శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇదేం గురుదక్షిణ?

>> Wednesday, March 30, 2011


గురుదక్షిణగా ఏకలవ్యుడి బొటనవేలును అడిగి తీసుకున్న ద్రోణుణ్ణి, ఇచ్చిన ఏకలవ్యుణ్ణి ఏమనాలి?
- జి. పాండు, నల్లగొండ

ఏమనడానికైనా ఎవరి కారణాలు వారికుంటాయి. ఒకసారి మహాభారత ఇతిహాసాన్ని చూద్దాం. హిరణ్యధన్వుడు అనే కోయదొర కుమారుడే ఏకలవ్యుడు. ద్రోణుడు కౌరవులు, పాండవులు, వృష్ణి వంశీయులైన యాదవులు, కర్ణుడు, తన విరోధి ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడు మొదలైన వారికి అస్త్రవిద్యలు నేర్పుతున్నప్పుడు ఏకలవ్యుడు అక్కడకు వచ్చి తనను కూడా శిష్యుడిగా స్వీకరించి అస్త్రవిద్యలు నేర్పమన్నాడు.

ద్రోణుడు ముందుచూపుతో అతడి అభ్యర్థనను తోసిపుచ్చి పంపేశాడు. ఒక లక్ష్యం ఉన్నవాడు కాబట్టి ఏకలవ్యుడు నిరాశపడలేదు. తండాలో తన గుడిసె ముందే ద్రోణాచార్యుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఆయన్ని గురువుగా ఆరాధిస్తూ విలువిద్యను స్వయంకృషితో నేర్చుకున్నాడు. మంచి విలుకాడయ్యాడు. ఒకరోజు వేటలో తన ఏకాగ్రతను భంగపరుస్తున్న ఒక కుక్కనోటిలో ఏడు బాణాల్ని నాటి దానికి ప్రాణాపాయం లేకుండా విడిచిపెట్టాడు. అది పాండవుల వేటకుక్క కావడంతో ఏకలవ్యుడి విషయం ద్రోణుడికి తెలిసింది.

తాను ప్రపంచంలోకల్లా ఉత్తమ విలుకాడుగా చెయ్యాలనుకున్న తన ప్రియశిష్యుడు అర్జునుణ్ణి తీసుకుని అడవిలో ఉన్న ఏకలవ్యుడి దగ్గరకు వస్తాడు ద్రోణుడు. అతని చేత పూజింపబడి అతడి బొటనవేలును గురుదక్షిణగా అడిగి తీసుకుని విలువిద్యలో అతడిని నిర్వీర్యుడిని చేస్తాడు. ఏకలవ్య చరిత్ర చూస్తేగాని త్రికాలజ్ఞుడైన ద్రోణుడు ఆ విధంగా ఎందుకు చేశాడో మనకు అర్థం కాదు. ఏకలవ్యుడు మహా విలుకాడు.

భవిష్యత్తులో అర్జునుడినే అంతమొందించగలవాడు. అతడు శ్రీకృష్ణుని విరోధి అయిన జరాసంధునితో స్నేహం చేస్తాడు. కృష్ణ జరాసంధ యుద్ధంలో తాను, తన పరివారంతో పాల్గొని దుష్టుల బలాన్ని పెంచుతాడు. ఇలాంటి చీడను మొదటే తీసివేస్తే సమాజానికి మేలే జరుగుతుందని ద్రోణుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏకలవ్యుడు తన పరోక్ష ఉత్తమ శిష్యుడైనా అతని అంగీకారంతో గురుదక్షిణను స్వీకరించాడు. ప్రపంచంలో ఏకలవ్యుని సాటి ఎవరూ లేరు. అతడు విద్యార్థి లోకానికి ధృవతార.
-ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ

Read more...

భగవంతుని వెదికే దారులు

>> Sunday, March 27, 2011

భగవంతుని వెదికే దారులు
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ
గవంతుడు ఉన్నాడా? ఉంటే కనబడతాడా? ఎప్పుడు కనబడతాడు? ఎవరికి కనబడతాడు? ఏం చేస్తే కనబడతాడు?- ఈ ప్రశ్నల పరంపర మానవజాతి పుట్టిన నాటినుంచి కొనసాగుతూ వస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలను వేదాలు సుందరంగా చెప్పాయి. వేదమంత్రద్రష్టలైన మహర్షులు వ్యాఖ్యానించి ఎన్నో గ్రంథాలు రాశారు. ప్రవక్తలు వేనోళ్ల ప్రవచించారు. అయినా మానవుల్లో కరడుగట్టిన అజ్ఞానం ఆ విషయాలను మరచిపోయేట్లు చేస్తోంది. ఏమీ తెలియని అసమర్థుల్లా మార్చివేస్తోంది. పాలతో కడిగితే బొగ్గు తెల్లబడుతుందా? అలాగే ఎంత ప్రక్షాళన చేసినా కరిగిపోకుండా ఘనీభవించిన అజ్ఞానానికి దాసుడైన మనిషికి జ్ఞానప్రబోధాలు అనుక్షణం అవసరమనే మాట యథార్థం.

భగవంతుణ్ని చూడటం అంటే తన గురించి తాను తెలుసుకోవడమే. దీనికి కొన్ని ప్రయత్నాలు అవసరమని మహర్షులు ప్రవచించారు. ఉన్నత విద్యల్లో ఆరితేరాలంటే ప్రాథమిక విద్యల్లో ముందుగా నిష్ణాతులు కావాలి. అక్షరాలు రానివారికి అంతరిక్ష విజ్ఞానాన్ని బోధపరచగలమా? అలాంటిదే బ్రహ్మవిద్య కూడా. 'బ్రహ్మం' అంటే భగవంతుడు కనుక, బ్రహ్మవిద్య అంటే భగవంతుణ్ని తెలిపే విద్య. ఈ విద్యను తెలుసుకోవడానికి నాలుగు దారులున్నాయని పెద్దలు చెప్పారు. అంటే, ఒక ఇంటి చిరునామాను కనుక్కోవడానికి ముందు ఆ ఇంటికి చేరే దారులను కనుక్కోవడం అన్నమాట.

మొదటిదారిలో వెళ్లడం అంటే- భగవంతుడు ఒక్కడే నిత్యుడు, శాశ్వతంగా ఉండేవాడు అని తెలుసుకోవడం. అంతేకాదు... భగవంతుడికి భిన్నమైనదంతా అనిత్యం, అంటే అశాశ్వతం అనీ గ్రహించడం. నిత్యం అంటే ఎంతకాలం గడచినా చెక్కు చెదరకుండా ఉండటమే. భగవంతుడు చేసిన సృష్టి ఎప్పటికో ఒకప్పటికి ప్రళయంలోకి జారుకొని అంతరిస్తుంది. కనుక సృష్టి అంతా అనిత్యమే. ఏది పుడుతుందో అది నశిస్తుంది. ఏది పుట్టదో అది నశించదు. అందుకే జీవకోటి నశిస్తుంది. భగవంతుడు నిత్యమై ఉంటాడు.

రెండోదారిలో వెళ్లడం అంటే, మనిషి అనుభవిస్తున్న భౌతికసుఖాలకు సంబంధించిన సామగ్రి అంతా ఎప్పటికైనా నశించిపోయేదే అని తెలుసుకోవడం. యజ్ఞయాగాలు, తపస్సులు, దానాలు చేసి సంపాదించుకొన్న పుణ్యంతో స్వర్గానికి వెళ్లి పారలౌకిక సుఖాలను పొందినా- అవీ ఒకనాటికి నశించిపోయేవే అని తెలుసుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే- ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మనిషి పొందే సుఖాలు అశాశ్వతమైనవి అనే జ్ఞానం కలగడం. మూడోదారిలో వెళ్లడం అంటే- ఆకలి వేసినప్పుడు అన్నం కోసం, దాహం వేసినప్పుడు నీళ్ల కోసం ఎలా మనసు పరుగులు తీస్తుందో, అలాగే పరమార్థజ్ఞానాన్ని సంపాదించడం కోసం సద్బోధనలు వినడం, విన్నవాటిని మళ్లీమళ్లీ గుర్తు చేసుకోవడం, అలాంటి విషయాలపై మనసును నిలపడం. పనికిరాని దృశ్యాలను చూడకుండా కళ్లను, వ్యర్థ ప్రసంగాలు వినకుండా చెవులను, అసభ్య సంభాషణలు పలుకకుండా నోటినీ నియంత్రించుకోవడం. చలికీ గాలికీ ఎండకూ తట్టుకోగలగడం, దూషణ భూషణలకు ఏ మాత్రం చలించకుండా స్థిరంగా నిలవడం. వికారాలన్నీ శరీర ధర్మాలేగానీ ఆత్మకు వాటితో సంబంధంలేదని తెలుసుకోవడం. గురువులనూ, పూజ్యులనూ సేవించి, వారినుంచి జ్ఞానాన్ని పొందడం.

నాలుగో దారిలో ప్రయాణించడం అంటే- అజ్ఞానం వలన కలిగే సాంసారిక బాధలను జ్ఞానసాధన ద్వారా అధిగమించడం. అంటే మనిషికి అతని జీవితంలో కలిగే కష్టసుఖాలు క్షణికాలనీ, అవి నిరంతరం వస్తూ పోతూ ఉంటాయేగానీ, స్థిరంగా ఉండవనీ చక్కగా గ్రహించగలగడం. ఈ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు మనసు చలించకుండాఉంటుంది. అప్పుడు అన్నింటికీ అతీతమైన స్థితి లభిస్తుంది. అన్ని బంధాల నుంచి మనిషి విముక్తుడవుతాడు. అదే భగవంతుని సాక్షాత్కారం. అలాంటి అనుభూతిని పొందినవాడు సామాన్యజీవుడైనా దేవుడే అవుతాడు.



Read more...

అసలైన ఆయుధాలు


- కిల్లాన మోహన్‌బాబు
త్మరక్షణ కోసం ఆయుధాలు ధరించడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. ఆయుధం పట్టని దేవుళ్లు మన పురాణాల్లో అరుదుగా కనిపిస్తారు. వివేకం, విచక్షణ కలిగినవారే ఆయుధాలను సమయోచితంగా ప్రయోగిస్తారు. ఆటవికయుగం నాటి కత్తులు, బల్లాల నుంచి ఆధునిక అణ్వస్త్రాల వరకు అన్నీ... ప్రమాదకరమైనవే. ప్రపంచాధిపత్యం కోసం అతి భయంకరమైన మారణాయుధాలు తమ వద్ద ఉన్నాయని బెదిరించడం వరకే అవి పనికొస్తాయి. తొందరపడి చేసే ప్రయోగం 'భస్మాసుర హస్తం' అవుతుందన్న భయం వారికుండటం సహజం. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన వినాశనం ఇప్పటికీ చేదుగుర్తుగా మానవాళిని వెంటాడుతూనే ఉంది.

ఆయుధ ధారణ గురించి రామాయణంలో వనవాస దీక్షలో ఉన్న సీత దండకారణ్యం దారిలో రాముడికి రసరమ్యంగా వివరిస్తుంది. మనిషికి అత్యంత ప్రమాదకరమైన వ్యసనాలు మూడున్నాయనీ... అవి అసత్యవాక్యం, పరస్త్రీ గమనం, అకారణ హింసగా ఆమె వర్ణిస్తుంది. 'రామా, నీవు మొదటి రెండూ ఎరుగవు. మూడోది, పరుల ప్రాణాలు తియ్యడం. అజ్ఞానంవల్ల పామరులు ఈ పని చేస్తారు. సర్వశాస్త్రాలు తెలిసిన నీవంటివాడు ఇలా హింసకు పాల్పడటం సమర్థనీయమా?' అని ప్రశ్నిస్తుంది. అంతటితో ఆగక, గతంలో పరమ భాగవతోత్తముడైన ఒక ముని ఘోర తపస్సును భంగం చేయడానికి దేవేంద్రుడు ఎలా ఈ ఆయుధాన్ని ఉపయోగించుకున్నాడన్న కథ ఒకటి చెబుతుంది. సత్యభాషి, ధర్మపరాయణుడైన ఓ ముని దృఢదీక్షతో అరణ్యంలో ఎనలేని ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అది సహించలేని దేవేంద్రుడు వేటగాడి రూపంలో వచ్చి 'మహాత్మా, నేను కార్యార్థినై దూరతీరం వెళ్తున్నాను. పదునైన ఈ ఖడ్గాన్ని మీ వద్ద భద్రంగా ఉంచండి. మళ్లీ వచ్చి తీసుకుంటాను' అని నమ్మబలుకుతాడు.

ఆ ముని, ఖడ్గాన్ని తన ఆశ్రమంలో ఉంచుతాడు. అడవిలోకి వెళ్లేటప్పుడు తనతో ఆ కత్తిని కూడా తీసుకెళ్ళేవాడు. కొన్నాళ్లు పోయాక ఆ ఖడ్గంతో జంతువులను, ఆపై మనుషులనూ చంపడం ప్రారంభించి ఘోరకృత్యాలు చేసి భ్రష్టుడవుతాడు. ఇదంతా అతడి దగ్గరున్న ఆయుధం వల్లనే జరిగిందని సీతామాత చెబుతుంది. దానికి రాముడు బదులిస్తూ శిష్టరక్షణ కోసం దుష్టశిక్షణ అనివార్యమని అంటాడు. తన లక్ష్యసాధనలో రాక్షస సంహారం తప్పదని పేర్కొంటాడు. 'కరణేషు మంత్రి'గా ఈ సలహా చాలా గొప్పగా ఉందనీ ఆమెను అభినందిస్తాడు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం వంటి లక్షణాలున్న వ్యక్తికి అపజయమన్నదే లేదని రాముడు అభిప్రాయపడతాడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసల వల్లనే చిరకాల యశస్సు పొందగలమనీ, మన వ్యక్తిత్వ రక్షణకు అవే 'అసలైన ఆయుధాలు'గా రఘురాముడు వివరిస్తాడు.

Read more...

సుప్రభాతంలో ఈ వర్ణన ఏమిటి?

>> Friday, March 25, 2011


శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో అశ్లీలం ఉందట. మరి దాన్ని ఎందుకు టీవీలు, రేడియోల్లో ప్రసారం చేస్తున్నారు?
- శ్రీరాపు శ్రీనివాసరావు, శృంగవరపుకోట.

మన పూర్వీకులు కావ్య ప్రబంధాల్లో ఆరు రుతువుల వర్ణనలతో పాటు, నవరసాల మేళవింపు కూడా తగుమాత్రంగా ఉండడం ఒక శాస్త్ర మర్యాదగా ఉండేది. ఈ సత్సంప్రదాయాన్ని బట్టే శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనాల్లో మూడు శ్లోకాల్లో మాత్రమే అమ్మవారి, స్వామివారి లావణ్య, సౌందర్య ప్రస్తావన వచ్చింది. అతి కొద్దిమంది మాత్రం బూతుగా వేలెత్తి చూపే 'కమలా కుచ చూచుక కుంకుమతో' అనే శ్లోక పాదం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలోనిది కాదు. అది శ్రీ వేంకటేశ్వర స్తోత్రంలోనిది.

కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే
అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క చనుమొనలపై గల కుంకుమతో ఎల్లప్పుడూ ఎర్రగా ఉండే అందమైన నీలదేహం కలవాడా! తామర రేకుల వలే విశాలములైన కన్నులు కలవాడా! లోకప్రభూ! వేంకటేశ్వరా! నీకు విజమగుగాక! అని అర్థం. దయా స్వరూపిణి అయిన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్వామి వక్షస్థలంలోనే ఉంటూ లోక రక్షణకై స్వామిలోని కల్యాణ గుణాలను ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఇక బూతుగా భ్రమపడే మరొక శ్లోకపాదం శ్రీ వేంకటేశ్వర ప్రపత్తిలోకి వస్తుంది.

'మాతుస్తనా వివశిశోరమృతాయ మానౌ' అంటే శ్రీ వేంకటేశ్వరా! బిడ్డకు తొలిగా తెలిసే తల్లి స్థనముల వలే అమృత తుల్యములుగా ఉన్న నీ పాదములనా శరణు పొందుతున్నాను అని అర్థం. ఈ రెండింటి అర్థాలు చూశారు కదూ? వీటిలో బూతు ఎంత ఉన్నదో మీకే అర్థం అవుతుంది. ప్రపంచంలో ఎందరో, ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు.

వినదగునెవ్వరు చెప్పిన.. అన్నీ వినండి. కానీ అన్నీ తలకు ఎక్కించుకోకండి. మీ వివేకానికి పదును పెట్టండి. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం మున్నగు స్తోత్రాలు ప్రమోదాన్ని, ప్రశాంతతను ఇచ్చే పవిత్ర స్తోత్రాలుగా భావిస్తాం. వీటి గురించి విపరీతార్థాలు తీసేకంటే నడివీథుల్లో జరుగుతున్న దుర్మార్గాలను అటకట్టించేందుకు ప్రయత్నిద్దాం. మన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడదాం.
- ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ

Read more...

మహాభారతం యదార్థమా ? కల్పితమా ? [రెండవభాగం]

>> Wednesday, March 23, 2011

కానీ మనం మర్చిపోయినది ఏమిటంటే-- మిగితా దేశాలలో లేకపోవచ్చుని గానీ, భారతదేశంలో పదార్థజ్ఞానం ఏనాటి నుంచో వుంది. ఆనాడు ఇనుముతో మనవారు చేసిన గారడీలు ఈ నాటికీ అంతుపట్టనివి అని నిరూపించడానికి కుతుబ్ మినార్ ముందునున్న-- ఆరున్నర టన్నుల బరువుతో, 22 అడుగుల ఎత్తున్న-- ఉక్కు స్థంభమే సాక్షం. క్రీ.పూ. 300 సంవత్సరంలో చెయ్యబడ్డ ఈ ధ్వజస్థంభం ఎన్నో శతాబ్ధాలుగా, ఆలయాలను విధ్వంసంచేసిన అనేక ముస్లిముల దాడులను సైతం లెక్కచెయ్యకుండా, కనీసం తుప్పైనా కూడా పట్టకుండా ఎదురు నిలిచింది.

అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చెయ్యగలిగారు గాని, ఆ స్థంభాన్ని మిగల్చక తప్పిట్లు లేదు. మరి అటువంటి చెక్కు చెదరని ఉక్కుని మనవారు ఎలా చేసి వుంటారు? ఏ పశ్చిమ దేశస్తుడికి తెలుసునట, ఆ కాలంలో మనకు నేర్పివుండటానికి ? ఏది ఏమైనా అంత పరిజ్ఞానం సాధించారు అంటే, మనకు ఆ రోజుల్లోని పదార్థజ్ఞానం చాలా ఎక్కువే అని తెలుసుకోవచ్చు. అంటే భారత కాలానికే మన దగ్గర ఇనుము వుందా అన్నది, ఒక అసందర్భ ప్రశ్న కావొచ్చును. “అంత పరిజ్ఞానం సాధించిన మనవారికి, మిస్సైల్స్ వంటి ఆయుధాల (అస్త్రాల) తయారీలో ఇనుము అవసరమే రాలేదా?”, అన్నది సరైన ప్రశ్న అవుతుంది. అంటే, దివ్యాస్త్రాలలో మనకు తెలియని మరేమైనా దివ్యపదార్థాలను వారు వాడి వుండే ఆస్కారం వుందా?

ఆస్కారం వుంది! అని చెబుతోంది భరద్వాజముని వ్రాసిన వైమానిక శాస్త్రం కూడా! అందులో చెప్పబడిన అనేక పదార్థాలలో ఏ పదార్థం కూడా, ఈనాడు మనకు అర్థం కాదు. అందులో చెప్పబడిన ఏ విమానంలోని టెక్నాలజీ కూడా మనకు బోధపడదు. అందులో వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనవారు, జర్మనులు ఎంత విశ్లేషించినా ఇప్పటికి అంతు పట్టడం లేదు. అంటే ఆనాటి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మనకు అర్థం కావడం లేదనేగా అర్థం!

1)

5. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ (WMD):

సరే మహాభారతం క్రీ.పూ 3100లోనో లేకపోతే క్రీపూ 1000 లోనో జరిగింది ఒప్పుకుంటాం. కానీ అప్పుడు అంత పెద్ద మహాయుద్ధమే జరిగితే, అందులో పాశుపతాస్త్రము, బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము వంటి అనేక దివ్యాస్త్రాలు వాడితే, వాటి అవశేషాలు ఏవి? అన్నదే చివరికి మిగిలిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన అన్వేషణ పూర్తయ్యినట్లే. ఆ రోజుల్లో అణ్వస్త్రాల వంటివి వాడినా, ఇప్పుడు ఇన్ని వేల ఏళ్ళయ్యిన తరువాత, త్రవ్వకాలలో ఏమి అవశేషంగా మిగిలి కనిపించాలో నిజంగా మనకు తెలియదు. ఒక వేళ అణుశక్తినే వాడితే, దాని తాలూకు రేడియేషనులు వుండాలిగా అనొచ్చు. కానీ, అది 5వేల సంవత్సరాలు భూమిలో కప్పెట్టబడిన తరువాత కూడా వస్తుందో లేదో తెలియదు. వచ్చినా, అసలు ఆనాడు వాడినది అణుశక్తో కాదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనకు తెలియని, అర్థంకాని శక్తి స్వరూపాలు ఇంకా మరెన్నో వున్నాయి.

ఉదాహరణకు మొదట్లో మనం చెప్పుకున్న యాంటీ మాటర్ గురించి మనకి ఇంకా ఏమి అవగాహనే లేదు. ఈ నవంబర్ 19వ తారీఖున జెనీవాలో యాంటీ యాటముని ఒక సెకనులో పదవ వంతు పాటు కాలం వరకు నిలప గలిగారని ప్రకటించారు. అది నేటి విజ్ఞాన రంగం అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయి కావొచ్చు. అయినా ఆ శక్తిరూపాన్ని స్పృశించడానికి, పరిక్షించడానికి, ఇంకా మరెన్నో సంవత్సరాలు పడుతుంది. అలాగే “డార్క్ మాటర్” , “డార్క్ ఎనర్జీ” అన్నవి ఇంకా కాన్సెప్టులే గానీ, వాటి గురించి మనకేమీ తెలియదు. ఇప్పుడప్పుడే తెలియక పోవచ్చు కూడా! ఇలా మన ఊహకి అందని ఎన్ని రకాల శక్తి రూపాలు ఎన్ని వున్నాయో? వీటిని ప్రయోగించిన తరువాత అసలు అవశేషాలు ఏమైనా మిగులుతాయో లేదో? మహాభారతంలో అసలు ఏ ఏ శక్తులని ప్రయోగించారో?

మనకు తెలిసిన ఒక్క మిస్సైల్ని పట్టుకొని, అదే దివ్యస్తామయి వుండొచ్చని, మనమే అనుకుని, అవి దొరకలేదు కాబట్టి ఆ మహాసంగ్రామం జరగలేదని చెప్పడం సబబేనా? ఏదో కాకతాళీయంగా ఒక కొత్త సాక్ష్యం మన చేతిలో పడాలి! అది కూడా అర్థం అవ్వాలి! అంతే కాదు ఆ సాక్షం చేతిలో పడడాని కంటే ముందే, దాన్ని అర్థం చేసుకోడానికి తగిన విజ్ఞానసామర్ధ్యం కూడా అభివృద్ధిచెంది, సమయానికి అందుబాటులో వుండాలి. అప్పుడు గానీ ఈ పజిల్‌కి ముక్తి లేదు. లేకపోతె ముందు చెప్పుకున్నట్లుగా, మనం చూసిన సూర్యుడు ఆరంగుళాల చిన్న చక్రమే అనేటువంటి వాదనల లోకి దిగే ప్రమాదం మిగుల్తుంది.

కాలక్రమేణా అన్ని తప్పక తెలుసుకోగలుగుతాము. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ద్వాపర యుగంలో జరిగింది. అంటే కనీసం 5000 సంవత్సరాల క్రితం నాటి మాట. ఆనాటి భౌగోళిక పరిస్థితులు మనకు తెలియవు. యుగాంతంలో జరిగే భోగోళిక ప్రక్రియలు, ప్రకృతిలోని మార్పులు, వాటి ప్రభావాలూ మనకింకా అర్థం అయ్యి వుండకపోవచ్చు. ఆ పరిస్థితులలో మనం వెతికే సాక్షాలు ఒక వేళ వున్నా, అవి భూగర్భంలోనో, కాలగర్భంలోనో ఎక్కడ, ఏరకంగా, ఎందుకు కలిసిపోయాయో అన్నది -- ఈనాడు మన ఊహకు అందని విషయం.

భోగోళిక మార్పుల వల్లనో, లేకపొతే మరేమైనా వేరే కారణాల వల్లనో ఏమో – త్రవ్వకాలలో క్రీ.పూ. 3000నాటి సింధూ లోయ నాగరికతకు నుంచీ, దాని తరువాత మళ్ళీ క్రీ.పూ 300 సంవత్సరపు మౌర్యుల నాగరికత దాకా మద్య Cultural continuity కనపడలేదు. ఆ మద్య కాలంలోని చరిత్రపై కూడా మనకు పెద్దగా ఆధారాలేమీ లేవు. అవగాహనా లేదు. భోగోళిక మార్పులు జరిగి, ఆనాటి అధారాలు నశించి వుండి వుండవచ్చు నేమో అని అనడానికి ఇది (The absence of Cultural continuity) ఒక చిన్న ఆధారం. ఇలా, కురుక్షేత్రయుద్ధం కల్పితం కాదనీ, అది చారిత్రాత్మకమేనని, ఈ మూడు భాగాల విశ్లేషణ వల్ల నిర్థారించవచ్చును. ఇక మనకు నిర్థారణ కాని విషయాలు – ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ ఆయుధాలతో జరిగింది? అన్నవే.

అలనాటి నాగరికత నేటి నాగరికత కన్నా మహోన్నతమైనది; వారి జ్ఞానం మనకన్నా ఎన్నో రెట్లు గొప్పది; కానీ కురుక్షేత్ర మహాసంగ్రామం వల్లనో , యుగాంతం వల్లనో ఎందరో చనిపోయి, వార్ల నాగరికతలు సమూలంగా నాశనమయ్యి, కాలక్రమేణా ఆ విజ్ఞానం సాంతం నశించిపోయి వుండవచ్చు. అందుకే మనం మరిన్ని ఆధారాలకై వెతుకుతూనే వుండాలి ; వెతికి అందరికి అర్థమయ్యేలా చూపించి, అందరి ఆమోదాన్నీ అందుకోవాలి. ఒక భారతీయునిగా అది మన బాధ్యత! అది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాకపోవచ్చు. ఎన్నో వేల సంవత్స్రాల చరిత్ర కలిగినది మన సంస్కృతి. ఎంతో సనాతనమైనది మన ధర్మం. నిరూపించడానికి చాలా సమయం పట్టొచ్చు. అయినా నిరాశ పడకుండా ప్రయత్నిద్దాం.

భారతీయులమైన మనం -- మన భారతాన్నయినా అర్థం చేసుకుందాం!

Read more...

మహాభారతం యదార్థమా ? కల్పితమా ? [రెండవభాగం]

కానీ మనం మర్చిపోయినది ఏమిటంటే-- మిగితా దేశాలలో లేకపోవచ్చుని గానీ, భారతదేశంలో పదార్థజ్ఞానం ఏనాటి నుంచో వుంది. ఆనాడు ఇనుముతో మనవారు చేసిన గారడీలు ఈ నాటికీ అంతుపట్టనివి అని నిరూపించడానికి కుతుబ్ మినార్ ముందునున్న-- ఆరున్నర టన్నుల బరువుతో, 22 అడుగుల ఎత్తున్న-- ఉక్కు స్థంభమే సాక్షం. క్రీ.పూ. 300 సంవత్సరంలో చెయ్యబడ్డ ఈ ధ్వజస్థంభం ఎన్నో శతాబ్ధాలుగా, ఆలయాలను విధ్వంసంచేసిన అనేక ముస్లిముల దాడులను సైతం లెక్కచెయ్యకుండా, కనీసం తుప్పైనా కూడా పట్టకుండా ఎదురు నిలిచింది.

అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చెయ్యగలిగారు గాని, ఆ స్థంభాన్ని మిగల్చక తప్పిట్లు లేదు. మరి అటువంటి చెక్కు చెదరని ఉక్కుని మనవారు ఎలా చేసి వుంటారు? ఏ పశ్చిమ దేశస్తుడికి తెలుసునట, ఆ కాలంలో మనకు నేర్పివుండటానికి ? ఏది ఏమైనా అంత పరిజ్ఞానం సాధించారు అంటే, మనకు ఆ రోజుల్లోని పదార్థజ్ఞానం చాలా ఎక్కువే అని తెలుసుకోవచ్చు. అంటే భారత కాలానికే మన దగ్గర ఇనుము వుందా అన్నది, ఒక అసందర్భ ప్రశ్న కావొచ్చును. “అంత పరిజ్ఞానం సాధించిన మనవారికి, మిస్సైల్స్ వంటి ఆయుధాల (అస్త్రాల) తయారీలో ఇనుము అవసరమే రాలేదా?”, అన్నది సరైన ప్రశ్న అవుతుంది. అంటే, దివ్యాస్త్రాలలో మనకు తెలియని మరేమైనా దివ్యపదార్థాలను వారు వాడి వుండే ఆస్కారం వుందా?

ఆస్కారం వుంది! అని చెబుతోంది భరద్వాజముని వ్రాసిన వైమానిక శాస్త్రం కూడా! అందులో చెప్పబడిన అనేక పదార్థాలలో ఏ పదార్థం కూడా, ఈనాడు మనకు అర్థం కాదు. అందులో చెప్పబడిన ఏ విమానంలోని టెక్నాలజీ కూడా మనకు బోధపడదు. అందులో వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనవారు, జర్మనులు ఎంత విశ్లేషించినా ఇప్పటికి అంతు పట్టడం లేదు. అంటే ఆనాటి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మనకు అర్థం కావడం లేదనేగా అర్థం!

1)

5. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ (WMD):

సరే మహాభారతం క్రీ.పూ 3100లోనో లేకపోతే క్రీపూ 1000 లోనో జరిగింది ఒప్పుకుంటాం. కానీ అప్పుడు అంత పెద్ద మహాయుద్ధమే జరిగితే, అందులో పాశుపతాస్త్రము, బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము వంటి అనేక దివ్యాస్త్రాలు వాడితే, వాటి అవశేషాలు ఏవి? అన్నదే చివరికి మిగిలిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన అన్వేషణ పూర్తయ్యినట్లే. ఆ రోజుల్లో అణ్వస్త్రాల వంటివి వాడినా, ఇప్పుడు ఇన్ని వేల ఏళ్ళయ్యిన తరువాత, త్రవ్వకాలలో ఏమి అవశేషంగా మిగిలి కనిపించాలో నిజంగా మనకు తెలియదు. ఒక వేళ అణుశక్తినే వాడితే, దాని తాలూకు రేడియేషనులు వుండాలిగా అనొచ్చు. కానీ, అది 5వేల సంవత్సరాలు భూమిలో కప్పెట్టబడిన తరువాత కూడా వస్తుందో లేదో తెలియదు. వచ్చినా, అసలు ఆనాడు వాడినది అణుశక్తో కాదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనకు తెలియని, అర్థంకాని శక్తి స్వరూపాలు ఇంకా మరెన్నో వున్నాయి.

ఉదాహరణకు మొదట్లో మనం చెప్పుకున్న యాంటీ మాటర్ గురించి మనకి ఇంకా ఏమి అవగాహనే లేదు. ఈ నవంబర్ 19వ తారీఖున జెనీవాలో యాంటీ యాటముని ఒక సెకనులో పదవ వంతు పాటు కాలం వరకు నిలప గలిగారని ప్రకటించారు. అది నేటి విజ్ఞాన రంగం అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయి కావొచ్చు. అయినా ఆ శక్తిరూపాన్ని స్పృశించడానికి, పరిక్షించడానికి, ఇంకా మరెన్నో సంవత్సరాలు పడుతుంది. అలాగే “డార్క్ మాటర్” , “డార్క్ ఎనర్జీ” అన్నవి ఇంకా కాన్సెప్టులే గానీ, వాటి గురించి మనకేమీ తెలియదు. ఇప్పుడప్పుడే తెలియక పోవచ్చు కూడా! ఇలా మన ఊహకి అందని ఎన్ని రకాల శక్తి రూపాలు ఎన్ని వున్నాయో? వీటిని ప్రయోగించిన తరువాత అసలు అవశేషాలు ఏమైనా మిగులుతాయో లేదో? మహాభారతంలో అసలు ఏ ఏ శక్తులని ప్రయోగించారో?

మనకు తెలిసిన ఒక్క మిస్సైల్ని పట్టుకొని, అదే దివ్యస్తామయి వుండొచ్చని, మనమే అనుకుని, అవి దొరకలేదు కాబట్టి ఆ మహాసంగ్రామం జరగలేదని చెప్పడం సబబేనా? ఏదో కాకతాళీయంగా ఒక కొత్త సాక్ష్యం మన చేతిలో పడాలి! అది కూడా అర్థం అవ్వాలి! అంతే కాదు ఆ సాక్షం చేతిలో పడడాని కంటే ముందే, దాన్ని అర్థం చేసుకోడానికి తగిన విజ్ఞానసామర్ధ్యం కూడా అభివృద్ధిచెంది, సమయానికి అందుబాటులో వుండాలి. అప్పుడు గానీ ఈ పజిల్‌కి ముక్తి లేదు. లేకపోతె ముందు చెప్పుకున్నట్లుగా, మనం చూసిన సూర్యుడు ఆరంగుళాల చిన్న చక్రమే అనేటువంటి వాదనల లోకి దిగే ప్రమాదం మిగుల్తుంది.

కాలక్రమేణా అన్ని తప్పక తెలుసుకోగలుగుతాము. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ద్వాపర యుగంలో జరిగింది. అంటే కనీసం 5000 సంవత్సరాల క్రితం నాటి మాట. ఆనాటి భౌగోళిక పరిస్థితులు మనకు తెలియవు. యుగాంతంలో జరిగే భోగోళిక ప్రక్రియలు, ప్రకృతిలోని మార్పులు, వాటి ప్రభావాలూ మనకింకా అర్థం అయ్యి వుండకపోవచ్చు. ఆ పరిస్థితులలో మనం వెతికే సాక్షాలు ఒక వేళ వున్నా, అవి భూగర్భంలోనో, కాలగర్భంలోనో ఎక్కడ, ఏరకంగా, ఎందుకు కలిసిపోయాయో అన్నది -- ఈనాడు మన ఊహకు అందని విషయం.

భోగోళిక మార్పుల వల్లనో, లేకపొతే మరేమైనా వేరే కారణాల వల్లనో ఏమో – త్రవ్వకాలలో క్రీ.పూ. 3000నాటి సింధూ లోయ నాగరికతకు నుంచీ, దాని తరువాత మళ్ళీ క్రీ.పూ 300 సంవత్సరపు మౌర్యుల నాగరికత దాకా మద్య Cultural continuity కనపడలేదు. ఆ మద్య కాలంలోని చరిత్రపై కూడా మనకు పెద్దగా ఆధారాలేమీ లేవు. అవగాహనా లేదు. భోగోళిక మార్పులు జరిగి, ఆనాటి అధారాలు నశించి వుండి వుండవచ్చు నేమో అని అనడానికి ఇది (The absence of Cultural continuity) ఒక చిన్న ఆధారం. ఇలా, కురుక్షేత్రయుద్ధం కల్పితం కాదనీ, అది చారిత్రాత్మకమేనని, ఈ మూడు భాగాల విశ్లేషణ వల్ల నిర్థారించవచ్చును. ఇక మనకు నిర్థారణ కాని విషయాలు – ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ ఆయుధాలతో జరిగింది? అన్నవే.

అలనాటి నాగరికత నేటి నాగరికత కన్నా మహోన్నతమైనది; వారి జ్ఞానం మనకన్నా ఎన్నో రెట్లు గొప్పది; కానీ కురుక్షేత్ర మహాసంగ్రామం వల్లనో , యుగాంతం వల్లనో ఎందరో చనిపోయి, వార్ల నాగరికతలు సమూలంగా నాశనమయ్యి, కాలక్రమేణా ఆ విజ్ఞానం సాంతం నశించిపోయి వుండవచ్చు. అందుకే మనం మరిన్ని ఆధారాలకై వెతుకుతూనే వుండాలి ; వెతికి అందరికి అర్థమయ్యేలా చూపించి, అందరి ఆమోదాన్నీ అందుకోవాలి. ఒక భారతీయునిగా అది మన బాధ్యత! అది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాకపోవచ్చు. ఎన్నో వేల సంవత్స్రాల చరిత్ర కలిగినది మన సంస్కృతి. ఎంతో సనాతనమైనది మన ధర్మం. నిరూపించడానికి చాలా సమయం పట్టొచ్చు. అయినా నిరాశ పడకుండా ప్రయత్నిద్దాం.

భారతీయులమైన మనం -- మన భారతాన్నయినా అర్థం చేసుకుందాం!

Read more...

మహాభారతం వాస్తవమా కల్పితమా ?

>> Tuesday, March 22, 2011

అందరం చిన్నప్పుడు స్టార్ ట్రెక్ సినిమాలు చూసేవుంటాము. సైన్స్ ఫిక్షన్ అన్న మాటనే మన ఊహల అంచులకి తీసుకుపోయేటి అంతటి మహాద్భుత రూపకల్పనలను ఆ చిత్రాలలో సమకూర్చారు. అందులో వాడే స్పేస్‌షిప్పులకి ఇంధనంగా పెట్రోలును గానీ బొగ్గుని కానీ వాడరు. అందులో వాడేది అణుశక్తి, అంటే అది మనకు తెలిసిన ఆణుశక్తి కూడా కాదు. సాధారణయాటంతో యాంటీయాటంని “ఢీ” కొడితే ఒక మహా శక్తి విడుదలయ్యి, దానితో వాళ్ళ “స్పేస్‌షిప్పు” కాలగమనం కంటే వేగంగా ప్రయాణిస్తుందనేటు వంటి ఒక అసమాన్యమైన ఊహను రూపొందించింది ఈ చిత్రం.

1928లో నోబెల్ బహుమతి గ్రహిత, పౌల్ డిరాక్ అనే శాస్త్రవేత్త తాను వేసిన అనేక సమీకరణాలలో యాంటీ మాటర్ అనేది బిగ్ బాంగ్ సమయంలో (శక్తి తాను పదార్థంగా రూపాంతరం చెందినప్పుడు) సాధారణ మాటర్‌తో సమానంగా తయారయ్యిందని తేల్చి, ప్రతిపాదించాడు. కానీ ఆ యాంటీ మాటర్ అంతా ఏమయ్యిందో ఈ నాటిదాకా అంతు పట్టడంలేదు. కానీ దాని పైన అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. తరువాత కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీ పరిశోధకులైన ఎమీలియో సెగ్రి , ఓవెన్ చాంబర్లెన్‌లు కొంత యాంటీ మాటర్‌ని తయారు చేసి చూపించి 1959లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. గత 20 సంవత్సరాలుగా కృషిచేస్తున్న, జెనీవాలోని యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (CERN) వారి 17 సభ్యుల రిసెర్చి బృందం, ఇటివలే, నవెంబర్ 19, 2010 నాడు, తమ ఆల్ఫా లాబరేటరీలో, 38 యాంటీ హైడ్రోజెన్ యాటములను సృష్టించి, ఒక క్షణం పాటు (సెకనులో పదవ వంతు కాలం) నిలువ చేయగలిగామని ప్రకటించారు. అది మన ఆధునిక విజ్ఞానరంగంలో ఒక మహత్తరమైన పురోగతి. ఎందుకంటే యాంటీ యాటములు విడుదలయ్యిన వెంటనే వాటిని మన ప్రకృతి విలీనం చేసుకుంటుంది. కనుక వాటి పైన అధ్యయనం ఈనాటి దాకా సాధ్యపడలేదు.

ఇప్పుడు CERN అభివృద్ధిచేస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఈ యాంటీ మేటర్‌ని అధ్యయనం చెయ్యడానికి వీలవుతుంది. కానీ, స్టార్ ట్రెక్‌లోని స్పేస్‌షిప్పులు, బాంబులు వంటివి తయారు చెయ్యడానికి మనకి ఇంకా ఎన్నో దశాబ్దాలు పట్టవచ్చు. అయినా మనం పురోగతి సాధిస్తున్నాము కనుక, కాలక్రమేణా అన్నీ తెలుసుకో గలుగుతామని ఆశించవచ్చు. అలాగే చాలా రోజులుగా మనకు అర్థం కానటువంటి “డార్క్ మాటర్” అంటే ఏమిటో, “డార్క్ ఎనర్జీ” వంటి కాన్సెప్టులపైన కూడా, అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వెరసి త్వరలోనే మనకు తెలిసిన అణు బాంబులను మించేటువంటి అతి భయంకర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్లు (WMD) ఎన్నో అవగతమవుతాయి.
కానీ ఈ యాంటీ మాటర్ లేమిటి, డార్క్ మాటర్ లేమిటి, డార్క్ ఎనర్జీలేమిటి? ఈ WMDలు ఏమిటి? వీటికి మన మన మహాభారత యుద్ధ విశ్లేషణకీ సంబంధం ఏమిటి? అనిపిస్తోంది కదూ! విశ్లేషణ చివరి కొచ్చేటప్పటికి వీటి మద్య నున్న సంబంధం కొంచెం అర్థమవ్వొచ్చు. చదవండి...
---- --- ----
గత రెండు మాసాలుగా కురుక్షేత్రయుద్ధం గురుంచి విశ్లేషణ జరుపుతూ వస్తున్నాం. ముందుగా 18 అక్షౌహిణుల సంఖ్య సుసాధ్యమే అని గుర్తించాం. తరువాత మహాభారత గ్రంధం మొత్తం చరిత్ర కాకపోయినా కనీసం అందులోని మూలకథ చరిత్రే అయ్యివుండాలని గ్రహించాం. ఇక సాక్షాధారాలు లేవు అన్న ఆక్షేపణను పరిశీలిద్దాం. పరిశీలించేముందు మనకు సాక్షాధారలను పరిశీలించి అర్థం చేసుకోగల అర్హత, సామర్ధ్యాలు వున్నాయా అని ప్రశ్నించుకోవాలి.
ఎందుకంటే, ఎదురుగా వున్న సూర్యుడినే మనం తిన్నగా చూడలేము, అది మనలోని లోపమే అవుతుంది కానీ సూర్యుడు అబద్దమని కాదు. ఒక వేళ చూసినా, చూడగలిగినా ఆ కనబడే సూర్యుడు ఆరు అంగుళాల వ్యాసమున్న చిన్న చక్రమేననీ, ఓస్ అదేమంత పెద్దది కాదనీ, అనుకుంటే అది మన అవివేకమే అవుతుంది, కాని ఆధారం లేక కాదు. సత్యాన్వేషనకు తగిన విజ్ఞాన సామర్ధ్యం కూడా అవసరం. మన విజ్ఞానం పరిణితి చెందుతోంది కనుక కొన్నికొన్ని విషయాలను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోగలుగుతున్నాము. మిగితావి కాలక్రమేణా అర్థం చేసుకోగలుగుతామేమో! కురుక్షేత్ర సంగ్రామానికి సంబంధించిన సాక్షాధారాలను ముఖ్యంగా 5 రకాలుగా విభజించవచ్చు.
1) చారిత్రాత్మక ఆధారాలు:
చరిత్ర గురించి మాట్లాడుతున్నాము కనుక, ముందుగా చారిత్రాత్మకతను పరిశీలిద్దాం. అంటే చరిత్రలోనే మనకు దొరికిన కొన్ని ఆధారాలను పరిశీలిద్దాం.
అయిహోలె జైనమందిరం లోని శిలాశాసనం ప్రకారం ఆ మందిరం భారతయుద్ధం తరువాత 3,735 సంవత్సరాలకు, అలాగే కలియుగంలో షక శకములో 556వ సంవత్సరంలో చాళుక్యరాజైన పులకేశి కట్టించాడని వ్రాసివుందట. ఇప్పుడు ఆ శకములో 1915 నడుస్తోంది. అంటే మహాభారత యుద్ధం దాదాపుగా క్రీ.పూ.3102 లో జరిగి వుండాలన్నది విధితమేనని మన పండితులు చెబుతున్నారు. ఇదే కలియుగారంభ కాలం కూడా.
క్రీ.పూ 4వ శతాబ్దిలో చాణుక్యుడు శ్రీకృష్ణజన్మ వృత్తాంతాన్ని ప్రస్తావించాడు.
క్రీ.పూ. 4వ శతాబ్దిలో, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి గ్రీకు రాయభారిగా వచ్చిన మెగస్తనీసు ప్రకారం, మథురావాసులైన Sourasenoi (అంటే సురసేనలు గానీ యాదవులుగానీ) Heraklesని పూజించారు అని పేర్కొన్నాడు. ఇతడు హెరకిలిస్సుకిచ్చిన వర్ణనను బట్టి, కృష్ణుడునే అని అలా గ్రీకులు పిలుచుకునేవారు అని ఒక విశ్లేషణ చెబుతోంది.
యొబరెస్ తీరాన (అంటే యమునా తీరాన) వారి రెండు మహానగరాలన్నాయని; వాటి పేర్లు మెథొర (మన మథుర) మరియు క్లైసొబొర (కృష్ణపుర?) అని మెగస్తనిసు చెప్పాడట. అంతే కాదు, హెరక్లెస్సు (అంటే శ్రీకృష్ణుడు) తన కుమార్తెని పాండయరాజుకి (పాండవరాజు లేక పాండ్యరాజు అయివుండవచ్చు) ఇచ్చాడని; వారు మరొక మథురని (తమిళనాడులోని మథురై) పాలించారనీ; ఆ రాజ్యం దక్షిణాదిన సముద్రతీరాన వుందని చెప్పాడు. దీనితో పాండ్యరాజులు అలా పాండవుల సంతతి వారు అయివుండ వచ్చునని; అలా పాండవులు దక్షిణప్రాంతంలో పాండ్యు లయ్యి మరో మథురను నిర్మించుకున్నాని తెలుస్తున్నది.
గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీసు వ్రాసిన మరో వివరం ప్రకారం, శ్రీకృష్ణుడి తరువాత 138వ రాజే చంద్రగుప్త మౌర్యుడు అని తెలుస్తోంది. అంటే ఇవన్ని చూస్తే కృష్ణుడు నిజంగా వున్నట్లే తెలుస్తున్నది. అంతే కాదు, చైనీయుల పర్యాటకుల ప్రస్తావనలు కూడా మహాభరతయుద్ధం జరిగినదనే చెబుతున్నాయి.
తరువాత పాణిని, పతంజలి, భౌద్ధులు, జైనుల గ్రంధాలలో కూడా శ్రీకృష్ణుని ప్రస్తావనలతో పాటూ, కురుక్షేత్రయుద్ధ సంఘటనలు కనబడతాయి.
యువాన్ చాంగ్ అనే చీనీ పర్యాటకుడు కూడా కురుక్షేత్రం వద్ద ఒక మహాయుద్ధం జరిగిందని; ఎందరో అందులో మరణించి భూస్థాపితమైపోయారనీ వ్రాసుకున్నాడు.
కురుక్షేత్ర ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో కొన్ని ఆనాటి బాణాలు, శూలాలు దొరికాయి.
అలాగే గ్రెకో-బాక్ట్రియన్ ప్రభువు, అగాథొక్లెస్ క్రీ.పూ. 180-165 కాలంలో శ్రీకృష్ణబలరాముల రూపాలతో నాణాలను అచ్చువేయించాడట. అధారాలుగా ఆ నాణాలు కూడా దొరికాయి. వాటిపై చక్రధారిగా శ్రీకృష్ణుడు కనపడతాడు. యూరప్‌లో క్రైస్తవ మతాని కంటే ముందు కూడా హైందవ లేక సనాతనధర్మం వుండేది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

ఈ నాణాలు, ఆనాటి గ్రీకు హైందవ స్నేహసంబంధాలను ధృవీకరిస్తున్నాయి. ఇవి రెండు దేశాల మద్య జరిగిన పరస్పర సాంస్కృతిక మార్పిడులను తెలియజేస్తూ, పశ్చిమ దేశాలలోకి భారతీయ విజ్ఞానం ఎలా వెళ్ళిందో చూపించ గలుగుతున్నాయి.
క్రీ.పూ. 1వ శతాబ్ది కాలపు, తక్షశిలవాసీ, గ్రీకు రాయభారియైన హెలియోడొరస్ నిర్మించిన బెసనగర్ లోని (నేటి మధ్యప్రదేశ్ లోని) గరుడ స్తూపం పైనున్న శిలాశాసనం వాసుదేవుని ఉనికిని చాటుతోంది.

మథుర వద్దనున్న మోరా శాసనం ప్రకారం అక్కడ ఐదుగురు దేవతలను ఆరాధించేవారనీ; అందులో వాసుదేవుడు ఒకడనీ తెలుస్తున్నది.
మరి ఇన్ని చారిత్రాత్మక ఆధారాలు దొరుకుతూవుంటే మన విశ్లేషకులు మహాభారతయుద్ధం జరుగలేదని ఎలా అనగలరు అని మనకు అనిపించవచ్చు. కానీ మన విశ్లేషకులు నమ్మనిదే ఆ శిలా శాసనాలను. ఎందుకంటే అ శాసనాలు భారత కాలానికి చెందినవి కావు కనుక. వారి అనుమానం కొందరు అమాయక ప్రభువులు గ్రుడ్డి నమ్మకంతో అవి చేయించారేమోనని! అ శాసనాలన్నీ నిజమైతే - త్రవ్వకాలలో తగిన ఆధారాలు ఎందుకు దొరకలేదు? అని వారీ ప్రశ్న. ఎప్పుడో 5,000 వేల ఏళ్ళనాటి సింధూలోయలో కూడా ఎన్నో విషయాలు బయటపడితే; మరి భారతకాలం నాటి శిధిలాలు ఏమయ్యాయి? అనే వారి ప్రశ్న.

2) త్రవ్వకాలు:
పురావస్తు శాఖ నిర్వహించిన అనేక త్రవ్వకాలలో ఇంకొన్ని ఆధారాలు దొరికాయి
a) కాంబాట్: మహాభారత పరిశోధనలో ఒక సరికొత్త మలుపు ఈ కాంబాట్. ఇటివలే (2002లో) జలగర్భంలోని చాలా లోతుల్లో కనుగొనబడిన ఈ కాంబాట్ అనే పట్టణం, కనీసం 9వేల సంవత్సరాలకన్నా పాతదని; అది 30వేల సంవత్సరాల కాలం నాటిది కూడా అయివుండవచ్చుననీ; ఇటీవలే సోనోగ్రఫీ టెస్టింగు ద్వారా కనుగొన్నారు.

ఋగ్వేదంలో అనేక చోట్ల సముద్ర యానం గురించి చెప్పబడి వుందని ప్రఖ్యాత చరిత్రకారుడు, అర్.సి.ముజుందార్ చెప్పారు. ఆయన ప్రకారం సింధూ-సరస్వతి ప్రాంతవాసులు పశ్చిమ దేశాలతో నౌకాయానం ద్వారా పరస్పర వ్యాపార సంబంధాలు ఏర్పరుచుకున్నారని తెలుస్తోంది. ద్వారక లోని రేవు, అదే విధంగా కాంబాట్ లోని ఈ రేవు పట్టణాలు ఇదే సత్యాన్నే ఋజువు చేస్తున్నాయి.

అసలు అంత కాలపు క్రిందట, భూమి పైన ఏ అభివృద్ధి చెందిన నాగరికతైనా వుండే ఆస్కారమే లేదు అని అంటూ, మనకు తెలిసిన, మనం నేర్చుకున్న, మన పాశ్చాత్య జ్ఞానం తెలుపుతోంది. కాని ఈ కాంబాట్ ప్రాంతం ఆ నమ్మకానికి పూర్తిగా భిన్నమైన ఆస్కారము వుందని ఋజువు చేసి, మన నాగరికత యొక్క సనాతనత్వాన్ని నిరూపిస్తోంది. మన సనాతనధర్మ నాగరికతకి ఇంతకన్నా ఏమి ఆధారం కావాలి?
b) ద్వారకానగరం: శ్రీకృష్ణుని మరణానంతరం కలియుగం ప్రవేశించిందని, అలా క్రీ.పూ.3102 వ సంవత్స్రం లో కలియుగం ప్రారంభమైందనీ మనకు తెలుసు.
నిర్యతె తు జానె తస్మిన్ సాగరోమకరాలయః
ద్వారకాం రత్నసంపూర్ణం జలేనాప్లావయత్తదా (మౌసల. 40)
“ జనమంతా వదిలేసిన తరువాత సముద్రం పొంగి సర్వసంపదలతో నిండిన ద్వారకను ముంచివేసింది. తాను ఇచ్చిన స్థలాన్ని మళ్ళీ కబళించివేసింది.” మాజీ పురావస్తుశాఖ శాస్త్రవేత్తయైన డా. ఎస్. ఆర్. రావు గారు, మెరైన్ ఆర్కియాలజీలో నిష్ణాతులు. ఆయన చేసిన పరిశోధనల వలన జలగర్భంలో ఆనాటి ద్వారకా నగరంతో పాటు, అనేక శిధిలాలు దొరికాయి.

హరివంశంలో సూచించిన ద్వారకా నగరవాసులు ధరించే ముద్రిక నొక దానిని (శంఖంపైన మూడు తలల చిహ్నం) వీరు గుర్తించ గలిగారు. వీటిని బట్టి ద్వారక అనే నగరం నిజంగానే వుండేదనీ, అది భారతంలో చెప్పబడ్డ శ్రీకృష్ణుని నగరమేననీ, అది మనం వెదికే కాలం నాటిదేననీ తెలుస్తోంది. ద్వారకా నగరం ముణిగిపోవడం కూడా భారతంలో చెప్పబడి వుంది.
డా. ఎస్. ఆర్. రావు గారు ద్వారకాదీశుని గుడి వద్ద జరిపిన త్రవ్వకాలలో 15వ, 12వ 9వ శతాబ్ది నాటి గుళ్ళు దొరికాయి. అలా ఆ మందిరాల క్రింద 9.5 మీతర్లు త్రవ్వుకుంటు పోగా, అక్కడ రెండు నగరాల శిధిలాలు కనపడ్డాయిట. అక్కడ దొరికిన పింగాణిల వంటివే మళ్ళీ మన హస్తినాపురంలో కూడా దొరికాయి. అందుచేత అక్కడే ద్వారక కూడా వుండి వుండాలని నమ్మికతో ఆయన సముద్ర జలగర్భంలో పరిశొధలు జరిపితే, అక్కడ పెద్ద పెద్ద ద్వారాలు, కోట గోడలు, ఒక రేవు దొరికాయట. వాటిని బట్టి అవి మహాభారత కాలానివేనని నిర్థారించడం జరిగింది. వాటితో పాటుగా కంచు, ఇనుప పరికరాలు, రాతి లంగరులు, శంఖు ముద్రలు, దొరికి ఈ నాగరికతకూ, హర్రప్పా నాగరికతకు మద్యన ఒక లంకెను కూడా చూపించాయి.
బెట్ ద్వారకా నగరం అనే ద్వీపంలోని మందిరానికి శ్రీకృష్ణుడు తరచు వెళ్తూ వుండేవాడట. అక్కడ మత్స్యావతార పురుషుడైన మహావిష్ణ్వాలయంకూడా వుండేదట. అక్కడ దొరికిన శిధిలాలో వాటికి సంబంధించిన అవశేషాలు దొరకడమే కాకుండా అవి క్రీ.పూ 1500 - 1300 నాటివని కూడా తెలుపుతున్నాయిట. మహాభారతంలో చెప్పబడిన గ్రామాలు, చెరువులు, కొండలను కూడా గుర్తు పట్టగలిగారట. మొత్తానికి గుజరాత్ దగ్గిర సముద్రంలో వద్ద జలగర్భంలో దొరికిన నగరం మన శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకానగర ప్రాంతమేనని పరిశోధకులు నిరూపించగలిగారు.
c) కురుక్షేత్రం : ఇంద్రప్రస్థం, హస్తినాపురం, కురుక్షేత్రం ప్రాంతాలలో పురావస్తు శాఖ జరిపిన త్రవకాలలో దొరికిన ఆధారాలను విశ్లేషిస్తే అక్కడి నాగరికతలు క్రీ.పూ 1700-1400 మద్య కాలానివని తేలాయి. కానీ, పెద్దగా చెప్పుకోదగ్గ ఆయుధ పరిజ్ఞానానికి సంబంధించిన ఆధారాలేమీ దొరకలేదు. అంటే మిసైలుల వంటి దివ్యాస్త్రాలు గానీ, భారి ఆయుధాలుగానీ, రధ చక్రాలు గానీ, ఇరుసులు, కీలలు గానీ, గుర్రపు నాడాలు గానీ, పెద్దపెద్ద భవనాలు గానీ కనిపంచలేదు. వెరసి ఒక మహాయుద్ధం జరిగింది అని చెప్పడానికి తగిన సాక్షాలు దొరకలేదు.

హస్తినాపురం: మత్స్య వాయు పురాణాలలో చెప్పబడిన గంగానది వరదల మూలంగా హస్తినాపురం మునిగిపోగా, నిచక్షు మహారాజు (పరిక్షితు తరువాత 5వ రాజు) కౌసంబికి రాజధానిని తరలించాడని తెలుస్తోంది. హస్తినాపురంలో మట్టిపై జరిపిన విశ్లేషణవల్ల అక్కడ అలాంటి పెద్ద వరద వచ్చినట్లుగానే తేలింది. అలాగే పురావస్తుశాఖ వారి త్రవ్వకాలలో కౌసంబి నగరం కూడా దొరికింది. అంతే కాదు ఆ నగరం వరద వచ్చిన కాలం నుంచే మొదలయ్యిందని కూడా నిర్థారణ చెయ్యగలిగారు.

అలాగే శ్రీకృష్ణ రాయభార సమయంలో పాండవులు అడిగిన పాణిప్రస్థము, సోనప్రస్థము, ఇంద్రప్రస్థ నగరాలలో (నేటి డిల్లీలోని పానిపట్, సోనేపేట్, పురానాఖిలా) కూడా ద్వారకలో దొరికిన రకమైన పింగాణీలే దొరికాయి. అలాగే పురానాఖిలాలో కొన్ని భవంతులు డ్రైనేజీ కాలువలు కనిపించాయి. దాదాపు 35 స్థలాలో జరిపిన ఈ త్రవ్వకాలన్నిటిలోనూ material culture అంటే painted grey ware (PGW) దొరికింది. ఈ పింగాణీలు అతి ఉన్నతమైన నిపుణతతో చేయబడ్దవి. ఈ నాగరికతలో ఇనుమును కూడా వాడినట్లు తెలుస్తోంది. కానీ హరప్పా జనులకు ఇనుము తెలిసినట్లుగా ఎక్కడా దాఖలాలు లేవు. అలనాడు వైభవాలలో మునిగితేలిన ఆ హస్తినాపురం - ఈ నాడు ఒక నిర్మానుష్య ప్రాంతం. అందులో దొరికిన వాటిలో ముఖ్యమైనవి - విదురుని భవనము, ద్రౌపది వంటశాల , ద్రౌపది స్నానల రేవులుగా గుర్తించారు. వాటితో పాటుగా అనేక రాగి గిన్నెలు, ఇనుప ముద్రలు, కొన్ని ఇనుప పరికరాలు, వెండిబంగారు ఆభరణాలు, మట్టిపాత్రలు, ఏనుగు దంతాలతొ చెసిన పొడగాటి పాచికలు(శకుని వాడినట్టివి) వెండిబంగారు ఆభరణాలు, పెంకులు, పింగాణీలు వంటివి ఎన్నో దొరికాయి. అలాగే బాణాలు, శూలాలు, ఇరుసులు, కొక్కాలు, గొడ్దలులు, కత్తులు,వంటి ఆయుధపరికరాలతో కూడిన మొత్తం 135 ఇనుముతో చేయబడ్డి వస్తువులు దొరికాయి. ఇటుకలతో పేర్చబడ్డ వీధులు, డ్రయినేజీలతో పాటుగా ఓక వ్యవసాయప్రథానమైన క్షేత్రంగా హస్తినాపురం కనిపిస్తోంది.
మరి ఇన్ని ఆధారాలు దొరికితే ఇక సమస్యేమిటి అంటే, కలియుగారంభం క్రీ.పూ.3102లో జరిగింది. అంటే భారతం ఇంకా ముందే జరిగివుండాలి. కానీ మనకు దొరికిన హస్తినాపురం క్రీ.పూ 1700-1400 మద్య కాలానిది, ద్వారక క్రీ.పూ 1500 - 1300 కాలానిది. అంటే వీటి నమయ నిర్దారణలలో ఎక్కడో లెక్క తప్పింది లేకపొతే మనమే మహాభారత కాలనిర్ణయంలో తప్పు చేసాము. ఇక కాల నిర్ణయానికి వేరే పద్దతులేమయినా వున్నాయా?
3) గ్రహాస్థితిగతులు :
ఇక మహాభారత యుద్ధానికి చెందిన కాలనిర్ణయం, దానికి సంబంధించిన ఆధారాల కొస్తే ముఖ్యంగా అందరూ చెప్పేది భారతంలో చెప్పబడిన గ్రహాస్థితిగతులు, గ్రహణాలు వాటికి సంబంధించిన కాలాలు. ఆ గ్రహస్థితులన్నీ భారతంలో వివరించిన క్రమంలో కనుక వచ్చినట్లైతే, వాటి మూలంగా దాని చారిత్రాత్మకతను కూడా ఖాయం చేసుకోవచ్చు అని అందరూ ఒప్పుకుంటున్నారు. యుద్ధం జరపడానికి ఒక ముహుర్తం; అలాగే భీష్ముడు తన మరణానికి ఒక ముహుర్తం; అలాగే యుద్ధం జరిగేటప్పుడు కూడా ఒకరోజు సూర్యుడు రెండు సార్లు అస్తమించడం, ఎన్నో గ్రహణాలు, ఇలా ఒకటేమిటి ఎన్నో చోట్ల గ్రహస్తితుల ప్రస్తావనలు కనబడతాయి. ఉదాహరణకు భారతంలో ప్రస్తావింప బడ్డ కొన్ని గ్రహ స్థితులు ఇలా కనిపిస్తాయి (ఇవికాక ఇంకా ఎన్నో వున్నాయి).
ఉద్యోగ భీష్మపర్వాలలో ప్రస్తావనలు
-శని రోహిణిలో వుండటం
- జ్యేష్టా నకషత్ర ప్రవేశానికి ముందు అంగారకుని వక్ర గమనము
- కార్తీక పౌర్ణిమ నాడు చంద్ర గ్రహణము, తరువాత జ్యేష్టలో సూర్య గ్రహణము
“ఓ, మధుసుదనా, అంగారకుని వక్రగమనముతో అనూరాధను శాంతి కాముకుడై ప్రార్థించుచున్నట్లు కనిపించుచున్నది. MB (V.141.8)
“మహాగ్రహములు రెండు సేనలలోనూ ఎంతో వినాశనమును తెలుపుచున్నవి. అంగారకుడు మఖా నక్షత్రం లోనూ బృహస్పతి శ్రవణా నక్షత్రంలోను వక్రగతిలోనున్నారు ” MB (VI. 3. 13)
“సూర్యకుమారుడు (శని) పూర్వఫాల్గుణి దాటి క్షీణించుచున్నాడు. ఓ రాజా, శుక్రుడు పూర్వా భాద్రపద ప్రవేశించి ఉత్తరాభాద్రపదను చుట్టుచూ రెంటిలోనూ ఉదయించుచున్నాడు.” MB (VI. 3. 14)
“యముడు ప్రకాశవంతుడై ధూమాపరివేషలను కలసి ఇంద్రస్థానమైన జ్యేష్టా నక్షత్రమును ప్రవేశించుచున్నాడు.” MB (VI. 3. 15)
“రాహువు సూర్యుని మింగగా భూమి వణుకుచున్నది. స్వేతగ్రహం చిత్రను అతిక్రమించుచున్నది” MB (VI. 3. 11)
“చంద్రుడు క్షీణించగా రాహువు సూర్యుని చేరుచున్నాడు.” MB (V. 141. 10)
ఎందరో విద్వాంసులు (మరి కొందరు ఈ నాటి కంప్యూటర్ సహకారంతో) ఆ గ్రహాలనూ, గ్రహణాలనూ పరిశీలించి, అవన్నీ జరిగినవేనని; భారతంలో పేర్కొనబడిన క్రమంలోనే అవి జరిగాయనీ చెప్పారు. కానీ మళ్ళి వచ్చిన చిక్కేమిటంటే, ఈ చెప్పబడిన గ్రహాల స్థితి గతులు ఒక్కసారే కాకుండా పలుమార్లు వచ్చినట్లున్నాయి. దానితో అనేక వాదోపవాదాలు కూడా వచ్చాయి. అలా భారత యుద్ధ కాలానికి అనేకులు అనేక రకాల కాల నిర్థారణలు చేసారు.

5వ శతాబ్దినాటి ఆర్యభట్టుని లెక్కల ప్రకారం మహాభారతయుద్ధం క్రీ.పూ.3100 కి ముందు జరిగింది. చాలా మంది ఆర్యభాట్టుడితోనే ఏకీభవిస్తారు. ప్రొ.వైద్య, ప్రొ. ఆప్టేల లెక్కలు కూడా దీనితో ఏకీభవించాయి. కానీ భారతంలో పేర్కొడబడిన చంద్ర గ్రహణాలను బట్టి, S. బాలకృష్ణ గారు మహాభారత కాలాన్ని క్రీ. పూ. 2559 అని నిర్థారిస్తే; I. N. అయ్యంగార్ గారు ద్వంద్వగ్రహణాలను బట్టి, శని, బృహస్పతుల గమనాలను బట్టి క్రీ.పూ. 1478 అని నిర్థారించారు; B. N. ఆచార్ గారు వివిధ గ్రహస్థానాలను బట్టి క్రీ.పూ. 3067 అని నిర్థారిస్తే; P. V. హోలెయ్ గారు వివిధ గ్రహస్థానాలను బట్టి క్రీ.పూ. నవంబర్ 13, 3143 అని నిర్థారించారు; అలాగే P. V. వర్తక్ గారు వివిధ గ్రహ స్థానాలను బట్టి క్రీ.పూ. అక్టోబర్ 16, 5561 అని నిర్థారిస్తే; K. సదానంద గారు క్రీ.పూ. నవెంబర్ 22, 3067 అని నిర్థారించారు.
అంటే సమయ నిర్థారణ సరిగ్గా చెయ్య లేక పోయారు గానీ, భారతం గాథ మొత్తం క్రీ.పూ. 3100 సంవత్సర ప్రాంతంలోనే జరిగి వుండాలి అని అనేకులు అభిప్రాయపడ్డారు. ద్వాపర యుగాంతంలో అష్టగ్రహకూటమి సంభవించిందని అంటారు. ఆ కూటమి క్రీ.పూ. ఫిబ్రవరి 18,3102 నాడు జరిగిందని గ్రీకు జ్యోతిష్యులు మనకన్నా ముందు నిర్థారించారట. ఎదేమైనా మనం చేసిన సమయ నిర్థారణలో లోపాలు వుండి వుండవచ్చు, కానీ ఇవన్ని మహాభారతం జరిగే వుండి వుంటుంది అని మాత్రం ఖచ్సితంగానే తెలియజేస్తున్నాయి. ఇక ఆ యుద్ధం జరిగిందా అన్నది ప్రయత్నిద్దాం.
4) ఇనుము :
మహాసంగ్రామ నిర్ణయంలోనూ, దాని కాల నిర్ణయంలోనూ, మనకి వచ్చిన మరొక అడ్డంకి ఇనుము. నిజంగా అంత పెద్ద యుద్దమే జరిగి వుంటే, అందులో ఆయుధాల కోసమనో రధాల కొసమనో ఎక్కడొ అక్కడ ఖచ్చితంగా కొంత ఇనుమును వాడి వుండాలి. భారతలో రథాలు వాడారని మనకు తెలుసు. రథాల నిర్మాణానికీ (కమ్మీలు, కీలలు, ఇరుసుకడ్డీ), అలాగే ఆధునిక మారణాయుధాల తయారీకీ, ఇనుము ఆవశ్యకత ఎంతో వుంటుంది. కురుక్షేత్రంలో జరిపిన త్రవ్వకాలలో పెద్దగా ఇనుము దొరకలేదుగానీ కొన్ని ఇనుప బాణాలు, శూలాలు దొరికాయిట. వీటిని బట్టి ఒక చిన్న యద్ధం జరిగిందని చెప్పొచ్చు, కానీ ఒక మహాయుద్ధం జరిగింది అనడానికి ఆధారాలుగా పెద్ద పెద్ద మిస్సైలులవంటి ఆయుధాలు, పరికరాలు దొరకలేదు.

ఒక్క నిమిషం దొరకని మిస్సైల్సుని పక్కన పెడదాం. ముందు ఆ దొరికిన బాణాలను థర్మోల్యూమినెన్స్ టెస్టింగు ద్వారా పరీక్షిస్తే, అవి క్రీ.పూ. 2800 నాటివని తెలిసింది. ఇది దాదాపు మన కలియుగారంభ సమయానిదే. వచ్చిన చిక్కేమిటంటే, మన చరిత్రకారుల ప్రకారం క్రీ.పూ. 1000కి ముందు ఇనుమునే కనుక్కోలేదు. మరి క్రీ.పూ.2800 నాటి ఇనప బాణాలు కురుక్షేత్రంలో ఎలా దొరికాయి? అంటే భారతం క్రీ.పూ. 1000కి లోపు గానే జరిగిందా? మనమే వాటి సమయాన్ని సరిగ్గా నిర్థారించలేదా? మొత్తానికి కాల నిర్థారణ మాట కొస్తే మళ్ళి మనకి మరొక్క కొత్త చిక్కే వచ్చింది.

కానీ మనం మర్చిపోయినది ఏమిటంటే-- మిగితా దేశాలలో లేకపోవచ్చుని గానీ, భారతదేశంలో పదార్థజ్ఞానం ఏనాటి నుంచో వుంది. ఆనాడు ఇనుముతో మనవారు చేసిన గారడీలు ఈ నాటికీ అంతుపట్టనివి అని నిరూపించడానికి కుతుబ్ మినార్ ముందునున్న-- ఆరున్నర టన్నుల బరువుతో, 22 అడుగుల ఎత్తున్న-- ఉక్కు స్థంభమే సాక్షం.

[అంతర్జాలంలో సమాచారం]

Read more...

శ్రీకృష్ణానందలహరి

>> Monday, March 21, 2011

కృష్ణానందలహరి

శంకర భగవత్పాదుల సౌందర్యలహరి గురించి తెలియనివారుండరు. అయితే శంభోర్మూర్తియైన శంకరులు జగత్తుకు అనుగ్రహించిన దివ్య కవితాధార 'ప్రబోధ సుధాకరమ్'. శ్రీకృష్ణానందలహరిగా భక్తులను రంజింపజేస్తుంది ప్రబోధసుధాకరమ్. పరమాత్మ తానొక్కడుగా, తనను అనేక రకాల జీవాత్మలుగా పరిచ్ఛిన్నం చేసుకుని, జీవుడుగా అనేక సాధనా మార్గాలను ఆశ్రయించి, చివరకు సర్వమూ తానేనన్న భావనలో అందంగా ఒదిగించే, పూర్ణద్వైత బోధ, ఈ ప్రబోధ సుధాకరం.

సౌందర్యలహరితో పాటు శివానందలహరి, ఆనందలహరి ప్రపంచానికి పరిచయమే. కృష్ణాత్మకమైన ఈ దివ్య ప్రబోధం శంకర హృదయగీతిక. ఆహ్లాద పరిమళం. 257 శ్లోకాలలో 18 సోపానాలుగా సాగే ఈ ఆధ్యాత్మిక భావగీతం, మధురం, మోహనం, మనోజ్ఞం, మనోహరం. పరమాత్మ ఒక్కడే నాయకుడు. జీవులన్నీ నాయికలే. జీవాత్మ, పరమాత్మల సంగమానందలీలను, శంకరులు సభగయ్యతో, కుశల శైలితో, సమృద్ధ భాషా వైదుష్యంతో, సమర్థంగా ఆత్మానుసంధాన విధానంగా సాగిస్తారు.

ఆనంద మార్గాలు
భక్తి, జ్ఞానాలు రెండూ బ్రహ్మానందం అందుకోవడానికి దివ్యమార్గాలు. నిజానికి అవి రెండుగా కనిపిస్తున్నా, స్థూలంగా ఒకటే. మనసు-హృదయాల స్థితుల వలె! తల్లీబిడ్డల వలె! సూర్యుడు, సూర్యకిరణాల వలె! చంద్రుడూ, చంద్ర కిరణాల వలె! శరీరం - దాని పరిమితి, ఇంద్రియాలు - వాటి చర్యలు, మనసు - దాని స్థితి, ఇంద్రియనిగ్రహం - మనో నియంత్రణం, నిర్మోహత్వం, ఆత్మ - దాని ఉనికి, మాయ - దాని అస్తిత్వం, సూక్ష్మకారణ శరీరాల నిర్వచనం, అద్వైతం - దాని నిరూపణ, కర్తృత్వం - దాని అనుభవం, ఆత్మ - దాని స్వయంప్రకాశ స్థితి, ధ్యాన - ధారణలలో సూక్ష్మ మనసు, మనస్సును మలగించడం, ఆత్మజ్ఞాన ప్రకాశం, భక్తి భావం, ధ్యానరీతి, ఏకత్వం, దివ్యానుగ్రహం... ఇవన్నీ సాధనాసోపానాలు. ఇవన్నీ ఆధునిక మానవుడికి అక్కరకొచ్చే విషయాలు.

ఏదీ కోరని స్థితి!
రోగాలు పోగొట్టుకోవడానికి, ప్రాపంచిక సుఖాలు జారిపోకుండా నిలబెట్టుకోవడానికి పడేయాతన, తాపత్రయం, వ్యామోహం కారణంగా అధ్యాత్మను ఆశ్రయించరాదు. అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదు. అదొక జీవనవిధానం. పూర్ణకుంభమది. మనిషి, తాను ఈ భూమిపై సంచరించినంత కాలం ఆనందంగా జీవించగలగాలి. ఆ ఆనందం ఆత్మవిద్యలో నుంచి మాత్రమే సాధించుకోవాలి. ప్రేమను పొందాలి, ప్రేమను పంచాలి. అమలిన ప్రేమ ఆనందరసానికి ఒక అభివ్యక్తి.

ఒక అభిజ్ఞ అంటే గురు. ప్రేమ, ఆనందం కలిస్తేనే భక్తి. భక్తి అంటే దేనినీ కోరని సమర్పణ. కోరికలు తీర్చుకోవడం కోసం ఎవరినో ఆశ్రయించడం భక్తి కాదు. భక్తి పారవశ్యమూ కాదు. పరాత్పరుడికి, అంటే ఆత్మకు వశం కావడమే భక్తి. భక్తి, వివేకాన్ని, విచక్షణను కలిగించాలి. అవి కలిగితే ఆ స్థితి పేరు జ్ఞానం! తెలియవలసిన దాన్ని తెలుసుకునే ప్రయత్నమంతా విజ్ఞానమే. విచారణ, విశ్లేషణ, ఆచరణ, సంచారణ ఇవన్నీ సాధనాస్థితులే! జ్ఞానమంటే ఏమీ అక్కరలేని స్థితి! భక్తి అంటే ఏదీ అక్కరలేదని చెప్పే స్థితి!

ఈ రెండు స్థితులను మానవుడికి అధ్యాత్మ ప్రబోధం చేస్తున్నారు శంకరులు. శ్రీకృష్ణపరంగా శంకరులు ప్రసాదించిన ఈ దివ్యబోధ, ఒక అనాహతనాదం, సానంద, సుమధుర, సాదర, సుందర గీతం. జ్ఞానామృత జలధిలో, శ్రీకృష్ణానందలహరిపై ప్రయాణం, మహానందయానం! ఆత్మానుభవం కోసం మనమూ ప్రారంభించాలి.
ం వి.ఎస్.ఆర్. మూర్తి
ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Read more...

మంత్రోపదేశం పొందితే ఆరాధన చేయనక్కర్లేదా?


ఒక గురువు వద్ద మంత్రోపదేశం పొందిన సాధకుడు ఆరాధన వంటి నిత్య నైమిత్తిక కర్మలు చేయక్కరలేందటున్నారు. ఇది నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మీ సలహా చెప్పండి.
- ఎ. వెంకటకృష్ణ, రాజమండ్రి

ఆత్మదర్శనానికై జ్ఞాన యోగం ప్రారంభించిన సాధకుడు ఇక కర్మయోగం అవలంభించనక్కర్లేదనే అభిప్రాయం ఒక అపోహ మాత్రమే. భగవద్గీత కర్మయోగంలో భగవానుడీ విషయాన్నే చెప్పాడు.

తస్మాత్ అసక్త స్సతతం
కార్యం కర్మ సమాచర
అసక్తో హ్యాచరన్ కర్మ
పరమాప్నోతి పూరుషః
కనుక ఆత్మదర్శనమయ్యే వరకు తప్పనిసరిగా ఫల, సంగ, కర్తృత్వాలను విడిచి కర్మలను చెయ్యాలి. దానివలననే ఆత్మ ప్రాప్తి కలిగి తీరుతుంది.

కర్మణైవహిసంసిద్ధిం
ఆస్థితా జనకాదయః
లోక సంగ్రహమేవాపి
సంపశ్యన్ కర్తుమర్హసి
జనకాది మహాత్ములు జ్ఞానయోగాధికారులైనా, కర్మల నాచరించడం వల్లనే శుద్ధాత్మ స్వరూపాన్ని పొందగలిగారు. లోకం అనర్థం పాలు గాకుండా ఉండడానికి ఉత్తముడైన జ్ఞానయోగాధికారి కూడా కర్మయోగాన్నే చెయ్యాలి.

యద్యదాచరతి శ్రేష్ఠః
తత్ తదేవేతరో జనః
సయత్ ప్రమాణం కురుతే
లోకస్తదనువర్తతే
గొప్పవాడు ఏ కర్మను ఏ విధంగా ఆచరిస్తే దానిని జూచి లోకంలో సామాన్యుడు కూడా ఆ కర్మనే అదే రీతిలో ఆచరిస్తాడు.

నమే పార్థాస్థి కర్తవ్యం
త్రిషులోకే షు కించన
నానవాప్త మవాప్తవ్యం
వర్త ఏవచ కర్మణి
మూడు లోకాల్లోనూ స్వేచ్ఛగా సంచరించే నాకు ఇది వరకు లేనిది, ఇప్పుడే కర్మల నాచరించి పొందవలసినది ఏమీ లేదు. అయినా, లోకాన్ని రక్షించడానికి నేను కర్మలను చేస్తున్నాను అన్నాడు. కనుక భగవదాజ్ఞగా, మీరు మీ సాధనతో పాటు నిత్య ఆరాధనాదులు కొనసాగించవచ్చు.
- ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ

Read more...

ఆయుర్వేదం –కొన్ని చిట్కాలు

>> Sunday, March 20, 2011

ఆయుర్వేదం –కొన్ని చిట్కాలు /చల్లా.జయదేవానంద శాస్త్రి .
------------------------------

--------------------------------------------


కీళ్ళ నొప్పికి తైలం:
------------------------------

ఆముదం చెట్టు వేర్లు 1 కిలో తీసుకోవాలి దాని పైన తోలును చాకు తో తీసి
పక్కన పెట్టు కొని ఆముదము అర(1/2 కిలొ) కిలో నీరు 4 రెట్లు
చేసె విధానం:

ఆముదం తోలు అర కిలొ (1/2కిలొ) ఒక పాత్రలో వేసి అందులో నాలుగు రెట్లు నీరు
అనగా 2 కిలోలు పొయ్యాలి. దానిని పొయ్యి మీద సన్నటి సెగ మీద పెట్టి, అర
కిలో నీరు మిగిలె వరకు మరిగించి, దానిని దించి, వడపోయాలి. దీనిని మళ్ళి
పొయ్యి మీద పెట్టి అర కిలో ఆముదము పోసి,సన్నట్టి సెగ మీద మరిగించి, నీరు
అంత ఆవిరి అయ్యి పోయక ఆముదము మాత్రమే మిగలాలి, తరవాత దానిని దించి,
వడపోసుకొని దానిలో మిరియాల పొడి 10 గ్రాములు, పిప్పళ్ళ పొడి 10 గ్రాములు,
ముద్ద కర్పూరం 30 గ్రాములు, కాచిన ఆముదములో వేసి బాగ కలిపి, చల్లార్చి
గాజు సీసలో నిల్వచేసుకోవాలి.
ఉపయోగించె విధానం:

దీనిని గోరు వెచ్చగ చేసుకొని ఎక్కువగ కీళ్ళ నొప్పులు వున్న చోట నెమ్మదిగ
మసాజ్ చేయాలి తరువాత పాత ఇటుక రాయి ని దంచి పొడి చేసి బాండి లో వేయించి,
దానిని ఒక గుడ్డలో చుట్టి, మసాజ్ చేసిన చోట కాపడం పెట్టాలి. ఆ తరవాత
చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యాలి



మొటిమలకు:-

రేగి పాండు గింజలు పగలగొట్టి అందులోని పప్పును తీసుకుని పొడి చేయాలి,
దానిలో తగినంత వెన్న , కొద్దిగ తేనె కలిపి మెత్తగ నూరాలి.ఈ పెస్ట్ ని
మోటిమల మీద, మోటిమల వల్ల కలిగిన మచ్చల మీద వ్రాయాలి,ఎండి పోయాక గోరు
వెచ్చటి నీటితో ముఖం కడుకోవాలి, ఇలా 40 రోజులు చేయలి.
రేగి పండు గింజల పొడి నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు

అరుగుదలకోసం:-

పచ్చి పుదీన, పచ్చి కరివేపాకు, పచ్చి కోత్తిమీర అన్ని సమానముగ (ఒక
100గ్రా)తీసుకోవాలి. అవి మిక్సిలో వేసి రసం తీయాలి, ఆ రసాన్ని కొలిచి,
అంతే పటికబెల్లం అందులో బాగ కరిగెటట్టు కలిపి దానిని పొయ్యి మీద పెట్టి
సన్న సెగ పెట్టాలి, అది తీగ పాకం వచ్చె వరకు వుంచి దానిని దించేసి,
చల్లార్చిన తరువాత ఒక గాజు సీసలో నిల్వ చేసుకొవాలి.

ఉపయోగించె విధానము:

ఈ పాకానిని కుండ నీటిలో వదతం చాల మంచిది ఒక గ్లాస్స్ నీటికి 2 స్పూన్స్
పాకనిని కలిపి త్రాగాలి పైన చెప్పిన పాకం లో ధనియాలు, జీలకర్ర పొడులు
కుడా జత చేసుకోవచ్చు
--------------------------------------------------------------------------------------------

అధిక రక్తపోటుకు సూచనలు-
High BPలేక అధిక రక్తపోటు కొరకు తీసుకొవల్సిన కొన్ని సూచనలు.
----------------------------------------------------------------------------------------

కరివేపాకు కారం పొడి 2 లేక 3 సార్లు ఉదయం టిఫిన్ లో తినవలెను . దీనిని
తీసుకోవడం వల్ల రక్తం లో వున్న వ్యర్ధ పదార్ధములను తొలగిస్తుంది.

కరివేపాకు కారం తయారు చేసె విదానన౦--:

యెండు మిర్చి 100గ్ర, చింతపండు 50గ్ర, కరివేపాకు చిన్నవి 4 కట్టలు,
ధనియాలు 10గ్ర, మినపప్పూ 1చెంచ, ఆవాలు 1/2 చెంచ,జీలకర్ర 1
చెంచ,వెల్లుల్లి 10 రెబ్బలు,ఉవ్పు తగినంత, కొంచం పసుపు, అన్ని దోరగా
వేయించి మిక్సి లో వేసి, తరవాత, చింత పండు , ఉవ్పు, పసుపు, వెల్లుల్లి
కూడ మిక్సి లొ వేసి తిప్పి, నిల్వ చేసుకొవాలి.

తీసుకోవలసిన పండ్ల్ రసాలు-

బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, దోసకాయ, టమాట.. కలిపి చేసుకొని ఊదయానే
తీసుకోవాలి లేక ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, యాపిల్, దానిమ్మ .. కలిపి
చేసుకొని ఊదయానే తీసుకోవాలి వెల్లుల్లి + పాలు కలిపి రాత్రి త్రాగి
పడుకోవాలి
-------------------------------------------------------------------------
చర్మ సౌందర్యము, రక్త శుద్ది కి క్యారెట్ హల్వా-
--------------------------------------------------------------

టమాటాలు 50 గ్రాములు
క్యారెట్ 50 గ్రాములు
బీట్ రూట్ 10 లేక 20 గ్రాములు
నిమ్మ కాయ 1
పటిక బెల్లం 50 గ్రాములు
తేనె 50 గ్రాములు
టమాటాలు చిన్న చిన్న ముక్కలు గా చేసి మిక్సిలో వేసి, కొంచం నీరు పోసి రసం
తీసి వడపోయలి, తరవాత ఆ రసం లో పటిక బెల్లం పొడి వేసి పొయ్యి మీద పెట్టి
సన్న సెగ పెట్టాలి, తీగ పాకం వచ్చె వరకు వుంచి దించేయాలి, దానిని బాగ
చల్లారాక, గాజు సీస లో నిల్వ చేయాలి,
ఉపయోగించె విధానం: రోజు గ్లాసు నీటిలో 2 లేక 3 స్పూనులు పాకం చల్లటి నీటి
లొ కలిపి , ఒక నిమ్మ చెక్కను కుడా కలిపి 2 లేక 3 సార్లు త్రాగాలి.
తేనె వేడి చేయరాదు, వేడి పదార్ధలలో వేయ రాదు.
౧. పైన రసం నుంది వచ్చిన పిప్పిని మిక్సిలో వేసి పాల మీద మీగడను వేసి
తిప్పాలి, దానిని మొఖానికి వ్రాసుకోవాలి 15 లేక 20 నిమిషాలు వుంచి
కడుక్కోవాలి
౨. టెబుల్ ల్యాంపు లో 15 లేక 20 వాట్సు బల్బు ని పెట్టి దానికి బ్లూ కలర్
కవెర్ చుట్టి, దాని కిరణాలు మొఖానికి పైన చెప్పిన పేస్టు పట్టించిన
దానిమీదా కొంచం దూరం గ పెట్టాలి, ఈ కిరణాల వల్ల త్వరగా ముఖం మీధ వున్న
మచ్చలు, మట్టి పోయి అందముగ వుంటుంది.

తలలో చుండ్రు సమస్య-
నిమ్మ కాయలు 2 లేక 3 పండినవి
కొబ్బరి నూనె మంచిది పావు కేజి
నిమ్మకాయలను బాగ క్రింద రుద్ది, కాయను కోసి, రసాన్ని పిండి వడ పొయాలి
బాండి లో కొబ్బరి నూనె, నిమ్మ రసం పోసి, పొయ్యిమీద పెట్టి, సన్నటి సెగ
పెట్టాలి, రసం నూనెలో కలిసి పోయి పొంగు తగ్గిపొతుంది, రసం అంత ఆవిరి
అయిపోయి , నూనె మాత్రమే మిగులుతుంది, దానిని వడ పోసి, బాగ చల్లారిన
తరువాత, గాజు సీసలో నిల్వచేయాలి
ఆ నూనెను వారానికి రెండు సార్లు, రాత్రి ముని వేళ్ళతో పాయలుగ తీసి,తలకు
పట్టించాలి
వుదయానె కుంకుడు కాయలతో కాని లేక సికకాయ్ పొడితో కాని తల స్నానం చేయాలి
జుట్టు వూడుతుంది అని మాన వద్దు
కొన్ని జాగ్రత్తలు:
దువెన: శుబ్రముగ కడిగి దువ్వుకోవాలి
దిండు కవరు: ప్రతి సారి మార్చలి స్నానం చేసాక
షాంపుతో తల స్నానం చేయరాదు
-------------------------------------------------------------


నడుము నొప్పి-
-------------------------------
కటి చక్రాసనం : చేతులు పైకి యెత్తి నిమ్మదిగా ప్రక్కనుండి వెనక్కు
తిరగాలి రెండు వైపుల చేయాలి 10 సార్లు
అర్ధ చంద్రాసనము: ఒక చేయి పైకి యెత్తి, ప్రక్కకు వంగాలి, రెండు వైపుల
చేయాలి 10 సార్లు రోజు
కొబ్బరి లడ్డు, నువ్వుల లడ్డు తినాలి

దాంపత్యము :
వేసవి కాలం: 3 లేక 4 రోజులకు
వాన కాలం : 7 లేక 15 రోజులకు
చలికాలం : రోజు
1.తెల్ల తవుడు పావు కేజి జల్లించాలి
పాత బెల్లం పావు కేజి
ఆవు లేక గేద నెయ్యి పావు కేజి
అన్ని బాగ కలిపి దంచాలి దానిని 10 లేక 15 గ్రాముల వుండలు చేసి బాగ గాలికి
ఆరబెట్టి గాజు పాత్రలొ నిల్వ చేసుకొవాలి
వుదయం, సాయం కాలం వాటిని తిని, పాలలో పటిక బెల్లం కలుపుకొని త్రాగాలి ఇలా
40 రోజులు చేయలి 22
2. మఱ్ఱిచెట్టు దెగ్గరికి వెళ్ళి సుర్యోదయానికి ముందె, చెట్టు కి గాటు
పెట్టి దానికి పాలు వస్తాయి, వాటితో ఒక గుడ్డను తడిపి, దానిని నడుము మీద
అతికించాలి, అది వుడిపోదు..
౩.నల్లతుమ్మ చెట్టు జిగురు లేక బంక, తీసుకొని, దానిని చిన్నముక్కలుగ
చేసి, నెయ్యి వేసి వేయించాలి, దానిని పొడి చేసుకొని, దానిలో పటిక బెల్లం
పొడి కలిపి నిల్వ చెయ్యాలి, రోజు ఒక స్పూను తిని పాలు త్రాగాలి.
-------------------------------------------------------------------------

నడుము నొప్పి-౨
నడుము నొప్పి నివారణకు లేక రాకుండ తీసుకో వలసిన జాగ్రత్తలు-
-----------------------------------------------------------------------------
వ్యాయామము:
1.తూర్పుగా నిలబడి చేతులు వెనక కటి మీద పెట్టి రెండు పక్కలకు తిరుగుతు 10
సార్లు చేయాలి చేతులు రెండు నడుము మీద పెట్టి, గుండ్రము(round) గా
తిప్పాలి 10 సార్లు
౨. నౌకాసనం వేయాలి
ఆహారము:
కారము, చేదు, వొగరు, అతి వీడి, అతి చల్లని పదార్ధలు తింటె నడుము నొప్పి
వస్తుంది ఆవకాయ, పండుమిర పకాయ పచ్చడి తినకూడదు
తినవలసినవి:
మామిడి పండ్లు, అరటి పండ్లు, తీపి పదార్ధలు ఇంట్లో చేసినవి...
వెల్లుల్లి గారెలు :
మినప పిండిలో వెల్లుల్లి గుజ్జు
అల్లం 3 గ్రాములు
ఇంగువ 3 చిటికెలు
సైంధవలవణం పావు స్పూను
అన్ని కలిపి గారెలు చేసుకోవాలి 2 లేక 3 తినాలి ప్రతి రోజు తినడం వల్ల
మొకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, వాతము తగ్గుతాయి
మినుములు, సున్ని యేదొ విధముగ రోజు తినాలి
బాదం పప్పు పావు కేజి,మునిగెటట్టు వేడి నీటిలో రాత్రి నాన పెట్టి, వుదయాన
వాటి పొట్టు తీసి, యెండ పెట్టి పొడి చేసుకొవాలి,
గసగసాలు పావు కేజి పొడి చేసి జల్లించాలి
పటిక బెల్లం పావు కేజి
అన్ని కలిపి ఒక గాజు పాత్రలో నిల్వచేసుకొవాలి రోజు వుదయం పరగడుపున, సగం
గ్లాసు నీటి లో 2 స్పూనులు వేసుకొని త్రాగాలి
పైన చెప్పినది త్రాగడం వల్ల కళ్ళు బాగుంటాయి
జ్ఞానము, జ్ఞాపకము, ధారణా శక్తి పెంపొందుతుంది


ముఖ సౌందర్యము-
ముఖ సౌందర్యము, శరీర సౌందర్యము
పచ్చిపసుపు దుబ్బలు (లావుగ,పొడవుగా ఉంటాయి)
వీటిని చిన్న ముక్కలు చేసి బాగ ఎండ బెట్టి పొడి చేసుకోవాలి
నల్ల నువ్వులు దోరగ వేయించి పొడి చేసుకోవాలి
ఈ రెందు పొడులను పచ్చి పాలతో కాని నీటితో కలిపి స్నానానికి గంట ముందు
వంటి నిండ పట్టించి స్నానం చేయాలి
ఈ విధంగా రోజు చేయడం వల్ల , మంచి నిగారింపు వస్తుంది
---------------------------------------------------------------


తక్కువ రక్తపోటు-
లో రక్తపోటు కి తీసుకోవల్సినవి :
-----------------------------------------------------
1. రోజు బస్రిక ప్రాణాయామం చేయలి
2. అల్లం రసం 1 స్పును
నిమ్మ రసం 1 స్పూను
తేనె 1 స్పును
అన్ని బాగ కలిపి ఒక గంట ఆహారానికి ముందు ఉదయం, సాయంకాలం తీసుకోవాలి,దీని
వల్ల అరుగుదల జరిగి, బాగ అకలి వేస్తుంది, దీనిని పెద్దలు, పిల్లలు
తినవచ్చు, పిల్లలకు వారి వయస్సు ప్రకారం ఇవ్వాలి.
3. ఎండు ద్రాక్ష సగం(1/2) గ్రాం లేక ఎండు కజ్జూర
అంజీర 2
అన్ని రాత్రి సగం గ్లాసు నీటి లో నాన బెట్టి, ఉదయానె ఆ నీటిని వడ పోసి
త్రాగాలి, నానిన పండ్లను తినాలి తరవాత ఒక గంట వరకు ఏమి తిన కూడదు
ఈ విధం గా 40 నుండి 100 రోజులు దాక తీసుకోవాలి
4. చిన్న టమాటాలు 2
క్యారెట్ 1
బీట్ రూట్ 3 ముక్కలు రోజు సాయంకాలం 4 లేక 5 గంటలకు తినాలి
పైనవి పాటించినచో లో రక్తపోటు నుండి విముక్తి పొందవచ్చు
--------------------------------------------------------

చేతులు, కాళ్ళ పగుళ్ళ నివారణ:-
---------------------------------------------------------
ప్రాణయామము:
చంద్ర భేధన బస్రిక ప్రాణాయమము:
1) కుడి ముక్కు మూసి, ఎడమ ముక్కు నుండి వేగం గా గాలి పీలుస్తూ ఉండాలి
2) ఎడమ ముక్కు నుండి నిమ్మది గా గాలి పీలుస్తూ, కుడి ముక్కు నుండి
నిమ్మది గ వదలాలి
సీతలీ :
నాలుకను రెండు ప్రక్కలు మడవాలి అది ఒక గొట్టం లాగ వస్తుంది, నిమ్మది గా
గాలి పీల్చాలి, చల్లటి గాలి లోపలికి వెలుతుంది.నాలుకని మాములు గా పెట్టి,
నిమ్మదిగా గాలి వదిలెయాలి.
సీత్ కారి:
పెదాలు తెరిచి పైన పళ్ళను, క్రింద పళ్ళ ను భిగింధి, గాలి నిమ్మది గా
పీల్చాలి, మళ్ళి నోరు మాములుగ పెట్టి గాలి నిమ్మది గ వదిలెయాలి.
అ) రాత్రి పడుకునె ముందు తప్పకుండ కాళ్ళకు, చేతులకు కొబ్బరి నూనె
వ్రాయాలి
ఆ) కుంకుడు కాయ రసంతో పగుళ్ళను బ్రషుతో రుద్దాలి
ఇ) జీలకర్ర 100 గ్రాములు పొడి చేయలి
దనియాలు 100 గ్రాములు దనియలు దోరగ వేఇంచి పొడి చేసుకొవలి
పటికబెల్లం 100 గ్రాములు అందులో కలిపి, గాజు సీస లో నిల్వచేసుకోవాలి.
దీనిని రోజు అర స్పూను మూడు పూటలా తినాలి,ఆహారనికి 30 నిమిషాలు ముందు,
దీని వళ్ళ వేడితగ్గుతుంది.
కాకర కాయ లేక కాకర ఆకు బాగ నూరి అందులో పసుపు కలిపి రాత్రి పడుకునె ముందు
వ్రాసుకొని పడుకొవాలి
జలుబు మరియూ ఆస్త్మ నివారణకు-
వ్యాయామము:
ఉజ్జయి ప్రాణాయామము: గొంతును బిగించి, గాలి పీల్చి,కుడి ముక్కు మూసి, ఎడమ
ముక్కుతో గాలీ వదలాలి
సూర్యభేధన ప్రాణాయామము:
ఎడమ ముక్కు మూసి కుడి ముక్కుతో గాలి పీల్చి,మళ్ళి కుడి ముక్కు మూసి ఎడమ
ముక్కుతో వదలాలి
ధీర్గ భస్రిక:
దీర్గం గా గాలి పీల్చి, నిమ్మదిగా వదలాలి
భుజంగాసనం:
బోర్ల పడుకొని చేతులు చాతి పక్కన పెట్టి,గాలి పీల్చుతూ చాతి వరకు పైకి
లేపాలి , వదులుతూ క్రిందకు రావలి

దుమ్ము, ధూళి, కఫము, తుమ్ముల నివారణ :
తులసి టీ:
తులసి ఆకులు 10
మిరియాలు 10
అల్లం 2 గ్రాములు
తులసి ఆకు, మిరియాలు దంచి, 2 కప్పుల నీటి లో వేయాలి, పొయ్యిమీద పెట్టి
మరిగించాలి 1 కప్పు అయ్యెవరకు, దించేసి వడపోసి అందులూ 1 స్పూను పటిక
బెల్లం పొడి వేసికొని ఉదయం, సాయంకాలం త్రాగాలి, త్రాగిన తరవాత, 1 గంట
వరకుయేమి తినకూడదు, స్నానము చేయరాదు
ఆస్త్మ:
పసుపు కొమ్ములు 100 గ్రాములు ముక్కలు చేసి పొడి చేయాలి
పాత గొదుమలు 100 గ్రాములు దోరగా వేయించి పొడి చేయాలి
రెండు కలిపి నిల్వచేయాలి
బాగా ఆస్త్మ వుంటే, పిల్లలకు చిటికెడు, పెద్దలు 2 లేక 3 చిటికెలు గోరు
వెచ్చని నీటిలో కలుపుకుని త్రాగాలిఆస్త్మ నివారణకు:-
ఆవ నూనెను గోరువెచ్చగ చేసి మొఖము నుండి ఛాతీ వరకు పట్టించి క్రింద
వ్యాయామాలు చేయాలి
1. నిలుచుని చేతులు ముందుకు చాపి ప్రక్కలకు తీసుకొని వెళ్ళాలి ఇలా 10
సార్లు
2. నిలుచుని చేతులు ముందుకు చాపి పైకి తీసుకొని వెళ్ళాలి ఇలా 10 సార్లు
3. నిలుచుని చేతులు ప్రక్కలకు చాపి, పైకి తీసుకొని నమస్కారాం పెట్టలి 5
సార్లు
4. చేతులను ప్రక్కలకు చాపి, గుండ్రము గా తిప్పాలి, ముందుకు, వెనకకు ఇలా
10 సార్లు చెయాలి
పిత్తము, వాతము, కఫము వల్ల ఊపిరి తిత్తులలొ సమస్యలకు నివారణకు:
కరక్కాయల పొడి 100 గ్రాములు
తానికాయల పొడి 100 గ్రాములు
ఉసిరికాయల పొడి 300 గ్రాములు
పిప్పళ్ళ పొడి 100 గ్రాములు
గమనిక: ఉసిరి ఫొడి =కరక్కాయల ఫొడి+తానికాయల ఫొడి+ పిప్పళ్ళ ఫొడి
అన్ని విడివిడి గా పొడులు చేసుకొని, జల్లించి పెట్టు కొని ముందుగ
కరక్కాయల పొడి ఒక ప్లేటు లోకి తీసుకొని, దానిలో తానికాయల పొడి కొంచం
కొంచం గా కలపాలి, తరవాత ఉసిరి పొడి,ఆ తరవాత పిపళ్ళ పొడి అదేవిధము గా
కలిపి ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకోవాలి
రోజు పావు స్పూను పొడి లో ఒక స్పూను తేనె కలిపి ఆహారనికి 30 నిమిషముల
ముందు తినాలి దీనిని 40 రోజులు వదలకుండ వాడాలి.
బాగ ఆస్త్మ వుంటే రోజుకు 3 సార్లు తినాలి
దీని వల్ల వేడి చేస్తె పొడి ని కొంచం తక్కువగా తీసుకోవాలి
-------------------------------------------------------------------------------
రాలుతున్న జుట్టుకు, తెల్లని జుట్టు నివారణకు కలబంద నూనె-
-------------------------------------------------------------------------
కలబంద నూనె తయారు చేసే విధానం:
కలబంద గుజ్జు పావు కిలో
కొబ్బరి నూనె పావు కిలో
కలబంద మట్టను తీసుకుని, దానిని చీల్చి లోపల వున్న గుజ్జును
గీరాలి,ముద్దలు గా వేయవద్దు, గీరితె సాగుతూ వస్తుంది.
ఒక బాండి లొ కొబ్బరి నూనె ను పో సి, అందులో, ఈ కలబంద గుజ్జును వేసి బాగ
నూనెలో కలిసిపోయెటట్టు కలపాలి, బాండి పొయ్యి మీద పెట్టి సన్నని సెగ
పెట్టి, కలుపుతూ వుండాలి అడుగు అంటకుండ, నీరు అంతా ఆవిరి ఆయిపోయి నూనె
మాత్రమే మిగులుతుంది.
దించెముందు మర్వం లేక ధవనం వేసి కలపాలి, వాసనకు మాత్రమే, వెయ్యక పోయిన
పరవాలేదు .
ఈ నూనెను రోజు గోరువెచ్చగా చేసి తలలో కుదుళ్ళకు వ్రాసి బాగ మర్దన చేయాలి
------------------------------------------------------------------------------

మతిమరుపు నివారణకు:
--------------------------------------------------------------------------------
౧. సుఖాసనం లేక పద్మాసనం లో కూర్చుని, ఒక దీపం వెలిగించి ఏకాగ్రతతో
దానిని చూడాలి, కళ్ళు నొప్పిగా వున్న ఏకాగ్రత కోల్పొకూడడు.
2 రోజు చదువుకునే ముందు, ఉదయం, సాయంత్రం 'అ కారం', 'మ కారం', 'ఓం కారం'
కళ్ళు మూసుకొని జపించాలి కనీసం 5 నిమిషాలు.
3 బ్రమరి ప్రాణాయమం 'మ కారం' అనాలి
౪. ఏకాగ్రత కోసం పిల్లలకు పద్మాసనం అలవాటు చేయాలి.
ఆహారము:
తెల్లవారు జామున లేచి స్నానం చేసి, పైన చెప్పిన వ్యాయమాలు 10 నిమిషాలు
చేసి, చదవడం మొదలు పెట్టాలి.
సాయంత్రం 7 గంటలకు అన్నం తినేసెయాలి
బాదం పాలు
బాదం పొడి
సోంపు గింజలలు దోరగ వేయించి పొడి చేయాలి
పటిక బెల్లం
అన్ని తగినంత తీసుకొని, ఒక గ్లాసు పాలల్లో కలిపి పడుకునే ముందు రోజు
తప్పకుండ త్రాగాలి .
*గది లో సరస్వతి దేవి ఫోటొ పెట్టు కొని బొటనవెళ్ళను బ్రొకటి మీద పెట్టి
నమస్కారం చేయాలి.
* సరస్వతి చూర్ణం
సరస్వతి ఆకు పొడి 100 గ్రాములు
అశ్వగంధ పొడి 100 గ్రాములు
అతిమధురం పొడి 100 గ్రాములు
పటిక బెల్లం పొడి 100 గ్రాములు
అన్ని కలిపి, జల్లించి నిల్వచేసుకోవాలి
పిల్లల వయస్సును బట్టి కొంచం పొడి పాల్లలో కాని , నీటి లో కాని కలిపి
ఇవ్వాలి, లేదా పొడిని కొంచం తిని నీరు త్రాగాలి
---------------------------------------------------------------------

జ్ఞాన శక్తి కోసం-
------------------------------------------------------------------------
చదువుకునే ముందు పద్మాసనంలో జ్ఞాన ముద్ర వేసుకొని కూర్చుని బ్రామరి
ప్రాణాయామం 'మా' కారం అంటు చేయాలి
తూర్పుకు యెదురు గా కూర్చుని నిటారుగా గాలి పీల్చి, నిదానంగా వదలాలి
అశ్వగంధి 100 గ్రాములు
తాది బెల్లం 100 గ్రాములు రెండు బాగ దంచి కలిపి ఉదయం, సాయంత్రం తినాలి
మోచేతిని వంచకుంద చెయ్యి చాపి, బొటన వేలుని నొక్కుతూ వదలాలి [ఒక 10 లేక
15 సార్లు]
----------------------------------------


ఆస్తమా సమస్య-
---------------------------------------------
అ) పిప్పళ్ళను దోరగ వెయించి మెత్తగ పొడి చేయాలి 50 గ్రాములు
సైంధవ లవణము మెత్తటి పొడి 50 గ్రాములు
పాత బెల్లం 150 గ్రాములు
రొట్లొ అన్ని వేసి బాగ దంచి, దానిని నిల్వచేసుకోవాలి
రోజు 10 గ్రాము మొతాదు తినాలి

ఆ) ఆవు పాలు 400 గ్రాములు
నువ్వుల నూనె 100 గ్రాములు
అతిమధురం 10 గ్రాములు
ఈ మూదు బాగ కలిపి, పొయ్యి మీద పెట్టి సన్న సెగ మీద మరిగించాలి, నువ్వుల
నూనె మాత్రమే మిగులుతుంది, దానిని చల్లార్చి, నిల్వచేయాలి, దానిని ఒక
చుక్కల సీస లో పోసుకొని, రోజు, ఉదయం, సాయంత్రం 2 చుక్క చొప్పున ముక్కులొ
వేసుకోవాలి.
-------------------------------------------

దోమల నివారణకు:
-----------------------------------------------
వేప ఆకు పొడి
ఆవాలు దోరగ వేయించి పొడి చేయాలి
కర్పూరం
కల్లుప్పు పొడి
మట్టి పాత్ర
పిడకలు (ఆవు లేక గేద)
పిడకలు మట్టి పాత్ర లొ వేసి, దాని మీద, కర్పూరం వెలిగించి దానిలో మంట
వచ్చాక కసేపు బయట పెట్టాలి, కసేపు వుంచి దానిని ఇంట్లో పెట్టి, అన్ని
తలుపులు వేసేసి, ఆ మంట మీద పైన చేసిన పొడులు నిమ్మది నిమ్మదిగ వేయాలి
అపుడు పొగ వస్తుంది, ఆ పొగను 15 లేక 20 నిమిషాల పాటు, ఇంట్లో అన్ని
గదులలో వేయాలి
పైన చెప్పిన వాటితో పాటు ఇప్పుడు చెప్పె వాటిని కూడ వాడవచ్చు ఉత్తరేణి
ఆకుల పొడి కానుగ లేక గానుగ పొడిసీతఫలం ఆకు పొడి పొగాకు పొడి .
ఈ పొగ వేయడం వల్ల, మనకు చాల ఉపయోగము, కఫము వున్న, ఊపిరిత్తిత్తులలో ఏమన్న
సమస్యలు ఉన్న నివారిస్తుంది.
---------------------------------------------



బట్టతల నివారణకు -
-----------------------------------------------
వేప నూనె, ఆవ నూనె తల నుండి పాదాల వరకు వ్రాసుకోవాలి తలకు రోజు నూనె
పెట్టాలి, లేదా వారనికి 2 సార్లు రాత్రి నూనె పెట్టి నిమ్మదిగ 15 లేక 20
నిమిషాముల పాటు మర్దన చేసి, ఉదయం కుంకుడు కాయలతో కాని, శికకాయ తో కాని తల
స్నానము చేయాలి .
బట్టతల మొదలు అవుతునపుడె త్రిఫలాలు (వుసిరి,కరక్కయ,తానికయలు) అన్ని 10,
10 ముక్కల చొప్పున తీసుకుని, రాత్రి నాన పెట్టి, ఉదయానే నీటిని వడ పోసి,
ఆ నీటిని తలకు వ్రాసుకోవాలి, రోజు చేయలి, బట్టతల రాదు, వచ్చిన చోట జుట్టు
వస్తుంది.
-----------------------------------------------


ఎసిడిటీ నివారణకు -
---------------------------------------------
కిస్మిస్ ౧౦౦ గ్రాములు
అల్లం౨౦ గ్రాములు
పెద్ద సొంపు గింజలు ౨౦ గ్రాములు
మిరియాలు ౨౦ గ్రాములు (దోరగా వేయించి దంచి )
సైంధవ లవణము ౧౦ గ్రాములు
అన్ని కలిపి రొట్లో వేసి బాగ నూరాలి
గ్యాస్, కఫం, జఠరాగ్ని నివారణకు, ఆహారము జీర్ణము, సుఖ విరోచణమునకు ఉపయోగ
పడుతుంది.
దీనిని అన్నం లోకాని, చపాతి లో కాని తినవచ్చు

నోట్: అతి గా తినారాదు తింటే విరోచనాలు అవుతాయి.
-----------------------------------------
కంటి చూపు సమస్యకు--
---------------------------------------------
కరక్కాయల పొడి 30 గ్రా
తానికాయల పొడి 60 గ్రా
ఉసిరికాయల పొడి 90 గ్రా
అథి మధురం పొడి 10 గ్రా
వెదురుప్పు (తెల్లగ వుంటుంది) 10 గ్రా
పిప్పళ్ళ పొడి దోరగావేయించి పొడి చేయాలి 20 గ్రా
పటిక బెల్లం పొడి 440 గ్రా
(పైన పొడులు అన్ని కలిపిన దానికి రెండు రెట్లు పటిక బెల్లం వేయాలి)
అన్ని పొడులు బాగ కలిపి, గాజు సీస లో నిల్వ చేసుకోవాలి
10 సంవత్సరాల లోపు -- 1/4 స్పూను పొడి, 1/4 స్పూను నేయ్యి, 1/2 తేనె అనగా
మూడు వేళ్ళతో వచ్చినంత పొడిని తీసుకోవాలి
పెద్దవాళ్ళకు 1/2 స్పూను, 1/2 స్పూను నేయ్యి, 1 తేనె వయస్సును బట్టి
మోతాదు ఇవ్వాలి
ఇలా వాడుతు వుంటె కొన్ని రోజులకు కళ్ళ అద్దాలను తీసేయవచ్చు.

--

Read more...

హింస అహింస విచక్షణ


[- అప్పరుసు రమాకాంతరావు]
హింస చేయటం వదలి అహింసే పరమధర్మంగా మెలగాలని నీతిసూత్రాలు బోధిస్తున్నాయి. అహింసా ధర్మాన్ని అనుసరించి క్షమ, శాంతి, దయ కలిగి ఉండాలి. అహింస కోసం, శాంతి, క్షమతో ప్రవర్తిస్తే ఎదుటివారి దృష్టిలో అసమర్థుడిగా జీవించే హీనపరిస్థితి కలిగే అవకాశం ఉంది. సర్వదా క్షమ, సర్వదా తీక్షణత్వం శ్రేయస్కరం కాదు. ఈ కారణం చేతనే పండితులు క్షమకు ఉపవాదాన్ని చెప్పారు. హింస అనాచరణీయమనే నీతి సర్వకాలాల్లోనూ యోగ్యం కానేరదు. మన దారిన మనం వెళ్తోంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చి అనవసరంగా మనల్ని బాధిస్తే శాంతం వహించడం అసమర్థత కిందికే వస్తుంది. శాంతంగా ఉండేవాణ్ని భార్యాపుత్రులు సైతం అపహాస్యం చేస్తారని ప్రహ్లాదుడు తన మునిమనమడైన బలి చక్రవర్తికి బోధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ మనకు లౌక్యత గురించి తెలుపుతుంది.

ఒక మహా నాగసర్పం భయంకరమైన విషకోరలతో పెద్దపడగతో బుసలు కొడుతూ ఆ దారిన వెళ్లే ప్రతి మనిషినీ కాటు వేసి చంపాలని ప్రయత్నించేది. పాముందనే భయంతో ప్రజలందరూ అధిక శ్రమకోర్చి చుట్టు దారిలో ప్రయాణించేవారు. ఒకరోజు ఆ నాగసర్పం సంచరించే దారిగుండా ఒక ముని నడుస్తూ అడవి వైపు వెళ్లసాగాడు. మనిషి నడుస్తున్న శబ్దం గమనించి నాగసర్పం ఆ మునిని కాటు వేయడానికి జరజరా రాసాగింది. దాని రాకను గమనించిన ముని 'నాగరాజా! నన్ను కాటువేయాలని వస్తున్నావు కదా! కాస్త ఆగు! నేను చెప్పేది విను' అన్నాడు. తనను గమనించగానే భయపడి పరుగెత్తే జనాన్ని చూసిన విషసర్పం, ముని పవిత్రతనూ ఆయన ధైర్యాన్నీ గమనించి ఆగిపోయింది. అప్పుడు ముని ఆ విషసర్పానికి కొన్ని మంచి మాటలు చెప్పాడు.

'నాగరాజా! గత జన్మలో ఇంతకన్నా శ్రేష్ఠమైన జన్మ ధరించిన నీవు, కొన్ని పాపకర్మల వల్ల నాగుగా జన్మించావు. నీకు ద్రోహం చేయని వారిని కాటువేస్తూ, ఈ జన్మలో మరింత పాపాన్ని మూట కట్టుకొంటున్నావు. ఇక ముందు నీవు ఎవరికీ హాని చేయనని వాగ్దానం చేస్తే వచ్చే జన్మ మళ్లీ శ్రేష్ఠమైన జన్మ లభించేట్లు దీవిస్తాను' అన్నాడు. నాగుపాము తలవంచి 'మునివరా! నాకు జ్ఞానోదయం కలిగించావు. ఇకపై నేను ఎవరికీ హాని తలపెట్టను, కాటువేయను' అని వాగ్దానం చేసింది. ఆ పామును దీవించి ముని వెళ్లిపోయాడు.

అప్పటి నుంచీ నాగసర్పం ఎవరికీ హాని చేయకుండా బతకసాగింది. అతి త్వరలోనే చాలామందికి పాము విషయం తెలిసిపోయింది. అది చాలా మంచితనంతో అమాయకంగా, అపాయం తలపెట్టకుండా జీవిస్తోందని అందరూ గమనించారు. దాంతో పిల్లలు, పెద్దలు నాగసర్పాన్ని ఆటపట్టించడం ప్రారంభించారు. రాళ్లతో కొట్టడం, కర్రలతో గాయపరచడంవల్ల సర్పానికి దేహం నిండా పుళ్లూ తీవ్రగాయాలయ్యాయి. మునికి ఇచ్చిన వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ పాము బాధలను సహిస్తూ గాయాలపాలై జీవనం గడుపుతోంది.

కొన్నాళ్లకు ఆ ముని అడవినుంచి గ్రామంవైపు వెళ్తూ ఆ నాగసర్పాన్ని గమనించాడు. ఒంటినిండా గాయాలతో, బాధతో నాగసర్పం బలహీనంగా, దీనంగా పడిఉంది. ముని ఆశ్చర్యపోతూ, 'ఎందుకిలా గాయాలయ్యాయి' అని అడిగాడు. ఆ పాము జరిగిందంతా చెప్పి 'ఇతరులకు హాని తలపెట్టి, హింసకు పాల్పడవద్దన్నారని మీరు బోధించడంవల్ల నేను ఎవరికీ ఏమీ చేయడంలేదు' అన్నది.

అప్పుడా ముని 'పిచ్చిదానా! నిన్ను హాని తలపెట్టవద్దనీ, కాటు వేయవద్దనీ చెప్పాను కాని, నీ స్వాభావిక నైజమైన 'బుస' కొట్టడం వద్దన్నానా!' అంటూ చక్కాపోయాడు.

కనుక, మనిషి ప్రతిఘటన అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎంతవరకు మంచిదంటే- తననూ, తనవారినీ హానికి గురిచేస్తున్న వారిపై క్రోధం వహించక తప్పదు. ఇదే ప్రాతిపదికపై భారతయుద్ధం సందర్భంలో యుద్ధం చేయాల్సిందిగా గీతాచార్యుడు ఫల్గుణుడికి బోధించాడు. తనకు అవమానం జరిగినా రోషం కలగని వానితో స్నేహం ఉన్నా, ద్వేషం ఉన్నా ప్రయోజనం సమమేనని కిరాతార్జునీయంలో భారవి చెప్పాడు.



Read more...

జపాన్ విలయానికి కారణం క్రీస్తును నమ్మకపోవటమట.

>> Friday, March 18, 2011

జపాన్ వినాశనానికి కారణం కిరస్తానీ మతప్రచారకులు చెప్పేస్తున్నారు. మొన్న నిన్నటినుంచి మాచుట్టుగ్రామాలలో కిరస్తానీ ఫాదరీలు సభలు జరుపుతున్నారు. ఆరోగ్యం,అప్పులబాధలనుండి తప్పుకోవాలంటే ఈసువార్తసభలలో పాల్గొనమనివారు మైకులలో ప్రచారం చేసుకుంటున్నారు. అంతవరకు పరవాలేదు. రాత్రి హోరెత్తిపోయే మైకులలో వాల్ల ఉపన్యాసం విన్నాక మనుషులు ఇంతనీచంగాకూడా ఆలోచిస్తారా అని జుగుప్సకలుగుతున్నది. జపాన్ వినాశనానికి కారణం వాళ్లుక్రీస్తును నమ్మకపోవటం వలనట . క్రీస్తును నమ్మకపోతే ఎవరికైనా ఈ గతే పడుతుందని నిస్సిగ్గుగా గొంతుచించుకుని కేకలు వేస్తు చెబుతున్నారు.
ఎక్కడైనా ఎవరికన్నా ఆపదసంభవిస్తే జాలిపడతాం . ఇంత ఘోరం చూసిన మనిషన్న ప్రతివాడు బాధపడుతున్నారు . లోకమంతా శుభంగా ఉండాలని కోరుకునే మతాచార్యులను చూశానుగాని ఇలాంటి పైశాచికానందాన్ని పొంది దీనిని మతప్రచారానికి ఉపయోగించుకునే వారిని చూసి ఆ మహానుభావుడు క్రీస్తుదేవుడెంత బాధపడతారో.
మనుషులం ఇంకెంత దిగజారతామో తలచుకుంటే భయమేస్తోంది

Read more...

కాముని పున్నమి

>> Thursday, March 17, 2011

మనకి ప్రతి సంవత్సరం పాల్గుణ పూర్ణిమ తిది నాడు వస్తుంది. దీన్ని కాముని
పున్నమి అనీ , కామ దహన మనీ , వసంతోత్సవ మనీ , హోలీ పండుగ అనీ
పిలుస్తారు .ఉత్తర భారతీయులు , హోలీ గాను , రాఖీ పూర్ణిమ గాను ఎక్కువగా
వ్యహరిస్తారు. దీన్నే రక్షా బంధనమని కుడా అంటారు.
ఐతే వీటి వెనుక అనేక పురాణ కధలూ దాగి ఉన్నాయి. " కామానికి " అది దేవుడు
మన్మధుడు .అంటే మనస్సును చిలికే వాడు , మదించే వాడు , మనస్సుని కల్లోల
పరచే వాడు . అని అనేక అర్ధాలు ఉన్నాయి. అటువంటి మన్మధుడు , రతీ దేవితో
చేరి పార్వతీ పరమేశ్వరులను , కల్లోల పరచ బోయి , త్రినేత్రుడి ఆగ్రహానికి
గురియై , త్రినేత్రాగ్ని లొ పడి భస్మం అయ్యాడు .అందు వలన ఆరోజు " కాముని
పున్నమి అంటారు . "
ఇక పొతే " వసంతిక " అనే మహా భక్తు రాలు అంద గాడైన భర్త వ్యాహం లొ పడి ,
శివా రాధనకి దూరమైంది .అందువలన పార్వతీ దేవి ఆగ్రహానికి గురియై అగ్ని
ప్రవేశం చేసింది . అందుకు ఆ భక్తు రాలి భక్తికి సంతసించి , ఆమె చితిని
పూల పాన్పుగా మార్చి , " అమ్మా ! వసంతికా ! వసంతంతో సమాన మైన
యవ్వనాన్ని ,అంద గాడైన నీ భర్తనీ ,లక్ష్య పెట్టక , తుచ్చ మైన కామాన్ని ,
అగ్నికి ఆహుతి చేసావు .గనుక ఈ రోజు " పాల్గుణ పౌర్ణిమ " . ఇంతటి పవిత్ర
మైన రోజు కావున , నీ త్యాగ నిరతికి సంతసించి ,ఈ రోజు నీ పేరున '
వసంతోత్సవం గా ప్రసిద్ధ మౌతుంది " . అని దీవింఛి , అదృశ్య మయ్యారు .
ఇక నిజానికీ ఈ పండుగ " హోలీ " కాదు. దీన్ని " డోలీ " గా గుర్తించాలి .
అదెలా ? అంటే " హోలిక " అనే రాక్షసీ పూర్వం కృత యుగంలో , " రఘునాధుడు "
అనే రాజు ఉండే వాడు .అతని రాజ్యం లొ ఆ రాక్షసి కేవలం శిశువులను
మాత్రమె హతమారుస్తూ ఉండె దట .అందువలన ఆ రాజు ఆ హోలిక అనే రాక్షసిని
సంహరించా లని ప్రయత్నిం చగా దేవ ఋషి నారదుడు అడ్డుబడి ," స్త్రీని
సంహరించడం రాజ లక్షణం కాదని , " వారించి కేవలం ఆమెని శాంతింప జేయడం
కోసం ప్రతి సంవత్సరం ," పాల్గుణ పూర్ణిమ " నాడు , " హోలికకు " వర్ణ
జలోత్శవం [ రంగు రంగుల నీటితో ] చేయాలని ఆదేశిం చాడు . అందువలన శిశు
మరణాలు సమసి పోయాయి. '[ ఈ వృత్తాంతాన్ని , ధర్మ రాజు శ్రీ కృష్ణునికి
చెప్పి నట్టుగా భవిషత్ పురాణములో పేర్కొన బడినది ]
ఇంతకీ ఈ " హోలిక " హిరణ్య కశిపునకు సోదరి.
ఈ హోలికనే " డోలికా ఉత్సవ మని పేర్కొన బడినది. అందుకు నిదర్శనం గా పురాణ
వాజ్ఞ్మయం ప్రకారం పాల్గుణ పున్నమి నాడు ,గోవిందుడు ఊ యల యందు శయనిం
చును .గాన దీనికి " డోలికా " ఉత్సవము అని ప్రతీతి .అందువలన ఎంత
చిన్నదైనా ఊ యల ప్రతిమను దానం చేస్తే , వైకుంథ వాసి అవుతారని నమ్మకం. ఇక
" హోలిక వృత్తాంతం పేరిట " హోలీ " గా పిలువ బడుతోంది. గనుక రంగులు జల్లు
కోవడం ఒక వినోదం ఆన్న మాట .
[శ్రీమతి రాజేశ్వరి గారి రచన]

Read more...

ఓ అద్భుత సంవాదం


Awesome Conversation (Must Read) Don't miss even a single word... Too good

An atheist professor of philosophy speaks to his class on the problem science has with God, The Almighty. He asks one of his new students to stand and.....
Prof:-So you believe in God?
Student:-Absolutely, sir.
Prof: -Is God good?
Student:-Sure.
Prof:-Is God all-powerful?
Student: -Yes.
Prof:-My brother died of cancer even though he prayed to God to heal him. Most of us would attempt to help others who are ill. But God didn't. How is this God good then? Hmm?

Prof:-You can't answer, can you? Let's start again, young fellow Is God well?
Student:-Yes.
Prof:-Is Satan good?
Student: - No.
Prof:-Where does Satan come from?
Student:-From...God....
Prof:-That's right. Tell me son, is there evil in this world?
Student:-Yes.
Prof:-Evil is everywhere, isn't it? And God did make everything. Correct?
Student:-Yes.
Prof:-So who created evil?


(Student does not answer.)


Prof:-Is there sickness? Immorality? Hatred? Ugliness? All these terrible things exist in the world, don't they?
Student:-Yes, sir.
Prof:-So, who created them?

Prof:-Science says you have 5 senses you use to identify and observe the world around you. Tell me, son...Have you ever
seen God?
Student:-No, sir.

Prof:-Tell us if you have ever heard your God?
Student:-No, sir.

Prof:-Have you ever felt your God, tasted your God, smelt your God? Have you ever had any sensory perception of God for that matter?
Student:-No, sir. I'm afraid I haven't.

Prof: -Yet you still believe in Him?
Student:-Yes.

Prof:-According to empirical, testable, demonstrable protocol, science says your GOD doesn't exist. What do you say to that, son?
Student:-Nothing. I only have my faith.

Prof:-Yes. Faith. And that is the problem science has.
Student:-Professor, is there such a thing as heat?

Prof:-Yes.
Student:-And is there such a thing as cold?

Prof:-Yes.
Student:-No sir. There isn't.

(The lecture theatre becomes very quiet with this turn of events.)


Student-: Sir, you can have lots of heat, even more heat, superheat, mega heat, white heat, a little heat or no heat. But we don't have anything called cold. We can hit 458 degrees below zero which is no heat, but we can't go any further after that.
There is no such thing as cold. Cold is only a word we use to describe the absence of heat. We cannot measure cold. Heat is energy. Cold is not the opposite of heat, sir, just the absence of it. (There is pin-drop silence in the lecture theatre.)

Student:-What about darkness, Professor? Is there such a thing as darkness?
Prof:-Yes. What is night if there isn't darkness?
Student:-You're wrong again, sir. Darkness is the absence of something. You can have low light, normal light, bright light, flashing light....But if you have no light constantly, you have nothing and its called darkness, isn't it? In reality, darkness isn't. If it were you would be able to make darkness darker, wouldn't you?

Prof:-So what is the point you are making, young man?
Student:-Sir, my point is your philosophical premise is flawed.

Prof:-Flawed? Can you explain how?
Student:-Sir, you are working on the premise of duality. You argue there is life and then there is death, a good God and a bad God. You are viewing the concept of God as something finite, something we can measure. Sir, science can't even explain a thought. It uses electricity and magnetism, but has never seen, much less fully understood either one. To view death as the opposite of life is to be ignorant of the fact that death cannot exist as a substantive thing. Death is not the opposite of life: just the absence of it.
Now tell me, Professor. Do you teach your students that they evolved from a monkey?

Prof:-If you are referring to the natural evolutionary process, yes, of course, I do.
Student:-Have you ever observed evolution with your own eyes, sir?

Student:-Since no one has ever observed the process of evolution at work and cannot even prove that this process is an on-going endeavor, are you not teaching your opinion, sir? Are you not a scientist but a preacher? (The class is in uproar.)
Student:-Is there anyone in the class who has ever seen the Professor's brain?
(The class breaks out into laughter.)
Student: - Is there anyone here who has ever heard the Professor's brain, felt it, touched or smelt it? No one appears to have done so. So, according to the established rules of empirical, stable, demonstrable protocol, science says that you have no brain, sir. With all due respect, sir, how do we then trust your lectures, sir?


Prof:-I guess you'll have to take them on faith, son.
Student:-That is it sir.... The link between man & god is FAITH . That is all that keeps things moving & alive.


NB: I believe you have enjoyed the conversation...and if so...you'll probably want your friends/colleagues to enjoy the same...won't you?..... This is a true story, and the


student was none other than.........

..
Albert Einstein
regards
rajanikanth

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP