పాదధూళి విలువ
>> Friday, October 25, 2013
''భాగ్యవశాత్తు భీమారథినదిలో గోణాయికి నామదేవుడు లభించాడు. అట్లే శ్రీసాయిబాబా పదునాదేండ్ల తరుణ వయస్సులో మొదట షిరిడీ గ్రామంలోని వేపచెట్టు క్రింద భక్తుల కొరకు ప్రకటమయ్యారు" అని వ్రాశారు శ్రీహేమాద్‌పంత్. ఆ ఇరువురి జన్మచరిత్రలు ఎవరికీ తెలియవు.
సాయిబాబా వలె నామదేవుడు భక్తిమార్గాన్ని ప్రోత్సహించాడు. సాయివలె నామదేవుడు పేదరికాన్ని వరించాడు కావాలని. పరశువేది నామదేవుని ఇంటి సమీపంలో పరిస్సాభగవత్ అనేవాడుండేవాడు. భగవత్‌రఖుూబాయిని ప్రార్థించి ఇనుమును బంగారంగా మార్చే పరశువేదిని సంపాదించాడు. భగవత్ భార్య నామదేవుని దారిద్య్రాన్ని చూచి, ఆ పరశువేదిని నామదేవ్ భార్యకు ఇచ్చి, ఇనుమును బంగారంగా మార్చుకొనుమని, తిరిగి పరశువేదిని ఇచ్చివేయాలని చెప్పింది. నామదేవునకు ఈ సంగతి తెలిసి చంద్రభాగా నదిలోనికి దానిని విసిరాడు. భగవత్ ఆతని భార్య ఆ పరశువేదిని తిరిగి ఇమ్మన్నారు. నామదేవ్ ''అయ్యా భగవత్! నీకు ఆ రాతిమీద అంత మక్కువ ఉంటే నదిలో మునిగితెస్తాను"అని మునిగి కొన్ని వందల రాళ్లను తెచ్చి ''ఇందులో నీ రాయి ఏదో గుర్తించు అన్నాడు. ప్రతిరాతిని లోహానికి తాకించగా, లోహం బంగారంగా మారసాగింది. అందరూ ఆశ్చర్యపోయారు. భౌతిక సుఖాల కోసం జీవితాన్ని వ్యర్థం చేసుకున్నానని భగవత్ గుర్తించాడు. నామదేవ్ కాళ్లపై పడ్డాడు. ''నీ చేతిని నా శిరస్సుపై ఉంచు. ఇక దేనినీ కోరను" అన్నాడు భగవత్. మహారాజులను చేయగలిగిన శక్తులు ఉన్నా బీదరికంలోనే బ్రతకటం సాయికి, నామదేవునికి ఇష్టం. మంచి స్నేహితుడు నామదేవుడు మహాభక్తుడు. అంతకు మించి జ్ఞాని పాండురంగని అనుమతితో జ్ఞానేశ్వరునితో తీర్థయాత్రలు చేసిన మహనీయుడు. ఆ సమయంలో వారి స్నేహం గాఢమయింది. జ్ఞానేశ్వరుడు శరీరాన్ని విడిచిపెడదామనుకున్నాడు. నామదేవుడు ఇతరులతో అలంది గ్రామానికి బయలుదేరాడు జ్ఞానేశ్వరుడు. జ్ఞానదేవుని చివరి దినాలను నామదేవ్ తన అభంగాలలో వ్రాశాడు. తన వియోగానికి దుఃఖించవద్దని, పాండురంగని సేవలో తరింపుమని జ్ఞానదేవుడు నామదేవునితో పలికాడు. అయినా నామదేవుని దుఃఖానికి అంతం లేకుండా పోయింది. ''నా గుండె ఎండిన కాసారంలా ఉంది. ఒట్టి శూన్యం నన్ను ఆవరించింది. జ్ఞానదేవుని తత్వజ్ఞానం, అతని బుద్ధి వైభవం, అఖండభక్తి భావన నన్ను కష్టాల కడలి నుండి గట్టెక్కించింది. ఆ చిరునవు్వ ఒక నేను చూడలేనా?" అని పరితపించాడు నామదేవుడు. ''ఓ నామదేవ్! నేనూ ఈశ్వరుడినే. మా ఇద్దరిని విడిగా చూడకు. నేను నీ చెంతనే ఉంటాను అన్న విఠలుని వాణి వినబడింది. అయినా వామదేవుని దుఃఖాన్ని ఎవరు తీర్చ గలరు? విఠలుడు దేవతలతో పరివేష్ఠింపబడి ఉన్న జ్ఞానేశ్వరుని చూపించాడు. అప్పుడు నామదేవుడు శాంతించాడు. 50సంవత్సరాలు జ్ఞానేశ్వరుడు బోధించిన మార్గంలో నడిచాడు నామదేవుడు. అంతటి స్నేహబంధం ఆ ఇద్దరిది. పండరీపురంలో నామదేవుని ఇంటిని ఇప్పటికి చూడవచ్చు. పాండురంగని ఆలయం వద్ద ఇతని సమాధి ఉన్నది. భగవద్భక్తుల పాదధూళిని ధరించాలని భావించటం వలన అలా సమాధి ఏర్పాటయింది. నామదేవుడు ''ప్రపంచ దీప్తిఅని జ్ఞానేశ్వరుడే కొనియాడాడు. - యం.పి. సాయినాథ్ |
0 వ్యాఖ్యలు:
Post a Comment