తిరుమలలో అపచారాలు ..పాలకులకు శాపాలు
>> Sunday, September 6, 2009
తిరుమల కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని దివ్యధామము . కనుకనే ప్రపంచము నలుమూలలనుండి ఆస్వామి ప్రత్యక్ష సన్నిధానాన్ని దర్శించిన అనుభవాన్ని పొందుతుంటారు. ఈరోజుకూ అక్కడ వృక్షరూపాలలో లోనూ అదృశ్యరూపాలలోనూ మహామునులు యోగీశ్వరులు స్వామిని సేవిస్తుంటారని నమ్మకం . కనుకనే ఈ స్థలాన్ని కలిమాయలకు దూరంగా పవిత్రంగా వుంచేందుకు పూర్వంనుండి మహంతులు,రాజులు ,పాలకులు శ్రద్ధ చూపేవారు . ఇక్కడ అపచారం జరగటం లోకానికి అరిష్ఠమని తరతరాలుగా నమ్ముతున్నారు. కొంచెం బాధాకరమే అయినా ఈమధ్య జరుగుతున్న కొన్ని దురదృష్టకరసంఘటనలకు తిరుమలలో జరుగుతున్న అపచారాలే కారణమని ఆస్తికలోకం నమ్ముతున్నది. కొన్ని సంఘటనలను మనం పరిశీలించాల్సి వున్నది. ఇప్పుడు భక్తులు అనుకుంటూన్న విషయాలు కొన్ని తెలుపుతాను.
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు శ్రీవేంకటేశ్వరుని భక్తుడే కాని .ఆయన కూడా కలిమాయవలనేమో చేసిన పొరపాటు తరువాత జరిగిన వరుస సంఘటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన చివరగా ముఖ్యమంత్రి అయ్యాక టీ.టీడి. పాలకమండలి ని కొత్తగానియమించి ప్రమాణ స్వీకారం జరిపించారు .అందులో రజనీకాంత్.భానుమతిగారు తదితరులు సభ్యులుగా వున్నారు. ఆలయం లోపలే ప్రమానస్వీకారం జరిపారు .వెంటనే రజనీకాంత్ భానుమతి గారితో సహా సభ్యులు రామారావుగారికి పాదాభివందనాలు చెయ్యటం మొదలెట్టారు . శ్రీవారి ఆలయం లో పరాత్పరుడైన ఆయనకు తప్ప వేరొకరికి నమస్కరించరాదు. అలానమస్కరించినా వారించి తప్పుసరిదిద్దుకోవాలి .లేకుంటే వారి పుణ్యఫలం మొత్తం కొట్టివేయబడుతుంది అని పెద్దలంటారు. మరి భక్తుడైనా రామారావుగారికి ఆవిషయం స్ఫురనకు రావకపోవటం విధివిచిత్రం .
ఆతరువాత కొద్దిరోజులకు ఒక కార్యకర్త ఆయనకు పాదాభివందనం చేయబోగా సెక్యూరిటీసిబ్బంది అత్నిని లాగివేశారు. కానీ ఆకార్యకర్త అప్పటీకే ఆయన కాల్లు పట్టుకుని వుండటం తో రామారావుగారు పడటం ముక్కుకు దెబ్బతగలటం జరిగినది. ఆతరువాత మరికొద్దిరోజులకు ఆయన ప్రయాణిస్తున్నా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడి దానిని పైలెట్ పొలాలోదించటం తో ప్రమాదం తప్పింది. కానీ మరికొద్దికాలం లో అల్లుళ్ళ ద్వారానే ఆయన అధికారం కోల్పోవటం ,మానసికంగా క్రుంగి ......తరువాత తెలిసిన కథే .
మహాభక్తుడైనా ,మామూలువాడైనా కర్మఫలితాన్ని అతిక్రమించలేరంటారు.
ఆతరువాత చంద్రబాబుగారి హయాములో తిరుమలను తీర్ధయాత్రాస్థలంకన్నా కూడా విహార యాత్రాస్థలం గామార్చాలనే పద్దతిలో కొండమీదకు రోప్ వే ఏర్పాటుచేయాలని తలచిన నిర్ణయంతోఒక అలజడి రేగటం ,అక్కడ కొన్ని నిర్మాణాలను తొలగించటం వివాదాస్పదమైనది . భక్తులు రోడ్లెక్కి ధర్నాచేసేవరకు వెళ్ళినది . వరుసగా కరువుకాటకాలు రావటం తోపాటు నక్సలైట్ల మందుపాతర పేలి స్వామి అనుగ్రహం తో ప్రమాదం నుంచి బయటపడ్దా తరువాత అధికారం కోల్పోవటం జరిగినది.
ఇక తిరుమలలో రాజశెఖరరెడ్డిగారి హయాములో పలు వివాదాలు చెలరేగాయి . సాక్షాత్తూ శ్రీవారి కొండపైనే పరమత ప్రచారం జరపటం పెద్దదుమారాన్ని రేకెత్తించినది. అలాగే తిరుమల డబ్బున్నవారు ,అధికారమున్నవారు మందీమార్బలంతో వచ్చి పద్దతులు పాటించకుండా పలు అపచారాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి . మద్యం వ్యాపారం చేసేవారిని పవిత్ర తిరుమల కు చైర్మన్ గానియమించటం .ఆస్వామి వారి పట్ల ఏమాత్రం నమ్మకం లేని కొందరు అధికారులను,వుద్యోగులను నియమించటం జరిగినది. నిజమెంతో తెలియదు గాని సాక్షాత్తూ ఒక మంత్రిగారు అర్చకులిచ్చి శ్రీవారి తీర్ధాన్ని సేవించకుండా చేతిలోనుంచి క్రిందబోసి అవమానించారని ,ఆయనకు వున్న నమ్మకంప్రకారం గెస్ఠ్ హౌస్ కెళ్ళి తీర్ధం తీసుకున్నందుకు బాధపడ్దారని తిరుమలలో గుసగుసలాడుతున్నారు. మనకైతే నిజం తెలియదు. జనం ముక్కుమీద వేలేసుకునేలా వివాదాస్పదుదైన శేషాద్రిలాంటివారిని అక్కడ నియమించటం ప్రభుత్వాలను ప్రజలు చీత్కారించుకుంటున్నారు.భక్తులు తిరుమల ఎందుకొచ్చామురా బాబూ అనుకునేలా చేయాలనేవిధంగా వుంది అక్కడ ఉద్యోగుల బాధ్యతల నిర్వహణ .
ఇక ఈమధ్య ఆభరణాల ను మాయం చేసిన విషయాలు బయటకు పొక్కటం సంచలనం కలిగించగా , ఈ విషయం లో పలు అనుమానాలు వున్నాయి జనం లో . ఈ వరుసలో రాజశేఖరరెడ్డిగారి దుర్మరణం తో ఒక సమర్ధుడైన నాయకున్ని కోల్పోయినది రాజకీయరంగం . దీంతో తిరుమలలో జరిగే అపచారాలు పాలకులకు శాపాలుగా మారుతున్నాయని జనం అభిప్రాయపడుతున్నారు. తాము చేసినా ,తమ తరపువారు చేసినా లేక తమక్రిందపనిచేసే టిటీడి వుద్యోగులవలన చేసినా పాలకులకే ఈ దోషం సంక్రమిస్తున్నదని ఆస్తికలోకం కోడైకూస్తున్నది.
ప్రజలు తాము పన్నులరూపం లో తమ పాపాలను రాజులకు సంక్రమింపజేస్తారు అంటున్నాయి ధర్మ శాస్త్రాలు . ధర్మాన్ని ,ధార్మిక క్షేత్రాలపవిత్రతను కాపాదవలసిన బాధ్యత పాలకులదే . ఇది మహాశక్తిప్రసరణ జరిగేపుణ్యస్థలి .ఇక్కడ పచారాలు జరిగితే దాని పర్యవసానం చాలాభయంకరంగా వుంటుందని , లోకంలో అశాంతికి కారణమవుతుందని పెద్దలు చెబుతున్నారు . పాలకులు చిత్తశుధ్ధితో తిరుమల నిర్వహణను చూడవలసివుంది . ఏవివాదము లేకుండా కలియుగ వైకుంఠ పవిత్రతను కాపాడవలసి వున్నది.
17 వ్యాఖ్యలు:
బాగా చెప్పారు ... ఏప్పుడు అయితే పాలకులు నిజాయతీ తో పని చేస్తారో అప్పుడే అందరికి శుభం
ఎక్కడ ఉన్నారు సార్ మీరు ! ఆ లెక్కన దేవుడు నిజంగానే దండన విధిస్తే న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఈ ప్రపంచానికి అవసరమా? మనం చేసిన పాపాలకు ఫలితం అనుభవించేట్లు అయితే జైళ్ళు అవసరం అంటారా? ఈ ప్రపంచంలో ఇంత జనాభా ఉండేదా? ఎక్కడికక్కడ జనాలు శిక్ష అనుభవించి చచ్చేవాళ్ళు. అంతెందుకు మీరూ నేనూ కూడా తెలిసో తెలీకో ఎన్నో అపచారాలు, తప్పులు చేసి ఉండొచ్చు. మనం మరీ హత్యలు చేసిన బాపతు కాదనుకోండి. ఓ మోస్తరు తప్పులకు శిక్ష పడి ఉన్నా ఇలా కంప్యూటర్ ముందు కూచుని మీరు టపాలు, నేను కామెంట్లు పెట్టేవాళ్ళం కాదు.
కలియుగ దైవం వెంకటేశ్వరున్ని చూడటానికి సాధారణ ప్రజలు కుక్క చావు చస్తున్నారు. దీనికి కారణం అవుతున్న ఉద్యొగులను, దళారులను ఏమి చేశాడు దేవుడు? లక్షాధీశ్వరుల్ని, కోటీశ్వరుల్ని చేశాడు. వారి పాపం పండాలి అంటారు. పుట్టిన వాడు గిట్టక తప్పదు అని కృష్ణ భగవానుడు చెప్పాడు కదా! చచ్చేవాడు ఏ రోజైనా చస్తాడు. అప్పుడు పాపం పండింది అంటారు. మరో కోణంలో వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతి పాత్రంగా పూజలు నిర్వహించిన ప్రధాన అర్చకులు మృత్యుంజయులుగా ఈ యుగాంతం వరకూ ఉండాలి కదా? ఇక్కడ కృష్ణుడి తత్వం వర్తిస్తుందా?
ఏదైనా ఒక పెద్ద ఘటన జరగ్గానే దానికి జ్యోతిషం చెప్పడం, ఇలా అయి ఉంటే బతికేవాడు అని విశ్లేషించడం, ఎవరెవరో దేవుడికి అపచారం చేశారు దానివల్ల చచ్చిపోయారు అనడం ఏమైనా సమంజసమా? ఇప్పుడు ఈ కామెంట్ చేసి దేవుడికి నేను అపచారం చేస్తే నేనూ చస్తానా? ఎప్పుడు? అన్నీ తిరగేసి చెప్పండి మరి. దేవుడిని దేవుడిలా ఉండనీయండి. ఒక ఆత్మస్థైర్యానికి, విలువలకు, నైతికతకు, మనశ్శాంతికి, సేవా భావానికి ప్రతీకగా ఆయనను నిలబెట్టండి. ఎన్నిరోజులు ఇలా దేవుడిని బూచిలా చూపిస్తూ ఉంటారు. అపచారాలు, గ్రహదోషాలు అంటూ ప్రజల్లో లేనిపోని భయాల్ని సృష్టించడం మాని. టీటీడీలో బంగారానికి తుప్పుపట్టకుండా మీలాంటి భక్తులు ఒక ఉద్యమాన్ని లేవదీయండి. దాన్ని ప్రజలకోసం ఉపయోగించేలా చేయండి. బాగా బలిసిన వాళ్ళు కళ్ళు మూసుకుని సమర్పించినవి అవి. కూడూ గుడ్డా నీడా లేనివాళ్ళు కోట్లలో ఉన్నారు, వారికి చేయూతను ఇవ్వమనండి. ఇప్పుడు టీటీడి చాలా పొడుస్తోంది అంటారా? వస్తున్న లెక్కకు ఖర్చుపెడుతున్న దానికి నిలువ ఉన్న దానికి ఏమైనా పొంతన ఉందేమో మీరైనా ఆలోచించండి. స్వామి వారి నగలను కొన్నింటిని అయినా 10 రెట్లు అధికంగా వేలం వేయించి ఆ డబ్బుతో ముందు చిత్తూరు జిల్లాలోని అన్ని గ్రామాలను దత్తత తీసుకుని అక్కడి నుంచే అభివృద్ధిని మొదలు పెట్టించండి. నిజ్గంగా దేవుడు, అల్లా, క్రీస్తు ఇలా ఎవరు ఉన్నది నిజమైనా ఈ పనిని హర్షిస్తారు, కాదంటారా?
తిరుపతిని అభివృద్ధి చేయకున్నా పర్లేదు. అపచారాలు తలపెటి, పవిత్రతకు భంగం కలిగించాండి అని వేడుకోవలసి వస్తున్నది.
విరాట్ గారు,
భగవంతుడున్నాడు కదా అని మనము చేయాల్సిన కర్తవ్యం విస్మరించలేము కదా.
అది అలా ఉండగా, కంచే చేను మేసే పర్తిస్థితి వచ్చినప్పుడు పాపులను శిక్షించడానికి దైవ సహాయం అవసరం మరి.
దుర్గేశ్వర్ గారు,
వైయస్సార్ ఎలాంటి నాయకుడైనప్పటికీ ఆయన హిందు దేవాలయాలని చిన్న చూపు చూసారన్నది నిర్వివాదాంశము. మీరు తెలియజేసిన విషయాలు చదివిన తరువాత రెండు వారాల క్రితం చంద్రబాబు నాయుడు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అసెంబ్లీలో తిరుమలలో జరుగుతున్న అవకతవకల మీద చర్చానంతరం ఆయన "భగవంతుడి సొమ్మ కాజేసిన వాడెవ్వడూ పైకి రాడు" అని అన్నారట..
విరాట్, నీకు బలిసిన వాళ్ళ బంగారం మీదేగాని భక్తి ఉన్నట్లు ఏ కోశానా కనబడటం లేదు. బ్లాగుకు కంమ్నేట్ ఇవ్వడం అనేది ఓ కళ, నీ లాంటి వాళ్ళ చేతిలో అది రాయిలా మారింది. పాపం పండించుకోవాలని నీకు చాలా ఉబలాటంగా ఉందే
విరాట్ గారూ,
౧ న్యాయవ్యవస్థనీ పోలీసువ్యవస్థనీ (ఆ మాటకి వస్తే సృష్టిలోని ప్రతీ వ్యవస్థనీ) ఏ ధార్మికశక్తి ఐతే నడిపిస్తోందో అది దైవస్వరూపం అని ఆస్తికవాదుల నమ్మిక. దానినే సనాతనధర్మం పాటించేవారు స్థితికారకుడు (అదే విష్ణుమూర్తి) అని పిలుచుకుంటారు. ఎప్పుడైతే ఆ భగవచ్ఛక్తి మనుష్యులనుండి ప్రకటమవ్వడానికి ఎక్కువైపోతుందో (అంటే మనిషి చేజారిపోయిన పరిస్థితి) అప్పుడు దైవమే నేరుగా దండించడం జరుగుతుంది. మనం చేసిన పనినిబట్టి ప్రతీదానికీ అనుభవైకవేద్యమైన ఫలితం ఉంటుంది. ఎంత చేస్తే అంత. అది అనుభవంలోకి వచ్చేది రకరకాలుగా -- జబ్బులు, ఆర్థికసామాజిక ఇబ్బందులు, ఇంకా మోతాదు మించితే "జైలు"దండనల వరకూ.
౨ ఇక (దేవాలయాలలో) ఉద్యోగులకీ దళారీలకీ బోలెడంత డబ్బులు సంక్రమిస్తున్నాయీ అంటే, వారి పాపపుణ్యాలూ గట్రా అన్నీ వదిలేసినా, వారికి మానసిక ప్రశాంతత అంత కరవౌతుంది. అది చాలదండీ!
౩ “పాపం పండడా”నికీ చావుకీ సంబంధంలేదండీ. చావుతో ఈ శరీరంతో అనుబంధం తెగిపోతుంది తప్పితే పాపం కాదు. పాపఫలితం ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా (తరువాతి జన్మలో ఐనా సరే) అనుభవించి తీరవలసిందే. అలాగే, శరీరం పడిపోవడానికీ (మృత్యుంజయత్వం లేకపోవడం) భక్తితత్పరతకీ సంబంధం లేదు. జాతస్య మరణం ధ్రువమ్.
౪ సూక్ష్మంగా చెప్పాలంటే జ్యోతిషశాస్త్రం బ్రహ్మాండానికీ అండాండానికీ గల సారూప్యాన్ని చూపిస్తుంది. అందువల్ల ఒక రకంగా చూస్తే సారూప్యాన్ని నిరూపించడం సమంజసం కాదు అనటం ప్రకృతిలో జరిగేవేవీ సమంజసంగా లేవు అనడమే!! పైపెచ్చు ఫోరెన్సిక్ రిపోర్టులూ తదితరాలు భౌతికమైన వివరణలు ఇస్తే, జ్యోతిషాది శాస్త్రాలు ధార్మికమైన మరియు నైతికమైన వివరణలు ఇస్తాయి. ఆ వివరణలు వివరాలు గ్రహించడం గ్రహించకపోవడం వారి వారి వ్యక్తిగత ఇష్టానిష్టాలమీద ఆధారపడి ఉంటుంది. గ్రహించనంతమాత్రాన జ్యోతిషశాస్త్రం అబద్ధం అయిపోదు. జ్యోతిషశాస్త్రం ఫలితాలతో ఆగకుండా ఆ ఫలితం చెడు ఫలితమైతే దానికి ప్రాయశ్చిత్తం కూడా సూచించింది. అవే గ్రహశాంతులూ వగైరా. ఉదాహరణకి, చదువుకోకపోతే పిల్లవాడు ఎదగడూ అని చెప్పడం ఫలితనిర్ణయం చేయటం ఐతే, చదువుకుంటే ఆ ఎదగకపోవడాన్ని నివారించచ్చూ అనడం గ్రహశాంతివిధానం ఔతుంది. ఇది ప్రజలలో భయభ్రాంతులు సృష్టించడం ఎందుకౌతుందీ? కచ్చితంగా కాదు.
౫ దైవానికి ఏదైనా సమర్పించాలీ అంటే ఆ కైంకర్యానికి “బలవ”వలసినది ఒళ్లు కాదండీ, హృదయం బలవాలి. అది కూడా భక్తివల్ల బలవాలి. లేకపోతే ఆ సమర్పణ కృతకమే ఔతుంది. అనాదిగా శ్రీవారికి వచ్చిన కానుకలు ఈ రకంగా భక్తితో చేసిన సమర్పణల కోవలోకి చెందినవే. మీరు "బాగా బలిసినవారు" అని అందరినీ ఒకే రాటకు కట్టడం బాగోలేదు.
౬ తితిదే యథాశక్తి ధార్మిక కార్యాలు చేస్తూనే ఉంది తప్పితే, ఊరకే వచ్చిన కానుకలన్నీ ఖజానాలోకి తరలించడం లేదు. కొద్దిరోజుల క్రితమే కదండీ ఒక కమీషనువారు వారి నివేదికను కూడా సమర్పించారు, తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలకి ఆదాయం కంటె వ్యయమే ఎక్కువ ఉందనీ, అలాంటివి మూసివేయడం మంచిదీ అని. ఆ నివేదికలో ఇచ్చిన సలహాల సంగతి అటుంచితే ధార్మికకార్యాలు జరుగుతున్నాయనేది కచ్చితంగా స్పష్టం.
౭ వేంకటేశ్వరుని సొమ్ముని ఖర్చు పెట్టి “అన్ని” అభివృద్ధి కార్యక్రమాలూ చేపడితే నిజమే, తప్పకుండా ఆ వేంకటేశ్వరుడూ సంతోషిస్తాడు. కానీ ఇది కేవలం హైందవదేవాలయాలకే పరిమితం కాకుండా ఉంటే మన లౌకికరాజ్యానికి మరీ మంచిది!
౮ ఇలా అనవలసివచ్చినందుకు మన్నించాలి, కానీ మీరు దుర్గేశ్వరగారిని అడిగారు ఆయన ఎక్కడున్నారో అని. మీరే చెప్పండి ఎవరు ఎక్కడ ఉన్నారో?!
మొత్తానికి భగవంతుడుని కూడా ఓ రాజకీయ పక్షానికి నాయకుడిలా మార్చేస్తున్నమా?
మా మతంలో ఉండి మమ్మల్ని పూజిస్తేనే అనుగ్రహిస్తామని భగవంతుడంటే, భగవంతుడికీ, మనుషులకీ పెద్ద తేడా లేదేమోకదా?
విరాట్ గారు,
>>"కలియుగ దైవం వెంకటేశ్వరున్ని చూడటానికి సాధారణ ప్రజలు కుక్క చావు చస్తున్నారు.
విరాట్ గారు, నేను గత కొంత కాలంగా దాదాపు ప్రతీనెలా తిరుమలకు వెళుతున్నాను. నేను ఎప్పుడు వెళ్ళినా ఉచిత దర్శనానికే వెళతాను. అయినప్పటికీ, నాకు దర్శనం కోసం రెండుగంటలకు మించి ఏరోజు పట్టలేదు.
కాకపోతే, ఒక్కటి. ఒకప్పుడు దేవుణ్ణి దగ్గరనుంచి ఒక అరనిమిషం అన్నా చూసేవాళ్ళం. అక్కడున్న వాళంటీర్లు "దయచేసి కదలండమ్మా" దర్శనం చేసుకోవాల్సిన వాళ్ళు మీలాగే చాలామంది ఉన్నారు అని మర్యాదగా చెప్పేవాళ్ళు.
కాని ఇప్పుడైతే, అక్కడికి వెళ్ళామో లేదో చెయ్యిపెట్టి బలవంతంగా నెడుతున్నారు. అలా నెట్టేవాళ్ళు ఎవరు? వాళ్ళకు ఎవరి అండ ఉంది.
పైన మీరు ఎక్కడో కుక్కచావు అన్నారు. మొన్న చచ్చాడుగా కుక్క చావుకంటే హీనంగా. ఎందరి ఉసురు తగిలింటుందో.
>>"బాగా బలిసిన వాళ్ళు కళ్ళు మూసుకుని సమర్పించినవి అవి".
వాళ్ళు బాగా ఎలా బలిసారు. ఏదైనా కష్టపడి పని చేస్తేనే సాధ్యమవుతుంది. బాగా బలిస్తే మాత్రం పేదలకు ఎందుకు ఇవ్వాలి? వాడి డబ్బు వాడిష్టం.
మీరు ఏనాడైనా పదిమందికి అన్నదానం చేశారా? కనీసం ఒక్కపేదవాడి జీవితాన్నైనా బాగు చేశారా?
హిందూ సంస్కృతిలో కొన్ని ఆచారాలు, నియమాలూ ఉంటాయి. వాటిల్లో దాదాపు అన్నిటిలో కూడా చివరికి అన్నదానమో, మరో దానమో చెయ్యమని ఉంటుంది. దాని ఉద్దేశ్యం మన కడుపే కాదు, ఇతరుల కడుపు కూడా నిండాలని.
అంతేగాని, మామూలుగా వచ్చి ప్రతీరోజూ ఎవడో ఒకడు అన్నం పెట్టమంటే తన్ని తరిమేస్తారు. అదీగాక, తేరగవస్తే తిందామనే వాళ్ళు ఈ కాలంలో బోలెడుమంది.
ఇక న్యాయస్థానాలు, కోర్టులు, జైల్లు సంగతి. జైలు శిక్ష అనుభవంచడం కూడా పాపం క్రిందికి వస్తుంది. ప్రతీ తప్పుకు మరణదండన ఉండదు.
ఎల్లప్పుడూ దైవ ప్రార్థన చేసి, దేవునికి గుడి కట్టించిన శ్రీరామదాసు కూడా జైలు శిక్ష అనుభవించాడు. ఎందుకంటే, రాజాఙ్జ లేకుండా గుడి కట్టించినందుకు. అతని శిక్షాకాలం పూర్తయ్యాకనే దేవుడు వచ్చి రక్షించాడు. పూర్తి వివరాలకోసం "శ్రీరామదాసు" సినిమా చూడండి. :).
దేవుడు, ఎప్పుడైనా మంచి విషయాలు చెబుతాడు. దానిని అనుసరించడం, అనుసరించకపోవడాన్ని మనకే వదిలేశాడు.
ఇంకొకటి, కలిమాయంటే ఏంటో చూడండి. మొన్ననే అంత దారుణంగా చనిపోయినా (తిట్టుకున్న వాళ్ళకే జాలికలిగించేంతగా), వేల ఎకరాల ఇడుపులపాయ ఉండి కూడా, అందులో చివరికి ఆరడుగుల నేలతప్ప మరేమీ మిగలకపోయినా, దాన్ని చూసి కూడా రాజకీయనాయకుల్లో ఒక్కరిలోనైనా మార్పు వచ్చిందా. అక్కడ అంత్యక్రియలు కూడా పూర్తికాకముందే, పదవుల కోసం పోరాటాలు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఆరాటాలు.
దుర్మార్ గులు, పాపులు ఎక్కువయినపుడు వారిని ఆ దేవుడు చూసుకొంటాడు అనే మాట ...మనిషి తన పరిధి ని మించి asamatulyanni ఎదుర్కోవాల్సిన సమయములో ప్రార్థిస్తాడు....రాజశేఖర్ కుడా ప్రజలు ఎదుర్కొనే స్థాయి ని మించి న వ్యక్తీ...సామాన్య udyogulu చేసే అవినీతి ని మన సంghaTanaa సామర్ధ్యము తో, చేతన తో నివారించవచు...అందుకే ఆ వేంకటేశ్వరుడు ఆ రాజైన పాపి ని ఆకాశానికి పంపాడు,అతను సామాన్య మానవుడి చేతిలో దొరికే స్థాయి ని మించిపోయాడు....
అన్ని జన్మల కన్నా మానవ జన్మ లభించడం దుర్లభం ...ఆ లభించిన జన్మ కాలములో దైవత్వం వైపు మారే ప్రయత్నం కంటే పశుత్వం వైపు మల్లె వారే ఎక్కువ...వారికి మానవ జన్మ విలువ తెలియదు కనుక అలా చేస్తారు....వారి ని ఆ ఫై వాడు చూస్తుంటాడు అనే నమ్మకం ఒక సమాజములో పోలిసు వ్యవస్థ అవసరము లేని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అందుకే ఈ daaruNamayina చావు ను మనం కచిచితముగా ఆ దేవుడే చేసాడనే విశ్వాసం సమాజ హితమే అవుతుంది........ఈ అంశం ప్రచారం చేయడం వలన లాభమే ఉన్నది-
ఇకా దేవుడి డబ్బుల విషయాని కి వస్తే...మన ధార్మిక వ్యవస్థ అంతా కుడా లేనివాడి కి సహయపడా లనే
ఉద్దేశ్యము తోనే పని చేయాలి ...మన గుడుల తో సర్వేజనా సుఖిని భవంతు అనే లక్ష్యాన్ని చేరు కోవడం ఒకా వ్యవస్థ గా సమాజములో ఏర్పరచారు ....౮౦౦ సంవత్సరాల బానిస బతుకుల తో మన వ్యవస్థ ను చిన్నాభిన్నం చేసు కొన్న ము .గుడి తప్పు కాదు...డబ్బు తో బలసిన మదాందులు హుండీ లో దానం వెయ్యాలనే ప్రేరణ కలిగించడానికి గుడి కేంద్రం kaavaDam తప్పు కాదు...సమాజములో గుడి ద్వారా జరగవలసిన మంచి దూరం కావడం అందరు ఆలోచించాల్సిన విషయం...
సిరిసిల్ల లో జరిగిన ఆత్మహత్యలను పరిశీలించిన నా మిత్రుడు ఒక విషయం చెప్పాడు..మానసికంగా దెబ్బలు తిన్న వ్యక్తీ ,,,,,భారం భగవంతునిదే ....అనే నమ్మకముతో, పనిచేయగలిగే వ్యవస్థ సిర్సిసిల్ల లో ఒకప్పుడు భజనల ద్వారా అత్యంత సుందరమయిన గుడి వ్యవస్థ ద్వారా ౧౯౮౦ వరకు మానసిక స్థైర్యము తో ఎటువంటి కష్టాలను అయినా ఎదుర్కొనే సామర్ధయముతో ఉండేది అక్కడి పెద్దలందరూ ఆ వ్యవస్థ ను కాపాడారు...
కాని, నెమ్మదిగా కొత్త తరం ఈ వ్యవస్థ నుంచి దూరముగా వెల్లడము తో మానసిక సంతులనం ఇచీ సాంఘిక వ్యవస్థ దెబ్బ తినడముతో ....గుడి స్థానములో kallu కాంపౌండ్ వచ్చింది....మన రాష్ట్రములో దీప ధూపాలు లేని గుడులు ఎక్కువ కాడం కుడా సమాజములో పెరుగుతున్న ఘోరలాకు ఆత్మహత్యల కు కారకాలు ....
అందుకే గుడి ని ,గుడి హుండీ నిర్వాహక వ్యవస్థ ను, కాపాడాలి కనుకా ఇది చాలా ముఖ్యమయినా సామాజిక అవసరం కాబట్టి రాజు కు కర్తవ్య నిర్వహణ భోధ పడేలా ఉద్యమాన్ని నిర్మించాల్సిన భాద్యత ఆలోచించే ప్రతి వోక్కరిది ఈ ...ప్రవాహములో తప్పు చేసిన వై యస్సార్ అనే నిజాని చెప్పి అతన్ని దేవుడు సిక్షించాడు అని చెప్పడం తప్పకుండా వోప్పే..........................
narasimha
క్రైస్తవ రెడ్డి తిరుమల మీద కన్నేస్తే గాదె రెడ్డి (దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు) రమా సహిత వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం (అన్నవరం) పై కన్నేసాడు. అక్కడ దైవ దర్శనం చేసుకుని వచ్చి విలేఖరులతో "హైందవ దేవాలయాలలో అన్యమతస్థులకు ఉద్యోగములు కల్పించవచ్చు" అని బహిరంగంగా పత్రికా ప్రకఠన చేసాడు. అతని దురదృష్టం కొద్దీ ఆరోజు నేను అన్నవరం వెరే పనిమీద వెళ్ళాను (దైవదర్శనానికి కాదు). అతను చెప్పినమాటలు ఆనోటా, ఆనోటా నా చెవిన పడ్డాయి. అతిథి గృహానికి వెళ్ళి "ఏమిటి సంగతి" అని అడుగగా "అర్చకులు మాత్రం హిందువులుంటే చాలు, మిగిలిన వారు అన్యమతస్థులైనా మీకొచ్చే ఇబ్బందేమిటి" అని ఎదురు ప్రశ్నించాడు. నేను ఒక ప్రశ్న వేశాను "మాంసం అమ్మే ముస్లిం దగ్గర ఒక హిందువుకి ఉద్యోగం ఇప్పించగలవా? శవపేటికలు తయారు చేసే క్రైస్తవ అంగడిలో ఒక హిందువుకి ఉద్యోగమిప్పించగలవా? నీవు ఇప్పిస్తే ఆఉద్యోగం చెయ్యటానికి ఎందరో హిందువులు సిధ్ధం" అన్నాను. "అది ఎలా కుదురుతుంది, అవి వారి కుల, మతాల వృత్తులు" అన్నాడు. "అయితే దేవాలయ నిర్వహణ హైందవుల వృత్తి, ప్రవృత్తి అని నీకు తెలియదా" అని ప్రశ్నించాను, సమాధానం లేదు. పక్కనున్న వ్యక్తి మాత్రం "మీ హిందువులు చాలా సంకుచితంగా ఆలోచిస్తారు" అని కోపంగా అన్నాడు. ఈమొత్తం సంఘటన అన్ని వార్తాపత్రికలలోనూ వచ్చింది. ఆటువంటి దరిదృడైన దేవాదాయ శాఖా మంత్రి లీలలు ఎన్నో, మరెన్నో. అన్నీ సవివరంగా పోస్ట్ చేస్తాను.
వాసుబాబు మల్ల
హైదరాబాద్
భగవంతుడు తనపట్ల అపచారం చేసినవాళ్ళను దండిస్తాడో లేదో నాకు తెలీదుగానీ..
భక్తుల పట్ల కృపాకటాక్షాలు చూపిస్తాడని మాత్రం హిందూధర్మం చెబుతోంది. దైవం పట్ల అపచారం చేసేవాళ్ళను, భక్తులపట్లా వాళ్ళ నమ్మకాల పట్లా అపచారం చేసేవాళ్ళను శిక్షిస్తాడని మాత్రం చెబుతోంది. పాతకుల పాపం పండాక, ఆ శిక్ష అమలవుతుందని మాత్రం చెబుతోంది. అప్పటిదాకా వాళ్ళ దౌష్ట్యాన్ని గమనిస్తూ ఉంటాడని మాత్రం చెబుతోంది.
భగవానుడి శిక్ష అతి భయంకరంగా ఉంటుంది. మనకు ఉదాహరణలు చాలా ఉన్నాయి.. వంద తప్పులు పూర్తయ్యాక, వందల మంది నిశ్చేష్టులై చూస్తూండగా, శిశుపాలుడి తలను మీటిపారేసాడు. హిరణ్యకశిపుడికి వేసిన శిక్ష ఎంత భీకరమైనదో మనకు తెలుసు. రావణాసురుడి సంగతీ తెలిసినదే.
తన భక్తులను శారీరికంగాను, మానసికంగాను వేధించి, బాధించినందుకుగాను విధించిన శిక్షలవి, తనకు అపచారం చేసినందుకు కాదు. కాలమేదైనా యుగమేదైనా తన భక్తుల పట్ల, భక్తులకు మేళ్ళు చెయ్యడంలో నిజాయితీగా ప్రవర్తించినవారి పట్లా ఆ శేషాచలపతి అవ్యాజమైన దయ కురిపిస్తాడు. కానినాడు, కానిపనులు చేసినవాడెవడైనా - పాలకుడైనా, పాలితుడైనా - ఆ సర్వాంతర్యామి విధించే శిక్షకు గురికావలసిందే!
అయ్యా అందరికీ నమస్కారాలు. నేను రాజశేఖర రెడ్డికి అనుకూలంగాను, హిందూ మతానికి వ్యతిరేకంగను మాట్లాడానా? నా కామెంటును పెద్దలంతా రాజకీయ, మతపరమైన కొణంలో తీసుకున్నారు.
అనానిమస్ గారూ పాపం పండటం ఏమిటో అర్థం కాలేదు? దేవుడా మీరా శిక్ష విధించేది? ముందుగా శాంతం అలవర్చుకో నాయనా! అది ఇమ్మని దేవుడిని పొద్దునా సాయంత్రం కోరుకో. ఆవేశపడి సాధించేది ఏదీ లేదు. నా వ్యాఖ్యకు మరో 10 మంది తమ అభిప్రాయాలను అందరికీ తెలియజేశారు. కళ అంటే ఇది.
రాఘవ గారూ మీరు తర్వాత జన్మ అన్నారు- ఇక నావైపు నుంచి నోరెత్తను.
నాగప్రసాద్ గారూ మీ అదృష్టానికి అసూయ వేస్తోంది. నాలాంటి పాపులకు బహుశా ఎక్కువ సమయం పడుతోందేమో. ఆ మధ్య పేపర్లు టీవీల్లో వరుసగా కథనాలు వచ్చాయి. బహుశ అది మీడియా హైప్ అని అంపిస్తోంది. నేను మానవసేవే మాధవసేవ అని ఉత్తినే అన్లేదు. అన్నదానం కాదు చాలా గొప్ప సేవే చేస్తున్నాను. అందుకే ఆ మాట అనగలిగాను. మిరు నమ్మండి నమ్మకపొండి. డబ్బా అయితే కాదు.
"గుడి తప్పు కాదు...డబ్బు తో బలసిన మదాందులు హుండీ లో దానం వెయ్యాలనే ప్రేరణ కలిగించడానికి గుడి కేంద్రం కావడం తప్పు కాదు...సమాజములో గుడి ద్వారా జరగవలసిన మంచి దూరం కావడం అందరు ఆలోచించాల్సిన విషయం... "" నేను చెప్పింది ఇదే పాయింటు.
"ఒక ఆత్మస్థైర్యానికి, విలువలకు, నైతికతకు, మనశ్శాంతికి, సేవా భావానికి ప్రతీకగా ఆయనను నిలబెట్టండి. " దీన్ని నేను మళ్ళీ చెబుతున్నాను.
ఫైనలుగా చెప్పేది ఏమంటే సేవ చేసే ప్రతి ఒక్కరూ నాకు దేవుడే! అది ఇంటి దగ్గ్గర కాలవలో చెత్త ఎత్తివేసేవాళ్ళు మొదలుకుని ఎవరైనా కావచ్చు.
హిందూ ధార్మిక సంస్థలు చేస్తున్న తప్పులకు క్రైస్తవం పెరిగిపోతోంది. నన్ను దైవ వ్యతిరేకిగా భావించి అనడంకంటే నా ఈ మాటల్లో నిజం లేదేమో ఒకసారి ఆలోచించండి.
>>"అన్నదానం కాదు చాలా గొప్ప సేవే చేస్తున్నాను. అందుకే ఆ మాట అనగలిగాను. మిరు నమ్మండి నమ్మకపొండి. డబ్బా అయితే కాదు."
విరాట్ గారు, నేను నమ్ముతున్నాను. మంచి పనులను చేసేవారిని నేను ఎప్పుడూ విమర్శించను. మీరు మంచి చేస్తున్నా అంటున్నారు కాబట్టి చాలా సంతోషం. చప్పట్లు.
కాకపోతే, మంచిపని చేసేవారి ఉద్దేశ్యం కూడా మంచిదై ఉండాలి. అందుకే, కేవలం, మతం మార్పించడం కోసం, క్రైస్తవులు చేసే వాటిని మాత్రమే విమర్శిస్తాను.
ఇక తిరుమల విషయానికొస్తే, అది అదృష్టం కాదు. తి.తి.దే వారు భక్తులకోసం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకుంటే, దర్శనం సులభతరమౌతుంది.
విరాట్ గారూ మీ ఆవేదన నాకర్ధమైనది కాని దాన్ని వ్యక్తపరచటం లో గదరగోళానికి గురయి వున్నారు. దీనికీ కారణం వున్నది .ఇప్పటిదాకా ధర్మవిధ్వంసకులు విద్యావిధానాన్ని ,సమాచార వ్యవస్థను శాసించి వుండటం వలన ఆప్రభావం విద్యావంతులకు తమ మనసులో స్పష్టత రానీయకుండా అడ్డుపడుతున్నది. మరొక సారి ప్రశాంతంగా ఆలోచించి చూడండి .అన్నీ అవగతమవుతాయి
Post a Comment