శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దేవుడు ఎక్కడుంటాడు? ఎటుచూస్తుంటాడు?ఏమిచేస్తుంటాడు?

>> Friday, December 31, 2010

ఓ రాజుగారికి కాస్త తలతిక్క, పండితులను హేళన చేసే తత్వం బాగా ఉన్నాయి . ఓరోజు తన ఆస్థాన పండితుని ప్రజ్ఞ ను పరీక్షించాలని కోరికపుట్టింది . అయ్యా ! పండితులవారూ మీరు ఈరోజు నా ప్రశ్నలకు శాస్త్రీయమైన సమాధానాలను ఇచ్చి

నా అనుమానాలు తీర్చాలి .ఇది మీబాధ్యత కూడా . నా ప్రశ్నలకు మీరు సంతృప్తికరమైన సమాధానములివ్వలేకపోయారంటే మీరు పండితులుకాదని అర్ధం .అలా జరిగితే మీరు పండితులమని చెప్పి మమ్మల్ని మోసం చేసినట్లుగా భావించవలసి వస్తుంది . అని చెప్పాడు.

సమాధానమివ్వటానికి సిద్దమయ్యాడు ఆయన.

మీరు దేవుని గూర్చి పలు శాస్త్రాల ఆధారంగా వివరనలిస్తున్నారు. ఈవిషయం నిజమని లోకాన్ని నమ్మిస్తున్నారు . సరే మీకంతగా తెలిసిన విషయమే కనుక . అసలు దేవుడెక్కడ ఉంటాడు . ఎటుచూస్తుంటాడు ? ఏమిచేస్తుంటాడు ?
ఈప్రశ్నలకు సరైన సమధానం చెప్పాలి . లేకుంటే మీరిప్పటి వరకు చెప్పినవి సప్రమాణమైనవి కావని భావించి అలాంటివి చెప్పినందుకు శిక్షించవలసి వస్తుంది కూడా అన్నాడు.

ఈ ప్రశ్నలకు ఏవిధంగా సమాధానమిచ్చి సంతృప్తి పరచాలో ఆపండితులవారికి అర్ధంకాలేదు. అందువలన ముందు గండం నుంచి బయటపడటానికి కొంత సమయం అడిగాడు . అందుకు రాజు అంగీకరించి ,ఈసమయంలోపు సంతృప్తికర సమాధానాలివ్వవలసి ఉంది అని హెచ్చరించాడు .

ఇక ఇంటికి వచ్చిన పండితులవారు దిగులుతో ఆలోచనల్లో మునిగిపోయాడు. మౌనంగా బాధపడుతున్న ఆయనను చూసి కుటుంబసభ్యులకు దిగులు పట్టుకుంది. అయన సమస్య ఎలా అధిగమిస్తాడోనని ఆందోళన మొదలైంది.
ఈస్థితిలో ఆపందితులవారి వద్ద శిశ్యైకం చేస్తున్న ఓ చురుకైన కుర్రవాడు ముందుకొచ్చాడు . గురువుగారూ మీతరపున నేను రాజుగారి ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి వెళతానని తనను పంపించమని కోరాడు.
వద్దునాయనా ! చూస్తూ చుస్తూ నిన్ను ప్రమాదంలోకి నెట్టలేను .అని నివారించబూనాడు .
కానీ అతని ఆత్మవిశ్వాసం చూసి మరియు ఇక ప్రత్యామ్నాయమేమీలేకపోవటం వలనను భగవంతునిపై భారం వేసి అంగీకరించాడు .

గడువు సమయం ముగిసేలోపల పండితులవారి శిష్యుడు ఆస్థానానికి వెళ్ళి తాను తన గురువుగారి తరపున సమాధానాలివ్వ్టటానికి సిధ్ధమని తెలియపరచాడు . ఈవిషయం తెలిసి సభకు జనం పెద్దఎత్తున తరలి వచ్చారు.
ఇక చర్చ మొదలైంది
రాజుగారడిగారు దేవుడు ఎక్కడ ఉంటాడు ?ఎటుచూస్తుంటాడు ? ఏమిచేస్తుంటాడు ?
శిష్యుడు అడిగాడు . మాహారాజా ! మీరడిగినవి చాలా లోతైన ప్రశ్నలు .సర్వ శాస్త్రాలసారమైన విషయం మీరడిగారంటే మీ మేధోశక్తి అనన్యసామాన్యం . మనమధ్య ఇంతగొప్పవిషయం చర్చ జరుగుతుంది కనుక మనం శాస్త్రీయమైన మర్యాదలు పాటించటం మమ్చిదికదా ! విజ్ఞులైన మీకు నేను చెప్పాల్సిన పనిలేదుకదా ! అనివినయంగా అడిగాడు.ఇప్పటికే శిష్యుడి పొగడ్తలకు పొంగివున్న రాజుగారు అంగీకరించాడు. ఏమిచేయాలో చెప్పమన్నాడు.
అడిగేవాడు చెప్పేవానికంటే తక్కువ . కాబట్టి అడుగుతున్న మీరు క్రింద చెప్పే నేను పైన కూర్చోవటం శాస్త్రసమ్మతం. కనుక మీరుకూర్చున్న సింహాసనం పై నేను నేను నిలుచున్న స్థితిలో ఈ కొద్దిసేపన్నా ఉండటం ధర్మం ఆపై తమరి చిత్తం.అన్నాడు.

రాజుగారు సరేనని శిష్యుణ్ణి సింహాసనం పై కూర్చోపెట్టి తాను నిలుచున్నాడు .

ఇప్పుడు చెబుతావినండి . దేవుడెక్కడున్నాడనికదా మీ ప్రశ్న . కొద్దిపాలు తెప్పించండి అని తెప్పించాడు . మహారాజా ! ఈపాలలో వెన్న ఉందా చెప్పండి అనడిగాడు . ఉంటుంది అన్నాడు మహారాజు . ఐతే చూపించండి అనడిగాడు శిష్యుడు. అదెలాకుదురుతుంది .వెన్నరావాలంటే కాచి తోడుపెట్టి పెరుగయ్యాక చిలికితేగాని రాదు అన్నాడు రాజుగారు.

అలానే సర్వత్రా వ్యాపించిఉంటాడు భగవంతుడు . అయితే ఆయన్ను చూడాలంటే మహాత్ములు చూపినబాటలో పాలలో వెన్నకోసం చేసిన ప్రయత్నం కంటే ఎక్కువప్రయత్నం చేస్తేగాని కనపడడు వివరించాడు శిష్యుడు.

రాజుగారు తల ఊపాడు.

ఇక మీ రెండవ ప్రశ్న .దేవుడు ఎటుచూస్తుంటాడు అనికదా . ఇదిగో చూడండి ఈవెలుగుతున్న జ్యోతి ఎటుచూస్తున్నది.ఎటని చెబుతాము ? అన్నివైపులా చూస్తున్నదికదా ?అలానే పరమాత్మ కూడా అంతే అన్నివైపులకూ చూడగలడు.
రాజుగారు తల ఊపక తప్పలేదు .

ఇక మీ మూడవ ప్రశ్న .ఆయన ఏమి చేస్తుంటాడు ? అప్పుడప్పుడూ ఇలాకూడా చేస్తుంటాడు .అన్నాడు శిష్యుడు.
ఇలా అంటే ? ప్రశ్నించాడు రాజు

అదేనండి అనామకుణ్ణైన నన్ను సింహాసనం మీద కూర్చో బెట్టాడు . మాహారాజులైన మిమ్మల్ని నాముందు నిలబెట్టాడు . అని చమత్కరించాడు . చప్పట్లతో దద్దరిల్లిపోయింది సభ.
రాజుకు కళ్ళు తిరిగి నేలకొచ్చాయి .

5 వ్యాఖ్యలు:

Unknown December 31, 2010 at 11:16 AM  

ఆప్తుల యోగక్షేమాలే ఆనందదాయకం ఆత్మీయులను తలచుకొనడం పండుగనాడు విధాయకం అందుకే ఈ పర్వదిన శుభ సమయంలో ఆయురారోగ్యభాగ్యాలు పెరగాలీ ఇతొధికం.
నూతన సంవత్సర శుభాకాంక్షలతొ ధరణీ రాయ్ చౌదరి

SRRao December 31, 2010 at 3:37 PM  

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

SRRao
శిరాకదంబం

చిలమకూరు విజయమోహన్ December 31, 2010 at 4:00 PM  

మాష్టారూ!నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

JP January 1, 2011 at 1:31 AM  

nice article andi.

Rajasekharuni Vijay Sharma January 1, 2011 at 5:50 AM  

చాలా బాగుంది కథ రామకృష్ణుల కథలాగా ఉంది. :)

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP