అక్షయతృతీయరోజున బంగారము కొనటమే కాదు......
>> Monday, April 20, 2009
.
అక్షయతృతీయరోజున బంగారము కొనండి అని బంగారపు వ్యాపారులు ప్రకటనలు గుప్పిస్తారు.ఆడవాల్లు కూడా అక్షతృతీయకు ఏమి కొనాలో ముందుగానే సిద్ధమయి వుంటారు. కాకుంటే ఈ ఆచారంవెనుక నున్న అసలు అంతరార్ధం కూడా తెలుసుకుంటే మంచిది. అక్షయ మంటే తరగనిది అనిఅర్థము.వైశాఖ శుద్ధతదియ రోజును మనం అక్షయతృతీయగా వ్యవహరిస్తుంటాము.ఆరోజు బంగారము కొంటే తరగదని అంటారు.
కానీ అసలు చేయాల్సినది బంగారము కొనటమేకాదు,దానిని దానము చేయటము కూడా చేయాలి. మన ఆచారాలన్నింటి వెనుక దానధర్మాలు అంతస్సూత్రంగా ఇమిడివుంటాయి. ఇటువంటి పవిత్రదినాన బంగారము కొనటమే కాక పేదలకు ధార్మిక ఆచారముతో జీవించేవారికి కొంతభాగము దానము చేయటము ద్వారా అనంత పుణ్యాన్ని పొందవచ్చు. అలా చేయటము ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మరలా మనచే జరపబడి అనంత పుణ్యము అక్షయమై మనవెంటవుంటూంది అని శాస్త్రములు చెబుతున్నాయి. కనుక బంగారము కొందామా!స్థలం కొందామా ,ఆస్థులు కొందామా అనే కాక మనకు భగవంతుడిచ్చిన అవకాశము తో మరిన్ని పుణ్యకార్యక్రమాలు కూడా చేద్దామనే సంకల్పాలతో ఇటువంటి పుణ్యతిథులను ఉపయోగించుకుందాము. పరమాత్మకు ఇష్టులగు జీవిద్దాము.సుఖసంతోషాలను పొందుదాము.
1 వ్యాఖ్యలు:
అక్షర సత్యం.కాని నిజంగా మంచిపని చేసేవాడు 'ఆ రోజూ' కొసం ఆగడు
Post a Comment