రుద్రాక్షలు
>> Saturday, December 18, 2010
- రుద్రాక్షలు
రుద్రాక్షలలో పలు రకాలు కలవు. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు పచ్చిగా ఉన్నపుడు కోడిగుడ్డు, ఓక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తరువాత ఇవి కుచించుకుంటూ గుండ్రముగా మారుతాయి. దీని మద్య భాగమున కల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తరువాత రుద్రాక్ష మద్య కాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది.
- రకాలు
వీటిని ముఖ్యముగా ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి పన్నెండు, పదిహేను ముఖాల వరకూ కలిగి ఉంటాయి. ఇరవై ఒక్క ముఖాల రుద్రాక్షలు కూడా వున్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించునవి పంచముఖ రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నిటిలోకీ ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు. అలాంటి రుద్రాక్షల వివరాలు.
- ఏకముఖి. (ఒక ముఖము కలిగినది)
అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓం కార రూపంగా నమ్ముతారు.
- ద్విముఖి (రెండు ముఖములు కలిగినది)
దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు.
- త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)
దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.
- చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది)
నాలుగు వేదాల స్వరూపం
- పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది)
పంచభూత స్వరూపం
- షట్ముఖి (ఆరు ముఖములు కలది)
కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.
- సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది)
కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం
- అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)
విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.
- నవముఖి (తొమ్మిది ముఖాలు కలది)
నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.
- దశముఖి (పది ముఖాలు కలిగినది)
దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.
అసలైన రుద్రాక్షలను గుర్తించే పద్ధతులు
క్రింది పరీక్షలను చేయడం ద్వారా నిజమైన రుద్రాక్షను నిర్ధారించడం ఉత్తమం.
- రెండు రాగి నాణెముల మధ్య రుద్రాక్షనుంచితే అది సవ్య దిశలో తిరుగుతుంది
- నకిలీ రుద్రాక్షను నీటిలోగానీ, పాలలోగానీ వేసినపుడు అది తేలుతుంది.
- నిజమైన రుద్రాక్షను పాలలో వేస్తే పాలు కొన్ని రోజుల వరకు విరగవు, చెడిపోవు.
- నిజమైన రుద్రాక్షను చల్లని నీటిలో వేస్తే అరగంటలో వేడెక్కుతాయి.
పూజలలో రుద్రాక్షలు
రుద్రాక్షలను 108 గాని, 54 గాని, 27 గాని బంగారము, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారుచేయించి మెడలో ధరించవలెను. జప మాలగా కూడ ఉపయోగించవచ్చును.
వైద్యంలో రుద్రాక్షలు
రుద్రాక్షలు ధరించుట వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం. రుద్రాక్షలను అన్ని వర్ణములవారు ధరించవచ్చును.
[వికీపీడియా నుండి]
1 వ్యాఖ్యలు:
durgeswara gariki namaskaram. 'rudrakshalu' gurinchi chala information iccharu thank you very much. veelaithe manchi rudrakshalu ekkada labhisthayo dayachesi chepagalaru...
Post a Comment