శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగానికి కార్యకర్తలుగా తరలిరండి...హనుమత్ పరివారమవుదాం మనం.

>> Thursday, December 29, 2011





జైశ్రీరాం

భగవద్బంధువులందరికీ హనుమత్స్మరణపూర్వక నమస్కారములు.

లోకశ్రేయస్సుకై శ్రీ వేంకటేశ్వర జగన్మాతపీఠం , నుండి గత మూడు సంవత్సరములు "హనుమత్ రక్షాయాగం"అను క్రతువును నిర్వహించుట జరిగినది . భక్తసులభుడైన హనుమంతుని అనుగ్రహంబడయుటకు అత్యంత సరళము అతిమహిమాన్వితమైన సాధనలను[మహాత్ములు మనకు ప్రసాదించిన మార్గములు] జతపరచి సాగించిన ఈయాగంలో పాల్గొన్న ఎంతో మందిభక్తులు స్వామి కరుణకు పాత్రులై వారి వారిసంకటములను తొలగించుకుని,శ్రేయస్సునుపొంది హనుమన్మహిమలకు ప్రత్యక్షసాక్షులైనిలచారు. ఎందరో ఉద్యోగ,విద్య,కుంటుంబసమస్యలు,అనారోగ్య, ఈతిబాధలను స్వయంగా చేసిన హనుమదుపాసనద్వారా శక్తివంతులై తొలగించుకోగలిగారు.
మహర్షులు మనకిచ్చిన సాధనామార్గాలను అనుసరించటం ద్వారా ప్రత్యక్షంగా ఫలితాలను చవిచూడవచ్చా లేదా అని ప్రయోగపూర్వకంగా సాధనామార్గంలో నడచి, నిలచి, గెలచి హనుమంతులవారి ఉపానసనకుండే శక్తి ఏమిటో అన్నింటినీ గీటురాయిమీద గీచి చూస్తే కానినమ్మలేని ఈ కలిమాయ మోహితకాలంలోనూ నిరూపించారు.వారికి వారి వెనుక ఉన్న స్వామివారికి కైమోడ్పులు.

ఇక ఈసంవత్సరం స్వామి ఆదేశంతోనేమో నాలుగవ ఆవృతిని "కోటిహనుమాన్ చాలీసా" పారాయణం జరిపి అష్టోత్తర శతకుండీయ[108] హనుమత్ రక్షాయాగంగా హనుమజ్జయంతి మరుసటిరోజు may 16 na జరపాలనే ప్రేరణగా ఆజ్ఞదయచేయబడింది . ఈమహత్తర కార్యక్రమం ఉడత వంటి ,నా చేత జరుగుతుందా ? ఎన్నడుకాదు. కనుకనే హనుమత్ పరివారం అంతా అండగా నిలబడుతుంది ....స్వామి భక్తులంతా తరలివచ్చి తలోవైపునా నిలుచుని మహావైభవంగా జరుపుతారనే సంకేతాలు అందుతున్నందున సాహసం చేసి మన అందరి తరపున ఈకార్యక్రమానికి సిద్దమవుతున్నాము.
ఇప్పుడు భూమిపై జరగనున్న ప్రమాదాలనుండి భక్తులు రక్షింపబడుటకై స్వామి అనుగ్రహం వేడుతూ కొనసాగే ఈ యాగానికి మీరందరూ పెద్దలే . ప్రతి ఒక్కరూ [ప్రతికుటుంబం]నుండి వెయ్యిన్నెనిమిది చాలీసాపారాయణములకు తగ్గకూండా చేసి అంత సంఖ్యలో రామనామం లిఖించి అందచేయటమేకాక మరో పదిమంది భక్తులచే పారాయణం చేపించి కార్యకర్తలుగా కూడా సాధనచేయవలసినదిగా మనవి. పూర్వం ఇంట్లో కొబ్బరికాయ దేవునికి నివేదన చేసుకుని తాము ప్రసాదంగా తీసుకొనుటయేగాక దానిని వీధిలోకొచ్చి పదిమందికీ పంచే వారు పెద్దలు . ఇదే నీతినీ మన సాధనారీతిగా మలచుకుంటూ ఈ కార్యక్రమం సాగిద్దాం . . సాధనలోపాల్గొనే భక్తులకు వలసిన లిఖిత,పారాయణ ప్రతులను అందజేయుటకు ఇంకా ఇంటర్ నెట్ లోంఛి డౌన్ లోడ్ చేసుకొనుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. వివిధ భక్తసమాజములు, సత్సంగములు,పాఠశాలలు,కళాశాలలో విద్యార్థులను కూడా ఈకార్యక్రమంలో సాధకులుగా మేళవిమ్చుకొను మార్గములు రూపకల్పనజరుగుతున్నవి.
ఇందులో పాల్గొను ప్రతి భక్తుని పేరునా అర్చన,హోమములో ఆహుతులివ్వబడి యాగానంతరం అత్యంతశక్తిపూరి తములైన "హనుమద్రక్షలు " యాగంలో పాల్గొన్న భక్తులు ఎక్కడ ఉన్నా వారికందజేయు కార్యక్రమం రూపొందించబడుతున్నది .

ఇక స్వామి పరివారంగా మారి మీరు ఈయాగానికి కార్యకర్తలై ముందుకుసాగాలి . ఇందుకోసం మీరున్న ప్రాంతాన్నే కార్యక్షేత్రంగా ఎన్నుకుని స్వామికార్యాన్ని సాధించాలి. అనుమానంలేదు హనుమ అనుగ్రహం మనపై పరిపూర్ణంగా వర్షించనుంది .తరలిరండి మెయిల్ ,లేదా ఫోన్ ద్వారా మీ సంసిధ్ధతను తెలియపరచండి.
జైశ్రీరాం .

down load

https://docs.google.com/viewer?pid=explorer&srcid=1z1hXva7Yaa9GnsmLnn8C5kPSFmLn82bNAgrjFxsGir2tMHwnzA9CMZRkhcv3&chrome=true&docid=22fd6191444f71fb14485a5df85bee27%7C061c96bdd24cf7ddf4244b285a84a6fa&a=bi&pagenumber=1&w=800



https://docs.google.com/viewer?pid=explorer&srcid=1z1hXva7Yaa9GnsmLnn8C5kPSFmLn82bNAgrjFxsGir2tMHwnzA9CMZRkhcv3&chrome=true&docid=22fd6191444f71fb14485a5df85bee27%7C061c96bdd24cf7ddf4244b285a84a6fa&a=bi&pagenumber=2&w=800





మంగళాశాసనములు


శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య భారతీతీర్థ మాహాస్వాములవారు శృంగేరీ పీఠం

శ్రీశ్రీశ్రీ మాతా అంజనీదేవి వారు [రాధామహాలక్ష్మీ ఆశ్రమం . బృందావనం ,యు,పి]
శ్రీశ్రీ కాలజ్ఞాన ప్రదాత వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ..పీఠాధిపతులవారు ... కందిమల్లయపల్లె
శ్రీశ్రీ మాతా ఈశ్వరాంబ పీఠాధిపతులు ..శివకుమారస్వామివారు కందిమల్లయపల్లె
బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు ప్రముఖ హనుమదుపాసకులు [చీరాల]
శ్రీశ్రీ శివస్వామి వారు శైవక్షేత్రం .తాళ్లాయపాలెం .



మంత్రాంగం మరియుమంత్రభాగం

----------

శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు[హైదరాబాద్]
శ్రీచల్లాజయదేవ్ గారు[చెన్నై]
శ్రీ సత్యన్నారాయణ శర్మ గారు [గుంటూరు]
శ్రీ గోపాలకృష్ణమూర్తి భట్టు గారు[చేజర్ల]
శ్రీనాగేంద్ర కుమార్ అయ్యంగారి గారు [హైదరాబాద్]
శ్రీ రాజశేఖరుని విజయశర్మగారు[హైదరాబాద్]
దుర్గేశ్వర [శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం]


క్షేత్ర సాధన
శ్రీ రమణాచార్యులు గారు [శ్రీవేంకటేశ్వస్వామి దేవస్థానం గోరంట్ల ,గుంటూరు]
శ్రీ రామాచార్యులుగారు [విజయవాడ]
శ్రీ గోపిశర్మసిద్దాంతి గారు [పెద్దాపురం ]
శ్రీ ముక్కామల వెంకట్రామయ్యగారు [తణుకు]
శ్రీ పేరిశాస్త్రి గారు [ గాయత్రీ పరివార్] కామేపల్లి
శ్రీ మహమ్మద్ ఖాన్ [శ్రీరాం] గారు [గాయత్రీ పరివార్] తెనాలి
శ్రీ సుదర్శనాచార్యులు గారు [గమిడి ఆంజనేయస్వామి దేవళం ]వినుకొండ
శ్రీ రాఘవాచార్యులు గారు [మదమంచిపాడు వీరాంజనేయస్వామి దేవస్థానం]
చిక్కాల రామారావుగారు [దత్తపీఠం ...ముక్కెళ్ళపాడు]


సమన్వయవిభాగం
------------------

చెనికల మనోహర్ [బెంగళూర్]
చింతలపాటి శ్రీకృష్ణ [ముంబాయి]
సునీల్ వైద్యభూషణ్ [చెన్నై]
మోహన్ కిశోర్ [గుర్గావ్]
రామరాజుభాస్కర్ గారు [అమెరికా]

అంతర్జాల & పౌరసంబంధాల విభాగం
--------------
మేడం రామిరెడ్డి గారు [అమెరికా]
వేలంకిని భరద్వాజ గారు[అమెరికా]
బి, శ్రీనివాసరావు గారు [నెల్లూరు]
dr,కౌటిల్య [గుంటూరు]
సూరె కృష్ణారావు గారు [గిద్దలూరు]


పారాయణ పర్యవేక్షణా విభాగం
-------------------

నాగప్రసాద్ [ఇడుపులపాయ]
జనార్ధన శర్మ గారు [హైదరాబాద్]
చిలమకూరు విజయమోహన్ గారు [తాడిపత్రి]
శరత్ పండా [విశాఖపట్టణం ] ఒరియా విభాగం
ఎల్. అంజిరెడ్డి గారు[ రవ్వవరం]
కోటేశ్వరరావు గారు [దరిశి]
సత్యన్నారాయణరెడ్డిగారు [నరసరావుపేట]
కె.శ్రీనివాసరావుగారు [కురిచేడు]

శాంతమ్మ గారు [వినుకొండ]
సురేష్ గారు [కదిరి]
సుంకర శ్రీనివాసరావుగారు [ ఒంగోలు]
గోరంట్లయ్య గారు [గిద్దలూరు]
జొన్నాభట్ల ఉగ్రకుమార్ గారు [నూజండ్ల]
శ్రీ త్రినాథశర్మగారు తణుకు
యనమదల చిరంజీవి [ముప్పాళ్ల]
అంజయ్య నాయక్ [రా.పా. తండా]
షేక్ హుస్సేన్ [రవ్వవరం]
బి. మాలకొండా రెడ్డి [విజయవాడ]
శ్రీమతి రత్నజ్యోతి [పూనే]
శ్రీమతి శశిరేఖ గారు [చెన్నై]
రమణారెడ్డి [ కొత్తపాలెం]
ఏసురాజు గారు [మాష్టిన్ కాలనీ]వినుకొండ



సాంకేతిక విభాగం
----------------
శ్రీమతి జ్యోతి గారు [హైదరాబాద్]
నాగమురారి గారు [హైదరాబాద్]
వేణుగోపాలరెడ్డి గారు[దాచేపల్లి]
శ్రీధర్ నల్లమోతు [కంప్యూటర్ ఎరా]
g ఏడుకొండలు


పత్రికా సంబంధాల విభాగం
---------------


మందపాటి ఆచారి [సాక్షి]
శ్రీరామనేని హనుమంతరావు[ఈనాడు]
నమశ్శివాయ [ఆంధ్రభూమి]
వెంకటరెడ్డి [ ఆంధ్రజ్యోతి]
న్యూ ఆవకాయ.కామ్
ఐ,వెంకటేశ్వర్లు గారు webdunia.com


సేవాకైంకర్య విభాగం

-----------

దుర్గేశ్వర ..........శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం
బి ,కృష్ణ


బి,యశోరామ
బి.పవనకుమార



ఆర్ధికనిర్వహణావిభాగం
-------------------
నారాయణ స్వామి గారు[ అమెరికా]
జి.శ్రీనివాసరెడ్డి గారు [ఒంగోలు]
అన్నా సుందరరావు గారు [ముక్కెళ్లపాడు]
తాతా గోపాలకృష్ణమూర్తిగారు వినుకొండ

ప్రదాసాల పంపిణీ విభాగం
బి. ప్రభాకర్ రెడ్డి పోస్ట్ మాస్టర్ [లక్ష్మీపురం]
సూరి [స్వాతి డ్రెసెస్ ] వినుకొండ
సేవాదళం
-------------
యరబోతు శ్రీకృష్ణదేవరాయలు [సత్యసాయి సమాజం ] [అమరావతి]
అన్నా సుబ్బారావు [ముక్కెళ్లపాడు]
ప్రభాకర రెడ్డి గారు [గణపతి సచ్చిదానంద జ్ఞానబోధసభ]
తిరుపతిరావు [ముతరాసువారి పాలెం]
సింగంశెట్టి ఆదిశేషయ్య [ముక్కెళ్లపాడు]
హిందూ పబ్లిక్ స్కూల్ పూర్వవిద్యార్ధులు



contact

durgeswara@gmail.com

9948235641

3 వ్యాఖ్యలు:

మోహన్ కిషోర్ నెమ్మలూరి December 29, 2011 at 10:02 AM  

శ్రీసీతారామచంద్రప్రభువు కీ జై.
శుభస్తు శీఘ్రం మాష్టారు.
చాలా బాగుంది, అయితే ఎప్పటి నుండి మొదలు పెట్టాలి ౧౦౦౮ చాలీసా పారాయణ?
మేము కూడా ఈ యాగంలో దూరం నుంచే పాల్గొంటాము.

Rajasekharuni Vijay Sharma December 30, 2011 at 1:13 AM  

చాలా మంచి కార్యక్రమం. దీనిలో నావంతు ప్రోత్సాహం కూడా తప్పక ఉంటుంది.

మీరు రాసిన "హనుమాన్ చాలీసా ఎలాపుట్టింది? ఎందుకోసం?"అన్న వ్యాసం చాలా బాగుంది.

http://durgeswara.blogspot.com/2008/08/blog-post_22.html

madhumarati December 30, 2011 at 7:33 AM  

స్వామి వారు కరుణామయుడు. మనం ఎన్ని తప్పులు చేసిన కరుణించి ఎన్నోనో అవకాశాలు ఇస్తున్నాడు. అలాంటి అవకాశమే మళ్లీ ఇచ్చాడు.
స్వామి వారె మన దగ్గరికి వస్తనన్నపుడు మనం వదులుకుంటే అంతకంటే పాపపు జన్మ ఇంకోటి వుండదు. ఇందులో నా వంతు క్రియను తప్పకుండ నిర్వహిస్తాను.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP