శతృ పీడా నివారకము.హనుమల్లాంగూలాస్త్రము.
>> Friday, April 24, 2009
శతృ పీడా నివారకము.హనుమల్లాంగూలాస్త్రము.
శతృవులను అణచివేయడం లోను,శత్రుపీడలను తొలగించుటలోను మిక్కిలి శక్తిగలది హనుమల్లాంగూలాస్త్రము అనబడే స్తోత్రము.దీనిని రావి చెట్టు మొదట్లో కూర్చుని ఎవ్వరు నియమముగా పారాయణము చేస్తారో వారు శత్రువులను జయించి హనుమదనుగ్రహముతో సుఖ శాంతులతో నుండగలరు ,ఇట్టిఫలితములను సద్బుద్ధితో నే పొందగలరు. శత్రుబాధననుభవించెడి ఉత్తములు ప్రతినిత్యము దీనిని పఠించినచో వారు శత్రువులనుండి కాపాడ బడుదురు. ఈ స్తోత్రము తో బాటు లాంగూల పూజ జరపాలి.
అదెలాగంటే,
వాలమునకు గంటగాని అవయవములు గాని అడ్డురానటువంటి ,హనుమంతుని చిత్రపటాన్ని తెచ్చుకోవాలి.ప్రతిరోజూ పూజానంతరము వాలము మొదటభాగము నుండి మొదలుపెట్టి ఒక్కొక్క బొట్టు పెట్టాలి కుంకుమ లేక సింధూరముతో.చివరవరకు అయిపోయిన రోజున మొత్తం తుడిపి అక్కడనుండి మొదలుపెట్టి మొదటివరకు ఒక్కొక్క బొట్టు చొప్పున పెట్టుకుంటూ మొదలు పెట్టినవరకు వచ్చేన్ని రోజులు పారాయణము చేయాలి.లాంగూలాస్త్రాన్ని. ఇది మహా శక్తివంతమైన ప్రక్రియ కనుక సద్బుద్ధి కల ఉత్తములకు ,మనసును అదుపు చేసుకోగల సమర్ధులయిన ఉత్తములకే చెప్పవలసివున్నది. కనుక వ్రాయటము లేదిక్కడ.
1 వ్యాఖ్యలు:
శత్రుపీడ కాకుండా ఇంకేమైనా కూడా కుదురుతుంది అని ఒక స్నేహితురాలు చెప్పేరు. కానీ వేరే మంత్రం లేదు. అలా బొట్లు పెడుతూ హనుమాన్ చాలీసా చదవమన్నారు. అలాగే చేసాము (కొన్నేళ్ళ క్రితం)
Post a Comment