శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కాముని పున్నమి

>> Thursday, March 17, 2011

మనకి ప్రతి సంవత్సరం పాల్గుణ పూర్ణిమ తిది నాడు వస్తుంది. దీన్ని కాముని
పున్నమి అనీ , కామ దహన మనీ , వసంతోత్సవ మనీ , హోలీ పండుగ అనీ
పిలుస్తారు .ఉత్తర భారతీయులు , హోలీ గాను , రాఖీ పూర్ణిమ గాను ఎక్కువగా
వ్యహరిస్తారు. దీన్నే రక్షా బంధనమని కుడా అంటారు.
ఐతే వీటి వెనుక అనేక పురాణ కధలూ దాగి ఉన్నాయి. " కామానికి " అది దేవుడు
మన్మధుడు .అంటే మనస్సును చిలికే వాడు , మదించే వాడు , మనస్సుని కల్లోల
పరచే వాడు . అని అనేక అర్ధాలు ఉన్నాయి. అటువంటి మన్మధుడు , రతీ దేవితో
చేరి పార్వతీ పరమేశ్వరులను , కల్లోల పరచ బోయి , త్రినేత్రుడి ఆగ్రహానికి
గురియై , త్రినేత్రాగ్ని లొ పడి భస్మం అయ్యాడు .అందు వలన ఆరోజు " కాముని
పున్నమి అంటారు . "
ఇక పొతే " వసంతిక " అనే మహా భక్తు రాలు అంద గాడైన భర్త వ్యాహం లొ పడి ,
శివా రాధనకి దూరమైంది .అందువలన పార్వతీ దేవి ఆగ్రహానికి గురియై అగ్ని
ప్రవేశం చేసింది . అందుకు ఆ భక్తు రాలి భక్తికి సంతసించి , ఆమె చితిని
పూల పాన్పుగా మార్చి , " అమ్మా ! వసంతికా ! వసంతంతో సమాన మైన
యవ్వనాన్ని ,అంద గాడైన నీ భర్తనీ ,లక్ష్య పెట్టక , తుచ్చ మైన కామాన్ని ,
అగ్నికి ఆహుతి చేసావు .గనుక ఈ రోజు " పాల్గుణ పౌర్ణిమ " . ఇంతటి పవిత్ర
మైన రోజు కావున , నీ త్యాగ నిరతికి సంతసించి ,ఈ రోజు నీ పేరున '
వసంతోత్సవం గా ప్రసిద్ధ మౌతుంది " . అని దీవింఛి , అదృశ్య మయ్యారు .
ఇక నిజానికీ ఈ పండుగ " హోలీ " కాదు. దీన్ని " డోలీ " గా గుర్తించాలి .
అదెలా ? అంటే " హోలిక " అనే రాక్షసీ పూర్వం కృత యుగంలో , " రఘునాధుడు "
అనే రాజు ఉండే వాడు .అతని రాజ్యం లొ ఆ రాక్షసి కేవలం శిశువులను
మాత్రమె హతమారుస్తూ ఉండె దట .అందువలన ఆ రాజు ఆ హోలిక అనే రాక్షసిని
సంహరించా లని ప్రయత్నిం చగా దేవ ఋషి నారదుడు అడ్డుబడి ," స్త్రీని
సంహరించడం రాజ లక్షణం కాదని , " వారించి కేవలం ఆమెని శాంతింప జేయడం
కోసం ప్రతి సంవత్సరం ," పాల్గుణ పూర్ణిమ " నాడు , " హోలికకు " వర్ణ
జలోత్శవం [ రంగు రంగుల నీటితో ] చేయాలని ఆదేశిం చాడు . అందువలన శిశు
మరణాలు సమసి పోయాయి. '[ ఈ వృత్తాంతాన్ని , ధర్మ రాజు శ్రీ కృష్ణునికి
చెప్పి నట్టుగా భవిషత్ పురాణములో పేర్కొన బడినది ]
ఇంతకీ ఈ " హోలిక " హిరణ్య కశిపునకు సోదరి.
ఈ హోలికనే " డోలికా ఉత్సవ మని పేర్కొన బడినది. అందుకు నిదర్శనం గా పురాణ
వాజ్ఞ్మయం ప్రకారం పాల్గుణ పున్నమి నాడు ,గోవిందుడు ఊ యల యందు శయనిం
చును .గాన దీనికి " డోలికా " ఉత్సవము అని ప్రతీతి .అందువలన ఎంత
చిన్నదైనా ఊ యల ప్రతిమను దానం చేస్తే , వైకుంథ వాసి అవుతారని నమ్మకం. ఇక
" హోలిక వృత్తాంతం పేరిట " హోలీ " గా పిలువ బడుతోంది. గనుక రంగులు జల్లు
కోవడం ఒక వినోదం ఆన్న మాట .
[శ్రీమతి రాజేశ్వరి గారి రచన]

2 వ్యాఖ్యలు:

astrojoyd March 17, 2011 at 9:49 AM  

కామునికి-పున్నమికి-శివునికి విడతీయరాని సంభ౦దముంది.చంద్రుడు మనః కారకుడు/కాముడు కోరికలకు కారకుడు/శివుడు పంచభూత కారకుడు.సివునివల్ల పంచభూతాలు ఆకృతిని పొందుతున్నాయి.ఈ ఆకృతులు కోరికలకు పుట్టినిల్లై మనసు అనే చంచలమైన చంద్రుని ద్వారా నడుస్త్తున్నాయి.అటువంటి కాముని+చంద్రుని జయిన్చ్నవాడు శివుడు కనుక కామేస్వరుడు అయ్యాడు.ఈ కాముని పున్నమి రోజున మనస్సులో జనించే కోరికలను శివార్పణం చేయాలి.ఈ అర్పణ క్రియనే దహనం..అంటే కాల్చివేయడం అంటారు.[కామ దహన పున్నమ]

Kiran March 19, 2011 at 10:56 AM  

informative. thanks.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP