శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మంత్రోపదేశం పొందితే ఆరాధన చేయనక్కర్లేదా?

>> Monday, March 21, 2011


ఒక గురువు వద్ద మంత్రోపదేశం పొందిన సాధకుడు ఆరాధన వంటి నిత్య నైమిత్తిక కర్మలు చేయక్కరలేందటున్నారు. ఇది నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మీ సలహా చెప్పండి.
- ఎ. వెంకటకృష్ణ, రాజమండ్రి

ఆత్మదర్శనానికై జ్ఞాన యోగం ప్రారంభించిన సాధకుడు ఇక కర్మయోగం అవలంభించనక్కర్లేదనే అభిప్రాయం ఒక అపోహ మాత్రమే. భగవద్గీత కర్మయోగంలో భగవానుడీ విషయాన్నే చెప్పాడు.

తస్మాత్ అసక్త స్సతతం
కార్యం కర్మ సమాచర
అసక్తో హ్యాచరన్ కర్మ
పరమాప్నోతి పూరుషః
కనుక ఆత్మదర్శనమయ్యే వరకు తప్పనిసరిగా ఫల, సంగ, కర్తృత్వాలను విడిచి కర్మలను చెయ్యాలి. దానివలననే ఆత్మ ప్రాప్తి కలిగి తీరుతుంది.

కర్మణైవహిసంసిద్ధిం
ఆస్థితా జనకాదయః
లోక సంగ్రహమేవాపి
సంపశ్యన్ కర్తుమర్హసి
జనకాది మహాత్ములు జ్ఞానయోగాధికారులైనా, కర్మల నాచరించడం వల్లనే శుద్ధాత్మ స్వరూపాన్ని పొందగలిగారు. లోకం అనర్థం పాలు గాకుండా ఉండడానికి ఉత్తముడైన జ్ఞానయోగాధికారి కూడా కర్మయోగాన్నే చెయ్యాలి.

యద్యదాచరతి శ్రేష్ఠః
తత్ తదేవేతరో జనః
సయత్ ప్రమాణం కురుతే
లోకస్తదనువర్తతే
గొప్పవాడు ఏ కర్మను ఏ విధంగా ఆచరిస్తే దానిని జూచి లోకంలో సామాన్యుడు కూడా ఆ కర్మనే అదే రీతిలో ఆచరిస్తాడు.

నమే పార్థాస్థి కర్తవ్యం
త్రిషులోకే షు కించన
నానవాప్త మవాప్తవ్యం
వర్త ఏవచ కర్మణి
మూడు లోకాల్లోనూ స్వేచ్ఛగా సంచరించే నాకు ఇది వరకు లేనిది, ఇప్పుడే కర్మల నాచరించి పొందవలసినది ఏమీ లేదు. అయినా, లోకాన్ని రక్షించడానికి నేను కర్మలను చేస్తున్నాను అన్నాడు. కనుక భగవదాజ్ఞగా, మీరు మీ సాధనతో పాటు నిత్య ఆరాధనాదులు కొనసాగించవచ్చు.
- ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ

2 వ్యాఖ్యలు:

రహ్మానుద్దీన్ షేక్ March 21, 2011 at 1:48 AM  

నేను పూర్తి పోస్టు చదవకుండానే వ్యఖ్యానిస్తున్నందుకు క్షంతవ్యుణ్ణి,

మంత్రోపదేశం పొందాక సాధారణ కర్మలు మరింత నిష్ఠగా చెయ్యాలి.
మంత్రోపదేశం చేసిన గురువును ఓడను జరిపేవాడిగా మంత్రాన్ని పడవగా, ఆ పడవను జరపటానికి అవసరమైన తెడ్డ, మరియు వాయువు ఇత్యాదివి మనం ఆచరించే కర్మలు అన్నది మీరా వాక్కు.

amrutha reddy March 4, 2017 at 4:57 AM  

గరువులకి ప్రానామలు.నాకు మంత్రోపదేశం చేపించుకునుటకు గరువు లేరు . ఈ కాస్తా ఙనాన్ని గ్రంధల ద్వారా గ్రహించను మంత్రోపదేశం కై నాకు ఏదైనా సలహ ఇవ్వగలరు

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP