భాగ్యాదా లక్ష్మీబారమ్మా ... [ఈరోజు వైభవలక్ష్మి దర్శనం]
>> Thursday, December 15, 2011
పూజలు చేయా,,పూలు తెచ్చామూ.......
క్షీరాబ్దికన్యకకు శ్రీ మహాలక్ష్మి కీ.........క్షీరాభిషేకం
శ్రీవారితో శ్రీదేవికి కలువలతో పూజ
అమ్మానీపాదము ...భక్తజనుల అర్చనతో శోభిల్లే పాదము.
అమ్మా సురభీ...... అర్చనలందగ వచ్చావా.
అమ్మపాదములపై అలరిన పూబాలలు
గోమాత పూజ .
ఈరోజు మార్గశిరలక్ష్మీవారపూజలలో భాగంగా పీఠంలో అమ్మవైభవోపేతంగా దర్శనమిచ్చింది. ఉదయాన్నే భక్తులు అమ్మకు షోడశోపచారములతో అర్చనకు సంబరాలన్నీ సమకూర్చుకుని సిద్దమయ్యారు. ప్రత్యేకపూజ జరుపమని కోరిన వారి తరపున పూజాద్రవ్యాలు,కలువపూలు సిద్దమయ్యాయి . ఈలోపల అనుకోకుండా నూజండ్లనుండి గోవత్సంతోకూడా గోమాత సురభి విచ్చేసింది .[ముప్పైఐదు వేలరూపాయలు పెట్టికొన్న ఈ గోవు సరిగా పాలివ్వటంలేదని యజమాని గత గురువారం అభిషేకాలకు కొద్ది పాలుపంపాడు పూజానంతరం అమ్మప్రసాదాలు పంపిస్తే తినిపించాడు. అప్పటినుండి గోమాత క్షీరం సమ్రుద్దిగా ఇస్తుందట. అందుకని తానే ఒక ఆటోలో గోమాతను పూజ చేపించుకోవాలని తీసుకొచ్చాడు,ముందుగా ఒక్కమాటకూడా చెప్పలేదు] ఇది నిజంగా పూజజరుపుకున్నవారి భక్తియొక్కశక్తో ,అమ్మ కరుణయోగాని యాదృచ్చికం మాత్రం కాదనిపిస్తుంది. ఇక గోత్రనామాలుపంపినవారందరి తరపున సంకల్పంచెప్పి ,తులసీ పూజ, గోపూజ జరిపాము. ఆతరువాత అమ్మకు శ్రీసూక్త ప్రకారంగా క్షీరం,హరిద్రా,గంధ,కుంకుమాది ద్రవ్యాలతో అభిషేకం. ఇక కమలాలయకు కలువలతో పూజ చెప్పనలవికాదు ఆ అందం. అందులో పక్కనే శ్రీవారు వేంచేసి ఉన్నారాయె ఇక అమ్మ ఆనందానికి అంతులేదు. పూజయ్యాక యజ్ఞం చేయాలని లేచాము. కానీ మనసులో లలిత....లలిత అని నాదం వినిపిస్తున్న భావన . మరలా కూర్చుని లలితాసహస్రనామ పారాయణంచేస్తూ పుష్పాలు,తులసి,మారేడు దళాలతో కుంకుమతో అర్చనలు చేశాము . ఈ పుష్పయాగమే నాకిప్పుడిష్టమని అమ్మ ఇలా జరిపించుకుంది .
ఈ పూజలో స్వయం పాల్గొన్నవారు ,రాలేక గోత్రనామాలు పంపినవారు,ప్రత్యేకంగా అమ్మకిష్టంగా సాగే ఈపూజలకోసం తమతరపున పూజాద్రవ్యాలు తెప్పించినవారు ,ఈపూజనుచేసినవారు,చూసినవారందరికీ తల్లీ ! నీ అనుగ్రహం కలిగి ధనధాన్యసమృద్ధులతో ,సకలశుభాలు,ఆనందం వారి గృహాలలో వెల్లివిరియగా చేయమ్మా !!! అంటు కనకధారా స్తవంతో స్తుతులు చేశాము. ముత్తైదువలు మంగళహారుతులెత్తగా చిరునవ్వులతో చిన్నారి పులకింపజేసింది . ఇక గోత్రనామాలు పంపినవారందరికీ ఈరోజు తమతమ ఇళ్లలో కొద్దిగా క్షీరం అమ్మవారికి నివేదనచేయమని విన్నవించాము ముందుగానే .అమ్మఖచ్చిత్తంగా వచ్చి ఆప్రసాదాన్ని స్వీకరించినదని నా ప్రగాఢనమ్మకం.
జైశ్రీరాం .
7 వ్యాఖ్యలు:
అద్భుత,రమణీయం,అత్యన్త్య ప్రశాన్తికం మీ -మా-అందరి లక్ష్మమ్మ పూజా వైభవం.
ఓం శ్రీమాత్రే నమః
అద్భుతం మాష్టారు. అమ్మ లీలలు ఇంకా ఇంకా వినాలని ఉంది. పీఠంలో పూజలు అందుకున్న క్షీరాబ్ది అమ్మ వారు ఎంత బాగున్నారో. గోమాత రూపములో ఉన్న అమ్మ వారు కూడా ఎంత బుజ్జిగా ఉన్నారో..
మా గోత్ర నామాలతో కూడా కలిపి పూజ జరిపినందుకు ధన్యవాదములు.
I am a regular reader of Durgeswar Garu emails. I live near Detroit,MI,USA. I talked to him many a times. I like his philosophy of life and well wisher of everybody to whom he contacts. Though I have not seen him I see his mind and heart. May God bless you and your wife with prosperity for all your good deeds. == Swamy Narayana
dhanyulamu tandri ...
నమస్కారములు.
అకుంఠిత దీక్ష తొ మీరు చేస్తున్న పూజలు అద్భుతం. అ దేవి కటాక్షం మీ కెప్పుడు ఉంటుంది .ధన్యులు .
అద్భుతం మాష్టరూ!!
రమణీయ పూజా చిత్రమాలికను మాతో పంచినందుకు ధన్యవాదాలు మాష్టరూ
-భాస్కర్
భగవద్భక్తులందరికీ ధన్యవాదములు
Post a Comment