కనమరుగవుతున్నాడు కడుపునింపేవాడు .. ఇది దేశానికి శాపం, మనకు చుట్టుకునే పాపం
>> Thursday, December 23, 2010
తాను అర్ధాకలితో ఉండి మనకు ఆన్నం పెట్టి కడుపునింపాడు . ఒక్క పుట్టి ఎక్కువపండితే ఉబ్బితబ్బిబ్బయి పదిమందికీ పంచే అల్పసంతోషి ,అపర త్యాగయోగి . అటువంటి అన్నదాత సెలవంటూ మనలను వదలి వెళ్లిపోతున్నాడు . కాదుకాదు..... మాయామర్మం తెలియని నీవు ఈ మాయదారి లోకంలో ప్రకృతితో జూదాలు ఆడుతూ బ్రతకలేవు నాన్నా , అని తన తల్లి భూమాత గర్భంలో కి పిలుచుకుని దాచుకుంటుంది . బాధలు కష్టాలు ఇకమావల్లకాదంటూ మనలను వదలి వెల్లిపోతున్న మన అన్నదాత కోసం ఓ కన్నీటిబొట్టు కార్చే ఓపికా తీరికా లేని మనకు రాబోయే కాలమంతా కావల్సినంత కన్నీరు ..... బోలెడంత దు:ఖం బోనస్ .
3 వ్యాఖ్యలు:
నేడు రైతుల జీవితాలతో ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయి.ఇదే ప్రభుత్వం రైతుల కాళ్ళు పట్టుకుని పంటలు పండించండి బాబూ అనే రోజు తప్పక వస్తుంది. పరిస్థితులు ఇంకా క్షీణించి ఆ సమయం త్వరలో రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.
చిలమకూరు విజయమోహన్ గారు,
Please think positive. Expect positive things.
The best response could be, to defeat (with votes during elections) all corrupt Congress politicians who are supporting that women who is controlling Congress Party.
నేను positiveగానే ఆలోచిస్తున్నానండి.రైతేరాజు,రైతే దేశానికి వెన్నెముక,అన్నదాత,రైతే దేశానికి అన్నం పెడుతున్నాడు ఇలాంటి మాటలకేం కొదవ లేదుగానీ ఎన్నికలొచ్చేటప్పటికి అందరూ అన్నీ మరచిపోతారు అప్పుడు మా కులమోడనో,మా మతమోడనో,నాకు పైసలిచ్చినాడనో చెప్పి అవినీతికి ఓట్లేసేవారే. ప్రజలకు తమ దగ్గరకు వస్తేగానీ రైతు సమస్య ఎంత జటిలమో అర్థమయ్యేది.పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతులమంతా వ్యవసాయం మానేసే పరిస్థితి రాక తప్పదు.అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.అందుకే అలాంటిది ముందే వస్తే దేశానికి మేలయినా త్వరగా జరుగుతుందని నా ఆలోచన.
Post a Comment