మొగుడు ముండా అంటే ముష్టికొచ్చినవాడుకూడా ముండా అన్నాడట ! ఎంత చులకనైపోయాము మనం ?
>> Sunday, December 12, 2010
ఈ వార్త చూడండి :
"మూర్ఖ భారతదేశం": సింగపూర్ దౌత్యవేత్త అనుచిత వ్యాఖ్య
వికీలీక్స్ బయటపెడుతున్న రహస్య విషయాలు కొన్ని దేశాల మధ్య చిచ్చు
రగిల్చేవిగా ఉంటే.. మరికొన్ని దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం
చేసేవిగా ఉన్నాయి. ప్రపంచ దేశాలను తిట్టడం, దేశాధినేతలకు మారుపేర్లు
పెట్టడం వంటిది ఇప్పటి వరకూ అమెరికానే చేసిందనుకున్నాం. కానీ.. ఇప్పుడు ఆ
జాబితాలోకి సింగపూర్ కూడా చేరిపోయింది.
ఇటీవల వికీలీక్స్ విడుదల చేసిన దౌత్య పత్రాలలో సింగపూర్‌కు చెందిన
దౌత్యవేత్త భారత్‌ను ఓ మూర్ఖదేశంగా అభివర్ణించినట్లు అస్ట్రేలియాకు
చెందిన ఫాక్స్ మీడియా సంస్థకు విడుదల చేసిన పత్రాలు వెల్లడిస్తున్నాయి.
సింగపూర్ రాయబారి టామీ కో భారత్‌ను 'మూర్ఖదేశమ'ని, జపాన్ 'చిక్కిపోతోంది'
అని వ్యాఖ్యానించినట్లు వికీలీక్స్ పేర్కొంది.
ఈ పత్రాల ప్రకారం.. "మూర్ఖ భారతీయ మిత్రులు.. భారత్ సగం ఆసియాన్
కూటమిలోనూ, సగం దాని బయట ఉంది" అని కో అన్నారు. గత 2008, 2009 మధ్యకాలంలో
సీనియర్ అమెరికా అధికారులైన డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ ఫర్ ఈస్ట్ ఏషియా
డేవిడ్ సిడ్నీలతో సింగపూర్ విదేశీ వ్యవహారాల అధికారులు
వ్యాఖ్యానించినట్లు వెల్లడైంది.
అంతే కాకుండా.. మలేసియా, థాయ్‌ల్యాండ్, జపాన్ తదితర దేశాలపై వారు అనుచిత
వ్యాఖ్యలు చేశారు. జపాన్ నాయకత్వానికి సరైన ధృక్పధం లేదని, మలేసియాకు
సరైన నాయకత్వం లేకపోడం ప్రధాన సమస్య అని వారు వ్యాఖ్యానించారు.
http://telugu.webdunia.com/
--
11 వ్యాఖ్యలు:
క్షమించమ్మా భారతీ చేతగాని వాజమ్మలమై నిన్ను అవమానాల పాల్జేస్తున్నందుకు . దు:ఖించమ్మా గుండెలవిసేలా ఇలాంటి సంతానాన్ని పొందినందుకు..
I think the issue has been blown out of proportions. That guy didnt call the whole nation stupid. He was taking our foreign policy, of being half in and half out of ASEAN, to task.
ఆడవాళ్ళని అవమానించకూడదనే కదా ఆ సామెత చెబుతున్నది.. ఎందుకు మార్చడం ? ఇలా మారుస్తూ పోతే ఎన్ని సామెతల్ని మార్చాలో !
ఇవే రంధ్రాన్వేషనలంటే . సమస్యను గమనించకుండా సామెతలుమార్చండి,జాతీయాలు తీసేయండి అంటే ఎలా?
విషయం గమనించండి స్వామీ !
మన దగ్గర ఎన్ని తెలివితేటలున్నా, ఎంత సంపద వున్నా, చేతగాని వాళ్ళం కావడం వల్లే ఈ అనర్ధాలన్నీ.... ఒక సమస్య వస్తే కప్పదాటు ధోరణి అవలంబించే నాయకులు వున్నంత కాలం, అఫ్జల్ గురు లాంటి వాళ్ళని, కసబ్ లాంటి వాళ్ళని వురి తీయకుండా ఇంకా విందు భోజనంతో మేపే రాజకీయ నాయకులున్నంత కాలం మన పరిస్తితి ఇంతే...
వ్యావహారిక భాషలో విధవరాలిని ముండ అని పిలవక ఏమని పిలుస్తారు? ఇలాంటి అభ్యంతరాలన్నీ పట్టించుకుంటే అందరం గ్రాంధికమే మాట్లాడాల్సి వుంటుంది కానీ ఈ పదం పైన అభ్యంతరాలని పట్టించుకోకండి. ఓ కొద్దిమంది జనం సెన్సిటివ్ అయిపోతున్నారనీ మనమూ తల ఊపకూడదు.
అనవసర వివాదం అని పైన రెండువ్యాఖ్యలు తొలగించాను ఏమనుకోవద్దు ఆ మితృలు
సింగపూర్ వాళ్ళకి కాస్త బలుస్తోందన్నమాట నిజమే. వాళ్ళకున్న ఓ రోగమేమంటే ప్రపంచంలో అంతా తమనే అనుసరిస్తున్నారని ఓ అపోహ వుంది. కాని వాళ్ళు బ్రిటన్, అమెరికాలను అడ్డంగా కాపీ కొడుతుంటారు. అన్నిదేశాలపై వాళ్ళు ఇలా చేయాలి, అలాచేయాలి అని అయాచిత సలహాలిచ్చేస్తుంటారు. ఇలాంటి సలహాలిచ్చినప్పుడు తైవాన్ లీడర్ ఓ సారి " ముక్కులో పొక్కు అంతలేని సింగపూర్ కూడా సలహాలిచ్చేదే అన్నాడు.:) అస్ట్రేలియా కూడా ఓ సారి అలానే విసుక్కున్నారు. ఇదంతా గాసిప్ అని, అవన్నీ పట్టిచుకోనక్కరలేదని ఆదేశ విదేశాంగమంత్రి నిన్న సెలవిచ్చారు. అంటే ఆ దేశ వున్నతాధికారులు గాసిప్ లతో గడిపేస్తుంటారనే కదా! కాబట్టి పట్టించుకోనవసరం లేదు.
మలక్పేటూ, ఫారిన్ మినిస్ట్రీని తిడితే ఇండియాని తిట్టినట్టు కాదా!?!
శరత్ గారు ,ఆ సామెతలో విధవరాలి గురించి ఎక్కడుంది ?విధవరాలిని మొగుడు ఎలా తిడతాడు ?got my point?
మన నాయకత్వం .
పార్లమెంట్ పైనేకాదు, పౌరులపైనా........
అని కాదు,
"పౌరులపైనేకాదు , పార్లమెంట్ పైనా ....."
అని చెప్పాలి.
స్వార్ధ చింతననే భుజ స్కంధాల మీద మోస్తూన్న మన నాయకులు గురించి ఏమని చెప్ప గలము? ప్చ్!
Post a Comment