శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గ్రహణ సమయం అద్భుత అవకాశం...అతి చేసి జారవిడుచుకోవద్దు

>> Saturday, September 6, 2025

ఈ రోజు చంద్రగ్రహణం.పర్వదినం.కానీ సోషల్మీడియా ప్రభంజనంలో మనసును కలవరపెట్టే విధంగా రాశి ఫలితాలు..భక్తిమార్గాన్ని గాక భయాలను పెంచే ఉపన్యాసాలు వివిధ పరిష్కారాల వీడియోలు.ఎందుకింత అతి అర్ధం కావటం లేదు. గ్రహణ సమయంలో మనం చేయగలిగిన మంత్ర,నామ, స్తోత్ర జపాలు అద్భుత ఫలితాలనిస్తాయి. ఇక మనం భయపడితే ఆశ్రయించాల్సినది భగవంతుణ్ణి. అప్పుడు కూడా గ్రహణ సమయము ఎక్కువ ఫలితాలనిస్తుంది కదా.ఇప్పుడు మనసారా మీ ఇష్టదైవాన్ని ఈసమయంలో ప్రార్థిస్తే ఇక మీ భయాలేవీ మిగలవు.శుభఫలితాలు వెళ్ళి వెత్తుతాయి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు సాధనకు ఉపయోగించుకోవాలి గాని సందేహాలెందుకు? సాగుదాం ముందుకు..జై శ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP