శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏ పూలతో సూర్యుని ఆరాదించాలి

>> Wednesday, January 21, 2015

ఏ పూలతో సూర్యుని ఆరాదించాలి  [from surya daily]
లోకంలోని చీకట్లను పారద్రోలుతూ వెలుగులు పంచే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడుగా భావించి ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది. ఇంద్రాది దేవతలు ... మహర్షులు సూర్యుడికి నమస్కరించుకున్న తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలు ఆరంభిస్తూ వుంటారు. ప్రకృతిని ప్రభావితం చేస్తూ ఆ ప్రకృతి ద్వారా జీవరాశికి కావలసిన ఆహారాన్ని అందించేది సూర్యుడే కనుక, ప్రాచీన కాలంలో అందరూ సూర్యుడిని ఆరాధించేవారు. సూర్యుడికి కౄఎతజ్ఞతలు చెప్పుకోవడమన్నట్టుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకునే వారు. ఆహారాన్ని ... ఆరోగ్యాన్ని అందించే దైవంగా ఆయన మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాడు.

దోష నివారకుడు సూర్యుడు:
అందువల్లనే ఈనాటికీ ఉదయాన్నే స్నానంచేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కరించేవాళ్లు ఎంతోమంది కనిపిస్తుంటారు. సూర్యుడికి నమస్కరించడం వలన అనేక దోషాలు తొలగిపోతాయనీ ... పుణ్యఫలాలు చేకూరతాయనేది ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. అలాంటి సూర్యభగవానుడి పూజలో కొన్ని రకాల పూలు విశిష్టమైన స్థానాన్ని కలిగి వున్నాయి.సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన ఆ పూలతో అర్చించడం వలన ఆయన అనుగ్రహం కలుగుతుందట. గులాబీలు .. జాజులు .. పొగడలు .. పొన్నాగలు .. తామరలు .. సంపెంగలు .. గన్నేరులు .. మందారాలు సూర్యభగవానుడి పూజలో విశేషమైనటువంటి స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. ఈ పూలతో సూర్యుడిని పూజించడం వలన ఆయన సంతృప్తి చెందుతాడనీ, ఆయన అనుగ్రహంతో విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.


అర్ఘ్యం వదిలి నమస్కారం:

సూర్య భగవానుడికి దోసిటతో అర్ఘ్యం వదిలి ఓ నమస్కారం సమర్పిస్తే సంతృప్తి చెందుతాడు. ఒకవేళ ఆ స్వామిని పువ్వులతో పూజించాలనుకుంటే, ఆయనకి ఇష్టమైన పువ్వులతో పూజించి అనుగ్రహం పొందవచ్చు. ఆ పువ్వులు ఏంటంటే మందారాలు, సంపెంగలు, పున్నాగ పుష్పాలు, గన్నేరులు, తామర, జాజులు, గులాబీలు, నాగకేసారాలు, మొల్లలు, మొగలి పూలు, మోదుగలు, విష్ణు తులసి, కృష్ణ్ణ తులసి సూర్య భగవానుడుకి అత్యంత ప్రీతికరమైనవి. ఇక ముళ్ళతో కూడిన పూలు, సువాసన లేని పూలు, నల్ల ఉమ్మెత్త పూలు, గురివింద పూలు సూర్యుడి పూజకు పనికి రావని పండితులు అంటున్నారు.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP