు . నలభైరోజులపాటు స్వామి సేవలో గడిపిన వీరికి ఆయన ఆయురారోగ్యయశోధైర్యాలను బుధ్ధిబలాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాము.

జైశ్రీరాం .....జైహనుమాన్

Read more...

ఇదోసారి చూడండి ........ఆలోచించండి .

>> Saturday, December 18, 2010


http://mail.google.com/mail/?ui=2&ik=23fc06d729&view=att&th=12c869cc3b2e4cb5&attid=0.1&disp=attd&realattid=f_gekzg9g40&zw


Read more...

రుద్రాక్షలు


రుద్రాక్షలు

రుద్రాక్షలలో పలు రకాలు కలవు. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు కోడిగుడ్డు, ఓక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుచించుకుంటూ గుండ్రముగా మారుతాయి. దీని మద్య భాగమున కల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మద్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది.

రకాలు

వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి పన్నెండు, పదిహేను ముఖాల వరకూ కలిగి ఉంటాయి. ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా వున్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు. అలాంటి రుద్రాక్షల వివరాలు.

  • ఏకముఖి. (ఒక ముఖము కలిగినది)

అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓం కార రూపంగా నమ్ముతారు.

  • ద్విముఖి (రెండు ముఖములు కలిగినది)

దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు.

  • త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)

దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.

  • చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది)

నాలుగు వేదాల స్వరూపం

  • పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది)

పంచభూత స్వరూపం

  • షట్ముఖి (ఆరు ముఖములు కలది)

కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.

  • సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది)

కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం

  • అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)

విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

  • నవముఖి (తొమ్మిది ముఖాలు కలది)

నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.

  • దశముఖి (పది ముఖాలు కలిగినది)

దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

అసలైన రుద్రాక్షలను గుర్తించే పద్ధతులు

క్రింది పరీక్షలను చేయడం ద్వారా నిజమైన రుద్రాక్షను నిర్ధారించడం ఉత్తమం.

  • రెండు రాగి నాణెముల మధ్య రుద్రాక్షనుంచితే అది సవ్య దిశలో తిరుగుతుంది
  • నకిలీ రుద్రాక్షను నీటిలోగానీ, పాలలోగానీ వేసినపుడు అది తేలుతుంది.
  • నిజమైన రుద్రాక్షను పాలలో వేస్తే పాలు కొన్ని రోజుల వరకు విరగవు, చెడిపోవు.
  • నిజమైన రుద్రాక్షను చల్లని నీటిలో వేస్తే అరగంటలో వేడెక్కుతాయి.

పూజలలో రుద్రాక్షలు

రుద్రాక్షలను 108 గాని, 54 గాని, 27 గాని బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి మెడలో ధరించవలెను. జప మాలగా కూడ ఉపయోగించవచ్చును.

వైద్యంలో రుద్రాక్షలు

రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును.

[వికీపీడియా నుండి]

Read more...

ఆనంద సాగరా మురళీధరా [ పీఠంలో ముక్కోటి రోజు న]

>> Friday, December 17, 2010

సంకీర్తనం














Read more...

మనబాస్ మరో జంటను విడిపోకుండా కాపాడండోయ్ ! చూడండి

సీతారాముల వియోగం బాధను ప్రత్యక్షంగా చూసినవాడు . మనస్వామి హనుమంతులవారు . ముప్పై రోజులక్రితం విడిపోవాలని నిర్ణయించుకున్న యువజంటకు మనసుమార్చి తనభక్తులను తానెప్పుడూ కాపాడుతూనే ఉన్నానని నిరూపణ ఇచ్చిన వైనం ఇక్కడ చూడండి


Read more...

ధనుర్మాసం వచ్చేస్తోంది

>> Wednesday, December 15, 2010





ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవశించి మహావిష్ణువును ప్రార్థించినట్లైతే మోక్షము ప్రాప్తిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

ముఖ్యంగా ఏకాదశి నాటినుండే విష్ణునామాలను మంత్ర జపములు చేయడం ఉత్తమం. ఆ రోజునే "విష్ణుశయనోత్సవం" జరుపుతారు. కావున ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే... కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. అంతేగాకుండా ఈ రోజున ఉపవాస జాగరణలు చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం.

ఇకపోతే... ధనుర్మాసం పూర్తిగా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి మహావిష్ణువును విష్ణుసహస్రనామముతో ప్రార్థించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Read more...

*కాలభైరవాష్టకం*

>> Tuesday, December 14, 2010


*కాలభైరవాష్టకం*

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయఙ్ఞ్యసూత్ర మిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!

భానుకోటి భాస్వరం భవతాబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధదాయకం త్రిలోచనం
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!

శూలటంక పాశ దండపాణి మాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!

భుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహం
నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!

ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశమోచకం సుశర్మ దాయకం విభుం
స్వర్ణవర్ణ కేశపాశ శొభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!

రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనం
మృత్యుదర్శనాశనం కరాళదంష్ట్ర భీషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!

అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్ట పాపతజాల ముగ్రనాశనం
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!

భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాపశోధకం విభుం
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే!!

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధనం విచిత్రపుణ్యవర్ధనం
శొకమోహ దైన్యలోభ కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధం ధ్రువం!!

ఫలం : మనశ్శాంతి, అధ్యాత్మిక జ్ఞానం


dEvarAja sEvyamAna pAvanAnGri pankajam
vyALaya~m~nyasUtra mindu SEkharam kRpAkaram
naaradaadi yOgibRnda vanditam digambaram
kaaSikaapuraadhinaatha kaalabhairavam bhajE!!

bhAnukOTi bhAsvaram bhavataabdhitaarakam param
neelakanTha meepsitArdhadAyakam trilOchanam
kAlakAla manbujAksha makshaSUla maksharam
kASikApurAdhinAtha kAlabhairavam bhajE!!

SulaTanka pASa danDapANi maadi kAraNam
SyAmakAya maadidEva maksharam niraamayam
bhImavikramam prabhum vichitra taanDava priyam
kASikApurAdhinAtha kAlabhairavam bhajE!!

bhukti muktidaayakam praSastacaaruvigraham
bhaktavatsalam sthitam samastalOka nigraham
nikvaNanmanOj~na hEmakinkiNIlasatkaTim
kASikApurAdhinAtha kAlabhairavam bhajE!!

dharmasEtu paalakam tvadharmamArga nASakam
karmapASamOcakam suSarma daayakam vibhum
svarNavarNa kESapASa Sobhitaanga manDalam
kASikApurAdhinAtha kAlabhairavam bhajE!!

ratna paadukaa prabhaabhirAma pAdayugmakam
nitya madvitIya mishTadaivatam niranjanam
mRtyudarSanASanam karALadaMshTra bhIshaNam
kASikApurAdhinAtha kAlabhairavam bhajE!!

aTTahAsa bhinna padmajAnDakOSa santatim
dRshTipAtanashTa pApatajAla mugranASanam
ashTasiddhi dAyakam kapAlamAlikA dharam
kASikApurAdhinAtha kAlabhairavam bhajE!!

bhUtasangha nAyakam viSAlakIrti dAyakam
kASivAsi lOka puNyapApaSOdhakam vibhum
nItimArga kOvidam purAtanam jagatprabhum
kASikApurAdhinAtha kAlabhairavam bhajE!!

kAlabhairavAshTakam paThanti yE manOharam
j~nAnamukti sAdhanam vichitrapuNyavardhanam
SokamOha dainyalObha kOpatApa nASanam
tE prayAnti kAlabhairavAnghri sannidham dhruvam!!

Read more...

మొగుడు ముండా అంటే ముష్టికొచ్చినవాడుకూడా ముండా అన్నాడట ! ఎంత చులకనైపోయాము మనం ?

>> Sunday, December 12, 2010

ఈ వార్త చూడండి :


"మూర్ఖ భారతదేశం": సింగపూర్ దౌత్యవేత్త అనుచిత వ్యాఖ్య

వికీలీక్స్ బయటపెడుతున్న రహస్య విషయాలు కొన్ని దేశాల మధ్య చిచ్చు
రగిల్చేవిగా ఉంటే.. మరికొన్ని దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం
చేసేవిగా ఉన్నాయి. ప్రపంచ దేశాలను తిట్టడం, దేశాధినేతలకు మారుపేర్లు
పెట్టడం వంటిది ఇప్పటి వరకూ అమెరికానే చేసిందనుకున్నాం. కానీ.. ఇప్పుడు ఆ
జాబితాలోకి సింగపూర్ కూడా చేరిపోయింది.

ఇటీవల వికీలీక్స్ విడుదల చేసిన దౌత్య పత్రాలలో సింగపూర్‌కు చెందిన
దౌత్యవేత్త భారత్‌ను ఓ మూర్ఖదేశంగా అభివర్ణించినట్లు అస్ట్రేలియాకు
చెందిన ఫాక్స్ మీడియా సంస్థకు విడుదల చేసిన పత్రాలు వెల్లడిస్తున్నాయి.
సింగపూర్ రాయబారి టామీ కో భారత్‌ను 'మూర్ఖదేశమ'ని, జపాన్ 'చిక్కిపోతోంది'
అని వ్యాఖ్యానించినట్లు వికీలీక్స్ పేర్కొంది.

ఈ పత్రాల ప్రకారం.. "మూర్ఖ భారతీయ మిత్రులు.. భారత్ సగం ఆసియాన్
కూటమిలోనూ, సగం దాని బయట ఉంది" అని కో అన్నారు. గత 2008, 2009 మధ్యకాలంలో
సీనియర్ అమెరికా అధికారులైన డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ ఫర్ ఈస్ట్ ఏషియా
డేవిడ్ సిడ్నీలతో సింగపూర్ విదేశీ వ్యవహారాల అధికారులు
వ్యాఖ్యానించినట్లు వెల్లడైంది.

అంతే కాకుండా.. మలేసియా, థాయ్‌ల్యాండ్, జపాన్ తదితర దేశాలపై వారు అనుచిత
వ్యాఖ్యలు చేశారు. జపాన్ నాయకత్వానికి సరైన ధృక్పధం లేదని, మలేసియాకు
సరైన నాయకత్వం లేకపోడం ప్రధాన సమస్య అని వారు వ్యాఖ్యానించారు.

http://telugu.webdunia.com/newsworld/news/international/1012/13/1101213006_1.htm


--

ఈడ్చితంతే మన రెండుజిల్లాలంతలేదు .సింగపూర్కుకూడా చులకనై పోయామా మనం ?

ఎక్కడైనా బలవంతుడే గౌరవింపబడతాడు . అతిమెతకసరుకు , ఇంట్లోనే విలువలేని ఈదేశానికి బయటనుంచి గొప్పగౌరవం ఎలాతేగలుగుతుంది మన నాయకత్వం .
పార్లమెంట్ పైనేకాదు, పౌరులపైనా దాడిచేసి పిట్టల్ని కాల్చినట్లు కాల్చినా వాల్లనేమీ చేయలేము . రాయబారిని ఆడపడుచు అనిచూడకుండా వల్లంతా తడిమి పరీక్షించినప్పుడు , మనమంత్రులకు అవమానం జరిగినప్పుడు కూడా గట్టిగా మాట్లాడలేని , ఆడా మగా కాని నాయకత్వాలతో ఈ భారతమాతకు ఇంతకంటే విలువదక్కదేమో .క్షమించమ్మా భారతీ చేతగాని వాజమ్మలమై నిన్ను అవమానాల పాల్జేస్తున్నందుకు . దు:ఖించమ్మా గుండెలవిసేలా ఇలాంటి సంతానాన్ని పొందినందుకు ..


Read more...

తెలుగు బ్లాగర్లందరికీ బ్లాగుదినోత్సవ శుభాకాంక్షలు


తెలుగుబ్లాగర్లందరికీ బ్లాగుదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు .అందరికీ సకలశుభాలను శ్రేయస్సును ప్రసాదించాలని జగన్మాతను ప్రార్ధిస్తున్నాము



ఓం సహనావవతు ! సహనౌభునక్తు ! సహవీర్యం కరవావహై ! తేజస్వి నావధీతమస్తు ! మావిద్విషావహై !

ఓం శాంతి :శాంతి: శాంతి :

Read more...

ఇదిగో ! ఇలాంటి గతి పట్టినదాకా మన కళ్ళు తెరుచుకోవు

>> Tuesday, December 7, 2010

[ఆంధ్రజ్యోతి దినపత్రిక nov 26, 2010 లోనిది ఈవ్యాసం]


ధార్మిక వివక్ష!
- మొహమ్మద్ ఇర్ఫాన్

గల్ఫ్‌లోని అన్ని దేశాలు పూర్తిగా ఇస్లామిక్ రాజ్యా లు కాగా అందులో కొన్ని కఠోర మత నిబంధనలు పాటిస్తుండ గా మరికొన్ని ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. ఇస్లామిక్ దేశమైనప్పటికీ మొత్తం గల్ఫ్‌లో కువైట్ ఒక అభ్యుదయ భావాలు కలిగిన దేశంగా పేరొందినా ఈ దీపావళి సందర్భం గా కువైట్ పోలీసులు ప్రవర్తించిన అమానుష చర్య అనేక ప్రశ్నలను సంధించింది.

ఒమాన్‌లోని, యుఎఇ(దుబాయి)లోని మందిరాలు మినహా గల్ఫ్‌లో ఎక్కడ కూడా హిందువుల ఆలయాలు లేవు. ఒక గుజరాతీయ సింధీ వ్యక్తి నిర్వహణలో ఉన్న దుబాయిలోని ఇరుకయిన మందిరాన్ని విస్తరించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇక విశాల సౌదీ అరేబియాలో కనీసం దేవుళ్ల చిత్రపటాలను కూడా తీసుకరావడం కూడా నిషే ధం. ఈ పరిస్థితులలో హిందూ ధార్మిక అభిరుచి కలిగిన కొందరు ఇళ్లలో గోప్యంగా సామూహిక ప్రార్థనలు జరుపుకోవడం మినహా మరే మార్గం లేదు.

కొన్నాళ్ల క్రితం దుబాయిలోని జుమేరియాలో గణేష్ నిమజ్జనం చేయడానికి ప్రయత్నించిన కొంత మంది యువకులను దుబాయి పోలీసులు అదుపులోకి తీసుకుని హెచ్చరించి వదిలిపెట్టారు. ప్రపంచంలోని ఎత్తయిన భవనాలలో ఒకటైన బుర్జ్ అల్ ఖలీఫా పైకప్పుపై బతుకమ్మ ఆడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రయత్నించారు. ధార్మిక కారణాల వల్ల కుదరలేదు. అందుకే హిందూ పండుగలను ఒక సాంఘిక లేదా సాంస్కృతిక కార్యక్రమంగా జరుపుకోవల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దుబాయిలో దసరాకు ముందు జరుపుకునే దాండియా ఉత్సవాలు ప్రముఖమైనవి. అయితే అందులో కేవలం సంపన్న వర్గాలు మాత్రమే పాల్గొంటారు.

ఈ ఏడాది నుంచి హైదరాబాద్‌లోని ఒక ప్రఖ్యాత క్లబ్ యజమాని గుజరాతీ వ్యాపారస్తులతో కలిసి దాండియాను భారీ వ్యయంతో కూడిన ఉత్సవంగా మార్చారు. కువైట్‌లో కూడా ఉన్నత ఉద్యోగాలు చేసే సంప న్న ప్రవాస భారతీయులు నివసించే సాల్మీయాలోని టైటానిక్ నివాస సముదాయంలో గత కొద్ది కాలంగా దీపావళి పండుగను ఆర్భాటంగా, ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. మొత్తం కువైట్‌లో ఈ ఒక్క ప్రదేశమే సురక్షితం కావడంతో రానురాను దీని ప్రాధాన్యం పెరిగి అనేక భారతీయ కుటుంబాలు టైటానిక్ నివాస సముదాయానికి వచ్చి టపాకాయలు కాల్చడం, పిల్లలతో ఆనందం పొందుతున్నారు.

ప్రతిసారి అలా సంప న్న భారతీయులు టైటానిక్ కాంప్లెక్స్‌లో టపాకాయలు కాల్చుతూ పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. దీనికి ప్రత్యేకంగా అధికారుల నుంచి అనుమతి కూడా ఉంది. రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాన్ని ముగించాలనే షరతుతో అనుమతి ఇచ్చారు. ఈ రకంగా అన్యమతస్తులు పండుగను నిర్వహించుకోవడం కొంతమంది కువైట్ జాతీయులకు మింగుడుపడలేదు. అందుకే ఈసారి దాన్ని ఎలాగై నా భగ్నం చేయాలనే పథకం రచించారు.

ఈ మేరకు అనుమతి లేకుండా బాణాసంచా పేల్చుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే సాయుధ పోలీసు బలగాలు వచ్చి దీపావళి జరుపుకుంటున్న 18 మందిని అరెస్టు చేశారు. 22 నిమిషాల గడువు ముగిసిన తర్వాత అంటే రాత్రి 9 గంటల 22 నిమిషాలకు పోలీసులు టైటానిక్ సముదాయంపై దాడి చేశారు. ఉగ్రవాదుల దాడులకు వెళ్లినట్టుగా 16 ప్రత్యేక వాహనాలలో వచ్చిన స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు పెద్ద తోపులాట తర్వాత భవన సముదాయంలోకి ప్రవేశించారు. అరెస్టు అయిన వారిలో అయిదుగురిని మరుసటి రోజు విడుదల చేయగా, మిగిలిన వారిని నాలుగు రోజుల తర్వాత విడుదల చేశారు. ఈ సంఘటన కువైట్‌లో పెద్ద దుమారం రేపింది.

భారతీయ ఎంబసీ తీరుపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఎంబసీ దీనిపై నోరు విప్పలేదు. కువైట్ జనాభాలో విదేశీయులు మెజారిటీ సంఖ్యలో ఉండగా అందులో భారతీయులు అగ్రగణ్యులు కాగా, అందులో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. అయినా ప్రభుత్వ తీరు సమంజసంగా లేదు. అంతకు ముందు కువైట్‌లోని ఒక స్టేడియంలో శ్రీలంకకు చెందిన సింహాళీయులు తమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీనికి కువైట్ ప్రభుత్వం అనుమతించింది కూడా.

సభలో శ్రీలంక రాయబారితో సహా ఆ దేశానికి చెందిన అనేకమంది ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు వేదికపై ఉండగా ఒక్కసారిగా పోలీసులు స్టేడియంలోకి ప్రవేశించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమ నిర్వహణకు తమకు అనుమతి ఉందని చెప్పినా శుక్రవారం నమాజు సమయంలో లౌడు స్పీక ర్ల ద్వారా పాటలు పాడడం భావ్యం కాదంటూ మొత్తం కార్యక్రమాన్ని ముగించారు. దీంతో వేలాది మంది నిరాశతో వెనక్కి మళ్లారు. 2003లో కువైట్‌లో భారతీయ రాయబారిగా వచ్చిన స్వష్ పవన్ సింగ్ స్థానికంగా ఉన్న ఒక గురుద్వారకు వెళ్లిన కొద్ది రోజులకు అక్రమంగా అనుమతి లేకుండా దాన్ని నిర్మించారని కువైట్ అధికారులు దాన్ని కూలగొట్టారు.

ముస్లింలలో షియా వర్గానికి చెందిన బోహ్రా తెగకు చెందిన ప్రవాస భారతీయులు, పాకిస్థానీలకోసం మసీదు నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కువైట్ మంత్రి తన పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. క్రైస్తవ మతానికి సంబంధించి కొన్ని చర్చీలు ఉన్నప్పటికీ దాన్ని విస్తరించడానికి కూడా స్థానికుల నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొత్తం గల్ఫ్ కూటమిలో కువైట్ ప్రగతిశీల, స్వేచ్ఛా వాతావరణం కలిగిన దేశం గా పేరొందింది.

దుబాయి కంటే కూడా కువైట్‌లో స్వేచ్ఛ ఎక్కువ అని పేరున్నా, ఇస్లామేతర ధార్మిక విషయాలకు సంబంధించిన ఈ సంఘటనలు చూస్తే బాధ కలుగుతుంది. ఆర్థికంగా, మౌలిక వసతుల కల్పన విషయంలో గల్ఫ్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ ధార్మిక విషయాలలో మాత్రం ఇంకా ఇస్లామిక్ మత ఛాందవాదం ముసుగులో ఉంది.

[ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి]

Read more...

గాంధీ గారేమన్నారంటే !!!


Read more...

హైదరాబాద్ లో జరిగిన లక్షగళార్చన[హనుమాన్ చాలీసా] ఫోటోలు వీడియోలు

హనుమంతుని స్తుతిస్తూ హైదరాబాద్లో జరిగిన లక్షగళార్చన హనుమాన్ చాలీసా పారాయణం ఫోటోలు వీడియోలు ఇక్కడ చూడండి




Read more...

మన మీడియా ఎవరిచేతిలో ఉంది ? [అంతర్జాలం నుంచి సమాచారం]

>> Sunday, December 5, 2010

Shocking but true......

INTERESTING ARTICLE ON OWNERSHIP OF MEDIA .....ONE MUST READ
Who owns the media in India ?......?

Let us see the ownership of different media agencies.

NDTV: A very popular TV news media is funded by Gospels of Charity in Spain Supports Communism. Recently it has developed a soft corner towards Pakistan because Pakistan President has allowed only this channel to be aired in Pakistan . Indian CEO Prannoy Roy is co-brother of Prakash Karat, General Secretary of the Communist party of India . His wife and Brinda Karat are sisters.

India Today :Which used to be the only national weekly which supported BJP is now bought by NDTV!! Since then the tone has changed drastically and turned into Hindu bashing.

CNN-IBN: This is 100 percent funded by Southern Baptist Church with its branches in all over the world with HQ in US.. The Church annually allocates $800 million for promotion of its channel. Its Indian head is Rajdeep Sardesai and his wife Sagarika Ghosh.

Times group list:
Times Of India, Mid-Day, Nav-Bharth Times, Stardust, Femina, Vijay Times, Vijaya Karnataka, Times now (24- hour news channel) and many more...

Times Group is owned by Bennet & Coleman. 'World Christian Council' does 80 percent of the Funding, and an Englishman and an Italian equally share balance 20 percent. The Italian Robertio Mindo is a close relative of Sonia Gandhi.

Star TV: It is run by an Australian, who is supported by St. Peters Pontifical Church Melbourne.

Hindustan Times: Owned by Birla Group, but hands have changed since Shobana Bhartiya took over. Presently it is working in Collaboration with Times Group.

The Hindu: English daily, started over 125 years has been recently taken over by Joshua Society, Berne , Switzerland .. N. Ram's wife is a Swiss national.

Indian Express: Divided into two groups. The Indian Express and new Indian Express (southern edition) ACTS Christian Ministries have major stake in the Indian Express and latter is still with the Indian counterpart.

Eeenadu: Still to date controlled by an Indian named Ramoji Rao. Ramoji Rao is connected with film industry and owns a huge studio in Andhra Pradesh.

Andhra Jyothi: The Muslim party of Hyderabad known as MIM along with a Congress Minister has purchased this Telugu daily very recently.

The Statesman: It is controlled by Communist Party of India.

Kairali TV: It is controlled by Communist party of India (Marxist)

Mathrubhoomi: Leaders of Muslim League and Communist leaders have major investment.

Asian Age and Deccan Chronicle: Is owned by a Saudi Arabian Company with its chief Editor M.J. Akbar.

Gujarat riots which took place in 2002 where Hindus were burnt alive, Rajdeep Sardesai and Bharkha Dutt working for NDTV at that time got around 5 Million Dollars from Saudi Arabia to cover only Muslim victims, which they did very faithfully...

Not a single Hindu family was interviewed or shown on TV whose near and dear ones had been burnt alive in Godra,

it is reported.

Tarun Tejpal of Tehelka.com regularly gets blank cheques from Arab countries to target BJP and Hindus only, it is said.

The ownership explains the control of media in India by foreigners. The result is obvious.

PONDER OVER THIS. NOW YOU KNOW WHY EVERY ONE IS AGAINST TRUTH, HOW VERY SAD.

DON'T FORGET TO SHARE, LET THE TRUTH BE KNOWN TO EVERYONE.

Read more...

లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబమ్


ప్రభూ !!



సంసార సాగర విశాల కరాళ కామ వక్రగ్రహన గ్రసన నిగ్ర్హహ విగ్రహస్య

మగ్నస్య రాగలసదూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలంబమ్ !

ఓ లక్ష్మీ నృసింహస్వామీ ! సంసారము అను సముద్రమునందలి భయంకరమగు కామమనే పెద్ద మొసలిచే మ్రింగబడుచున్నవాడనై ,విషయచితలనెడి అలలచే వెనుకకు ముందుకు గుంజబడి బాధలనొందుచున్న నాకు నీదివ్యహస్తము నందించుప్రభూ !

సంసారఘోరగహనే చరతో మురారే !మారోగ్రభీకర మృగ ప్రవరార్ధితస్య
ఆర్తస్య మత్సరనిదాఘ పీడితస్య లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలంబమ్

ఓ మురారీ ! సంసారమను కారడవియందు బడి తిరుగుచూ మన్మథుడు అనబడు ఈ కౄరమృగవాతనబడి బాధనొందుచున్నాను .క్రోధమను గ్రీష్మముచే మిగులతపింపబడు నాకు ప్రాపగుము !

సంసారకూప మతిఘోర మగాధమూలం సంప్రాప్య దు:ఖశత సర్పసమాకులస్య
దీనస్యదేవ కృపయా శరణాగతస్య లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబం

ఓ లక్ష్మీ నృసింహా ! మిగులభయంకరము,చాలాలోతుగల సంసారమనబడెడు నూతిలో బడి ,దు:ఖములను పాములకుజిక్కి కలవరము నొందిన కృపణుడనగు నన్ను కరుణించి చేయూతనందించి లేవదీయుము .

సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీఢ్యమాన వపుషస్సక లార్దితస్య
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీనృసింహ ! మమదేహి కరావలంబమ్ !

ఓ లక్ష్మీ నృసింహ స్వామీ ! సంసారమను భయంకరమైన మదపుటేనుగు తొండపుదెబ్బలచే నొచ్చిన మేనుగలవాడను,సమస్తబాధలచే కృశించినవాడను ప్రాణాపదవలన భయముతో కూడినవాడనైన నాకు జేయూతనొసగుము.
సంసారసర్ప విషదుష్టభయోగ్రతీవ్రదంష్ట్రాకరాళ విషదగ్ద వినష్టమూర్తే:
నాగారి వాహన ! సుధాబ్దినివాససౌరే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్

ఓ గరుడవాహనా ! పాలసముద్రమున పవ్వళించు ఓదేవా! సంసారమను భయంకరసర్పము యొక్క విషముచే దుష్టములై,భయంకరములై. కౄరములై,తీక్ష్ణములైనకోరలయందలి భీషణవిషసంపర్కముచే నశించిన శరీరముగల నాకు జేయూతనొసగుము.

సంసారజాల పతితస్య జగన్నివాస సర్వేన్ద్రియార్ద బడిశస్థఝుషాత్మనశ్చ !
ప్రోత్తమ్భితప్రచుర తాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ!మమదేహి కరావలంబం

సర్వలోకాంతర్యామివగు ఓప్రభూ ! సంసారపు జిక్కులమారి వలలో తగులుకొని శబ్దరూపస్పర్శరసగంధాధి విషయములకు లోనై వలలోచేపమాదిరిగా చిక్కుకున్నవాడనై,ఎత్తబడినదియు తెరువబడినదియు పెదవులుతలగల నాకు జేయూతనిమ్ము.

సంసారదావ దహననాకుల భీకరోగ్రజ్వాలావలీభి రభిదగ్ద తనూరుహస్య !
త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య లక్ష్మీనృసింహ ! మమదేహి కరావలంబం

ఓ లక్ష్మీ నృసింహస్వామీ ! సంసారమను కార్చిచ్చుయొక్క అన్నివైపులాజుట్టివచ్చుచున్న భయంకరములైన,కౄరములైన మంటలచే మాడిపోయిన రోమములుగలవాడినై నీపాదములను శిరమునదాల్చి ధ్యానించుచున్న నాకు నీ చేయూతనిమ్ము .

సంసారసాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో! కరుణానిధే!మామ్ !
ప్రహ్లాదఖేదపరిహార పరావతార లక్ష్మీనృసింహ !మమదేహి కరావలంబం

దయగల యోమహానుభావా ! సంసార సముద్రమునబడి యుక్కిరిబిక్కిరియగుచున్న దిక్కులేని నన్నుగాపాడుము. నాకుచేయినందిమ్ము .



Read more...

జ్యోతిర్లింగార్చనకు ప్రమిదలు దొరకకపోతే ?????......

>> Friday, December 3, 2010


జ్యోతిర్లింగార్చనకు ప్రమిదలు దొరకటం కష్టంగాఉందని అమెరికా నుంచి కొందరు మితృలు అడుగుతున్నారు.
ప్రమిదలు దొరకకుంటే గోధుమపిండితో ప్రమిదలు చేసుకుని వానినుపయోగించుకొనవచ్చు. అలాగే కొందరు కొవ్వొత్తులతో చేయవచ్చా ? అని అడుగుతున్నారు . అలాచేయకూడదు . దీవివెనుక చాలావైజ్ఞానిక కారణాలున్నాయి .
ఈమధ్య నూజిలాండ్ శాస్త్రవేత్తలు కొవ్వొత్తులు ఎక్కువ గా ఉపయోగించి నచోట విపరీతంగా విషవాయువులు కాలుష్యం వెలువడటం తమ ప్రయోగం ద్వారా నిరూపించారు .
మన ఆచారంలో ఉపయోగించే ఆవునెయ్యి,నువ్వులనూనెల ద్వారా వెలిగే దీపాల వలన అక్కడి వాతావరణం శుభ్రపడుతుంది . మనసు ప్రశాంతస్థితికి వెళ్లటమేకాక భగవత్ శక్తి అనుగ్రహధారలు ప్రవహిస్తాయి ఆజ్యోతులమీదుగా . మన మహర్షుల వైజ్ఞానిక శక్తి ఈ ఆచారాలన్నింటి వెనుక ఉన్నది. కనుక మన పెద్దలు చెప్పినమార్గం లోనే నడుద్దాము .

Read more...

"ఆర్ట్" తో కాదు అమ్మను" హార్ట్" తో చూడాలి


్మొన్న విజయవాడ నుంచి పెళ్ళికి దరిశి వెళుతూ మా ఆవిడతరపు బంధువులు ఇటువైపు వచ్చారు . ఆయన ఇంటిల్జెన్స్ లోఅధికారి .వాళ్ల ఆవిడ ,కుమారుడు కూడా ఉన్నారు . అతనికుమారుడు కాట్రాక్టర్ కూడా . .సరే కాఫీలు గట్రా అయ్యాక మందిరంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించు కుంటామని కోరితే మందిరం లోకి తీసుకెళ్ళాను . లోపలకొచ్చాక ఆకాంట్రాక్టర్ గారు అన్నీ పరిశీలిస్తున్నాడు . అమ్మవారి ముందు నిలబడి మూర్తిని పరిశీలించి చూస్తున్నాడు . .


ఏమిటీ అమ్మవారిని దర్శిస్తున్నారా ? అడిగాను

కాదండి ! నేను ఎక్కడకెళ్ళినా విగ్రహం చెక్కినతీరు చూస్తుంటాను . ఇక్కడ ఆ కళ్ళూ అవీ చక్కగా చెక్కారు . మంచి ఆర్ట్ ఉంది అంటూ చెప్పుకుపోతున్నాడు ....

నాకు అరి కాలిమంట నెత్తికెక్కింది .

అమ్మవారిని చూడటం ఎలాగో తెలియకపోతే చూసి నేర్చుకోవాలి లేదా ఎవరినన్నా అడగాలి . అసలు ఆలయమంటే ఏమిటనుకున్నావు ? ఆలయం దైవస్థానం దైవం కొలువైఉన్న దివ్యస్థలం . ఆలయాలలోకెళ్ళినప్పుడు వినయ విధేయతలతో.నమస్కారముద్రలో భగవన్మూర్తి ముందు నిలబడాలి . చాలాగౌరవభావంతో అక్కడి అర్చకులను మన అనుమానాలడగాలి . ఇదీ తీరు . ఎవడయ్యా నీకు నేర్పినవాడు . నీ కళాత్మక పరిశీలనలు చేస్తే దైవాగ్రహానికి గురై ఉన్నకూడుకూడా పోయి దరిద్రుడవవుతావు . అమ్మను చూడాలంటే ఆర్ట్ తోకాదు హార్ట్ తో చూడాలి . నీలా చూసేవాడికి బొమ్మ కనపడుతుంది ,అమ్మెలా కనపడుతుంది ? శిల్పకళను చూడాలనిపిస్తే మ్యూజియాలకెళ్ళు అంతేగాని గుళ్లకెళ్లమాకు ... కఠినంగా గట్టిగా నానోటినుంచి వచ్చిన మాటలకు బిత్తరపోయారు వాళ్ళు .
ఆ మాజీ అధికారికి తన తప్పు తెలిసినదిలా ఉంది ...లేదండి ..మావాడు విజయవాడలో దుర్గగుడికి తరచు వెళుతుంటాడు...........ఏదో చెప్పబోయాడు
గంగానదిలో చుట్టుపక్కల గ్రామాల పశువులు రోజూ మునుగుతాయి . ఉపయోగమేముంది ? ఇంకాస్త చీదరింపుగా అన్నాను .
బంధువర్గంలో ఎక్కువగా గౌరవింపబడుతుంటాడు [డబ్బుద్వారా,హోదాద్వార] ఆయన .వారికంటే ముందే వచ్చిన బంధువులంతా ఉన్నారు అక్కడే
మిగతావాళ్లు బిక్కచచ్చిపోయారు . ఏమిటీ ? ఈ స్వామి మరీ మొహమాటం లేకుండాతిడుతున్నాడు ,నోరుతెరిస్తే మమ్మల్నేమంటాడో ...అని బెదిరిపోయి చూస్తున్నారు .

. నేనిక్కడ ఉన్నంతసేపు అమ్మకు సేవకుణ్ణి . ఇతరులహోదాలనో ,గొప్పతనాలనో చూసి ఆమ్మదగ్గర గర్వప్రదర్శన చేసేవాళ్ళను గౌరవించలేను

అయితే అలా అరచినంత మాత్రాన సరిపోదు .విషయం తెలియజెప్పటం నాబాధ్యత గనుక వినేవాళ్లకు వివరిస్తుంటాను. . మామూలు గా సౌమ్యంగా వివరించటం మెదలెట్టాను .
చరాచరసృష్టి అంతటావ్యాపించివున్న భగవత్శక్తిని విగ్రహంలోకి ఆహ్వానించి భక్తులకు మేలుచేయటానికి మహర్షులు మూర్తి ప్రతిష్టాకలాపం ఏర్పాటుచేశారు . చెక్కేప్పుడు రాయే . కానీ ఒకసారి ప్రతిష్ట జరిపాక అక్కడ దైవశక్తి కొలువై ఉంటుంది .
మనం ఒక అధికారి వద్దకో పెద్దవాళ్లదగ్గరకో వెళ్లినప్పుడు చూడండి ఎంత వినయంగా ఉంటామో ! ఎందుకని ? ఆయనముందు గర్వంగా ప్రవర్తిస్తే వాళ్లకు ఆగ్రహం వస్తుందేమోనన్న గమనిక ఉండటం వలన .
కేవలం మానవమాత్రులైన వీళ్లకే ఇంత విలువిస్తామే ! ఇక భగవంతుని దగ్గర ఎలా ఉండాలి ! అంటూ మెల్లగా అర్ధమయ్యేలా చెప్పాను.
ఆయన ,ఆయనభార్య ,కుమారుడునాకోపానికి కారణం అర్ధం అయింది కాబోలు చాలావినయంగా తీర్ధప్రసాదాలు స్వీకరించి మేము వచ్చి ఒకవారం రోజులు ఇక్కడ ఉండాలని ఉంది స్వామీ అని కోరారు . తప్పనిసరిగా రండి పంచ భక్ష్య పరమాన్నాలు పెట్టలేకపోయినా ఉన్నదాన్నే వచ్చినవారితో ఆప్యాయంగా పమ్చుకుంటాము . అదీగాక దైవభక్తులసేవ చేయగలగటం మా అదృష్టం అని చెప్పాను. తరువాత వాళ్లు ఒక అరగంట మాతో గడిపి వెళ్ళారు పెళ్ళికి .


ఈమధ్య మాతమ్ముని వెంట వాళ్ల మండల అభివృద్ధి అధికారి వెంట మరో ఇద్దరు స్నేహితులతో వచ్చాడు . వాళ్ళిద్దరుకూడా ఎమ్డీవోలే . మావాడు వాళ్ల అసిస్టెంట్ కనుక దర్పంగా గుడిలో కొచ్చారు . నేను పూజలో ఉన్నాను ,
వారిలో ఒకాయన ముడ్డివెనుక చేతులు కట్టుకుని విలాసంగా చూస్తున్నాడు అన్నీ . కనీసం నమస్కరించనుకూడా లేదు దేవునికి . నాకు చిర్రెత్తు కొచ్చింది ఇలాంటివాళ్లను మందిరంలోకి రానిచ్చినందుకు.

భగవంతుని పట్ల గౌరవం ఉంటేనే మనం ఆలయాలలోకి అడుగుపెట్టాలి . ఇలా విలాసంగా పరిశీలించటం ప్రమాదం . మీ జిల్లాధికారి వస్తేనే మీరు సార్ సార్ అని పదిసార్లు పిలుస్తూ వినయం చూపించటానికి పోటీపడతారే ! అలాంటిది గుడిలో కొచ్చి భగవంతుని దర్శించుకోవాలి కానీ అవినయంగా ఉండకూడ దు అన్నాను .
అలాకాదు స్వామీ ! మీరు పూజచేశాక ప్రసాదమిస్తారు కదా అప్పుడు నమస్కారం చేసుకుందామని ఆగాం అన్నారు
ఇదేమిటిస్వామి ? దేవాధిదేవుడైన భగవంతుని మూర్తి కనపడగానే నమస్కరించాలి గాని ఎప్పుడోతరువాత నమస్కారం చేస్తామా ? అని మాటలు తుంచివేశాను . వాల్లు వినీ విననట్లు వెళ్ళిపోయారు .తరువాత ఇటువంటివాళ్లను ఎప్పుడు ఆహ్వానించమాకు మందిరానికి అని మాతమ్ముణ్ణి హెచ్చరించాను.
అధికారి కదా !చూడాలని అంటే కాదనలేక పిలచాను అన్నాడు మావాడు
పిలువు . కానీ ఇక్కడేలా ఉండాలో చెప్పు ముందుగానే . వీల్లకు చదువులు పెరిగాయి కానీ సంస్కారాలు అబ్బలేదు . సర్వానికి అధికారి భగవంతుడు , మనం ఆయనపట్ల గౌరవం చూపనివారికి విలువివ్వవలసిన అవసరం లేదు . అని చెప్పాను .

మొన్న జిల్లా జాయంట్ కలెక్టర్ గారు వచ్చారు . ఆయనకు నేను ముందే చెప్పాను మీరు మాత్రమే రమ్మని . అయినా ఆయన పోగ్రామ్ తెలిసినందున వెంట మండలసిబ్బంది .ఆయన తో పనిబడ్డ స్తానిక నాయకులు కూడావచ్చారు. పాపం ఎంతో శ్రద్దగా ఆయన స్నానంచేసి మందిరంలోకొచ్చికూర్చుంటే బయట ఆవరణలో కుర్చీలు వేసుకుని కూర్చున్నారీబాచ్ .పైగా ముచ్చట్లు ఇక్కడ మందిరం ఆవరణలోపల కుర్చీలు లాంటి ఆసనాలు వేయటం అంగీకరింపము . అంజిరెడ్డి అని కుర్రనాయకుడొకడు గదిలో ఉన్న కుర్చీలు తెచ్చి వేసి బాతాఖానీ మొదలెట్టాడు .లోపలకు వినపడుతున్నాయి మాటలు . బయట మాసర్పంచ్ బాలిరెడ్డి ఇంకాఇద్దరు ఉన్నారు వాల్లు నేలమిదే కూర్చునివున్నారు . బాలిరెడ్డి ! అక్కడ మాట్లాడెదెవరయ్యా ? అనడిగాను . మేముకాదండి అంజిరెడ్డి సెట్టింగ్ అన్నారు వాల్లు , బయటకు వచ్చి ముక్కచివాట్లు పెట్టాను బుద్దీజ్ఞానం ఉందా లేదా ? అని . తెలీదు స్వామీ తెలియక వేశాము అని వాల్లు కుర్చీలు పట్తుకుని లేచి వెల్లారు . పూజయ్యాక జెసీ గారికి చెప్పాను , చూశారుకదా ! వీల్లకు శ్రద్ద లేదు . వినయం లేదు , మీలాంటి వాల్లను చూసైనా నేర్చుకోరు .గర్వం .ఆ తలపొగురు భగవంతుని పట్ల ఎలా ఉండాలో నేర్చుకోనివ్వదు . మీరు ఈసారొచ్చేప్పుడు ఎవరికీ సమాచారం అందించనివ్వకండి .భార్యాభర్త మాత్రమే రండి ప్రశాంతంగా ఉంటుంది .ఈ గుంపులు మీ కు మాకు ప్రశాంతత నుండనివ్వవు అని చెప్పాను.

ఇక్కడ హనుమత్ రక్షాయాగంలో ఎంతో శ్రద్దాశక్తులతో పాల్గొని సేవచేసిన ఐదవరోజే కేంద్రమంత్రి ఒకరివద్ద కు ప్రమోషన్ మీద వెళ్ళిన మాజిల్లా అధికారి దుర్గాప్రసాద్ గారు అంకితభావంగల భక్తులు . ఇక్కడ జరిగేపూజల ఫలితం చూసినవాడు . ఈమధ్య ఫోన్ చేసి స్వామీ మీరు ! స్తానిక ఎమ్మెల్యేలను పిలవండి పీఠానికి పెద్దవాల్లంతా వస్తుంటే బాగుటుంది పీఠ అభివృద్దికి అని చెప్తున్నారు.

వద్దండి ! ఇక్కడ అమ్మ సేవ చే్సేప్పుడు చాలా నిష్థ్గగా ఉండాలి . ఇప్పుడీ ! రాజకీయ నాయకులను పిలచామనుకోండి వాల్లవెంట భజనబృందాలుంటాయి .వాల్లను వెంటేసుకుని వాల్లదర్పం చూపిస్తూ వస్తారు . శుచీ శుభ్రతా లేనివాడు ,ఈసమయంలో గుడిలోకి వెళ్లకూడదు అని తెలిసినా లెక్కచేయని వాల్లూ వస్తారు వెంట . ఎవరినీ నిరోధించలేము . అంతా అనాచారమవుతుంది .అటువంటీవాల్లకు లేనిదోషం తలకెత్తుకున్నట్లవుతుంది

అదీగాక మనం ఎన్నిసార్లు పిలచినా ఆవిడ కిష్టమైన వాల్లే ఇక్కడ అడుగుపెడతారు . మనం పిలవకున్నాసరే ఆతల్లి ఆజ్ఞ అయినవారు వస్తుంటారు . పీఠం అభివృద్దిగూర్చి ఆలోచించాల్సిన పని నాదికాదు. అమ్మ అనుజ్ఞ లేనిదే ఇక్కడడుగు పెట్టలేరెవరూ . ఒకవేళ అవకాశం ఉండి వచ్చినా గర్విష్ఠులు ఇక్కడ పదినిమిషాలు కూడా నిలబడలేరు . చీమలు జెర్రులు పాకినట్లు ఉంటుంది కాబోలు రుసరుస లాడుతూ వెళ్లిపోతారు . ఇది నాకు ప్రత్యక్ష అనుభవం . మీరున్నారు చూడండి . ఎంతపెద్ద ఉద్యోగంలో ఉన్నా భగవత్ సేవలో ఎంతో వినయంతో పాల్గొంటారు దానికి తగ్గట్టు ఫలితముంటుంది .అలాంటివాల్లు సాధనచేసుకోవటానికే అమ్మ అనుగ్రహం పొందడానికే ఈ పీఠం లో సేవాకార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి .అని వివరించానాయనకు

వీల్లే కాదు గొప్పసాధకులమని పేరుపొందినవారిలో కూడా వినయవిధేయతలులేనివారు ఇక్కడకొచ్చినప్పుడు పడినపాట్లు నేను చూశాను.

నేను ఎవరైనా మితృలింటికెళ్లినప్పుడు కూడా వాల్లలో కొందరు ,మా పూజ గది చూద్దురుగాని రండి అంటారు . నేను స్నానం చేయనిదే పూజగదిలోకడుగు పెట్టను . అన్నప్పుడు కొందరు పరవాలేదండి కాళ్ళుకడుకుని వచ్చి చూడండి అంటారు.
అయ్యా ! మీకవి పటాలుగా కనిపిస్తున్నాయేమో గాని పూజాగదిఅంటే దైవనివాస స్థానం అని నా నమ్మకం ,వాస్తవం కూడా . నేను ప్రయాణాలు చేసివచ్చి శుచీ శుభ్రత లేకుండా ప్రవేశించే సాహసం చేయలే్ను అని వారిస్తుంటాను
మనం గుడికెళ్లనీ ,లేక పూజామందిరం లో కెళ్లనీ అక్కడ వినయవిధేయతలతో శ్రద్ధాశక్తులతో ప్రవర్తించాలి
లేకుంటే మనం ఎన్ని జన్మలెత్తినా బొమ్మల్ను చూడ గలుగుతామేగాని అమ్మనుమాత్రం చూడలేము ... జాగ్రత్త

ఏమిటీ తలతిక్క వాడని మీరనుకోవచ్చు అనుకోండి ,కానీ నాకు అమ్మ తన సంకల్పం తో తాను ఇక్కడ కొలువై ఉన్నానని ప్రత్యక్ష ప్రమాణాలు చూపిస్తున్నది . దేవతాప్రతిష్ట చేయాలంటే ముందు విగ్రహాలు సిద్దపరచుకోవాలి . కానీ విగ్రహమెక్కడ ఉందో తెలియకుండానే ఆహ్వానాలు పంపి సంబారాలు సమకూర్చుకుని , ప్రతిష్ఠాచార్యులను పిలుచుకుని సిధ్ధమైన మూర్ఖుణ్ణి బహుశా ప్రపంచంలో నన్నుతప్ప మీరింకెవరినీ చూసి ఉండరు . ప్రతిష్ఠకు పదిరోజులముందు మాత్రమే తన ఉనికిని తెలిపి తరలి వచ్చింది అద్భుతమైన రూపంతో అమ్మవారు. ఆవివరాలు గతంలో ఇక్కడే తెలిపాను . ఆ మూర్ఖత్వానికి ్ ఆధారం అమ్మ అనుగ్రహ లీలలతో నాతోపాటు నాలోపెరిగిపెద్దదైన నమ్మకం . ఆనమ్మకమే నాజీవితానికి . గతి, స్థితీ కూడా.
జైభవానీ




Read more...

హిందూ మతమంటే ఏమిటి ?

>> Thursday, December 2, 2010


హిందూ మతం; సనాతన ధర్మం ఏ వాదాన్నో ఏ సిద్ధాంతాన్నో నమ్మాలనే ప్రబల ప్రయత్నాలతో కూడుకొన్నది కాదు.
అనుభూతే, ఆత్మస్థితే సనాతన ధర్మ తత్త్వం విశ్వాసంకాదు.
నిరంతర సాధన వల్ల పరిపూర్ణతను పొందటమే.. మోక్షాన్ని పొందటమే.. భగవంతున్ని ప్రాప్తింపజేయటమే... భగవంతున్ని దర్శించటమే.. హిందూమత ముఖ్య ఉద్దేశం..
ఈ భగవత్ ప్రాప్తి , భగవత్ సాక్షాత్కారం, భగవంతునికి వున్నట్టి పరిపూర్ణతను పొందటం - ఇదే హిందూ మతం; సనాతన ధర్మం..
స్వామి వివేకానంద..

Read more...

ఆచార్య వాణి

అనుభవం ,అవగాహన లేనివానికి ఆనందాన్ననుభవించే జ్ఞాని ,వట్టి తెలివితక్కువవాడుగానూ, తనలా వస్తువులను సేకరించి అనుభవించటం చేతకానివాడుగానూ తోచటం లోకంలో చూస్తాము . కానీ వాస్తవానికి జ్ఞాని, సకల జీవరాశి ఏ ఆనందం కోసమైతే యావజ్జీవితం వృధాగా నిర్విరామ కృషి చేస్తూ సోలిపోతున్నాయో దానిని పొందిన మహాభాగ్యశాలి
-- ఆచార్య ఎక్కిరాల భరద్వాజ

Read more...

తెలుగు గురించి ఆవేదన

>> Wednesday, December 1, 2010

నమస్తే _/|\_

కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రిగారి సూక్తి ముక్తావళినుండి మన తెలుగు భాష
గూర్చి కొన్ని మచ్చుకు

ఇంట బయటకూడ ఇంగ్లీషు మాట్లాడు
తెలుగు వచ్చికూడ 'తెగులు' వలన
దేశభాషలందు 'తెలుగు' లెస్సాయెరా (less+ఆయెరా)
శాస్త్రిమాట నేటి జగతి బాట

తెలుగు పలుకునింట అలవాటు గావింప
పిల్లలకది యబ్బు నెల్లవేళ
ఇంటిలోనకూడ ఇంగ్లీషుభాషేన?
శాస్త్రిమాట నేటి జగతి బాట

తేటనెనుగు నుడికి సాటిలేదిలలోన
ఎట్టిభాషలందు యెంచిచూడ
తెనుగు పదమునందు తేనెయే చిందురా
శాస్త్రిమాట నేటి జగతి బాట

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP