లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబమ్
>> Sunday, December 5, 2010
సంసార సాగర విశాల కరాళ కామ వక్రగ్రహన గ్రసన నిగ్ర్హహ విగ్రహస్య
మగ్నస్య రాగలసదూర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలంబమ్ !
ఓ లక్ష్మీ నృసింహస్వామీ ! సంసారము అను సముద్రమునందలి భయంకరమగు కామమనే పెద్ద మొసలిచే మ్రింగబడుచున్నవాడనై ,విషయచితలనెడి అలలచే వెనుకకు ముందుకు గుంజబడి బాధలనొందుచున్న నాకు నీదివ్యహస్తము నందించుప్రభూ !
సంసారఘోరగహనే చరతో మురారే !మారోగ్రభీకర మృగ ప్రవరార్ధితస్య
ఆర్తస్య మత్సరనిదాఘ పీడితస్య లక్ష్మీ నృసింహ ! మమదేహి కరావలంబమ్
ఓ మురారీ ! సంసారమను కారడవియందు బడి తిరుగుచూ మన్మథుడు అనబడు ఈ కౄరమృగవాతనబడి బాధనొందుచున్నాను .క్రోధమను గ్రీష్మముచే మిగులతపింపబడు నాకు ప్రాపగుము !
సంసారకూప మతిఘోర మగాధమూలం సంప్రాప్య దు:ఖశత సర్పసమాకులస్య
దీనస్యదేవ కృపయా శరణాగతస్య లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబం
ఓ లక్ష్మీ నృసింహా ! మిగులభయంకరము,చాలాలోతుగల సంసారమనబడెడు నూతిలో బడి ,దు:ఖములను పాములకుజిక్కి కలవరము నొందిన కృపణుడనగు నన్ను కరుణించి చేయూతనందించి లేవదీయుము .
సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీఢ్యమాన వపుషస్సక లార్దితస్య
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీనృసింహ ! మమదేహి కరావలంబమ్ !
ఓ లక్ష్మీ నృసింహ స్వామీ ! సంసారమను భయంకరమైన మదపుటేనుగు తొండపుదెబ్బలచే నొచ్చిన మేనుగలవాడను,సమస్తబాధలచే కృశించినవాడను ప్రాణాపదవలన భయముతో కూడినవాడనైన నాకు జేయూతనొసగుము.
సంసారసర్ప విషదుష్టభయోగ్రతీవ్రదంష్ట్రాకరాళ విషదగ్ద వినష్టమూర్తే:
నాగారి వాహన ! సుధాబ్దినివాససౌరే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్
ఓ గరుడవాహనా ! పాలసముద్రమున పవ్వళించు ఓదేవా! సంసారమను భయంకరసర్పము యొక్క విషముచే దుష్టములై,భయంకరములై. కౄరములై,తీక్ష్ణములైనకోరలయందలి భీషణవిషసంపర్కముచే నశించిన శరీరముగల నాకు జేయూతనొసగుము.
సంసారజాల పతితస్య జగన్నివాస సర్వేన్ద్రియార్ద బడిశస్థఝుషాత్మనశ్చ !
ప్రోత్తమ్భితప్రచుర తాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ!మమదేహి కరావలంబం
సర్వలోకాంతర్యామివగు ఓప్రభూ ! సంసారపు జిక్కులమారి వలలో తగులుకొని శబ్దరూపస్పర్శరసగంధాధి విషయములకు లోనై వలలోచేపమాదిరిగా చిక్కుకున్నవాడనై,ఎత్తబడినదియు తెరువబడినదియు పెదవులుతలగల నాకు జేయూతనిమ్ము.
సంసారదావ దహననాకుల భీకరోగ్రజ్వాలావలీభి రభిదగ్ద తనూరుహస్య !
త్వత్పాదయుగ్మ సరసీరుహ మస్తకస్య లక్ష్మీనృసింహ ! మమదేహి కరావలంబం
ఓ లక్ష్మీ నృసింహస్వామీ ! సంసారమను కార్చిచ్చుయొక్క అన్నివైపులాజుట్టివచ్చుచున్న భయంకరములైన,కౄరములైన మంటలచే మాడిపోయిన రోమములుగలవాడినై నీపాదములను శిరమునదాల్చి ధ్యానించుచున్న నాకు నీ చేయూతనిమ్ము .
సంసారసాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో! కరుణానిధే!మామ్ !
ప్రహ్లాదఖేదపరిహార పరావతార లక్ష్మీనృసింహ !మమదేహి కరావలంబం
దయగల యోమహానుభావా ! సంసార సముద్రమునబడి యుక్కిరిబిక్కిరియగుచున్న దిక్కులేని నన్నుగాపాడుము. నాకుచేయినందిమ్ము .
1 వ్యాఖ్యలు:
నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.
దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
--
ధన్యవాదముతో
మీ సమూహము
http://samoohamu.com
Post a Comment