108 ముఖ్యమైన హనుమత్ క్షేత్రాలు
>> Wednesday, April 8, 2009
అంతా రామమయం .ఈజగమంతా రామాంజనేయ మయము.ఈ భారత భూమి అంతా శ్రీ సీతా రామాంజనేయుల పద స్పర్శతో పునీతమయినది.ఎందరో మహానుభావులు,ఋషుల తపోఫలితముగా స్వయంభూ గా ఆంజనేయస్వామి వెలసిన క్షేత్రాలు,ఎందరో మహాభక్తులు,సమర్ధరామదాసు గారు,తులసీదాసుగారు,శ్రీ భక్త రామదాసుగారు,శ్రీమధ్వాచార్యులు గారు ,శ్రీ వ్యాసరాయలు వారు ఇంకా అనేకమంది హనుమద్భక్తులు స్థాపించిన క్షేత్రాలు అవియేగాక అతిప్రాచీనమైనవి,త్రేతాయుగం నాటివి కూడా అనేకం .......అనంతం.లక్షలాది హనుమత్ మందిరాలలో ప్రముఖమయిన 108 హనుమత్ క్షేత్రాల వివరాలను మీకు అందిస్తున్నాము.
1.శ్రీ జాపాలి హనుమాన్ క్షేత్రం
.....................
హనుమంతుని జన్మస్థలము తిరుమల కొండలని పరిశోధన పూర్వకం గా నిర్ధారించబడినది.మహా పవిత్ర మయిన తిరుమలగిరులలో జాబాలి మహర్షి తపస్సు చేయగా స్వామి స్వయం భూగా వెలశాడు బాల రూపము లో. తిరుమల లో పాపనాశనం వెళ్ళేదారిలో ఆకాశగంగకు ముందు వచ్చే టర్నింగ్ లో బస్సు దిగి కొద్దిమాత్రం నడకతో జాపాలి క్షేత్రాన్ని దర్శించవచ్చు.తిరుమల వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శించండి.
2. శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి
......................
చిత్తూరు జిల్లాలో తిరుపతి పుణ్యక్షేత్రము నుండి 75 కిమీ దూరం లో కాణిపాకం వున్నది. అక్కడకు 10 కిమీ దూరం లో అరగొండ గ్రామము నకు 2 కిమీ దగ్గరలో ఎత్తైన కొండమీద ఈ క్షేత్రమున్నది. ఇచట సహజ సిద్దముగా ఏర్పడిన "సంజీవరాయ"పుష్కరిణి విశేషమహిమ కలది.ఇక్కడ స్నానము చేసిన సర్వ వ్యాధులు హరించునని ప్రసిద్ధి.
3.శ్రీ గండి వీరాంజనేయ స్వామి
.....................
కడపజిల్లా లో పొద్దుటూరుకు నుంచి వేంపల్లికి వెళ్ళి అక్కద నుంచి 7 కిమీ వెలితే గండి క్షేత్రమునకు వెల్లవచ్చు.హనుమమ్తుని తండ్రియగు వాయుదేవుడు ,లంకనుంచి తిరిగి వెళ్ళునప్పుడు ఇక్కడకు వచ్చి వెల్లవలసినదిగా కోరినందున ఆయన కోరిక మీద స్వామి సీతా సహితులై వచ్చేప్పుడు ,వాయుదేవుడు రెండు కొండలకు మధ్య బంగారు తోరణము కట్టెనట.కైవల్య ప్రాప్తికి ముందు మాత్రమే ఈతోరణము కనిపిస్తుందని అంటారు. బ్రిటిష్ కలెక్టర్ మన్రోకు ఈతోరణము దర్షనమయినదని మిత్రులకు చెప్పటము తరువాత ఆయన దేహత్యాగము చేయటము జరుగినదని చెబుతారు.
రాముడు తబన వింటి కొనతో బండపై హనుమ రూపాన్ని లిఖించగా వ్యాసరాయలవారు ప్రాణ ప్రతిష్ఠచేసియున్నారు.
4.శ్రీ వెల్లాల సంజీవరాయ స్వామి
.....................
సంజీవపర్వతాన్ని తీసుకు వెళుతున్నా స్వామిని ఇక్కడున్న మునులు ప్రార్ధించి వుండిపొమ్మనగా కాదు సమయము దాటి పోతున్నది వెళ్లాలని స్వామి అన్నారు.ఆయన నోటినుంచి వెల్లాల అని వచ్చినది కనుక ఈగ్రామానికి ఈపేరు వచ్చినది.హనుమత్ మల్లు అనురాజు నదిలోనున్న స్వామిని తీసి ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.రోజు రోజుకు పెరుగుతున్న స్వామి తలపై రాగికలశము వుంచటముతో పెరగటము ఆగి నదట
5.నేమకల్లు-మురుడి-కస్సాపురం
---------------------
వ్యాసరాయల వారు ఈమూడుక్షేత్రములలో ఒకేసారి,ఒకేరోజు మూడు విగ్రహములను ప్రతిష్ఠచేశారు.శ్రావణ,కార్తీక మాస మంగళ శనివారములలో ఒకేరోజులో ఈ మూడుక్షేత్రాలను దర్శించినవారికి శుభములు చేకూరుతాయి.కాని స్వంతవాహనము లేకుండా ఒకేరోజులో
ఈ మూడు క్షేత్రాలను దర్శించటము వీలుకాదు.
గుంతకల్లునుండి కసాపురం వెల్లవచ్చు.
[రేపు మరొక ఐదుక్షేత్రాలను పరిచయం చేస్తాము.]
.
2 వ్యాఖ్యలు:
కసాపురం,మురడి,నేమకల్లు క్షేత్రాలను ఒకే రోజున దర్శించుకునే అవకాశాన్ని APSRTC వారు ప్రత్యేకరోజుల్లో అనంతపురం నుంచి,తాడిపత్రినుంచి ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు
Post a Comment