శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అయ్యా ! ఇలా కొత్త వ్రతవిధానాలు,పారాయణ గ్రంథాలు తయారుచెయ్యకండి దయచేసి.

>> Tuesday, December 13, 2011

ఈమధ్య నేను గమనిస్తున్న కొత్తవిషయమేమిటంటే కొత్తగా ఎవరికి వారు పారాయణగ్రంథాలు వ్రాయటం ,ఇంకా ఒకడుగు ముందుకేసి వ్రతవిధానాలు వ్రాసి జనం మీదకొదలటం . ఇక్కడ మనం నిర్మొహమాటంగా ఒకమాట చెప్పుకోవాలి.
నేను మొన్న హనుమద్వ్రతం చేసుకోదలచి నాదగ్గరున్న పుస్తకం ఎవరో తీసుకెళ్ళి తిరిగివ్వక పోవటం వలన ఇబ్బందిపడ్డాను . కొత్తపుస్తకంకోసం వినుకొండలో గుంటి ఆంజనేయస్వామివారి ఆలయ అర్చకులనడిగితే ఒక పుస్తకం పంపారు . తీరాపుస్తకం తెరచి చూద్దునుకదా !అంతా కొత్తగాఉంది . పూజావిధి,వ్రతకథలుకూడా . సరే దాన్నిపక్కనబెట్టి వ్రతం పూర్వపద్దతిలోనే ముగించుకుని తరువాత సదరు రచయితకు ఫోన్ నంబర్ పుస్తకంమీద ఉండటంతో నేను ఫోన్ చేశాను .
ఆయన పెద్దవారు ఏదో ప్రభుత్వసంస్థలో ఉద్యోగి . హనుమద్భక్తుడు.
అయ్యా ! మీరు వ్రాసిన హనుమత్ వ్రతం చూశాను .ఇది మీరుస్వంతగా వ్రాసినదిలాఉంది అనడిగాను.
అవునండి , స్వామి ప్రేరణతో నేనే ఈవ్రతవిధానాన్ని కూర్చాను చాలాసంతోషం మీరు చదివినందుకు అని ఏదో ఆయన గూర్చి చెప్పారు .
అయ్యా ! ప్రామాణికం గా మనకు హనుమత్ వ్రతవిధానం పరాశరమహర్షి విరచించి ఇచ్చినదుందికదా అనడిగాను.
ఆయనప్పటికీ విషయం అర్ధంచేసుకోక ఆయన రచనలగూర్చి చెప్పుకొచ్చారు.
సరే ! ఇక ఆయనతో వాదన అనవసరం కనుక నమస్కారం చెప్పి ఫోన్ పెట్టేశాను.

ఇక్కడ రచయితలు గమనించవలసిన అంశం ఒకటుంది . ఏదైనా పూజావిధానంగానీ ,లేదా వ్రతవిధానంకానీయండి వాటిని మహాసాధకులు పరమాత్మతో సన్నిహిత సంబంధం ఉన్నవాళ్లు తెలియజేస్తే,రూపకల్పనచేస్తే అవిశక్తివంతాలయి మానవులకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మన పూర్వఋషులు అటువంటి తపోసంపన్నులుకనుక వారిచ్చిన అర్చన,పూజావిధులు యుగాలుగడచినా శక్తివంతమయి ఇష్ట కామ్యాలను సిద్దింపజేస్తున్నాయి . కనుక అవి పరమ ప్రమాణం
ఇప్పుడేదో కొద్దిగా ఆథ్యాత్మిక మార్గంలో నడచినవారంతా మానాయనపాండిత్యం కొంత నాపైత్యం కొంత అని దాన్నీదీన్నీ రంగరించి కొత్తగా తయారుచేసి జనంమీదకొదలటంవలన మంచికంటే చెడుజరిగే ప్రమాదమే ఎక్కువని నాభావన . కాకుంటే ఉన్నదాన్ని సరళంగా విడమరచి అర్ధంకూడా చెప్పవచ్చు కాని కొత్తగా తాముతయారు చేసినవి ఇలా జనంలోకొచ్చి కలగాపులగమైపోయి చివరకు ఏదిప్రమాణమో ! అర్ధంకాక జనం వీటిమీద నమ్మకాన్ని కోల్పోయేలాచేసినందుకు ఆదోషాన్ని నెత్తి కెత్తుకున్నవారవుతారు .
ఉన్నవి చాలు .అందులోనూ అవి ప్రక్రుతినియమాలనుఆపోసనపట్టి వాటిని అనుసంధానిస్తూ శాస్త్రీయంగా ఋషులిచ్చిన సంపద . మనలా వాళ్ళు పుస్తకాలు ముద్రించుకుని దాతలపేర్లు తల్లిదండ్రులపేర్లు వ్రాసే స్థితినుంచి తయారయినవికాదు
మనకూ ఆఋషులకూ అక్కడే ఉంది పెద్దతేడా > అదిగమనించాలి రచయితలు .
నమస్కారములు

2 వ్యాఖ్యలు:

ఎందుకో ? ఏమో ! December 13, 2011 at 8:30 AM  

నిజమే నండీ! ఇట్లాంటి సమస్యే గతం నుంచీ కుడా ఉన్నది !!
శంకరా చార్యుల పేరిట చాలా మంది చాలా చాల గ్రంథాలను స్తోత్రాలను రచించారు
చివరికి ఏది అది శంకరుల విరచితమో, ఏది అభినవ శంకరుల విరచితమో తెలుసుకోవటం లో
తికమక ఏర్పడినది
మీ వ్యాసం లో ప్రామాణికత అనే మాటలో అర్థం అంతా దాగి ఉన్నాడని తోస్తున్నది
ధన్యవాదాలు
అవునండి మీ email id hack ఇయ్యింది అన్నారు
వెనక్కి పొందగాలిగారా? లేదా?

?!

uma maheswar sharma August 27, 2017 at 7:33 PM  

నిజమేసార్

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP