ఆహా ! అమ్మ కరుణ [ఇప్పుడే వచ్చిన మెయిల్]
>> Friday, December 16, 2011
అత్యంత అద్భుతంగానూ నయనానందం గాను ఉంది అండి అమ్మ. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు సదా కృతజ్ఞులం. నిన్న అమ్మకి పొద్దున్న పాలు తిరిగి మధ్యాన్నం పాలు సమర్పించాను అండి. నిత్యమూ చేస్తాను. నిన్న మటుకు రాత్రి వేళ ఎంతో ఆనందం కలిగింది. మా వారు విశాఖపట్నం లో దాదాపు ౧౫ సంవత్సరాల క్రితం ఒక చిన్న flat కొన్నారు. అది చూసుకోలేక అద్దెలు సరిగ్గా రాక ఇప్పుడు అది అమ్మివేసి ఇక్కడే ఇంకొకటి కొందాం అని అనుకున్నారు. ఇక్కడది ఒకటి నచ్చి ఆయన అడ్వాన్సు ఇచేసి reg. కూడా చేసేసారు. అక్కడది మాత్రం అమ్ముడు పోలేదు.
దానిని నమ్ముకునే ఇక్కడ కొనేసారు. అది అమ్మగా వచ్చిన డబ్బు వెంటనే ఇక్కడ పెట్టేద్దాం అని. కాని తీర చూస్తె అక్కడ ఆ ఇల్లు చిక్కులో పడింది. ఆది నుంచి చిక్కులే. అద్దెకి ఉన్నవారు సరిగా అద్దె ఇవ్వకుండా, ఖాళి చేయకుండా, అమ్మకానికి పెట్టిన తరువాత ఎవరన్న వస్తే చూడడానికి తలుపులు తీయకుండా నానా యాతన పెట్టారు. ఈయన ఏమో ఇక్కడ నుంచి అక్కడకి వెళ్ళలేరు.
ఇంతలో అమ్మవారి అనుగ్రహం ఒక మంచి వ్యక్తి రూపంలో వచ్చి అది కొనుక్కోడానికి ఒప్పుకున్నారు. ఆ వ్యక్తీ ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వారు. చాల సంతోషించి అంతా బానే ఉంది అనుకున్నాం. మా వారు బయలు దేరి విశాఖపట్నం వెళ్లారు మూడు రోజుల క్రితం. ఇంతలో ఆ documents అన్ని తప్పులు తప్పులు. ఇంక reg. అవ్వదు అని అనుకున్నాము. వాళ్ళు అన్ని తప్పులని సరి చేసి దానికి డబ్బులు అడిగి నిన్నటికి మార్చారు వాళ్ళు అక్కడ ఆఫీసు లో. చిక్కులు ఎలా వచ్చాయో అలానే విడిపోయాయి. నిన్న అంతా సవ్యంగా జరిగి reg. అయిపొయింది. మా వారు అక్కడనుంచి ఈ రోజు ఉదయం బయలుదేరారు. ఇదంతా అమ్మ ఆది నుండి దగ్గర ఉండి జరిపించిందా అని పదే పదే అనిపించింది. నిన్న గురువారం మార్గ శీర్ష మాసం అమ్మ ఇలా నిన్నటికి మార్చి రిజిస్ట్రేషన్ మా మీద కొన్న వారి మీద తన అనుగ్రహం కురిపించింది. అలానే ఇక్కడది కూడా సవ్యంగా అయి వారికి మరింత లక్ష్మి కటాక్షం కలగాలి ఇంట్లో ఉన్న కష్టాలు తీరాలి అని అమ్మని మనసార ప్రార్ధిస్తున్నాను.
మా తమ్ముడు కూడా మీకు పంపాడు అండి. మీ ఎకౌంటు ఒకసారి చూడమని మనవి.
నా పేరు లేకుండా మీ బ్లాగ్ లో పోస్ట్ చేయమని మనవి.
ప్రణామములు!
ఓసోదరి
0 వ్యాఖ్యలు:
Post a Comment