రామప్రభో ! నిన్నెంతకాలము గుర్తుంచు కోవాలి మేము ?
>> Friday, April 3, 2009
రామప్రభూ!
కన్నతల్లిదండ్రులు పట్ల ఎలా కృతజ్ఞత చూపించాలో ,వారి ఆజ్ఞ ఎలా శిరసావహించాలో తెలుసుకోవాలనుకున్నంతకాలము
అన్నదమ్ముల పట్ల ప్రేమాభిమానాలు,వారికై ఎంతసంపదనైనా త్యాగంచేయగల గుణాన్ని కాపాడుకోవాలనుకున్నంత కాలము,
కష్టలలో సహితము భార్య భర్తను ఎలా నీడలా అనుసరించాలో తెలుసుకోవాలనుకున్నంత కాలము,
అన్నదమ్ముల తో ఆస్తులేకాదు ఆపదలలో కష్టాలను కూడాపంచుకోవాలనే ధర్మము మాకు గుర్తున్నంత
భార్య దూరమైతే విలపించే నిజమైన ప్రేమ మాలో వున్నంత కాలము,
స్నేహితుల పట్ల చూపాల్సిన నిబద్ధత మేము కోరుకున్నంత కాలము,
ఎన్ని కష్టాలైనా రానీ ,ఎన్నిప్రలోభాలు చుట్టుముట్టనీ భర్త తప్ప అన్యము మనసునకు రానీయని మహిళామ తల్లులు భువిపై జన్మిస్తున్నంత కాలము,
తన భార్య కుజరగిన అవమానము నకు ప్రతీకారము తీర్చుకునే పౌరుషము మా మనములలో ఉన్నంతకాలము,
శతృవునైనా క్షమించగల దయాగుణమున్న మహనీయులు పృథ్విపై పుడుతున్నంత కాలము,
తనప్రజల అభిప్రాయానికి విలువనిచ్చే పాలకులు కావాలనుకున్నంత కాలము,
ప్రజలశ్రేయస్సుకు రాజెలా పాలనచేయాలో ఒక ఉదాహరణ ఉండాలనుకున్నంత కాలము
ధర్మ మెలా ఉంటుందో సప్రమాణముగా తెలుకోవాలని అనుకున్నంత కాలము,
లోకాన సత్యధర్మ శాంతులు విలసిల్లాలని మా మనసులో కోరిక పుట్టినంత కాలము,
భువిపై మానవత్వము బ్రతికున్నంతకాలము
పాలకుడు ఎలావుండాలో ,సుపరి పాలనంటే ఏమిటో ఉదాహరణ కావాలనుకున్నంత కాలము
నీనామము ,నీరూపము ,నీత్యాగము ,ఆర్త జనరక్షణ,ధర్మాచరణ నీ చరితము మామనసున మిగిలి పోయేలా నీ పుట్టిన రోజు ,రాజ్యము చేపట్టినరోజు మాకు వరముగా ప్రసాదించు తండ్రీ !
2 వ్యాఖ్యలు:
శ్రీ రాముడి కుటుంబం,మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకొంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
Nice post. Chaala baaga raasaaru.
Post a Comment