అభిషేకములతో ఆనంద తాండవమాడిన హనుమంతుడు.
>> Saturday, April 11, 2009
వినుకొండలో ప్రసిద్ధ గుంటి ఆంజనేయ స్వామి వారు.
వినుకొండ పట్టణములో ఈరోజు జరిగిన అభిషేకాలతో హనుమంతుడు ఆనంద తాండవమాడాడు.పట్టణమునకు హనుమత్ రక్షతో దిగ్బంధనము చేసినట్లుగా వినుకొండకు ఎనిమిది దిక్కులా హనుమత్ ప్రతిష్టజరిగియుండటము ఈ వూరి విశేషము. హనుమత్ రక్షాయాగము లో భాగంగా నేడు[11 ఏప్రిల్09] హనుమంతునికి వినుకొండ పట్టణ జన రక్షణార్ధం సామూహిక అభిషేకములు నిర్వహించబడ్డాయి.శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం పర్యవేక్షణలో పట్టణములోని పలుదేవాలయాలలో ఉదయం 6 గంటలనుంచి భక్తులు పోటెత్తినట్లు తరలి వచ్చి ఆవుపాలు శుద్ధ జలములతో అభిషేకాలు జరిపారు. మధ్యాహ్నం 1 గంటవరకు ఆలయాలలో రద్దీ తగ్గలేదు. పట్టణములో ప్రముఖమయిన గుంటి ఆంజనేయ స్వామి ఆలయం.డబాసెంటర్ ఆలయం .పుట్టాబత్తుని ఆంజనేయస్వామి,దక్షిణ గమిడీ ఆంజనేయస్వామి కోదండరామస్వామి,కొత్తపేట రామాలయం,రంగనాయక స్వామి ఆలయం,శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం లలో హనుమంతునికి అభిషేకములు నిర్వహించి అక్కడ హనుమత్ రక్షలను ధరించారు.
శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠము పర్యవేక్షణలో ఆలయాల అర్చకులు,సేవాసమితులు పలు ఆధ్యాత్మిక సంస్థలు తమ సేవలను అందించగా భక్తులు స్వామివారిని ఈ సంవత్సరాన ఏదుష్ఫలితములు రాకుండా కాపాడమని ప్రార్ధన చేస్తూ మన్యుసూక్త రుద్రసూక్తాలతో స్తుతిస్తూ అభిషేకాలను చేశారు.
0 వ్యాఖ్యలు:
Post a Comment