అంతర్జాలమిత్రులందరికీ విజ్ఞప్తి ..నా మెయిల్ ను హాక్ చేశారు .
>> Tuesday, December 6, 2011
మిత్రులందరకూ విజ్ఞప్తి
ఈ అంతర్జాలంలో ప్రవేశించాక ఏదైనా విషయంపై చర్చలు వాదనలలో పాల్గొన్నానేమోకాని భగవంతుని దయవలన ఎవరిపట్లా నాకు ఇప్పటివరకు శత్రుత్వభావనకలగలేదు . నాకుతెలసి ఎవరికీ ఏఅపకారమూచేయలేదు. ఏదో నాకుతోచినమార్గంలో భగవత్ సేవాకార్యక్రమములు చేస్తూ ,చేపిస్తూ సాగుతున్నాను.
నేను కూడా సభ్యునిగా ఉన్న సత్సంగం అనేగ్రూప్ లో నాపేరుతో [నాఐడితో] ఒక మెస్సేజ్ వచ్చినదని నిర్వాహకులైన మిత్రులు తెలిపారు . నేనేమిటో తెలుసుగనుక వారు నన్ను అపార్ధం చేసుకోలేదు.అందుకు కృతజ్ఞుడను.
ఇలా హాక్ చేసినవారు ఇంకా ఎవరికైనా ఇలాంటిమెస్సేజ్ లేవన్నా పంపివుంటే ,అందుకు వారికి బాధకలిగితే వారు నన్ను అపార్ధం చేసుకోవద్దని మనవిచేసుకుంటున్నాను . దయచేసి నాఫోన్ నెంబర్ ఉందికనుక నాతోస్వయంగా మాట్లాడమని మరోసారి మనవి .
సాంకేతికరీత్యా తీసుకోవలసిన జాగ్రత్తలను ఇక్కడ ఉన్న మాకుర్రాళ్ళు తెలియబరిచారు.పెద్దలు సలహాలందిస్తున్నారు. వారందరి అభిమానానికి ఋణపడిఉంటాను . ఇక నేనుఇంతకంటే ఏమీచేయలేని బలహీనుడను కావచ్చు కానీ నేను నమ్మికొలిచేస్వామి హనుమంతులవారు మహాబలి. అది మాత్రం మరువవద్దని నాకీకష్టం కలిగించిన అజ్ఞాతసోదరునకు తెలుపుకుంటున్నాను .దోషబుధ్ధిని దహించనూగలరు చేసినతప్పు ఒప్పుకుని ఆయనను శరణువేడితే దయచూపనూ గలరు .
జైశ్రీరాం
1 వ్యాఖ్యలు:
మీకు ఇలా జరగటం నిజంగా బాధాకరం
అయినా సరే తక్కువేమీ మనకు రాముoడొక్కడుండు వరకు అన్న రీతిలో
ఇంకా మీ భావ ప్రకటన శైలి భక్తుల విశ్వాసాలను ప్రతిబింబిస్తూ
అపకారిని సైతం సోదర భావంతో చూడ గలిగే మైత్రి గుణం జ్ఞాన దృష్టి
నా హృదయాన్ని తాకినది
ఎవరు hack చేసినప్పటికీ మీరు మీ mail తిరిగి పొంద గలరని నాకు తోచుచున్నది మరోమారు
phone verification సాయంతో ప్రయత్నిన్చాగాలరని మనవి
శ్రీ రామ రక్ష సర్వ జగత్ రక్ష
ఆంజనేయ రక్ష అఖిల జగత్ రక్ష
Post a Comment