దూరదర్శన్ లో బ్లాగుల పరిచయం
>> Sunday, April 19, 2009
బ్లాగ్ మిత్రులకు సూచన. తెలుగు బ్లాగుల పరిచయము చేయటానికై దూరదర్శన్ వారు గతనెలలో ఒక కార్యక్రమాన్ని రూపొందించారు.ఇందులో తెలుగు బ్లాగర్ల చేత వారి బ్లాగులగూర్చి పరిచయం చేపిస్తూ తెలుగు భాషను అంతర్జాలంలో ప్రచారం చేయటానికి అవి ఉపయోగపడుతున్నతీరును తెలియజేశారు.ఈకార్యక్రమాన్ని ది.20-4-09 సోమవారం ఉదయం 9.00 గంటలకు ప్రసారం చేస్తున్నారు .బ్లాగ్మిత్రులంతా ఈకార్యక్రమాన్నివీక్షించాలని మనవి.
3 వ్యాఖ్యలు:
చక్కటి విషయం. ఈ ప్రోగ్రాములను యూ ట్యూబులో పెడితే బాగుంటుంది.
హరిసేవ గారూ,
మీరు ఇచ్చిన సమాచారం వలన "దూర్ దర్శన్" లో " అంతర్జాలం లో తెలుగు " అనే కార్యక్రమాన్ని చూసే అదృష్టం కలిగింది. ఏదో మాకు చేతిలో టైమ్ ఉండబట్టి, లోడ్ షెడ్డింగ్ లేకపోబట్టీ, చూడగలిగేము. నాగన్న గారు అన్నట్లుగా దీనిని " యూ ట్యూబ్ " లో పెట్ట గలిగితే అందరికీ చూసే అవకాశం కలుగుతుంది. ఆ కార్యక్రమం చూస్తూంటే, అంతర్జాలం లో తెలుగు లో ఎన్నెన్ని అద్భుతాలు చేయగలమో తెలిసింది. నేనుఈ బ్లాగ్ ప్రపంచం లో ప్రవేసించి కొన్ని నెలలు మాత్రమే అయ్యింది ( తెలుగు లో). నేను సాధించినది చాలా అణు మాత్రమైనా చాలా చాలా సంతోషం గా ఉంది. తెలుగు లో టైపింగ్ నేర్చుకొని బ్లాగ్గ్ లు రాయడం నేర్చుకొన్నాను---
http://harephala.wordpress.com/ . దీనికి పూర్తి క్రెడిట్ ఈ - తెలుగు కే చెందుతుంది. 60 సంవత్సరాలు నిండిన తరువాత నాలాంటి వాడికి కూడా ఇందులో ఆసక్తి కలిగింప చేశేరంటే ఈ-తెలుగు వారు చెప్పే విధానం ఎంత సుళువు గా ఉందో తెలుస్తోంది. ఆయుష్మాన్ భవ !!
ఈ రోజు సప్తగిరి లొఈ-తెలుగు
ఈ రోజు సప్తగిరి లొఈ-తెలుగు చూసిన తరువాత ఏమి తెలియని నేను ప్రయత్నించి రాస్తూన్నాను. ముందు ఈ-తెలుగు వారికి నాధన్యవాదములు.
నాలాంటి వారు అంటె నా వయస్సులొ వున్నవారు సుమారు 55 సంవత్సరాలు 60సంవత్సరాలువాళ్ళు పాత తరము కాదు క్రొత్త తరము కాని వాళ్ళు అంటే శాండువిచ్ జనరేషను ఆన్నమాట.ఇంగ్లీష్అర్ధము చేసుకునేవారు,కాని రాయలేరు,చదవగలరు కాని మాట్లాడలేరు. అటువంటి వారికి ఉద్యొగరీత్య దూరంగా వున్న పిల్లలతొ కమ్యూనికేషను చాలా కష్టమవుతోంది. అందువల్ల నేటి యువత ఈ-తెలుగు లొ మీ మాతృ భాష లొ మీ మాతృమూర్తి కి ఒక్క వాక్యము రాసి చూడండి.అమ్మా,ఎలా వున్నావు? అని అమ్మకి విడిగారాయండి. ఆమె కళ్ళలొ మమతల జల్లు కురవదంటారా " నాన్నకి రాస్తూ అమ్మ ఎలావుందీ, అమ్మకి హలొ చెప్పండి.అనికాక ,అలా రాసినరోజు నాలాటి వారు ఎంతొమంది ఇలా రాయడానికి ప్రయత్నిస్తారు కదా, ఎందుకంటే నాకు తెలిసి నాలాగా బాధపడేవారు చాలామంది వున్నారు.
Post a Comment