శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ప్రసిద్ధ హనుమదాలయాలు ......2

>> Wednesday, April 29, 2009

శ్రీరామపాద క్షేత్రం
_______________
క్రిష్ణా జిల్లాలో విజయవాడ_ హైదరాబాద్ రహదారి పక్కన పరిటాల గ్రామమంలో 15 అడుగల వేదిక పైన నిర్మించిన 135 అడుగుల భారీ విగ్రహమిది. కోటిన్నార రూపాయల వ్యయం తో నిర్మించిన స్వామి మూర్తిని చూడాలంటే తలపూర్తిగా వెనక్కు వంచి చూడాల్సినదే.ఈ దివ్యక్శేత్రానికి ప్రేరన శక్తి హనుమాన్ చాలీసాదే. బృందంగా సాగిన చాలీసా భజనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. 2000 , maY28 నప్రారంభమయిన చాలీసా పారాయణం ఒక్కక్షణమాగకుండా 1,35,000 సార్లు జరిగినది.ఒక్కూక్క అడుగు నిర్మాణానికి ఒక వెయ్యి చొప్పున పారాయణం చేసి 2001 april28 ప్రతిష్ఠాకలాపం పూర్తిచేశారు.

సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి
-------------------------
ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గరలో దివ్యక్షేత్రమిది.250 సంవత్సరాలకు పూర్వం కొండపైన లక్ష్మీ నరసింహుని ధ్వజస్థంభ ప్రతిష్ఠ చేస్తుండగా ఒక దివ్యపురుషుడు కొండక్రింద ప్రసన్నాంజనేయుని తెచ్చి ప్రతిష్ఠ చేయటం చూసిన జనం క్రిందకొచ్చేటప్పటికే ఆయన అదృశ్యమయ్యారట. మహా శక్తివంతమైన క్షేత్రం ఇది.


పొన్నూరు వీరాంజనేయుడు
___________________________
గుంటూరు జిల్లా పొన్నూరులో నున్న ఇరవైనాలుగు అడుగుల మహామూర్తి ఈస్వామి.
బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి విగ్రహముతయారయినది మొదలు గ్రామగ్రామాలలో తన శిష్య కోటికి దీక్షనిచ్చి కొన్ని కోట్లజపం చేపించి ఆ శక్తిని ధారపోయించి గొప్పజ్యోతిని వెలిగించారు .ఆజ్యోతి ఇప్పటికీ వెలుగుతూనేఉంది.యడ్లపాదు కొండలదగ్గర తయారు చేసిన ఈస్వామిని ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెచ్చిప్రతిష్ఠించారు .

గుంటి ఆంజనేయస్వామి
______________________
గుంటూరు జిల్లాలో వినుకొండలోనున్న ఇలవేల్పు గుంటాంజనేయస్వామి వారు.క్రీశ 1600 లో గుంటి భాస్కరుడు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశాడు.ఈయనను టపా ఆంజనేయ స్వామని,చెట్టాంజనేయ స్వామి అని బెట్టాంజనేయ స్వామిఅని కూడా పిలుస్తారు.గుడిలేకుండా ఆరామంగా ఉంటుంది.

కొండగట్టు ఆంజనేయస్వామి
__________________________
కరీంనగర్ లోని దాసాంజనేయ స్వామి ఒక చిన్నకొండపై వెలసి వున్నాడు.ఆంధ్రాలో ని ప్రముఖమయిన ఆంజనేయస్వామి గుడులలో ఇది కూడా ఒకటి.

గుత్తినదీవి
_________
తూర్పుగోదావరి జిల్లా ముంబడివరం తాలూకాలో స్వామి వారు గతం లో ఉగ్రరూపంతో నృత్యం చేస్తున్నట్లు ఉండేవారు.ఏపూజారీ రెండు మూడునెలలకంటె ఎక్కువ ఉండలేక పోయేవారు.గౌతమ మహర్షిచే ప్రతిష్ఠించబడిన ఈస్వామి పదునాలుగు సంవత్సరాల క్రితం శిరస్సుఅపైన సీతారాములను ప్రతిష్ఠించాక శాంతించాడట.

సారంగాపూర్
---------

తెలంగాణలో నిజామాబాద్ నుంచి సుమారు ఎనిమిది కిలో మీటర్ల దూరంలో శ్రీ సమర్ధ రామదాసుగారిచే నిర్మించబడిన మఠమ్. రామదాసువారు ఇక్కడ పర్యటన్లో నున్నప్పుడు
స్వామి వారిని ప్రతిష్ఠించి నతరువాత ఇక్కద వర్షాలు కురిసి కరువుతొలగినదట
.
తాడుబందు ఆంజనేయుడు
_________________________
సికిందరాబాద్ లోనున్న స్వామిని జాబాలి మహర్షి ప్రతిష్ఠించాడట.జాపాలి చే ప్రతిష్ఠించబడిన నాలుగు ఆలయాలలో ఇదొకటి. ఆయన తపశ్సక్తినంతా ధారవోసి న ఈ మూర్తి మహా శక్తివంతుడు

.
శ్రీ మద్ధి ఆంజనేయుడు
_____________________
పశ్చిమ గోదావరి జిల్లాలో గురవాయి గూడెం గ్రామంలో మద్ది చెట్టు క్రింద వున్న ఈస్వామి భక్తుడైన మధ్వుని తపోఫలితంగా వెలశాడు.


వెయ్యేళ్ళ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయుడు
_________________________________________
హైదరాబాద్ లో చాంద్రాయణ గుట్టవెళ్ళే మార్గం లో ఈగుడిని చూడవచ్చు.పదకొండవ శతాబ్ధం లో రెండవ ప్రోలరాజు కుమారుడు రుద్రరాజు వేటకు వచ్చినప్పుడు ఒకపెద్దపులి అరుపు వినిపించగా వెదకగా శ్రీరాం శ్రీరాం అనే తారకమంత్రం వినిపించిందట.ఆయన ప్రార్ధన మేరకు ధ్యానం లో స్వామి వారి దివ్యమూర్తి దర్శనం పొంది .హనుమాన్ జయంతి రోజున ఆలయ నిర్మాణం ప్రారంభించిఈ ప్రాంతానికి కర్మన్ ఘాట్ అని పేరు పెట్టారు.
ఔరంగజేబు ఆలయాన్ని కూల్పించటానికి ప్రయత్నించినప్పుడు స్వామి భీకరాకారుడై కనిపించగా అతను తన తప్పుతెలుసుకుని అన్నదానం చేసి ఇక్కడ మహారాష్ట్ర లో కూడా ఆస్తులను రాసిఇచ్చాడు.

బీచుపల్లి ఆంజనేయ స్వామి
__________________________
మొహబూబ్ నగర్ జిల్లాలో ఇటిక్యలమండలంలో జాతీయ రహదారి పైన వున్నఈ ఆలయం పదహారవ శతాబ్ధం లో వ్యాసరాయల వారిచే ప్రతిష్ఠజరుపబడినదని తెలుస్తుంది. స్వామి వారికి అర్చకులుగా ఎవరిని నియమించాలా అని అలో చిస్తున్న వ్యాసరాయలవారికి ఎవరు ముందుగా వస్తే వారినే నియమించమని స్వామి వారు సూచించారు.మొదటగా వచ్చిన బోయవానినే పూజారిగా నియమించటం జరిగినది.

కేసరి హనుమాన్
_________________
భాగ్యనగరం లో మూసీనది ఒడ్డున సమర్ధరామదాసు గారిచే ప్రతిష్ఠ జరుపబడ్డ ఈ ఆలయం లో నాలుగువందల సంవత్సరాల క్రితం వెలగించిన జ్యోతులలానే వెలుగుతున్నాయి.


శ్రీ సువర్చలా సహిత ఆంజనేయుడు
__________________________________
మచిలీ పట్నమ్ పరాస పేటలో ఈ స్వామిని సమర్ధ ప్రతిష్ఠించారట.


నవావతార క్షేత్రం
________________
ఒంగోలులో ముంగమూరు రోడ్డులో వెలసిన ఈ క్షేత్రం విశిష్ఠమయినది. ప్రపంచం లోనే తొమ్మిది అవతారాల తో స్వామిని ప్రతిష్ఠించిన క్షేత్రము ఇదొక్కటే.

Read more...

యథాప్రజా ! తథారాజా !

>> Sunday, April 26, 2009

కొంచెం మార్చి చెప్పినట్లుగావున్నది కదా ! అవును పరిస్థితులు తల్లకిందులుగా నడుస్తున్నప్పుడు సిద్ధాంతాలు కూడా ఇలానే తల్లక్రిందులవుతుంటాయి మరి. గతములో పాలకుడెలాంటివాడో ప్రజలు కూడా అటువంటి ఆచరణ కలిగినవారుగా తయారవుతారని "యథారాజా !తథాప్రజా ! అని చెప్పేవారు. ఇప్పుడు ఆపాలకులను ఎన్నుకొనేది ప్రజలేకనుక వారి మనోభావాలననుసరించి పాలకులు ఉద్భవిస్తున్నారు.
పూర్వం ప్రజలు ధార్మిక చింతన కలవారై సత్య ధర్మ పరాయణత్వముకలిగి కలిగి యున్నప్పుడు ఋజువర్తనులు,త్యాగపురుషులు మహావీరులు పాలకులుగా వచ్చేవారు .అతని ఆచరణను అనుసరించి వారు కూడా చక్కని జీవితాన్ని సుఖ సంతో షాదులను పొంది.సృష్టి లోని సమస్త జీవరాశికి మితృలుగా సహజీవనము సాగించ ప్రయత్నించేవారు.
మరిప్పుడేమవుతున్నది? పాలకులంటే దోచుకునేవారుగా ,ఆక్రమణలు చేసుకునేవారిగా .స్వార్ధపరులుగా మారిపోతున్నారు. రాజకీయాలలావున్నాయి, ఎవడు వచ్చినా దోచుకోవటమే పని . స్వార్ధము పెరిగిపోయినది అని మనము విమర్శిస్తుంటాము ఎప్పుడూ. కాని అలాంటివారు పాలకులుగా రావటానికి కారణము మనము కాదా?అలోచించిచూస్తే మనమే ఈ అనర్ధానికి కారణము అని స్పష్టమవుతుంది.
ఒక్కసారి ఆలోచిద్దాము. మనలో స్వార్ధపరత పెరిగినప్పుడు మన బిడ్డలకోసమని అడ్డ దారులు తొక్కయినా సంపాదించాలని చూసి మన బిడ్దలకు కూడా అదే మార్గం చూపిస్తున్నాము. కనుక వాళ్ళు స్వార్ధపరత్వాన్ని వారసత్వం గా పొందుతున్నారు. గౌరవించాల్సిన గురువులను జోకర్లుగా చిత్రిస్తూ వచ్చే రచనలను చిత్రాలను నవ్వుతూ చూసి ఆదరిస్తున్నాము గనుక, మనపిల్లలు కూడా గురువులు పెద్దలంటే గౌరవభావము లేనివారిగా తయారయి మంచి వినే ఆసక్తి లేనితరంగా తయారవు తున్నారు. మనము సిగ్గుశరము విడచి పశుప్రాయమైన ,ధర్మ విరుద్దమైన కామాన్ని ప్రేరేపించే సాహిత్యాలను సినిమాలను ఆబగా చూస్తున్నాము కనుక ,అలాంటి ఆచరణ గల వ్యక్తులు తయారవుతున్నారు. రోజురోజుకు అకృత్యాలు పెరగటానికి కారణమిదికాదా. వరుసావాయలేని ఈ పశు ప్రవృత్తినికూడా ప్రోత్సహింఛే మేధావులు సిద్ధాంతాల రాద్ధాంతాలతో మనకు ఏరకమైన మేలును చేస్తున్నారో గాని ,నాయకులవుతున్న యువతకూడా ఇటువంటి కల్మష హృదయాలు గలవారిగా తయారవుతుంటె మనకు మంచి పరిపాలన కావాలంటే ఎలా వస్తుంది.

ఇక ఎన్నికలప్పుడు మనము ధర్మా ధర్మ విచక్షణలజోలికెల్లకుండా మనకులమా,పార్టీయా అని ఆలోచించటము జరుగుతున్నది. ఈసారి మరీ ఘోరము .సిగ్గూ శరము విడచి డబ్బు తీసుకుని ఓట్లు వేసినవాళ్ళే ఎక్కువ మా ప్రాంతములో.ఇందు లో ధనిక పేద బేధము లేదు.ఇక మందు విందులతో వేలాదిమంది దాదాపు ఇరవై రోజులు అభ్యర్ధుల డబ్బును వాడుకున్నారు. మరి ఇలా ఖర్చు పెట్టినవారు సంపాదించుకోకపోతే అడుక్కుతింటారు తరువాత కనుక తప్పనిసరిగా పెట్టిన పెట్టుబడికి పదింతలు సంపాదించుకోవాలని చూడటములో తప్పులేదుకదా?
మనవాడైతే చాలు వాడు చేసే తప్పులను పట్టించుకోక సమర్ధించేమనము వానివలన జనానికి జరిగే హానికి కారకులము కామా? ఇక్కడ మనస్వార్ధపరత,ధర్మ విచక్షణలేని అభిమానము ఇలాంటీ్ నాయకులు తయారవ్వటానికి కారణముకాదా?
ఈమధ్య మా మాస్టర్ గారొకయన మాట్లాడుతూ " రాజకీయ నాయకులు ,అధికారులు దోచుకుంటున్నారండి ,వీళ్ళ ను నిలబెట్టి కాల్చేస్తే గాని దేశము బాగుపడదు " అని వాదనకు దిగాడు ఆవేశముగా.
నిజమే మాస్టర్ గారూ! బోడి ఐదువందలరూపాయలు ఇచ్చి టీచింగ్ మెటీరియల్ కొనమంటే దానిలో గూడా నాలువందలు కొని ఐదువందలకు ఓచర్లు రాపించేవాల్లు మనలోవున్నాము కదా! వందరూపాయలు నొక్కటానికి అవకాశమున్నపుడు మనము పాల్పడినప్పుడు, వేలు కోట్ల రూపాయల ను నొక్కెయ్యటానికి అవకాశమున్నది కనుక వాళ్ళు అందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ మనకు కూడా అవకాశముంటే మనము శుద్దిగా వుంటామనే గ్యారంటీ ఏమన్నావున్నదా? ఐదురూపాయలకైనా పాల్పడే వాడు అవి నొక్కుతున్నాడు.కోట్లు కొట్టెయ్యగలిగినవాడు అవి నొక్కుతున్నాడు. ఇందులో స్థాయీ బేధమేగాని తేడాఏమీ లేదు.
మనమిప్పుడు రాజకీయనాయకులను మరెవరినో దూషించటము కాక ,మనలోనున్న స్వార్ధపరత్వము యెక్క అనర్ధము గమనించాలి. కోట్లుసంపాదించేవాడయినా ,కూలికెళ్ళేవాడయినా తినగలిగేది ఆనాలుగు ముద్దలే.ఇక్కడవుండేది నాలుగురోజులేననే సత్యాన్ని గ్రహించగలిగితేనే గాని ఈ సమస్యలు తీరవు. అంతదాకా ఒకరినొకరు తిట్టుకొని దూషించుకొన్నందువల్ల ప్రయోజనమేముంటుంది.
అందుకే వివేకానందులవారు ఒకసారి చెబుతారు.మనం సామ్యవాదము సామ్యవాదము అంటాము.అదే అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని నమ్ముతాము. కాని సామ్యవాదపరమైన ప్రభుత్వం వచ్చినదనుకుందాము పదిమందికి పంచమని ఒకరికి అప్పగించిన సంపదను అతను స్వార్ధపరుడయ్యాడనుకో పంచడుకదా? అవకాశమున్నంతవరకు దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రయత్నిస్తాడు.దానివలన సిద్ధాంతము అపజయము పాలవుతుంది. కనుక సంఘము మారితే మనకు మేలు జరుగుతుందనేది కాక .వ్యక్తిగా మనము మారితేగాని సమాజానికి మేలుజరుగుతుందనే సత్యాన్ని నమ్మి అలా బ్రతకడము మొదలు పెట్టాలి .

కాబట్టి మనధర్మ భూమిలో మనిషి ఎలా బ్రతకాలో సూచించిన ధర్మసిద్ధాంతాలను ఆచరణాత్మకంగా పాటించినప్పుడు మన ఆలోచనలకు అనుగుణముగా ధార్మికులైన పరిపాలకులే వస్తారు. యథాప్రజా తథారాజా ఈ కలియుగములో.కాదని రాధ్ధాంతాలతో కాలము గడిపినప్పుడు ఏమార్పూరాదు.ఇది ప్రకృతి బోధిస్తున్న సిద్ధాంతము. పిచ్చిమొక్క విత్తనాలు నాటితే పిచ్చిమొక్కలే వస్తాయి. మామిడి విత్తనాలు నాటితే మామిడి చెట్లే వస్తాయి ,వాదనలవలన వాటి లో మార్పురాదుకదా?

ధర్మో రక్షతి రక్షిత:

Read more...

శ్రద్ధాసక్తులు లేని సాధన ఫలితాలనివ్వలేదు.

>> Saturday, April 25, 2009

శ్రద్ధాసక్తులు లేని సాధన ఫలితాలనివ్వలేదు.

ఏలక్ష్యాన్ని సాధించాలన్నాచేసే పని పైన శ్రధ్దా సక్తులు ముఖ్యము. శ్రద్ధలేని పని ఏదీ ఉత్తమమైన ఫలితాలనివ్వలేదు. కనుక చేయదలచుకున్న పనిని శ్రద్ధ తోను ఆసక్తి కలిగి చేయాలి.దీనినే షిర్డి సాయినాథులు నిష్టా,సబూరీ కావాలని చెప్పారు.ఆథ్యాత్మిక రంగములో ఇవి మరీ ముఖ్యము.
హనుమత్ రక్షాయాగాన్ని ప్రారంభించేప్పుడే చెప్పాము.ఇదొక ఆథ్యాత్మిక ప్రయోగముగా భావించి,శ్రద్ధతో చేస్తే గాని ఖచ్చితమయిన ఫలితాలు వస్తాయని. ఇక్కడకు గోత్రనామాలు పంపేవారు తప్పనిసరిగా ఆవిధముగా చాలీసా పారాయణము చేయాలని కూడా సూచించబడినది. కొందరు ఎంతో వత్తిడి పనిలో వుండికూడా అన్నింటికంటే భగవత్ కార్యము ముఖ్యమనే నమ్మికతో ,తాము అనుకున్నది సాధించాలనే తపనతో ఎంతో శ్రద్ధగా పారాయణము సాగిస్తున్నారు దేశవిదేశాలలోని మనవారు. వారికి ఖచ్చితమయిన ఫలితాలు వస్తున్నట్లు సూచనలు కూడా వస్తున్నాయని తెలుపుతున్నారు.వారి భక్తిశ్రద్ధలకు ,స్వామి వారిఅనుగ్రహానికి ప్రణామాలు.

ఇక కొందరు చెబుతున్నారు,మాకు సమయము చాలటము లేదని,మనసు బాగుండటము లేదని ,పరిస్తితులన్నీ అనుకూలించాలికదా!అని ఇలా రకరకాల కారణాలను చెబుతున్నారు. వారికి మా విన్నపమేమిటంటే ఇవన్నీ భగవన్మార్గములో నుండి మనల్ను పక్కకు తప్పించేందుకొచ్చే ఆటంకాలు. మన అలసత్వము దీనికి తోడైతే మనము లక్ష్యాన్ని చేరుకోవటము గగనమవుతుంది. మనకు సమయము లేకున్నా బంధువుల పెళ్ళికి ,వెళతాము ,ఎందుకంటే వెళ్లకుంటే చుట్టాలకు దూరమవుతాము కనుక.అలాగే అధికారులు ,స్నేహితుల విషయము లోనూ .ఇలా భౌతిక బంధాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేమనము భగవంతుని పట్ల మాత్రమే నిరాసక్తత ,నిస్సహాయాన్ని వ్యక్తము చేస్తుంటాము. ఎందుకని? అది మనకు ప్రథమ ప్రాధాన్యతా విషయముగా గోచరించక పోవటము వలన. మన పిల్లవాడు ఇది తినను ఇంకోటి చేసి పెట్టమంటే అప్పటి కప్పుడు ఎంతశ్రమకయినా ఓర్చి చేసి పెట్టగల ఆతల్లి ఇంట్లో దేవునికి నైవేద్యం వండాలంటే సమయము లేదంటుంది. ఇది సమయము సమస్యకాదని అర్థమవుతుది కదా? కనుక "శ్రద్ధావాన్ లభతే విద్యా" అన్న సూక్తిని మననంచేసుకుని సాధనలో ముందుకు సాగుదాము. పూజ ను పనిగా చేయకుండా ,పనిని పూజగా మార్చుకోవాల్సి వుంది మనము. అదే హనుమత్ సాధనలో బోధించబడుతున్న రహస్యము .ఆయన ఆచరించి చూపిన దారి కూడా.
కనుక స్వామి మార్గములో విజయవంతముగా సాగుదాము.జైహనుమాన్

Read more...

శతృ పీడా నివారకము.హనుమల్లాంగూలాస్త్రము.

>> Friday, April 24, 2009


శతృ పీడా నివారకము.హనుమల్లాంగూలాస్త్రము.
శతృవులను అణచివేయడం లోను,శత్రుపీడలను తొలగించుటలోను మిక్కిలి శక్తిగలది హనుమల్లాంగూలాస్త్రము అనబడే స్తోత్రము.దీనిని రావి చెట్టు మొదట్లో కూర్చుని ఎవ్వరు నియమముగా పారాయణము చేస్తారో వారు శత్రువులను జయించి హనుమదనుగ్రహముతో సుఖ శాంతులతో నుండగలరు ,ఇట్టిఫలితములను సద్బుద్ధితో నే పొందగలరు. శత్రుబాధననుభవించెడి ఉత్తములు ప్రతినిత్యము దీనిని పఠించినచో వారు శత్రువులనుండి కాపాడ బడుదురు. ఈ స్తోత్రము తో బాటు లాంగూల పూజ జరపాలి.
అదెలాగంటే,
వాలమునకు గంటగాని అవయవములు గాని అడ్డురానటువంటి ,హనుమంతుని చిత్రపటాన్ని తెచ్చుకోవాలి.ప్రతిరోజూ పూజానంతరము వాలము మొదటభాగము నుండి మొదలుపెట్టి ఒక్కొక్క బొట్టు పెట్టాలి కుంకుమ లేక సింధూరముతో.చివరవరకు అయిపోయిన రోజున మొత్తం తుడిపి అక్కడనుండి మొదలుపెట్టి మొదటివరకు ఒక్కొక్క బొట్టు చొప్పున పెట్టుకుంటూ మొదలు పెట్టినవరకు వచ్చేన్ని రోజులు పారాయణము చేయాలి.లాంగూలాస్త్రాన్ని. ఇది మహా శక్తివంతమైన ప్రక్రియ కనుక సద్బుద్ధి కల ఉత్తములకు ,మనసును అదుపు చేసుకోగల సమర్ధులయిన ఉత్తములకే చెప్పవలసివున్నది. కనుక వ్రాయటము లేదిక్కడ.

Read more...

అక్షయతృతీయరోజున బంగారము కొనటమే కాదు......

>> Monday, April 20, 2009

.
అక్షయతృతీయరోజున బంగారము కొనండి అని బంగారపు వ్యాపారులు ప్రకటనలు గుప్పిస్తారు.ఆడవాల్లు కూడా అక్షతృతీయకు ఏమి కొనాలో ముందుగానే సిద్ధమయి వుంటారు. కాకుంటే ఈ ఆచారంవెనుక నున్న అసలు అంతరార్ధం కూడా తెలుసుకుంటే మంచిది. అక్షయ మంటే తరగనిది అనిఅర్థము.వైశాఖ శుద్ధతదియ రోజును మనం అక్షయతృతీయగా వ్యవహరిస్తుంటాము.ఆరోజు బంగారము కొంటే తరగదని అంటారు.
కానీ అసలు చేయాల్సినది బంగారము కొనటమేకాదు,దానిని దానము చేయటము కూడా చేయాలి. మన ఆచారాలన్నింటి వెనుక దానధర్మాలు అంతస్సూత్రంగా ఇమిడివుంటాయి. ఇటువంటి పవిత్రదినాన బంగారము కొనటమే కాక పేదలకు ధార్మిక ఆచారముతో జీవించేవారికి కొంతభాగము దానము చేయటము ద్వారా అనంత పుణ్యాన్ని పొందవచ్చు. అలా చేయటము ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మరలా మనచే జరపబడి అనంత పుణ్యము అక్షయమై మనవెంటవుంటూంది అని శాస్త్రములు చెబుతున్నాయి. కనుక బంగారము కొందామా!స్థలం కొందామా ,ఆస్థులు కొందామా అనే కాక మనకు భగవంతుడిచ్చిన అవకాశము తో మరిన్ని పుణ్యకార్యక్రమాలు కూడా చేద్దామనే సంకల్పాలతో ఇటువంటి పుణ్యతిథులను ఉపయోగించుకుందాము. పరమాత్మకు ఇష్టులగు జీవిద్దాము.సుఖసంతోషాలను పొందుదాము.

Read more...

దూరదర్శన్ లో బ్లాగుల పరిచయం

>> Sunday, April 19, 2009

బ్లాగ్ మిత్రులకు సూచన. తెలుగు బ్లాగుల పరిచయము చేయటానికై దూరదర్శన్ వారు గతనెలలో ఒక కార్యక్రమాన్ని రూపొందించారు.ఇందులో తెలుగు బ్లాగర్ల చేత వారి బ్లాగులగూర్చి పరిచయం చేపిస్తూ తెలుగు భాషను అంతర్జాలంలో ప్రచారం చేయటానికి అవి ఉపయోగపడుతున్నతీరును తెలియజేశారు.ఈకార్యక్రమాన్ని ది.20-4-09 సోమవారం ఉదయం 9.00 గంటలకు ప్రసారం చేస్తున్నారు .బ్లాగ్మిత్రులంతా ఈకార్యక్రమాన్నివీక్షించాలని మనవి.

Read more...

టీవీప్రకటనలలో అమ్మే దైవ సంబంధిత వస్తువులు మహిమ కలిగి వుంటాయా?

>> Wednesday, April 15, 2009



ఈమధ్య దూరదర్శన్ కార్యక్రమము కోసము కలిసి నప్పుడు బ్లాగ్ మిత్రులమధ్య చిన్న చర్చ జరిగినది. టివిలలో హనుమత్ యంత్రాలు,ఇత్యాదిగా దైవసంబంధిత వస్తువులు అమ్ముతామని వీటివలన అద్భుత ఫలితాలు వస్తాయని ,వాల్లకు వాళ్ళే గొప్ప సాధకులుగా కితాబులిచ్చు కోవటం వాటిపైన వేడి వేడిగా చర్చ జరిగినది. అటుతిరిగి ఇటుతిరిగి నా అభిప్రాయము కనుక్కోవాలనేవిధంగా విమర్శలు సాగినట్లనిపించినది.
మహామంత్రాలు గాని మహాసాధకులు గాని ఎవరూ మార్కెట్ లో వస్తువులుగా ప్రదర్శించి దిగజారాల్సిన అవసరము లేదు. బంగారము తాను బంగారాన్నని చెప్పుకోవాల్సిన అవసరము లేదు. ఒకవేళ అలాచెప్పుకుంటున్నారంటే అది బంగారము కాదేమోనని అనుమానపడాల్సినదే.భగవత్ శక్తి నెవరూ విక్రయించటము ద్వారా అందజేయలేరు. మన చిల్లరడబ్బులకు లొంగేవాడు కాదు కదా భగవంతుడు. కనుక మేము అంత పంపిస్తే ఈయంత్రమిస్తాము ,ఇంత పంపిస్తే ఆ తాయెత్తులు పంపుతాము అనే వ్యాపారముపట్ల నేను పూర్తి వ్యతిరేకము కనుక అటువంటివారి పట్ల నాకు సదభిప్రాయము కూడా లేదు.ఇదే సమాధానాన్ని మనమిత్రులకు చెప్పాను.

ఇక ఇది కలికాలము .కనుక చిత్రాతి చిత్రములు జరుగుతుంటాయి.కాలజ్ఞానములో తాతగారు బ్రహ్మం గారు హెచ్చరించారు మనలను.ఉల్లిగడ్డకు కూడ ఉపదేశ మిచ్చేటి కల్లగురువులు భువిని పుట్టెరయా! అని అలాగే పుణ్యక్షేత్రాలన్నీ వ్యాపార క్షేత్రాలుగా మారుతాయని ,మహామంత్రాలు మాడలకు అమ్మబడతాయని చెప్పారాయన ఆనాడే. ఎప్పుడైతే డబ్బుకమ్మాలని చూస్తామో అప్పుడు మంత్రాలు,యంత్రాలు శక్తి హీనమవుతాయి.తీసుకున్నవారి నమ్మకాన్ని మనం విమర్శించటము కాదు గాని నిజం ఇది. భక్తి పూర్వకంగా భగవంతుని ఆశ్రయించి మెప్పించలేని అలసత్వంతోను,అత్యాసతోను కొండొకచోట అమాయకత్వము వలనను భగవద్భక్తులు కూడా ఈ వ్యాపారుల పాలిట పడుతుంటారు.వీరికి భగవంతుని ఆశ్రయించి ఆశక్తిని పొందగలిగే అవకాశమున్నప్పటికీ సాధనకు దిగరు .నాకు కూడా చిత్రమయిన వ్యక్తులు తటస్థిస్తుంటారు వారి సమస్యకు తగిన సలహా చెప్పి ఏ హనుమాన్ చాలీసా నో మరొకటొ ఇలా చేయండి.ఇలాఫలితమొస్తుందని ఉదాహరణలతోటి చూపించినా వారు వందలసమస్యలు చెబుతుంటారు .మాకు సమయము చాలదని,ఎక్కడండీ మాకు పనులవత్తిడి అని రకరకాల కారణాలతో తప్పుకోజూస్తుంటారు. మరికొందరు శ్రద్దగా చెప్పిన సూచనలను పాటించి ఇక్కడే ఈఅంతర్జాలములో పరిచయమయినవారే చాలమంది తమసమస్యలను పరిష్కరించుకున్నవారు ఉన్నారు.అది వారిశ్రద్ధకు భగవంతుడు చూపించిన కరుణకు నిదర్శనము. కొద్దిమంది సాధకులు లోకకల్యాణ కాంక్షతో ఇతరులకోసము తమసాధనధారపోసి కొద్దిగా మేలు చేయవచ్చు . కాని తరువాత రోగగ్రస్తుడైన రోగికిఅత్యవసరమయి ఎంత సేపు సెలైన్ ఎక్కించినా పూర్తి శక్తిని పొందాలంటే ఆహారం తీసుకోక తప్పదు గదా!కనుక ఎవరికి ఆకలైతే వారు అన్నంతినాలి. ఎవరోతింటే మనకు కడుపునిండదు. అందుకే ఇక్కడ ఏకార్యక్రమము చేపట్టినా పాల్గొనేవారు కూడా తప్పనిసరిగా పారాయణాదులు చేసినప్పుడే ఇక్కడచేసే కార్యక్రమాలతో అనుసంధానించబడి ఫలితాలను పొందుతారని ఖచ్చితముగా చేయాలని చెబుతాము. అది కొందరికి నచ్చినా నచ్చకున్నా!

ఇది నావ్యక్తిగతభావన.నేను నమ్మిన మార్గం. నాకు మహానుభావులగు గురుపరంపరద్వారా అందిన బోధన.నా స్వల్ప బుద్ధికి అందిన జ్ఞానము.నేనెవర్నీ కించపరచటము లేదు.పెద్దలమాటను ఉదహరించాను.ఆథ్యాత్మిక మాహాసాగరములో చిన్న ఇసుకరేణువునైన నేను అంతానాకు తెలుసని నాకు తెలిసినదే ప్రమాణమని వాదించే సాహసము చేయలేను. కాని నానమ్మకము నాకు సరయినదనే నిదర్శనాలను నాజీవితము లోను ఏదో ఉడతాభక్తిగా భక్తజనులకు నేనిచ్చేసలహాలతో వారి జీవితాలలోనూ ఆజగన్మాత లీలామాత్రంగా చూపిస్తూనే వున్నది.ఈజన్మ నెత్తినందుకు ఎవరికన్నా ఉపయోగపడితే చాలు కనుక నేనిలానే సాగుతుంటాను. మీ నమ్మకాలు మీఅనుభవాలు మీవి. ఏదైనా విమర్శించి చూసి పరిశీలించినమ్మటము ఉత్తమమని నాభావన. భగవద్భక్తులకు ప్రణామములు.

Read more...

మాతృభూమికి దూరంగా వున్నా మిత్రులారా ! యాగానికి ఆహ్వానం

>> Monday, April 13, 2009

లోక శ్రేయస్సు కొరకై హనుమత రక్షాయాగము మొదలైనది. విరోదినామ సంవత్సర విపరితములనుమ్ది రక్షిమ్కామని కోరుతూ హనుమదుపాసన జరుగుతున్నదిక్కడ . ప్రపంచ ము లోని పలుప్రాంతాల్లో వున్న మనవారు తమపేరున కూడా అర్చనలను జరుపమని వేగు ద్వారా కోరుతున్నారు. మహత్తర కార్యక్రమము మొదలు పెట్టినదే అందుకు కనుక తప్పనిసరిగా మీ కొరకు ఇక్కడ స్వామి వారికి సేవలు జరుప బడతాయి . మీకు సర్వ వేళలా రక్షగా వుండాలని ఆయనను స్తుతించటము జరుగుతున్నది. మీరుకూడా అక్కడ హనుమాన్ చాలీసా,దండకము పారాయణము చేయటము dvaa రా సిఘ్రముగా ఆయన అనుగ్రహము పొందవచ్చు

Read more...

అభిషేకములతో ఆనంద తాండవమాడిన హనుమంతుడు.

>> Saturday, April 11, 2009

వినుకొండలో ప్రసిద్ధ గుంటి ఆంజనేయ స్వామి వారు.

వినుకొండ పట్టణములో ఈరోజు జరిగిన అభిషేకాలతో హనుమంతుడు ఆనంద తాండవమాడాడు.పట్టణమునకు హనుమత్ రక్షతో దిగ్బంధనము చేసినట్లుగా వినుకొండకు ఎనిమిది దిక్కులా హనుమత్ ప్రతిష్టజరిగియుండటము ఈ వూరి విశేషము. హనుమత్ రక్షాయాగము లో భాగంగా నేడు[11 ఏప్రిల్09] హనుమంతునికి వినుకొండ పట్టణ జన రక్షణార్ధం సామూహిక అభిషేకములు నిర్వహించబడ్డాయి.శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం పర్యవేక్షణలో పట్టణములోని పలుదేవాలయాలలో ఉదయం 6 గంటలనుంచి భక్తులు పోటెత్తినట్లు తరలి వచ్చి ఆవుపాలు శుద్ధ జలములతో అభిషేకాలు జరిపారు. మధ్యాహ్నం 1 గంటవరకు ఆలయాలలో రద్దీ తగ్గలేదు. పట్టణములో ప్రముఖమయిన గుంటి ఆంజనేయ స్వామి ఆలయం.డబాసెంటర్ ఆలయం .పుట్టాబత్తుని ఆంజనేయస్వామి,దక్షిణ గమిడీ ఆంజనేయస్వామి కోదండరామస్వామి,కొత్తపేట రామాలయం,రంగనాయక స్వామి ఆలయం,శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం లలో హనుమంతునికి అభిషేకములు నిర్వహించి అక్కడ హనుమత్ రక్షలను ధరించారు.

శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠము పర్యవేక్షణలో ఆలయాల అర్చకులు,సేవాసమితులు పలు ఆధ్యాత్మిక సంస్థలు తమ సేవలను అందించగా భక్తులు స్వామివారిని ఈ సంవత్సరాన ఏదుష్ఫలితములు రాకుండా కాపాడమని ప్రార్ధన చేస్తూ మన్యుసూక్త రుద్రసూక్తాలతో స్తుతిస్తూ అభిషేకాలను చేశారు.

Read more...

బ్రహ్మచారుల చే పారాయణము ప్రారంభించ బడినది

>> Friday, April 10, 2009




హనుమత్ రక్షా యాగము లో ౪౦ రోజులు బాల బ్రహ్మచారులచే జరపబడే ప్రత్యేక పారాయణముప్రారంభమయినది. శక్తివంతమయిన చాలీసా పారాయణము వీరిచే జరపబడటము వలన స్వామికి మహా ప్రీతికారకమయి శీఘ్ర ఫలితాలనిస్తుంది. ఇక్కడకు గోత్రనామాలను పంపిన భక్తుల శ్రేయస్సుకోసము ,లోకకల్యాణార్ధము వీరిచే హనుమజ్జయంతివరకు పారాయణము జరుపబడుతుంది.

Read more...

108 ముఖ్యమైన హనుమత్ క్షేత్రాలు

>> Wednesday, April 8, 2009

అంతా రామమయం .ఈజగమంతా రామాంజనేయ మయము.ఈ భారత భూమి అంతా శ్రీ సీతా రామాంజనేయుల పద స్పర్శతో పునీతమయినది.ఎందరో మహానుభావులు,ఋషుల తపోఫలితముగా స్వయంభూ గా ఆంజనేయస్వామి వెలసిన క్షేత్రాలు,ఎందరో మహాభక్తులు,సమర్ధరామదాసు గారు,తులసీదాసుగారు,శ్రీ భక్త రామదాసుగారు,శ్రీమధ్వాచార్యులు గారు ,శ్రీ వ్యాసరాయలు వారు ఇంకా అనేకమంది హనుమద్భక్తులు స్థాపించిన క్షేత్రాలు అవియేగాక అతిప్రాచీనమైనవి,త్రేతాయుగం నాటివి కూడా అనేకం .......అనంతం.లక్షలాది హనుమత్ మందిరాలలో ప్రముఖమయిన 108 హనుమత్ క్షేత్రాల వివరాలను మీకు అందిస్తున్నాము.

1.శ్రీ జాపాలి హనుమాన్ క్షేత్రం
.....................

హనుమంతుని జన్మస్థలము తిరుమల కొండలని పరిశోధన పూర్వకం గా నిర్ధారించబడినది.మహా పవిత్ర మయిన తిరుమలగిరులలో జాబాలి మహర్షి తపస్సు చేయగా స్వామి స్వయం భూగా వెలశాడు బాల రూపము లో. తిరుమల లో పాపనాశనం వెళ్ళేదారిలో ఆకాశగంగకు ముందు వచ్చే టర్నింగ్ లో బస్సు దిగి కొద్దిమాత్రం నడకతో జాపాలి క్షేత్రాన్ని దర్శించవచ్చు.తిరుమల వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించండి.
2. శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి
......................

చిత్తూరు జిల్లాలో తిరుపతి పుణ్యక్షేత్రము నుండి 75 కిమీ దూరం లో కాణిపాకం వున్నది. అక్కడకు 10 కిమీ దూరం లో అరగొండ గ్రామము నకు 2 కిమీ దగ్గరలో ఎత్తైన కొండమీద ఈ క్షేత్రమున్నది. ఇచట సహజ సిద్దముగా ఏర్పడిన "సంజీవరాయ"పుష్కరిణి విశేషమహిమ కలది.ఇక్కడ స్నానము చేసిన సర్వ వ్యాధులు హరించునని ప్రసిద్ధి.

3.శ్రీ గండి వీరాంజనేయ స్వామి
.....................

కడపజిల్లా లో పొద్దుటూరుకు నుంచి వేంపల్లికి వెళ్ళి అక్కద నుంచి 7 కిమీ వెలితే గండి క్షేత్రమునకు వెల్లవచ్చు.హనుమమ్తుని తండ్రియగు వాయుదేవుడు ,లంకనుంచి తిరిగి వెళ్ళునప్పుడు ఇక్కడకు వచ్చి వెల్లవలసినదిగా కోరినందున ఆయన కోరిక మీద స్వామి సీతా సహితులై వచ్చేప్పుడు ,వాయుదేవుడు రెండు కొండలకు మధ్య బంగారు తోరణము కట్టెనట.కైవల్య ప్రాప్తికి ముందు మాత్రమే ఈతోరణము కనిపిస్తుందని అంటారు. బ్రిటిష్ కలెక్టర్ మన్రోకు ఈతోరణము దర్షనమయినదని మిత్రులకు చెప్పటము తరువాత ఆయన దేహత్యాగము చేయటము జరుగినదని చెబుతారు.
రాముడు తబన వింటి కొనతో బండపై హనుమ రూపాన్ని లిఖించగా వ్యాసరాయలవారు ప్రాణ ప్రతిష్ఠచేసియున్నారు.

4.శ్రీ వెల్లాల సంజీవరాయ స్వామి
.....................

సంజీవపర్వతాన్ని తీసుకు వెళుతున్నా స్వామిని ఇక్కడున్న మునులు ప్రార్ధించి వుండిపొమ్మనగా కాదు సమయము దాటి పోతున్నది వెళ్లాలని స్వామి అన్నారు.ఆయన నోటినుంచి వెల్లాల అని వచ్చినది కనుక ఈగ్రామానికి ఈపేరు వచ్చినది.హనుమత్ మల్లు అనురాజు నదిలోనున్న స్వామిని తీసి ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.రోజు రోజుకు పెరుగుతున్న స్వామి తలపై రాగికలశము వుంచటముతో పెరగటము ఆగి నదట

5.నేమకల్లు-మురుడి-కస్సాపురం
---------------------
వ్యాసరాయల వారు ఈమూడుక్షేత్రములలో ఒకేసారి,ఒకేరోజు మూడు విగ్రహములను ప్రతిష్ఠచేశారు.శ్రావణ,కార్తీక మాస మంగళ శనివారములలో ఒకేరోజులో ఈ మూడుక్షేత్రాలను దర్శించినవారికి శుభములు చేకూరుతాయి.కాని స్వంతవాహనము లేకుండా ఒకేరోజులో
ఈ మూడు క్షేత్రాలను దర్శించటము వీలుకాదు.
గుంతకల్లునుండి కసాపురం వెల్లవచ్చు.

[రేపు మరొక ఐదుక్షేత్రాలను పరిచయం చేస్తాము.]

.

Read more...

హనుమత్ రక్షాయాగమునకు ఇంకా గోత్రనామాలు పంపవచ్చు.

>> Tuesday, April 7, 2009

హనుమత్ రక్షాయాగములో పాల్గొనటానికి ఇంకా గోత్రనామాలు పంపవచ్చా అనిచాలామంది అడుగుతున్నారు. పారాయణము నలభైరోజులు చేయటానికి ఏప్రిల్ 9 వతేదీదాకా సమయమున్నది. 9 నుంచి మే 19 హనుమజ్జయంతివరకు 40 రోజులు వుంటుంది. కనుక సరిపోతుంది. కనుక మీరు గోత్రనామాల ఎప్పుడైనా పంపవచ్చు. అలాగే మీప్రాంతములో సామూహికముగా పారాయణములు ,అలాగే చాలీసా హోమములు ,హనుమదభిషేకములు నిర్వహించదలచుకున్నవారు అక్కడ చేయవచ్చు. మీకు కావలసిన వివరములు పంపగలము.

ఇక ఇక్కడ కార్యక్రమానికి తమవంతు సహాయపడతామని చాలామంది పెద్దమనసుతో అడుగుతున్నారు..వారికి ధన్యవాదములు తెలుపుకొంటున్నాము. అటువంటివారు ఇక్కడ జరిగే కార్యక్రమములలో పూజాద్రవ్యాలకు, హోమ కార్యక్రమాలకు,అన్నదానములోను తమ సహాయమందించవచ్చు. తాము ఏకార్యక్రమానికి సహాయపడతారో సూచించినచో అందుకొరకు వినియోగించబడుతుంది మీరందించే సహాయము.ఐతే చిన్నమనవి. గోత్రనామాలు పంపినవారు తప్పనిసరిగా ఏదైనా పంపాలనే నియమమేమీలేదు.గోత్రనామాలు పంపినవారందరి పేరన ఇక్కడ సంకల్పములు చెప్పి స్వామివారికి సేవలు జరుపబడతాయి. కొందరు భక్తులు తమచేయి కూడా ఈ కార్యక్రమములో కలవాలని కోరుతున్నందున మాత్రమే ఈవిషయము చెప్పబడుతున్నది.

Read more...

రామప్రభో ! నిన్నెంతకాలము గుర్తుంచు కోవాలి మేము ?

>> Friday, April 3, 2009


రామప్రభూ!
కన్నతల్లిదండ్రులు పట్ల ఎలా కృతజ్ఞత చూపించాలో ,వారి ఆజ్ఞ ఎలా శిరసావహించాలో తెలుసుకోవాలనుకున్నంతకాలము
అన్నదమ్ముల పట్ల ప్రేమాభిమానాలు,వారికై ఎంతసంపదనైనా త్యాగంచేయగల గుణాన్ని కాపాడుకోవాలనుకున్నంత కాలము,
కష్టలలో సహితము భార్య భర్తను ఎలా నీడలా అనుసరించాలో తెలుసుకోవాలనుకున్నంత కాలము,
అన్నదమ్ముల తో ఆస్తులేకాదు ఆపదలలో కష్టాలను కూడాపంచుకోవాలనే ధర్మము మాకు గుర్తున్నంత
భార్య దూరమైతే విలపించే నిజమైన ప్రేమ మాలో వున్నంత కాలము,
స్నేహితుల పట్ల చూపాల్సిన నిబద్ధత మేము కోరుకున్నంత కాలము,
ఎన్ని కష్టాలైనా రానీ ,ఎన్నిప్రలోభాలు చుట్టుముట్టనీ భర్త తప్ప అన్యము మనసునకు రానీయని మహిళామ తల్లులు భువిపై జన్మిస్తున్నంత కాలము,
తన భార్య కుజరగిన అవమానము నకు ప్రతీకారము తీర్చుకునే పౌరుషము మా మనములలో ఉన్నంతకాలము,
శతృవునైనా క్షమించగల దయాగుణమున్న మహనీయులు పృథ్విపై పుడుతున్నంత కాలము,
తనప్రజల అభిప్రాయానికి విలువనిచ్చే పాలకులు కావాలనుకున్నంత కాలము,
ప్రజలశ్రేయస్సుకు రాజెలా పాలనచేయాలో ఒక ఉదాహరణ ఉండాలనుకున్నంత కాలము
ధర్మ మెలా ఉంటుందో సప్రమాణముగా తెలుకోవాలని అనుకున్నంత కాలము,
లోకాన సత్యధర్మ శాంతులు విలసిల్లాలని మా మనసులో కోరిక పుట్టినంత కాలము,
భువిపై మానవత్వము బ్రతికున్నంతకాలము
పాలకుడు ఎలావుండాలో ,సుపరి పాలనంటే ఏమిటో ఉదాహరణ కావాలనుకున్నంత కాలము
నీనామము ,నీరూపము ,నీత్యాగము ,ఆర్త జనరక్షణ,ధర్మాచరణ నీ చరితము మామనసున మిగిలి పోయేలా నీ పుట్టిన రోజు ,రాజ్యము చేపట్టినరోజు మాకు వరముగా ప్రసాదించు తండ్రీ !

Read more...

ఇలా బర్త్ డే చేస్తే భలేగుంటదీ !

>> Thursday, April 2, 2009


ఇలా బర్త్ డే చేస్తే భలేగుంటదీ !

ఎప్పుడూ నోటితే వెలిగే దీపాలను ఆర్పే పద్దతిలో పుట్టిన రోజు పండగను చేసేవారు ,మనపద్దతి లో శాస్త్రీయంగా ఇలా జరుపుకోండి.ఎంత అద్భుతంగా వుంటుందో పండుగ.పుట్టినరోజే కాదు పెళ్ళిరోజు కూడా ఇలానే జరుపుకోవచ్చు.

పుట్టిన రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానము చేయాలి .[తలకు నువ్వుల నూనె పెట్టుకొని స్నానము చేయాలి.]స్నానానంతరము కొత్తవస్త్రములు ధరించి దేవుని పూజ చేసుకోవాలి.తరువాత స్నేహితులను బంధువులను అందరినీ ఒక నిర్ణీత సమయానికి పిలుచుకుని ఆసమయములో క్రిందివిధముగా కార్యక్రమము చేసుకోవాలి.
హాలుకు మధ్యగా ఒక బల్లవేసి దానిపై దీపపు కుందిని గాని లేక ప్రమిదలు గాని వత్తులు వేసి ఆవునేయి లేక నూనె వేసి వెలిగించటానికి సిద్దంగా వుంచుకోవాలి.ఎన్నవ పుట్టిన రోజు జరుపుకుంటుంటే అన్ని వత్తులు ప్రమిదలు సిద్ధం చేసుకోవాలి.దాని పక్కన సుమారు పావుకిలో కు తగ్గకుండా పాలకోవా ముద్దగాని,కలాకాన్ గాని హల్వాగాని లేక అటువంటి మెత్తని ముద్దలావుండే స్వీట్ గాని ఏదైనా సరే వెడల్పుగా,గుండ్రముగా పూరీ ఆకారములో మందముగా చేసి వుంచుకోవాలి అందరూ రాగానే ఈక్రింది మంత్రము చదువుతూ దీపము వెలిగిస్తాడు.ఒకవేళ మరీ చదవలేనివారైతే వాళ్లతరపున తల్లి లేకతండ్రి గాని చదవవచ్చు.మంత్రము చదవలేనివారు తాత్పర్యము చదవవచ్చు.రెండూ చదివినచో చాలామంచిది.చదివేప్పుడు చక్కగా,స్పష్టముగా అతిథులంతా కూడా వినునట్లు చదవవలెను.

మం// ఉద్దీప్యస్య జాతవేదో అపఘ్నన్నిర్ ఋతింమమ
పశూగ్ శ్చమహ్యమావహ జీవనంచ దిశోదిశ //
[ఓజాతవేదుడవైన అగ్నిదేవా!చక్కగా ప్రకాశవంతముగా వెలిగి మాయందున్న పాపమను చీకటిని పోగొట్టుము.చక్కని ఇంద్రియములను ,సుఖమైన జీవనమును,మంచిదృష్టి ఇమ్ము]

ఈ మంత్రము చదివినతరువాత పాలలో తేనె కలిపి దీపముదగ్గరవుంచవలెను.తేనె లేనిచో పంచదార వాడవలెను.దీపమునకు నమస్కరించి ఈక్రింది మంత్రమును చదవవలెను.

మహా మృత్యుంజయమంత్రము
------------------

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుక మివబంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్
అని మూడుసార్లు స్పష్టముగా నెమ్మదిగా చదవవలెను. చిన్నపిల్లలైనచో పెద్దవారిచేచెప్పించవచ్చును.
[పుష్టిని వృద్ధిచేయునట్టి,మంచి సువాసన కలుగజేయునట్టి మూర్తియగు త్రినేత్రుని మేము ఆరాధించుచున్నాము.ఆయన పండినదోసపండు తొడిమనుండి వేరుచేసినట్లు మమ్ము మృత్యువునుండి వేరుచేసి అమృతత్వమునకు చేర్చుగాక!]

పాలుతేనె కలిపిన ఈపానీయమును తాను కొద్దిగా తీర్ధముగా తీసుకుని తరువాత చేతులు కడుగుకుని అందరికీ తీర్ధములా ఇవ్వవలెను.
ఆతరువాత తరువాత పూరి వలె సిద్దముగా వుంచిన స్వీటు మీద ఈక్రింది పద్దతిలో చాకుతో గాని లేక సూదితోగాని ఈక్రింది విధముగా గీయాలి.
ఆ ఆకారము ఎంతస్పష్టముగా గీసిన అంతశుభకరము.దానికి నమస్కరించవలెను

ముందు స్వీటు మీద నిలువుగా అడ్డముగా గీతలు గీయాలి [+] ఆకారములో. ఇప్పుడు ప్లస్ యొక్క నాలుగు చివర్లను సరళరేఖలతో కలపవలెను.అంటే ప్లస్ చుట్టూ చతురస్రము అమర్చినట్లుంటుంది. తరువాత ఒకవృత్తము ఈఆకారము చుట్టూ గీయాలి .అంటే చతురస్రము యొక్క నాలుగు మూలలూ తగులుతూ వృత్తం వుంటుంది.

అట్లు గీస్తున్నప్పుడుఈ క్రింది మంత్రము చదవాలి.

మం// సన్త్వాసిఞ్చామి యజుషా ప్రజామాయుర్ధనఞ్చ .ఓం శాంతి:శాంతి:శాంతి:
[ మాకు ఆయుష్షు,సంతతి మున్నగునవి సమృద్దిగా కలుగుగాక!]
ఇట్లు కోసినతరువాత వచ్చిన అతిథులను బట్తి ఆస్వీటును కావలసినన్ని చిన్న ముక్కలుగా కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క ఇచ్చుచూ ఈక్రింది మంత్రము చదవవలెను.
మం// సహనావవతు/సహనౌభునక్తు/సహవీర్యం కరవావహై

తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ...ఓంశ్శాన్తి శ్శాన్తి శ్శాన్తి:

[ మేము రక్షింపబడుదుముగాక.కలసి భుజింతుముగాక. కలసి సామర్ధ్యము పొందుదుము గాక. తేజశ్శ్వంతులమవుదుముగాక.విరోధము పొందకుందుముగాక .మా మధ్య ద్వేషము కలుగకుండుగాక.]
అప్పుడు అచ్చటనున్నవారిలో పెద్దవారు పుట్టినరోజు జరుపుకుంటున్నవారిని దీపము దగ్గర కుర్చీపై కూర్చోబెట్టి ఈక్రింది మంత్రమును మూడుసార్లు చదువుతూ ఆవ్యక్తిపై అక్షతలు వేయవలెను. మిగిలిన వారు కూడా అక్షతలు వేయాలి. ఆ వ్యక్తికన్న వయస్సులో చిన్నవారు పూలు మాత్రమే వేయవలెను.

మం//శతమానం భవతి...శతాయు:పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతితిష్టతి.


అటుతరువాత వచ్చిన వారందరికీ తామివ్వదలచుకున్న ఉపాహారములను లేక విందును ఇవ్వవచ్చును.

[పూజ్య ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు తమశిష్యులకు బోధించి ఆచరింపజేసిన శుభకరమయిన విధానమిది]ఇలా మన సాంప్రదాయ పద్దతి లో శుభకార్యాలను జరుపుకుందాము.

Read more...

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP