శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రావణ మాస పూజలకు మీ గోత్రనామాలు పంపండి.

>> Monday, August 24, 2015

శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో ప్రతి ఏడాదివలెనే ఈ సంవత్సరం కూడా విశేషమాసములలో విశేష తిథులలో  ఉత్సవములు ,పూజలు జరుపబడుతున్నాయి.
 ఈ కార్యక్రమములన్నీ లోకకళ్యాణం కోసం సంకల్పించబడతాయి కనుక  గోత్రనామాలు పంపి తమపేర అర్చన జరుపాలని కోరుకున్నవారందరి తరపున నిర్వహించబడుతున్నాయి. మీ గోత్రనామములు పంపి ఈ పూజలలో మీరు పాల్గొనవచ్చు. 
ఇందుకుగాను మీరివ్వవలసిన దక్షిణ ఏమిటంటే మీశక్త్యానుసారం మీరు అనుష్టానం చేస్తున్న మంత్రమో, నామజపమో జరుపుతున్నసమయం లో ,అందులో కొంతభాగం దేశ క్షేమానికి,ధర్మప్రవర్ధనార్థం సమర్పిస్తున్నాము అని సంకల్పం చెప్పడం. మీకు వీలైనసమయంలో ఆర్తులకు అన్నం పెట్టడం .  ఇదే మేము కోరేది. 
లోకహితం కోసం ఈనియమంతో మీరు చేసే జపతపాదులన్నీ విశేష ఫలితాలనిస్తాయి సందేహం లేదు.
రెండవ శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం .
శనివారం రోజున  శ్రీవేంకటేశ్వర స్వామివారికి విశేషతులసీ దళార్చన 
 విష్ణుసహస్రనామపారాయణములు జరుపబడనున్నాయి


మీ గోత్రనామాదులను  durgeswara@gmail.com  నకు పంపగలరు
జైశ్రీరాం.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP