శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ధనుర్మాసం వచ్చేస్తోంది

>> Wednesday, December 15, 2010





ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవశించి మహావిష్ణువును ప్రార్థించినట్లైతే మోక్షము ప్రాప్తిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

ముఖ్యంగా ఏకాదశి నాటినుండే విష్ణునామాలను మంత్ర జపములు చేయడం ఉత్తమం. ఆ రోజునే "విష్ణుశయనోత్సవం" జరుపుతారు. కావున ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే... కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. అంతేగాకుండా ఈ రోజున ఉపవాస జాగరణలు చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం.

ఇకపోతే... ధనుర్మాసం పూర్తిగా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి మహావిష్ణువును విష్ణుసహస్రనామముతో ప్రార్థించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

3 వ్యాఖ్యలు:

Anonymous December 15, 2010 at 6:09 AM  

దుర్గేశ్వర గారు, 17 శుక్రవారం న ఏకాదశి మధ్యహ్నం 12కి వెళ్ళిపోతుందిగదా?

పూజలు శుక్రవారం సాయంత్రం చెయ్యాలా? గురువారం సాయంత్రం చెయ్యాలా?

durgeswara December 15, 2010 at 7:28 AM  

అమ్మా
ఏకాదశి పుర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశిలో పారణచేయాలి.
అయితే మనం మిగులు నే తిథిగాపాటిస్తాము కనుక .శుక్రవారం రోజు ఉపవాసం ఉండి ద్వాదశి అంటే శనివారం ఉదయం పూజపూర్తిచేసుకుని భోజనాదులు చేసుకోవాలి .

రాజేశ్వరి నేదునూరి December 17, 2010 at 8:27 AM  

నమస్కారం దుర్గేస్వర్ గారు .కుశలమా ? ఈ మధ్య నేను అటు ఇటు తిరగడం వలన సరిగా చూడలేక పోయాను క్షమించ గలరు. ధనుర్మాస ప్రతేకతను చక్క గా చెప్పారు. నిజమె ఈ నెల మొదటి నుండీ సంక్రాంతి నెల రంగు రంగుల ముగ్గులతొ వాటి మధ్య కొలువు తీరిన గొబ్బిళ్ళు [చిరు చలిలొ ]తెలుగు వారి లోగిళ్ళు ,హరిదాసులు గంగిరెద్దు మేళాలు. కొత్త ధాన్యం ,కొత్త అల్లుళ్ళు ,సంక్రాంతి లక్ష్మి ఇంటింటా ప్రతి ఇంటా కలకలలాడుతు ఉంటాయి. మరిప్పుడు ఆ వైభవాలు ఉన్నాయొ లేదో ?

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP