హనుమత్ వ్రతం పూర్తిచేసుకుని జాపాలి బయలుదేరిన దీక్షా బృందాలు
>> Sunday, December 19, 2010
వందేసంతం శ్రీహనుమంతం ...రామదూతం బలవంతం
ఈరోజు హనుమద్వ్రతం .భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం. మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి , హనుమంతుని ఆయనశక్తిస్వరూపమగు సువర్చలాదేవిని పంపానది ని కలశాలలోకి ఆవాహనచేసి పూజించి ,హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్లతోరాన్ని ధరిస్తారు . ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సమ్పూర్ణ అనుగ్రహం ఆ సాధకులకు కలుగుతుంది అని శాస్త్రవచనం .వ్రతవిధానాన్ని హనుమదుపాసకులు పూజ్య అన్నదానం చిదంబర శాస్త్రిగారు పరాశరసంహిత నుండి ప్రచురణలోకి తెచ్చారు .
కాగా మాప్రాంతంలో కార్తీకం మొదటినుంచి హనుమత్ వ్రతం దాకా .అలాగే వైశాఖంలో వచ్చే హనుమజ్జయంతికి నలభైరోజులు పూర్తయ్యే విధంగా హనుమద్దీక్షలు స్వీకరిస్తుంటారు. ముఖ్యంగా ఏకాగ్రత ,మానసికబలం ,శక్తిసామర్ధ్యాలను పెంచే ఈ హనుమత్ ద్దీక్షలను యువకులు ఎక్కువగా స్వీకరిస్తుంటారు.
మనపీఠం లో ఇప్పుడు దీక్షలు స్వీకరించిన వారిలో ఒక బృందం ఈరోజుకు మద్దిమడుగు ఆంజనేయ దేవస్థానంలో ఉండేలా మొన్ననే బయలుదేరి వెల్లగా మరొక బృందం ఈరోజు ఇక్కడే వ్రతాలు చేసుకుని హనుమ జన్మస్థలమైన తిరుమలగిరులలో ఉన్న జాపాలి క్షేత్రానికి తరలి వెల్లారు.
ఈరోజు వ్రతం చేసుకున్నవారిలో షేక్ హుస్సేన్ , సాంబశివానాయక్,శ్రీహరిరెడ్డి ఉన్నారు .వీల్లంతా మాపూర్వవిద్యార్థులు . నలభైరోజులపాటు స్వామి సేవలో గడిపిన వీరికి ఆయన ఆయురారోగ్యయశోధైర్యాలను బుధ్ధిబలాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాము.
జైశ్రీరాం .....జైహనుమాన్
0 వ్యాఖ్యలు:
Post a Comment