శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగానికి కార్యకర్తలుగా తరలిరండి...హనుమత్ పరివారమవుదాం మనం.

>> Thursday, December 29, 2011





జైశ్రీరాం

భగవద్బంధువులందరికీ హనుమత్స్మరణపూర్వక నమస్కారములు.

లోకశ్రేయస్సుకై శ్రీ వేంకటేశ్వర జగన్మాతపీఠం , నుండి గత మూడు సంవత్సరములు "హనుమత్ రక్షాయాగం"అను క్రతువును నిర్వహించుట జరిగినది . భక్తసులభుడైన హనుమంతుని అనుగ్రహంబడయుటకు అత్యంత సరళము అతిమహిమాన్వితమైన సాధనలను[మహాత్ములు మనకు ప్రసాదించిన మార్గములు] జతపరచి సాగించిన ఈయాగంలో పాల్గొన్న ఎంతో మందిభక్తులు స్వామి కరుణకు పాత్రులై వారి వారిసంకటములను తొలగించుకుని,శ్రేయస్సునుపొంది హనుమన్మహిమలకు ప్రత్యక్షసాక్షులైనిలచారు. ఎందరో ఉద్యోగ,విద్య,కుంటుంబసమస్యలు,అనారోగ్య, ఈతిబాధలను స్వయంగా చేసిన హనుమదుపాసనద్వారా శక్తివంతులై తొలగించుకోగలిగారు.
మహర్షులు మనకిచ్చిన సాధనామార్గాలను అనుసరించటం ద్వారా ప్రత్యక్షంగా ఫలితాలను చవిచూడవచ్చా లేదా అని ప్రయోగపూర్వకంగా సాధనామార్గంలో నడచి, నిలచి, గెలచి హనుమంతులవారి ఉపానసనకుండే శక్తి ఏమిటో అన్నింటినీ గీటురాయిమీద గీచి చూస్తే కానినమ్మలేని ఈ కలిమాయ మోహితకాలంలోనూ నిరూపించారు.వారికి వారి వెనుక ఉన్న స్వామివారికి కైమోడ్పులు.

ఇక ఈసంవత్సరం స్వామి ఆదేశంతోనేమో నాలుగవ ఆవృతిని "కోటిహనుమాన్ చాలీసా" పారాయణం జరిపి అష్టోత్తర శతకుండీయ[108] హనుమత్ రక్షాయాగంగా హనుమజ్జయంతి మరుసటిరోజు may 16 na జరపాలనే ప్రేరణగా ఆజ్ఞదయచేయబడింది . ఈమహత్తర కార్యక్రమం ఉడత వంటి ,నా చేత జరుగుతుందా ? ఎన్నడుకాదు. కనుకనే హనుమత్ పరివారం అంతా అండగా నిలబడుతుంది ....స్వామి భక్తులంతా తరలివచ్చి తలోవైపునా నిలుచుని మహావైభవంగా జరుపుతారనే సంకేతాలు అందుతున్నందున సాహసం చేసి మన అందరి తరపున ఈకార్యక్రమానికి సిద్దమవుతున్నాము.
ఇప్పుడు భూమిపై జరగనున్న ప్రమాదాలనుండి భక్తులు రక్షింపబడుటకై స్వామి అనుగ్రహం వేడుతూ కొనసాగే ఈ యాగానికి మీరందరూ పెద్దలే . ప్రతి ఒక్కరూ [ప్రతికుటుంబం]నుండి వెయ్యిన్నెనిమిది చాలీసాపారాయణములకు తగ్గకూండా చేసి అంత సంఖ్యలో రామనామం లిఖించి అందచేయటమేకాక మరో పదిమంది భక్తులచే పారాయణం చేపించి కార్యకర్తలుగా కూడా సాధనచేయవలసినదిగా మనవి. పూర్వం ఇంట్లో కొబ్బరికాయ దేవునికి నివేదన చేసుకుని తాము ప్రసాదంగా తీసుకొనుటయేగాక దానిని వీధిలోకొచ్చి పదిమందికీ పంచే వారు పెద్దలు . ఇదే నీతినీ మన సాధనారీతిగా మలచుకుంటూ ఈ కార్యక్రమం సాగిద్దాం . . సాధనలోపాల్గొనే భక్తులకు వలసిన లిఖిత,పారాయణ ప్రతులను అందజేయుటకు ఇంకా ఇంటర్ నెట్ లోంఛి డౌన్ లోడ్ చేసుకొనుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. వివిధ భక్తసమాజములు, సత్సంగములు,పాఠశాలలు,కళాశాలలో విద్యార్థులను కూడా ఈకార్యక్రమంలో సాధకులుగా మేళవిమ్చుకొను మార్గములు రూపకల్పనజరుగుతున్నవి.
ఇందులో పాల్గొను ప్రతి భక్తుని పేరునా అర్చన,హోమములో ఆహుతులివ్వబడి యాగానంతరం అత్యంతశక్తిపూరి తములైన "హనుమద్రక్షలు " యాగంలో పాల్గొన్న భక్తులు ఎక్కడ ఉన్నా వారికందజేయు కార్యక్రమం రూపొందించబడుతున్నది .

ఇక స్వామి పరివారంగా మారి మీరు ఈయాగానికి కార్యకర్తలై ముందుకుసాగాలి . ఇందుకోసం మీరున్న ప్రాంతాన్నే కార్యక్షేత్రంగా ఎన్నుకుని స్వామికార్యాన్ని సాధించాలి. అనుమానంలేదు హనుమ అనుగ్రహం మనపై పరిపూర్ణంగా వర్షించనుంది .తరలిరండి మెయిల్ ,లేదా ఫోన్ ద్వారా మీ సంసిధ్ధతను తెలియపరచండి.
జైశ్రీరాం .

down load

https://docs.google.com/viewer?pid=explorer&srcid=1z1hXva7Yaa9GnsmLnn8C5kPSFmLn82bNAgrjFxsGir2tMHwnzA9CMZRkhcv3&chrome=true&docid=22fd6191444f71fb14485a5df85bee27%7C061c96bdd24cf7ddf4244b285a84a6fa&a=bi&pagenumber=1&w=800



https://docs.google.com/viewer?pid=explorer&srcid=1z1hXva7Yaa9GnsmLnn8C5kPSFmLn82bNAgrjFxsGir2tMHwnzA9CMZRkhcv3&chrome=true&docid=22fd6191444f71fb14485a5df85bee27%7C061c96bdd24cf7ddf4244b285a84a6fa&a=bi&pagenumber=2&w=800





మంగళాశాసనములు


శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య భారతీతీర్థ మాహాస్వాములవారు శృంగేరీ పీఠం

శ్రీశ్రీశ్రీ మాతా అంజనీదేవి వారు [రాధామహాలక్ష్మీ ఆశ్రమం . బృందావనం ,యు,పి]
శ్రీశ్రీ కాలజ్ఞాన ప్రదాత వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ..పీఠాధిపతులవారు ... కందిమల్లయపల్లె
శ్రీశ్రీ మాతా ఈశ్వరాంబ పీఠాధిపతులు ..శివకుమారస్వామివారు కందిమల్లయపల్లె
బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ప్రముఖ హనుమదుపాసకులు [చీరాల]
శ్రీశ్రీ శివస్వామి వారు శైవక్షేత్రం .తాళ్లాయపాలెం .



మంత్రాంగం మరియుమంత్రభాగం

----------

శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు[హైదరాబాద్]
శ్రీచల్లాజయదేవ్ గారు[చెన్నై]
శ్రీ సత్యన్నారాయణ శర్మ గారు [గుంటూరు]
శ్రీ గోపాలకృష్ణమూర్తి భట్టు గారు[చేజర్ల]
శ్రీనాగేంద్ర కుమార్ అయ్యంగారి గారు [హైదరాబాద్]
శ్రీ రాజశేఖరుని విజయశర్మగారు[హైదరాబాద్]
దుర్గేశ్వర [శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం]


క్షేత్ర సాధన
శ్రీ రమణాచార్యులు గారు [శ్రీవేంకటేశ్వస్వామి దేవస్థానం గోరంట్ల ,గుంటూరు]
శ్రీ రామాచార్యులుగారు [విజయవాడ]
శ్రీ గోపిశర్మసిద్దాంతి గారు [పెద్దాపురం ]
శ్రీ ముక్కామల వెంకట్రామయ్యగారు [తణుకు]
శ్రీ పేరిశాస్త్రి గారు [ గాయత్రీ పరివార్] కామేపల్లి
శ్రీ మహమ్మద్ ఖాన్ [శ్రీరాం] గారు [గాయత్రీ పరివార్] తెనాలి
శ్రీ సుదర్శనాచార్యులు గారు [గమిడి ఆంజనేయస్వామి దేవళం ]వినుకొండ
శ్రీ రాఘవాచార్యులు గారు [మదమంచిపాడు వీరాంజనేయస్వామి దేవస్థానం]
చిక్కాల రామారావుగారు [దత్తపీఠం ...ముక్కెళ్ళపాడు]


సమన్వయవిభాగం
------------------

చెనికల మనోహర్ [బెంగళూర్]
చింతలపాటి శ్రీకృష్ణ [ముంబాయి]
సునీల్ వైద్యభూషణ్ [చెన్నై]
మోహన్ కిశోర్ [గుర్గావ్]
రామరాజుభాస్కర్ గారు [అమెరికా]

అంతర్జాల & పౌరసంబంధాల విభాగం
--------------
మేడం రామిరెడ్డి గారు [అమెరికా]
వేలంకిని భరద్వాజ గారు[అమెరికా]
బి, శ్రీనివాసరావు గారు [నెల్లూరు]
dr,కౌటిల్య [గుంటూరు]
సూరె కృష్ణారావు గారు [గిద్దలూరు]


పారాయణ పర్యవేక్షణా విభాగం
-------------------

నాగప్రసాద్ [ఇడుపులపాయ]
జనార్ధన శర్మ గారు [హైదరాబాద్]
చిలమకూరు విజయమోహన్ గారు [తాడిపత్రి]
శరత్ పండా [విశాఖపట్టణం ] ఒరియా విభాగం
ఎల్. అంజిరెడ్డి గారు[ రవ్వవరం]
కోటేశ్వరరావు గారు [దరిశి]
సత్యన్నారాయణరెడ్డిగారు [నరసరావుపేట]
కె.శ్రీనివాసరావుగారు [కురిచేడు]

శాంతమ్మ గారు [వినుకొండ]
సురేష్ గారు [కదిరి]
సుంకర శ్రీనివాసరావుగారు [ ఒంగోలు]
గోరంట్లయ్య గారు [గిద్దలూరు]
జొన్నాభట్ల ఉగ్రకుమార్ గారు [నూజండ్ల]
శ్రీ త్రినాథశర్మగారు తణుకు
యనమదల చిరంజీవి [ముప్పాళ్ల]
అంజయ్య నాయక్ [రా.పా. తండా]
షేక్ హుస్సేన్ [రవ్వవరం]
బి. మాలకొండా రెడ్డి [విజయవాడ]
శ్రీమతి రత్నజ్యోతి [పూనే]
శ్రీమతి శశిరేఖ గారు [చెన్నై]
రమణారెడ్డి [ కొత్తపాలెం]
ఏసురాజు గారు [మాష్టిన్ కాలనీ]వినుకొండ



సాంకేతిక విభాగం
----------------
శ్రీమతి జ్యోతి గారు [హైదరాబాద్]
నాగమురారి గారు [హైదరాబాద్]
వేణుగోపాలరెడ్డి గారు[దాచేపల్లి]
శ్రీధర్ నల్లమోతు [కంప్యూటర్ ఎరా]
g ఏడుకొండలు


పత్రికా సంబంధాల విభాగం
---------------


మందపాటి ఆచారి [సాక్షి]
శ్రీరామనేని హనుమంతరావు[ఈనాడు]
నమశ్శివాయ [ఆంధ్రభూమి]
వెంకటరెడ్డి [ ఆంధ్రజ్యోతి]
న్యూ ఆవకాయ.కామ్
ఐ,వెంకటేశ్వర్లు గారు webdunia.com


సేవాకైంకర్య విభాగం

-----------

దుర్గేశ్వర ..........శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం
బి ,కృష్ణ


బి,యశోరామ
బి.పవనకుమార



ఆర్ధికనిర్వహణావిభాగం
-------------------
నారాయణ స్వామి గారు[ అమెరికా]
జి.శ్రీనివాసరెడ్డి గారు [ఒంగోలు]
అన్నా సుందరరావు గారు [ముక్కెళ్లపాడు]
తాతా గోపాలకృష్ణమూర్తిగారు వినుకొండ

ప్రదాసాల పంపిణీ విభాగం
బి. ప్రభాకర్ రెడ్డి పోస్ట్ మాస్టర్ [లక్ష్మీపురం]
సూరి [స్వాతి డ్రెసెస్ ] వినుకొండ
సేవాదళం
-------------
యరబోతు శ్రీకృష్ణదేవరాయలు [సత్యసాయి సమాజం ] [అమరావతి]
అన్నా సుబ్బారావు [ముక్కెళ్లపాడు]
ప్రభాకర రెడ్డి గారు [గణపతి సచ్చిదానంద జ్ఞానబోధసభ]
తిరుపతిరావు [ముతరాసువారి పాలెం]
సింగంశెట్టి ఆదిశేషయ్య [ముక్కెళ్లపాడు]
హిందూ పబ్లిక్ స్కూల్ పూర్వవిద్యార్ధులు



contact

durgeswara@gmail.com

9948235641

Read more...

ఏమిటమ్మా నీలీల ! ఏసీ కార్లెక్కిస్తావు, అంతలోనే కసువులూడ్చిఎత్తేపని చేపిస్తావు ?? !

>> Wednesday, December 28, 2011


నినునమ్మినవారికెన్నడు నాశములేదుకదమ్మ ఈశ్వరీ ! అని జగన్మాత దయను వర్ణించాడు భక్తకవి పోతనామాత్యుడు . అమ్మ అనుగ్రహం అలా మనపై స్థిరమవ్వాలంటే అమ్మ అనుగ్రహానికి పాత్రమయ్యేలా మన నడవడిక ఉండాలేమో ! లేకుంటే అలా ఉండేలా శిక్షణనుకూడా ఇస్తుందేమో ఆతల్లి. నాకెందుకో అమ్మ శిక్షణ ఒక్కోసారి మింగుడుపడదు.కానీ గత్యంతరం కూడాలేదుకదా !

మొన్న తిరుమల యాత్రకు వెళ్ళివస్తుండగా ఓ మితృడు స్వామీ ! అహోబిలం వెళ్ళటానికి బయలుదేరుతున్నాము వస్తారా ? అనడిగాడు . అందులోనూ ప్రయాణానికి ఇబ్బందిలేకుండా ఏసీ కారు . బాగుంది ...బాగుందని బయలుదేరాను ప్రయాణబడలికకూడా మరచి. ఆతరువాత దారిలో మరిద్దరు మితృలు కలవటం .చాలాసంతోషంగా ప్రయాణం . ఉండదుమరి ? ఎంతగౌరవం ? ఎంతగౌరవమని ....!! ఇకసాయంత్రానికి వాళ్లు మహానందివైపు వెళుతూ నేను ఇంటికి వెళ్లాలనగా దారిలో దింపి సెలవు తీసుకున్నారు . ఇక మరోగంటలో నేను కిటకిటలాడుతున్న రైలు పెట్టెలో కూర్చోటానికి జాగాలేక నిలబడే జోగుతున్నాను . నాస్థితికి నాకే నవ్వొచ్చింది . ఇందాకేమో కార్లో కూర్చోపెట్టి తిప్పావా ? ఇంతలోనే నీది "ఏ "క్లాసుకాదురా" సీ " క్లాసే గుర్తుంచుకో! అంటూ ఇలా నిలబెట్టావా తల్లీ ! అని మనసులో అమ్మను తలచుకున్నాను .
ఇప్పుడేనా ? !!! ఇంకా చూడు ..అన్నట్లనిపించింది
ఇక వినుకొండలో ట్రైన్ దిగి రాత్రి ఒంటిగంటకు గజగజ లాడే చలిలో బైక్ మీదప్రయాణం చేసి ఇంటికి చేరాను. ఇక పొద్దున్నే పూర్తిగా నిదురకూడా పోకుండానే లేచి చీపురు పట్టుకున్నాను . తప్పదు మరి ? పీఠంలో సేవాబాధ్యతలప్పించివెళ్లానుకదా మా తమ్మునికి ,వానికి కూడా జ్వరం .దాంతో వాడొక్కడే చేయలేడుకదా తప్పదు.
మామేనత్త [దేవీభక్తురాలు ] వచ్చి ఉన్నది ఇంటివద్ద నేను తిరుపతి వెళితే తోడు ఉండటానికి. సాయంత్రం వేళ పీఠం లో గోడలకు ఉన్న బూజు దులుపుతూ,కసువులూడ్చుకుంటూ ఉంటే నవ్వుతూ ఏరా ! అబ్బాయ్ గురువుగారు కసుఊడవటం బాలేదే ? అన్నది మామేనత్త నవ్వుతూ ఎగతాళిగా .
నిజమేనత్తా ! ఏంటో గురువుగారూ అని పిలిపిస్తుంది ...గడ్డిపోచకింద తీసేస్తుంది . ఏమిటో ? అమ్మలీల . అన్నాను నేనూ నవ్వుతూ .

అలా ఊడుస్తూ .పూజా సామాగ్రి శుభ్రపరచుకుంటూ నాలోనేనే ప్రశ్నించుకుంటూన్నానుఅమ్మనుద్దేశించి . అమ్మా ఇప్పుడు చూడాలి గురువుగారి వైభోగం ...అయినా ఏమిటమ్మా ! సి క్లాసు గాడ్ని సి క్లాసులో ఉంచక ఏ క్లాసు లో కూర్చోబెట్టడమెందుకు ? మరలా నీది సీ క్లాసే నని ఎగతాళి చేయడమెందుకు ?
ఏ క్లాసైనా అది నాప్రసాదమేనని గుర్తుంచుకునేందుకు . నీస్తాయేమిటో నువ్వెప్పుడన్నా మరచిపోయి నా అనుగ్రహానికి దూరంకాకుండా ఉండేందు ..... అని అమ్మ అంటూన్నట్లుగా మనసులో ఓసమాధానం మెరుపులా మెరిసింది.
నాకేక్లాసూ వద్దమ్మా ! నీ కాళ్లదగ్గర పడిఉండే భాగ్యం దూరంకాకుంటేచాలు అని నమస్కరించుకున్నాను .

మరునాడోక ఫోన్ . స్వామీ ! నేను ఓకొత్త వ్యాపారం ప్రారంభించుకోబోతున్నాను .దానిని ప్రారంభం మరో ఇద్దరితోపాటు మీతోకలిపి. ఆహ్వాన పత్రికలలో మీపేరు వేసుకుంటున్నాను అని .


వద్దులే ?

మీరు కాదనవద్దు

వద్దులేస్వామి !

కాదనకండి స్వామి ! బ్రతిమిలాడారాయన

సరే ! పిలచేది నన్నా ? అమ్మనా ?

ఆ......!!!!! అమ్మనే


కదా ? అప్పుడు అమ్మపీఠానికి ఆహ్వాన పత్రిక పంపు . అందులో అమ్మపీఠంలో సేవచేసే ప్రధానసేవకుడని వ్రాసుకో చాలు .అదే మనస్థితి . అని అసలు విషయం చెప్పానాయనకు అసలు నిజం.

Read more...

నమో నారశింహా ! నమొ నమో భక్తపాలా !

>> Sunday, December 25, 2011






గోవిందమాలధరించి స్వామిని సేవించాలని ఎంతోకాలంగా ఉన్నకోరికను స్వామి అనుగ్రహించి తీర్చారు. మాలవిరమణకు గురువారం మార్గశిర లక్ష్మీవారపూజలు ముగించుకుని నేరుగా తిరుపతి వెళ్లాను. శుక్రవారం తెల్లవారకముందే తిరుచానూరు లో వున్న మన అమ్మ అలవేలుమంగమ్మసన్నిధికిచేరాను . అయితే అక్కడ శుక్రవారాభిషేకాలు జరుగుతున్నందున ఎవరినీ కనీసం ఆలయ ఆవరణలోకికూడా రానివ్వటంలేదు . లోపల విఐపీలు వున్నారు మరి !
ఆ టికెట్ తీసుకుందామంటే లేదంటున్నారు . బ్రతిమిలాడగా బ్రతిమిలాడగా కనికరించిన కానిస్టేబుల్ బాబులు లోపలకెళ్ళి ఆవరణలో కూర్చోటానికి అనుమతిచ్చారు. ఆవరణ లో కూర్చుని అమ్మను స్థుతిస్తూ కూర్చున్నాను . వీడి ఏడుపు చూడలేననుకుందో ఏమోగాని అమ్మ కరుణాంతరంగ కదా ! లోపల అభిషేకాలు ముగిశాక ఆసేవచేపించినభక్తులకు ప్రసాదంగా అమ్మకు అభిషేకంలో అలమిన పసుపు గంధం ప్రసాదం ఇస్తారు] ఆప్రసాదం లభించిన కరుణామయుడగు ఒక భక్తుడు వచ్చి నాచేతిలో కొద్దిగా అమ్మ ప్రసాదంగా పసుపు ఇచ్చాడు. ఆ తరువాత అమ్మకు పసుపుకుంకుమలు సమర్పించి తిరుమల వెళ్లాను .చక్కగా స్వామి వారు చిరునవ్వులతో దర్శనమిచ్చారు . ఈనవ్వుచాలుస్వామీ ! కోటిజన్మలైనా ఎదురుచూడటానికి అని నమస్కరించుకుని అలా ప్రదక్షిణమార్గంలో నడుస్తూ యోగనారసింహుని వద్దకు చేరాను అక్కడ ఒక ఎలుక స్వామివారికి అలంకరిమ్చిన పూలమాలను కొరుకుతూ ఉంది. బయటనుంచి ఇష్షు ఉష్షూ ...అన్నాకూడా ఏమాత్రం లెక్కచేయలేదు . ఏందుకో అప్పుడు మనసులో అనిపించింది. ఈర్ష్యాద్వేషాలనే ఎలుకలు నీభౌతికావరణాన్ని ఎంతగా కొరుకుతూ కలవరపరుస్తున్నా చలించకుండా ఉండగలగటమే యోగం.అదే నారసింహ యోగమని అదే స్వామి బోధ అనిపించింది. బయటకు రాగానే మాతమ్ముడు ఫోన్ చేశాడు.అన్నా ! నువ్వు బయలుదేరి ఉదయానికి పెంచలకోన వెళతావా ? నారసింహస్వామి దర్శనంతోపాటు అక్కడ యోగినీమాత విజయేశ్వరీ దేవి ప్రస్తుతం వచ్చి ఉన్నారు వారితో నీవుమాట్ళాడె ఏర్పాటు చేస్తాను అనడిగాడు. పీఠం లో పూజకు ఇబ్బందిగా ఉంటూంది ఇప్పుడు ఇంటికెళతాలే మరోసారి చూద్దామని చెప్పివదిలేశాను. ఒంగోలులో ఉన్న శ్రీనివాసరెడ్డికి కి ఫోన్ చేశాను నువ్వేమన్నా దరిశి వెళుతున్నావా నేను తెల్లవారేసరికి ఒంగోలులో ఉంటాను నేను నీతోపాటుబండిలో వస్తాను అనడిగాను.
స్వామీ ! నేను అహోబిళం వెళ్లాలని బయలుదేరుతున్నాను ,మీరొస్తారా ? అనడిగాడు. ఒక్కక్షణం అర్ధంకాలేదు. ఏమిటీ ఇదేదో స్వామి పిలుపులా ఉందే అనిపించింది . మొన్న కురిచేడులో హనుమదభిషేకాలుచేస్తున్నప్పుడు పైననే ఉన్న నరసింహుని దర్శిమ్చుకోవటానికి వెళ్లలేకపోయాను. మొన్న పెద్దవరం లో హనుమత్ పూజనాడుకూడా పక్కనే ఉన్న దేకనకొండ నరసింహునికొండ నుదర్శిద్దామనుకున్నా కుదరలేదు.వారంక్రితం మంగళగిరి నుండి స్వామివారు మిగిలిన పానకం భక్తులు తెచ్చి ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి విజయవాడ వెళ్ళివస్తూ కూడా చూడలేకపోయాను .
ఇప్పుడేమో రమ్మని పిలుపు ఓహో ! స్వామి కరుణ ఎంతటిదోకదా ! వేడినవారికి దర్శనమీయవు,వలదనని నిన్ను వారించు వారిని వదలక వెంటా తిరిగెదవయ్యా ! అనే పాట గుర్తుకొచ్చింది.
సరే ! నాలుగింటికే ఒంగోలు చేరాను అక్కడనుండి శ్రీనివాసరెడ్డి ఆయన మితృడు శ్రీనివాసరావుగారు వచ్చి నన్ను కారెక్కించుకున్నారు . వెళుతూ గిద్దలూరులో ఉన్న మితృలకు సమాచారమిచ్చాను నేనుఅటువైపు వస్తున్నానని .
వార్త రిపోర్టర్ కృష్ణారావు గారు నేనూ వస్తాస్వామీ అన్నారు. అక్కడకెళ్లాక శ్రీనివాసరావు గారి మితృడు గోరంట్లయ్యగారు కూడా వస్తానని బయలుదేరారు. యాదృచ్చికంగా ఆయన కృష్ణారావు గారికి మితృడట ఆయన కూడా రవ్వవరం పీఠానికి రావాలనుకుంటూన్నామని చెప్పారు .ముందుగా నలమల కొండలలో ఎదురైన నారసింహక్షేత్రాన్ని దర్శించాము .ఆతరువాత కాశినాయన ఆశ్రమం లో భోజనంచేసి అక్కడవున్న యోగనరశింహుని ఆతరువాత ఎగువ అహోబిళంలో స్వామిని దర్శించాము. అకాశాన్నంటుతున్నట్లున్న ఆగిరిశిఖరాల మధ్య స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతం నాకు. ఎక్కడ కెళ్ళినా అమ్మ లక్ష్మీదేవి ఎంత దివ్యతేజస్సులువెదజల్లుతూ వున్నదో చెప్పలేను. అమ్మ ముందుకూర్చుని విష్ణుసహస్రనామ పారాయణం చేసుకుని ప్రసాదం కోసం నిలబడగా హఠాత్తుగా అర్చకస్వామి అమ్మ మెడలో చిన్నపూలమాల తెచ్చి నామెడలో వేశారు. అమ్మ అనుగ్రహానికి కళ్లవెంట నీళ్ళుతిరిగాయి . బిడ్డపట్ల అమ్మకుండే ప్రేమ ఇంకెవరికుంటుంది ? అమ్మ ప్రేమ అలాకురిపించింది ఈ దీనునిపై.
అక్కడే మాలావిరమణ చేసి అటునుండి దిగువ అహోబిళంలో లక్ష్మీనరసింహుని దర్శించుకున్నాము .అక్కడ చాలా గొప్పగా జరుగుతున్న విష్ణుయాగస్థలికి వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తూ ఆ నల్లమల కొండల నారసింహక్షేత్రంలో హనుమత్ రక్షాయాగం [నాలుగవ ఆవృత్తికి సంకల్పం చేసుకున్నాము] .నవనారసింహ క్షేత్రాలన్నీ దర్శించే కార్యక్రమాన్ని రూపొందించమని మితృలందరూ కోరగా అలావెళ్లాలని నిర్ణయం జరిగింది. అప్పుడు వీలైనవారు వస్తే తీసుకెలతాము. !

Read more...

క్షీరాబ్ధికన్యకకు శ్రీమహాలక్ష్మికీ ........,నీరజాలయకునూ నీరాజనం

>> Thursday, December 22, 2011

అమ్మ సంకల్పం కలిగిమ్చి మరీ చేపించుకున్న సేవ మార్గశిర లక్ష్మీవారపూజలు . ఈపూజలను మార్గశిరం నాలుగు గురువారాలు పుష్యం లో ఒక గురువారం మొత్తం ఐదువారాలుగా చెస్తారు. అయితే కారణాంతరాలవలన మొదటి గురువారం చేయలేకపోయినా రెండవ గురువారం నుండి చక్కగా మూడుగురువారాలు సాగించి అమ్మను సేవించుకోవటం జరిగింది . ఈపూజలకు గోత్రనామాలు పంపిన భక్తులు,స్వయంగా పాల్గొన్న భగవత్ సేవకుల భక్తిశక్తి ఏమోగాని వారానికొకతీరుగా అత్యంతమనోహరంగా పూజలతో అలంకారాలతో అమ్మ మురిసిపోయింది. మనమనసులను ఆనందడోలికల్లో తేలియాడిస్తూ ఈసేవను మనచే జరిపించినది. అమ్మకు కావల్సినదేమున్నది తన బిడ్డలక్షేమం తప్ప .అందుకే మనకొరకు మనమేలు కొరకు మనం మేలుపొందాలనే ప్రేమతో ఇలా మనకీఅవకాశం కల్పించినది .ఎంతైనా పాలకడలి లో పుట్టినతల్లికదా ! అలా పాలించటం అమ్మకేళీవిలాసం.
జగన్మాత్రే నమోనమః
అందుకే పలుకుదాం ....క్షీరాబ్ధికన్యకకు శ్రీమహాలక్ష్మికీ ,,,నీరజాలయకునూ నీరాజనం ......















Read more...

గల్ఫ్ లేఖ .. మతాంతరీకరణలు - మొహమ్మద్ ఇర్ఫాన్

>> Sunday, December 18, 2011

గల్ఫ్ లేఖ

మతాంతరీకరణలు
- మొహమ్మద్ ఇర్ఫాన్

విశ్వంలోని పురాతన నాగరికతలలో హైందవ నాగరికత ఒకటి. హైందవ సమాజం కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ప్రపంచంలోని అనేక ఇతర మతస్థులకు ఆశ్రయం కల్పించింది. ఇరుగు పొరుగు రాజ్యాలు, దూరదేశాల నుంచి వచ్చిన ముస్లింలు, జొరాస్ట్రియన్లు, యూదులు, క్రైస్తవులు అందరికీ ఆశ్రయం ఇచ్చి ఆయా మతాలు భారత ఉపఖండంలో వర్ధిల్లడానికి హిందూ ఉదారత దోహదపడింది. హిందూ మతానికి ఉన్న ఓర్పు, సహనం ఇతర మతాలకు లేవని చెప్పవచ్చు.

అయితే గల్ఫ్ దేశాలలో హిందూ మతాన్ని పూర్తిగా అణగదొక్కుతున్నారు. తమ ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరచుకోవడానికై అప్పులు సప్పులు చేసి గల్ఫ్ దేశాలకు ఆంధ్రులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ వారిలో అనేక మంది మోసపోతున్నారు. కఠోరమైన పనులు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరికొందరు మెరుగైన బ్రతుకుదెరువు కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో మతమార్పిడి చేసుకొంటున్నారు. గల్ఫ్ దేశాలలోని జైళ్ళలో, ఆసుపత్రులలో సంవత్సరాల తరబడి పడిఉంటున్న భారతీయులలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. వారిని చేరదీసి ఉపకారం చేసి గత్యంతరం లేని పరిస్థితులలో మతం మారేట్లు చేస్తున్నారు.

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న విదేశీయులలో ఫిలిప్పీన్స్ క్రైస్తవులు, భారతీయ హిందువులు మతమార్పిడికి లక్ష్యంగా ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గల్ఫ్ దేశాలలోని భారతీయ ఎంబసీలలో పేర్లు, మతం మార్పిడికి సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అత్యధికులు పేర్ల మార్పిడి చేసుకోకుండానే నూతన మతాన్ని స్వీకరిస్తున్నారు. సౌదీ ఆరేబియాలో హిందువుల అంతిమ క్రియలు నిషేధం. కనీసం హిందూ దేవతల ఫోటోలను కూడా ఆ దేశంలో అనుమతించరు.

ఇతర మతాల కంటే ఒక్క హిందువుకు మాత్రమే ప్రాణ నష్టం కేసులలో నష్టపరిహారం అతి తక్కువగా చెల్లించే విధంగా సౌదీ అరేబియా చట్టాలున్నాయి. దీనికి తగినట్లుగా లౌకిక భారతదేశంలో బిజెపితో సహా అన్ని ప్రభుత్వాలు ఇప్పటి వరకూ సౌదీలో కేవలం ముస్లింలనే భారతీయ రాయబారిగా నియమిస్తున్నాయి. భారతదేశానికి సన్నిహిత దేశమైన యు.ఏ.ఇలో మిగిలిన అరబ్ దేశాల కంటే హిందువులు ఎక్కువ ఉన్నారు. యు.ఏ.ఇ స్థానిక జనాభాలో 17 శాతం హిందువులున్నారు. యు.ఏ.ఇ ఆర్ధికాభివృద్ధిలో వీరిపాత్ర గణనీయంగా ఉంది.

అయినా దుబాయిలో ఉన్న ఏకైక హిందూ దేవాలయం విస్తరణకు నోచుకోలేదు. ఈ దేవాలయాన్ని బ్రిటీష్ హయాంలో గుజరాతీ సింధూ అయిన షరాఫ్ బాయి ఒక చిన్న గదిలో నిర్మించారు. రంజాన్ మాసంలో ఉపవాసం వేళలలో హిందూ భక్తులకు ప్రసాదం కూడా ఇవ్వరు. కృష్ణ మందిర్‌గా ప్రాచుర్యం పొందిన ఈ దేవాలయంలోనే గురుద్వారా కూడా ఉంది.

హిందువుల దహన సంస్కారాలకు దుబాయి, ఆబుదాబి మున్సిపాలిటీలకు పర్యావరణ కాలుష్య పన్ను చెల్లించడం అనేది మరో నగ్న సత్యం. గుజరాతీ సంతతికి చెందిన హిందువులు పౌరసత్వం కలిగిన ఒమాన్ గల్ఫ్‌లోని మిగతా వాటి కంటే అత్యంత ఉదార దేశం. కానీ ఒమాన్‌లోని సలాల వద్ద కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కార్మికులు 14 మంది (అందరూ హిందూ మతస్తులే) మరణిస్తే కనీసం పట్టించుకొనే వారు ఎవరూ లేకపోయారు. గల్ఫ్‌లో హిందువుల దుర్భర ధార్మిక జీవితానికి ఈ కొన్ని ఉదాహరణలు చాలు.

గల్ఫ్‌లో ఇస్లాం అధికారిక మతం కావడంతో సంఘ్‌పరివార్ కార్యకలాపాలు కేవలం ఉన్నత ఉద్యోగాలు చేసే కొందరిలో భజనలు వరకు మాత్రమే పరిమితమయ్యాయి. క్రింది స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కార్మికులకు దీనితో సంబంధం లేదు. విశ్వహిందూ పరిషత్ వారికి ఈ విషయం తెలిసినా ఆ సంస్థ వారు ఇక్కడి సామాజిక పరిస్థితుల వల్ల దీన్ని అడ్డుకోలేక మౌనంగా మిన్నకుండిపోతున్నారు. సహచర తెలుగు వ్యక్తి విలవిలలాడితే ఏ తెలుగువాడు పట్టించుకోడు. అదే ఎక్కడో ఇథియోపియా, బ్రిటన్ లేదా మన దేశంలోని గోవా లేదా కేరళ క్రైస్తవులు మాత్రం వీరిని పట్టించుకొంటారు, ఆదరిస్తారు. వారి సమస్య పరిష్కారానికి కృషిచేస్తారు.

సౌదీ ఆరేబియాలో మతం మార్పిడి చేసుకొన్న వారికి పోలీసులు ప్రత్యేకమైన సర్టిఫికెట్ ఇస్తూ రెసిడెన్సీ వీసాలో కూడా దీన్ని ఎండార్స్ చేస్తారు. వ్యభిచారం, జూదం, మానవ హక్కుల ఉల్లంఘన అన్నింటికి కేంద్రంగా ఉన్న దుబాయి సమాజ ఉదారవాదం, హిందువు అనే విషయానికి వచ్చేసరికి మారిపోతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో రాస్ అల్ ఖైమా, అబుదాబి, షార్జా, దుబాయి ఎమిరేట్లలో దీని కార్యకలాపాలు అధికంగా ఉంటాయి.

దుబాయి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఇస్లాం పుచ్చుకొని ఖురాన్ కంఠస్ధం చేస్తే శిక్షా కాలాన్ని తగ్గించేందుకు దుబాయి రాజు షేఖ్ మొహ్మద్ మఖ్తూం హుకుం జారీ చేశారు. దుబాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇస్లాహీ సెంటర్ మతమార్పిడి చేస్తుంది. దివంగత అబుదాబి రాజు షేఖ్ జాయాద్ అల్‌నహ్యాన్ తన పేరిట అల్ అయిన్‌లో మతమార్పిడి కేంద్రాన్ని స్థాపించారు. కువైట్‌లో 28 సంవత్సరాలుగా ఐపిసి అనే సంస్ధ అన్యమతస్థులను ఇస్లాంలో చేర్చడానికి కృషి చేస్తోంది. ఖతర్‌లోని ఇస్లామిక్ సంస్ధ ఫనార్ ప్రతి సంవత్సరం వేయి మందికి పైగా ఇతర మతస్తులను ఇస్లాంలో చేర్పిస్తుంది.

గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న ఆంధ్రుల సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే విద్యాధికులైన ఉన్నత ఉద్యోగులలో, ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన చెందిన హిందూ, ముస్లిం ఇతర మతాలకు చెందిన వారిలో మతమౌఢ్యం బాగా ఉంది. అదే గ్రామీణ ప్రాంతాలకు చెందిన హిందు, ముస్లిం కార్మికులలో మాత్రం సంతృప్తికరమైన సాన్నిహిత్యం, సద్భావన ఉంది.
మహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)


Read more...

ఆలయాలను ఈరకంగాఅభివృధ్దిపరచటం అవసరమా ?

>> Saturday, December 17, 2011

మనం ఇప్పుడు చాలాసార్లు వింటుంటాం .ఆలయాలను అభివృద్ధి పరుస్తున్నాం అనేమాటలు . దురదృష్టవశాత్తూమన ధార్మికక్షేత్రాలన్నీ \ ఎండోమెంట్ బకాసురుని చేతులలో చిక్కుకుని ఉన్నాయి . వీళ్లదృష్టిలో అభివృధ్ధి అంటే హుండి ఆదాయం పెరగటం . రకరకాలపూజల టిక్కెట్లు అమ్ముడుపోవటం . ఆథ్యాత్మికచింతనకన్నా ఆదాయవనరులను పెంచుకోవటమే వీళ్ల భావనలోఅభివృద్ధి . ఇక ఈరకం అభివృధ్ధి జరగటం మొదలవ్వగానే రాక్ష[జ]కీయులు ఆ భివృద్ధి లో పాలు "పంచుకోవాలని" ఎగబడతారు . అటుఆదాయం ఇటు అధికారం రెండూ ఉంటాయికనుక తమను ఫలానా ఆలయానికి ధర్మకర్తగా నియమించాలనే డిమాండ్లు పైరవీలు సాగిస్తుంటారు. మనదౌర్భాగ్యం కొద్దీ మన ఆలయాలకు ఎవరుధర్మకర్తగాఉండాలో నిర్ణయించే అధికారం కూడా విదేశీయులు విధర్మీయులచేతిలో ఉందిప్పుడు . కావాలంటే పరిశీలించండి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గిరీ కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లుకొట్టే మన నేతలరీతులు.
మనకేమో ఎప్పుడు హడావుడిగా వెళ్ళి మొక్కులుతీర్చుకొనివచ్చేసరికే సరిపోతుంది గాని ఆక్షేత్రాలుమనవనిగాని అక్కడ జరిగే అనాచారాలు అపచారాలనుఅడ్డుకోవటం కూడా మనబాధ్యతనే విషయంగాని గుర్తురాదు.అసలు వాటి గూర్చి పట్టించుకునే సమయంగానీ ఆలోచించాల్సిన అవసరంగాని లేవుగనుక మనం నోరెత్తం. ఇక వీళ్ల ఆగడాలకు అడ్డేముంది ? అందుకే నాకైతే ఈపుణ్యక్షేత్రాల అభివృధ్ధి అవసరంలేదేమోననిపిస్తుంది.
సరే ! ఈబాధంతా ఏమిటని మీరు విసుక్కుంటున్నారా ! విషయానికొస్తున్నాను .
ప్రస్తుతం హనుమదుపాసకుడైన ఓగొప్పసాధకుడు [నాకు గురుతుల్యులు ] మహాప్రముఖమైన ఓ హనుమత్ క్షేత్రం అభివృద్దిలోకి రాకపోవటం గూర్చి బాధపడుతూ ఆ క్షేత్రాన్ని అభివృధ్ధిపరచాలని కోరుతూ ఓ ఉద్యమం చేపట్టారు . వారి సంకల్పం గొప్పది . వారిశక్తి నాకు తెలుసు . కానీ ఇందుకు నామనసంగీకరించటంలేదు. అప్పటికీ వారితో చెప్పానుకూడా
గురువుగారూ ! అక్కడ వసతులు ఏర్పాటుచేస్తే ప్రకృతి అందాలన్నీ కనుమరుగవుతాయి. ఎప్పుడు అన్నివసతులుంటాయో అక్కడకు భక్తులు సాధకులకు బదులు విహార యాత్రికులతాకిడి ఎక్కువవుతుంది ,వీల్లకోసం వ్యాపారాలు మొదలవుతాయి ., ఇక అనాచారపరులు ,,డాంబికుల రద్దీతో అసలైన సాధకులకు ఈక్షేత్రంనుండి అందవలసిన శక్తిప్రసరణ ఆగిపోతుంది . ప్రస్తుతం మనం పుణ్యక్షేత్రాలలో చూస్తున్నవారిలో ఎనభైశాతంమంది శ్రధ్ధాసక్తులు తక్కువగాఉన్నవారే .[క్షమించాలి ఆ ఎనభైశాతంలో నేనూ ఒకణ్ణికావచ్చు] భక్తికంటే భయం ఎక్కువ ఉన్నవాళ్లు . ఓనమస్కారం పడెస్తే పోలా ! అనే మనస్తత్వం . కష్టాలకోర్వరు. సులభంగా దర్శనమయ్యే అవకాశం ఉంటే భక్తులనేకాదు భగవంతుణ్ణికూడా మోసం చేయటానికి వెనుకాడరు . దైవసాన్నిధ్యంలో ఉండాల్సిన వినయం, సహనం లేనివాళ్లు ఎక్కువ .
వీళ్ల ఆశను ,అవసరాలను సొమ్ముచేసుకునే వ్యాపారులు,దోపిడి ముఠాలతో ఆయాశక్తిక్షేత్రాలలో పవిత్రవాతావరణం కలుషితమవుతుంది. ఈ అభివృద్దే లేదనుకోండి , కావాలనుకున్నవాడు కేవలం స్వామి మీదనమ్మకమున్నవాళ్లు ఎలానూ వెళతారు . ఫలితం కూడా ఆలానే ఉంటుంది .మీరు పెద్దలు చెప్పదగ్గంతవాణ్ణికాను అని విన్నవించాను
కానీ స్వామి పట్ల వారికున్న ఆవేదన వలన వారు భక్తితో ఈ ఉద్యమాన్ని సాగిస్తూనే ఉన్నారు. పెద్దలు వారి భక్తి శక్తి అనన్యసామాన్యము .కనుక వారి సంకల్పం వృధాపోదు. కానీ నాకుమాత్రం ఆపచ్చని ప్రకృతి,మనసువెంటనే భగవంతునిపై లయమయే ప్రశాంతవాతావరణం కనుమరుగవుతాయేమోననే భయం మాత్రం పోవటం లేదు .
జైశ్రీరాం

Read more...

ఆహా ! అమ్మ కరుణ [ఇప్పుడే వచ్చిన మెయిల్]

>> Friday, December 16, 2011


దుర్గేశ్వర గారు


అత్యంత అద్భుతంగానూ నయనానందం గాను ఉంది అండి అమ్మ. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు సదా కృతజ్ఞులం. నిన్న అమ్మకి పొద్దున్న పాలు తిరిగి మధ్యాన్నం పాలు సమర్పించాను అండి. నిత్యమూ చేస్తాను. నిన్న మటుకు రాత్రి వేళ ఎంతో ఆనందం కలిగింది. మా వారు విశాఖపట్నం లో దాదాపు ౧౫ సంవత్సరాల క్రితం ఒక చిన్న flat కొన్నారు. అది చూసుకోలేక అద్దెలు సరిగ్గా రాక ఇప్పుడు అది అమ్మివేసి ఇక్కడే ఇంకొకటి కొందాం అని అనుకున్నారు. ఇక్కడది ఒకటి నచ్చి ఆయన అడ్వాన్సు ఇచేసి reg. కూడా చేసేసారు. అక్కడది మాత్రం అమ్ముడు పోలేదు.
దానిని నమ్ముకునే ఇక్కడ కొనేసారు. అది అమ్మగా వచ్చిన డబ్బు వెంటనే ఇక్కడ పెట్టేద్దాం అని. కాని తీర చూస్తె అక్కడ ఆ ఇల్లు చిక్కులో పడింది. ఆది నుంచి చిక్కులే. అద్దెకి ఉన్నవారు సరిగా అద్దె ఇవ్వకుండా, ఖాళి చేయకుండా, అమ్మకానికి పెట్టిన తరువాత ఎవరన్న వస్తే చూడడానికి తలుపులు తీయకుండా నానా యాతన పెట్టారు. ఈయన ఏమో ఇక్కడ నుంచి అక్కడకి వెళ్ళలేరు.

ఇంతలో అమ్మవారి అనుగ్రహం ఒక మంచి వ్యక్తి రూపంలో వచ్చి అది కొనుక్కోడానికి ఒప్పుకున్నారు. ఆ వ్యక్తీ ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వారు. చాల సంతోషించి అంతా బానే ఉంది అనుకున్నాం. మా వారు బయలు దేరి విశాఖపట్నం వెళ్లారు మూడు రోజుల క్రితం. ఇంతలో ఆ documents అన్ని తప్పులు తప్పులు. ఇంక reg. అవ్వదు అని అనుకున్నాము. వాళ్ళు అన్ని తప్పులని సరి చేసి దానికి డబ్బులు అడిగి నిన్నటికి మార్చారు వాళ్ళు అక్కడ ఆఫీసు లో. చిక్కులు ఎలా వచ్చాయో అలానే విడిపోయాయి. నిన్న అంతా సవ్యంగా జరిగి reg. అయిపొయింది. మా వారు అక్కడనుంచి ఈ రోజు ఉదయం బయలుదేరారు. ఇదంతా అమ్మ ఆది నుండి దగ్గర ఉండి జరిపించిందా అని పదే పదే అనిపించింది. నిన్న గురువారం మార్గ శీర్ష మాసం అమ్మ ఇలా నిన్నటికి మార్చి రిజిస్ట్రేషన్ మా మీద కొన్న వారి మీద తన అనుగ్రహం కురిపించింది. అలానే ఇక్కడది కూడా సవ్యంగా అయి వారికి మరింత లక్ష్మి కటాక్షం కలగాలి ఇంట్లో ఉన్న కష్టాలు తీరాలి అని అమ్మని మనసార ప్రార్ధిస్తున్నాను.

మా తమ్ముడు కూడా మీకు పంపాడు అండి. మీ ఎకౌంటు ఒకసారి చూడమని మనవి.

నా పేరు లేకుండా మీ బ్లాగ్ లో పోస్ట్ చేయమని మనవి.

ప్రణామములు!
ఓసోదరి

Read more...

భాగ్యాదా లక్ష్మీబారమ్మా ... [ఈరోజు వైభవలక్ష్మి దర్శనం]

>> Thursday, December 15, 2011


పూజలు చేయా,,పూలు తెచ్చామూ.......
క్షీరాబ్దికన్యకకు శ్రీ మహాలక్ష్మి కీ.........క్షీరాభిషేకం



శ్రీవారితో శ్రీదేవికి కలువలతో పూజ

అమ్మానీపాదము ...భక్తజనుల అర్చనతో శోభిల్లే పాదము.
అమ్మా సురభీ...... అర్చనలందగ వచ్చావా.
అమ్మపాదములపై అలరిన పూబాలలు
గోమాత పూజ .



ఈరోజు మార్గశిరలక్ష్మీవారపూజలలో భాగంగా పీఠంలో అమ్మవైభవోపేతంగా దర్శనమిచ్చింది. ఉదయాన్నే భక్తులు అమ్మకు షోడశోపచారములతో అర్చనకు సంబరాలన్నీ సమకూర్చుకుని సిద్దమయ్యారు. ప్రత్యేకపూజ జరుపమని కోరిన వారి తరపున పూజాద్రవ్యాలు,కలువపూలు సిద్దమయ్యాయి . ఈలోపల అనుకోకుండా నూజండ్లనుండి గోవత్సంతోకూడా గోమాత సురభి విచ్చేసింది .[ముప్పైఐదు వేలరూపాయలు పెట్టికొన్న ఈ గోవు సరిగా పాలివ్వటంలేదని యజమాని గత గురువారం అభిషేకాలకు కొద్ది పాలుపంపాడు పూజానంతరం అమ్మప్రసాదాలు పంపిస్తే తినిపించాడు. అప్పటినుండి గోమాత క్షీరం సమ్రుద్దిగా ఇస్తుందట. అందుకని తానే ఒక ఆటోలో గోమాతను పూజ చేపించుకోవాలని తీసుకొచ్చాడు,ముందుగా ఒక్కమాటకూడా చెప్పలేదు] ఇది నిజంగా పూజజరుపుకున్నవారి భక్తియొక్కశక్తో ,అమ్మ కరుణయోగాని యాదృచ్చికం మాత్రం కాదనిపిస్తుంది. ఇక గోత్రనామాలుపంపినవారందరి తరపున సంకల్పంచెప్పి ,తులసీ పూజ, గోపూజ జరిపాము. ఆతరువాత అమ్మకు శ్రీసూక్త ప్రకారంగా క్షీరం,హరిద్రా,గంధ,కుంకుమాది ద్రవ్యాలతో అభిషేకం. ఇక కమలాలయకు కలువలతో పూజ చెప్పనలవికాదు ఆ అందం. అందులో పక్కనే శ్రీవారు వేంచేసి ఉన్నారాయె ఇక అమ్మ ఆనందానికి అంతులేదు. పూజయ్యాక యజ్ఞం చేయాలని లేచాము. కానీ మనసులో లలిత....లలిత అని నాదం వినిపిస్తున్న భావన . మరలా కూర్చుని లలితాసహస్రనామ పారాయణంచేస్తూ పుష్పాలు,తులసి,మారేడు దళాలతో కుంకుమతో అర్చనలు చేశాము . ఈ పుష్పయాగమే నాకిప్పుడిష్టమని అమ్మ ఇలా జరిపించుకుంది .
ఈ పూజలో స్వయం పాల్గొన్నవారు ,రాలేక గోత్రనామాలు పంపినవారు,ప్రత్యేకంగా అమ్మకిష్టంగా సాగే ఈపూజలకోసం తమతరపున పూజాద్రవ్యాలు తెప్పించినవారు ,ఈపూజనుచేసినవారు,చూసినవారందరికీ తల్లీ ! నీ అనుగ్రహం కలిగి ధనధాన్యసమృద్ధులతో ,సకలశుభాలు,ఆనందం వారి గృహాలలో వెల్లివిరియగా చేయమ్మా !!! అంటు కనకధారా స్తవంతో స్తుతులు చేశాము. ముత్తైదువలు మంగళహారుతులెత్తగా చిరునవ్వులతో చిన్నారి పులకింపజేసింది . ఇక గోత్రనామాలు పంపినవారందరికీ ఈరోజు తమతమ ఇళ్లలో కొద్దిగా క్షీరం అమ్మవారికి నివేదనచేయమని విన్నవించాము ముందుగానే .అమ్మఖచ్చిత్తంగా వచ్చి ఆప్రసాదాన్ని స్వీకరించినదని నా ప్రగాఢనమ్మకం.
జైశ్రీరాం .

Read more...

రామనామము ......రామనామము...రమ్యమైనది.....రామనామము

>> Wednesday, December 14, 2011


శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే!
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే!!
శ్రీరామ రామ రామ అని మూడుసార్లు రామ నామాన్ని జపిస్తే విష్ణు సహస్ర నామాన్ని జపించినంత పుణ్యఫలం లభిస్తుందని సాక్షాత్తు మహాశివుడు పార్వతిమాతతో చెప్పాడు. రామనామ విశిష్టత అమోఘమైనది. అద్వితీయమైనది. ఇహలోకాన్నుండే బాధలను తొలగించి, పర లోకాన ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించేది. ఈ నామాన్ని సదా స్మరణం చేసే వారి ఇంట్లో లేమి ఉండదని, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి. కబీర్‌దాస్, తులసీదాస్, భక్తరామదాసు లాంటి మహా భక్తులెందరో రామనామమే పరమావధిగా భావించి, పునీతులయ్యారు. రామనామ విశిష్టత అనన్య సామాన్యమైనది.‘రామ’నామ మందు మంత్రాత్మకమైన నిగూఢార్ధం ఇమిడి ఉంది. ఇందులో ‘ర’కారము రుద్రుని, ‘అ’కారము బ్రహ్మను, ‘మ’కారము విష్ణువుని సూచిస్తుంది. కనుకనే ‘రామ’శబ్దం బ్రహ్మవిష్ణు, శివాత్మక రూపంగా భావించడం జరుగుతోంది. అలాగే ‘రామ’అనే శబ్దం జీవిత్మ పరమాత్మలకు స్వరూపంగా కూడా చెప్పడం జరుగుతోంది. ఇందులో ‘రా’అనే అక్షరాన్ని ‘తత్’అని అనగా ‘పరబ్రహ్మము’ అని ‘మ’ అనే అక్షరానికి ‘త్వం’ అనగా జీవాత్మ అని అర్థం చెబుతారు. అలాగే అష్టాక్షరి మహామంత్రమయిన ఓం నమో నారాయణాయ నమఃలో ‘రా’ బీజాక్షరం, పంచాక్షరి మహామంత్రమయిన ఓం నమఃశివాయలో ‘మ’ బీజాక్షరం ఇందులో ఇమిడి ఉన్నాయి. అందువల్లే ఇది రెండు మంత్రాల శక్తిని, మహత్తును కల్గి ఉందని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత శక్తిదాయకమైన రామ మంత్ర జపంవల్ల ముక్తిమోక్షాలు లభిస్తాయి. కనుకనే హరిహరాత్మకమైన ఈ ‘రామ’నామ మంత్ర రాజాన్ని తారక మంత్రంగా చెప్పడం జరుగుతోంది.
భవబంధాల నుంచి తరింపచేయడంవల్లనే ‘రామ’మంత్రాన్ని తారక మంత్రమని పిల్వడం జరుగుతోంది. అంతేకాకుండా ‘రామ’ నామ శబ్దం ప్రాణాయామ శక్తిగా కూడా చెబుతారు. స్వభావ సిద్ధంగా పూరకమైన శ్వాసను ‘మ’కారంతో కుంభించి, ‘రా’కార ఉచ్ఛారణతో రేచకం చేయడం వల్ల ప్రాణాయామం సంపూర్ణంగా జరుగుతుంది. ఆ కారణంగా ‘రామ’ నామ శబ్ద ఉచ్ఛరణంవల్ల ఒక పక్క రామనామ సంకీర్తనా ఫలం, మరో పక్క ప్రాణాయామం జరిగి, ఆరోగ్యం చేకూరుతుందని శాస్తక్రోవిదులు చెబుతున్నారు. ఆ కారణంగా రామ నామాన్ని ఏకాగ్రతతో ఐదు నిముషాలు ఉచ్ఛరిస్తే, మనస్సు నిర్మలమై, ఏకాగ్రత సిద్ధిస్తుందని, సత్‌కార్యాలకు పునాది పడుతుందని చెబుతారు. త్రిమూర్త్యాత్మక రూపమైన ‘రామ’నామాన్ని నిత్యం పఠించి ఆంజనేయుడంతటి పరమభక్తుడు దైవమయ్యాడు. రామనామ స్మరణే పరమావధిగా భావించిన ఆ స్వామి జగద్విఖ్యాతినొందాడు. రామనామమే తన ఉచ్ఛ్వాస నిచ్చ్వాసలుగా భావించిన కబీరు, భక్తరామదాసులాంటి మహాభక్తులు స్వామి కృపకు పాత్రులై, జగద్విఖ్యాతి నొందారు. రామ నామంలోని విశిష్టతను, మహత్తును తెలిసిన పరమేశ్వరుడు, ఆ మంత్రాన్ని జపించమని సాక్షాత్తు పార్వతి మాతకు చెప్పాడు. శ్రీహరి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మికి రామనామ శబ్దానికున్న మహత్తును వివరించాడు. రామ నామం విశేషమైనది.
గొప్ప మహత్తు కలది. భవ బంధాలనుంచి దూరం చేసి, ముక్తిని మోక్షాన్నిచ్చేది. ఆ కారణంగానే ఇది పరమోత్కృష్ట మంత్ర రాజంగా పూజింపబడుతోంది. రామనామ స్మరణంవల్ల బ్రహ్మవిష్ణు, శివులను పూజించిన ఫలం దక్కుతుంది. దీనివల్ల విష్ణుసహస్ర నామాన్ని, శివ పంచాక్షరిని పూజించిన ఫలం దక్కుతుంది. ‘రామ’శబ్దంలోని రెండు అక్షరాలు మనో నిగ్రతను పెంచి, ఏకాగ్రతను వృద్ధిచేసి ఆధ్యాత్మిక ద్వారాలను తెరుస్తాయి.
దుష్కర్మలన్నీ పటాపంచలై, మనోనిబ్బరం ఏర్పడుతుంది. ఫలితంగా మానసికానందం సొంతమవుతుంది. శివకేశవులకు భేదం లేదని తెలిపే ఈ నామ స్మరణంవల్ల సర్వసౌభాగ్యాలు సిద్ధిస్తాయి. సర్వమనోకామనలు సిద్ధించి, భవిష్యత్తు నందన వనమవుతుంది. ఆధ్యాత్మిక చింతనాసక్తి ఉన్న భక్తులంతా ఈ నామాన్ని జపించడంవల్ల ఆధ్యాత్మికాసక్తి పెరిగి, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది.


-----దుర్గ [ఆంధ్రభూమి నుండి]

Read more...

వద్దన్నా వచ్చేదే కర్మఫలం

వద్దన్నా వచ్చేదే కర్మఫలం

ధర్మాన్ని త్యజించినవాడు జీవచ్ఛవం లాంటివాడు. ధర్మాచార పరాయణుడు మృతి చెందినా సత్కీర్తితో చిరంజీవి కాగడు. ఇది నిస్సంశయం. ధర్మో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. అంటే, ధర్మాన్ని నీవు రక్షించు! అది నిన్ను రక్షిస్తుంది అని అర్థం. సత్కర్మలను ఆచరిస్తూ స్వల్పకాలం జీవించినా ఆ మానవుడి జీవితం ధన్యమే. సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మం సోదరుడు. దయ చెలికాడు. శాంతం భార్య, సహనం కుమారుడు. ఈ ఆరుగురూ మానవుడికి బంధువులు. ఐహిక విషయాలలో బంధాలలో చిక్కిన మనిషికి మనస్సు బంధానికి కారణం. ఈ బంధానికి లోబడి, ధర్మాచరణ విడువరాదు. కర్మయందే నీకు అధికారం కలదు, కాని, దాని ఫలితంపై నీకు ఆసక్తి ఉండరాదని గీతలో కృష్ణుడు బోధించాడు. దేహం పట్ల ప్రేమను వదులుకొని, తాను పరమాత్మయందు ఉన్నట్లు తెలుసుకుంటే, మనస్సు ఎక్కడ వెళ్లినా, ఆ చోట పరమాత్మయందు నిలుస్తుంది. కోరిన కోరికలన్నీ నెరవేరి ఎవరికైనా అంతా సుఖమే ప్రాప్తించదు. సమస్తమూ దైవాధీనం, ప్రాప్తించిన దానితో సంతృప్తి చెందడమే ధర్మం. దుష్టుల సాంగత్యాన్ని విడిచిపెట్టి సజ్జన సాంగత్యాన్ని చేరాలి. రాత్రింబవళ్ళు దైవాన్ని భజిస్తూ ఉండాలి. అహం శాశ్వతం కాదని తెలుసుకోవాలి.
ముక్తిని కాంక్షించేవారు ఐహిక విషయాలను విషంతో సమానమని గ్రహించాలి. సహనం, ఋజువర్తన, దయ, పవిత్రత, సత్యాన్ని అమృతంలా భావించి ఆచరించి ధర్మమార్గంలో పయనిస్తే దైవానుగ్రహం లభిస్తుంది. ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః’ అన్నారు ఆదిశంకరులు. అంటే, సత్సాంగత్యంవల్ల నిస్సంగత్వం అలవడుతుంది. తద్వారా నిశ్చలతత్వం వస్తుంది. దానివల్ల జీవన్ముక్తి కల్గుతుందని భావం. శరీరాలు అనిత్యమని, శాశ్వతంకాదని, మృత్యువు ఎప్పుడూ వెన్నంటి వుంటుందని గ్రహించి, పుణ్యకార్యాలు ఆచరించడం ఉత్తమం. ప్రాణులపట్ల దయతో ఎవని హృదయం కరుగుతుందో అతడే జ్ఞాని. అతడికే మోక్షం ప్రాప్తిస్తుంది. విదేశంలో విద్యయే తోడు, ఇంటిలో భార్య తోడు, రోగికి ఔషధం తోడు. ధర్మాచరణే చివరి తోడు. ఈ చరాచర ప్రపంచంలో సంపదలు, ప్రాణాలు శాశ్వతం కావు. యవ్వనం కూడా అశాశ్వతమే. ధర్మమొక్కటే శాశ్వతమైనది. ధన సంపద భూమిపై, పశుసంపద గోశాలలో, భార్య ఇంటి వాకిట ఉంటే, బంధువులు, మిత్రులు శ్మశానంవద్ద ఉండిపోతారు. కాని కేవలం ఆచరించిన ధర్మమే తనకు తోడుగా వెడుతుంది.
కర్మఫలం కర్మకు లోబడి వుంటుంది. మానవుల బుద్ది కర్మను అనుసరించి ఉంటుంది. కనుకనే జ్ఞానులైనవారు, సజ్జనులైనవారు ధర్మాచారణయందు ఆసక్తి కల్గి మానవజన్మను చరితార్థం చేసుకోవాలంటే, చక్కగా ధర్మాన్ని ఆచరించి, కర్మల్ని నిర్వహించాలి. రామాయణంలో శ్రీరాముడు, సత్యహరిశ్చంద్రుడు లాంటి మహనీయులు ఆచరించిన ధర్మసంబంధమైన కార్యాలు స్మరించుకుంటూ మనం కూడా అదే బాటలో పయనిస్తే జీవితం మృతతుల్యం అవుతుంది!

Read more...

అయ్యా ! ఇలా కొత్త వ్రతవిధానాలు,పారాయణ గ్రంథాలు తయారుచెయ్యకండి దయచేసి.

>> Tuesday, December 13, 2011

ఈమధ్య నేను గమనిస్తున్న కొత్తవిషయమేమిటంటే కొత్తగా ఎవరికి వారు పారాయణగ్రంథాలు వ్రాయటం ,ఇంకా ఒకడుగు ముందుకేసి వ్రతవిధానాలు వ్రాసి జనం మీదకొదలటం . ఇక్కడ మనం నిర్మొహమాటంగా ఒకమాట చెప్పుకోవాలి.
నేను మొన్న హనుమద్వ్రతం చేసుకోదలచి నాదగ్గరున్న పుస్తకం ఎవరో తీసుకెళ్ళి తిరిగివ్వక పోవటం వలన ఇబ్బందిపడ్డాను . కొత్తపుస్తకంకోసం వినుకొండలో గుంటి ఆంజనేయస్వామివారి ఆలయ అర్చకులనడిగితే ఒక పుస్తకం పంపారు . తీరాపుస్తకం తెరచి చూద్దునుకదా !అంతా కొత్తగాఉంది . పూజావిధి,వ్రతకథలుకూడా . సరే దాన్నిపక్కనబెట్టి వ్రతం పూర్వపద్దతిలోనే ముగించుకుని తరువాత సదరు రచయితకు ఫోన్ నంబర్ పుస్తకంమీద ఉండటంతో నేను ఫోన్ చేశాను .
ఆయన పెద్దవారు ఏదో ప్రభుత్వసంస్థలో ఉద్యోగి . హనుమద్భక్తుడు.
అయ్యా ! మీరు వ్రాసిన హనుమత్ వ్రతం చూశాను .ఇది మీరుస్వంతగా వ్రాసినదిలాఉంది అనడిగాను.
అవునండి , స్వామి ప్రేరణతో నేనే ఈవ్రతవిధానాన్ని కూర్చాను చాలాసంతోషం మీరు చదివినందుకు అని ఏదో ఆయన గూర్చి చెప్పారు .
అయ్యా ! ప్రామాణికం గా మనకు హనుమత్ వ్రతవిధానం పరాశరమహర్షి విరచించి ఇచ్చినదుందికదా అనడిగాను.
ఆయనప్పటికీ విషయం అర్ధంచేసుకోక ఆయన రచనలగూర్చి చెప్పుకొచ్చారు.
సరే ! ఇక ఆయనతో వాదన అనవసరం కనుక నమస్కారం చెప్పి ఫోన్ పెట్టేశాను.

ఇక్కడ రచయితలు గమనించవలసిన అంశం ఒకటుంది . ఏదైనా పూజావిధానంగానీ ,లేదా వ్రతవిధానంకానీయండి వాటిని మహాసాధకులు పరమాత్మతో సన్నిహిత సంబంధం ఉన్నవాళ్లు తెలియజేస్తే,రూపకల్పనచేస్తే అవిశక్తివంతాలయి మానవులకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మన పూర్వఋషులు అటువంటి తపోసంపన్నులుకనుక వారిచ్చిన అర్చన,పూజావిధులు యుగాలుగడచినా శక్తివంతమయి ఇష్ట కామ్యాలను సిద్దింపజేస్తున్నాయి . కనుక అవి పరమ ప్రమాణం
ఇప్పుడేదో కొద్దిగా ఆథ్యాత్మిక మార్గంలో నడచినవారంతా మానాయనపాండిత్యం కొంత నాపైత్యం కొంత అని దాన్నీదీన్నీ రంగరించి కొత్తగా తయారుచేసి జనంమీదకొదలటంవలన మంచికంటే చెడుజరిగే ప్రమాదమే ఎక్కువని నాభావన . కాకుంటే ఉన్నదాన్ని సరళంగా విడమరచి అర్ధంకూడా చెప్పవచ్చు కాని కొత్తగా తాముతయారు చేసినవి ఇలా జనంలోకొచ్చి కలగాపులగమైపోయి చివరకు ఏదిప్రమాణమో ! అర్ధంకాక జనం వీటిమీద నమ్మకాన్ని కోల్పోయేలాచేసినందుకు ఆదోషాన్ని నెత్తి కెత్తుకున్నవారవుతారు .
ఉన్నవి చాలు .అందులోనూ అవి ప్రక్రుతినియమాలనుఆపోసనపట్టి వాటిని అనుసంధానిస్తూ శాస్త్రీయంగా ఋషులిచ్చిన సంపద . మనలా వాళ్ళు పుస్తకాలు ముద్రించుకుని దాతలపేర్లు తల్లిదండ్రులపేర్లు వ్రాసే స్థితినుంచి తయారయినవికాదు
మనకూ ఆఋషులకూ అక్కడే ఉంది పెద్దతేడా > అదిగమనించాలి రచయితలు .
నమస్కారములు

Read more...

శ్రీ శంకరవేదం

>> Monday, December 12, 2011



వేదాలు అపౌరుషేయాలా? కర్మాచరణ, తత్త్వ చింతనలలో ఏది ఉత్తమం? కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచం నిజమా? కల్పనా? ఇవీ ప్రశ్నలు, సందేహాలు, విచారణాంశాలు. ఈవిషయాలనే నిరంతరం చర్చించే వేదిక మండనమిశ్రుడి యిల్లు. జగత్తుకు సమాధానం అందించటం జ్ఞాని బాధ్యత. ఆ బాధ్యతను తలకెత్తుకున్నది పరమేశ్వర స్వరూపమైన శంకరాచార్యులు. మండనమిశ్రుడి వాదనలు, శంకరుల స్పష్టమైన భావ శరపరంపరలో ఛిన్నమైన వైనం, ప్రపంచం సాధించుకున్న అద్వైత స్థితి. శ్రీ శంకర భగవత్పాదుల ఆలోచనలు సర్వకాలికాలు. అవేంటో విందాం.

"వేదాలలో కర్మకాండ కంటే ఆత్మవిచారణకే పెద్దపీట. తొలిదశలో సాధకుడికి కర్మాచరణం, ఆధ్యాత్మసాధనకు తోడ్పడవచ్చు. కర్మలు ఆత్మవిద్యకు ఆలంబనం కాదు. అంతరంగము బ్రహ్మమేనని తెలుసుకోవటానికి, అదేనీవు, ఆ బ్రహ్మము నీవే, వేదం నుంచే అన్నీ పుడుతున్నాయి అనే మాటలు, ప్రమాణాలు కాదా! అసలు వున్నదే ఆత్మ! సృష్టికి పూర్వమే సత్యం వున్నది. అంటే ఆత్మన్నా, సత్యమన్నా ఒకటే కదా! ప్రత్యేక రూపం లేనిది, అన్ని రూపాలు తనే అయినది సత్యం. కనుక సత్యమే ఆత్మ! అది కాలాద్యవచ్ఛిన్నం.

ఏమీ లేదనేదే ఆత్మ
నేనే బ్రహ్మము అనుకోవటం అసలు ధ్యానం. పది యింద్రియాలు, మనసు కలిపి నేను అనుకుని ధ్యానిస్తే, అది బ్రహ్మానుభవానికి దారితీస్తుంది. మేనులోని అసలు నేనును అనుభవ పరిథిలోకి తెస్తుంది. కర్మకాండలను ఆచరించినందువలన కలిగే శ్రమకు ఫలితం లభిస్తే, మోక్షమూ అటువంటిదే. కానీ బ్రహ్మభావన, జ్ఞానంగా అనుభూతం అవుతుంది. ఆ స్థితిలో నిలకడగా వుండగలగటమే ఎరుక. ప్రపంచం, నిత్య, సత్య, శాశ్వతమనే భావన మనసు ఆడుకునే ఆట. ఆత్మను చూసిన వారెవరున్నారు? ఆత్మ, సాక్షాత్ ఆకారంగా వున్నదనుకున్న వాడికి, దేహము ఆత్మగానే అనిపిస్తున్నది. ఆత్ అంటే ఏమీ, మా అంటే లేదని అర్థం. లేదు అంటే ప్రత్యేకంగా లేదని, ఉన్నదంతా ఆత్మ అని కదా స్ఫురణ! అదే అహం స్ఫురణ! సగుణం వున్నంతకాలం వ్యత్యాసం, వైరుధ్యం తప్పవు. నిర్గుణం అనుభవం అయినప్పుడు సందేహమూ కలుగదు. కనుక సమాధానం అవసరం వుండదు.

అసలైన రాజయోగి
యోగనిష్ఠలో, ఆత్మనిష్ఠలో, బ్రహ్మనిష్ఠలో వున్నవాడికి ఎంతటి బాహ్య సౌందర్యమూ అకర్షణీయం కాదు. యోగేశ్వర కృష్ణుడి సంచారమంతా బ్రహ్మచర్యమే. బాహ్యచర్య కాదుకదా! కృష్ణుడు అందరినీ అకర్షించాడు. ఆయన ఎవరి ఆకర్షణకూ లోబడలేదు కదా! కారణం, ఆయన ఆత్మజ్ఞాని కనుక. అంటినదీ, అంటించుకున్నదీ లేదు. ఆయనకున్న లోలత్వమంతా బ్రహ్మజ్ఞానం పట్లనే. వైరాగ్యంలో జీవుడు, కామాంతకుడు కావాలి. బ్రహ్మజ్ఞానమంతుడికి యితర విద్యలన్నీ కరతలామలకం. ముంజేత కంకణాలు. అవే ఆయనను అనుసరించి, ఆయన సేవలో ధ్యనవంతము, ప్రామాణికమూఅయి, శాశ్వతత్వాన్ని సంతరించుకుంటాయి.

మరొక్కవిషయం. కర్మకాండకు వేదాలే ఆధారం. మహనీయుల బోధలన్నీ ఒక కాలాన్ని, దేశాన్ని, ప్రదేశాన్ని అనుసరించి విభిన్నంగా వినిపిస్తుంటయ్. మనమే సమన్వయం చేసుకోవాలి. సంఘర్షణకు తావులేని రీతిలో విషయాన్ని అర్థం చేసుకోవాలి. జీవుడు ఆత్మాభిముఖుడు కావటానికి కర్మకాండ సహాయపడుతుంది. సాధనాకాలంలో తనంతట తానే, సర్వమూ తాత్కాలికమేనని, సత్యమే సర్వమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఈ ఎరుక కలిగిన తర్వాత జీవుడి మనసు కర్మకాండ నుంచి బయటపడి, బ్రహ్మజ్ఞానం వైపు మరలి, కడగా అక్కడూ లయం అవుతుంది. అదే జీవన్ముక్తి. కర్మకు అతీతమైనవాడికి ప్రపంచమూ లేదు, దాన్ని గురించిన ఆలోచనా లేదు.

స్థిమితంగా వుంటాడు. పరబ్రహ్మము చైతన్యమనీ, ప్రపంచమంతా దాని చ్ఛాయేనని, మాయగాఅనుభవం కలిగి, సంస్థితుడై వుంటాడు. శరీరగౌరవాన్ని కాపాడే గోచిగుడ్డనీ, అరచేతిలో భిక్షాపాత్రనీ, మనసంతా వేద ధ్వనుల ప్రతిధ్వనులనీ... అన్ని వేళలా, దివ్యవైరాగ్యాన్నీ అనుభవించగలవాడే యోగిరాజు. నిజానికి వాడే అసలైన రాజయోగి!

[ ఆంధ్ర జ్యోతి దినపత్రిక నుండి]

Read more...

స్వామీ ! శరణం అయ్యప్పా అని సాగే భక్తులసందోహం .

>> Sunday, December 11, 2011






నిష్ఠతో నియమాలమాలాధారణ చేసి స్వామీ శరణమంటూ ఎలుగెత్తి కొలచిన భక్తులు శబరిగిరిపై వెలసిన ఆదివ్యవెలుగును దర్శించడానికై తరలివెళుతున్నారు . ఈరోజు పీఠంలో గణపతి,షణ్ముఖుల సమేతంగా కొలువుదీరిన అయ్యప్పకు దీక్షాధారుల తరపున మాతమ్ముడు పంచామృతాభిషేకంజరిపి ప్రత్యేక అర్చనలు చేసిన అనంతరం స్వాములు ఇరుముడులుధరించడానికి సిద్దమయ్యారు.

Read more...

మనం సంస్కృతం ఇలా నేర్చుకోవచ్చు

సంస్కృత పాఠమాల - సంస్కృతభాషా సేవా మండలి వారి ప్రచురణలు మొత్తం పుస్తకాలు 15 విభాగాలు 24 హైదరాబాదు లోని వారి ప్రచురణ సంస్థ లో పొందవచ్చును. ఈ పుస్తకాలను చదవటం ద్వారా మనం మన మాతృభాష అయిన తెలుగు లో సంస్కృతాన్ని అభ్యసించవచ్చును. ప్రాప్తి స్థానము:


Sanskrita Bhasha Seva Mandali,
T2, Kalyani Estates,Konark Road,
Madhurapuri, Dilsukh Nagar,
Hyderabad - 500 060
Ph: 040 55757750.

There are two more ways.

1) There is one organisation by name Samskruta Bhararati who teach Samskrutam free of chagres. They may be having branches in Delhi or near your place also.They publish books. There is one set consisting of three or four books which are extremely helpful. The set costs around Rs.250/- If you get them there it is O.K. I can help you by giving to your people if you have anybody in Hyd.

2) There is one organisation by name Central Institute of Foreign Languages. There they teach Sanskrit at four levels. This is also very good.

Learning Samskrit is extremely useful.

I shall find out whether Samskruta Bharati has any website.



Here is a online self study course on Sanskrit.. They have lessons
from alphabets, vowels, words to sentence framing and practice
exercises.
This can be a good start...

Introduction..
http://acharya.iitm.ac.in/sanskrit/sans.php?lnum=0

Lesssons
http://acharya.iitm.ac.in/sanskrit/lessons.php

Offline learning..
http://acharya.iitm.ac.in/sanskrit/off-line.php

Read more...

దత్తజయంతి శుభాకాంక్షలు

>> Friday, December 9, 2011


ఆదిదేవుడు జీవుల అజ్ఞానాంధకారాన్ని తొలగించే లోకోద్దరణ కార్యదీక్షాదక్షుడై అత్రివరదునిగా దర్శనమిచ్చిన పర్వదినం మార్గశిర పౌర్ణమి. కోటి వెన్నెల కరుణ కన్నులనుండి కురవగ కరుణాంతరంగుడైన దత్తస్వామి మనలను కరుణించే పండుగ ఇది. పూజించండి ,ప్రార్ధించండి ఆపాదాలనాశ్రయించండి . క చింతలేదు చిన్మయరూపుడైన స్వామిచెంతచేరాక .

పీఠం లో రేపు స్వామికి పంచామృతాభిషేకములు , దత్తచరిత్ర పారాయణం ,గాయత్రీ హోమం నిర్వహించబడుతున్నాయి.

జయగురుదత్త

Read more...

అమ్మ లక్ష్మీదేవికి క్షీరాభిషేకం..ఆపై అన్న హనుమన్న వ్రతం .[ఈరోజు పీఠంలో పూజలు]

>> Thursday, December 8, 2011

భక్తులతరపున బంగారుతల్లికి అభిషేకం
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం .......
లోకాలుపాలించేతల్లికి పాలతో అభిషేకం





కొలువు దీరిన అమ్మనుగొలచీ.........
అమ్మ వాత్సల్యదృష్టులు .


ఇక హనుమన్న వ్రతంకదా ఈవేళ
భక్తితో నివేదించిన ప్రసాదములు
ఆపై ప్రదక్షిణలు

అనంతరం వ్రతం .

Read more...

అంతర్జాలమిత్రులందరికీ విజ్ఞప్తి ..నా మెయిల్ ను హాక్ చేశారు .

>> Tuesday, December 6, 2011

మిత్రులందరకూ విజ్ఞప్తి

ఈ అంతర్జాలంలో ప్రవేశించాక ఏదైనా విషయంపై చర్చలు వాదనలలో పాల్గొన్నానేమోకాని భగవంతుని దయవలన ఎవరిపట్లా నాకు ఇప్పటివరకు శత్రుత్వభావనకలగలేదు . నాకుతెలసి ఎవరికీ ఏఅపకారమూచేయలేదు. ఏదో నాకుతోచినమార్గంలో భగవత్ సేవాకార్యక్రమములు చేస్తూ ,చేపిస్తూ సాగుతున్నాను.
నేను కూడా సభ్యునిగా ఉన్న సత్సంగం అనేగ్రూప్ లో నాపేరుతో [నాఐడితో] ఒక మెస్సేజ్ వచ్చినదని నిర్వాహకులైన మిత్రులు తెలిపారు . నేనేమిటో తెలుసుగనుక వారు నన్ను అపార్ధం చేసుకోలేదు.అందుకు కృతజ్ఞుడను.
ఇలా హాక్ చేసినవారు ఇంకా ఎవరికైనా ఇలాంటిమెస్సేజ్ లేవన్నా పంపివుంటే ,అందుకు వారికి బాధకలిగితే వారు నన్ను అపార్ధం చేసుకోవద్దని మనవిచేసుకుంటున్నాను . దయచేసి నాఫోన్ నెంబర్ ఉందికనుక నాతోస్వయంగా మాట్లాడమని మరోసారి మనవి .
సాంకేతికరీత్యా తీసుకోవలసిన జాగ్రత్తలను ఇక్కడ ఉన్న మాకుర్రాళ్ళు తెలియబరిచారు.పెద్దలు సలహాలందిస్తున్నారు. వారందరి అభిమానానికి ఋణపడిఉంటాను . ఇక నేనుఇంతకంటే ఏమీచేయలేని బలహీనుడను కావచ్చు కానీ నేను నమ్మికొలిచేస్వామి హనుమంతులవారు మహాబలి. అది మాత్రం మరువవద్దని నాకీకష్టం కలిగించిన అజ్ఞాతసోదరునకు తెలుపుకుంటున్నాను .దోషబుధ్ధిని దహించనూగలరు చేసినతప్పు ఒప్పుకుని ఆయనను శరణువేడితే దయచూపనూ గలరు .
జైశ్రీరాం

Read more...

మార్గశిర లక్ష్మీవార పూజలకు గోత్రనామాలు పంపండి

>> Monday, December 5, 2011



మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారము[గురువారము]లు మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనవి. ఈరోజులలో అమ్మవారికి విశేషపూజలు జరుగుతాయి. ఈపూజలనందుకున్న అమ్మ ఆభక్తుల ఇళ్లలో సకలసంపదలు కురిపిస్తుందని శాస్త్రవచనం.
లోకశ్రేయస్సు కొరకై " శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం "లో మహాలక్ష్మీ దేవికి విశేషార్చనలు నిర్వహించబడుతున్నాయి.గురువారం క్షీరాభిషేకం జరిపి అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన కలువ పూలతో అర్చన జరుపబడుతుంది . విశేష హారతులివ్వబడతాయి.శ్రీవేంకటేశ్వర స్వామివారికి తులసీదళార్చనజరుపబడుతుంది
వివరాలు పంపిన భక్తుల గోత్రనామాలు పూజాసమయంలో చెప్పబడతాయి .ఇందుకొరకు భక్తులు నుండి పీఠమునకు ఏమీ పంపవలసిన అవసరములేదు.
ఇక తమతరపున ప్రత్యేకంగా ఈ అర్చన జరిపించాలని కోరుకునేవారు గోత్రనామాలుపంపుతూ క్షీరాభిషేకమునకు వలసిన పూజాద్రవ్యాలు ,కలువపూల కొరకయ్యే ఖర్చును భరించవలసి ఉంటుంది .

పూజజరుపబడు గురువారములు
8-12-2011
15-12-2011
22-12-2011
29-12-2011
వివరములకు ఇక్కడ సంప్రదించండి
durgeswara@gmail.com
9948235641

Read more...

ఇదొక్కటే మానవజీవితసార్ధకతకు మహోన్నత మార్గం


నేనే సత్యం ...నేనే నిత్యం


మనిషేమిటో తెలియజేసింది నరుని జీవితం
తానేమిటో తెలిపాడు నారాయణుడు .
అపారకరుణతో మానవుడు తననుచేరుకునే మార్గాన్ని ఉపదేశించాడు మాధవుడు. ఆగీతామాత మానవులకు దర్శనమిచ్చిన గీతాజయంతి పర్వదినం రేపు . పరమాత్మ అనుగ్రహం మనందరిపై వర్షించాలని ప్రార్ధిస్తున్నాను.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP