శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జపాన్ విలయానికి కారణం క్రీస్తును నమ్మకపోవటమట.

>> Friday, March 18, 2011

జపాన్ వినాశనానికి కారణం కిరస్తానీ మతప్రచారకులు చెప్పేస్తున్నారు. మొన్న నిన్నటినుంచి మాచుట్టుగ్రామాలలో కిరస్తానీ ఫాదరీలు సభలు జరుపుతున్నారు. ఆరోగ్యం,అప్పులబాధలనుండి తప్పుకోవాలంటే ఈసువార్తసభలలో పాల్గొనమనివారు మైకులలో ప్రచారం చేసుకుంటున్నారు. అంతవరకు పరవాలేదు. రాత్రి హోరెత్తిపోయే మైకులలో వాల్ల ఉపన్యాసం విన్నాక మనుషులు ఇంతనీచంగాకూడా ఆలోచిస్తారా అని జుగుప్సకలుగుతున్నది. జపాన్ వినాశనానికి కారణం వాళ్లుక్రీస్తును నమ్మకపోవటం వలనట . క్రీస్తును నమ్మకపోతే ఎవరికైనా ఈ గతే పడుతుందని నిస్సిగ్గుగా గొంతుచించుకుని కేకలు వేస్తు చెబుతున్నారు.
ఎక్కడైనా ఎవరికన్నా ఆపదసంభవిస్తే జాలిపడతాం . ఇంత ఘోరం చూసిన మనిషన్న ప్రతివాడు బాధపడుతున్నారు . లోకమంతా శుభంగా ఉండాలని కోరుకునే మతాచార్యులను చూశానుగాని ఇలాంటి పైశాచికానందాన్ని పొంది దీనిని మతప్రచారానికి ఉపయోగించుకునే వారిని చూసి ఆ మహానుభావుడు క్రీస్తుదేవుడెంత బాధపడతారో.
మనుషులం ఇంకెంత దిగజారతామో తలచుకుంటే భయమేస్తోంది

7 వ్యాఖ్యలు:

udaya March 19, 2011 at 1:12 AM  

atlaa untay anni

చాలా బాగా March 19, 2011 at 1:13 AM  

దేవుడు శాంతిని కోరుకుంటాడేగాని, ఎంతటి దుర్మార్గుడు నైనా చంపాలని అనుకోడు. ఇది ఏ మతము కైనా వర్తిస్తుంది.

చాలా బాగా March 19, 2011 at 1:14 AM  

God is peaceful, He wont hurt anyone. This applies to all regions.

Anonymous March 19, 2011 at 4:25 AM  

అలా అయితే మఱి మొన్న న్యూజీల్యాండులో వచ్చిన భూకంపానికి కారణం వాళ్ళు క్రీస్తుని నమ్మడమా ?

TM Raveendra March 19, 2011 at 6:07 AM  

న్యూజిలాండ్ లో ఈ మధ్యనే క్రిస్ట్ చర్చ్ అనే ప్రదేశం లో పెద్ద భూకంపం వచ్చింది , చాల మేడలు మిద్దెలు కూలి పోయాయ్. ఆ నగరం పేరే క్రిస్ట్ చర్చ్ అక్కడ ఎన్నో చర్చిలు కూడా వున్నై.
మరి అక్కడ భూకంపం ఎందుకు వచ్చిందో ఈ మాట ప్రచారకులను అడగండి !

korne March 19, 2011 at 7:55 AM  

no need to take seriously about their comments

చిలమకూరు విజయమోహన్ March 22, 2011 at 6:44 PM  

వీళ్ళు ప్రచారానికి చివరకు స్మశానాన్నికూడా వదలడంలేదు.ఈ మధ్య మతం మారిన వారి అంత్యక్రియలకు హాజరయితే అక్కడ కూడా ప్రచారం తంతే.క్రీస్తును నమ్మి ఆయనను దేవునిగా అంగీకరిస్తే చనిపోయినవాళ్ళను మనం మళ్ళీ చూడచ్చట.లేకపోతే వాళ్ళు కనిపించరట.హిందూమతం గురించి వ్యతిరేకంగా మాట్లాడారు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP