హిందూ మతమంటే ఏమిటి ?
>> Thursday, December 2, 2010
హిందూ మతం; సనాతన ధర్మం ఏ వాదాన్నో ఏ సిద్ధాంతాన్నో నమ్మాలనే ప్రబల ప్రయత్నాలతో కూడుకొన్నది కాదు.అనుభూతే, ఆత్మస్థితే సనాతన ధర్మ తత్త్వం విశ్వాసంకాదు. నిరంతర సాధన వల్ల పరిపూర్ణతను పొందటమే.. మోక్షాన్ని పొందటమే.. భగవంతున్ని ప్రాప్తింపజేయటమే... భగవంతున్ని దర్శించటమే.. హిందూమత ముఖ్య ఉద్దేశం.. ఈ భగవత్ ప్రాప్తి , భగవత్ సాక్షాత్కారం, భగవంతునికి వున్నట్టి పరిపూర్ణతను పొందటం - ఇదే హిందూ మతం; సనాతన ధర్మం.. స్వామి వివేకానంద..
2 వ్యాఖ్యలు:
ధన్యవాదాలు.
"అనుభూతే, ఆత్మస్థితే సనాతన ధర్మ తత్త్వం.
విశ్వాసంకాదు"
ఈ మాట సత్యనారాయణ శర్మ గారి మాటలు వింటున్నతర్వాత అర్దమవుతున్నవి.
దేవుణ్ణి కూడా అనుభవించి నమ్ము కానీ ఎవరో చెప్పారని కాదు అన్న భావన లో ఆయన చెప్తుంటారు.
"నిరంతర సాధన వల్ల పరిపూర్ణతను పొందటమే మోక్షాన్ని పొందటమే.. భగవంతున్ని ప్రాప్తింపజేయటమే... భగవంతున్ని దర్శించటమే.. హిందూమత ముఖ్య ఉద్దేశం.."
ఆ సాధనా మార్గాలు వివిధమైనందువల్లే ప్రతిమార్గం ఒక మతమంటూ హిందూ మతం అనేదే లేదంటూ కొందరు వితండవాదం చేస్తుంటారు.
హిందూ మతం గమ్యాన్ని వివరిస్తుంది, మార్గాన్ని ఎంచుకోమంటుంది. ఇతర కొత్త మతాల లాగా ప్రతి అడుగు ఇలానే ఉండాలని మార్గాన్ని నిర్దేశించదు.
మార్గాన్ని ఎంచుకొందామనీ, గమ్యం చేరాలని ఉత్సాహం (మరియు అవసరం?) లేక చిన్న మానసిక అవసరాలకు, కోరికలు తీరటానికి మతాన్ని వాడుకొంటున్నాం నాలాంటి చాలామంది.
Post a Comment