శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహాభారతం యదార్థమా ? కల్పితమా ? [రెండవభాగం]

>> Wednesday, March 23, 2011

కానీ మనం మర్చిపోయినది ఏమిటంటే-- మిగితా దేశాలలో లేకపోవచ్చుని గానీ, భారతదేశంలో పదార్థజ్ఞానం ఏనాటి నుంచో వుంది. ఆనాడు ఇనుముతో మనవారు చేసిన గారడీలు ఈ నాటికీ అంతుపట్టనివి అని నిరూపించడానికి కుతుబ్ మినార్ ముందునున్న-- ఆరున్నర టన్నుల బరువుతో, 22 అడుగుల ఎత్తున్న-- ఉక్కు స్థంభమే సాక్షం. క్రీ.పూ. 300 సంవత్సరంలో చెయ్యబడ్డ ఈ ధ్వజస్థంభం ఎన్నో శతాబ్ధాలుగా, ఆలయాలను విధ్వంసంచేసిన అనేక ముస్లిముల దాడులను సైతం లెక్కచెయ్యకుండా, కనీసం తుప్పైనా కూడా పట్టకుండా ఎదురు నిలిచింది.

అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చెయ్యగలిగారు గాని, ఆ స్థంభాన్ని మిగల్చక తప్పిట్లు లేదు. మరి అటువంటి చెక్కు చెదరని ఉక్కుని మనవారు ఎలా చేసి వుంటారు? ఏ పశ్చిమ దేశస్తుడికి తెలుసునట, ఆ కాలంలో మనకు నేర్పివుండటానికి ? ఏది ఏమైనా అంత పరిజ్ఞానం సాధించారు అంటే, మనకు ఆ రోజుల్లోని పదార్థజ్ఞానం చాలా ఎక్కువే అని తెలుసుకోవచ్చు. అంటే భారత కాలానికే మన దగ్గర ఇనుము వుందా అన్నది, ఒక అసందర్భ ప్రశ్న కావొచ్చును. “అంత పరిజ్ఞానం సాధించిన మనవారికి, మిస్సైల్స్ వంటి ఆయుధాల (అస్త్రాల) తయారీలో ఇనుము అవసరమే రాలేదా?”, అన్నది సరైన ప్రశ్న అవుతుంది. అంటే, దివ్యాస్త్రాలలో మనకు తెలియని మరేమైనా దివ్యపదార్థాలను వారు వాడి వుండే ఆస్కారం వుందా?

ఆస్కారం వుంది! అని చెబుతోంది భరద్వాజముని వ్రాసిన వైమానిక శాస్త్రం కూడా! అందులో చెప్పబడిన అనేక పదార్థాలలో ఏ పదార్థం కూడా, ఈనాడు మనకు అర్థం కాదు. అందులో చెప్పబడిన ఏ విమానంలోని టెక్నాలజీ కూడా మనకు బోధపడదు. అందులో వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనవారు, జర్మనులు ఎంత విశ్లేషించినా ఇప్పటికి అంతు పట్టడం లేదు. అంటే ఆనాటి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ మనకు అర్థం కావడం లేదనేగా అర్థం!

1)

5. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ (WMD):

సరే మహాభారతం క్రీ.పూ 3100లోనో లేకపోతే క్రీపూ 1000 లోనో జరిగింది ఒప్పుకుంటాం. కానీ అప్పుడు అంత పెద్ద మహాయుద్ధమే జరిగితే, అందులో పాశుపతాస్త్రము, బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రము వంటి అనేక దివ్యాస్త్రాలు వాడితే, వాటి అవశేషాలు ఏవి? అన్నదే చివరికి మిగిలిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మన అన్వేషణ పూర్తయ్యినట్లే. ఆ రోజుల్లో అణ్వస్త్రాల వంటివి వాడినా, ఇప్పుడు ఇన్ని వేల ఏళ్ళయ్యిన తరువాత, త్రవ్వకాలలో ఏమి అవశేషంగా మిగిలి కనిపించాలో నిజంగా మనకు తెలియదు. ఒక వేళ అణుశక్తినే వాడితే, దాని తాలూకు రేడియేషనులు వుండాలిగా అనొచ్చు. కానీ, అది 5వేల సంవత్సరాలు భూమిలో కప్పెట్టబడిన తరువాత కూడా వస్తుందో లేదో తెలియదు. వచ్చినా, అసలు ఆనాడు వాడినది అణుశక్తో కాదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనకు తెలియని, అర్థంకాని శక్తి స్వరూపాలు ఇంకా మరెన్నో వున్నాయి.

ఉదాహరణకు మొదట్లో మనం చెప్పుకున్న యాంటీ మాటర్ గురించి మనకి ఇంకా ఏమి అవగాహనే లేదు. ఈ నవంబర్ 19వ తారీఖున జెనీవాలో యాంటీ యాటముని ఒక సెకనులో పదవ వంతు పాటు కాలం వరకు నిలప గలిగారని ప్రకటించారు. అది నేటి విజ్ఞాన రంగం అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయి కావొచ్చు. అయినా ఆ శక్తిరూపాన్ని స్పృశించడానికి, పరిక్షించడానికి, ఇంకా మరెన్నో సంవత్సరాలు పడుతుంది. అలాగే “డార్క్ మాటర్” , “డార్క్ ఎనర్జీ” అన్నవి ఇంకా కాన్సెప్టులే గానీ, వాటి గురించి మనకేమీ తెలియదు. ఇప్పుడప్పుడే తెలియక పోవచ్చు కూడా! ఇలా మన ఊహకి అందని ఎన్ని రకాల శక్తి రూపాలు ఎన్ని వున్నాయో? వీటిని ప్రయోగించిన తరువాత అసలు అవశేషాలు ఏమైనా మిగులుతాయో లేదో? మహాభారతంలో అసలు ఏ ఏ శక్తులని ప్రయోగించారో?

మనకు తెలిసిన ఒక్క మిస్సైల్ని పట్టుకొని, అదే దివ్యస్తామయి వుండొచ్చని, మనమే అనుకుని, అవి దొరకలేదు కాబట్టి ఆ మహాసంగ్రామం జరగలేదని చెప్పడం సబబేనా? ఏదో కాకతాళీయంగా ఒక కొత్త సాక్ష్యం మన చేతిలో పడాలి! అది కూడా అర్థం అవ్వాలి! అంతే కాదు ఆ సాక్షం చేతిలో పడడాని కంటే ముందే, దాన్ని అర్థం చేసుకోడానికి తగిన విజ్ఞానసామర్ధ్యం కూడా అభివృద్ధిచెంది, సమయానికి అందుబాటులో వుండాలి. అప్పుడు గానీ ఈ పజిల్‌కి ముక్తి లేదు. లేకపోతె ముందు చెప్పుకున్నట్లుగా, మనం చూసిన సూర్యుడు ఆరంగుళాల చిన్న చక్రమే అనేటువంటి వాదనల లోకి దిగే ప్రమాదం మిగుల్తుంది.

కాలక్రమేణా అన్ని తప్పక తెలుసుకోగలుగుతాము. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ద్వాపర యుగంలో జరిగింది. అంటే కనీసం 5000 సంవత్సరాల క్రితం నాటి మాట. ఆనాటి భౌగోళిక పరిస్థితులు మనకు తెలియవు. యుగాంతంలో జరిగే భోగోళిక ప్రక్రియలు, ప్రకృతిలోని మార్పులు, వాటి ప్రభావాలూ మనకింకా అర్థం అయ్యి వుండకపోవచ్చు. ఆ పరిస్థితులలో మనం వెతికే సాక్షాలు ఒక వేళ వున్నా, అవి భూగర్భంలోనో, కాలగర్భంలోనో ఎక్కడ, ఏరకంగా, ఎందుకు కలిసిపోయాయో అన్నది -- ఈనాడు మన ఊహకు అందని విషయం.

భోగోళిక మార్పుల వల్లనో, లేకపొతే మరేమైనా వేరే కారణాల వల్లనో ఏమో – త్రవ్వకాలలో క్రీ.పూ. 3000నాటి సింధూ లోయ నాగరికతకు నుంచీ, దాని తరువాత మళ్ళీ క్రీ.పూ 300 సంవత్సరపు మౌర్యుల నాగరికత దాకా మద్య Cultural continuity కనపడలేదు. ఆ మద్య కాలంలోని చరిత్రపై కూడా మనకు పెద్దగా ఆధారాలేమీ లేవు. అవగాహనా లేదు. భోగోళిక మార్పులు జరిగి, ఆనాటి అధారాలు నశించి వుండి వుండవచ్చు నేమో అని అనడానికి ఇది (The absence of Cultural continuity) ఒక చిన్న ఆధారం. ఇలా, కురుక్షేత్రయుద్ధం కల్పితం కాదనీ, అది చారిత్రాత్మకమేనని, ఈ మూడు భాగాల విశ్లేషణ వల్ల నిర్థారించవచ్చును. ఇక మనకు నిర్థారణ కాని విషయాలు – ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఏ ఆయుధాలతో జరిగింది? అన్నవే.

అలనాటి నాగరికత నేటి నాగరికత కన్నా మహోన్నతమైనది; వారి జ్ఞానం మనకన్నా ఎన్నో రెట్లు గొప్పది; కానీ కురుక్షేత్ర మహాసంగ్రామం వల్లనో , యుగాంతం వల్లనో ఎందరో చనిపోయి, వార్ల నాగరికతలు సమూలంగా నాశనమయ్యి, కాలక్రమేణా ఆ విజ్ఞానం సాంతం నశించిపోయి వుండవచ్చు. అందుకే మనం మరిన్ని ఆధారాలకై వెతుకుతూనే వుండాలి ; వెతికి అందరికి అర్థమయ్యేలా చూపించి, అందరి ఆమోదాన్నీ అందుకోవాలి. ఒక భారతీయునిగా అది మన బాధ్యత! అది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాకపోవచ్చు. ఎన్నో వేల సంవత్స్రాల చరిత్ర కలిగినది మన సంస్కృతి. ఎంతో సనాతనమైనది మన ధర్మం. నిరూపించడానికి చాలా సమయం పట్టొచ్చు. అయినా నిరాశ పడకుండా ప్రయత్నిద్దాం.

భారతీయులమైన మనం -- మన భారతాన్నయినా అర్థం చేసుకుందాం!

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP