ఇదిగో ! ఇలాంటి గతి పట్టినదాకా మన కళ్ళు తెరుచుకోవు
>> Tuesday, December 7, 2010
[ఆంధ్రజ్యోతి దినపత్రిక nov 26, 2010 లోనిది ఈవ్యాసం]
ధార్మిక వివక్ష!
- మొహమ్మద్ ఇర్ఫాన్
గల్ఫ్‌లోని అన్ని దేశాలు పూర్తిగా ఇస్లామిక్ రాజ్యా లు కాగా అందులో కొన్ని కఠోర మత నిబంధనలు పాటిస్తుండ గా మరికొన్ని ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. ఇస్లామిక్ దేశమైనప్పటికీ మొత్తం గల్ఫ్‌లో కువైట్ ఒక అభ్యుదయ భావాలు కలిగిన దేశంగా పేరొందినా ఈ దీపావళి సందర్భం గా కువైట్ పోలీసులు ప్రవర్తించిన అమానుష చర్య అనేక ప్రశ్నలను సంధించింది.
ఒమాన్‌లోని, యుఎఇ(దుబాయి)లోని మందిరాలు మినహా గల్ఫ్‌లో ఎక్కడ కూడా హిందువుల ఆలయాలు లేవు. ఒక గుజరాతీయ సింధీ వ్యక్తి నిర్వహణలో ఉన్న దుబాయిలోని ఇరుకయిన మందిరాన్ని విస్తరించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇక విశాల సౌదీ అరేబియాలో కనీసం దేవుళ్ల చిత్రపటాలను కూడా తీసుకరావడం కూడా నిషే ధం. ఈ పరిస్థితులలో హిందూ ధార్మిక అభిరుచి కలిగిన కొందరు ఇళ్లలో గోప్యంగా సామూహిక ప్రార్థనలు జరుపుకోవడం మినహా మరే మార్గం లేదు.
కొన్నాళ్ల క్రితం దుబాయిలోని జుమేరియాలో గణేష్ నిమజ్జనం చేయడానికి ప్రయత్నించిన కొంత మంది యువకులను దుబాయి పోలీసులు అదుపులోకి తీసుకుని హెచ్చరించి వదిలిపెట్టారు. ప్రపంచంలోని ఎత్తయిన భవనాలలో ఒకటైన బుర్జ్ అల్ ఖలీఫా పైకప్పుపై బతుకమ్మ ఆడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రయత్నించారు. ధార్మిక కారణాల వల్ల కుదరలేదు. అందుకే హిందూ పండుగలను ఒక సాంఘిక లేదా సాంస్కృతిక కార్యక్రమంగా జరుపుకోవల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దుబాయిలో దసరాకు ముందు జరుపుకునే దాండియా ఉత్సవాలు ప్రముఖమైనవి. అయితే అందులో కేవలం సంపన్న వర్గాలు మాత్రమే పాల్గొంటారు.
ఈ ఏడాది నుంచి హైదరాబాద్‌లోని ఒక ప్రఖ్యాత క్లబ్ యజమాని గుజరాతీ వ్యాపారస్తులతో కలిసి దాండియాను భారీ వ్యయంతో కూడిన ఉత్సవంగా మార్చారు. కువైట్‌లో కూడా ఉన్నత ఉద్యోగాలు చేసే సంప న్న ప్రవాస భారతీయులు నివసించే సాల్మీయాలోని టైటానిక్ నివాస సముదాయంలో గత కొద్ది కాలంగా దీపావళి పండుగను ఆర్భాటంగా, ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. మొత్తం కువైట్‌లో ఈ ఒక్క ప్రదేశమే సురక్షితం కావడంతో రానురాను దీని ప్రాధాన్యం పెరిగి అనేక భారతీయ కుటుంబాలు టైటానిక్ నివాస సముదాయానికి వచ్చి టపాకాయలు కాల్చడం, పిల్లలతో ఆనందం పొందుతున్నారు.
ప్రతిసారి అలా సంప న్న భారతీయులు టైటానిక్ కాంప్లెక్స్‌లో టపాకాయలు కాల్చుతూ పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. దీనికి ప్రత్యేకంగా అధికారుల నుంచి అనుమతి కూడా ఉంది. రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాన్ని ముగించాలనే షరతుతో అనుమతి ఇచ్చారు. ఈ రకంగా అన్యమతస్తులు పండుగను నిర్వహించుకోవడం కొంతమంది కువైట్ జాతీయులకు మింగుడుపడలేదు. అందుకే ఈసారి దాన్ని ఎలాగై నా భగ్నం చేయాలనే పథకం రచించారు.
ఈ మేరకు అనుమతి లేకుండా బాణాసంచా పేల్చుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే సాయుధ పోలీసు బలగాలు వచ్చి దీపావళి జరుపుకుంటున్న 18 మందిని అరెస్టు చేశారు. 22 నిమిషాల గడువు ముగిసిన తర్వాత అంటే రాత్రి 9 గంటల 22 నిమిషాలకు పోలీసులు టైటానిక్ సముదాయంపై దాడి చేశారు. ఉగ్రవాదుల దాడులకు వెళ్లినట్టుగా 16 ప్రత్యేక వాహనాలలో వచ్చిన స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు పెద్ద తోపులాట తర్వాత భవన సముదాయంలోకి ప్రవేశించారు. అరెస్టు అయిన వారిలో అయిదుగురిని మరుసటి రోజు విడుదల చేయగా, మిగిలిన వారిని నాలుగు రోజుల తర్వాత విడుదల చేశారు. ఈ సంఘటన కువైట్‌లో పెద్ద దుమారం రేపింది.
భారతీయ ఎంబసీ తీరుపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఎంబసీ దీనిపై నోరు విప్పలేదు. కువైట్ జనాభాలో విదేశీయులు మెజారిటీ సంఖ్యలో ఉండగా అందులో భారతీయులు అగ్రగణ్యులు కాగా, అందులో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. అయినా ప్రభుత్వ తీరు సమంజసంగా లేదు. అంతకు ముందు కువైట్‌లోని ఒక స్టేడియంలో శ్రీలంకకు చెందిన సింహాళీయులు తమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీనికి కువైట్ ప్రభుత్వం అనుమతించింది కూడా.
సభలో శ్రీలంక రాయబారితో సహా ఆ దేశానికి చెందిన అనేకమంది ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు వేదికపై ఉండగా ఒక్కసారిగా పోలీసులు స్టేడియంలోకి ప్రవేశించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమ నిర్వహణకు తమకు అనుమతి ఉందని చెప్పినా శుక్రవారం నమాజు సమయంలో లౌడు స్పీక ర్ల ద్వారా పాటలు పాడడం భావ్యం కాదంటూ మొత్తం కార్యక్రమాన్ని ముగించారు. దీంతో వేలాది మంది నిరాశతో వెనక్కి మళ్లారు. 2003లో కువైట్‌లో భారతీయ రాయబారిగా వచ్చిన స్వష్ పవన్ సింగ్ స్థానికంగా ఉన్న ఒక గురుద్వారకు వెళ్లిన కొద్ది రోజులకు అక్రమంగా అనుమతి లేకుండా దాన్ని నిర్మించారని కువైట్ అధికారులు దాన్ని కూలగొట్టారు.
ముస్లింలలో షియా వర్గానికి చెందిన బోహ్రా తెగకు చెందిన ప్రవాస భారతీయులు, పాకిస్థానీలకోసం మసీదు నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కువైట్ మంత్రి తన పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. క్రైస్తవ మతానికి సంబంధించి కొన్ని చర్చీలు ఉన్నప్పటికీ దాన్ని విస్తరించడానికి కూడా స్థానికుల నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొత్తం గల్ఫ్ కూటమిలో కువైట్ ప్రగతిశీల, స్వేచ్ఛా వాతావరణం కలిగిన దేశం గా పేరొందింది.
దుబాయి కంటే కూడా కువైట్‌లో స్వేచ్ఛ ఎక్కువ అని పేరున్నా, ఇస్లామేతర ధార్మిక విషయాలకు సంబంధించిన ఈ సంఘటనలు చూస్తే బాధ కలుగుతుంది. ఆర్థికంగా, మౌలిక వసతుల కల్పన విషయంలో గల్ఫ్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ ధార్మిక విషయాలలో మాత్రం ఇంకా ఇస్లామిక్ మత ఛాందవాదం ముసుగులో ఉంది.
[ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి]
4 వ్యాఖ్యలు:
దుర్గేస్వర గారు,
మనలను (హిందువులను) ప్రొటెక్ట్/రెప్రజెన్ట్ చెయడానికి ఎవరు లేరు. అది కిరస్తానీలకు మరియు తురకలకు బాగా తెలుసు. తంతే అడిగే దిక్కు లేదు. ఇండియా ప్రభుత్వము (సొనియా మరియు కాంగ్రెస్) హిందువులను ప్రొటెక్ట్ చేయదు. ఇంకా చెపాలి అంటే అది హిందువులకు వెతిరేకంగా పనిచెస్తుంది.
హిందువులు ఒక సెంట్రల్ ఆర్గనైజెషన్ ను ఎర్పరచుకొవాలి. That organization must be funded and run like a Corporation. Full time paid representatives oversea the best interests of హిందువులు all over the world. They will manage Media, Social, Cultural, Charitable and Political issues.
ఇండియా ప్రజాస్వామ్య దేశంగా వుండాలి ఆంటే, హిందువులు అందరిని ఒక ఒట్ బ్యాన్క్ గా చెయగలగాలి; లేక పొతే వేరే పొలిటికల్ system ను తీసుకు రావాలి.
మేజారిటిలొ వుండి కూడా ప్రభుత్వము ఏర్పరచలేక పొవడము హిందువుల చెతకాని తనము.
దుర్గేస్వర గారు, మీరు హిందువులను చైతన్యులను చెయాలి అని ప్రయత్నిస్తున్నారు. మంచి విషయము.
కాని హిందువుల 1) మౌనం (silence) , 2) తెలీని తనం (ignorance), 3) కలివిడి లేక పొవడం(no unity), 4) నిర్లక్షం (arrogance), 5) చెతకానితనం అనేవి నిజమైన అడ్డు గొడలు.
పైన చెప్పిన 5 విషయాలను అదిగమించగలిగితేనే "ఇండియాలొ హిందువుల మనుగడ"(*) వుంటుంది. (*)దాని మీదనే ప్రపంచములొ హిందువుల భబిష్యత్ ఆదారపడి వుంది.
హిందువులు ఒక జడ పదార్దము లాంటి వాళ్ళు. వారిలొ చైతన్యము తెవాలి అంటే అయొధ్య movement లాంటిది ఇంకొకసారి రావాలి.
Post a Comment