శ్రద్ధాసక్తులు లేని సాధన ఫలితాలనివ్వలేదు.
>> Saturday, April 25, 2009
శ్రద్ధాసక్తులు లేని సాధన ఫలితాలనివ్వలేదు.
ఏలక్ష్యాన్ని సాధించాలన్నాచేసే పని పైన శ్రధ్దా సక్తులు ముఖ్యము. శ్రద్ధలేని పని ఏదీ ఉత్తమమైన ఫలితాలనివ్వలేదు. కనుక చేయదలచుకున్న పనిని శ్రద్ధ తోను ఆసక్తి కలిగి చేయాలి.దీనినే షిర్డి సాయినాథులు నిష్టా,సబూరీ కావాలని చెప్పారు.ఆథ్యాత్మిక రంగములో ఇవి మరీ ముఖ్యము.
హనుమత్ రక్షాయాగాన్ని ప్రారంభించేప్పుడే చెప్పాము.ఇదొక ఆథ్యాత్మిక ప్రయోగముగా భావించి,శ్రద్ధతో చేస్తే గాని ఖచ్చితమయిన ఫలితాలు వస్తాయని. ఇక్కడకు గోత్రనామాలు పంపేవారు తప్పనిసరిగా ఆవిధముగా చాలీసా పారాయణము చేయాలని కూడా సూచించబడినది. కొందరు ఎంతో వత్తిడి పనిలో వుండికూడా అన్నింటికంటే భగవత్ కార్యము ముఖ్యమనే నమ్మికతో ,తాము అనుకున్నది సాధించాలనే తపనతో ఎంతో శ్రద్ధగా పారాయణము సాగిస్తున్నారు దేశవిదేశాలలోని మనవారు. వారికి ఖచ్చితమయిన ఫలితాలు వస్తున్నట్లు సూచనలు కూడా వస్తున్నాయని తెలుపుతున్నారు.వారి భక్తిశ్రద్ధలకు ,స్వామి వారిఅనుగ్రహానికి ప్రణామాలు.
ఇక కొందరు చెబుతున్నారు,మాకు సమయము చాలటము లేదని,మనసు బాగుండటము లేదని ,పరిస్తితులన్నీ అనుకూలించాలికదా!అని ఇలా రకరకాల కారణాలను చెబుతున్నారు. వారికి మా విన్నపమేమిటంటే ఇవన్నీ భగవన్మార్గములో నుండి మనల్ను పక్కకు తప్పించేందుకొచ్చే ఆటంకాలు. మన అలసత్వము దీనికి తోడైతే మనము లక్ష్యాన్ని చేరుకోవటము గగనమవుతుంది. మనకు సమయము లేకున్నా బంధువుల పెళ్ళికి ,వెళతాము ,ఎందుకంటే వెళ్లకుంటే చుట్టాలకు దూరమవుతాము కనుక.అలాగే అధికారులు ,స్నేహితుల విషయము లోనూ .ఇలా భౌతిక బంధాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేమనము భగవంతుని పట్ల మాత్రమే నిరాసక్తత ,నిస్సహాయాన్ని వ్యక్తము చేస్తుంటాము. ఎందుకని? అది మనకు ప్రథమ ప్రాధాన్యతా విషయముగా గోచరించక పోవటము వలన. మన పిల్లవాడు ఇది తినను ఇంకోటి చేసి పెట్టమంటే అప్పటి కప్పుడు ఎంతశ్రమకయినా ఓర్చి చేసి పెట్టగల ఆతల్లి ఇంట్లో దేవునికి నైవేద్యం వండాలంటే సమయము లేదంటుంది. ఇది సమయము సమస్యకాదని అర్థమవుతుది కదా? కనుక "శ్రద్ధావాన్ లభతే విద్యా" అన్న సూక్తిని మననంచేసుకుని సాధనలో ముందుకు సాగుదాము. పూజ ను పనిగా చేయకుండా ,పనిని పూజగా మార్చుకోవాల్సి వుంది మనము. అదే హనుమత్ సాధనలో బోధించబడుతున్న రహస్యము .ఆయన ఆచరించి చూపిన దారి కూడా.
కనుక స్వామి మార్గములో విజయవంతముగా సాగుదాము.జైహనుమాన్
1 వ్యాఖ్యలు:
మీరు చెప్పింది నిజం.
Post a Comment